Jump to content

APIIC industrial park in Mallavalli,Verpanenigudam


sonykongara

Recommended Posts

  • Replies 240
  • Created
  • Last Reply
  • 3 weeks later...
కొరియా రవాణారంగ నిర్వహణపై అధ్యయనం

ఈనాడు, అమరావతి: రవాణారంగ (లాజిస్టిక్స్‌) పార్కుల నిర్వహణలో దక్షిణ కొరియా సాధిస్తున్న విజయాలను అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎండీ ఏ.బాబు ఆ దేశంలో పర్యటిస్తున్నారు. భారత జాతీయ రహదారుల సంస్థ సహకారంతో దేశంలో తొలిసారి విజయవాడ వద్ద 150 ఎకరాల్లో భారీ లాజిస్టిక్స్‌ పార్కును ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వాటిపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం దక్షిణ కొరియాకు ఒక బృందాన్ని పంపింది. ఎన్‌హెచ్‌ఏఐ సభ్యురాలు, సీనియర్‌ ఐఏఎస్‌ వీణాఈశ్‌ నేతృత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారుల బృందం సియోల్‌లో పర్యటిస్తోంది. బుసాన్‌ రేవులో సరకు రవాణా వ్యవస్థను ఈ బృందం పరిశీలించింది. లాజిస్టిక్స్‌ పార్కుల నిర్వహణలో దక్షిణ కొరియా విధానాలు ఆదర్శప్రాయమని ఏపీఐఐసీ ఎండీ బాబు తెలిపారు. ఆ దేశ రాజధాని సియోల్‌ నుంచి ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ కేవలం లాజిస్టిక్స్‌ పార్కుల గురించే కాకుండా పరిశ్రమల ఏర్పాటుకు దక్షిణ కొరియాలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారో అధ్యయనం చేస్తున్నామని అన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

పారిశ్రామిక ప్రగతి కోసం.. అడుగుపడాలి 
పూర్తికాని భూ కేటాయింపులు 
కొలిక్కి రాని ఏపీఐఐసీ కార్యాచరణ 
హనుమాన్‌జంక్షన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే 
amr-gen1a.jpg

నవ్యాంధ్రలో పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం చేస్తున్న కృషికి పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందనే వస్తోంది. కానీ భూ కేటాయింపులు, మౌలిక వసతుల కల్పన ఇంకా ఆశించిన రీతిలో ముందడుగు పడటం లేదు. అమరావతి పరిధిలో పారిశ్రామిక అవసరాల కోసం ఇప్పటికే భూ బ్యాంక్‌ను సిద్ధం చేసిన ఏపీఐఐసీ.. వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి పరిశ్రమల స్థాపనకు వీలుగా దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రధానంగా బాపులపాడు మండలం మల్లవల్లిలో 1,260 ఎకరాల భారీ భూ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. తర్వాత కసరత్తులో వెనుకంజ వేస్తోంది. భూసేకరణ జరిగి ఏడాది గడుస్తున్నా.. ఒక్క దానికి శంకుస్థాపన లేకపోవడం, కనీసం లేఅవుట్‌కు సీఆర్డీఏ ఆమోదం లభించకపోవడం పరిశ్రమల స్థాపన ఇంకా పట్టాలెక్కలేదు. రెండున్నర నెలల క్రితం పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి స్వయంగా మల్లవల్లిలో పర్యటించించారు. పనులు చకచకా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం పారిశ్రామిక వూపునకు సంకేతంగా కన్పించింది. కానీ అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ ఆశించిన పురోగతి కన్పించడంలేదు.

నేరుగా రహదారి : మరోవైపు మల్లవల్లి పారిశ్రామికవాడకు ఎలాంటి అవాంతరాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా కొత్త రహదారి నిర్మాణానికి ఏపీఐఐసీ కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా నూజివీడు మండలం మీర్జాపురం వద్ద పెడన-విస్సన్నపేట రాష్ట్ర రహదారి నుంచి అయిదు కి.మీ మేర రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. 45 మీటర్ల వెడల్పున ఉండబోయే ఈ రహదారికి నూజివీడు మండలంలో 16 ఎకరాలు, బాపులపాడు మండలంలో 23 ఎకరాల మేర భూమి సేకరించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే మండల సర్వేయర్ల ఆధ్వర్యంలో పెగ్‌ మార్కింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఏయే రైతు భూమి ఎంత సేకరించాలనే జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.

కొలిక్కి రాని కేటాయింపులు 
1,260 ఎకరాల్లో వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ బాడీబిల్డింగ్‌ యూనిట్‌, స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ సంస్థ ఇందానీ బంగారం రిపైనరీ, మోహన్‌ స్పింటెక్స్‌, తదితర సంస్థలు ఇక్కడ తమ యూనిట్లను స్థాపించేందుకుసిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు వందెకరాలకు పైబడి తమకు కేటాయించాలని చిన్న తరహా పారిశ్రామిక సంఘాలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. వీటితో పాటు జాతీయ రహదారుల సంస్థ లాజిస్టిక్‌ పార్క్‌కు ఇప్పటికే కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఇవి కాకుండా పండ్ల రసాల తయారీ యూనిట్లు, శీతల గిడ్డంగులు ఇక్కడ నిర్మించేలా ఏపీఐఐసీ ప్రణాళిక రూపొందించిందన్న ప్రచారం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఉన్న భూమికంటే రెట్టింపు స్థాయిలో పారిశ్రామిక వర్గాల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు ఏపీఐఐసీ వర్గాల కథనం. కానీ ఇంతవరకు భూ కేటాయింపుల కసరత్తుని ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారు.

ఫుడ్‌పార్కుకు మోక్షం లేదు : ఏడాదిన్నర క్రితమే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెగా ఫుడ్‌పార్కుకు మల్లవల్లిలో వందెకరాలను కేటాయించారు. ఇందులో 57 ఎకరాలు ఫుడ్‌పార్కుకు, మిగతా 43 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఆధ్వర్యంలో ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు కేటాయించేలా ప్రణాళిక రూపొందించారు. కేంద్రం ఎప్పుడోనే నిధులు కేటాయించినా, ప్రైవేటు సంస్థలు సైతం ఆసక్తిగానే ఉన్నా ముందడుగు పడటంలేదు. అదిగో భూమి పూజ, ఇదిగో శంకుస్థాపన అనే మాటలు ప్రచారానికే తప్ప ఆచరణ రూపం దాల్చడంలేదు.

మౌలిక వసతులు : ఫుడ్‌పార్కు కేటాయించిన వందెకరాల స్థలం వరకు రహదారులు, ప్రహరీ, మురుగు కాల్వల వ్యవస్థ, విద్యుత్తు దీపాల వంటి వసతులు సమకూర్చారు. ఇంకా నీటి వసతి, పూర్తి స్థాయి విద్యుత్తు సౌకర్యం వంటివి కల్పించాల్సి ఉంది. పారిశ్రామిక హబ్‌గా కేటాయించనున్న 1,260 ఎకరాలకు సంబంధించి మౌలిక వసతులు కల్పించడానికి ఇప్పటివరకు ముందడుగు పడలేదు. ఏపీఐఐసీ రూపొందించిన లేఅవుట్‌కు ప్రభుత్వ తుది ఆమోదం తర్వాత, సీఆర్డీఏ అనుమతులు మంజూరు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతానికి నేరుగా ఈ భూముల్లోకి వెళ్లేందుకు ప్రధాన రహదారిని మాత్రం రబ్బీసుతో నిర్మించారు.

ప్రభుత్వం కసరత్తు చేస్తోంది 
మల్లవల్లి ఫుడ్‌పార్కు, పారిశ్రామిక హబ్‌ను ఎంత త్వరగా ఆచరణలోకి తేవాలనేదానిపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. భూ కేటాయింపులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే విషయమై ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి, ఏపీఐఐసీ ఎండీ, ఛైర్మన్ల ఆధ్వర్యంలో సంప్రదింపులు సాగుతున్నాయి. ఆ వెంటనే పరిశ్రమల స్థాపనకు వీలుగా కార్యాచరణ మొదలవుతుంది.

- బి.సుబ్బారావు, ఈడీ, ఏపీఐఐసీ
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Company investment & future expansion plans ni batti ivvochhu kada land. ilaagaithe vachhina vaallu kooda venakki pothaaru.

 

Future expansion batti istunnaru lands,, future project report iste consider chestunnaru,,,

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
  • 3 weeks later...

http://www.andhrajyothy.com/artical?SID=463785

 

మెగా కారిడార్.. రెడీ

13-09-2017 14:40:13

 

మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో మెగా పరిశ్రమలకు భూముల కేటాయింపు

మెగా ఫుడ్‌పార్క్‌లో ప్లాట్లు రెడీ.. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):అమరావతి రాజధాని ప్రాంతంలో పారిశ్రామిక హబ్‌గా మారుతున్న గన్నవరం మరో అడుగు ముందుకు వేసింది. బాపులపాడు మండలంలో మల్లవల్లిలోని ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న మెగా పారిశ్రామిక సంస్థలకు ఏపీఐఐసీ భూములు కేటాయించింది. ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ అశోక్‌ లేల్యాండ్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు 100 ఎకరాలను కేటాయించింది. దక్షిణ భారతదేశంలో భారీ స్థాయిలో భారీ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయటానికి అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ ఎప్పటినుంచో స్థలాన్వేషణ జరుపుతోంది. అనూహ్యంగా రాజధాని ప్రాంతంలో గన్నవరం పారిశ్రామిక జోన్‌గా అభివృద్ధి చెందటం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మల్లవల్లిలో దాదాపుగా 1260 ఎకరాల విస్తీర్ణంలో ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌(ఐపీ)ను అభివృద్ధి చేయటంతో అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ దృష్టి ఇటుపడింది. మల్లవల్లి ఐపీ భూములను పరిశీలించిన మీదట తమకు అనుకూలంగా ఉందని నిర్ణయించుకున్న అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంతో ఈ మేరకు ఎంఓయూ చేసుకుంది. దేశంలో స్పిన్నింగ్‌ రంగంలో ప్రము ఖ ‘మోహన్‌ స్పిన్‌టెక్స్‌’కు ఇన్నోవేటివ్‌ ఐపీ కారిడార్‌లో 81 ఎకరాలను ఏపీఐఐసీ కేటాయించింది. మోహన్‌ స్పిన్‌టెక్స్‌ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. టెక్స్‌టైల్స్‌ రంగానికి ఈ భారీ కంపెనీ చేస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. వీటి ఉత్పాదకతలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్నాయి. టెక్స్‌టైల్స్‌ రంగానికే చెందిన మరో స్పిన్నింగ్‌ దిగ్గజం ‘వెంటేజ్‌ ప్రాడక్ట్స్‌’ కు కూడా ఏపీఐఐసీ అధికారులు 28 ఎకరాలను కేటాయించారు. కృష్ణాజిల్లాకు మణిహారంగా నిలిచే ‘లాజిస్టిక్‌ పార్క్‌’ కోసం నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హె చ్‌ఏఐ)కు 150 ఎక రాలను ఏపీ ఐఐసీ కేటా యించింది. లాజి స్టిక్‌ పార్క్‌ వల్ల సరుకు ఎగుమతి, దిగుమతులన్నీ ఇక్క డినుంచే జరుగుతాయి. వివిధ రాష్ర్టాలు, దేశాల నుంచి వచ్చే సరుకు లాజిస్టిక్‌ పార్క్‌కు వస్తుంది. ఇక్కడి నుంచి తిరిగి నిర్ణీత ప్రాంతాలకు రవాణా చేసుకునే అవకాశం ఉంది. కస్టమ్స్‌ క్లియరె న్స్‌ కూడా ఇక్కడి నుంచే ఉంటుంది.

 

కృష్ణాజిల్లాలో రానున్న రోజుల్లో బందరుపోర్టు, పోర్టు ఆధారిత ఇండస్ర్టియల్‌ కారిడార్‌,

విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి కార్గో సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, లాజిస్టిక్‌ పార్క్‌ వల్ల ఎంతగానో ఉపయోగాలు ఉంటాయి. మొత్తం 1,260 ఎకరాల మల్లవల్లి ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో ఐదు మెగా పరిశ్రమలకు 359 ఎకరాలను కేటా యించటం జరిగింది. ఎకరం రూ.16.50 లక్షలకు కేటాయించటం జరిగింది. మార్కెట్‌లో అయితే రూ.కోటి పైనే ఖరీదు చేసే భూములను మరిన్ని పరిశ్రమలకు అవకాశం కల్పించాలన్న సదు ద్దుశంతో.. పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూప టానికి అతి తక్కువ రేట్లకే కేటాయించాలని ఇంతకు ముందే నిర్ణయం తీసుకో వటం జరిగింది. ఇంకా మెగా పరిశ్ర మలు ఏవైనా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంటే.. ప్లాట్లను కేటాయించటానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇన్నోవేటివ్‌ ఐసీలోనే చిన్న, మధ్య తరహా పరిశ్ర మలను ఏర్పాటు చేయటానికి వచ్చేవారు అసోసియేషన్‌ ్సగా ఏర్పడి ప్రభుత్వంతో ఎంవో యూలు చేసుకున్నవారు ఉన్నారు. వీరికి ఎకరం రూ.16. 50 లక్షలకే ప్లాట్లను కేటాయించనున్నారు.

 

ఆన్‌లైన్‌ బుకింగ్‌కు శ్రీకారం

మల్లవల్లి ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ను ఆనుకుని 100 ఎకరాల విస్తీర్ణంలో మెగా ఫుడ్‌పార్క్‌ను ఏపీఐఐసీ అధికారులు అభివృద్ధి చేశారు. మెగా ఫుడ్‌పార్క్‌లో కేంద్ర సంస్థల ఏర్పాటు కోసం ఏ-కారిడార్‌, రాష్ర్టీయ సంస్థల కోసం బీ-కారిడార్‌ లుగా విభజిం చారు. కేంద్ర సంస్థల కోసం ఏ కారిడార్‌ను 52 ఎకరాలలోను, బీ కారిడార్‌ను 48 ఎకరాలలో అభివృద్ధి పరిచారు. ఏ-కారి డార్‌లో 19 ప్లాట్లకు లే అవుట్‌ను రూపొందించారు. బీ-కారిడార్‌లో మొత్తం 33 ప్లాట్లకు లే అవుట్‌ను రూపొందించారు. ఒక్కో ప్లాటు ఎంత విస్తీర్ణంలో ఉందో జియో గ్రాఫికల్‌ మ్యాప్స్‌తో సహా ఏపీఐఐసీ వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. వర్గీకరి ంచా రు. కేంద్ర సంస్థల కోసం 2 ఎకరాల నుంచి 10 ఎకరాల లే అవుట్‌ లను ఎక్కువుగా సిద్ధం చేయటం గమనార్హం. రాష్ర్టీయంగా వచ్చే సంస్థల కోసం 30 సెంట్ల ప్లాట్ల నుంచి 5 ఎకరాల ప్లాట్ల వరకు నిర్ణయించారు. ఏపీఐఐసీ వెబ్‌సైట్‌కు ఒకసారి లాగిన్‌ అయితే.. మల్లవల్లి మెగా ఫుడ్‌పార్క్‌లోని ప్లాట్ల లేఅవుట్‌లను స్వయంగా పర్యవేక్షించవచ్చు. నిర్ణీత సైజు ప్లాట్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఆయా ప్లాట్లను ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకునేందుకు ఒక ఆప్షన్‌ కూడా కల్పించారు.

Link to comment
Share on other sites

ఒకే రోజు 75 పరిశ్రమలు
 
 
636419887300353748.jpg
  • 2,600 మందికి ఉద్యోగాలు
  • దసరానాడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
అమరావతి (ఆంధ్రజ్యోతి): విజయదశమి రోజు రాష్ట్ర రాజధానిలో 75 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఇ)లు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యూనిట్లను ప్రారంభిస్తారు. ఈ సంస్థల ఏర్పాటుతో దాదాపు 2,600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
 
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సిఎం చంద్రబాబు .. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వీటి కోసం ప్రత్యేకంగా పారిశ్రామికవాడలను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే పరిశ్రమల శాఖ జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఇ పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైంది. రాష్ట్రంలో తొలిగా అమరావతిలో ఏర్పాటయ్యే ఎంఎస్‌ఎంఇ పారిశ్రామికవాడతో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ తరహా పారిశ్రామిక వాడలు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రవాసాంధ్రుల సంస్థ (ఎపిఎన్‌ఆర్‌టి) పేర్కొంది.
 
భారీగా ఉపాధి అవకాశం
భారీ పరిశ్రమలకే కాకుండా ఎంఎస్‌ఎంఇలు ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత రెండేళ్లుగా విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుల్లో భారీ, మధ్య తరగతి పరిశ్రమల ఏర్పాటు కోసం ఇంధన, మౌలిక సదుపాయాల శాఖలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే ఈ సదస్సుల్లో ఎంఎస్‌ఎంఇల ఉనికిని ఏ మాత్రం గుర్తించడం లేదు. భారీ పెట్టుబడులు పెట్టే పరిశ్రమలతో పోలిస్తే ఎంఎస్‌ఎంఇల్లో పెట్టుబడులు తక్కువగానే ఉన్నప్పటికీ .. స్థానిక యువతకు ముఖ్యంగా పదో తరగతిలోపు విద్యార్హత ఉన్న వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. రాష్ట్రంలో భారీ పరిశ్రమలు ఎంత అవసరమో.. వాటికి అనుబంధంగా ఉండే ఎంఎస్‌ఎంఇల అవసరమూ అంతే అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎపిఎన్‌ఆర్‌టి ఎంఎస్‌ఎంఇలపై దృష్టి సారించింది.
 
దీంతో హైదరాబాద్‌లోని ప్రముఖ పారిశ్రామిక వాడలలోని పలు సంస్థలు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ప్రతిపాదనలు అందజేశాయి. రాష్ట్రానికి ఎంఎస్‌ఎంఇ సంస్థలు అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు .. ఈ పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే భూ కేటాయింపులు చేపట్టాలంటూ ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ)ని ఆదేశించారు. దీంతో.. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలోనే దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోని వీరపనేని గూడెంలో 75 ఎంఎస్‌ఎంఇలను స్థాపించేందుకు వీలుగా ఎపిఐఐసి భూమి కేటాయించింది. ఈ భూములను స్వాధీన పరచుకున్న ఎంఎస్‌ఎంఇలు ఏడాది తిరగకుండానే ఉత్పత్తికి సిద్ధమయ్యాయి.
 
అనేక ఉత్పత్తులు
ఈ ఎంఎస్‌ఎంఇల్లో ఎరోస్పేస్‌ పరికరాలు, మిషనరీ విడిభాగాలు, ప్రెస్‌ టూల్స్‌, కాప్టివ్‌ ఎక్వి్‌పమెంట్‌, గృహోపకరణాలు, ఇంజనీరింగ్‌ సేవలు లభిస్తాయి. ఈ 75 సంస్థలలో సుమారు 2,600 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. సహజంగా భారీ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభ్యం కావాలంటే .. కనీస విద్యార్హతలైన డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఐటిఐ, పాలిటెక్నిక్‌ వంటి విద్యార్హతలు కావాలి. కాని, ఎంఎస్‌ఎంఇలలో పనిచేసేందుకు .. ఆయా వస్తు తయారీలో అనుభవం ఉంటే సరిపోతుంది. ఇందుకోసం కేంద్ర రాష- ప్రభుత్వాలు స్టయిఫండ్‌తో కూడిన శిక్షణ కూడా ఇస్తాయి.
Link to comment
Share on other sites

ఒకే రోజు 75 పరిశ్రమలు
 
 
636419887300353748.jpg
  • 2,600 మందికి ఉద్యోగాలు
  • దసరానాడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
అమరావతి (ఆంధ్రజ్యోతి): విజయదశమి రోజు రాష్ట్ర రాజధానిలో 75 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఇ)లు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యూనిట్లను ప్రారంభిస్తారు. ఈ సంస్థల ఏర్పాటుతో దాదాపు 2,600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
 
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సిఎం చంద్రబాబు .. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వీటి కోసం ప్రత్యేకంగా పారిశ్రామికవాడలను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే పరిశ్రమల శాఖ జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఇ పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైంది. రాష్ట్రంలో తొలిగా అమరావతిలో ఏర్పాటయ్యే ఎంఎస్‌ఎంఇ పారిశ్రామికవాడతో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ తరహా పారిశ్రామిక వాడలు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రవాసాంధ్రుల సంస్థ (ఎపిఎన్‌ఆర్‌టి) పేర్కొంది.
 
భారీగా ఉపాధి అవకాశం
భారీ పరిశ్రమలకే కాకుండా ఎంఎస్‌ఎంఇలు ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత రెండేళ్లుగా విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుల్లో భారీ, మధ్య తరగతి పరిశ్రమల ఏర్పాటు కోసం ఇంధన, మౌలిక సదుపాయాల శాఖలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే ఈ సదస్సుల్లో ఎంఎస్‌ఎంఇల ఉనికిని ఏ మాత్రం గుర్తించడం లేదు. భారీ పెట్టుబడులు పెట్టే పరిశ్రమలతో పోలిస్తే ఎంఎస్‌ఎంఇల్లో పెట్టుబడులు తక్కువగానే ఉన్నప్పటికీ .. స్థానిక యువతకు ముఖ్యంగా పదో తరగతిలోపు విద్యార్హత ఉన్న వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. రాష్ట్రంలో భారీ పరిశ్రమలు ఎంత అవసరమో.. వాటికి అనుబంధంగా ఉండే ఎంఎస్‌ఎంఇల అవసరమూ అంతే అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎపిఎన్‌ఆర్‌టి ఎంఎస్‌ఎంఇలపై దృష్టి సారించింది.
 
దీంతో హైదరాబాద్‌లోని ప్రముఖ పారిశ్రామిక వాడలలోని పలు సంస్థలు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ప్రతిపాదనలు అందజేశాయి. రాష్ట్రానికి ఎంఎస్‌ఎంఇ సంస్థలు అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు .. ఈ పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే భూ కేటాయింపులు చేపట్టాలంటూ ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ)ని ఆదేశించారు. దీంతో.. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలోనే దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోని వీరపనేని గూడెంలో 75 ఎంఎస్‌ఎంఇలను స్థాపించేందుకు వీలుగా ఎపిఐఐసి భూమి కేటాయించింది. ఈ భూములను స్వాధీన పరచుకున్న ఎంఎస్‌ఎంఇలు ఏడాది తిరగకుండానే ఉత్పత్తికి సిద్ధమయ్యాయి.
 
అనేక ఉత్పత్తులు
ఈ ఎంఎస్‌ఎంఇల్లో ఎరోస్పేస్‌ పరికరాలు, మిషనరీ విడిభాగాలు, ప్రెస్‌ టూల్స్‌, కాప్టివ్‌ ఎక్వి్‌పమెంట్‌, గృహోపకరణాలు, ఇంజనీరింగ్‌ సేవలు లభిస్తాయి. ఈ 75 సంస్థలలో సుమారు 2,600 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. సహజంగా భారీ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభ్యం కావాలంటే .. కనీస విద్యార్హతలైన డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఐటిఐ, పాలిటెక్నిక్‌ వంటి విద్యార్హతలు కావాలి. కాని, ఎంఎస్‌ఎంఇలలో పనిచేసేందుకు .. ఆయా వస్తు తయారీలో అనుభవం ఉంటే సరిపోతుంది. ఇందుకోసం కేంద్ర రాష- ప్రభుత్వాలు స్టయిఫండ్‌తో కూడిన శిక్షణ కూడా ఇస్తాయి.
Link to comment
Share on other sites

వీరపనేనిగూడెంలో పరిశ్రమల ‘దసరా’

75 ఎంఎస్‌ఎంఈలకు 30న ముఖ్యమంత్రి శంకుస్థాపన

ఈనాడు - అమరావతి

27ap-main8a.jpg

వేలాది మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈలు)కు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరపనేనిగూడెం వేదిక కాబోతోంది. ఇక్కడ 75 ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు విజయదశమి సందర్భంగా ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఏ1 కన్వెన్షన్‌ సెంటర్లో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

గన్నవరం విమానాశ్రయానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉండే వీరపనేనిగూడెంలో ఈ ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) 81 ఎకరాలు కేటాయించింది. రాళ్లు రప్పలు, గుట్టలతో ఉండే ఈ ప్రాంతాన్ని ఇప్పుడు పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలంగా ఆగమేఘాల మీద చదును చేశారు. ప్రవాసాంధ్రుల వ్యవహారాలు చూస్తున్న ‘ప్రవాసాంధ్రులు తెలుగు సొసైటీ’ (ఏపీఎన్‌ఆర్టీ) తీసుకున్న చొరవతో ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌ అందరంగా రూపుదిద్దుకోవడానికి సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడితో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నారు. వీటి ద్వారా 2,600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించబోతున్నారు.

27ap-main8b.jpg

లండన్‌లో మొగ్గతొడిగి

వీరపనేనిగూడెంలో ఏపీఎన్‌ఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌కు ఆలోచన లండన్‌లో మొగ్గ తొడిగింది. 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్‌లో పర్యటించినప్పుడు ప్రవాస భారతీయులు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని, సహకారం అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షులు వేమూరి రవి ప్రవాసాంధ్రులతో మాట్లాడి విజయవాడకు సమీపంలో ఒక ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని యోచించారు. ఈ క్రమంలో ప్రతిపాదిత క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టడానికి తొలిగా కేవలం 13 మంది ఆసక్తి చూపారు. అయితే ఎంఎస్‌ఎంఈలకు ఇక్కడ కల్పించే మౌలిక సదుపాయాలు, అందిస్తున్న ప్రోత్సాహం చూసిన తరువాత ఏకంగా 145 మంది పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. వారంతా ‘అమరావతి పరిశ్రమల సంఘం’గా ఏర్పడ్డారు. లాటరీ పద్ధతిలో 75 మందికి స్థలాలు కేటాయించారు. ఎకరా నుంచి అర ఎకరం అంత కంటే తక్కువ విస్తీర్ణంలో చొప్పున ఈ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ స్థలం అభివృద్ధికి ఏపీఐఐసీ రూ.16కోట్లు వెచ్చించింది. ఆరు నెలల్లోపే ఇక్కడ పరిశ్రమలన్నీ యూనిట్‌ నిర్మాణాలన్నీ పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. రక్షణ రంగానికి, సంబంధించిన విడి పరికరాలు తయారు చేసే సంస్థలు, విమానరంగం, సౌర విద్యుత్తు, విద్యుత్తు రంగానికి సంబంధించి విడిభాగాల తయారీ సంస్థలు ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. స్థానికంగా ఉన్న యువతీ, యువకులకు ఈ పరిశ్రమలు ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు కల్పించబోతున్నాయి. కేవలం ఏడాదిలోపే ఈ క్లస్టర్‌ను అభివృద్ధి చేసి, పరిశ్రమలకు కేటాయించడం ద్వారా ఏపీఎన్‌ఆర్టీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వస్తున్నవారికి ప్రభుత్వం తరఫున ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది.

మారనున్న వీరపనేనిగూడెం దశ

ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌ రాకతో వీరపనేనిగూడెం దశ తిరగనుంది. కొండలు, గుట్టలతో అభివృద్ధికి దూరంగా ఉండే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుంది.

రైల్వే గేటుతో అడ్డంకి

వీరపనేనిగూడెం క్లస్టర్‌ పరిశ్రమల పరంగా అభివృద్ధి చెందడానికి అన్ని అనుకూల పరిస్థితులే ఉన్నప్పటికీ ఇక్కడికి సమీపంలో ఉండే రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ గేటు కొంత ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రైలు పైవంతెనను అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరముంది.

ఇదో ముందడుగు మాత్రమే: ఏపీఎన్‌ఆర్టీ

వీరపనేనిగూడెంలో ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌ ఏపీఎన్‌ఆర్టీ ప్రయత్నాల్లో ఒక ముందడుగు మాత్రమేనని ఆ సంస్థ అధ్యక్షలు డాక్టర్‌ రవి వేమూరి, ముఖ్య కార్యనిర్వహణాధికారి కోగంటి సాంబశివరావులు తెలిపారు. ఏడాదిలోపే ఈ క్లస్టర్‌ను అభివృద్ధి చేయడం తమకు ఆనందంగా ఉందని, రాష్ట్రంలో పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించే ప్రణాళికలో ఇదో బాగమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలను తీసుకురావడానికి తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు.

Link to comment
Share on other sites

మెగా గన్నవరం..
 
 
636422779087797422.jpg
  • ఇండస్ర్టియల్‌ హబ్‌గా వీరపనేనిగూడెం
  • రూ.200 కోట్ల వ్యయం
  • 75 యూనిట్లకు దసరా పర్వదినాన
  •  కన్వెన్షన్‌లో శంకుస్థాపన
  •  86 ఎకరాల్లో ఏపీఐఐసీ లే అవుట్‌
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రాజధాని ప్రాంతంలో పారిశ్రామిక దిశగా అడుగులు వేస్తున్న గన్నవరం నియోజకవర్గం ఆ దిశగా తొలి అడుగులు వేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ నుంచి తరలి వస్తున్న సూక్ష్మ చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు వీరపనేనిగూడెం మోడల్‌ ఇండ స్ర్టియల్‌ కారిడార్‌ లో కొలువు దీరనున్నాయి. మరికొద్ది రోజుల్లో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు వీరపనేనిగూడెంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా దసరా పర్వదినాన మహా శంకుస్థాపన కార్యక్రమం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరగనుంది. ఈ పరిశ్రమల నమూనాల ఎగ్జిబిషన్‌ ను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. ఈ యూనిట్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు.
 
రాజధానిలో పారిశ్రామిక విప్లవం
అమరావతి రాజధాని ప్రాంతంలో గన్నవరం ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని నిర్దేశించటం జరిగింది. దేశంలోనే అతి పెద్ద భారీ ఇండస్ర్టియల్‌ కారిడార్లలో ఒకటైన వైజాగ్‌ - చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో గన్నవరం, కంకిపాడు ప్రాంతాలు పారిశ్రామిక నోడల్‌గా ఉన్నాయి. ఇప్పటికే దేశీయంగా కార్పొరేట్‌ స్టీల్‌, ఐటీ, ఆటో మొబైల్‌ వంటి కంపెనీలతో పాటు డెయిరీ యూని ట్లు, స్పిన్నింగ్‌, లెదర్‌ , పౌల్ర్టీ , టూల్‌ డి జైనింగ్‌ వంటి పారిశ్రామిక యూనిట్లతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి జరగటానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లు రంగంలోకి దిగుతున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు మండలం వీరపనేనిగూడెంలో మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌, మల్లవల్లిలో మెగా ఫుడ్‌ పార్క్‌, ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్లకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఇవి సాకారమైతే గన్నవరం ప్రాంతం దశతిరుగుతోందనటంలో ఎలాంటి సందేహం లేదు.
 
రూ. 200 కోట్ల వ్యయంతో పరిశ్రమలు
హైదరాబాద్‌ నుంచి మాతృగడ్డకు రావాలను కున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యాజమాన్యాలు అమరావతి ఇండస్ర్టియల్‌ అసోసియేషన్‌గా ఏర్పడ్డాయి. దాదాపుగా రూ. 200 కోట్ల మేర పెట్టుబడులతో రాజధాని ప్రాంతంలో యూనిట్లను ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం వీరప నేనిగూడెం ప్రాంతంలో మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాల్సిందిగా ఏపీఐఐసీని ఆదేశించటం జరిగింది.
 
86 ఎకరాల్లో లే అవుట్‌
ప్రభుత్వం తనపై పెట్టిన బాధ్యతలతో ఏపీఐఐసీ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా యంత్రాం గంతో సమన్వయం చేసుకుని వీరపనేనిగూడెంలో 86 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించటం జరిగింది. కొండలను చదును చేసి ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం ఏర్పాట్లు చేపట్టింది. రూ.10 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రెయిన్లు, బోర్‌వెల్స్‌ , విద్యుత్‌ పోల్స్‌, విద్యుత్‌సదుపాయాలకు సంబంధించిన పనులు చేపడుతున్నారు. బీటీ మాత్రమే మిగిలి ఉంది. పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు సంబం ధించి ప్లాట్లను చదును చేయాల్సి వుంది.
 
75 పరిశ్రమల ఏర్పాటు
అమరావతి ఇండస్ర్టియల్‌ అసోసియేషన్‌ పేరుతో మొత్తం 75 రకాల పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. ఈ పరిశ్రమలన్నింటికీ ప్లాట్లను కేటాయించటం జరిగింది. రాయితీలతో పాటు భూములను కూడా కారుచౌకగా విక్రయిం చటం జరిగింది. వీటిని వారు చదును చేయటం జరిగింది. నిర్వాహకులు వీటిని ఏర్పాటు చేయటమే మిగిలింది. ఇందుకోసమే శంకుస్థాపన నిర్వహిస్తు న్నారు. సీఎం శంకుస్థాపనతోటే క్షేత్ర స్థాయంలో పనులు మొదలు పెడతాయి. ఎనిమిది నెలల్లో తమ యూనిట్లను పూర్తి చేయాల్సి ఉంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...