Jump to content

APIIC industrial park in Mallavalli,Verpanenigudam


sonykongara

Recommended Posts

  • Replies 240
  • Created
  • Last Reply
  • 2 weeks later...
అశోక్‌ లేలాండ్‌కు 50ఎకరాలు
11-10-2017 02:40:45
 
అశోక్‌ లేలాండ్‌ కంపెనీ అనుబంధ యూనిట్ల స్థాపనకు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఎకరాకు రూ.16.5 లక్షల వంతున 50 ఎకరాలు, ఆర్‌వీఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు 25 ఎకరాలు కేటాయించారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎంఅండ్‌ హెచ్‌సీవీ ఉత్పాదక ప్రాజెక్టు ఏర్పాటుకు అశోక్‌ లేలాండ్‌ కంపెనీకి పదేళ్లపాటు ప్రత్యేక ప్రోత్సాహకాలకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 100 శాతం నెట్‌ ఎస్జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం ఉంటుంది. ప్రాజెక్టులో నియమించే ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఇందుకు ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేలు చెల్లిస్తారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం గుర్రపాలెం గ్రామంలోని సర్వే నెంబర్‌ 157, 174 వగైరాలలోని 247.37 ఎకరాలను ఇండస్ర్టియల్‌ పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయించారు.
 
కడప జిల్లా రైల్వే కోడూరులో సర్వే నంబరు 2085/1లోని 17.74 ఎకరాల భూమిని ఇండస్ర్టియల్‌ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి కేటాయించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో సర్వే నంబరు 274/5, 274/8లోని 17.63 ఎకరాల భూమిని ఇండస్ర్టియల్‌ పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి అప్పగించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమ్మిలిలో సర్వే నంబరు 1/1పిలోని 11 ఎకరాల భూమిని విజయనగరం జిల్లా తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌కు అప్పగించేందుకు కేబినెట్‌ ఆమోదించింది.
Link to comment
Share on other sites

  • 1 month later...

     

అమరావతిలో మెగా ఫుడ్‌పార్క్‌
21-11-2017 07:30:11

    ఆన్‌లైన్‌లో వేకెంట్‌ ప్ల్లాట్ల వివరాలు
     99 ఏళ్ళ లీజు ప్రాతిపదికన కేటాయింపు
    ఎకరం రూ.42లక్షలుగా నిర్ణయం
     మొత్తం 33ప్లాట్లు.. 1.11 లక్షల స్క్వేర్‌ మీటర్లు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణాజిల్లా మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్క్‌ సర్వసన్నద్ధమైంది. పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు ఏపీ ఇండస్ర్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) విజయవాడ జోన్‌ అధికారులు ప్లాట్ల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. కేంద్రప్రభుత్వ ప్రతిష్ఠాత్మక మెగా ఫుడ్‌పార్క్‌కు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యమై కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో 100 ఎకరాలలో ఫుడ్‌పార్క్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో కేంద్రపార్ట్‌కు సంబంధించి మొత్తం 57.45 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వ పార్ట్‌కు సంబంధించి 42.55 ఎకరాలను లే అవుట్‌ వేసి ప్లాట్లుగా అభివృద్ధి చేయటం జరిగింది. ప్రస్తుతం ఇందులో కేంద్ర ప్రభుత్వ పార్ట్‌కు సంబంధించి 57.45 ఎకరాలకు సంబంధించిన ప్లాట్ల వివరాలను ఏపీఐఐసీ అధికారులు ఆన్‌లైన్‌లో ముందుగా పొందు పరిచారు. ఈ మొత్తం విస్తీర్ణంలో ప్లాట్ల విస్తీర్ణం 29.63 ఎకరాలు మాత్రమే ఉంది. మిగిలిన భూములలో రోడ్లు 9.19 ఎకరాలు, ఓపెన్‌ స్పేస్‌, సదుపాయాలకు సంబంధించి 12 ఎకరాలు, సెంట్రల్‌ ప్రాసెస్‌ సెంటర్‌ (సీపీఎ్‌స)లకు సంబంధించి 6.32 ఎకరాలు పోతోంది. మిగలిన 29.63 ప్లాట్ల ఏరియాకు సంబంధించిన వాటినే ఏపీఐఐసీ అధికారులు ఆన్‌లైన్‌లో పెట్టారు. మొత్తం 33 ప్లాట్లకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టారు. మొత్తంగా 1,11, 426 స్క్వేర్‌ మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ల వివరాలను ఆన్‌లైన్‌లో పొందు పరిచారు. కనిష్టంగా 1200 స్క్వేర్‌ మీటర్ల నుంచి గరిష్టంగా 8328 స్క్వేర్‌ మీటర్ల విస్తీర్ణంలో ఉండే విధంగా ప్లాట్ల సైజులను నిర్ణయించటం జరిగింది. సగటున 1257, 1259, 2686, 2994, 3365, 3487, 4188, 4652, 4737, 4793, 5120, 5128, 5135, 5526, 6421, 6647, 8140 స్క్వేర్‌ మీటర్ల మేర ప్లాట్ల సైజులను నిర్ణయించారు. ఈ ప్లాట్లలో ఎస్టీ వర్గాలకు 6 , ఎస్సీ వర్గాలకు 2 చొప్పున కేటాయించటం జరిగింది. మిగిలినవి జనరల్‌ కేటగిరిలో ఉంచారు. ఒక ఆరు ప్లాట్లను మాత్రం ఖాళీగా ఉంచినప్పటికీ కేటాయించలేమని ఆన్‌లైన్‌లో సూచించటం జరిగింది. హైకోర్టు కేసులో ఉండటంతో వీటికి సంబంధించిన వివరాలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తెలుసుకునేందుకు పొందు పరిచినా.. వాటిని కేసు తేలే వరకు కేటాయించే అవకాశం లేదు. ఈ ఆరింటిలో కొన్ని షెడ్యూల్‌ తెగలు, కులాలకు సంబంధించినవి ఉన్నాయి.
 
99 ఏళ్ల పాటు లీజు
మెగా ఫుడ్‌ పార్క్‌ కేంద్ర ప్రభుత్వ పార్ట్‌కు సంబంధించిన ప్లాట్లు కావటంతో ఏపీఐఐసీ అధికారులు కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్లాట్లను అమ్మటానికి అంగీకరించటం లేదు. కేవలం లీజు ప్రాతిపదికనే నిర్ణయించటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ లీజులు అన్నీ 99 ఏళ్ళ ప్రాతిపదికన ఉంటాయి. మెగా ఫుడ్‌పార్క్‌ కేంద్ర పార్ట్‌ ప్లాట్లను కూడా 99 ఏళ్ళ లీజు ప్రాతిపదికన అప్పగించటానికి ఏపీఐఐసీ అధికారులు నిర్ణయించారు.
 
ఎకరం రూ.42 లక్షలు
ఏపీఐఐసీ అధికారులు అభివృద్ధి చేసిన ప్లాట్లకు సంబంధించి ఎకరం రూ. 42 లక్షల విలువుగా నిర్ణయించటం జరిగింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఎంత విస్తీర్ణంలో ప్లాట్లను లీజుకు తీసుకుంటారో ఆ ప్రాతిపదికన అంత విలువను పొందిన వారిగా పరిగణిస్తారు. ఒక ఎకరానికి 1070 స్క్వేర్‌ మీటర్ల విస్తీర్ణం ఉంటుంది. 

Link to comment
Share on other sites

చంద్రబాబుతో సీఎండీ భేటీ.. ఏపీలో అశోక్ లేల్యాండ్ బస్సు ప్లాంట్..
29-11-2017 21:05:19
 
636475863201968188.jpg
అమరావతి: సీఎం చంద్రబాబుతో అశోక్ లేల్యాండ్ సీఎండీ వినోద్ కె.దాసరి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై చంద్రబాబుతో వినోద్ చర్చించారు.
ఏపీలో అశోక్ లేల్యాండ్ బస్సు ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు అశోక్ లేల్యాండ్ సీఎండీ ముందుకొచ్చారు. కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో బస్సు ప్లాంట్, ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వినోద్ తెలిపారు. 75 ఎకరాల భూమి కేటాయించాలని సీఎం చంద్రబాబుకు అశోక్ లేల్యాండ్ సీఎండీ వినోద్ కే దాసరి విజ్ఞప్తి చేశారు. బస్సు ప్లాంట్ ఏర్పాటు ద్వారా 5వేల మందికి ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బస్సు ప్లాంట్‌లోనే నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Link to comment
Share on other sites

మల్లవల్లి మెగా మోడల్‌ ఇండ స్ర్టియల్‌ కారిడార్‌ రెడీ
01-12-2017 07:10:40
 
636477090420839539.jpg
  •   939 ప్లాట్లతో లే అవుట్‌ సిద్ధం
  •  28,18,452 చదరపు మీటర్ల మేర ప్లాట్ల విస్తీర్ణం
  •  ఆన్‌లైన్‌లో ప్లాట్ల వివరాలు ఉంచిన ఏపీఐఐసీ
  •  భారీ పరిశ్రమలు, అసోసియేషన్లు, ఎంఎస్‌ఎంఈలకు తొలి కేటాయింపు
 
(ఆంద్రజ్యోతి, విజయవాడ): అమరావతి రాజధాని ప్రాంతంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం మరో మెగా ఇండస్ర్టియల్‌ కారిడార్‌ సిద్ధమైంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో 1,260 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మెగా మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ లే అవుట్‌ రూపుదిద్దుకుంది. అమరావతి రాజధానికే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే భారీ పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు ఈ మెగా మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ వేదిక కాబోతోంది. వారం రోజుల కిందట ఇదే మల్లవల్లిలో దీనిని ఆనుకుని రూపుదిద్దుకున్న 100 ఎకరాల మెగా ఫుడ్‌ పార్క్‌కు సంబంధించి 52 ఎకరాల లే అవుట్‌ను పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతూ ఏపీఐఐసీ ఆన్‌లైన్‌లో ప్లాట్ల వివరాలను పొందుపరిచింది. ఇది గడిచి వారం రోజులు కూడా కాకముందే మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ను ఏపీఐఐసీ సిద్ధం చేసింది. మొత్తం 939 పారిశ్రామిక ప్లాట్లకు సంబంధించి లే అవుట్‌ వేసింది. ఈ ప్లాట్ల విస్తీర్ణం చూస్తే మొత్తం 28,18,452 చదరపు మీటర్లుగా ఉంది. మల్లవల్లి మెగా మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో ప్లాట్లు ఆన్‌లైన్‌లో అయితే పెట్టారు కానీ, దాదాపుగా ఇవి హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. భారీ పరిశ్రమలు, అసోసియేషన్లు, ఎంఎస్‌ఎంఈ యూనిట్లు, ఎస్సీ, ఎస్టీ రిజర్వు ప్లాట్లు పోను మిగిలేవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ లే అవుట్‌లో భారీ పరిశ్రమలకు 50 నుంచి 100 ఎకరాల ప్లాట్లను, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం ఎకరం నుంచి 30 ఎకరాల లోపు ప్లాట్లను సిద్ధం చేశారు. అసోసియేషన్ల తరపున ముందుగా కమిట్‌మెంట్‌ వాటి కోసం 500 చదరపు మీటర్ల నుంచి 10 వేల చదరపు మీటర్ల వరకు కూడా ప్లాట్లను విభజించింది.
 
భారీ పరిశ్రమలకు వెల్‌కమ్
మల్లవల్లి మెగా మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో భారీ పరిశ్రమలకు సంబంధించి దాదాపుగా 500 ఎకరాల వరకు సంసిద్ధంగా ఉంచారు. అశోక్‌ లేల్యాండ్‌ సంస్థకు సంబంధించి బస్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌కు 100 ఎకరాలు, మోహన్‌ స్పిన్‌టెక్స్‌కు 50 ఎకరాలు, గోల్డ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు 30 ఎకరాలు, జాతీయ రహదారుల సంస్థ ఏర్పాటు చేసే లాజిస్టిక్స్‌ పార్క్‌కు 6,07,500 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించటం జరిగింది. హెరిటేజ్‌కు 40,460 చదరపు మీటర్ల స్థలాన్ని రిజర్వు చేశారు. ఇంకా పలు ఫార్మా కంపెనీలు, భారీ స్పిన్నింగ్‌ మిల్లులు, టెక్స్‌టైల్స్‌ ఇండస్ర్టీస్‌కు కూడా కేటాయించటం జరిగింది. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా అనేక భారీ పరిశ్రమలు కూడా ఇక్కడ తమ శాఖలను ఏర్పాటు చేయటానికి ఏపీఐఐసీకి లేఖలు రాశాయి. వీటిపై ఏపీఐఐసీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
 
అసోసియేషన్లకు భారీగా కేటాయింపు
సగం ప్లాట్ల నిడివి భారీ పరిశ్రమలకు కేటాయింపు పోగా మిగిలిన సగంలో తొంభై శాతం పరిశ్రమల అసోసియేషన్లు, ఎంఎస్‌ఎంఈ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేశారు. అసోసియేషన్లకు సంబంధించి చూస్తే.. భారీగా వీటికే ప్లాట్లను కేటాయించారు. నవ్యాంధ్ర ఇండస్ర్టియల్‌ అసోసియేషన్‌, ఎంఎస్‌ఎంఐడీ అసోసియేషన్‌, స్వర్ణాంధ్ర ఇండస్ర్టియల్‌ అసోసియేషన్‌, మల్లవల్లి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌, సీఓడబ్లూ వంటి సంస్థలకు మూడొంతుల ప్లాట్లను కేటాయించగా.. మిగిలిన వాటిలో ఎంఎస్‌ఎంఈకి కేటాయించటం జరిగింది.
తుది లే అవుట్‌ రావాల్సి ఉన్నందున కొన్ని ప్లాట్లపై అనుమానం ఉన్న ఏపీఐఐసీ అధికారులు వాటిని కేటాయించలేని జాబితాలో చూపించింది. మార్ట్‌గేజ్‌ను దృష్టిలో ఉంచుకుని తుది లే అవుట్‌ను దృష్టిలో ఉంచుకుని వీటిని కేటాయించటం జరుగుతుంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
మల్లవల్లి.. మెల్లగా
20-12-2017 07:17:24
 
636493510524021466.jpg
రాజధాని ప్రాంతంలో పారిశ్రామిక జోన్‌గా భారీ అంచనాలు ఉన్న ‘మల్లవల్లి’ పై నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అంతగా ఆసక్తి కనిపించటం లేదు. మెగా ఫుడ్‌ పార్క్‌లో పారిశ్రామిక యూనిట్ల కోసం కేవలం ఆరు దరఖాస్తులు మాత్రమే రాగా.. ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌కు 132 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న మల్లవల్లి విషయంలో ఎందుకిలా జరుగుతోందన్నది చర్చనీయాంశంగా మారుతోంది.
  •  ఫుడ్‌పార్క్‌కు కేవలం 6 దరఖాస్తులు..
  •  ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం 132
  •  మల్లవల్లిలో అసోసియేషన్ల పేరుతో అలాట్‌మెంట్‌
  •  అందవనే భావనలో నూతన పారిశ్రామికవేత్తలు
  •  కొందరిదేనన్న ముద్ర నుంచి బయటకు రావాలి
  •  అపోహలు తొలగించాల్సింది ప్రభుత్వమే!
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): మల్లవల్లిలోని మెగాఫుడ్‌ పార్క్‌, ఇన్నో వేటివ్‌ మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఖాళీ ప్లాట్ల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టి పక్షం రోజులు గడిచినా నూతన ఔత్సాహికుల నుం చి ఆశించిన స్పందన లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏపీఐఐసీ అధికారులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మల్లవల్లి కొందరిది మాత్రమే కాదని.. అందరిదన్న భావన కలిగించకపోతే నష్టపోవాల్సి ఉంటుందని గ్రహించాల్సిన అవ సరం ఉంది. అసోసియేషన్ల ముసుగులో గంపగుత్తుగా అలాట్‌మెంట్‌లు చేయటం, ఫలానా కేటగిరీ వారికే అని నిర్దేశించటం కొంప ముంచుతోంది. మల్లవల్లిలో మొత్తం 1,360 ఎకరాల్లో 100 ఎకరాలు మెగా ఫుడ్‌పార్క్‌కు, 1260 ఎకరాలు ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌కు కేటాయించారు. మెగా ఫుడ్‌పార్క్‌ లే అవుట్‌ వేసి ఇందులో కేంద్ర ప్రభుత్వ పోర్షన్‌ 1,03,286 చదరపు మీటర్ల స్థలంలో మొత్తం 32 ప్లాట్ల వివరాలను నెల రోజుల కిందట ఏపీఐఐసీ అధికారులు ఆన్‌లైన్‌లో పెట్టారు. ఇంకా స్టేట్‌ పార్ట్‌ ప్లాట్లను పెట్టాల్సి ఉంది. మెగా ఫుడ్‌పార్క్‌ ఏర్పాటుకు ముందు ఉన్న ఆసక్తి ఇది ఏర్పాటైన తర్వాత కనిపించటం లేదు. మల్లవల్లిలోని ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ 30,10,626 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొత్తం 962 ప్లాట్ల వివరాలను పక్షం రోజుల కిందట ఆన్‌లైన్‌లో పెట్టారు.
స్పందన నామమాత్రం..
ఏపీఐఐసీ అధికారులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన ప్లాట్లను చూసి నూతన ఔత్సాహికుల నుంచి అనూహ్య స్పం దన వస్తుందని భావిస్తే కేవలం 132 దరఖాస్తులు మాత్రమే వ చ్చాయి. వీరిలో నూతన ఔ త్సాహికుల శా తం కూడా త క్కువగానే ఉన్నట్టు సమాచారం. ఇలా ఆన్‌లైన్‌లో పెట్టగానే అలా దర ఖాస్తుల వెల్లవ వస్తుందనుకుంటే పరిస్థితి భిన్నంగా ఉండటం చూస్తే.. ఔత్సాహికులను ఆకర్షించే విధంగా మల్లవల్లిని ప్రమోట్‌ చేయలే దనిపిస్తోంది. మల్లవల్లికి ముందు వీరపనేనిగూడెంలో 76 ఎకరాల్లో అభి వృద్ధి చేసిన మోడల్‌ ఇండస్ర్టియల్‌ పా ర్క్‌ను గంపగుత్తగా అమరా వతి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌కు కేటాయిం చారు. ఒక రకంగా చెప్పాలంటే అమరావతి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌ కోసమే.. వీరపనేనిగూడెంలో భూ ములను సేకరించారు. ప్రస్తుతం కేటాయించగా ఇంకా అమరావతి ఇం డస్ర్టీస్‌ అసో యేషన్‌కు భూ ములను సేక రించాల్సి వస్తోంది. వీర పనేనిగూడెం కారిడార్‌లో అమరావతి ఇండస్ర్టీస్‌ అసో సియేషన్‌కు కేటాయించిన భూ ముల్లో ఇప్పటి వరకు పరిశ్రమల ఏర్పాటు దిశగా జరుగుతున్న చర్యలు శూన్యం. ఈ క్రమంలోనే మల్లవల్లి ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ భూముల వివరాలను ఆన్‌లైన్‌లో పొం దుపరిచారు. వీరపనేనిగూడెం విషయంలో పూర్తిగా అసోసియేషన్లకే ఇస్తున్నారన్న ముద్ర ఎలా పడిపోయిందో.. మల్లవల్లి ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌కు కూడా దాదాపుగా అదే ముద్ర పడిపోయింది. కనీసం ఈ ముద్ర పడకుండా జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే బాగుండేది.
ఎంతవరకు సమంజసం?
మల్లవల్లి ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో మొత్తం 962 ప్లాట్లకు సంబంధించి చూస్తే. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే ప్లాట్లుగా 224 వరకు చూపించారు. బల్క్‌ అలాట్‌మెంట్‌గా ఏడింటిని, అసోసియేషన్లకు ఎలాట్‌మెంట్‌గా 306 ప్లాట్లను, ఇతరులకు అలాట్‌మెంట్‌గా 75 ప్లాట్లను వర్గీకరించారు. మొత్తం 962 ప్లాట్లలో నూతన ఔత్సాహికులు దృష్టి సారించగలిగేది 75 ప్లాట్లపైనే. ఎస్సీ, ఎస్టీ కోటాలో ఉన్న ప్లాట్లకు కూడా అవకాశం ఉంది. బల్క్‌ అలాట్‌మెంట్‌ పేరుతో భారీ పరిశ్రమల కోసం కొంత రిజర్వు చేశారు. కొంతమంది హైదరాబాద్‌ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అసోసియేషన్ల ముసుగులో ప్రభుత్వాన్ని, ఏపీఐఐసీ అధికారులను సంప్రదించటం జరుగుతోంది. ఇంకా అసోసియేషన్లను ఆహ్వానించటానికి వారి కోసం ప్లాట్లను రిజర్వు చేసి పెట్టి ఉంచటం ఎంతవరకు సమంజసమో ఏపీఐఐసీ అధికారులకే తెలియాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం సింహభాగం అసోసియేషన్లకే కాకుండా.. నూతన ఔత్సాహికుల కోసం సింగిల్‌గా కూడా అవకాశం కల్పించటానికి అదనంగా ఒక కేటగిరీ చేసి ఉంటే బాగుండేది. ఇతరుల కేటగిరీలో ఇప్పటికే పారిశ్రామికవేత్తలుగా ఉన్నవారే పోటీలు పడటం గమనార్హం. ఇలాంటి క్రమంలో నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆసక్తి ఉన్నా.. మల్లవల్లిలో తమకు ప్లాట్లు దక్కవేమోనన్న అభద్రతా భావంతో ఉన్నారు. దీనిని తొలగించటానికి తక్షణం అటు ప్రభుత్వం, ఇటు ఏపీఐఐసీ అధికారులు కృషి చేయాల్సి ఉంది. ఇక మెగా ఫుడ్‌ పార్క్‌ విషయానికి వస్తే ఔత్సాహికుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉండటానికి భూముల ధరలు కూడా కొంత వరకు కారణం అవుతోంది.
ఏమిటీ వ్యత్యాసం?
మల్లవల్లిలో ఒకే దగ్గర ఉన్న భూములకు వేర్వేరు ధరలను నిర్ణయించటమే హాస్యాస్పదంగా ఉంది. పారిశ్రామికవేత్తలతో కూడిన అసోసియేషన్లకు ఎకరం 16.50 లక్షలకే ఔట్‌రేట్‌ సేల్‌ కింద ఇవ్వటానికి నిర్ణయించారు. అదే మెగా ఫుడ్‌ పార్క్‌లో మాత్రం ఎకరం రూ.42 లక్షలుగా ఉంది. ఽఈ వ్యత్యాసం ఔత్సాహిక పారిశ్రామి కవేత్తలలో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు కాబట్టి మల్ల వల్లి కొంద రిది కాదని.. అందరిదన్న నమ్మకాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది.
Link to comment
Share on other sites

ప్రభుత్వ ప్రోత్సాహకాలు
ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా మల్లవల్లి సమీపంలోని మిర్జాపురంలో అశోక్‌ లేలాండ్‌ కంపెనీ నెలకొల్పే బస్‌ బాడీ, ఛాసిస్‌ తయారీ ప్రాజెక్టుకు పలు ప్రోత్సాహకాలను అందిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీ పెట్టుబడులపై వస్తు సేవల పన్ను 100 శాతాన్ని పదేళ్ల వరకూ మినహాయింపు ఇచ్చారు. శిక్షణనిచ్చి ఉద్యోగం కల్పించేందుకు అయ్యే వ్యయంలో ఒక్కో అభ్యర్థిపై రూ.10వేల చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది.
డీఈఈలకు ఈఈలుగా పదోన్నతి 
ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖలో పదోన్నతులు పొందిన 252 మంది ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లను (డీఈఈ) వివిధ ప్రాంతాల్లో కార్యనిర్వాహక ఇంజినీర్లుగా (ఈఈ) నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Link to comment
Share on other sites

మల్లవల్లికి బై..బై!
01-01-2018 02:12:35

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన లేనట్టే
వెనుదిరుగుతున్న హైదరాబాద్‌ పారిశ్రామికవేత్తలు
పరిశ్రమల స్థాపనకు 450 ఎంఎస్‌ఎంఈల ఒప్పందం
రెండేళ్లుగా ఎంఎస్‌ఎంఈలకు జరగని భూకేటాయింపులు
అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మల్లవల్లి ఇన్నోవేటివ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో పరిశ్రమల స్థాపన ఇప్పట్లో కార్యరూపం దాల్చేలా లేదు. ఇక్కడ చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ ఎంఈ)లను ఏర్పాటు చేసేందుకు ముంకొచ్చిన హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు పునరాలోచనలో పడ్డారు. అధికారుల తీరుతో విసిగి వేసారిన వీరు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
 
విశాఖలో 2016, 2017లో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుల్లో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నిర్వహిస్తున్న పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వారిలో 425 మంది పరిశ్రమల శాఖ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థలతో మల్లవల్లి పారిశ్రామిక పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నారు.
 
ఒప్పందాలు చేసుకుని రెండేళ్లు గడుస్తున్నా భూకేటాయింపులు జరగకపోవడంతో విసుగు చెంది, పరిశ్రమల ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలన్న యోచనకు వారు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని సీఎం చంద్రబాబు దేశవిదేశాల్లోని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
 
ఆయన పిలుపునకు స్పందించి హైదరాబాద్‌కు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. 450 సూక్ష్మ, చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చారు. తమకు భూమి కేటాయిస్తే తక్షణమే కార్యకలాపాలను ప్రారంభిస్తామని, రూ.1100 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని చెప్పారు. వాస్తవానికి ఈ ఒప్పందాల కాలపరిమితి ఏడాది మాత్రమే. ఈలోగానే పరిశ్రమలను స్థాపించడం.. కార్యకలాపాలను చేపట్టడం జరిగిపోవాలి. కానీ అలా జరగలేదు.
 
పరిశ్రమల యాజమాన్యాలు మల్లవల్లి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌, నవ్యాంధ్రా ఇండస్ట్రియల్‌ ఆసోసియేషన్‌, స్వర్ణాంధ్ర ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌, మల్లవల్లి స్మాల్‌ అండ్‌ మీడియం ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌ పేరిట సంఘాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ అసోసియేషన్ల పరిధిలోని పారిశ్రామికవేత్తలకు మల్లవల్లి ఇన్నోవేటివ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో భూములు కేటాయించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ)కు పరిశ్రమల శాఖ అప్పగించింది. మల్లవల్లిలో ఎకరాకు రూ.16.50 లక్షల చొప్పున ధరను నిర్ణయించి కేటాయించాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. అప్పటి నుంచే పారిశ్రామికవేత్తలకు కష్టాలు మొదలయ్యాయి.
 
అప్పటిదాకా ఎకరా రూ.36 నుంచి 42 లక్షల దాకా ఉన్న భూముల ధరలు అమాంతం తగ్గడంతో డిమాండ్‌ బాగా పెరిగింది. గత రెండేళ్లుగా తమ కార్ల టైర్లు అరిగిపోయేలా హైదరాబాద్‌ నుంచి అమరావతికి.. అమరావతి నుంచి హైదరాబాద్‌కు ఎంఎస్ ఎంఈలు తిరిగారు. వీరికి 133 ఎకరాలను మాత్రమే కేటాయిస్తామని ఏపీఐఐసీ తొలుత చెప్పింది. తాజాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. ఒక్కో సంస్థకు 500 గజాలు మాత్రమే ఇస్తామని చెబుతోంది. పరిస్థితిని మంత్రి ఎన్‌.అమర్నాథ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇక తిరిగే ఓపిక తమకు లేదంటూ హైదరాబాద్‌ శివారు ప్రాంత ఎంఎ్‌సఎంఈలు భావించి, మల్లవల్లి ఆలోచనకు గుడ్‌బై చెప్పాలన్న నిర్ణయానికి వచ్చాయి.

Link to comment
Share on other sites

 రోజుల్లో భూములు కేటాయిస్తాం
03-01-2018 01:52:12
హైదరాబాద్‌ శివారు పరిశ్రమలకు ఏపీఐఐసీ హామీ
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ శివారులోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు పదిరోజుల్లో మల్లవల్లి ఇన్నోవేషన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో భూములు కేటాయిస్తామని ఏపీఐఐసీ హామీ ఇచ్చింది. హైదరాబాద్‌ శివారు ఎంఎస్ ఎంఈలతో 2016, 2017లలో విశాఖలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుల్లో పరిశ్రమల శాఖ, ఆర్థికాభివృద్ధి సంస్థలు ఒప్పందాలు చేసుకున్నా...ఆచరణలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. దాదాపు 450 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మల్లవల్లికి తరలివచ్చి రూ.1100 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో సహా...సుమారు 16 వేల మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చాయి.
 
ఈ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాల్సిన పరిశ్రమల శాఖ అధికారులు..అందుకు భిన్నంగా వ్యవహరించడంపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలను ప్రచురించింది. అధికారుల తీరుతో అసంతృప్తికి గురైన హైదరాబాద్‌ శివారు ఎంఎ్‌సఎంఈలు...మల్లవల్లి ఇన్నోవేషన్‌ పారిశ్రామిక పార్కుకు గుడ్‌బై చెప్పాలన్న యోచనకు వచ్చాయి.
 
దీనిపైనా ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌.అమర్నాథరెడ్డి స్పందించారు. సమస్య పరిష్కారమయ్యేలా చూడాలంటూ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రీతమ్‌ను ఆదేశించారు.
 
దీంతో..సమస్యలను పరిష్కరించుకుందామంటూ ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు సుబ్బారావు, శ్యామ్‌... ఎంఎస్ ఎంఈలను ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం విజయవాడ ఏపీఐఐసీలో సమావేశం జరిగింది. రెండు రోజుల్లో డీపీఆర్‌లను ఆన్‌లైన్‌లో సమర్పిస్తే... వాటిని పరిశీలించి అర్హతను బట్టి భూములను 10 రోజుల్లో కేటాయిస్తామని ఈడీలు హామీ ఇచ్చారు.
 
ఇదిలావుండగా, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కథనాలు ప్రచురించి శాశ్వత పరిష్కారాన్ని చూపిందంటూ హైదరాబాద్‌ శివారు ఎంఎ్‌సఎంఈ ప్రతినిధులు జీఎన్‌వీ చౌదరి, పున్నయ్య, శ్రీనివాస్‌, మురళీకృష్ణ ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

Link to comment
Share on other sites

మల్లవల్లి ఫుడ్‌పార్క్‌కు.. మరో మణిహారం
07-01-2018 08:09:22

రూ.80 కోట్లతో కామన్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న మనీష్‌ ఫ్లోర్‌ మిల్స్‌
ఫుడ్‌ పార్కులోకి వచ్చే పరిశ్రమలన్నింటికీ ఉపయోగం 
త్వరలో శంకుస్థాపన
విజయవాడ (ఆంధ్రజ్యోతి): మల్లవల్లి మెగా ఫుడ్‌పార్క్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల అవసరాల కోసం కామన్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ) ఏర్పాటుకు రంగం సిద్ధమైది. రూ.80 కోట్ల వ్యయంతో ఇది ఏర్పాటుకానుంది. సీపీసీ ఏర్పాటుకు ఏపీఐఐసీ పిలిచిన టెండర్లలో పాలు పంచుకున్న మనీష్‌ ఫ్లోర్‌ మిల్స్‌ సంస్థ దీని నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను దక్కించుకుంది. కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి హర్‌ శిమ్రత్‌కౌర్‌తో దీనికి శంకుస్థాపన చేయాలనుకున్నప్పటికీ ఆమె రాకపై స్పష్టత లేకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిపించాలని ఏపీఐఐసీ భావిస్తున్నట్టు సమాచారం. కామన్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ) రాకతో మెగా ఫుడ్‌పార్కుకే కళ రాబోతోంది. మెగా ఫుడ్‌ పార్కులో కేంద్ర ప్రభుత్వ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ పోర్షన్‌కు సంబంధించి ఇప్పటికే ఏపీఐఐసీ అధికారులు ఆన్‌లైన్‌లో ప్లాట్ల వివరాలు పెట్టారు. పలు సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఆయా సంస్థలను పిలిచి ప్రతినిధి బృందాలతో చర్చలు జరపాల్సి ఉంది.
 
 
ఫుడ్‌ పార్క్‌కే తలమానికం..
సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ) అనేది మెగా ఫుడ్‌ పార్కుకే తలమానికం. మెగా ఫుడ్‌ పార్కులో వివిధ ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆహార అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఈ పరిశ్రమలన్నింటికీ కామన్‌గా ఉండే అవసరాలు కొన్ని ఉంటాయి. వాటి కోసమని ఖరీదైన యంత్ర సామాగ్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. సీపీసీ సేవలను తీసుకుంటే సరిపోతుంది. దీనిలో జ్యూస్‌ ఎక్సకవేటర్లు ఉంటాయి. ఆహార ఉత్పత్తులను ప్యాకింగ్‌ చేసే యూనిట్‌, ఆహార ఉత్పత్తులను భద్రంగా ఉంచటానికి వేర్‌ హౌసింగ్‌, ఆహార ఉత్పత్తులను నిల్వ ఉంచటానికి కోల్డ్‌స్టోరేజ్‌, ఫ్యాక్టరీ షెడ్లు వంటివి ఉంటాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటే కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది. అదేదో కామన్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంటే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. మనీష్‌ ఫ్లోర్‌ మిల్స్‌ వారు దీనిని నిర్మించటంతో పాటు మూడు సంవత్సరాల పాటు దీని నిర్వహణ కూడా చేపడతారు. ఈ సంస్థద్వారా సేవలు పొందాలనుకునే యూనిట్ల నుంచి స్వల్పంగా యూజర్‌ ఛార్జీలను ఈ సంస్థ వసూలు చేస్తుం

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...