Jump to content

Recommended Posts

  • 4 months later...
  • 3 months later...
Posted

తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయాలి

తెలుగు భాషాభివృద్ధిపై ప్రభుత్వానికి కమిటీ సమగ్ర నివేదిక

30ap-state2a.jpg

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధి కోసం ఏడు విభాగాలతో ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించామని తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి అధ్యయన కమిటీ సభ్యుడు, ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ తెలిపారు. తెలుగుభాషాభివృద్ధిపై చేసిన అధ్యయన నివేదికను ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌, రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, సాంస్కృతికశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా, సంచాలకులు డాక్టర్‌ విజయభాస్కర్‌తో కలిసి మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం బుద్ధప్రసాద్‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రాధికార సంస్థ ఏర్పాటు సూచనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు. భాషను నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకునే అధికారాన్ని ప్రాధికార సంస్థకు కల్పించాలని అన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు.. తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి కేటగిరిలోనూ 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. తెలుగు భాష నేర్చుకునేలా ఆన్‌లైన్లో సర్టిఫికేట్‌ కోర్సులు నిర్వహించాలి. తెలుగు సాహిత్యం, సాంస్కృతికత, గ్రామీణ సాంకేతికత, జానపదం, చరిత్రలకు సంబంధించి ఆరు అకాడమీలు ఏర్పాటు చేయాలి. అమరావతిలో ప్రాచీన భాషా కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి.

Posted
తెలుగు మాధ్యమ విద్యార్థులకు.. ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్!
 
 
  •  మహిళాసాధికార దినోత్సవంగా దీపావళి
  •  తెలుగు అభివృద్ధి అధ్యయన కమిటీ నివేదిక
అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసించేవారికి ఇకపై ప్రభుత్వ కొలువుల్లో 10 శాతం రిజర్వేషన్ లభించనుంది. అదేవిధంగా ఏటా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొనే దీపావళి పండుగను ఇకపై మహిళాసాధికార దినోత్సవంగా ప్రభుత్వమే నిర్వహించనుంది. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో తెలుగును కచ్చితంగా అమలు చేయనున్నారు. ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు తెలుగు భాషా, సంస్కృతి అభివృద్ధి అధ్యయన కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అదేవిధంగా తెలుగు భాషాభివృద్ధికి ఏడు విభాగాలతో ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు 2016 సెప్టెంబరు 14న అప్పటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తన 156 పేజీల నివేదికను.. సభ్యులు శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌, సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌, సాంస్కృతికశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, సాంస్కృతికశాఖ కార్యదర్శి ముఖే్‌షకుమార్‌ మీనాలు మంగళవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. అనంతరం, ఉపసభాపతి మండలి మీడియాతో మాట్లాడుతూ.. తమ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అందరి అభిప్రాయాలనూ తీసుకుందన్నారు. వందల మంది కవులు, కళాకారులు, భాషాభిమానులు తమ అభిప్రాయాలు వెల్లడించినట్టు చెప్పారు. అదేవిధంగా చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్‌లోని తెలుగు వారి నుంచి కూడా భాషాభివృద్ధికి సూచనలు తీసుకున్నట్టు చెప్పా రు. ఢిల్లీలో కూడా పర్యటించి మూడు అకాడమీలను సందర్శించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికార భాషా అమలు విభాగం, తెలు గు భాషాభివృద్ధి విభాగం, ఇ-తెలుగు విభాగం, అనువాద విభాగం, ప్రచురణల విభాగం, అంతర్జాతీయ తెలుగు భాషాభివృద్ధి విభాగం, గ్రంథాలయాల విభాగాలతో ఓ ప్రాదికార సంస్థను ఏర్పాటు చేయాలని సూచించినట్టు చెప్పారు. కమిటీ చేసిన మరిన్ని సూచనలు..
  •  సచివాలయం నుంచి గ్రామం వరకు ఉత్తర్వులు, ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలి
  •  తెలుగు మాధ్యమం చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి కేటగిరీలోనూ 10ు రిజర్వేషన్‌ కల్పించాలి
  •  సరిహద్దు రాష్ట్రాల్లో తెలుగును 2వ అధికార భాషగా గుర్తించేలా తమిళ, కన్నడ, ఒడిసా ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలి
మహిళా సాధికార దినోత్సవంగా..
తెలుగు పండగలైన వినాయక చవితిని పర్యావరణ చైతన్యోత్సవంగా, శ్రీరామ నవమిని కుటుంబోత్సవంగా, దీపావళిని మహిళా సాధికార దినోత్సవంగా, ఉగాది పండుగను తెలుగు సాంస్కృతిక మహోత్సవంగా, క్రిస్మ్స్ ను కారుణ్య మహోత్సవంగా, రంజాన్‌ను సౌహార్ద్ర మహోత్సవంగా జరపాలి.
Posted

Nothing wrong TG fighting for this center & funds. But already Hyderabad lo telugu university & chaala samsthala HQs vunnayi idi AP ki vadileyyochhu kada.

  • 2 months later...
  • 3 months later...
  • 5 months later...
Posted
త్వరలో ఏపీలో ప్రాచీన తెలుగు పీఠం ఏర్పాటు

ఈనాడు, దిల్లీ: కర్ణాటకలోని మైసూరులో ప్రస్తుతం ఉన్న ప్రాచీన తెలుగు భాష అధ్యయన పీఠాన్ని త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకుంటామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చినట్లు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జాతీయ గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, వెంకయ్యనాయుడు మాజీ ఓఎస్‌డీ సత్యకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం తాము ఉపరాష్ట్రపతిని కలిసి ఈ విషయమై విజ్ఞప్తి చేసినప్పుడు.. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.

Posted

sony annai  mee follow ups ki :adore: 

  • 4 weeks later...
Posted
Just now, sonykongara said:

mysore lo pettindi evaru raa appudu evari xxxxx gudusthunnaru prati di TDP meda thoyytam alvatu ayyindi

Eee kaaram gaadini evadu pattinchukontaadu sony annai..lite..

jdHBNb.gif

  • 2 weeks later...
Posted
‘అమ్మ భాష’కు అందలం
ఆంధ్రప్రదేశ్‌ తెలుగు భాష అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
ఈనాడు - అమరావతి
10ap-main7a.jpg

తెలుగు భాషకు ప్రాధాన్యం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ తెలుగు భాష అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం నియమించే ఛైర్మన్‌తోపాటు సాధారణ పరిపాలన, న్యాయ, కార్మిక, పర్యాటక, సాంస్కృతిక, విద్యాశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉండే ఈ సంస్థలో  తెలుగు సాహిత్యం, పరిపాలన, చట్టం వంటి అంశాలలో నిపుణులైన నలుగురు సభ్యులు ఉంటారు. సంస్థ సీఈవో పాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ప్రాధికార సంస్థ ద్వారా ప్రత్యేకంగా ఐదు కమిటీలను వేసి, భాషకు పునరుత్తేజం కల్పించేందుకు కృషి చేయనున్నారు. తెలుగు అమలు, విద్యావిధానంలో అంతర్భాగంగా తెలుగు భాషాభివృద్ధి, ఈ-తెలుగు అభివృద్ధి, ప్రచురణలు, అనువాదం, అంతర్జాతీయంగా తెలుగు అభివృద్ధి వంటి అంశాలలో ఈ కమిటీలు సేవలందించనున్నాయి. ప్రధానంగా అధికార భాష అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు ప్రాధికార సంస్థ ప్రయత్నిస్తుంది. ప్రభుత్వపరంగా ప్రజలు వినియోగించే ప్రతి దరఖాస్తు, రికార్డులను తెలుగులో అందుబాటులో ఉంచడంపై దృష్టిసారిస్తుంది. ప్రత్యేకించి న్యాయస్థానాల తీర్పులు సైతం తెలుగులో ఉండేలా సమన్వయం చేయాలన్నది సర్కారు ఆలోచన. ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు భాషపై పట్టు సాధించేలా అథారిటీ శిక్షణ, సదస్సులు నిర్వహిస్తుంది.

పాఠ్యపుస్తకాల స్థాయి పరిశీలన..
అధికార భాషగా తెలుగు అమలు అవుతుందా లేదా అనేదానిపై సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న అన్ని పదాలకు తెలుగులో పదకోశాన్ని సిద్ధం చేస్తారు. అన్ని రకాల నామ ఫలకాలు, గోడపత్రికలు.. ఇలా ప్రతి విషయంలోనూ తెలుగుదనం కనిపించేలా చర్యలు తీసుకుంటుంది. తెలుగు పాఠ్యపుస్తకాల స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించడం, ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్థుల అభ్యాసన స్థాయులను పరిశీలించడం, ప్రధానంగా తల్లిదండ్రులను ఈ క్రమంలో చైతన్యపరచటం, తెలుగేతర విద్యార్థులు తెలుగు నేర్చుకునేలా శిక్షణ తరగతులు నిర్వహణలాంటివి క్రియాశీలకం కానున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించనుంది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో తెలుగును అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపచేసేందుకు చర్యలు తీసుకోనుంది. మానసికశాస్త్రం, శాస్త్రసాంకేతిక రంగాలు, చరిత్ర, వైద్యం తదితరాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని డిజిటల్‌ పదకోశంలో అందుబాటులోకి తేనుంది. హిందీ మాట్లాడే రాష్ట్రాలలో సైతం మూడోభాషగా తెలుగు ఉండేలా చూడటం, సరిహద్దు రాష్ట్రాల వెంబడి ఉన్న గ్రామాల్లోని తెలుగు ప్రజలు భాష పట్ల మక్కువ చూపేలా ప్రాధికార సంస్థ ప్రత్యేక పథకాలు అమలుచేయనుంది. తెలుగు భాషాభివృద్ధి నిధి పేరిట రూ.25కోట్లు మంజూరు చేశారు.

అమలు చేయకపోతే జరిమానా..
రాష్ట్రంలో దుకాణదారులు తెలుగులో నామఫలకాలను ఏర్పాటు చేయకపోతే రూ.50వేలు వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదే తప్పిదాన్ని మళ్లీ చేస్తే జరిమానాను పెంచే అధికారం ప్రాధికార సంస్థకు ఉంటుంది. శిలాఫలకాలు, గోడపత్రికల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తెలుగు వినియోగించాలి. లేదంటే రూ.10వేలు జరిమానా విధిస్తారు. నిబంధనల మేరకు తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపని ప్రభుత్వ శాఖలకు రూ.5వేలు అపరాధ రుసుము విధిస్తారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీచేసే నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థల నిర్వాహకులు తెలుగును బోధనాంశంగా అమలు చేయకపోతే రూ.50వేలు జరిమానా లేదా ఆరు నెలల జైలుశిక్ష తప్పదు.

Posted
తెలుగుకు జై
11-07-2018 02:48:28
 
636668741079421056.jpg
  • ప్రచురణలు, కోర్టు తీర్పులు, సంస్థల పేర్లన్నీ తెలుగులోనే
  • భాషోద్ధరణలో ముందడుగు
  • ప్రత్యేకంగా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
  • భాషకు పునరుత్తేజం, విశ్వవ్యాప్తి లక్ష్యంగా కార్యాచరణ
  • ఉన్నతాధికారులకు తెలుగులో శిక్షణ
  • ‘పలుకు’బడిపై ఉద్యోగులకు పరీక్షలు
 
 
అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): తేనెలొలుకు తెలుగు మరింత తీయదనాన్ని అద్దుకోనుంది. ప్రాచీనతకు ప్రాకారంగా నిలిచిన మాతృభాషలోనే ఇకముందు పరిపాలన జరగనుంది. ప్రభుత్వ ప్రచురణలు మొదలు ఉన్నతాధికారులకు శిక్షణ దాకా తెలుగులోనే సాగనున్నాయి. నవ్యాంధ్రలో తొలినుంచీ తెలుగుకు పట్టం కడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ‘‘ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ బోర్డుని ఏర్పాటుచేసింది. తాజాగా ఈ బోర్డు పరిధిలోనే ‘ఆంధ్రప్రదేశ్‌ తెలుగు భాషాభివృద్ధి సంస్థ’కు ప్రభుత్వం జీవం పోసింది. ఈ మేరకు పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంస్థ విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి.. తెలుగు భాషను ఎలా అభివృద్ధి చేస్తారు..ముఖ్యంగా ప్రభుత్వ పాలనలో తెలుగు భాష పరిధిని ఏ స్థాయిలో పెంచుతారనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రణాళికను సిద్ధం చేసింది. తెలుగు భాషకు పునరుత్తేజం, విశ్వవ్యాప్తే ధ్యేయంగా ఏర్పాటు అయిన ఈ సంస్థ చైర్మన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. సాధారణ పరిపాలన, న్యాయ, కార్మిక, పర్యాటక, విద్యాశాఖ కార్యదర్శులు ఈ సంస్థలో సభ్యులుగా ఉంటారు. తెలుగు సాహిత్యం, పరిపాలన, చట్టం వంటి అంశాల్లో నిపుణులైన నలుగురిని సభ్యులుగా నియమిస్తారు. సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఈ సంస్థ పాలనా వ్యవహరాలను పర్యవేక్షిస్తారు. ఈ సంస్థ కింద ఐదు కమిటీలు పని చేస్తుంటాయి. భాషకు పునరుత్తేజం కలిగించేందుకు కృషి చేస్తాయి. తెలుగు అమలు కమిటీ, ‘ఈ - తెలుగు’ కమిటీ, అభివృద్ధి, ప్రచురణలు కమిటీ, అనువాదం కమిటీ, అంతర్జాతీయ భాషాభివృద్ధి కమిటీల పేరిట వీటిని ఏర్పాటు చేస్తారు.
 
పూర్తి ‘అధికార’ ముద్ర కోసం..
అధికార భాష అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించడం కోసం ప్రాధికార సంస్థ ప్రయత్నిస్తుంది. దీనికోసం ప్రభుత్వపరంగా ప్రజలు వినియోగించే ప్రతి దరఖాస్తు, రికార్డును తెలుగులో అందుబాటులో ఉంచటంపై దృష్టి సారిస్తుంది. న్యాయ స్థానాలు వెలువరించే తీర్పులు కూడా తెలుగులో ఉండేలా చూడాలనేది ప్రభుత్వం అభిలాష. అయితే, న్యాయవ్యవస్థలో వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు పని చేస్తున్నారు. అలాంటివారిని గుర్తించి, వారికి తెలుగు భాషపై మరింత పట్టు సాధించేలా శిక్షణ, సదస్సులు, ప్రదర్శనలను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుంది. పాలనా విధులు నిర్వహిస్తున్న చాలా మంది ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాలకు చెందినవారు. సుదీర్ఘకాలంగా ఏపీలో పని చేస్తున్నందు వల్ల, వారిలో కొంతమంది తెలుగు మాట్లాడగలుగుతారు. అయితే, వారి భాషా పరిజ్ఞానం తెలుగులో విధులు నిర్వహించేందుకు ఎంతవరకు సరిపోతుందనేది ప్రశ్నార్థకమే. దీంతో ఆ అధికారులకు తెలుగుపై ఉన్న పట్టు ఎంత అన్నదానిపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను కూడా తెలుగు భాషాభివృద్ధి సంస్థకు అప్పగించింది. అలాగే, రాష్ట్రంలో ఉన్న కేంద్ర సంస్థల్లో కూడా తెలుగు అమలు చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
 
సంస్థలకు, కార్యాలయాలకు తెలుగు పేర్లు
విమానాశ్రయాలు, బ్యాంకులు, తపాలా కార్యాలయాలు ఇలా అన్నింటా తెలుగు కనిపించేలా చర్యలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక కృషికి గ్రామ సచివాలయం నుంచి శ్రీకారం చుట్టి, తాలూకా, జిల్లా స్థాయికి విస్తరిస్తారు. శాసనసభ వ్యవహరాలకు సంబంధించిన అన్ని అంశాలు తెలుగులోనే ఉండేలా ప్రత్యేక కార్యాచరణ అమలుకానుంది. అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న అన్ని పదాలకు తెలుగులో పదకోశాన్ని సిద్ధం చేస్తారు. ప్రభుత్వ పరమైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాలతో పాటు అన్ని రకాల నామ ఫలకాలు, గోడపత్రికలు, జెండాలు తయారీలోనూ తెలుగుదనం ఉట్టిపడనుంది. ప్రభుత్వ పరమైన ప్రచురణలు అన్ని విధిగా తెలుగులోనే ఉంటాయి. అలాగే, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తారు. భాష అనేది అభ్యాసం ద్వారా అలవడుతుంది. అందులో భాగంగా విద్యకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించేలా నిబంధనలు రూపుదిద్దుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, విద్య విషయాల్లో ప్రాధాన్యం, తెలుగు పాఠ్యపుస్తకాల స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించటం, ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్థుల అభ్యాసన స్థాయిలను పరిశీలించటం వంటివి చేస్తారు. ప్రధానంగా తల్లిదండ్రులను ఈ క్రమంలో చైతన్య పరచటం, తెలుగేతర విద్యార్థులు తెలుగు నేర్చుకునేలా శిక్షణా తరగతులు, వివిధ సందర్భాల్లో కవులు వాడిన పదాలను ప్రచారంలోకి తీసుకువస్తారు. భాషను కాపాడుకోవాల్సిన అవసరంపై యువతను చైతన్య పరుస్తూ, వారికి పోటీలు, సదస్సులు, కార్యశాలలు నిర్వహిస్తారు. తెలుగు భాష, సంస్కృతిపై పరిశోధన చేసే వారిని ప్రోత్సహించటం, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ తెలుగు మహా సభలకు నిర్వహించనున్నారు.
 
డిజిటల్‌లో మన పలుకు
డిజిటల్‌ యుగంలో తెలుగును అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపచేయాలంటే, అదే విధానంలో భాషను ముందుకు తీసుకువెళ్లవలసి ఉంది. ఈ క్రమంలోనే ’ఈ - తెలుగు’ అభివృద్ధికి ప్రత్యేక కమిటీ ఏర్పాటయింది. సైకాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాలు, చరిత్ర, వైద్యం వంటి రంగాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని డిజిటల్‌ పదకోశంలో అందుబాటులో ఉంచుతారు. ఇంటర్నెట్‌లో తెలుగు వినియోగంపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఇక.. అన్‌లైన్‌లో తెలుగు బోధన చేపడతారు. ప్రాధికార సంస్థ వెబ్‌సైట్‌లో తెలుగు సంగీతం, పురాతన గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలను డిజటలీకరించి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ పరమైన వ్యవహారాలన్నింటికి యూనికోట్‌ అందుబాటులోకి తీసుకువచ్చి, సమాచారాన్ని అదే రూపంలో భద్రపరచటం వంటి పనులు చేయనున్నారు. విదేశీ భాషల్లో ఉన్న అత్యున్నత సమాచారంతో పాటు సాధారణ పరిపాలనకు సంబంధించిన అంశాలను అనువాదం చేసి అందరికీ అందుబాటులో ఉంచుతారు. అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాగించాలని నిబంధన ఏర్పాటు చేశారు.
 
పొరుగు రాష్ట్రాలతో సమన్వయం..
తెలుగు ప్రజలు ఉన్న రాష్ట్రాల్లో విద్యాభోధన తెలుగులో సాగేలా అక్కడి పాలకులతో సమన్వయం చేసుకొంటారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కూడా మూడో భాషగా తెలుగు ఉండేలా ప్రయత్నిస్తారు. సరిహద్దు రాష్ట్రాల వెంబడి ఉన్న గ్రామాల్లోని తెలుగు ప్రజల కోసం భాషపరమైన ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.
 
కొసమెరుపు
తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వం ‘‘తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ’’ను ఏర్పాటు చేసింది. కానీ దానికి సంబంధించిన ఉత్తర్వులను మాత్రం ఆంగ్లంలో విడుదల చేయడం కొసమెరుపు.
 
 
మాట తప్పితే వేటే..
‘‘తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రాధికార సంస్థకు జీవం పోశారు. పరిపాలనలో తెలుగు అమలు, వినియోగంపై కాలపరిమితితో కూడిన నిబంధనావళి ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో తెలుగు భాషాభివృద్ధి నిధి పేరిట రూ.25 కోట్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో దుకాణదారులు తెలుగులో నామఫలకాలను ఏర్పాటు చేయకపోతే రూ.50 వేల వరకు జరిమానా వసూలుచేస్తాం. శిలాఫలకాలు, గోడపత్రికల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తెలుగు వినియోగించాలి. లేకుంటే రూ.10 వేలు జరిమానా తప్పదు. నిబంధనల మేరకు తెలుగుతో ఉత్తరప్రత్యుత్తరాలు జరపని ప్రభుత్వ శాఖలకు రూ.5 వేలు అపరాధరుసుం విధిస్తాం. విద్యాసంస్థల నిర్వాహకులు తెలుగును బోధనాంశంగా అమలు చేయకపోతే రూ.50 వేలు జరిమానా, ఆరునెలల జైలు శిక్ష తప్పదు.
- ముఖేశ్‌ కుమార్‌ మీనా, ముఖ్య కార్యదర్శి,
పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ
  • 5 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...