sonykongara Posted November 1, 2018 Author Posted November 1, 2018 రాష్ర్టానికి 41 వేల ఇళ్లు01-11-2018 03:18:35 బీఎల్‌సీ కింద కేటాయించిన కేంద్రం గ్రామాలకు 32,454 ఇళ్లు ఒక్కో ఇంటికి రూ.2 లక్షల రాయితీ అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): రాష్ర్టానికి మరోసారి ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారుని నేతృత్వంలో నిర్మాణం (బీఎల్‌సీ), అఫర్డ్‌బుల్ హౌసింగ్ ప్రోగ్రామ్(ఏహెచ్‌పీ) కింద కేంద్ర ప్రభు త్వం 41,707 ఇళ్ల మంజూరుకు బుధవారం ఆమోదం తెలిపింది. వీటిలో ఏహెచ్‌పీ కింద 900 ఇళ్లు, పట్టణ స్థానిక సంస్థల్లో నిర్మించుకునే బీఎల్‌సీ కింద 8,353, యూడీఏ-బీఎల్‌సీ కింద 32,454 ఇళ్లు ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఇటీవలే యూడీఏలకు ఒకేసారి 1.31 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. దీనికి ముందు ఇచ్చిన వాటితో సహా 1,64,036 ఇళ్లు ఇప్పటికే రాష్ర్టానికి మంజూరయ్యాయి. అదనంగా ఇప్పుడు ఈ ఇళ్లను మంజూ రు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉండగా, వారం రోజుల కిందట ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణాల కింద రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల ఇళ్లు మంజూరుచేసింది. వాటికి అదనంగా ఇప్పుడు సుమారు 2 లక్ష ల వరకు యూడీఏ-బీఎల్‌సీ కింద వచ్చాయి. దీంతో దాదాపు 6 లక్షల కొత్త ఇళ్లకు గృహనిర్మాణశాఖ శంకుస్థాపనలు చేయబోతోంది. తాజాగా ఇచ్చిన ఇంటి యూనిట్ కాస్ట్ రూ.2.5 లక్షలు కాగా దీనిలో రూ.50 వేలు లబ్ధిదారు భరించాలి. రూ.లక్షన్నర కేంద్రం, రూ.50 వేలు రాష్ట్రం రాయితీగా ఇస్తాయి. తగ్గుతున్న డిమాండ్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్రం వరుసగా పక్కా ఇళ్లు మంజూరు చేస్తుండటంతో క్రమంగా రాష్ట్రంలో ఇళ్ల డిమాండ్ తగ్గుతోంది. ఎన్టీఆర్ హౌసింగ్ కింద గత మూడేళ్ల నుంచి రెండేసి లక్షల చొప్పున ఇళ్లు మంజూరుచేశారు. వాటితోపాటు వచ్చే ఏడాది 2019-20కి కూడా ఒకేసారి 4 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. దీనికి అదనంగా తాజాగా కేంద్రం నుంచి ఇళ్లు వచ్చాయి. ఇప్పుడు ఒక్కసారే 6 లక్షల ఇళ్లు వచ్చాయి. దీంతో తాజా డిమాండ్ సుమారు 14 లక్షలకు తగ్గొచ్చని అంచనా.
Yaswanth526 Posted November 14, 2018 Posted November 14, 2018 రాష్ట్ర ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ పథకాన్ని అమలు చేస్తోందని అక్రిడిటేషన్ కలిగిన వర్కింగ్ జర్నలిస్టులందరూ హౌసింగ్ వెబ్ సైట్ http://apgovhousing.apcfss.in/journalisthousing … నందు నమోదు చేసుకోవాలని సమాచార పౌర సంబంధాలశాఖ డిప్యూటి డైరెక్టరు నేడొక ప్రకటనలో తెలిపారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now