Jump to content

AP Real Time Governance Center


sonykongara

Recommended Posts

  • 4 weeks later...

భారత దేశ ప్రధమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ అమరావతిలో టెక్నాలజీ చూసి ఫిదా అయిపోయారు... ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రెజెంటేషన్ తో, రాష్ట్రపతి ఆశ్చర్యపోయారు... రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ లో ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు... కొత్త రాష్ట్రం, పక్క రాష్ట్రాలతో పోటీ పడి ముందంజులో ఉంది.. మీకు ఎవరూ పోటీ కాదు... ఐ యాం ప్రౌడ్ అఫ్ యు అంటూ ముఖ్యమంత్రిని అభినందించారు... ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇలాంటిది దేశం మొత్తం ఉండాలి... మీరు అన్ని రాష్ట్రాలకి ఈ విషయం గురించి చెప్పండి... వారు కూడా ఇది ఇంప్లెమెంత్ అయ్యేలా చెయ్యండి... ఢిల్లీ వచ్చి ప్రధాని మోడీకి కూడా ఈ ప్రెజెంటేషన్ ఇవ్వండి, ఇది ఒక అద్భుతం అంటూ కొనియాడారు... మరి ప్రధాని మోడీ, రాష్ట్రపతి మాటలు వింటే ఎలా రియాక్ట్ అవుతారో...

 

 

 

 

 

అంతకు ముందు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వచ్చిన రాష్ట్రపతికి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ సెంటర్ ద్వారా ఏమి చేస్తాం అనేది ప్రెజెంటేషన్ ఇచ్చారు... నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆసియా ఖండంలోనే పెద్ద రియల్ టైమ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పని విధానాన్ని దాని ప్రత్యేకతలను రాష్ట్రపతికి చంద్రబాబు వివరించారు. అంతేకాకుండా ఆసియాలోనే అతిపెద్ద 66 అడుగుల పొడవైన వీడియో వాల్ పై సెంటర్ సాంకేతిక నైపుణ్యతను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకతల్లో ఒకటైన పీపుల్స్ హబ్ ను కూడా రాష్ట్రపతి వీక్షించారు. పోలవరం పనులు లైవ్ చూసారు...

 

 

 

ప్రజా సాధికార సర్వే ద్వారా రాష్ట పౌరుల వివరాలను ఆధార్ తో అనుసంధానం చేసి రూపొందించిన డేటాను చంద్రబాబు చూపించారు. మొత్తం 4.80 కోట్ల మంది ప్రజల డేటాను రాష్ట్రపతి దృషికి తీసుకువచ్చారు. ప్రభుత్వం వివిధ వర్గాలకు ప్రజలకు అందిస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల వివరాలను వివరించారు. దీంతో పాటు ల్యాండ్ హబ్ కాంప్రహెన్సివ్ ఫైనానియల్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఎఫ్ఎమ్ఎస్), ఈ-ఆఫీస్, ఈ-అటెండెన్స్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ప్రభుత్వం నేరుగా తీసుకునే పరిష్కార వేదిక పనితీరు వాటి పరిష్కారం పై రాష్ట్రపతికి ప్రత్యక్షప్రసారం ద్వారా చూపించారు. అంతే కాకుండా పత్రికలు, సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రజా సమస్యల కథనాలను సుమోటోగా స్వీకరిస్తున్న విధానాన్ని సైతం వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ ప్రగతిలో పొందుపరుస్తున్న విధానాన్ని రాష్ట్రపతికి తెలియజేసారు. ఈ సందర్భంగా ఇటీవల ఆధునీకరించిన 2.0 వెర్షన్ కోర్ డ్యాష్ బోర్డును రాష్ట్రపతి ప్రారంభించారు.

 

Edited by sonykongara
Link to comment
Share on other sites

గవర్నెన్స్‌కు విశేష స్పందన 
రాష్ట్రపతి ట్వీటుకు  4,084 మంది రీట్వీట్లు 
చంద్రబాబును అభినందించిన మధ్యప్రదేశ్‌ సీఎం చౌహాన్‌
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ విధానంపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయంలోని రాష్ట్రస్థాయి రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ఆ విశేషాలు వివరిస్తూ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా నుంచి మొత్తం 24 ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను 19,153 మంది లైకు చేయగా.. 4,084 మంది రీట్వీట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కన్నడ సినీనటుడు ఉపేంద్ర, రాష్ట్రపతి ప్రెస్‌ కార్యదర్శి అశోక్‌ మాలిక్‌, కర్ణాటక పాత్రికేయుడు చక్రవర్తి సులిబెలె సహా పలువురు ప్రముఖులు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రంలో కూర్చొని సమీక్షిస్తున్న చంద్రబాబు చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేసి అభినందనలు తెలిపారు. చంద్రబాబు చిత్రానికి నటుడు ఉపేంద్ర పారదర్శకత అనే వ్యాఖ్యను జోడించి పోస్టు చేశారు.
అభినందనల ట్వీట్లు ఇలా..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించే డిజిటల్‌ సాధికార భారతదేశానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ పెద్ద బలం. నామమాత్రపు ధరకు అత్యంత వేగవంతమైన అంతర్జాల సదుపాయాన్ని అందించి రాష్ట్రం మొత్తాన్ని డిజిటల్‌ పరంగా అనుసంధానించే దూరదృష్టి గొప్పది.  ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని బృందాన్ని అభినందిస్తున్నా.
- శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి
ఐటీ నగరమైన బెంగళూరుకు 500 కిమీ దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా పాలిస్తున్నారు. కర్ణాటకలో మనం నిద్రపోతున్నాం.
- చక్రవర్తి సులిబెలె, ప్రముఖ పాత్రికేయుడు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడేళ్లుగా సీఎం డ్యాష్‌బోర్డును నిర్వహిస్తోంది. సాంకేతికతను వినియోగించి పథకాల అమలును పర్యవేక్షిస్తోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఈ బాటలో నడవాలి.
- ది లాజికల్‌ ఇండియన్‌ (మీడియా కంపెనీ)
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి అభినందనలు. బెంగళూరు లాంటి సిలికాన్‌ నగరం ఇలాంటి నాయకుడిని కోరుకుంటోంది.
- బెంగళూరు ఫేస్‌బుక్‌ పేజీ

Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఆర్టీజీకి జాతీయ స్థాయి గుర్తింపు
18-01-2018 01:01:10
 
  • నేడు రాష్ట్ర ప్రభుత్వంతో నీతి ఆయోగ్‌ ఒప్పందం
అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రియల్‌ టైం గవర్నెన్స్‌(ఆర్టీజీ) ప్రాజెక్టుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో నీతి ఆయోగ్‌ ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను క్షేత్రస్థాయి సమాచారంతో అనుసంధానం చేసి అప్పటికప్పుడే ఫలితాలను సమీక్షించే వ్యవస్థను ఆర్టీజీ ద్వారా నెలకొల్పారు. దేశంలో అత్యంత వెనుకబడిన 115 జిల్లాల అభివృద్ధికి తాము అమలు చేస్తున్న పథకాల ఫలితాలను ఇదే తరహాలో సమీక్షించాలని నీతి ఆయోగ్‌ భావిస్తోంది. దీనికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఆర్టీజీ ద్వారా పొందాలని ఆ సంస్థ భావిస్తోంది.
 
 
నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ గురువారం స్వయంగా ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతకుముందు ఆయన సీఎం చంద్రబాబుతో అల్పాహార సమావేశంలో పాల్గొంటారు. కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న తర్వాత 11 గంటలకు ఆయన అక్కడ నుంచి సచివాలయానికి బయలుదేరి వెళ్లి అక్కడ రియల్‌ టైం గవర్నెన్స్‌ కేంద్రాన్ని సందర్శిస్తారు. దాని పనితీరును తెలుసుకొంటారు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొంటారు.
 
మధ్యాహ్నం 3.30గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడ నుంచి కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకొంటారు. అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఈ పర్యటనలో ఆయన పోలవరం కూడా సందర్శించాల్సి ఉంది. కానీ దానికోసం మరోసారి వస్తానని ఆయన రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు చెప్పినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

చంద్రబాబు చేసిన ఈ పని, ప్రతి రాష్ట్రానికి చెప్తామంటున్న నీతి అయోగ్‌...

   
niti-ayog-18012018.jpg
share.png

ఆర్టీజీఎస్‌ చూస్తుంటే భారత్‌లో ఉన్నట్లుగా అనిపించడం లేదని, ఇదో అద్భుతం, అమోఘం అని నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ఉన్న ఆర్టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌) కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ పనితీరు గురించి, దాని ద్వారా ప్రజలకు సకాలంలో ప్రభుత్వం ఏవిధంగా సేవలు అందిస్తున్నది ఆర్టీజీఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ముఖ్య కార్యనిర్వహణాధికారి-సీఈఓ) అహ్మద్‌ బాబు వివరించారు. రైతులకు ఉపయోగపడే విధంగా ఎప్పటికప్పుడు భూసార పరీక్షల ఫలితాలను ఆన్‌లైన్‌లో ఉంచడం, వాటి ద్వారా రైతులు వారి భూమి సారాన్ని బట్టి ఎలాంటి పంటలు వేసుకోవాలో సూచనలు ఇస్తున్న వైనాన్ని వివరంచారు.

 

rtgs 26112017 2

రాష్ట్ర వ్యాప్తంగా సర్వైలెన్స్‌ కెమెరాలను ఉపయోగించి నిఘా పర్యవేక్షణ, విపత్తలు, ప్రమాదాల సమయంలో ఎలా ప్రభుత్వం వేగంగా స్పందిస్తున్నది వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 వేల కెమెరాలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు, పౌరులు ఇంటికి తాళం వేసి బయట ఊళ్లకు వెళ్లినప్పుడు ఆ ఇంటికి పోలీసులు కెమెరాల గస్తీ ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా కాపాడుతున్న తీరును వివరించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ పనితీరును ప్రత్యక్షంగా తిలకించిన నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ఆయన బృందం ఆర్టీజీఎస్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తాను భారత్‌లో ఉన్నట్లుగా లేదని, ఇదో అద్భుతమని అన్నారు.

rtgs 26112017 3

దేశంలో మరెక్కడా కూడా ఇలాంటి వ్యవస్థ లేదని, ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇదో మంచి ఆలోచన, ఆర్టీజీఎస్‌ నిజంగా కళ్లు తెరిపిస్తోంది. ఏపీ సాధించిన ఒక గొప్ప అద్భుతమైన విజయం ఆర్టీజీఎస్‌ అన్నారు. ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌ తరహాలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ఏర్పాటు చేసుకుని డిజిటల్‌ బాట పట్టాలని సూచించారు. ప్రతి రాష్ట్రానికి తాము ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీజీఎస్‌ను చూడాలని సిఫారసు చేస్తామని చెప్పారు. త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్‌ సెక్రటరీ (ప్రధాన కార్యదర్శి)ల సదస్సు జరుగుతోందని, అందులో ఆర్టీజీఎస్‌ గురించి ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ ఆహ్వానించిందని, దీనివల్ల మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని గురించి తెలుసుకోగలుగుతాయని చెప్పారు.

Link to comment
Share on other sites

దావోస్‌ సదస్సులో ఆర్టీజీ!
20-01-2018 02:43:03
 
అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రియల్‌ టైం గవర్నెన్స్‌కు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. దావో్‌సలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆర్టీజీ విధానాన్ని ప్రదర్శించనున్నారు. రాష్ట్రపతి నుంచి నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడి వరకు అమరావతికి వచ్చిన వారంతా ఇక్కడి ఆర్టీజీ కేంద్రం, రియల్‌ టైం పాలన అద్భుతమని కొనియాడారు. ఇప్పుడీ అద్భుతాన్ని ప్రపంచానికి కూడా చాటి చెప్పనున్నారు. దావో్‌సలో ఏపీకి కేటాయించిన స్టాళ్లలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులు అక్కడకు వెళ్లి దీనికి సంబంఽధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో ఉన్నట్లుగానే అక్కడా వీడియో వాల్‌ ఏర్పాటు చేస్తారు.
Link to comment
Share on other sites

రియల్‌ టైం గవర్నెన్స్‌’కు కలాం ఇన్నోవేషన్‌ పురస్కారం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘రియల్‌ టైం గవర్నెన్స్‌’ (ఆర్టీజీ)కు అబ్దుల్‌ కలాం ఇన్నోవేషన్‌ అవార్డు లభించింది. పరిపాలనలో సరికొత్త ఆవిష్కరణలను అమలు చేస్తున్న ఆర్టీజీకి లభించిన ఈ పురస్కారాన్ని.. శనివారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఉపేంద్రకుశ్వహా చేతుల మీదుగా ఆర్టీజీ కార్యనిర్వాహణాధికారి (సీఈఓ) అహ్మద్‌బాబు స్వీకరించారు.

Link to comment
Share on other sites

దావోస్ లో ఏపి లాంజ్ కు వస్తున్న ప్రధానికి, చంద్రబాబు ఇచ్చే సర్‌ప్రైజ్ ఇదే...

   
rtgc-23012018-1.jpg
share.png

సర్‌ప్రైజ్ అంటే ఏంటో అనుకోకండి... మొన్నటి వరకు అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంది... నిన్న రాష్ట్రపతి మెచ్చుకుంది... ఈ రోజు దావోస్ లో అంతర్జాతీయ ఖ్యాతి పొందుతున్న మన రాష్ట్ర రియల్‌ టైం గవర్నెన్స్‌ గురించి, మొదటి సారి ప్రధాని, ఈ అద్భుతం చూడనున్నారు... అవును ఇది అద్భుతమే... దేశ రాష్ట్రపతిని సైతం ఆశ్చర్యపరిచిన ప్రాజెక్ట్ ఇది... ఇప్పుడు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రియల్‌ టైం గవర్నెన్స్‌ విధానాన్ని ప్రదర్శించనున్నారు. రాష్ట్రపతి నుంచి నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడి వరకు అమరావతికి వచ్చిన వారంతా ఇక్కడి ఆర్టీజీ కేంద్రం, రియల్‌ టైం పాలన అద్భుతమని కొనియాడారు. ఇప్పుడీ అద్భుతాన్ని ప్రపంచానికి కూడా చాటి చెప్పనున్నారు...

 

rtgc 23012018 2

ప్రధాని కూడా దావోస్ లో ఉన్నారు... ఈ రోజు దాదాపు రెండు గంటల పాటు, దావోస్ లో ఏర్పాటు చేసిన ఏపి లాంజ్ లో, ప్రధాని మోడీ గడపనున్నారు... ఈ సందర్భంగా, ప్రధాని మోడీకి రియల్‌ టైం గవర్నెన్స్‌ విధానాన్ని చూపించి, అది ఎలా పని చేస్తుంది, రియల్ టైంలో పాలన ఎలా చేస్తుంది, చంద్రబాబు మోడీకి వివరించనున్నారు... ఈ రియల్‌ టైం గవర్నెన్స్‌ పని తనాన్ని, ప్రపంచానికి కూడా చాటి ఉద్దేశంతో, దావోస్ లో ఏపి లాంజ్ లో ఇది ఏర్పాటు చేసారు... సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో ఉన్నట్లుగానే అక్కడా వీడియో వాల్‌ ఏర్పాటు చేసారు...

rtgc 23012018 3

ఇప్పటికే రియల్‌ టైం గవర్నెన్స్‌(ఆర్టీజీ) ప్రాజెక్టుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇప్పటికే, ఈ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో నీతి ఆయోగ్‌ ఒప్పందం కుదుర్చుకోనుంది. దేశంలో అత్యంత వెనుకబడిన 115 జిల్లాల అభివృద్ధికి తాము అమలు చేస్తున్న పథకాల ఫలితాలను ఇదే తరహాలో సమీక్షించాలని నీతి ఆయోగ్‌ భావిస్తోంది. దీనికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఆర్టీజీ ద్వారా పొందాలని ఆ సంస్థ భావిస్తోంది.

Link to comment
Share on other sites

నిఘా కన్ను పట్టేసింది.. 
లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ విధానంలో దొరికిన దొంగ 
సేవలు సద్వినియోగం చేసుకొని సహకరించాలి : ఎస్పీ 
knl-cri1a.jpg

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌తో ఫలితం నమోదైంది. కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన కాశెపోగు అశోక్‌ (30) అనే దొంగ పోలీసులకు దొరికిపోయాడు. ఎస్పీ గోపీనాథ్‌ జెట్టి మంగళవారం స్థానిక కార్యాలయంలో డీఎస్పీ ఖాదర్‌ బాషా, సీఐలు మురళీధర్‌రెడ్డి, నాగరాజరావులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గుత్తి పెట్రోలు బంకు సమీప శ్రీరామ్‌కాలనీలో నివాసం ఉండే సీతారామయ్య అనంతపురం వెళుతూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతని ఇంట్లో వైర్‌లెస్‌ కెమెరా ఏర్పాటుచేసి వెళ్లారు. ఇతని ఇంటికి తాళం వేసినట్లు గుర్తించిన దొంగ రాత్రికి చొరబడ్డాడు. కెమెరా కంటికి చిక్కగానే కమాండ్‌ కంట్రోల్‌లో సైరన్‌ మోగడంతో ఆ విభాగం పర్యవేక్షించే పోలీసులు అప్రమత్తమై స్థానికంగా గస్తీ తిరిగే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఇంటికి చేరుకోగానే శబ్దం విన్న దొంగ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సీసీ పుటేజీలో దొంగముఖం స్పష్టంగా ఉండటంతో స్థానిక బుధవారపేటకు చెందిన పాత నేరస్తుడు కాశపోగు అశోక్‌గా గుర్తించారు. గాలించి అతన్ని పట్టుకున్నారు. నిందితుడిపై 2012 నుంచి నేరచరిత్ర ఉందని, కర్నూలులోనే 11 కేసులు ఉన్నాయని, ఓ సంవత్సరం జైలుశిక్ష అనుభవించినట్లు గుర్తించారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

ఇటువంటి టెక్నాలజీ విదేశాల్లోనూ లేదు: ముకేష్
13-02-2018 19:32:48

అమరావతి: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ అమరావతి చేరుకున్నారు. ముకేష్‌కు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. ఆ తర్వాత సచివాలయం చేరుకున్న ముకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ఏ విధంగా జరుగుతుంది? ముఖ్యంగా గ్రామాల నుంచి సచివాలయం వరకు ఏ విధంగా కనెక్టయి ఉందన్నవిషయాన్ని సీఎం స్వయంగా ఆయనను పక్కన కూర్చొబెట్టుకుని వివరించారు. గ్రామాల్లో ఏమైనా అంశాలు జరిగినప్పుడు వాటి సమాచారాన్ని ఆటోమేటిక్‌గా సచివాలయంలో ఉన్న తన డ్రా బాక్స్‌లో కనిపించే విధంగా పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీని చూసిన ముకేష్ ముగ్ధుడయ్యారు. ఇటువంటి టెక్నాలజీ విదేశాల్లోనే కాదు.. ఎక్కడా లేదన్నారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడంతో పాటు ఫైబర్ గ్రిడ్ ఎలా పనిచేస్తుందో కూడా ముఖ్యమంత్రి ముకేష్ అంబానీకి వివరించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా గ్రామాల్లో ఫోన్, ఇంటర్ నెట్, టీవీ మూడు ఒకే వైర్ ద్వారా ఇవ్వడం చాలా అరుదైన విషయమని ముకేష్ అన్నారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది.

Link to comment
Share on other sites

 ఈ-ప్రగతి అనుసంధానం: సీఎం
15-02-2018 02:28:49

అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఆర్టీజీతో ఈ-ప్రగతిని అనుసంధానించి సత్ఫలితాలు సాధించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ-ప్రగతి పనితీరుపై బుధవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. 30కి పైగా ప్రభుత్వ శాఖలు 130కి పైగా ప్రభుత్వ విభాగాధిపతులు, 800 సూచికల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలని సీఎం మార్గనిర్దేశం చేశారు.

Link to comment
Share on other sites

Technology is good and it makes life easier and eradicates corruption. But some govt employees are intentionally delaying the greivences saying network/server down. Unfortunately user doesn't have the information whether the server is really down or not. These tactics have to be stopped. 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
ఆర్టీజీఎస్‌ మాకు స్ఫూర్తి
08-05-2018 03:15:12
 
636613461116365907.jpg
  • ఈ ఆలోచన అద్భుతం..
  • పనితీరుకు ముగ్ధులైన ఆర్థికమంత్రులు
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థ(ఆర్టీజీఎస్‌) చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులు ప్రశంసించారు. ఆర్థిక మంత్రుల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన మంత్రులు, ప్రతినిధులు... సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రాన్ని సందర్శించారు. సీఎం చంద్రబాబు వారిని స్వయంగా ఈ సెంటర్‌కు తీసుకొచ్చి ఆర్టీజీఎస్‌ పనితీరు గురించి వివరించారు. పరిష్కార వేదిక 1100 కాల్‌ సెంటర్‌ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తున్నామని చెప్పారు. కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(సీఎ్‌ఫఎంఎస్‌) ద్వారా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌ చేశామని, బిల్లుల చెల్లింపు మొదలు అన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నామని వివరించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫైబర్‌నెట్‌ సంస్థను ఏర్పాటు చేశామంటూ.. దాని ప్రయోజనాలను చెప్పారు. ఆర్టీజీ సీఈవో ఏ.బాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా దాని పనితీరు గురించి వివరించారు. ఆర్థిక మంత్రులు స్పందిస్తూ.. ఆర్టీజీఎస్‌ పనితీరు అద్భుతంగా ఉందని, ఎంతో మందికి ఇది ఆదర్శప్రాయంగా ఉందని తెలిపారు. ఇంత మంచి ఆలోచన చేయడమే కాకుండా దాన్ని విజయవంతంగా ఆచరణలోకి తీసుకొచ్చిన సీఎం చంద్రబాబును అభినందించారు. ఆర్టీజీఎ్‌సలోని సర్వైలెన్స్‌ కెమెరాలు, లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ వ్యవస్థ, డ్రోన్లు, పిడుగులకు సంబంధించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు పసిగడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న తీరు తదితర అంశాలను చూసిన ఆర్థిక మంత్రులు మంత్రముగ్ధులయ్యారు. వీరిలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, పశ్చిమ బెంగాల్‌ ఆర్థికమంత్రి అమిత్‌ మిత్రా, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మనీశ్‌ సిసోడియా, కేరళ ఆర్థిక మంత్రి డాక్టర్‌ థామస్‌ ఇజాక్‌ తదితరులు ఉన్నారు.
Link to comment
Share on other sites

రంపచోడవరంలో ఒక మహిళకు ..అరుదైన గ్రూపు రక్తమ్ 13బాటిల్స్ కావాల్సొస్తే RTGS ద్వారా 29 వేల మందికి ..మెసేజ్ లు పంపి ..కావల్సిన రక్తమ్ సేకరించారు

https://pbs.twimg.com/media/Dcz0IpFVAAEf_RP.jpg

Link to comment
Share on other sites

  • 4 weeks later...

రియల్ టైమ్ గవర్నెన్స్ పేరుతో అర్జీల స్వీకరణ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా 100% సాధన ద్వారా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం లో ఉంది. జన్మభూమి, మీకోసం, తదితర శాఖలకు సంబంధించి లక్షలాది అర్జీలు వచ్చాయి. జిల్లాలో అర్జీలలో ఉన్న సమస్యలు పరిష్కరించబడ్డాయి

https://pbs.twimg.com/media/De8o5a-U0AA_BAe.jpg

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...