Jump to content

Recommended Posts

Posted

రైతు రథంపై మధ్యేమార్గం!

‘రొటోవేటర్‌’ కొనుగోలు నిబంధన తొలగింపు

ఈనాడు, అమరావతి: రైతుల సూచనల నేపథ్యంలో ‘రైతు రథం’ పథకం నిబంధనలు మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకంలో రాయితీపై 6 వేల ట్రాక్టర్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ట్రాక్టర్‌తో పాటు రొటోవేటర్‌, లేక మరేదైనా రూ.లక్ష విలువ చేసే పరికరాన్ని తప్పనిసరిగా కొనాలనే నిబంధన పెట్టారు. ఆ పరికరాలను విడిగా తీసుకుంటే రాయితీ వస్తోందని, ట్రాక్టర్‌తో కలపడంతో తమపై భారం పడుతోందని రైతులు వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్లపై ఇస్తున్న రాయితీలో రూ.50 వేలు తగ్గించి.. రొటోవేటర్‌ నిబంధనను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో 2 వీల్‌ డ్రైవ్‌ ట్రాక్టర్‌పై రూ.2 లక్షలు, 4 వీల్‌ డ్రైవ్‌ ట్రాక్టర్‌పై రూ.2.50 లక్షల రాయితీ ప్రకటించారు.

Posted
రైతురథంలో ట్రాక్టర్ల రాయితీ తగ్గింపు

ఈనాడు, అమరావతి: రైతురథం పథకంలో ట్రాక్టర్ల రాయితీ తగ్గింది. అధిక అశ్వికసామర్థ్యం(ఫోర్‌వీల్‌ డ్రైవ్‌) గల ట్రాక్టర్‌కు రూ 2.50 లక్షల నుంచి రూ.2 లక్షలు, తక్కువ అశ్వికసామర్థ్యం(టూవీల్‌ డ్రైవ్‌) ఉన్న ట్రాక్టర్‌కు రూ.2 లక్షల నుంచి రూ.1.50 లక్షల మేరకు రాయితీని తగ్గిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాక్టర్‌తో పాటు దానికి అనుసంధానించే సేద్యం పరికరాలు రొటోవేటర్‌, ఇతర పరికరాలను తీసుకుంటేనే.. వాటి అన్నింటికీ కలిపి రూ.2.50లక్షలు, రూ.2లక్షల చొప్పున రాయితీని అందించేవారు. తాజా మార్గదర్శకాల్లో దాన్ని రైతు ఇష్టానికే వదిలేశారు.

Posted
రైతు రథాలు పదివేలు


636356848215203821.jpg



  •  సబ్సిడీపై పంపిణీ చేసే ట్రాక్టర్ల సంఖ్య పెంపు
  •  వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి ప్రకటన

 

అనంతపురం, జూలై 14(ఆంధ్రజ్యోతి): రైతు రథం పథకం కింద గ్రామీణ నియోజకవర్గాల రైతులకు సబ్సిడీపై ఇచ్చే ట్రాక్టర్ల సంఖ్య పెంచాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం మన్నించింది. పది వేల ట్రాక్టర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. గతంలో ఆరు వేల ట్రాక్టర్లను సబ్సిడీ కింద ఇవ్వాలని నిశ్చయించారు. వీటి కోసం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. నియోజకవర్గానికి కేటాయించిన ట్రాక్టర్ల కంటే అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతోపాటు సిఫారసుల కోసం వచ్చేవారి సంఖ్యా భారీగా ఉండడంతో ఎమ్మెల్యేలు విలవిలలాడారు. ట్రాక్టర్ల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలను అభ్యర్థించారు. దీంతో సబ్సిడీపై ఇచ్చే ట్రాక్టర్ల సంఖ్యను పది వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సోమిరెడ్డి శుక్రవారం అనంతపురంలో ప్రకటించారు. రెయిన్‌ గన్స్‌ ప్రయోగాలపై నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన, జలవనరుల మంత్రి దేవినేని ఉమ సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలతో సమీక్ష జరిపారు. గత ఏడాది అనుభవాలు, ఈ ఏడాది అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ బెట్టపరిస్థితుల్లో వేరుశనగ పంటను కాపాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.


  • 4 weeks later...
  • 3 months later...
  • 3 months later...
  • 5 weeks later...
Posted

Happy farmers on their Rythu Rathams! సాగుకు సాంకేతికసాయం అందించే ఉద్దేశ్యంతో ఒక్కో ట్రాక్టరుకు రూ.2లక్షల రాయితీపై రెండేళ్ళలో 20 వేల ట్రాక్టర్లను రైతులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి ఏడాది 6,000 ట్రాక్టర్లను మంజూరుచేశారు.

https://pbs.twimg.com/media/DbxsqzYV0AAORV3.jpg

https://pbs.twimg.com/media/DbxsqzZVQAEN8dc.jpg

Posted

Total Tractors distributed District wise as promised by NCBN under "Rythu Ratham"

Srikakulam - 360

Vizianagaram - 320

Visakhapatnam - 400

East Godavari - 680

West Godavari - 520

Krishna - 520

Guntur - 600

Prakasam - 400

Nellore - 360

Kurnool - 520

Anantapur - 520

Kadapa - 320

Chittoor - 480

Total - 6000 

  • 3 weeks later...
Posted
రైతు రథాలు.. 11,364
ఈనాడు, అమరావతి: ‘రైతురథం’ కింద ట్రాక్టర్ల పంపిణీకి వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది 11,364 ట్రాక్టర్లు రైతులకు అందజేయాలని నిర్ణయించింది. గతేడాది తీరునే టూవీల్‌ డ్రైవ్‌ ట్రాక్టరుకు (సాధారణ పొలం పనులకు వాడేవి) రూ.1.50లక్షలు, ఫోర్‌వీల్‌ డ్రైవ్‌ ట్రాక్టర్‌కు (ఎక్కువ సామర్థ్యం ఉన్నవి) రూ.2 లక్షల చొప్పున రాయితీ ఇస్తారు. 2018-19 బడ్జెట్లో యాంత్రీకరణ పథకానికి ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.176 కోట్లకుపైగా మొత్తాన్ని ట్రాక్టర్లకే కేటాయిస్తున్నారు. మిగిలిన సొమ్మును గతేడాది బకాయిల చెల్లింపు కోసం వినియోగించనున్నారు. రైతురథం పథకాన్ని రాష్ట్రప్రభుత్వం గతేడాది ఖరీఫ్‌ మధ్యలో ప్రవేశపెట్టింది. దశలవారీగా 12,676 ట్రాక్టర్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటిదాకా 12,010 ట్రాక్టర్లు రైతులకు అందాయి. ఇంకా 666 వరకు పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో 10వేల ట్రాక్టర్లకు వినియోగ ధ్రువపత్రాలు అందగా 7 వేలకు మాత్రమే బిల్లులు చెల్లించారు. నియోజకవర్గానికి 50 చొప్పున రాష్ట్రంలోని 150 గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాలకు ట్రాక్టర్లలో ప్రాధాన్యం ఇస్తున్నారు.
 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...