Jump to content

Power Problem between AP and Telangana


Recommended Posts

 • Replies 142
 • Created
 • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

Power ivvatam maatrame kaadu daani consumption kuda undaali., aa consumption lekapothe transmission losses vasthaayi avi thagginchataanike timings system vaadathaaru., ippudu enni hrs evaru ichaaru qu

Aithe enti ippudu?? Ippudu vaagataleda prathi anaa ki paniki raani edava., db lo vaage edavalakanna vaadu better le, atleast oka state ki cm, oka party ki leader.. annitiki minchi thaagubothu edava..

Guest Urban Legend

center em peekutundhi money ippinchakunda

ah governor gadu gudulu gopuralu pandaga party;lu ani enjoy cheyyatam tappa

oka governor cheyyalsina pani okkati cheyyada

emi cheyyanappudu asala common govenor ndhuku

Link to post
Share on other sites
 • 2 weeks later...
Guest Urban Legend

 

 


ah governor gadu gudulu gopuralu pandaga party;lu ani enjoy cheyyatam tappa oka governor cheyyalsina pani okkati cheyyada emi cheyyanappudu asala common govenor ndhuku
Link to post
Share on other sites
 
పీపీఏలపై పునఃసమీక్ష636287695812499470.jpg
 • ఇకపై ఏపీఈర్‌సీ ఆమోదం తప్పనిసరి
 • ఇంధన రంగ ఆర్థిక సుస్థిరతకు కమిటీ
 • తెలంగాణ బకాయిలు రాబడదాం
 • ఇంధన శాఖపై యనమల కమిటీ నిర్ణయం
అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): నష్టాల బారి నుంచి బయటపడాలంటే.. బిడ్డింగ్‌ విధానంలో మినహా, ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థలతో చేసుకున్న దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) అన్నిటిపైనా పునఃసమీక్ష జరపాలని.. ఇంధన రంగం ఆర్థికంగా సుస్థిరతను సాధించేలా అంతర్గత సామర్థ్యాలను పెంచుకోవాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రుల కమిటీ నిర్దేశించింది. దేశవ్యాప్తంగా విద్యుత మిగులులో ఉన్నందున.. ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌ - పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి)ను ఉత్పత్తి సంస్థలు గణనీయంగా తగ్గించడం వల్ల నష్టాలు ఎదురవుతున్నాయని గుర్తించింది.
 
గతంలో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి సాధించడంపై దృష్టి సారించిన విద్యుత సంస్థలపై.. ఇప్పుడు 60 నుంచి 65 శాతం మాత్రమే పీఎల్‌ఎఫ్‌ ఉండడం వల్ల.. ఫిక్స్‌డ్‌ చార్జీల భారం పడుతోందని అభిప్రాయపడింది. మంగళవారం సచివాలయంలో ఇంధన శాఖపై యనమల కమిటీ సమీక్షించింది. మంత్రులు కిమిడి కళావెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఇంధన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, సీఆర్‌డీఏ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌, ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్‌, ట్రాన్స్‌కో జేఎండీ దినేశ్‌ పరుచూరి, డైరెక్టర్లు ఆదినారాయణ, సుందర్‌సింగ్‌, ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ ఎం.ఎం.నాయక్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌.వై.దొర పాల్గొన్నారు.
 
ఇంధన శాఖ ఆర్థికంగా సుస్థిరత సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆర్థిక సలహాదారు నరసింహమూర్తి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివీ..జాతీయ స్థాయిలో విద్యుత మిగులుకు చేరుకున్నందున.. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు కరెంటు దొరుకుతోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థలు ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) తగ్గించుకుంటున్నాయి. అయినా.. ఫిక్స్‌డ్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఇది విద్యుదుత్పత్తి సంస్థలకు పెనుభారంగా మారుతోంది. ఇదే సమయంలో బ్యాంకుల వడ్డీ రేటు 12 శాతం నుంచి ఒకేసారి 8.5 శాతానికి తగ్గిపోయింది.
 
ఈ పరిస్థితుల్లో విద్యుత సంస్థలు కుదుర్చుకున్న దీర్ఘకాల ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాలని నరసింహమూర్తి సూచించారు. అదేవిధంగా అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలు చెల్లించి.. తక్కువ వడ్డీతో కొత్త రుణాలు తీసుకుంటే.. సంస్థపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. దీర్ఘకాలిక పీపీఏలన్నిటినీ పునఃసమీక్షించేందుకు ఆర్థిక, ఇంధన రంగ ఉన్నతాధికారులు, నరసింహమూర్తితో కమిటీ వేస్తున్నట్లు యనమల ప్రకటించారు. భవిష్యతలో ఒక్క యూనిట్‌ బయట కొనుగోలు చేయాలన్నా.. పీపీఏలు చేసుకోవాలన్నా ఆంధ్ర ప్రదేశ్‌ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదం తీసుకోవాల్సిందేనన్నారు. ఏపీ ఉత్పత్తి చేస్తున్న విద్యుత నుంచి 56.89 శాతం తెలంగాణకు ఇస్తున్నందున ఆ రాష్ట్రం రూ.4800 కోట్లు చెల్లించాల్సి ఉందని ఉన్నతాధికారులు యనమల దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని స్థిరాస్తుల విభజనపై చర్చ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ వద్ద ప్రస్తావిస్తామని, బకాయిలు రాబడదామని యనమల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.2 వేల కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఇందులో జలవనరుల శాఖ వాటా రూ.600 కోట్లని తెలిపారు.
బకాయుల్లేకుండా స్థానిక సంస్థలకు బిల్లులు
స్థానిక సంస్థలకు ఇప్పటిదాకా పాత బకాయులు, సర్‌చార్జీలతో కలిపి బిల్లులు పంపుతున్నామని.. ఇకపై నెలవారీ వినియోగించిన బిల్లులను మాత్రమే పంపుతామని అజయ్‌ జైన్‌ చెప్పారు. దీనివల్ల రూ.లక్షల్లో ఉన్న బకాయిల సంగతెలా ఉన్నా.. వేలల్లో వచ్చే బిల్లులను తక్షణమే చెల్లించేందుకు స్థానిక సంస్థలకు వెసులుబాటు ఉంటుందని వివరించారు. అంతర్గత సామర్థ్యాలను పెంచుకుంటున్నామని.. విదేశీ బొగ్గు వినియోగాన్ని ఆపేశామని, కృష్ణపట్నానికి బొగ్గు సరఫరా కోసం రీ-టెండర్లు పిలిచామని విజయానంద్‌ చెప్పారు. 2018-19లో రూ.2000 కోట్ల మేర ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అధిక వడ్డీల భారాన్ని తగ్గించుకునేందుకు స్వల్ప వడ్డీ రుణాలు తీసుకుంటున్నామన్నారు. అన్నీ మీరే చేసేస్తే ఇక సమీక్ష ఎందుకని యనమల సరదాగా వ్యాఖ్యానించారు.
కాగా.. ఏపీఈఆర్‌సీ అనుమతి లేకుండా ఇకపై విద్యుత కొనుగోలు ఒప్పందాలు చేసుకోరాదని నరసింహమూర్తి స్పష్టం చేశారు. బొగ్గు నాణ్యత, పరిమాణంపై నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత ధరలు తగ్గినందున.. బయట ‘ ఓపెన్‌ యాక్సెస్‌’ విధానంలో తక్కువ ధరకు భారీ పరిశ్రమలు కరెంటును కొనుగోలు చేసుకుంటున్నాయని.. అందువల్ల డిమాండ్‌ తక్కువగా ఉన్న సమయంలో పరిశ్రమల విద్యుత టారి్‌ఫను తగ్గించడం మంచిదని ఆయన చేసిన సూచనకు ఇంధన శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ నెల 8 నుంచి పవర్‌ ఎక్స్ఛేంజీ నుంచే కొనుగోలు చేస్తున్నామని విజయానంద్‌ చెప్పారు. సోలార్‌ విద్యుత్తు ధరలు గణనీయంగా పడిపోతున్నాయని నరసింహమూర్తి చెప్పారు. ప్రపంచ బ్యాంకు రుణం తీసుకుని మరో లక్ష సోలార్‌ వ్యవసాయ పంప్‌సెట్లను అమర్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని అజయ్‌ జైన్‌ వివరించారు.
Link to post
Share on other sites
 • 3 weeks later...

2019 నుంచి ఎవరి విద్యుత్‌ వారిదే!

రాష్ట్ర విద్యుత్‌ ప్రణాళికలో తెలిపిన ఏపీట్రాన్స్‌కో

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్‌ వాటాల వివాదం కొలిక్కి రాబోతోంది. గతంలో చేసుకున్న పలు కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) గడువు 2019 మార్చి నాటికి ముగియబోతోంది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల విద్యుత్‌ ఆంధ్రప్రదేశ్‌కే అందనుంది. దీనివల్ల రాష్ట్రానికి ఇప్పటి కంటే 397 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటు పెరగనుంది. రాష్ట్ర విద్యుత్‌ ప్రణాళిక (ఎస్‌ఈపీ)పై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి ఏపీట్రాన్స్‌కో ఇటీవల సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో: డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (వీటీపీఎస్‌)లోని మూడు విద్యుత్‌ కేంద్రాలు (1,260 మెగావాట్లు), రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఆర్టీపీపీ)లోని తొలి యూనిట్‌ (420 మెగావాట్లు)ల పీపీఏ గడువు 2019 మార్చితో ముగియనుంది.

తెలంగాణలో: కొత్తగూడెంలోని మూడు యూనిట్లు (720 మెగావాట్లు), కొత్తగూడెం (డి) యూనిట్‌ (500 మెగావాట్లు), రామగుండం (బి) యూనిట్‌ (69 మెగావాట్లు) పీపీఏలు కూడా ఆ సమయానికి ముగియనున్నాయి. వీటీపీఎస్‌లోని 500 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం, తెలంగాణలోని భూపాలపల్లి, కొత్తగూడెం నాలుగో యూనిట్‌ పీపీఏ గడువు ఇంకా ఎక్కువ కాలం ఉన్నట్లు సమాచారం.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో జారీ అయిన ఉత్తర్వులో అప్పటి వరకూ ఉన్న ప్రాజెక్టుల విద్యుత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం, తెలంగాణకు 53.89 శాతం కేటాయించారు. జల విద్యుత్‌ను భౌగోళికత ఆధారంగా రెండు రాష్ట్రాలూ వాడుకుంటున్నాయి. తాప విద్యుత్‌ను ఆ ఉత్తర్వుకు అనుగుణంగా ఉభయ రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. దీని ప్రకారం తెలంగాణకు వెళ్లే విద్యుత్‌ వాటా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఏపీజెన్‌కోకు రూ.3 వేల కోట్లకు పైగా బకాయి ఉన్నాయి.

Link to post
Share on other sites
Guest Urban Legend

siggu undali manaku, manchithanam chethakani thanam laga undakudadu

 

governor gadu vunnada poyada adhey governor duties nunchi term aipoyindhi ga

 

ah governor ni maarchani ra babu

Link to post
Share on other sites
 • 2 weeks later...

విద్యుత్‌ బకాయిలు చెల్లించండి లేకపోతే కరెంటు ఆపేస్తాం

తెలంగాణకు లేఖ జారీకి సిద్ధమైన ఏపీజెన్‌కో

ఈనాడు, అమరావతి: కొండలా పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోతే తెలంగాణకు ఇచ్చే కరెంటును ఆపేయాలని ఏపీజెన్‌కో నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో తుది ప్రయత్నంగా లేఖ రాయాలని భావిస్తోంది. రేపోమాపో తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు దాన్ని పంపే అవకాశముంది. తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల నుంచి ఏపీజెన్‌కోకు రూ.3,816 కోట్లు రావలసి ఉంది. ఇదే సమయంలో సింగరేణి కాలరీస్‌కు రూ.1,436 కోట్లను ఏపీజెన్‌కో చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి బకాయిని సర్దుబాటు చేస్తామని తెలియజేస్తూ తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి ఏపీజెన్‌కోకు లేఖ అందింది. ఇదే విషయాన్ని సింగరేణికి ఏపీజెన్‌కో తెలియజేసింది. అయితే బాకాయిలను ఎప్పుడో ఇస్తే కుదరదని, ఇప్పుడే సర్దుబాటు చేయాలని సింగరేణి స్పష్టం చేసింది. బకాయిని దృష్టిలో పెట్టుకునే బొగ్గు సరఫరాను కూడా సింగరేణి నియంత్రించినట్లు చెబుతున్నారు. సింగరేణికి డబ్బులు చెల్లించాలంటే అమ్మే విద్యుత్‌కు డబ్బులు రావాలి. అది రాకుండా డబ్బులు ఇవ్వడం కష్టం. అందుకే తెలంగాణకు ఇచ్చే విద్యుత్‌ను కూడా రాష్ట్ర(ఆంధ్రప్రదేశ్‌) అవసరాలకు మళ్లించాలన్న భావనకు ఇప్పటికే ఏపీజెన్‌కో వచ్చింది. నిర్ణయం అమలే తేలాల్సి ఉందనే అభిప్రాయం నేపథ్యంలో తాజా లేఖాస్త్రం సంధిస్తున్నట్లు సమాచారం.

Link to post
Share on other sites
4,781 కోట్లు తక్షణం చెల్లించండి
 
 • తెలంగాణ జెన్కోకు తుది నోటీసు
 • నేడు అందజేయనున్న ఏపీ జెన్కో
అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): తీసుకున్న విద్యుత్తునకు అసలు, వడ్డీ కలిపి వెంటనే చెల్లించాల్సిందిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం తుది తాఖీదు ఇవ్వనుంది. ‘‘రాష్ట్ర విభజన నాటినుంచి రాష్ట్ర విద్యుత్కేంద్రాల నుంచి ఉత్పత్తి అవుతున్న కరెంటులో 53.89 శాతం తెలంగాణకు అందిస్తున్నాం. దానికిగాను ఇప్పటిదాకా ఏపీ జెన్కోకు రూ.4,781 కోట్లను చెల్లించాల్సిఉంది. ఇంత పెద్ద బకాయిని రాబట్టుకోలేకపోవడం వల్ల ఏపీ జెన్కో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఏపీ ట్రాన్స్‌కో నుంచి అడపాదడపా సర్దుబాటు మొత్తాలను తీసుకోవాల్సి వస్తోంది. భారీ స్థాయిలో తెలంగాణ నుంచి బకాయిలు రాకపోవడం వల్ల బొగ్గు సరఫరా దారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, వెంటనే రూ.4,781కోట్లను చెల్లించండి. లేదంటే..ఈ నెలాఖరు నుంచి కరెంటు సరఫరాను బంద్‌ చేస్తాం’’ అంటూ తెలంగాణ జెన్కోకు అందించడానికి ఏపీ జెన్కో లేఖని సిద్ధం చేసింది. ఈ లేఖ కాపీలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు అందజేసిన ఏపీ జెన్కో అధికారులు, బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌సీ సింగ్‌, తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శికి, తెలంగాణ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావుకు అందజేసేందుకు సమాయత్తమవుతున్నారు.
Link to post
Share on other sites

 

4,781 కోట్లు తక్షణం చెల్లించండి

 

 • తెలంగాణ జెన్కోకు తుది నోటీసు
 • నేడు అందజేయనున్న ఏపీ జెన్కో
అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): తీసుకున్న విద్యుత్తునకు అసలు, వడ్డీ కలిపి వెంటనే చెల్లించాల్సిందిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం తుది తాఖీదు ఇవ్వనుంది. ‘‘రాష్ట్ర విభజన నాటినుంచి రాష్ట్ర విద్యుత్కేంద్రాల నుంచి ఉత్పత్తి అవుతున్న కరెంటులో 53.89 శాతం తెలంగాణకు అందిస్తున్నాం. దానికిగాను ఇప్పటిదాకా ఏపీ జెన్కోకు రూ.4,781 కోట్లను చెల్లించాల్సిఉంది. ఇంత పెద్ద బకాయిని రాబట్టుకోలేకపోవడం వల్ల ఏపీ జెన్కో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఏపీ ట్రాన్స్‌కో నుంచి అడపాదడపా సర్దుబాటు మొత్తాలను తీసుకోవాల్సి వస్తోంది. భారీ స్థాయిలో తెలంగాణ నుంచి బకాయిలు రాకపోవడం వల్ల బొగ్గు సరఫరా దారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, వెంటనే రూ.4,781కోట్లను చెల్లించండి. లేదంటే..ఈ నెలాఖరు నుంచి కరెంటు సరఫరాను బంద్‌ చేస్తాం’’ అంటూ తెలంగాణ జెన్కోకు అందించడానికి ఏపీ జెన్కో లేఖని సిద్ధం చేసింది. ఈ లేఖ కాపీలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు అందజేసిన ఏపీ జెన్కో అధికారులు, బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌సీ సింగ్‌, తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శికి, తెలంగాణ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావుకు అందజేసేందుకు సమాయత్తమవుతున్నారు.

 

 

Good Decision  atlast..

Link to post
Share on other sites
Guest Urban Legend

Mundu power stop cheyyandi.

Chesi ah power daachukovala?

Verey agreements chesukovala? other state tho Agreement chesukoni stop cheyyali kaani stop cheyyandj..stop cheyyandi ani bokka padudhi

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  No registered users viewing this page.


×
×
 • Create New...