Jump to content

IT Raids


Nfdbno1

Recommended Posts

  • Replies 162
  • Created
  • Last Reply

Idi demonetization announce chesina week twitter lo circulate aindi baga....News lo ekkada rala mari. Intha major news cover cheyyakunda untaru anukonu.

 

deccan hearld okka dantlo vachindi... inka dentlo nu raaledhu.... anduke nenu kuda db lo veyyala.. :P

Link to comment
Share on other sites

AndhraJyothy:
 
రూ.93.52 లక్షల.. కొత్త రూ.2000 నోట్లు స్వాధీనం
12-12-2016 20:38:41
636171719222013682.jpg
జైపూర్: సుమారు రూ.93.52 లక్షల కొత్త రూ.2000 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో సోమవారం ఏడుగురి నుంచి ఈ మొత్తాన్ని పట్టుకున్నారు. సీఐడీకి అందిన పక్కా సమాచారంలో ఓ కారును అడ్డుకుని రూ.64 లక్షల డబ్బును సీజ్ చేశారు. ఇందులో రూ.58 లక్షలు కొత్త రూ.2000 నోట్లు కాగా మిగతా రూ.6 లక్షలు రూ.100 నోట్ల కట్టలే. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
 
మరో ఘటనలో బికనీర్ వ్యాపార‌వేత్త నుంచి రూ.83 లక్షల కొత్త కరెన్సీని దోచుకున్న కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.28 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో రద్దైన పాత నోట్లు మార్పిడి చేస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి పట్టుకున్న రూ.8 లక్షల డబ్బులో రూ.7.52 లక్షలు కొత్త రూ.2000 నోట్లే. దర్యాప్తు కోసం ఈ మూడు కేసులను ఐటీ శాఖకు అప్పగించారు.
Link to comment
Share on other sites

కోట్ల కొద్దీ కొత్త నోట్లు 
13-12-2016 02:44:42
636171938833770448.jpg
  • సుప్రీం లాయర్‌ ఇంట్లో 14 కోట్లు
  • ఐటీ దాడుల్లో 33 కోట్ల ఆస్తులు లభ్యం
  • స్వచ్ఛంద వెల్లడి రూ.125 కోట్లు
  • 100 కోట్లతో ఇటీవలే కొడుకు పెళ్లి
  • గత ఏడాదే వంద కోట్ల ఇల్లు కొనుగోలు
  • అగస్టా నిందితులతో సంబంధాలు
 న్యూఢిల్లీ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): రోహిత టాండన్‌ దేశంలోకెల్లా సంపన్నుడైన సుప్రీంకోర్టు న్యాయవాది. జీవితంలో ఒక్క కేసు వాదించింది లేదు. తాను పెట్టిన టీ అండ్‌ టీ న్యాయవాద కంపెనీ ద్వారా కార్పొరేట్‌ సంస్థల అధిపతులకు ప్రఖ్యాత న్యాయవాదుల్ని సమకూర్చడం, విదేశీ ఆయుధ కంపెనీలకు, రాజకీయ నాయకులకు మధ్య చీకటి ఒప్పందాలు కుదర్చడం.. ఇవీ ఆయన చేసే పనులు. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల స్కాం నిందితులు అభిషేక్‌ వర్మ, గౌతమ్‌ ఖైతాన్‌లతో సంబంధాలు బయట పడటంతో అప్పటి దాకా పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ఆయనకు కష్టాలు ఒక్కసారిగా మొదలయ్యాయి. అక్టోబరు 6 నుంచి ఆదాయపు పన్ను శాఖ ఆయన వెంట పడింది. రెండు నెలల్లో ఆయన ఇళ్లు, ఆఫీసులపై మూడు సార్లు దాడులు జరిగితే ప్రతీసారీ కోట్లకు కోట్లు నగదు, ఆస్తులు, డిపాజిట్లు బయటపడ్డాయి. ఇరవై రోజుల కింద ఒక ఇంటిపై ఐటీ అధికారులు దాడిచేస్తే రూ.కోటి దొరికాయి. తాజాగా అదే ఇంట్లో రూ.14 కోట్లు తీసుకొచ్చి దాచగల ధైర్యం టాండన్‌కే సొంతం. టాండన్‌ గత ఏడాదే వంద కోట్లు పెట్టి ఢిల్లీలో ఇల్లు కొన్నాడు. మరో వంద కోట్ల ఖర్చుతో కొడుకు పెళ్లి చేశాడు. రెండు నెలల క్రితం ఐటీ దాడుల్లో అడ్డంగా దొరికి పోవడంతో రూ.125 కోట్ల అక్రమ ఆస్తులను వెల్లడించాడు. ఇంకా ఆయన దగ్గర వందల కోట్లు మూలుగుతున్నాయి.
 
 
ఢిల్లీలో ఆయనకు అనేక ఇళ్లున్నాయి. వాటిల్లో జనం ఎవరూ ఉండరు. డబ్బులు దాచిపెట్టే గోదాములుగా ఉపయోగిస్తారు. శనివారం నుంచి ఆయన ఇళ్లు, ఆఫీసులపై మరో దఫా దాడులు జరిగాయి. ఈ సందర్భంగా దొరికిన సొమ్మును మెషీన్లతో లెక్క పెట్టడానికే రెండు రోజులు పట్టింది. టాండన్‌ ఇంటిపై ఐటీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించి వివిధ చోట్ల దాచిన రూ.14 కోట్ల నగదును, అత్యంత విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నగదులో రెండు వేల కొత్త నోట్లు రూ.2.6 కోట్లు ఉన్నాయి. పాత వెయ్యి నోట్ల రూపంలో రూ.7 కోట్లు, వంద నోట్ల రూపంలో రూ.3 కోట్లు, మిగిలినవి రూ.50 నోట్లు ఉన్నాయి. రెండు నెలల క్రితం ఐటీ నోటీసులిచ్చి సోదాలు చేసినపుడు రూ.19 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పత్రాలు లభించాయి.
 
ఇతర ఆస్తులూ వెలుగులోకి రావడంతో రూ.125 కోట్లు స్వచ్ఛందంగా బయట పెట్టారు. ఇక తన జోలికి రారులే అనుకున్నారు. పలుచోట్ల దాచిన పాతనోట్ల పాతరలు తెరిచి నోట్ల మార్పిడికి సిద్ధపడ్డారు. విషయం తెలిసి ఐటీ అధికారులు కాపేశారు. ఆదివారం రాత్రి గ్రేటర్‌ కైలా్‌షలోని ఆయన ఇంటికి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని ఆకాశరామన్న ఇచ్చిన సమాచారంతో మళ్లీ దాడులు నిర్వహించారు. 14 కోట్ల నగదుకు కేవలం ఇంటి నౌకరు కాపలాగా ఉన్నాడు. టాండన్‌ నుంచి ఇప్పటి వరకూ రూ.33 కోట్ల విలువైన ఆస్తులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. టాండన్‌కు దుబాయిలో, ఢిల్లీ చుట్టుపక్కల అనేక ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. 18 బ్యాంకు ఖాతాలున్నాయి.
 
 
లైవ్‌లో ఐటీ సోదాలు
సెల్‌ఫోన్లో వీక్షించిన టాండన్‌
సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత టాండన్‌కు చెందిన టీ అండ్‌ టీ కార్యాలయంపై శనివారం రాత్రి ఐటీ అధికారులు దాడి చేసినపుడు మొత్తం సోదాలను ఆయన లైవ్‌లో చూశారు. టాండన్‌ ఇళ్లు, ఆఫీసుల్లో ఏ స్విచ్‌ వేసినా ఆయన సెల్‌ఫోన్లో ఎలర్ట్‌ వస్తుంది. వెంటనే సంబంధిత ఇంటి సీసీటీవీ కెమెరాలను ఆన్‌ చేసుకొని తన ఐఫోన్లో లైవ్‌ చూడగలరు. అలాంటి సాంకేతిక ఏర్పాట్లతో ఉన్న రోహిత టాండన్‌ సోదాలు పూర్తయ్యే వరకు లైవ్‌లో చూస్తూ దరిదాపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు.
Link to comment
Share on other sites

Sekhar Reddy raid update: - private banks helped him exchange

 

శేఖర్‌రెడ్డి భోషాణంలో 400 కిలోల బంగారం
13-12-2016 02:47:53
636171940737668428.jpg
  • విలువ 290 కోట్లు..170 కోట్ల కరెన్సీ 
  • 2 బ్యాంకుల నుంచి శేఖర్‌రెడ్డికి కొత్త నోట్లు 
చెన్నై, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఏకంగా 400 కిలోల బంగారం.. రూ.170 కోట్ల నగదు.. వీటిలో సింహభాగం కొత్త 2వేల రూపాయల నోట్లు! బం దాదాపు రూ.290 కోట్లు! ‘నల్ల’తిమింగలం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు, కాంట్రాక్టరు జె.శేఖర్‌ రెడ్డి భోషాణంలో ఇప్పటిదాకా పట్టుబడిన సొమ్ము ఇదీ! గురువారం చెన్నైలోని కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు భారీగా నగదు, బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాతా ఈ దాడులు కొనసాగడంతో ఈ ‘ఇసుక బేహారీ’ వద్ద మరింత సొమ్ము పట్టుబడింది. మరి.. నోట్లరద్దు నేపథ్యంలో శేఖర్‌రెడ్డికి ఇంతపెద్ద మొత్తంలో కొత్తనోట్లు ఎలా లభ్యమయ్యాయి? ఐటీ అధికారులు ఈ దిశగానే తీగలాగితే డొంకంతా కదులుతోంది. వందల కోట్లవిలువలైన పెద్దనోట్ల మార్పిడిలో కమీషన్‌తో బ్యాంకు పెద్దలు శేఖర్‌రెడ్డికి అన్నివిధాలా సహకరించినట్లు సమాచారం. తనిఖీల్లో భాగంగా పట్టుబడిన సొమ్ములో దాదాపు 95కోట్ల నగదు కొత్త నోట్ల రూపంలో లభ్యమైంది. కాగా ఈ కొత్త కరెన్సీని అతను స్థానిక టి.నగర్‌లోని రెండు ప్రైవేటు బ్యాంకుల్లో మార్చుకున్నారు. కమీషనతోనే రూ.1000, రూ.500 నోట్లను మార్చుకుని కొత్త నోట్లను తీసుకున్నట్లు తెలిసిందని, దీనిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారని ఐటీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు మైనింగ్‌ డాన్‌ గాలి జనర్దన్‌రెడ్డికి చెందిన పెద్దనోట్లను కొత్త కరెన్సీగా మార్చడంలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన భూవిస్తరణాధికారి భీమానాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.
Link to comment
Share on other sites

బెజవాడలో 18.48 లక్షలు స్వాధీనం 
13-12-2016 03:01:03
636171948636719880.jpg
  •  ‘మార్పిడి’ చేస్తున్న 11 మంది అరెస్టు 
విజయవాడ(గుణదల), డిసెంబరు 12: ఏపీ రాజధానిలో నగదు మార్పిడి ముఠా గుట్టు రట్టయింది. 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.18.48 లక్షల నగదు, ఒక కారు, 5 మోటారు బైక్‌లు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ పాలరాజు తెలిపారు. సోమవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొంతమంది ముఠాగా ఏర్పడి నగదు మార్పిడికి పాల్పడుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌కు అందిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మురళీధర్‌ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగారు. గాంధీనగర్‌ బాబాయ్‌ హోటల్‌ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న కారును ఆపి తనిఖీ చేయడంతో ముఠా బాగోతం బయటపడిందన్నారు. పసుమర్తి శ్రీను(28) కొంతమందితో కలిసి 12.5ు కమీషన్‌పై పాతనోట్లకు కొత్త కరెన్సీ ఇస్తున్నట్లు తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నాగుల లక్ష్మినారాయణ రెడ్డి(29), కృష్ణ అశోక్‌కుమార్‌(45), మెర్జి భాస్కర్‌రావు(48), కొనకాల వెంకట్రావ్‌(52), బల్లం సుధాకర్‌రాజు(49), రంగు విక్రం(30), సంగన శివరామరెడ్డి(52), కోటపాటి నరసింహారావు(33), చిట్టే బాలనారాయణ(42), శానికొమ్ము శ్రీనివాసరెడి ్డ(46)లను అరెస్టు చేశామన్నారు. నగదు మార్పిడికి సంబంధించి నగరంలో ఆరు ముఠాలను కోర్టులో హాజరుపరిచామన్నారు
Link to comment
Share on other sites

If andhraJyothy article numbers are accurate, it looks like money exchangers are desparate/too much competion than black hoarders. just 12.5% commission????

This 12.5% commission must have started after the IT amendment news of 50% tax + lock-in period... kattalu kattalu unde batch dorakatame kashtam ga undi, just one by one dorukutunnaru... inka exchange batch ante chala rare annattu..

Link to comment
Share on other sites

 

బెజవాడలో 18.48 లక్షలు స్వాధీనం 

13-12-2016 03:01:03

636171948636719880.jpg
  •  ‘మార్పిడి’ చేస్తున్న 11 మంది అరెస్టు 
విజయవాడ(గుణదల), డిసెంబరు 12: ఏపీ రాజధానిలో నగదు మార్పిడి ముఠా గుట్టు రట్టయింది. 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.18.48 లక్షల నగదు, ఒక కారు, 5 మోటారు బైక్‌లు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ పాలరాజు తెలిపారు. సోమవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొంతమంది ముఠాగా ఏర్పడి నగదు మార్పిడికి పాల్పడుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌కు అందిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మురళీధర్‌ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగారు. గాంధీనగర్‌ బాబాయ్‌ హోటల్‌ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న కారును ఆపి తనిఖీ చేయడంతో ముఠా బాగోతం బయటపడిందన్నారు. పసుమర్తి శ్రీను(28) కొంతమందితో కలిసి 12.5ు కమీషన్‌పై పాతనోట్లకు కొత్త కరెన్సీ ఇస్తున్నట్లు తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నాగుల లక్ష్మినారాయణ రెడ్డి(29), కృష్ణ అశోక్‌కుమార్‌(45), మెర్జి భాస్కర్‌రావు(48), కొనకాల వెంకట్రావ్‌(52), బల్లం సుధాకర్‌రాజు(49), రంగు విక్రం(30), సంగన శివరామరెడ్డి(52), కోటపాటి నరసింహారావు(33), చిట్టే బాలనారాయణ(42), శానికొమ్ము శ్రీనివాసరెడి ్డ(46)లను అరెస్టు చేశామన్నారు. నగదు మార్పిడికి సంబంధించి నగరంలో ఆరు ముఠాలను కోర్టులో హాజరుపరిచామన్నారు

 

This is wonderful catch!

Link to comment
Share on other sites

This 12.5% commission must have started after the IT amendment news of 50% tax + lock-in period... kattalu kattalu unde batch dorakatame kashtam ga undi, just one by one dorukutunnaru... inka exchange batch ante chala rare annattu..

 

true. another reason could be that these middlemen have easier access to new currency

Link to comment
Share on other sites

Thanks swarnanadhra bro..

 

Bathroom lo 5.7crores new currency, 90lakh old, 30kg of gold in chitradurg area bangalore, from a hawala person.

 

కూలీ బయటపెట్టిన ‘సీక్రెట్‌ లాకర్‌’ 
13-12-2016 02:56:58
 
చిత్రదుర్గ ‘బాత్రూం భోషాణం’ గుట్టువీడిందిలా.. 

 

బెంగళూరు, డిసెంబరు 12: బాత్‌‌రూంలోకి వెళితే.. అక్కడ మరో గది ఉన్నట్లుగా ఏమాత్రం అనుమానం రాదు. సీక్రెట్‌ బటన్‌ నొక్కితే గానీ తెలియదు... టైల్స్‌లో టైల్స్‌గా కలిసిపోయిన ఓ ద్వారం తెరుచుకుంటుంది! అందులో కళ్లు మిరుమిట్లు గొలిపేలా కొత్తనోట్ల రూపంలో కోట్లకు కొట్ల డబ్బు! కడ్డీలకొద్దీ బంగారం! ధగధగలాడే ఆభరణాలు! కర్ణాటక చిత్రదుర్గ జిల్లా చల్లకెరేలో నిన్నటికి నిన్న కేసీ వీరేంద్ర అనే వ్యక్తికి చెందిన మూడు ఇళ్లలో వెలుగు చూసిన బాత్రూం ‘భోషాణాల’ బాగోతం అతడి కక్కుర్తి బుద్ధితోనే బయటపడింది.! ఇంతకీ ఈ ‘వినూత్న లాకర్‌’ను గుట్టును ఐటీ అధికారులు ఎలా రట్టు చేయగలిగారు? గోవాలో క్యాసినో బిజినెస్‌ వ్యాపారం నిర్వహించే కేసీ వీరేంద్ర.. తనకు, తన ఇద్దరు తమ్ముళ్ల కోసం నిర్మిస్తున్న ఇళ్ల కోసం ఈ ‘బాత్రూం భోషాణం’పై ప్రణాళిక వేశాడు. తనకు తెలిసిన వారితో ఈ పనిలో నిష్ణాతులైన కార్మికులను నియమించుకున్నాడు. బాత్రూం గోడల్లో ఓ గది ఉందని యజమానికే తెలియని లెవల్లో వారు అద్భుతంగా లాకర్‌ను నిర్మించిపెట్టారు. తాను అక్రమంగా సంపాదించినదంతా వాటిల్లో దాచాడు. తముళ్లతో కలిసి కొత్త ఇళ్లలోకి మారాడు. అయితే.. వీరేంద్ర కక్కుర్తికొద్దీ పనివాళ్ల నైపుణ్యానికి తగ్గట్లుగా వారికి కూలీ ముట్టజెప్పలేదు. దీంతో చిర్రెత్తిన ఓ కూలీ విషయాన్ని వీరేంద్ర సన్నిహతులకు చెప్పడంతో చివరికి ‘విషయం’ ఐటీ అధికారుల చెవిన పడింది. అయినా.. రూ.3.5 కోట్ల నగదు, 28 కేజీల బంగారు కడ్డీలు, 4కేజీల ఆభరణాలు దాచేందుకు సీక్రెట్‌ లాకర్లను తయారు చేయించుకున్నాక.. చేతికి ఎముక లేనట్లుగా కూలీలకు ఎక్కువ మొత్తాన్ని విదిల్చి ఉంటే పోయేది కదా? వీరేంద్ర ఇప్పుడు ఇలానే బాధపడుతూ ఉంటాడేమో! 
Link to comment
Share on other sites

Police seized new notes of Rs 16 lakh at Ramayampet in Medak district of Telangana. The money was recovered the cash from a car during the vehicle checking in the town.

The driver and another person accompanying him told police that they were carrying the cash to Toopran near Hyderabad for handing it over to a man for purchase of a piece of land.

Police handed over the cash to the income tax department for further investigation. 

A car was stopped during a routine check of vehicles today on the outskirts of Ramayampet town. During the search, we found Rs 16 lakh inside the car. We have detained car occupants B.Srinivas and D.Raju as they couldn't explain the source of the money," said Ramayampet police station sub- inspector Nagarjun Goud.

He said Rs 15.90 lakh in the seized currency are in denomination of Rs 2,000 and Rs 10,000 in denomination of Rs 100. Police handed out the seized money to Income Tax officials for further investigation.

http://www.business-standard.com/article/pti-stories/rs-16-lakh-in-valid-tenders-seized-in-tal-2-detained-116121100619_1.html

 

http://www.dnaindia.com/money/report-telangana-rs-16-lakh-cash-seized-2-detained-2281887 

 

B.Srinivas and D.Raju, Rayampet, TS. 16lakh. Dec 11, 2016

Link to comment
Share on other sites

Police seized Rs 93.52 lakh in Rs 2,000 currency notes from seven people in Jaipur on Monday. Three people were arrested and the others detained in the two separate seizures.

Two people were detained allegedly after Rs 64 lakh, of which Rs 58 lakh was in denomination of Rs 2,000 notes, was seized from them, police said.

“On a tip off, a joint team of the CID’s crime branch and police intercepted their car when it was roaming in the area apparently to facilitate exchange of demonetised notes,” DCP (West) Ashok Gupta said, adding that Rs 6 lakh was of 100-rupee notes.

The Income Tax department has been informed about the seizure and they are probing the matter, the police official said.

Read | Rs 32 crore cash in new notes, 82kg gold seized in multiple raids across country

In another incident, three people were arrested for allegedly robbing a Bikaner-based businessman of Rs 83 lakh in new currency.

“Three of the five accused in the case have been arrested. All of them were friends of businessman Rajesh. Police have also seized Rs 28 lakh from their possession,” Gupta said, adding the other accused, both policeman, are absconding.

The incident occurred a few days back when he had come here to meet them and exchange his money in demonetised Rs 500 and Rs 1,000 notes, he said.

“The accused took him to a flat where he was tricked into believing that two policemen had come into the complex. He was asked to throw the money in a plot adjacent to the flat,” the DCP said, adding the accused policemen picked up the money.

The victim had registered a complaint following the incident, he said.

Read | Gold biscuits hidden inside baby diapers recovered at Delhi airport

In the outskirts of the city, police caught two residents when they were exchanging scrapped notes with new currency.

“Rs 8 lakh, including Rs 7.52 lakh in new Rs 2,000 notes, was recovered from Shyam Lal and Bhanwar who were exchanging notes in near Ajayrajpura village,” SHO at SEZ police station Gayasuddin said.

The I-T department has been informed about the matter, he said.

Link to comment
Share on other sites

At least 16 kg gold biscuits hidden in baby diapers were recovered on Monday from the Indira Gandhi International Airport in New Delhi after a group of fliers coming from Dubai were intercepted by security agencies.

Officials said the recovery was made around 7:00am when a group of six passengers arrived here from Dubai and were intercepted for a thorough check.

“Gold biscuits weighing about 16kg have been recovered from the passengers. The sixteen gold biscuits, of one kg each, were found cleverly concealed in the diapers and towel of the two babies they were carrying. The two groups comprising a couple and a baby each are from Surat,” they said.

The fliers are being interrogated by customs officials, they added.

Link to comment
Share on other sites

Venezuela Follows India’s Example and Voids Half of Its Cash
 

CARACAS, Venezuela—Venezuela is taking nearly half the country’s bank notes out of circulation beginning Wednesday, threatening to ruin the holidays season for Venezuelans already suffering from dire cash shortages, hyperinflation and an economic meltdown.

 

http://blogs.wsj.com/indiarealtime/2016/12/13/venezuela-follows-indias-example-and-voids-half-of-its-cash/

Link to comment
Share on other sites

AndhraJyothy:
పని మనిషి కాదు మిలియనీర్ !
13-12-2016 18:06:38
636172491988721766.jpg
కోల్‌కతా : ఓ పేదరాలు ఉన్నట్టుండి మిలియనీర్ అయిపోయింది. పనికి పోతే కాని పూట గడవని ఆమెకు అంత సంపద ఎలా వచ్చింది? పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన మాయాజాలంలో ఇదొకటి. బ్యాంకు ముఖమెరుగని ఆమె పేరు మీద జన్‌ధన్ ఖాతా పుట్టింది. అంతేనా.. ఆ ఖాతాలో 60 లక్షల రూపాయలు వచ్చి పడ్డాయి. అది కోల్‌కతాలోని మిటియబురుజ్ అనే బీదవాడ. ఆ మహిళ అక్కడ ఓ పూరింటిలో తండ్రితో నివసిస్తుంటుంది. ఖాతాలో వివరాల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమె చిరునామాను వెతుక్కుంటూ వెళ్లారు. ఆ ప్రాంతాన్ని, ఆమె ఇంటిని చూసి అవాక్కయ్యారు. ఆమె ఇళ్లలో పని చేసుకుని ఆమె జీవనం సాగిస్తోందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అధికారులు చెప్పే వరకు ఆమెకు తన పేరు మీద ఖాతా ఉన్నట్లు తెలియదట. ఆమెకు తెలియకుండా ఎక్కడైనా సంతకాలు పెట్టి ఉంటుందని ఈడీ అధికారులు భావిస్తున్నారు. నవంబరు 8 తర్వాత ఆమె పేరు మీద ఉన్న ఖాతాలో రూ.60 లక్షలు జమయ్యాయి.
Link to comment
Share on other sites

ఆంధ్రా, తెలంగాణల నుంచే శేఖర్‌రెడ్డికి నగదు..!
14-12-2016 19:51:24
636173418845450048.jpg
చెన్నై: చెన్నైకి చెందిన ఇసుక కాంట్రాక్టర్‌ జె.శేఖర్‌రెడ్డి వద్ద పట్టుబడిన కొత్త కరెన్సీలో రూ. 34 కోట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గత గురువారం శేఖర్‌రెడ్డి, అతని స్నేహితులు, భాగస్వాముల ఇళ్లు, నివాసాల్లో తనిఖీ చేసిన ఐటీ అధికారులు రూ. 170 కోట్ల నగదు, 400 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ కారులో ఏకంగా రూ.24 కోట్ల కొత్త కరెన్సీ పట్టుబడింది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు చేపట్టిన విచారణలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. పట్టుబడిన మొత్తం నగదులో రూ.34 కోట్లు హైదరాబాద్‌, విశాఖపట్నంలలోని జాతీయ బ్యాంకుల నుంచే కమిషన్ ఆధారంగా శేఖర్‌రెడ్డి సేకరించినట్లు తేలింది. కరెన్సీ ముద్రితమైన తరువాత నేరుగా రిజర్వుబ్యాంక్‌ రాష్ట్ర కేంద్ర కార్యాలయానికి పంపించి, అక్కడి నుంచి ఆయా బ్యాంకులకు తరలిస్తుంటుంది. ఇలా దిగుమతి చేసుకున్న హైదరాబాద్‌, విశాఖపట్నం బ్యాంకుల ఉన్నతాధికారులు కొందరు శేఖర్‌రెడ్డికి పంపించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. పట్టుబడిన కరెన్సీ సీరియల్‌ నెంబరు ఆధారంగా చేపట్టిన విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయని, ఈ కుంభకోణంలో మొత్తం పదిమంది అధికారులు కుమ్మక్కు అయినట్లు తేలిందని ఆ వర్గాలు వివరించాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...