Jump to content

Recommended Posts

  • 3 weeks later...
Posted
చంద్రన్న బీమాకు రూ.2.16 కోట్లు మంజూరు

ఈనాడు, అమరావతి: చంద్రన్న బీమా పథకంలో అదనంగా 13,54,251 మంది కార్మికులకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.2.16 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  • 2 weeks later...
  • 3 weeks later...
Posted
⁠⁠⁠⁠⁠ఇక పై సహజ మరణానికీ కూడా చంద్రన్న బీమా వర్తింపు!!

సుదీర్ఘ చర్చల అనంతరం ఇన్సూరెన్స్ కంపెనీల అంగీకారం!!

 దేశంలోనే మొదటి రాష్ట్రంగా AP

Posted

 

⁠⁠⁠⁠⁠ఇక పై సహజ మరణానికీ కూడా చంద్రన్న బీమా వర్తింపు!!
సుదీర్ఘ చర్చల అనంతరం ఇన్సూరెన్స్ కంపెనీల అంగీకారం!!
 దేశంలోనే మొదటి రాష్ట్రంగా AP

 

:terrific:  :terrific:

Posted

ఇకపై సహజ మరణానికీ చంద్రన్న బీమా వర్తింపు.. ఇన్సూరెన్స్ కంపెనీల అంగీకారం

 

అమరావతి: ఇకపై సహజ మరణానికి కూడా చంద్రన్న బీమా వర్తింప చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకారం తెలిపాయి. పధకం లబ్డిదారులకు 14వరోజు సంతాప కార్యక్రమం, అదే కార్యక్రమంలో ఫైనల్ సెటిల్‌మెంట్ చెక్ అందివ్వాలని సీఎం ఆదేెశించారు. మృతుని ఇంటికి వెళ్లి జన్మభూమి సభ్యులే ఫైనల్ సెటిల్మెంట్ చెక్ అందివ్వాలని సీఎం సూచించారు. 2.13 కోట్ల మందిని ఇన్సూరెన్స్ కవరేజ్ పరిధిలోకి తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచిందని, మిగిలిన రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్‌గా నిలిచిందని చంద్రబాబు చెప్పారు.

Posted

All these tv channels and 'news' papers (not just sakshi) are obviously operating with blatant agenda to undermine everything TDP does (except may be AJ). I'm sure CBN/TDP knows this. Lower level leaders (constituency level, mla) need to take active part in taking these programs further. CBN anni chusukoledu.

 

Lower level leaders baga dull ga vunnaru brother. Evaru active part theesukovatamu ledhu except here and there. Gadde Rammohan lanti vaallaku Ministry ivvakapoyina, ituvanti responsibilities isthe chakkaga handle chestharu.

Posted
బీమాలో మరింత ధీమా!
28-07-2017 02:29:24
 
636368057924573260.jpg
  • సహజ మరణానికి సాయం భారీగా పెంపు.. ఇకపై 2 లక్షలు చెల్లింపు
 
అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అసంఘటిత రంగ కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం మరో వరాన్ని ఇవ్వబోతోంది. అసంఘటిత రంగ కార్మికులు ఎవరైనా సహజమరణానికి గురైతే వారి కుటుంబానికి రూ.2 లక్షలు అందజేయాలని భావిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఆగస్టు 15న అధికారికంగా ప్రకటించనున్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ‘చంద్రన్న బీమా’ పథకం ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. చంద్రన్న బీమాను విస్తృతపర్చి అసంఘటిత రంగ కార్మికులకు మరింత మేలు చేకూర్చేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ ఆ శాఖ అధికారులతో చర్చించారు.
 
అసంఘటిత రంగ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా.. సహజ మరణానికి గురైనా అతనిపైనే ఆధారపడిన కుటుంబం నిలువనీడ లేకుండా పోతోందని దీన్ని దృష్టిలో పెట్టుకొని సహజమరణానికి గురైన వారికి రూ.2 లక్షలు చెల్లించడం ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలిచినట్లు ఉంటుందని సమావేశం అభిప్రాయపడింది. గురువారం సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో మంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నిపుణులు, బీమా కంపెనీల ప్రతినిధులతో చర్చించి రూ.2లక్షలు బీమా చెల్లించాలంటే అదనంగా ఏమైనా చెల్లించాలా? అనారోగ్యంతో ఉన్న వారికి కూడా వర్తిస్తుందా? ఎంత వయసు ఉన్నవారికి వర్తింపజేయవచ్చు? తదితర అంశాలను చర్చించారు.
 
ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండా ప్రభుత్వం కొంత మేర భరించి అమలు చేస్తే నిరుపేదలకు ఎంతో ఉపయోగకరమనే నిర్ణయానికి వచ్చారు. అయితే వయసు విషయంలో సాధారణ మరణానికి 50ఏళ్లలోపు వారైతేనే రూ.2లక్షలు చెల్లించేందుకు సమ్మతమని బీమా కంపెనీలు నిబంధన పెట్టినట్లు తెలిసింది. దీనిపై మరింత కసరత్తు చేసి ఆగస్టు 15 నాటికి పూర్తి విధివిధానాలను రూపొందించనున్నారు.
 
పాదయాత్ర నాటి ఆలోచన
అసంఘటిత రంగ కార్మికులకు అండగా నిలవాలన్న ఆలోచన వస్తున్నా మీకోసం పాదయాత్ర సమయంలో చంద్రబాబు మదిలో పురుడుపోసుకుంది. పాదయాత్ర సమయంలో ఒకచోట లారీ డ్రైవర్‌ పరిస్థితి చూసి చలించిన ఆయన అధికారంలోకి వస్తే మీ కుటుంబాలకు భరోసా ఇస్తానని హామీ ఇచ్చారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక లారీ డ్రైవర్లు మొదలుకొని వ్యవసాయ కూలీల వరకూ రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు లబ్ధి చేకూరేలా కార్మికశాఖ ఒక పథకాన్ని సిద్ధం చేసింది.
 
కోటిన్నర మందికి ఈ పథకం ద్వారా మేలు చేయవచ్చని ప్రతిపాదించడంతో ‘చంద్రన్న బీమా’ పథకం గత ఏడాది అక్టోబరు 2న అమల్లోకి వచ్చింది. కేవలం రూ.15 చెల్లిస్తే మిగతా మొత్తం ప్రభుత్వమే చెల్లించి బీమా అందేలా మార్గం సుగమం చేసింది. చంద్రన్న బీమా పొందిన వారు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.5లక్షల పరిహారం ఆ కుటుంబానికి దక్కుతుంది. అదే సాధారణ మరణమైతే రూ.30వేలు చెల్లిస్తారు. రాష్ట్రంలో 2.13 కోట్ల మంది ఈ పథకం పరిధిలో సభ్యులుగా చేరారు.
 
‘చంద్రన్న’కు హస్తిన ప్రశంసలు
చంద్రన్న బీమా లబ్ధిదారులు సహజ మరణం పొందితే వారి పెద్ద కర్మ(14రోజుల్లో ఎప్పుడైనా) రోజు మొత్తం పరిహారం కుటుంబ సభ్యులకు అందజేయాలన్న సీఎం ప్రతిపాదనకు బీమా కంపెనీలు సమ్మతించాయి. ‘చంద్రన్న బీమా’ చెల్లింపుల్లో జాప్యం సరికాదని సీఎం సమీక్షలో అన్నారు. ఇచ్చేది ఏదైనా సకాలంలో చెల్లిస్తే లబ్ధిదారులకు ఊరట లభిస్తుందని, సహజ మరణాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వారాలు దాటకుండా చెల్లింపులు జరగాల్సిందేననడంతో అందుకు బీమా కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. వారం పది రోజుల్లోపే చెక్‌ సిద్ధం చేస్తే జన్మభూమి కమిటీ సభ్యులు మృతుని ఇంటికి వెళ్లి అందజేస్తారని సీఎం స్పష్టం చేశారు. ఐదు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 2.13 కోట్ల మందికి లబ్ధి చేకూరేలా అమలవుతోన్న ఏకైక పథకం చంద్రన్న బీమా తప్ప మరోటి లేదంటూ పలువురు ఢిల్లీ పెద్దలు తన హస్తిన పర్యటనలో ప్రశంసించారని వెల్లడించారు.
  • 4 weeks later...
Posted

చంద్రన్న బీమాకు కొత్తరూపు!

సహజ మరణానికి పరిహారం రూ.2 లక్షలకు పెంపు

2.20 కోట్ల మందికి ప్రయోజనం కల్పించేలా చర్యలు

ఈనాడు - అమరావతి

29ap-state1a.jpg

చంద్రన్న బీమాలో మార్పులకు రంగం సిద్ధమవుతోంది. ఈ పథకం ప్రారంభించి ఏడాదవుదన్న సందర్భంగా క్షేత్రస్థాయి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని కార్మికులకు అదనంగా లబ్ధి చేకూర్చేలా కొన్ని మార్పులు ప్రతిపాదించారు. వీటిలో రెండు మార్పులు కీలకంగా కనిపిస్తున్నాయి. ఒకటి... సహజ మరణానికి పరిహారం రూ.2 లక్షల వరకు పెంచడం. రెండు... పాక్షికంగా వైకల్యం సంభవిస్తే పరిహారాన్ని రూ.3.62 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు తగ్గించడం. గతంలో ఈ పథకంలో చేరకుండా ఉండిపోయిన వారికి ఈ ఏడాది అవకాశం కల్పించనున్నారు.

తాజా మార్పులు...

* చంద్రన్న బీమాను రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యాకేజీగా సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఆమ్‌ ఆద్మీ బీమా యోజన పథకాలను కలిపి రాష్ట్రంలో కార్మికులకు ఎక్కువ మొత్తంలో ప్రయోజనం కల్పించేలా చంద్రన్న బీమాను రూపొందించారు.

* కార్మికులకు సహజ మరణం సంభవిస్తే ఇప్పటివరకు ఇది రూ.30 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు రూ.2 లక్షల పరిహారం అందుతుంది. 50 ఏళ్ల వరకు వయసు ఉండి, సహజ మరణం సంభవిస్తేనే ఇంత మొత్తం ఇస్తారు. 51 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు సహజ మరణానికి రూ.30వేలే పరిహారంగా అందిస్తారు. 60ఏళ్ల తర్వాత సహజమరణానికి ఏ పరిహారమూ దక్కదు.

* ప్రమాదంలో మరణిస్తే ఏ కార్మికుని కుటుంబానికైనా రూ.5 లక్షలు పరిహారం అందుతుంది. మొదటి సంవత్సరంలోనూ ఇదే విధానం అమలు చేశారు.

* పూర్తి వైక్యల్యం సంభవిస్తే మునుపటిలాగానే రూ.5 లక్షల పరిహారం దక్కుతుంది. పాక్షిక వైకల్యం పొందిన కార్మికులకు రూ.2.50 లక్షల పరిహారమే అందుతుంది. కిందటి సంవత్సరం ఇది రూ.3.62 లక్షలుగా ఉండేది.

* 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు రూ.1,200 ఉపకార వేతనం అందించనున్నారు.

7 లక్షల మందికి అదనంగా ప్రయోజనం

అక్టోబరు 2 నుంచి ఈ పథకం రెన్యువల్‌ అవుతుంది. రెండో సంవత్సరంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య మరో 7లక్షలు పెరిగి... 2.20 కోట్లకు చేరవచ్చని కార్మికశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కార్మికశాఖ వద్ద విస్తృతమైన డేటాబేస్‌ సిద్ధంగా ఉంది. అందులో నుంచి 70 ఏళ్లు దాటిన వారిని తొలగించి...17 ఏళ్లు నిండిన కొత్త యువతరాన్ని చేర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం 70 ఏళ్లు దాటి ఈ పథకం నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య కన్నా 17 ఏళ్లు నిండి కొత్తగా చేరే వారి సంఖ్యే ఎక్కువని అధికారులు వివరిస్తున్నారు. ఇలా మొత్తం 5 లక్షల మంది వరకు పెరుగుతారని, కిందటి సంవత్సరం వివిధ కారణాల వల్ల ఈ పథకం పరిధిలోకిరాని మరో 2 లక్షల మంది కూడా చేరతారని అంచనా వేస్తున్నారు. కార్మిక బీమా పథకాలకు ఎల్‌ఐసీని మాత్రమే ఏజెన్సీగా ఎంపిక చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీమియం కింద దాదాపు రూ.320 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది దాదాపు రూ.500 కోట్ల వరకు కార్మికులకు బీమా రూపంలో దక్కినట్లు తెలిపారు.

  • 4 weeks later...
  • 2 months later...
Posted

అసంఘటిత కార్మికుల భద్రత కొరకు ప్రవేశపెట్టిన చంద్రన్న భీమా పథకం న భూతో, న భవిషత్ అనే చెప్పాలి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఇలా భద్రత కొరకు ఒక పథకం పెట్టి వాళ్ల కుటుంబాలను అదుకోలేదు.
‌ఈ రోజు నందవరం మండలంలో చనిపోయిన చంద్రన్నభీమా పాలసీ దారులకు 15 లక్షల 90000 రూపాయల ప్రొసీడింగ్స్ పంపిణీ చేయటం జరిగింది. కనకవీడు గ్రామంలో ఉరుము పడి చనిపోయిన నరసింహులు గౌడ్ కుటుంబానికి 5 లక్షలు, సోమలగూడూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ సలాం కుటుంబానికి 2 లక్షలు, ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన మాదిగ తోటమ్మ కుటుంబానికి 2 లక్షలు, అదే గ్రామానికి చెందిన బోయ నాగమ్మ కుటుంబానికి 2 లక్షలు, నందవరం కి చెందిన చెంచు నాగమ్మ కుటుంబానికి 2 లక్షలు, మిట్టసోమాపురం గ్రామానికి చెందిన ఆరేకంటి ఇస్మాయిల్ కుటుంబానికి 30000, మూగతి గ్రామానికి చెందిన బడేసాబ్ కుటుంబానికి 30000, అదేగ్రామానికి చెందిన దొమ్మరి పాండురంగడు కుటుంబానికి 30000, తెలుగు మంగమ్మ కుటుంబానికి 2 లక్షల చెక్కులు ఇవ్వటం జరిగింది.

https://scontent-iad3-1.xx.fbcdn.net/v/t31.0-8/25586750_136232827093446_4356881681366564802_o.jpg?oh=e0f99175959eb886918cda2d623a7caa&oe=5AC988D1

  • 1 month later...
  • 2 months later...
Posted

రాజంపేటలో ఇటీవల రోడ్డు, రైలు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరికీ చంద్రన్న బీమా పథకం కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి పంపిణీ చేశారు.

ఇటీవల రైలు కింద పడి చనిపోయిన గుండ్లూరు గ్రామానికి చెందిన కోడూరు చలపతి కుటుంబానికి రూ. 5,00,000

https://pbs.twimg.com/media/DbcyL44U0AASVkl.jpg

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...