Jump to content

Setback to Mamata on Durga idols procession


swarnandhra

Recommended Posts

Source: AndhraJyothy

 

మమత బెనర్జీకి హైకోర్టులో ఎదురు దెబ్బ 

21-09-2017 15:11:37
 
636416105765387707.jpg
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మమత బెనర్జీ ప్రభుత్వం దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంపై జారీ చేసిన ఆదేశాలను కలకత్తా హైకోర్టు గురువారం రద్దు చేసింది. మొహర్రం ఊరేగింపుకు, దుర్గామాత విగ్రహాల నిజమజ్జనాలకు వేర్వేరు మార్గాలను నిర్ణయించాలని ఆదేశించింది. దుర్గామాత విగ్రహాల నిమజ్జనం మొహర్రం రోజుతో పాటు అన్ని రోజుల్లోనూ అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది. ప్రభుత్వం విపరీతమైన అధికారాన్ని ఎటువంటి ఆధారాలు లేకుండా వినియోగిస్తోందని దుయ్యబట్టింది. ప్రభుత్వం అయినంత మాత్రానికి నిరంకుశ ఆదేశాలు జారీ చేయవచ్చునా? అని నిలదీసింది. ఏదో జరుగుతుందని కల వస్తే, వెంటనే ఆంక్షలు విధించకూడదని వివరించింది. క్రమబద్ధీకరణకు, నిషేధానికి తేడా ఉందని పేర్కొంది. ఇటువంటి పండుగల సమయాల్లో ముంబై పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారని ఆరా తీసింది. ఆ విధమైన ఏర్పాట్లను ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది.
 
వివాదానికి అసలు కారణం ఏమిటంటే... దుర్గామాత విగ్రహాలను మొహర్రం రోజున నిమజ్జనం చేయరాదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 సాయంత్రం 6 గంటలలోగా నిమజ్జనాలను పూర్తి చేయాలని, మిగిలిన విగ్రహాలను మొహర్రం రోజున (అక్టోబరు 1న) నిమజ్జనం చేయకుండా, ఆ మర్నాడు (అక్టోబరు 2న) నిమజ్జనం చేయాలని ఆదేశించింది. మొహర్రం రోజున తాజియా ఊరేగింపు జరుగుతుందని పేర్కొంది.
 
ఈ ఆదేశాలను సవాలు చేస్తూ కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ ఆదేశాలను రద్దు చేసింది.
Link to comment
Share on other sites

Deeniki following ga maree arrogant ga icchindhi Mamata statement......................ok, we will follow but yemi jarigina naaku samandham ledhu ani response icchindhi!

 

Porapaatuna yemanna jarigithe deenini dismiss chesi dobbali court...........not sure if court has such powers!

Link to comment
Share on other sites

Deeniki following ga maree arrogant ga icchindhi Mamata statement......................ok, we will follow but yemi jarigina naaku samandham ledhu ani response icchindhi!

 

Porapaatuna yemanna jarigithe deenini dismiss chesi dobbali court...........not sure if court has such powers!

court ki lekapote BJP ki unnayiga powers ....if such thing happens article 356 A can be used to impose governor's rule ....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...