Jump to content

CBN South Korea Tour


sonykongara

Recommended Posts

  • Replies 66
  • Created
  • Last Reply
డిసెంబర్ 3న దక్షిణ కొరియా వెళ్ళనున్న చంద్రబాబు
 
 
636474693208379165.jpg
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డిసెంబర్ 3వతేదీన దక్షిణ కొరియా వెళుతున్నారు. ఈమేరకు పర్యటన షెడ్యూల్ మంగళవారం ఖరారైంది. ఆయన మూడు రోజులపాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఈ పర్యటన కొనసాగనుంది. కాగా... తన పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రమ వేత్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీలో కొరియా కంపెనీలు ఏర్పాటుచేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చిన నేపధ్యంలో కొరియా పారిశ్రామిక క్లస్టర్ పైన, కొరియా పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
Link to comment
Share on other sites

3న దక్షిణ కొరియాకు బాబు
29-11-2017 01:45:44
 
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెల 3వ తేదీన దక్షిణ కొరియా వెళ్తున్నారు. 3వ తేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఆయన ఆ దేశంలోని సియోల్‌, బుసాన్‌ నగరాల్లో పర్యటిస్తారు. కొద్ది రోజుల క్రితం కొరియా నుంచి పారిశ్రామికవేత్తల బృందం ఇక్కడకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ప్రభుత్వం రెండు వేల ఎకరాల భూమి ఇస్తే పూర్తిగా కొరియా కంపెనీలతో పారిశ్రామిక వాడ నెలకొల్పుతామని వారు ప్రతిపాదించారు.
 
కియా కార్ల ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్న అనంతపురం జిల్లా పెనుకొండ లేదా కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఇవ్వగలిగితే బాగుంటుందని తెలిపారు. కియా కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో ఆకర్షితులైన ఈ సంస్థలు తాము కూడా త్వరితంగానే ఫ్యాక్టరీలు నెలకొల్పుతామని చెబుతున్నాయి. వాటితో మరోసారి చర్చించి తుది రూపు ఇచ్చే నిమిత్తం ముఖ్యమంత్రి అక్కడకు వెళ్తున్నారు. బుసాన్‌లో ఉన్న కియా కార్ల ఫ్యాక్టరీని కూడా సందర్శిస్తారు.
Link to comment
Share on other sites

3న కొరియాకు చంద్రబాబు
01-12-2017 01:21:41
 
అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు బృందం డిసెంబరు 3వ తేదీన దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లనున్నది. ఈ పర్యటనలో సామ్‌సంగ్‌, హ్యూండాయ్‌, లోప్టే సహా పలు ప్రఖ్యాత సంస్థల యాజమాన్య ప్రతినిధులతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తుంది.
 
ఈ పర్యటనతో రాష్ట్రానికి రూ.8000 కోట్ల పెట్టుబడులను రాబట్టాలనే లక్ష్యంతో ఈ బృందం పయనమవుతుంది. ఈ నెల 3వ తేదీ సాయంత్రం ఢీల్లీ నుండి కొరియాకు సీఎం చంద్రబాబు, మంత్రులు యనమల రామకృష్ణుడు, ఎన్‌.అమరనాథరెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియా రాజ్‌తో కూడిన బృందం బయలు దేరుతుంది.
 
నాలుగో తేదీ ఉదయం సియోల్‌కు చేరుకుని... అక్కడి ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ముఖాముఖీ సమావేశాలు నిర్వహిస్తారు. హ్యూండాయ్‌, సామ్‌సంగ్‌, లోప్టే తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రి కియ యాజమాన్యం ఇచ్చే విందులో పాల్గొంటారు. ఈ నెల 5వ తేదీ బూసాన్‌లో ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ కియ యాజమాన్యంతో సమావేశమవుతారు. తర్వాత స్థానిక ఆటోమొబైల్‌ అనుబంధ సంస్థల పరిశ్రమల పార్కును సందర్శిస్తారు.
Link to comment
Share on other sites

దక్షిణ కొరియా పర్యటనకు చంద్రబాబు
01-12-2017 16:08:21
 
636477413024964151.jpg
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 4, 5, 6 తేదీల్లో దక్షిణ కొరియా పర్యటనకు వెళ్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. పర్యటనలో భాగంగా సియోల్, బూసాన్ నగరాల్లో ఆయన పర్యటిస్తారని అన్నారు. సియోల్‌లో కియా మోటార్స్ హెడ్‌క్వార్టర్స్‌ను ఆయన సందర్శిస్తారని అన్నారు. కాగా కృష్ణపట్నం పోర్టుతో భాగస్వామ్యానికి సంబంధించి జరిగే బిజినెస్ సెమినార్‌లో సీఎం పాల్గొంటారని చెప్పారు. అనంతపురంలో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుకు 4న ఎస్సెట్జ్ గ్రూపుతో ఏపీఈడీబీకి మధ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. కియా మోటర్స్‌కి సంబంధించి 17 సంస్థలతో ఏపీఐఐసీ, ఈడీబీ ఎంవోయూలు చేసుకుంటాయని చెప్పారు.
Link to comment
Share on other sites

చంద్రబాబు కొరియా పర్యటన...పోయినసారి వెళ్లి కియా తెచ్చారు... మరి ఈ సారి ?

 

korea-01122017.jpg
share.png

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు బృందం డిసెంబరు 3వ తేదీన దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లనున్నది. ఈ పర్యటనలో సామ్‌సంగ్‌, హ్యూండాయ్‌, లోప్టే సహా పలు ప్రఖ్యాత సంస్థల యాజమాన్య ప్రతినిధులతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తుంది. మొత్తం 6 ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. ఆటోమైబైల్ దిగ్గజం ‘కియా’ వైస్ చైర్మన్ , లొట్టె కార్పొరేషన్ ప్రెసిడెంట్, కొకం కంపెనీ లిమిటెడ్ సీఈవో , OCI కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్, యంగ్ వన్ కంపెనీ చైర్మన్, కొరియా ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తో, ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయి.

 

అలాగే, 17 కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో, కియాకు అనుబంధంగా ఉన్న మరో 27 టూ టైర్, త్రీ టైర్ సంస్థల ప్రతినిధులతో గ్రూపు మీటింగ్స్ ఉంటాయి. అలాగే దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు ఉంటాయి... బూసన్ కాన్సులేట్ జనరల్ జియాంగ్ టెక్ మిన్... బూసన్ మెట్రో పాలిటన్ సిటీ మేయర్ సుహ్ బైంగ్సూ తో మీటింగ్స్ ఉంటాయి. 2 ఎంవోయూలు ఇప్పటికి ఖరారు అయ్యాయి, మరొకటి జరిగే అవకాశం ఉంది... ఎస్సెట్జ్ గ్రూపుతో ఏపీఈడీబీ ఎంవోయూ (ఇది ప్రాపర్టీ కంపెనీ), (అనంతపురములో ఏర్పాటుచేయనున్న వరల్డ్ క్లాస్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటు పై)... కియా మోటార్స్‌ 17 అనుబంధ సంస్థలతో ఏపీఐఐసీ, ఈడీబీ అవగాహన ఒప్పందం.... బూసన్, ఏపీఐఐసీ మధ్య ఎంవోయూ జరిగే అవకాశం ఉంది...

ఈ మధ్యనే దక్షిణకొరియా కాన్సుల్ జనరల్ జియోంగ్ డ్యూయెక్ మిన్ నేతృత్వంలో ఏపీలో పారిశ్రామికవేత్తల బృందం ఒకటి ఏపీలో పర్యటించింది. ఏయే రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయో సమగ్రంగా అధ్యయనం చేసింది. ఈ రాష్ట్రంలో భూముల లభ్యత, రాయితీలు, సహకారం, అనుమతులిచ్చే విధానం తదితర అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని ఈ బృందం సంతృప్తి చెంది వెళ్లింది... ఎలక్ట్రిక్ స్టీల్, లాజిస్టిక్, నిర్మాణరంగం, ఫైనాన్స్, ఆటోమొబైల్ కాంపొనెంట్స్, హెవీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, బ్యాటరీ, మీట్ ప్రాసెసింగ్, లిక్కర్స్, షిప్ బిల్డింగ్, మెడికల్, మెరైన్ అక్విప్‌మెంట్ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. వీటి అన్నిటి మీద, చంద్రబాబు పర్యటనలో మరింత స్పష్టత వచ్చే అవకాసం ఉంది..

Link to comment
Share on other sites

దక్షిణ కొరియాకు బయల్దేరిన సీఎం చంద్రబాబు
03-12-2017 20:54:34
 
636479312720766370.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు వేట కొనసాగుతోంది. తాజాగా ఆయన దృష్టి దక్షిణ కొరియా పెట్టుబడులు దారులపై పడింది. ఈ నేపథ్యంలో ఆయన కాసేపటిక్రితం దక్షిణ కొరియా బయల్దేరివెళ్లారు. మొత్తం మూడు రోజులు పాటు  పర్యటించనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, నేతలు, అధికారులు కూడా వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దక్షిణ కొరియా ప్రతినిధులకు వివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. 
Link to comment
Share on other sites

దక్షియ కొరియాలో చంద్రబాబు షెడ్యూల్ ఇదే....
03-12-2017 22:09:47
 
636479357856035260.jpg
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియాకు బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ మూడు రోజులపాటు పర్యటించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 2.20కి సియోల్ చేరుకుంటారు. ఉదయం 5.45కి భారత రాయబారి విక్రమ్ దొరైస్వామితో సమావేశమవుతారు. అనంతరం ఉ.6.50 దాసన్ నెట్‌వర్క్‌ చైర్మన్ నామ్ మెయిన్‌వూతో చంద్రబాబు భేటీ ఉంటుంది. ఆ తర్వాత ఉ.7కి జుసంగ్ ఇంజనీరింగ్ సీఈఓ వాన్గ్ చుల్‌జుతో సమావేశం అవుతారు. ఉదయం 8.30కి లొట్టే కార్పొరేషన్ సీఈఓ వాన్గ్ కాగ్‌జుతో చంద్రబాబు భేటీ కానున్నారు.
Link to comment
Share on other sites

Andhra CM to visit South Korea on three-day tour

 

facebook1.png twitter_short.png pinterest1.png linkedin.png google_plus1.png
 

Amaravati (Andhra Pradesh) [India] Dec 01. : Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu is visiting South Korea visit on a three-day tour.

Dr. Parakala Prabhakar, Advisor to government of Andhra Pradesh, addressed the media at a press conference to brief the media about the Chief Minister's forthcoming trip to South Korea.

The CM led delegation will visit South Korea between December 4-6, 2017, said Dr. Parakala Prabhakar.

The representatives of the government accompanying CM Naidu include Amarnath Reddy, Minister for Industries, Food Processing, Agri-Business, Commerce & Public Enterprises; Yanamala Ramakrishnudu, Minister for Finance & Planning, Commercial Taxes, Legislative Affairs; Dr. Parakala Prabhakar, Advisor (Communications); Sai Prasad, Principal Secretary to CM; Solomon Arokia Raj, Secretary (Industries); Jasthi Krishna Kishore, CEO of Andhra Pradesh Economic Development Board; Ahmed Babu, CEO of Real Time Governance and VC & MD APIIC; and Preetam Reddy, Special Representative to Government (Industrial & Infrastructure Development Department).

There will also be a small contingent of business delegates accompanying CM Naidu, which includes: Srini Raju, Chairman of Sri City; Sannareddy Ravindra Babu, Founder and MD of Sri City; Jaydev Galla, Managing Director of Amara Raja Batteries; C. Saravanan, President (Marketing) of Brandix; Venkat Nekkanti, Executive Director of Nekkanti Seafoods Limited; and Anil Yendluri, Director & CEOP of Krishnapatnam Port.

Dr. Prabhakar established the purpose of the visit as an effort to garner increased investment interest to Andhra Pradesh.

He said that the key elements of the trip are two MoU signings with Kia Motors ancillaries, visit to KIA Motors headquarters, business seminar in partnership with Krishnapatnam Port and Kia Motors, two major roadshows, visits to Pusan Newport Company (Busan), Nok-san National Industrial Complex (Busan) and Myeongji Free Economic Zone.

Kia Motors will be investing almost $2 billion (one of the state's largest FDI in recent years) to set up an ultra-mega integrated automobile project in Anantapur, said Dr. Prabhakar.

This deal attracted the interest and attention of many investors in South Korea.

The state has already attracted a cumulative investment of Rs. 24,754 crore in the automobile sector, from leading companies of the sector.

On November 9, the Chief Minister met with a delegation of 20 entrepreneurs from South Korea lead by Consul General Jeong Deok-Min. The delegation proposed to establish a 'South Korea City' in Andhra Pradesh, bringing in at least 30 companies to set up their units.

On December 4, an MoU will be forged between Andhra Pradesh Economic Development Board and Assetz group for the development of a world class "SMART industrial City" in Anantapur which includes: Industrial park, logistics park and warehousing, commercial space, housing (affordable as well as luxury), golf course, legoland and wellness centre.

Twenty-nine companies in written and 10 more companies have orally expressed their interest in investment in the state of Andhra Pradesh. Twenty-seven tier 2 and 3 ancillaries of Kia Motors have issued LoIs, and will invest approximately Rs. 8,000 crore. The cluster of Korean companies will be spread across 850 acres, and generate employment for 30,000 people in Anantapur.

Other key bilateral meetings planned are with Lotte Corp, Kokam Co. Ltd., OCI Company Ltd., Youngone and Korea Automobile Manufacturers Association.

Link to comment
Share on other sites

దక్షిణకొరియాలో సీఎం చంద్రబాబు పర్యటన
04-12-2017 10:19:14
 
636479795551116922.jpg
సియోల్: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షిణకొరియాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో రెండు ఎంవోయూలు కుదుర్చుకోవడంతో పాటు ఆ ద్వైపాక్షిక భేటీలో చంద్రబాబు పాల్గొంటారు. దక్షిణకొరియా పర్యటనలో భాగంగా చంద్రబాబు కియో మోటర్స్ హెడ్‌క్వాటర్స్‌ను సందర్శించి అక్కడ జరిగే బిజినెస్ సెమినార్‌లో పాల్గొన్నారు. బూసన్ సిటీలోని ఫ్యూసన్ న్యూపోర్ట్ కంపెనీ, మేకిన్ ఇండియా సెంటర్, నాక్స్ అండ్ నేషనల్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌ను సీఎం చంద్రబాబు సందర్శిస్తారు.
 
కొరియా కార్ల దిగ్గజం కియో, దాని అనుబంధ సంస్థలు కలిపి రూ.13,500కోట్ల పెట్టుబడులతో అనంతపురం జిల్లాలో అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ మొబైల్ ప్రాజెక్టులు నెలకొల్పుతున్నాయి. ఈ స్పూర్తితో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం దక్షిణకొరియాలో పర్యటిస్తున్నారు. 17 కియో అనుంబంధ సంస్థల ప్రతినిధులతో పాటు మరో 25 టూ టైర్, త్రీ టైర్ అనుబంధ సంస్థల ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ అవుతారు. కియో మోటర్, దాని 17 అనుబంధ సంస్థలతో ఏపీ ఐఐసీ, ఈడీబీ మధ్య అవగాహనా ఒప్పందం కుదరనుంది. ఎస్సెర్స్‌ గ్రూప్‌తో ఎంవోయూ కుదుర్చుకోనుంది.
 
అనంతపురంలో వరల్డ్ క్లాస్ స్మార్ట్ ఇండస్ట్రీయల్ సిటీ ఏర్పాటుపై ఎస్సెర్స్ గ్రూప్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్ పార్క్, వేర్ హౌసింగ్, కమర్షియల్ స్పేస్ హౌసింగ్, గోల్ఫ్ కోర్స్ ఇందులో భాగంగా ఉంటాయి. ఈ ఎంవోయూలో 29 కంపెనీలు భాగస్వామ్యం అవుతాయి. బూసన్, ఏపీఐఐసీ మధ్య మరో ఎంవోయూ జరిగే అవకాశం ఉంది. ఏపీలో అన్ని అనుకూలతలు ఉన్న ఓ ప్రాంతంలో కొరియన్ సిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న సీఎం అందులో బూసన్ తరహా ఇండస్ట్రియల్ సిటీ నెలకొల్పే ఆలోచనలో ఉన్నారు. రేపు, ఎల్లుండి సీఎం చంద్రబాబు రెండు రోడ్‌షోల్లో పాల్గొంటారు.
 
డిసెంబర్ 6న కియో మోటర్స్‌తో కలిసి మరో బిజినెస్ సెమినార్‌కు హాజరవుతారు. ఈ పర్యటనలోనే కియో మోటర్స్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించి ఆ సంస్థ వైస్ చైర్మన్‌తో సీఎం భేటీ కానున్నారు. ఆ తరువాత లొట్టె కార్పొరేషన్ ప్రెసిడెంట్‌తో సమావేశం అవుతారు. కొకం కంపెనీ లిమిటెడ్ సీఈవోతో, ఓసీఐ కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్‌తోనూ, ఎంగ్‌వన్ కంపెనీ చైర్మన్‌తో అలాగే కొరియా ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ అసోసియోషన్ మేనేజింగ్ డైరెక్టర్‌తోనూ చంద్రబాబు సమావేశమవుతారు.
 
Tags : Chandrababu, South Korea
Link to comment
Share on other sites

ఏపీని మీ రెండవ రాజధానిగా చేసుకోండి: చంద్రబాబు
04-12-2017 11:28:49
 
636479837302994689.jpg
సియోల్‌: ఏపీలో కొరియన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న చంద్రబాబు...కియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఏపీని మీ రెండవ రాజధానిగా చేసుకోవాలని కోరుతున్నామన్నారు. అందు కోసం మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీకి పుష్కలంగా నీరు, మిగులు విద్యుత్ ఉందని వివరించారు.
 
దక్షిణకొరియా సాధించిన ప్రగతి అబ్బురపరిచిందని బాబు కొనియాడారు. దక్షిణకొరియా అభివృద్ధి సాధించిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. భౌగోళికంగా, జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్‌కు, దక్షిణకొరియాకు సారూప్యతలు ఉన్నాయని తెలిపారు. తయారీ, సాంకేతిక రంగంలో దక్షిణకొరియా ముందంజలో ఉందన్న బాబు తయారీరంగంలో భారత్‌ మెరుపువేగంతో దూసుకువెళ్తోందని పేర్కొన్నారు. భారత 'లుక్ ఈస్ట్' పాలసీని ఏపీ సాకారం చేస్తుందన్నారు. దక్షిణకొరియా పరిశ్రమలతో సంబంధాలను కోరుకుంటున్నామని ఈ సందర్భంగా బాబు అన్నారు.
 
ఈ సమావేశంలో భాగంగా ఏపీలో పెట్టుబడుల ప్రణాళికపై కియా ప్రతినిధులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాంతాల్లో ఎంత మేర పెట్టుబడులు పెట్టేది చంద్రబాబుకు కియా ప్రతినిధులు వివరించారు. అలాగే తమ సంస్థల ద్వారా ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయో వివరణ ఇచ్చారు. ఆపై అనంతపురం జిల్లాలో కియా సంస్థకు కేటాయించిన ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీ బృందం ప్రజెంటేషన్‌ ఇచ్చింది.
Link to comment
Share on other sites

ఏపీలో కొరియన్‌ సిటీ ఏర్పాటు చేస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు
దక్షిణ కొరియా పర్యటన ప్రారంభం
4brk78a.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా కొరియన్‌ సిటీని ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్లిన ఆయన తొలిరోజు పలువురు ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను రెండో రాజధానిగా చేసుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు తొలుత కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము పెట్టబోయే పెట్టుబడుల ప్రణాళికపై కియా ప్రతినిధులు చంద్రబాబుకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాంతాల్లో ఎంతమేర పెట్టుబడులు పెట్టేది వివరించారు. తాము ఏర్పాటు చేసే సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయో వెల్లడించారు.

దక్షిణ కొరియాలో కియా అనుబంధ సంస్థల ప్రతినిధులందరినీ ఒకేసారి కలుసుకోవడంపై చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. అనేక అవరోధాలు, ప్రతికూలతలను అధిగమించి దక్షిణకొరియా అభివృద్ధి సాధించిన తీరు స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు. భౌగోళికంగా, జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్‌, దక్షిణకొరియా మధ్యనున్న సారూప్యతలను వివరించారు. ప్రపంచంలో భారత్‌ ఒక్కదానికే రెండంకెల వృద్ధిరేటు సాధించగల సామర్థ్యం ఉందన్నారు. గత మూడేళ్లుగా ఏపీ సుస్థిరంగా రెండంకెల వృద్ధి సాధిస్తోందని తెలిపారు. వచ్చే 15ఏళ్ల పాటు 15శాతం వృద్ధి నమోదు చేయాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

రిటెక్ కంపెనీ సీఈవో కిమ్ డెహోన్‌ను కలిసిన చంద్రబాబు
04-12-2017 15:59:56
 
సియోల్‌: ఐరిటెక్ కంపెనీ సీఈవో కిమ్ డెహోన్‌ను సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్రంలో సెన్సర్లు, డ్రోన్లు, ఐవోటీ, క్లౌడ్ లాంటి.. సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టామని కిమ్‌కు చంద్రబాబు వివరించారు. భూములకు యునిక్ ఐడీని కేటాయించే విధానానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. ఈనెల 10 తరువాత ఏపీకి వస్తామని కిమ్ డెహోన్, చంద్రబాబుకు తెలిపారు.
Link to comment
Share on other sites

ఏపీలో కొరియన్‌ సిటీ ఏర్పాటు చేస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు
దక్షిణ కొరియా పర్యటన ప్రారంభం
4brk78a.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా కొరియన్‌ సిటీని ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్లిన ఆయన తొలిరోజు పలువురు ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను రెండో రాజధానిగా చేసుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు తొలుత కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము పెట్టబోయే పెట్టుబడుల ప్రణాళికపై కియా ప్రతినిధులు చంద్రబాబుకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాంతాల్లో ఎంతమేర పెట్టుబడులు పెట్టేది వివరించారు. తాము ఏర్పాటు చేసే సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయో వెల్లడించారు.

దక్షిణ కొరియాలో కియా అనుబంధ సంస్థల ప్రతినిధులందరినీ ఒకేసారి కలుసుకోవడంపై చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. అనేక అవరోధాలు, ప్రతికూలతలను అధిగమించి దక్షిణకొరియా అభివృద్ధి సాధించిన తీరు స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు. భౌగోళికంగా, జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్‌, దక్షిణకొరియా మధ్యనున్న సారూప్యతలను వివరించారు. ప్రపంచంలో భారత్‌ ఒక్కదానికే రెండంకెల వృద్ధిరేటు సాధించగల సామర్థ్యం ఉందన్నారు. గత మూడేళ్లుగా ఏపీ సుస్థిరంగా రెండంకెల వృద్ధి సాధిస్తోందని తెలిపారు. వచ్చే 15ఏళ్ల పాటు 15శాతం వృద్ధి నమోదు చేయాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...