Jump to content

Recommended Posts

Posted
కరుణిస్తే.. కొండకు వైభవం 
తితిదే సహకారంతో వైకుంఠపురం ప్రగతి 
‌అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రమే.. 
స్వయంభువుగా వెలసిన వేంకటేశ్వరుడు 
పురాతన ఆలయం ప్రగతి 
ఈనాడు-అమరావతి 
amr-sty3a.jpg

కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించే ప్రాంతం.. స్వయంభువుగా వెలసిన వేంకటేశ్వరుడు.. సుమారు 5వేల సంవత్సరాల నాటి ఆలయం.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పవిత్రమైన వైకుంఠపురం వేంకటేశ్వరుని ఆలయం అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా రాజధాని ప్రాంతానికి తలమానికం కానుంది. రూ.100కోట్లతో వెంకన్న ఆలయాన్ని నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ప్రకటించింది. ఈ ఆలయ ప్రాశస్త్యం, పవిత్రత, ఇతర అంశాల ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడే ఆలయాన్ని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. వాసిరెడ్డి వెంకట్రాదినాయుడు కాలంలో ఎంతో అభివృద్ధి చెందింది. అంతకుముందు పాలించిన రాజులు భూములు ఇచ్చి చేయూతనిచ్చారు. రాజధాని నిర్మాణం నేపథ్యంలో వైకుంఠపురం కొండపై ఆలయాన్ని అభివృద్ధి చేయడం అన్నివిధాలా అనుకూలమైనదన్న వాదన వినిపిస్తోంది.

ఆధ్యాత్మిక, పర్యటకానికి అనుకూలం 
అమరావతి మండలం వైకుంఠపురం గ్రామం సమీపంలో కౌంచగిరి కొండపై వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలిశారు. సుమారు 5వేల సంవత్సరాల క్రితం నుంచి ఆలయం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో కొండ కింది భాగంలో ఆలయం నిర్మించారు. రాజధాని ప్రాంతంలో ఆధ్యాత్మికంగా పేరొందిన ఈ ఆలయ ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ఆలయాన్ని నిర్మించాలని తితిదేని కోరింది. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండపై చదునైన ప్రాంతం లేనందున అభివృద్ధి పనులకు అధిక వ్యయం చేయాల్సి వస్తుందని, ప్రత్యామ్నాయం చూడాలని తితిదే ప్రభుత్వానికి లేఖ రాసింది. కొండ పైభాగంలో బైరవకోనగా పిలుస్తున్న ప్రాంతంలో సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో చదునైన ప్రాంతం ఉంది. దీనిని వినియోగించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వైకుంఠపురం వద్ద కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుండటంతో ఈప్రాంతం పవిత్రమైనదిగా భావిస్తారు. తొలి ఏకాదశి రోజున వేలమంది భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం కొండపైకి మెట్లదారి మాత్రమే ఉంది. కొండను ఒకవైపు గట్టుగా చేసుకుని వైకుంఠపురం బ్యారేజీ నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇక్కడే గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుతూ రోడ్డు వంతెన, రైలు వంతెన కృష్ణానదిపై నిర్మించనున్నారు. ఈక్రమంలో వైకుంఠపురం కొండను అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మికంగా, పర్యటకంగా వృద్ధి చెందడానికి అనేక అనుకూలతలు తోడ్పడుతాయి. గతంలోనే కొండపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణం ప్రారంభమైనా రాజకీయ కారణాలతో అడ్డంకి ఏర్పడి ఆగిపోయింది. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదికి కుడివైపు కరకట్ట వైకుంఠపురం కొండ వరకు ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి కరకట్ట మీదుగా భక్తులు వైకుంఠపురం ఆలయానికి చేరుకునేవారు. ఈమార్గాన్ని ఇటీవల కొంత అభివృద్ధి చేశారు. రాజధాని నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కృష్ణానది కరకట్ట ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.

పట్టాలెక్కేనా? 
రాజధానికి  మణిహారం 
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి సమీపంలో వైకుంఠపురం ఉంది. తితిదే ప్రకటించినట్లు దీనిని రూ.100కోట్లతో పనులు చేస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుంది. పర్యటకంగా ప్రగతి సాధ్యమవుతుంది. సమీపంలో పంచారామాలలో ప్రథమారామం అమరలింగేశ్వరుని ఆలయం, అనంతవరం కొండపై వేంకటేశ్వరుడు, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, కృష్ణానదికి అటువైపు కనకదుర్గ ఆలయం ఉండటంతో వీటన్నింటినీ కలిపి ఆధ్యాత్మిక వలయంగా అభివృద్ధి చేయవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న దృక్పథంతో ఉంది. తితిదే తాజాగా ఫిబ్రవరి 26వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ప్రభుత్వ తీసుకునే నిర్ణయంపై వైకుంఠపురం ఆలయ వైభవం ఆధారపడి ఉంది.

  • 2 months later...
Posted
వైకుంఠ ధామం
వైకుంఠపురం కొండనే క్రౌంచగిరి అంటారు. క్రౌంచగిరిపై వేంకటేశ్వరస్వామి, అలివేల మంగమ్మ దేవస్థానం ఉంది. దీంతో క్రౌంచగిరి వైకుంఠపురం క్షేత్రదర్శినిగా ఖ్యాతికెక్కింది. అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ కొండకు ఎనలేని శోభ వచ్చింది. వైకుంఠపురం కొండపై కలియుగ వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించాలని ఆలిండియా పంచాయతీ పరిషత్‌ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా స్పందించి టీటీడీకి దీనికి సంబంధించి లేఖ కూడా రాసింది. తిరుమల కొండపై ఏ విధంగా ఆలయాన్ని నిర్మించారో అదే విధంగా ఇక్కడ కూడా నిర్మించాలని ప్రభుత్వం నిశ్చయించింది. తిరుమల అంశగా వైకుంఠపురం ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇందులో భాగంగా రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించాలన్న భావనతో ఉంది. ప్రస్తుతం సీఆర్‌డీఏ ఈ అంశాన్ని చూస్తోంది.
 
Posted

ఆధ్యాత్మికంగా కీలకం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి సమీపంలోనే వైకుంఠపురం బ్యారేజీ నిర్మిస్తున్నారు. వైకుంఠపురం కొండపై వెంకటేశ్వరస్వామి స్వయంభువుగా వెలిశారు. వెంకటేశ్వరుడి వైభవం వల్లే ఈప్రాంతానికి వైకుంఠపురం పేరు వచ్చింది. 1650 సంవత్సరంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఈప్రాంతానికి జమిందారుగా ఉంటూ పరిపాలనా చేసేవారు. ఈప్రాంతానికి బంధారావూరు అనే పేరు ఉండేది. ఈక్రమంలో కొండమీద వెంకటేశ్వరస్వామికి నిత్యం వేదపారాయణము, నిత్యసేవా కార్యక్రమాలు 650 మంది వైష్ణవస్వాములచే నిర్వహించడాన్ని జమిందారు చూసి కలియుగ వైకుంఠంలాగా వెలుగొందుతోందని గుర్తించి వైకుంఠపురం అని నామకరణం చేశారు. అప్పటినుంచి వైకుంఠంపురంగాఈప్రాంతం ప్రసిద్ధి చెందింది. కాశీ క్షేత్రంలో గంగానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. అలాగే కాశీక్షేత్రంలో ఒకే రాతిపై ఐదు శివలింగాలుంటాయి. ఇక్కడ కృష్ణానదిలో 5 శివలింగాలు ఉండటం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉండటంతోపాటు అమరావతి సమీపంలో ఉండటంతో రూ.100కోట్లతో అభివృద్ధి చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకువచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఇక్కడి ఆలయం అభివృద్ధి చేస్తామని గతంలోనే ప్రకటించారు. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణంతో పెదకూరపాడు నియోజకవర్గం ప్రజల కల నెరవేరుతుందని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ‘ఈనాడు’కు తెలిపారు. బ్యారేజీ నిర్మాణంతో సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు.

  • 4 weeks later...
Posted
వైకుంఠపురం ఆలయాన్ని సందర్శించిన టీటీడీ అధికారులు
05-07-2018 08:08:13
 
అమరావతి: ఉత్తరవాహినీ తీర్ధంగా విరాజిల్లుతున్న మండలంలోని వైకుంఠపురం ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు బుధవారం సందర్శించారు. రాజధాని ప్రాంతంలో టీటీడీ అభివృద్ధి చేయనున్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు టీటీడీ జేఈవో భాస్కర్‌, చీఫ్‌ ఇంజనీరు చంద్రశేఖర్‌రెడ్డి, డీఈ నాగభూషణం, ఏఈ ప్రసాద్‌రావులు వైకుంఠపురం కొండపై స్థలాన్ని పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ అధికారుల సమావేశం నేపథ్యంలో అధికారుల సందర్శన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని పరిధిలో టీటీడీ చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు చారిత్రక ప్రాధాన్యం, స్వయంభువుగా వెలసిన వెంకటేశ్వరస్వామి, పవిత్ర కృష్ణానది వైకంఠపురంలో ఉత్తరంగా ప్రవహించడంతో ఉత్తరవాహినీ తీర్ధంగా పేరుగాంచిన ఈ ప్రదేశం అనువైనదిగా ఉంది. ఈ కొండపైనే టీటీడీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ కార్యదర్శి జాస్టి వీరాంజనేయులు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. గతంలో కూడా సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరకూరి శ్రీధర్‌ కొండపై పర్యటించారు. అధికారుల నివేదిక ఆధారంగా ఆలయ నిర్మాణంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Posted
కృష్ణా తీరంలో శ్రీవారి ఆలయం
20 ఎకరాల్లో తితిదే ఆధ్వర్యంలో నిర్మాణం
దొనకొండలో నిర్మాణ నగరం
డిసెంబరు 15కి తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం
సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో పలు నిర్ణయాలు
రాజధాని పనుల పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి
4ap-main10a.jpg

ఈనాడు, అమరావతి: కృష్ణానది ఒడ్డున పవిత్రసంగమం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందుకు 20 ఎకరాలు కేటాయిస్తూ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తితిదే వీలైనంత త్వరలో దేవాలయం ఆకృతులు సిద్ధంచేసి, వాటిపై ప్రజాభిప్రాయం తెలుసుకుని, వెంటనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతం, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ పవిత్రసంగమం వద్ద కట్టే ఐకానిక్‌ బ్రిడ్జి సమీపంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తారు. వైకుంఠపురం రిజర్వాయర్‌ దగ్గర కృష్ణానదిపై నిర్మించే వారధి ఐకానిక్‌గా ఉండాలని సీఎం ఆదేశించారు. వివిధ ప్రాంతాల్ని అమరావతికి అనుసంధానం చేస్తూ కృష్ణా నదిపై నిర్మించే డజనుకుపైగా వారధులన్నీ రాజధానికి మకుటాయమానంగా నిలవాలన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద నిర్మాణ నగరాన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. మొదట 61.77 ఎకరాల్లో ట్రేడ్‌ సెంటర్‌లా దీన్ని నెలకొల్పుతారు. ఇక్కడ వ్యాపార కార్యలాపాలు ప్రారంభించేందుకు ఇప్పటికే 610 కంపెనీలు ముందుకొచ్చాయని ఏపీటిడ్కో అధికారులు వివరించారు. భవిష్యత్తులో ఈ నగరాన్ని తయారీ, నిర్మాణ రంగ సామగ్రి, పరికరాలకు సంబంధించిన హబ్‌గా తీర్చిదిద్దుతారు. మొదటి దశలో కార్పొరేట్‌ కార్యాలయాలు, నిర్మాణ సామగ్రి ప్రదర్శన కేంద్రాలు, గిడ్డంగులు, గ్రీన్‌ బెల్ట్‌, పార్కింగ్‌ ప్రాంతం, ఫుడ్‌ ప్లాజా, క్రేన్లు వంటి భారీ వాహనాలు, పరికరాల కోసం సింగపూర్‌ భాగస్వామ్యంతో ప్రదర్శన కేంద్రం ఏర్పాటు చేస్తారు. ‘‘కేవలం నిర్మాణ సామగ్రి తయారీకి నెలవుగానే కాకుండా, నిర్మాణరంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, నవ్యావిష్కరణలకు ఆలవాలంగా, సాంకేతిక, వైజ్ఞానిక కేంద్రంగా ఉండాలి. దీర్ఘకాల మన్నిక, అందుబాటు ధర, ఆకట్టుకునే ఆకృతులు, ఆధునిక నగర ప్రణాళికలకు సంబంధించిన నూతన ఆలోచనలకు వేదికగా నిలవాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు, చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.
* రాజధానిలో రహదారుల నిర్మాణ పురోగతి ఆశించినంత వేగంగా లేకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ 36 శాతం పనులే పూర్తయ్యాయని, రూ.కోట్లు వెచ్చించి పెట్టుకున్న కన్సల్టెన్సీ సంస్థలు ఏం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
* వీజీటీఎం-ఉడా కింద ఉన్న ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, నాలుగో తరగతి ఉద్యోగుల్ని సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
* రాజధానిలో సొంత ఫ్లాట్ల కొనుగోలుకు ఉద్యోగులు, న్యాయవాదులు, ఇతర వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌ దృష్ట్యా సీఆర్‌డీఏ వెయ్యి ఫ్లాట్లను వాణిజ్య ప్రాతిపదికన నిర్మించేందుకు ఆమోదించింది.
* దేశంలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థను రాజధానిలో ఏర్పాటు చేయనున్నారు.
* అమరావతిలో భూములు కేటాయించిన 8 పాఠశాలల నిర్మాణాలు త్వరలో ప్రారంభం.
* త్వరలో ఒక ఫైవ్‌స్టార్‌, నాలుగు ఫోర్‌స్టార్‌, నాలుగు త్రీస్టార్‌ హోటళ్ల నిర్మాణాలు ప్రారంభం.
* అమరావతిలోని శాఖమూరు పార్కులో భాగంగా 7.5 ఎకరాల్లో నిర్మించే ఎత్నిక్‌ విలేజ్‌లో ఎకరం విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో హస్తకళల కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
* రాజధాని ప్రాంతంలోని కొండలన్నింటినీ  వివిధ రకాల పుష్పజాతులతో సుందరంగా తీర్చిదిద్దాలి.
* నీరుకొండలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌, మ్యూజియం ఆవరణలో ట్రాక్‌ రహిత టాయ్‌ ట్రైన్‌, స్టార్‌ హోటళ్లు, రిసార్టులు, స్పోర్ట్స్‌ రిక్రియేషన్‌ క్లబ్బుల ఏర్పాటుకి ప్రతిపాదనలు.
* డిసెంబరు 15 నాటికి తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం చేయాలని సీఎం ఆదేశం.
* నగరాల్లో రోడ్డు మీద నీరు నిలిస్తే సంబంధిత అధికారిని సస్పెండ్‌ చేయాలి.

Posted
2 hours ago, sonykongara said:

Is this the new temple he is talking about instead developing Vaikunthapuram temple?

or

both in plans?

Posted
48 minutes ago, Vulavacharu said:

Is this the new temple he is talking about instead developing Vaikunthapuram temple?

or

both in plans?

naku ardham kala bro pavitra sangamam antunaru, malli eroju

వైకుంఠపురం ఆలయాన్ని సందర్శించిన టీటీడీ అధికారులు
05-07-2018 08:08:13
 
అమరావతి: ఉత్తరవాహినీ తీర్ధంగా విరాజిల్లుతున్న మండలంలోని వైకుంఠపురం ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు బుధవారం సందర్శించారు. రాజధాని ప్రాంతంలో టీటీడీ అభివృద్ధి చేయనున్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు టీటీడీ జేఈవో భాస్కర్‌, చీఫ్‌ ఇంజనీరు చంద్రశేఖర్‌రెడ్డి, డీఈ నాగభూషణం, ఏఈ ప్రసాద్‌రావులు వైకుంఠపురం కొండపై స్థలాన్ని పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ అధికారుల సమావేశం నేపథ్యంలో అధికారుల సందర్శన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని పరిధిలో టీటీడీ చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు చారిత్రక ప్రాధాన్యం, స్వయంభువుగా వెలసిన వెంకటేశ్వరస్వామి, పవిత్ర కృష్ణానది వైకంఠపురంలో ఉత్తరంగా ప్రవహించడంతో ఉత్తరవాహినీ తీర్ధంగా పేరుగాంచిన ఈ ప్రదేశం అనువైనదిగా ఉంది. ఈ కొండపైనే టీటీడీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ కార్యదర్శి జాస్టి వీరాంజనేయులు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. గతంలో కూడా సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరకూరి శ్రీధర్‌ కొండపై పర్యటించారు. అధికారుల నివేదిక ఆధారంగా ఆలయ నిర్మాణంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Posted (edited)
2 hours ago, Vulavacharu said:

Is this the new temple he is talking about instead developing Vaikunthapuram temple?

or

both in plans?

cm ki vykuntapuram daggra kattalani undi, ttd vallu karchu ekkuva avuthundi pavitra sangamam daggra kattalani chusthunaru

Edited by sonykongara
Posted
7 hours ago, sonykongara said:

cm ki vykuntapuram daggra kattalani undi, ttd vallu karchu ekkuva avuthundi pavitra sangamam daggra kattalani chusthunaru

Anantavaram and Vykuntapuram temples are different?

Posted (edited)

Vykuntapuaram lo already Venkateswara swamy temple vundi ga.

may be thats why they want to build at Pavithra sangamam

Edited by rk09
Posted
Just now, rk09 said:

Vykuntapuaram lo already Venkateswara swamy temple vundi ga.

may be thats why they want to build at Pavithra sangamam

anduku kadu konda meda chadunu cheyyali ante ekkuva karchuavuthundi antunaru TTD valu

Posted
23 minutes ago, swarnandhra said:

my vote is for a hill. baaga distance nunchi kuda kanipistu vunte baaguntundi.

Guntur: The Tirumala Tirupati Devasthanams will construct the new capital Amaravati’s Balaji temple atop Vykunthapuram situated on the banks of River Krishna. Chief Minister N. Chandrababu made an announcement about the same — auspicious Uttaravahini place. 

It will be built near the 5,000-year-old ancient Venkateswara temple already existing on the hill. The temple is considered auspicious due to the holiness its location, at the Uttara-vahini, towards the north side of River Krishna, On Thursday, the locals performed special puja welcoming the CM’s decision.

Posted
1 hour ago, sonykongara said:

:super:

  • 2 weeks later...
Posted
అమరావతిలో శ్రీవారి నమూనా ఆలయం 
మంత్రి నారాయణ వెల్లడి

తిరుపతి, న్యూస్‌టుడే: అమరావతి ప్రాంతంలో కృష్ణానదీ తీరాన శ్రీవేంకటేశ్వర స్వామివారి నమూనా ఆలయ నిర్మాణానికి అనువైన మంచి వాస్తు కలిగిన 25 ఎకరాల భూమిని తితిదేకి అప్పగించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో శుక్రవారం మంత్రి తితిదే, తిరుపతి కార్పొరేషన్‌, తుడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజధానిలో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి సంబంధించిన ప్రతిపాదనలు తితిదే పాలకమండలి తదుపరి సమావేశంలో చర్చించి ఆమోదించనున్నట్లు వివరించారు. తిరుపతి శివారులోని అవిలాల చెరువును తితిదే రూ.180 కోట్లతో రెండు దశల్లో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. తిరుపతి స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.350 కోట్లతో వివిధ ప్రాజెక్టులను రూపొందించామని, అందులో రూ.150 కోట్ల పనులు టెండరు దశలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నగర, పురపాలిక పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంపొందించడం ద్వారా ప్రజలు ఆదరిస్తున్నారని, తిరుపతిలోని 44 నగరపాలిక పాఠశాలలను రూ.21 కోట్ల ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లకు మంచి ఆదరణ లభిస్తోందని, త్వరలోనే 203 క్యాంటీన్లను ఆందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగడం శుభ పరిణామమని మంత్రి నారాయణ తిరుపతిలో అన్నారు. విభజన చట్టంలోని 19 అంశాలను, అప్పటి ప్రధాని పార్లమెంట్‌ సాక్షిగా చేసిన హామీలను గల్లా జయదేవ్‌ చాలా స్పష్టంగా తెలియజెప్పారని జయదేవ్‌ను అభినందించారు.

  • 1 month later...
  • 6 years later...
  • 1 month later...
  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...