Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Vykuntapuram Temple, Amaravati

Featured Replies

  • Replies 104
  • Views 14.5k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • sonykongara
    sonykongara

  • sonykongara
    sonykongara

  • sonykongara
    sonykongara

    Amaravati: అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం శ్రీనివాసుని కల్యాణంతో అమరావతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం శనివారం సాయంత్రం గోవింద నామస్మరణతో మారుమో

  • Author

Amaravati: అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం

శ్రీనివాసుని కల్యాణంతో అమరావతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం శనివారం సాయంత్రం గోవింద నామస్మరణతో మారుమోగింది.

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 16 Mar 2025 06:18 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు
హాజరైన గవర్నర్, మంత్రులు, ప్రముఖులు
ఆధ్యాత్మిక శోభతో వెలుగులీనిన అమరావతి
గోవిందనామ స్మరణతో మార్మోగిన ప్రాంగణం

ap150325main4a.webp

వెంకటపాలెంలో తితిదే ఆలయం వద్ద విద్యుద్దీపకాంతులతో వెలుగులీనుతున్న కల్యాణ వేదిక

ఈనాడు, అమరావతి; గుంటూరు సాంస్కృతికం, తుళ్లూరు, న్యూస్‌టుడే: శ్రీనివాసుని కల్యాణంతో అమరావతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం శనివారం సాయంత్రం గోవింద నామస్మరణతో మారుమోగింది. ఆరు గోపురాలతో ఏర్పాటుచేసిన నమూనా ఆలయం వేదికపై అంగరంగవైభవంగా దేవదేవుడి కల్యాణం జరిగింది. వేలమంది భక్తులు వేడుకను వీక్షించి, తన్మయత్వంతో గోవిందుడిని స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తితిదే ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. అర్చకస్వాముల సభా ప్రార్థన, విష్వక్సేనారాధనతో కల్యాణవేడుక ప్రారంభమైంది. ప్రతి ఘట్టానికి తగినట్టు గాయనీ గాయకులు అన్నమయ్య కీర్తనలు గానం చేశారు. వేదోక్త మంత్రఘోషతో సద్యోఅంకురార్పణం, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, కల్యాణోత్సవ సంకల్పం, మహాసంకల్పం, మాంగల్యధారణం, ప్రధాన హోమం, పూర్ణాహుతి జరిగాయి. అనంతరం పూల బంతులాట, నూతన వధూవరులు పూలదండలు మార్చుకోవడం సరస సమ్మిళితంగా సాగింది. ఏ వైపు చూసినా భక్తజన పవిత్ర మనస్సంకల్పంతో కల్యాణమూర్తుల దర్శనభాగ్యం దక్కిందన్న ఆనందానుభూతులు కనిపించాయి. ఇసుకేస్తే రాలని భక్త జనవాహినితో కల్యాణ ప్రాంగణం నిండిపోయింది. 

ap150325main4c.webp

సతీమణి భువనేశ్వరికి యజ్ఞ తిలకం దిద్దుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

స్వామివారి సేవలో సీఎం దంపతులు

వేంకటేశ్వర స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకకు హాజరైన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ప్రముఖులకు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి తొలుత ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. హారతి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అక్కడ నుంచి కల్యాణ వేదిక వద్దకు వచ్చి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముహూర్తం మేరకు 6 గంటలకు కల్యాణోత్సవం ప్రారంభమైంది. కల్యాణ వేదికను దేశవిదేశాల్లో లభ్యమయ్యే రకరకాల పత్రాలు, పూలతో అలంకరించారు. 4 టన్నుల స్థానిక పుష్పాలు, 30 వేల కట్‌ ఫ్లవర్స్‌ను వినియోగించారు. తితిదేకు చెందిన పెదజీయర్, చినజీయర్‌ స్వాములు, కమలానంద భారతి, అహోబిలస్వామి, శివస్వామి, తాళ్లపాక అన్నమయ్య వంశీయులు హాజరయ్యారు. వేడుక అనంతరం వారిని సీఎం సత్కరించారు. క్రతువుకు వ్యాఖ్యాతగా సహస్రావధాని మేడసాని మోహన్‌ వ్యవహరించారు. తిరుమల నుంచి తెచ్చిన 50 వేల చిన్న లడ్డూలను భక్తులకు అందించారు. తితిదే అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో అమరావతి అక్షయ ఫౌండేషన్‌ వారు పులిహోర, పెరుగన్నం, రవ్వ కేసరి, స్వీట్‌ ప్యాకెట్లు 40 వేల చొప్పున పంచారు. కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, కొల్లు రవీంద్ర, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రావణ్‌కుమార్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తితిదే బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, సుచిత్ర ఎల్ల, పనబాక లక్ష్మి, నన్నూరి నర్సిరెడ్డి, సదాశివరావు, ఎం.శాంతారాం, తమ్మిశెట్టి జానకీదేవి, ఎస్‌.నరేష్‌కుమార్, జి.భానుప్రకాశ్, దేవాదాయశాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్, గుంటూరు కలెక్టర్‌ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ap150325main4b.webp

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు అర్చకుల ఆశీర్వాదం.. చిత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు

  • శ్రీవారి దయతో ప్రజలు గర్వించే రాజధానిగా అమరావతి ఆవిష్కృతం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు తాము చేస్తున్న కృషి ఫలించేలా శ్రీనివాసుడు కరుణించాలని ‘ఎక్స్‌’లో ప్రార్థించారు. శ్రీనివాస కల్యాణోత్సవంలో పాల్గొనడం సంతోషాన్ని, సంతృప్తినిచ్చిందని, రాజధాని ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందని అభివర్ణించారు.
  • సీఎం చంద్రబాబు సనాతన ధర్మాన్ని కాపాడగలరని ప్రముఖ భగవద్గీత గాయకుడు గంగాధరశాస్త్రి అన్నారు. కల్యాణోత్సవం చివర్లో ఆయన మాట్లాడుతూ అలిపిరి ఘటనలో ప్రాణాలతో బయట పడినందుకు కృతజ్ఞతగా సనాతన ధర్మాని పరిరక్షించాలని కోరారు. ఐదో తరగతి నుంచి భగవద్గీతను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. ‘గీత నేర్చుకుందాం.. రాత మార్చుకుందామ’ని పిలుపునిచ్చారు. ఒక్క శ్లోకమైనా పూర్తి తాత్పర్యంతో పిల్లలకు నేర్పించాలని తితిదేకు విన్నవించారు.

ap150325main4d.webp

శ్రీనివాసుడి కల్యాణానికి హాజరైన భక్తజనం

  • Author

Amaravati: అమరావతిలో అద్భుతంగా శ్రీవారి ఆలయం

ఇల వైకుంఠంలా విరాజిల్లే తిరుమల క్షేత్ర వైభవాన్ని అమరావతిలోనే దర్శింపజేసేలా రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుంకట్టింది.

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 23 Mar 2025 06:07 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

రూ.185 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి
తిరుమలను తలపించేలా సర్వ హంగులు
అమరావతిపై కక్షతో వ్యయాన్ని రూ.36 కోట్లకు కుదించిన జగన్‌ ప్రభుత్వం

ap220325main31a.webp

ఈనాడు, అమరావతి: ఇల వైకుంఠంలా విరాజిల్లే తిరుమల క్షేత్ర వైభవాన్ని అమరావతిలోనే దర్శింపజేసేలా రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుంకట్టింది. ఆలయం చుట్టూ భారీ ప్రాకారం, ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తులతో మహారాజ గోపురం, మూడు దిక్కుల్లో ఐదు అంతస్తులతో గోపురాలు, మాడ వీధులు, పుష్కరిణితో పాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దనుంది. రాజధాని నిర్మాణ పనుల్ని మొదలు పెడుతున్న ప్రభుత్వం.. సమాంతరంగా శ్రీవారి ఆలయాన్ని రూ.185 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ నెల 14న తితిదే అధికారులు వివరించారు. ఆయన ఆమోదముద్ర వేయడంతో అమలుకు సిద్ధమవుతున్నారు. రాజధానిలో శ్రీవారి కల్యాణోత్సవాన్ని తితిదే ఆధ్వర్యంలో ఈ నెల 15న కన్నుల పండుగలా నిర్వహించడం ద్వారా అమరావతి పునర్వైభవానికి ప్రభుత్వం నాంది పలికింది. 

జగన్‌ కక్షగట్టినా భక్తులతో కళకళ

రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలని ఏడేళ్ల ముందు అప్పటి తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. వెంకటపాలెం వద్ద ప్రధాన అనుసంధాన రహదారికి, కృష్ణా కరకట్టకు మధ్యలో 25 ఎకరాల్ని కేటాయించింది. రూ.150 కోట్ల అంచనా వ్యయంతో తిరుమలను తలపించేలా శ్రీవారి ఆలయం నిర్మించాలన్నది ఆలోచన. ఈ ప్రతిపాదనకు తితిదే ధర్మకర్తల మండలి 2018లో ఆమోదం తెలిపింది. ప్రణాళికలు సిద్ధమై పనులు ప్రారంభించిన కొన్నాళ్లకే అధికారంలోకి వచ్చిన వైకాపా.. రాజధానిపై కక్షగట్టి ఎక్కడి పనులు అక్కడే నిలిపేసింది. శ్రీవారి ఆలయ నిర్మాణ పనులూ నిలిచిపోయాయి. ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వం ఆదేశాలలో ఆలయ ప్రణాళికను తితిదే కుదించింది. అంచనా వ్యయాన్ని రూ.36 కోట్లకు పరిమితం చేసింది. ప్రధాన ఆలయం, లోపాలి ప్రాకారం, ఒక రాజగోపురం, ధ్వజస్తంభ మండపాలు మాత్రం నిర్మించి మమ అనిపించింది. జగన్‌ ప్రభుత్వం అంతలా కక్షగట్టినా అమరావతిలోని శ్రీవారి ఆలయం భక్తులతో నిత్యం కళకళలాడుతోంది.


సకల హంగులతో నిర్మాణం..!

ఏడేళ్ల క్రితం శ్రీవారి ఆలయాన్ని ఏ స్థాయిలో నిర్మించాలనుకున్నారో దానికి మించి సకల హంగులూ కల్పించనున్నారు. ఆలయానికి లోపలి ప్రాకారం మాత్రమే ఉండగా, ఇప్పుడు వెలుపలి ప్రాకారాన్నీ నిర్మించనున్నారు.

  • వెలుపలి ప్రాకారానికి తూర్పు దిక్కున మహారాజగోపురం, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల్లో రాజగోపురాలు ఉంటాయి. వాటితో పాటు కల్యాణోత్సవ, ఉత్సవ మండపాలను రూ.84 కోట్లతో నిర్మిస్తారు. 
  •  ఆర్జిత సేవల మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రాధా మండపం, ఆంజనేయస్వామి ఆలయం, పుష్కరిణి నిర్మిస్తారు. ఆలయ ప్రాంగణంలో కట్‌స్టోన్‌ ఫ్లోరింగ్‌ ఏర్పాటు చేస్తారు. వీటన్నిటికీ కలిపి రూ.44 కోట్లు వెచ్చిస్తారు. 
  • రూ.6 కోట్లతో ఆలయానికి చుట్టూ మాడ వీధులు, అప్రోచ్‌ రహదారులు ఏర్పాటు చేస్తారు.
  • అన్నదానం కాంప్లెక్స్, అర్చకులు, సిబ్బంది క్వార్టర్లు, రెస్ట్‌ హౌస్, భక్తులు వేచివుండే హాల్‌ వంటి నిర్మాణాల్ని రూ.20 కోట్లతో చేపడతారు. 
  • రూ.20 కోట్లతో ధ్యాన మందిరాన్ని నిర్మిస్తారు.
  • విద్యుత్‌ సబ్‌ స్టేషన్, సోలార్‌ లైటింగ్‌ విధానం, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ తదితరాలను రూ.11 కోట్లతో ఏర్పాటు చేస్తారు.
  • 3 weeks later...
  • 1 month later...
  • 3 months later...
  • 2 weeks later...
  • 1 month later...
  • Author

 రాజధానిలోని శ్రీవారి ఆలయానికి రెండో ప్రాకారం

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 18 Nov 2025 07:44 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

27న సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన

image.png

రెండో ప్రాకారంతో ఆలయ నమూనా

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని ప్రాంతం వెంకటపాలెం సమీపంలో తితిదే నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయానికి మహర్దశ రానుంది. ఆలయానికి రెండో ప్రాకారం నిర్మించాలని తితిదే నిర్ణయించింది. ఈ నెల 27న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఉదయం 10.55 నుంచి 11.30 గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుమల మాదిరిగా ఇక్కడ కూడా రెండో ప్రాకారం రూపుదిద్దుకోనుంది. పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కుల్లో 5 అంతస్తులతో గాలి గోపురాలు.. తూర్పు వైపున 7 అంతస్తులతో మహా రాజగోపురం నిర్మించనున్నారు. అంతర్భాగంలో మహా రాజగోపురానికి అభిముఖంగా ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్సవ మండపం, కోనేరు మొదలైనవి రానున్నాయి.

 
  • Author

మహా రాజగోపురం.. ఆలయ ప్రాకారం

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 27 Nov 2025 05:51 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

తిరుమల తరహాలో అమరావతి శ్రీవారి ఆలయం అభివృద్ధి
రూ.260 కోట్లతో విస్తరణ పనులు
నేడు భూమి పూజ చేయనున్న సీఎం చంద్రబాబు

AP261125main-36a.webp

రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ 

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో కృష్ణా నది ఒడ్డున తిరుమల తరహాలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండు దశల్లో రూ.260 కోట్లతో ఆలయ విస్తరణ పనులు ప్రారంభించనుంది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం శ్రీవారి ఆలయాన్ని రూ.185 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా.. దానిని రూ.36 కోట్లకు కుదించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి.. ఆలయాన్ని 2014-19 నాటి ప్రణాళికను మించి సకల హంగులతో అభివృద్ధి చేసేందుకు అడుగు ముందుకేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం భూమిపూజ చేయనున్నారు. సుమారు 3 వేల మంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

image.png

ప్రస్తుతం విద్యుద్దీపాల అలంకరణలో ఇలా..

రూ.140 కోట్లతో మొదటి దశ పనులు..: మొదటి దశలో రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మిస్తారు. రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, కట్‌ స్టోన్‌ ఫ్లోరింగ్‌ నిర్మిస్తారు.

రెండో దశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్‌రోడ్డు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్‌ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్‌ వంటి పనుల్ని చేపడతారు. వీటికి రూ.120 కోట్ల వ్యయం కానుంది.

  • Author

శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు చంద్రబాబు భూమిపూజ

అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు గురువారం భూమిపూజ చేశారు. విస్తరణలో భాగంగా ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయాలను నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్‌ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆ చిత్రాలు.

Eenadu icon
By Photo News TeamUpdated : 27 Nov 2025 14:52 IST
Ee
Font size
 
 
 
 
 
 
1/14
27125cm8.webp
2/14
271125cm13.webp
3/14
271125cm7.webp
4/14
271125cm6.webp
5/14
271125cm5.webp
6/14
271125cm4.webp
7/14
271125cm3.webp
8/14
271125cm2.webp
9/14
28714cm12.webp
10/14
27125cm13.webp
11/14
27125cm11.webp
12/14
27125cm10.webp
13/14
27125cm9.webp
14/14
2711255cm1.webp
  • Author

శ్రీవారికి అప్రతిష్ఠ కలిగే ఏ పనీ చేయను.. చేయనివ్వను

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 28 Nov 2025 05:14 IST
Ee
Font size
 
 
 
 
4 min read
 
 

తప్పులు చేస్తే ఈ జన్మలోనే శిక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన

ap271125main3a.webp

అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు భూమిపూజ చేస్తున్న సీఎం చంద్రబాబు

ఈనాడు, అమరావతి: శ్రీవేంకటేశ్వరస్వామికి అప్రతిష్ఠ కలిగే ఏ పనీ చేయను... ఎవరినీ చేయనివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కలియుగ దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు పవిత్రత, పరిశుభ్రత, స్వచ్ఛమైన ఆలోచన ఉండాలన్నారు. రూ.260 కోట్లతో అమరావతిలో చేపట్టిన శ్రీవారి ఆలయ అభివృద్ధి పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని, తిరుమల తరహాలో ఆలయాన్ని తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనుల భూమిపూజ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ‘చిన్నప్పటి నుంచి స్వామిని చూస్తూనే బతికా. శ్రీవారి పాదపద్మాల చెంత తరించా. స్వామి దగ్గరకు సీఎంగా కాకుండా.. ఓ భక్తుడిగా క్యూ లైన్‌లోనే వెళ్తా. అక్కడ సామాన్యుడిగా ఉండాలనేదే నా భావన. కొంతమంది తప్పులు చేసి వేరే జన్మలో శిక్ష పడుతుందనుకుంటారు. కానీ, వేంకటేశ్వరస్వామి తప్పు చేసిన వారిని ఈ జన్మలోనే శిక్షిస్తారు. పాలకమండలి సభ్యులు, ఉద్యోగులు, అర్చకులు, అక్కడికెళ్లిన వారెవరైనా ఇది గుర్తుపెట్టుకోవాలి. తిరుమల పవిత్రతను స్వామే కాపాడుకుంటారు’ అని తెలిపారు.

ap271125main3c.webp

ఆలయ ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

వైభవంగా ఆలయ విస్తరణ పనులకు భూమిపూజ 

రాజధాని పరిధిలోని వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున వచ్చిన భక్తుల సమక్షంలో సీఎం చంద్రబాబు గురువారం భూమిపూజ చేశారు. తిరుమల నుంచి వచ్చిన వేదపండితులు, అర్చకులు పూజలు నిర్వహించారు. ఆలయ ద్వితీయ ప్రాకారం, ఏడంతస్తుల మహారాజగోపురంతో పాటు మరో 3 గోపురాలు, ఆర్జిత సేవా, వాహన, రథ మండపాలు, పంచముఖ ఆంజనేయస్వామివారి విగ్రహం, పుష్కరిణి సహా పలు పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆలయ ప్రాంగణంలో పూజలను వీక్షించేందుకు భారీ వేదికను ఏర్పాటు చేశారు. శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వార్ల ఉత్సవ విగ్రహాల్ని యాగశాలలో ఉంచి ప్రత్యేక పూజలు, కైంకర్యాలు నిర్వహించారు. చతుర్వేద పారాయణం, నివేదన, దివ్య సమర్పణ, హోమం తదితర క్రతువులు నిర్వహించారు. పూర్ణాహుతి క్రతువులో చంద్రబాబు, మంత్రులు, తితిదే బోర్డు సభ్యులు పాల్గొన్నారు. యాగశాల నుంచి చంద్రబాబు ఊరేగింపుగా వెళ్లి శంకుస్థాపన చేశారు. ఆలయ బృహత్‌ ప్రణాళికపై అధికారులు, ఇంజినీర్లకు సూచనలు చేశారు. ప్రధాన ఆలయంలోని స్వామిని దర్శించుకొన్నారు. ఆలయం వెలుపల ప్రజాప్రతినిధులు, అర్చక బృందంతో సీఎం గ్రూప్‌ ఫొటోలు దిగారు. వేడుకలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, నాదెండ్ల మనోహర్, తితిదే బోర్డు ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, తితిదే పాలకమండలి సభ్యులు సుచిత్ర ఎల్ల, పనబాక లక్ష్మి, ఎంఎస్‌ రాజు, జ్యోతుల నెహ్రూ, నన్నూరి నర్సిరెడ్డి, భానుప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ap271125main3d.webp

ఆలయ విస్తరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రులు ఆనం, మనోహర్, నారాయణ, తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, తితిదే బోర్డు సభ్యులు తదితరులు


స్వామి కృపతోనే రాజధానికి అమరావతి పేరు

‘2019లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించాం. కృష్ణా నది ఒడ్డున 25 ఎకరాలు కేటాయించాం. స్వామి కృపతోనే రాజధానికి అమరావతిగా పేరు పెట్టాం. దేవతల రాజధాని అమరావతి ఎలా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వేంకటేశ్వరస్వామిని కోరుతున్నా’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘వైకాపా ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమీ చేయలేదు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఐదేళ్లూ నరకం చూపించారు. రైతులు శ్రీవారిని నమ్ముకొని ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో పాదయాత్ర చేసి అమరావతిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేశారు. వారికి అభినందనలు, కృతజ్ఞతలు’ అని తెలిపారు. 2003లో పేలుళ్ల నుంచి వేంకటేశ్వరస్వామే తనకు ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ‘శ్రీవారి సన్నిధిలో నిత్య అన్నప్రసాదం, ప్రాణదానం వంటి పథకాలతో పాటు ‘శ్రీవారిసేవ’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. శ్రీవారి సేవలో నేడు స్వచ్ఛందంగా వేల మంది సేవలందిస్తున్నారు. అదే స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నాం. ఇందుకు భక్తులు ముందుకు రావాలి. ముంబయిలో రేమాండ్స్‌ సంస్థ రూ.100 కోట్లతో ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చింది’ అని తెలిపారు.

ap271125main3b.webp

ఆలయంలో జరిగిన పూజలో సీఎం చంద్రబాబు. చిత్రంలో భారత్‌ బయోటెక్‌ ఎండీ, తితిదే బోర్డు సభ్యురాలు సుచిత్రా ఎల్ల, తితిదే బోర్డు సభ్యులు నరేశ్‌కుమార్, భానుప్రకాశ్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, ఎంఎస్‌ రాజు

  • 1 month later...
  • 1 month later...

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.