Jump to content

SAGAR right&Gundlakamm :18 lakh acres golden days very soon


AnnaGaru

Recommended Posts

వేగిరానికి దిశానిర్దేశం
తొలిదశ పనులు ప్రారంభం
క్షేత్రస్థాయిలో కాలువ అలైన్‌మెంట్‌ ఖరారు
రెండు గ్రామాలకు సిద్ధమైన ప్రతిపాదనలు
ఈనాడు, గుంటూరు
gnt-gen2a.jpg

గోదావరి-పెన్నా నదుల అనుసంధానం తొలిదశ పనులు క్షేత్రస్థాయిలో మొదలయ్యాయి. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాతక్మంగా తీసుకుని వీలైనంత తొందరగా పనులు పూర్తిచేయాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది. దీంతో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. నవంబరు నెల 26న ముఖ్యమంత్రి పనులకు నకరికల్లు వద్ద శంకుస్థాపన చేశారు. మే నెల నాటికి గోదావరి జలాలను సాగర్‌ కాలువలకు తరలించాలని అధికారులకు గడువు విధించారు. రైతులు కూడా భూసేకరణకు సహకరించి పనులు తొందరగా పూర్తికావడానికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. దీంతో నవంబరు 27వతేదీ నుంచి క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థలు, జలవనరులశాఖ అధికారులతో కాలువ ఆకృతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సిద్ధం చేసుకున్న ఆకృతులను క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా స్వల్ప మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఈవారాంతానికి ఆకృతికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఈమేరకు ఎక్కడి నుంచి ఎక్కడికి భూమి సేకరించాలన్న విషయమై గుర్తులు పెడుతున్నారు. రాజుపాలెం, వైకుంఠపురం గ్రామాల్లో భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా పాలనాధికారికి పంపారు. మిగిలిన గ్రామాలకు  సంబంధించిన భూసేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సుమారు 3500 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. భూసేకరణకు జలవనరులశాఖ నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక బృందాలు వేసి భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఏయే సర్వేనంబర్లలో ఎంతభూమి సేకరించాలి. ఏ రైతు భూమి ఎంత సేకరణకు తీసుకోవాలి తదితర అంశాలపై నివేదిక పూర్తయిన వెంటనే నోటిఫికేషన్‌ ఇస్తారు. ప్రస్తుతం ఈప్రాంతంలో ఉన్న భూముల మార్కెట్‌ విలువకు రెండున్నరెట్లు అదనంగా పరిహారం కింద రైతులకు సొమ్ము అందిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియకు కొంత సమయం పడుతుంది.

సాంకేతిక అంశాలపై కసరత్తు
జలవనరులశాఖ భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు అందించిన వెంటనే సాంకేతిక అంశాలపై దృష్టిసారించనుంది. భూసేకరణతో సంబంధం లేకుండా పంపుహౌస్‌ అలైన్‌మెంట్‌, లీడింగ్‌ చానల్‌ నిర్మాణం, పైపులైను అలైన్‌మెంట్‌, ఐదుచోట్ల పంపుహౌస్‌ల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై కసరత్తు చేస్తారు. పైపుల అమరిక నుంచి పంపింగ్‌ వరకు ప్రతి అంశాన్ని కుణ్ణంగా అధ్యయనం చేసి అలైన్‌మెంట్‌ ఖరారు చేస్తారు. ఈమొత్తం ప్రక్రియ పూర్తికావడానికి మూడునెలల సమయం పడుతుందని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. భూసేకరణ ప్రక్రియ కొలిక్కివచ్చేనాటికి సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించి అనుమతులు పూర్తిచేస్తే వెంటనే పనులు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆకృతులపై తుదినిర్ణయం తీసుకుంటే ఆమేరకు తయారీకంపెనీకి ఆర్డరు ఇచ్చి పంపులు, మోటార్లు, ఇతర పరికరాలు తెచ్చుకోవడానికి గుత్తేదారులకు కొంత సమయం పడుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని సాంకేతిక అంశాలపై దృష్టిసారించామని జలవనరులశాఖ పర్యవేక్షక ఇంజినీరు బాబూరావు ‘ఈనాడు’కు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పనుల ప్రగతిపై రోజువారీగా సమీక్షించుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. భూసేకరణ ప్రక్రియ కొలిక్కివచ్చే నాటికి సాంకేతిక అంశాలకు సంబంధించిన పనులు పూర్తిచేస్తామన్నారు.

Link to comment
Share on other sites

one more season...after that any wastage will be stopped...

 

This yeat total sea left from prakasam is 50 TMC+Pattiseema pumps stopped for 24 days)= 70 TMC total

 

also CBN wellthought and he planned rubber dam down stream before sea so "salt water seapage" won't happen

 

 

ac84e1d5-a61b-4447-99db-99b4c600af9c

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

  • 1 month later...
Tuesday, 12 Feb, 9.57 pmసూర్య
164x41_paper.png
  •  
  •  

ఆంధ్రప్రదేశ్
గోదావరి, పెన్నా అనుసంధానం పనులు ఆరంభం

5792ba12490db0d7ee527d2d2d0eb73f.jpg

గోదావరి, పెన్నా నదులు అనుసంధాన పనులను మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రుక్చర్స్‌ లిమిటెడ్‌(ఎంఈఐఎల్‌) ప్రారంభించింది. నిర్ధేశించిన లక్ష్యానికన్నా ముందుగా పనులు పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా పను కొనసాగిస్తోంది. గోదావరి, పెన్నా నదు అనుసంధానానికి ప్రభుత్వం టెండర్లు పివటంతో అందులో పాల్గొన్న మేఘా ఇంజనీరింగ్‌ తొలిదశను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు పనులకు ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా నకరిక్లు వద్ద శంకుస్థాపన చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందిగా ఈ సందర్భంగా సీఎం నిర్మాణ సంస్థను కోరారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 24 నెల గడువు ఉన్నప్పటికీ 12 నెల్లో అంటే వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి పూర్తి చేయానే లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు నిర్ధేశించారు. పట్టిసీమ ప్రాజెక్టును అనుకున్న సమయం కన్నా ముందే పూర్తి చేసి రికార్డు సొంతం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్‌ గోదావరి, పెన్నా అనుసంధానాన్ని కూడా అంతకన్నా వేగంగా చేయానే సంక్పంతో పనుకు శ్రీకారం చుట్టింది. గుంటూరు జిల్లా క్రోసూరు వద్ద మూడో పంప్‌హౌస్‌ నిర్మాణానికి అవసరమైన మట్టిపనులను ప్రారంభించింది. మేఘా ఇంజనీరింగ్‌ అధికారులు శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి మట్టితవ్వకం పనులు ప్రారంభించారు.

ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన వైకుంఠపురం నుంచి రాజుపాలెం మండ కేంద్రం వరకూ 45 కిలోమీటర్ల కాలువ, పైప్‌ లైన్‌ పనులను మేఘా ఇంజనీరింగ్‌ చేయనుంది. ఇందులో 39.8 కిలోమీటర్ల కాలువను గురుత్వాకర్షణ ద్వారా నీరు పారేవిధంగా (గ్రావిటీ కెనాల్‌), 4.575 కిలోమీటర్లు అరువరుస పైప్‌లైన్‌ మూడున్నర మీటర్ల మీటర్ల వ్యాసంతో కూడిన పైపును ఉపయోగించి ఏర్పాటు చేస్తారు. ఈ పనుల్లో భాగంగా మూడు పంపు హౌస్‌లు, మూడు ప్రెజర్‌మైన్‌లు నిర్మిస్తారు. ఒక్కో పంప్‌హౌస్‌లో ఆరేసి పంపు అమరుస్తారు.

వీటి ద్వారా తొలుత వైకుంఠపురం వద్ద 14.5 మీటర్ల ఎత్తు నుంచి నీటిని కృష్ణా నది నుంచి ఎత్తిపోసి చివరగా 65 మీటర్ల ఎత్తు నుంచి నీటిని తోడి నాగార్జునసాగర్‌ కుడికాలువలోకి పోస్తారు. మూడు పంప్‌హౌస్‌ల్లో ఏర్పాటు చేసి 18 పంపు ద్వారా ఏడు వేల క్యూసెక్కు వంతున 120 రోజుల్లో 73 టీ ఎం సీ నీటిని తోడిపోస్తారు. నీటిని తోడేందుకు 220 మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతుంది. గోదావరి నుంచి పట్టిసీమ, చింతపూడి ఎత్తిపోత పథకా ద్వారా పోవరం కుడి కాువ నుంచి వచ్చే నీరు కృష్ణానదిలో కలుస్తుంది.

అక్కడి నుంచి గోదావరి నీటిని దశ వారీగా పెన్నాకు మళ్లిస్తారు. జూన్‌ నాటికి కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌ పంటకు పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్టా డెల్టాకు అందించిన మాదిరిగానే గోదావరి, పెన్నా అనుసంధానం ద్వారా నాగార్జుసాగర్‌ కుడి కాువ కింది ఆయకట్టుకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తొలి పంటకు జూన్‌ నాటికి నీరు ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో ఈ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. గుంటూరు జిల్లా నకరిక్లు వద్ద గోదావరి నీటిని నాగార్జున సాగర్‌ కుడికాలువలో ఎత్తిపోస్తారు. గోదావరి, పెన్నా అనుసంధానం ఐదు దశల్లో జరుగుతుంది.

గోదావరి నీటిని నాగార్జున సాగర్‌ కుడికాువ లోకి ఎత్తిపోయటం రెండు దశల్లో జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించిన సర్వే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. డిజైన్లు ఆమోదం దశలో ఉన్నాయి. రైతు సంపూర్ణ సహకారంతో భూ సేకరణ ఎలాంటి అడ్డంకులు లేకుండా వేగంగా పూర్తి అయితే నిత్యం కరువుతో అల్లాడే ప్రకాశం జిల్లా ఇక పచ్చటి పంటతో కళకళలాడే అవకాశం ఉంది.

గోదావరి, పెన్నా అనుసంధానం ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలోని 79 మండలాలకు సాగు, తాగు నీరుతో పాటు పరిశ్రమ అవసరాకు నీటిని అందిస్తారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు, ప్రత్తిపాడు, తాడికొండ, పెద కూరపాడు, వినుకొండ, చికూరిపేట, నరసరావుపేట, గురజా నియోజకవర్గాల్లోని 39 మండలాల్లోని 5,12,150 ఎకరా ఆయకట్టును స్థిరీకరిస్తారు. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, కొండెపి, ఒంగోలు, దర్శి, సంతనూతపాడు, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లోని 40 మండలాల్లో 4,49,081 ఎకరా ఆయకట్టును స్థిరీకరిస్తారు. తొలిదశలో మూడు ఎత్తిపోత పథకాలను హరిశ్చంద్రాపురం, లింగాపురం, ఉయ్యందన...తాళ్లూరు వద్ద ఏర్పాటు చేస్తారు.

Link to comment
Share on other sites

గోదావరి - పెన్నా అనుసంధాన పనుల ప్రారంభం

 

పంపుహౌస్‌ పనులకు శ్రీకారం చుట్టిన మేఘా సంస్థ

ఈనాడు, అమరావతి: నాగార్జున సాగర్‌ కుడి కాలువ ఆయకట్టు రైతులు ఆశగా ఎదురుచూస్తున్న గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టులో తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా క్రోసూరు వద్ద మూడో పంపుహౌస్‌ నిర్మాణానికి మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ మంగళవారం మట్టి తవ్వకం పనులు చేపట్టింది. తొలి దశ పనులను జలవనరుల శాఖ రెండు ప్యాకేజీలుగా చేపట్టింది. తొలుత గోదావరి వరద నీటిని పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజికి తరలిస్తారు. ఈ నీటిలో దాదాపు 73 టీఎంసీలను 120 రోజుల్లో ఎత్తిపోసి నాగార్జున సాగర్‌ కుడి కాలువకు పంపిణీ చేస్తారు.

* మొదటి ప్యాకేజీలో ప్రకాశం బ్యారేజి ఎగువన వైకుంఠపురం నుంచి రాజుపాలెం వరకు 45కి.మీ. మేర పనులు చేపడతారు. ఇందులో 39.8కి.మీ. మేర కాలువద్వారా నీటిని తరలిస్తారు. మధ్యలో మూడు పంపుహౌస్‌లు నిర్మించి 4.575కి.మీ. మేర 6 వరుసల పైపులైనుతో నీటిని మళ్లిస్తారు. 2 సంవత్సరాల్లో ఈ పనులు పూర్తి చేసేందుకు గడువున్నా 12 నెలల్లోనే పూర్తి చేయాలని ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి మేఘా సంస్థకు గడువు విధించారు.

* రెండో ప్యాకేజీలో రాజుపాలెం నుంచి నకరికల్లు వరకు నీటిని తీసుకువెళ్తారు. ఈ మధ్యలో రెండు చోట్ల పంపుహౌస్‌లు నిర్మించి కొంత కాలువ, మరికొంత పైపులైను సాయంతో నీటిని సాగర్‌ కుడి కాలువకు తరలిస్తారు.

* ఈ ప్రాజెక్టుతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 79 మండలాలకు సాగు, తాగునీరు అందుతుంది. 9.61లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుంది.

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...