Jump to content

APIIC industrial park in Mallavalli,Verpanenigudam


sonykongara

Recommended Posts

  • 2 weeks later...
  • Replies 240
  • Created
  • Last Reply
  • 2 weeks later...
ఏపీలో మెగా కారిడార్ రెడీ
 
636275799191021912.jpg
  • ఫుడ్‌ - ఇండస్ర్టియల్‌ పార్క్‌లో ప్లాట్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
  • వీరపనేనిగూడెంలో ప్లాట్ల అభివృద్ధికి సిద్ధ పడుతున్న పారిశ్రామిక వేత్తలు 
  • మల్లవల్లి కారిడార్‌కు మాస్టర్‌ ప్లాన్ రెడీ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
మల్లవల్లి ఫుడ్‌ పార్క్‌ కమ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ దాదాపుగా రెడీ అయింది. రెండు విభాగాల్లో యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు ఏపీఐఐసీ అధికారులు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏపీఐఐసీ యుద్ధ ప్రాతిపదికన ఫుడ్‌పార్క్‌లో మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేసింది. రోడ్లతో పాటు సైడ్‌ డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల నిర్మాణాలను చేపట్టింది. లే అవుట్‌ కూడా సిద్ధం అయింది. తుది అనుమతులు రాగానే ప్లాట్లను విభజించడమే తరువాయి. మల్లవల్లిలో మొత్తం 100 ఎకరాలలో ఏపీఐఐసీ అధికారులు ఫుడ్‌పార్క్‌ కమ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ పనులు చేపట్టారు. 57.45 ఎకరాలలో మెగా ఫుడ్‌పార్క్‌, 42.55 ఎకరాలలో ఇండస్ర్టియల్‌ కారిడార్‌ నిర్మిస్తున్నారు. మెగా ఫుడ్‌పార్క్‌కు సంబంధించి ప్లాట్ల ఏరియా మొత్తం 29.63 ఎకరాలుగా ఉంది. మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్డు ఏరియా 9.19 ఎకరాలు, ఇతర సదుపాయాలకు 6.4 ఎకరాలు, ఓపెన్ స్పేస్‌గా 5.91 ఎకరాలు, కామన్ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ) యూనిట్స్‌ ఏరియా 6.32 ఎకరాలను కేటాయించారు. ఫుడ్‌ పార్క్‌ అవసరాలకు సంబంధించి ప్యాకింగ్‌, శీతలీకరణ తదితర యూనిట్లు ఇక్కడ ఉంటాయి.
ఇండస్ర్టియల్‌ కారిడార్‌ విషయానికి వస్తే ప్ట్లాట్ల విస్తీర్ణం 30.99 ఎకరాలలో ఉంటుంది. రోడ్డు ఏరియాగా 6.35 ఎకరాలు, ఓపెన స్పేస్‌ ఏరియాగా 5.21 ఎకరాల చొప్పున విభజించటం జరిగింది. ఏపీఐఐసీ అధికారులు మౌలిక సదుపాయాలను కల్పించటంతో ప్లాట్లను కేటాయించటమే మిగిలిఉంది. ఇండస్ర్టియల్‌ కారిడార్‌, మెగా ఫుడ్‌పార్క్‌లకు వేర్వేరు యూనిట్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువరించటానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్లాట్లను ఏ ప్రాతిపదికన కేటాయిస్తారన్న వివరాలు గోప్యంగా ఉంచారు. ప్లాట్లను లీజుకిస్తారా? విక్రయిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. ఔట్‌రేట్‌ సేల్‌ ప్రాతిపదికన విక్రయించే అవకాశాలు కూడా లేకపోలేదన్న వాదనలు కూడా ఉన్నాయి. వీరపనేనిగూడెంలో ఏర్పాటు చేసిన మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో భాగంగా ప్లాట్లను ఔట్‌రేట్‌ సేల్‌ (ఓఆర్‌ఎస్‌) విధానంలో కేటాయించారు.
 
పనులు ప్రారంభించనున్న పారిశ్రామిక వేత్తలు
వీరపనేని గూడెం మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో తమకు కేటాయించిన ప్లాట్ల అభివృద్ధికి అమరావతి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కొంతమంది పారిశ్రామికవేత్తలు తమప్లాట్ల అభివృద్ధికి సుముఖత తెలిపినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లోనే పనులు ప్రారంభించనున్నారు. మిగిలిన వారు కూడా ఈ నెలలో ప్లాట్లను అభివృద్ధి చేసుకోనున్నారు. దీంతో ఏపీఐఐసీ కూడా సమాంతరంగా మౌలిక సదుపాయాల పనులను ప్రారంభిస్తోంది.
 
మల్లవల్లికి మాస్టర్‌ ప్లాన్
మల్లవల్లి భారీ ఇండస్ర్టియల్‌ కారిడార్‌కు మాస్టర్‌ ప్లాన్ రెడీ అయింది. ఫుడ్‌పార్క్‌ను ఆనుకుని ఇది ఉంటుంది. దీని లే అవుట్‌కు సీఆర్‌డీఏ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. మౌలిక సదుపాయాల పనులను కూడా ఏపీఐఐసీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంది. ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఎలా ఉండాలి? భారీ పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలకు సంబంఽధించి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలో మాస్టర్‌ప్లానులో పొందుపరచటం జరిగింది. మాస్టర్‌ ప్లాన్ రెడీ అయిన నేపథ్యంలో, సీఆర్‌డీఏ లే అవుట్‌ కోసం ఎదురు చూస్తున్నారు.
Link to comment
Share on other sites

మల్లవల్లి పారిశ్రామికవాడలో ప్లాట్‌ ధరలపై తగ్గింపు ఎంత ?
 
636283604905003503.jpg
విజయవాడ : ప్రతిష్ఠాత్మక మల్లవల్లి మెగా ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో ప్లాట్ల ధరల తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం జరిగే రాష్ట్ర క్యాబినెట్‌ అజెండాలో మల్లవల్లి భూములకు సంబంధించి ప్రతిపాదన చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఏపీఐఐసీ ఎండీ నివాస్‌ నుంచి వెళ్ళిన ప్రతిపాదనపై క్యాబినెట్‌ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. మల్లవల్లికి సంబంఽదించి ఏపీఐఐసీ ఎండీ ద్వారా వెళ్ళిన ప్రతిపాదన వివరాలు గోప్యంగా ఉన్నాయి. మల్లవల్లిలోని దాదాపుగా వెయ్యి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మెగా ఇండస్ర్టియల్‌ కారిడార్‌ నిర్మాణానికి రెవెన్యూ శాఖ, ఏపీఐఐసీకి భూములు బదలాయించింది. మల్లవల్లి అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన తయారు చేయాల్సిందిగా కొద్దికాలం కిందట ఎల్‌అండ్‌టీ వారికి బాధ్యతలను అప్పగించటం జరిగింది. మల్లవల్లి లే అవుట్‌ కోసం సీఆర్‌డీఏకు ఏపీఐఐసీ దరఖాస్తు చేసుకుంది. మల్లవల్లికి తగిన నీటి అవసరాలపై అధ్యయనం జరుగుతోంది. గొల్లపూడి - నూజివీడు వెళ్ళే మంచినీటి పథకం ద్వారానే మల్లవల్లికి నీటి సదుపాయం తీర్చటం సాధ్యమౌతుంది. ఇది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతోపాటు ఇందులో ఏపీఐఐసీ కల్పించే మౌలిక సదుపాయాల ఖర్చు కూడా భారీ అవుతోంది. ఈ కారిడార్‌లో పరిశ్రమలను ప్రారంభించాలనుకునే బడా సంస్థలు భూముల ధరలు ఎక్కువుగా ఉన్నాయని అభిప్రాయపడటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ స్థాయిలో తగ్గింపు కోరుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భూముల ధరలు, ఏపీఐఐసీ పెట్టే మౌలిక సదుపాయాల ఖర్చు చూస్తే కోట్లాది రూపాయల వ్యయం అవుతోంది. ఈ నేపథ్యంలో, పారిశ్రామవేత్తలను ఆకర్షించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సానుకూల అంశాలు తీసుకుంటుందో నేటి వరకు వేచి చూడాల్సిందే.
Link to comment
Share on other sites

కృష్ణా జిల్లాలో బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక పార్కు

రూ.1,030 కోట్లతో హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు

గ్రానైట్‌ పరిశ్రమ బలోపేతానికి ­తం

అనంతపురం నుంచి అమరావతికి రహదారి

మంత్రిమండలి నిర్ణయాలు

21ap-main6a.jpg

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు శుక్రవారం జరిగిన మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఇది 1,341.67 ఎకరాల్లో రానుంది. నెల రోజుల్లోనే దీన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అక్కడ ఎకరా భూమి రూ.45 లక్షలు ఉంది. అయితే ఎకరా రూ.16.5 లక్షలకు అందివ్వాలని చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంఘం (ఎంఎస్‌ఎమ్‌ఈ) ప్రభుత్వానికి విన్నవించిన నేపథ్యంలో ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని వారంలోగా నిర్ణయం ప్రకటించాలని సీఎం ఆదేశించారు.

Link to comment
Share on other sites

ఏపీ రాజధాని నగరం...పరిశ్రమలకు ఊతం
 
636287905889608908.jpg
హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వపరంగా అందించే అను మతులు సకాలంలో మంజూరు చేయటానికి చర్యలు తీసు కుంటున్నట్లు చెప్పారు. భారీ పరిశ్ర మలశాఖ మంత్రి ఎన్‌.అమర్‌ నాథ్‌రెడ్డి అన్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలోని మెగాఫుడ్‌ పార్క్‌ పారిశ్రామిక ప్రాంతాన్ని (ఏపీఐఐసీ) భూములను మంగళవారం ఆయన సందర్శించారు. మెగా ఫుడ్‌పార్క్‌ పారిశ్రామిక ప్రాంతాల్లో జరుగుతున్న రహదారుల నిర్మాణం, విద్యుత్, నీటి సరఫరా తదితర మౌలిక వసతులు పనులపై మంత్రి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫేజ్‌ 1 భూముల్లో మౌలికవసతులు అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజధాని పరిధిలోనే కర్మాగారాలు నెలకొల్పడం వల్ల పారిశ్రామికవేత్తలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో పుడ్‌ప్రా సెసింగ్‌ విభాగం ప్రారంభ దశలో ఉందని చెప్పారు. పండ్లరసాలు, పల్వరైజింగ్‌ వంటి ఆహారపదార్ధాల తయారీ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన శీతల గిడ్డంగులు (కోల్డ్‌స్టోరేజ్‌లో) నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల్లో కర్మాగారాలు ఏర్పాటు చేసుకున్న రాష్ర్టానికి చెందిన పారిశ్రామి కవేత్తలు ఇక్కడ కర్మాగారాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సంప్రదిస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మొత్తం పూర్తయిందని, త్వరలో కర్మాగారాల నిర్మాణాలకు భూము లు అందిస్తామని వివరించారు. పారిశ్రా మికవేత్తలకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన మల్లవల్లి భూముల్లో ఎకరం రూ.16 లక్షలకు అందించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఎకరం భూమి ధర కోటి రూపాయలు ఉందన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము వెచ్చించి మరీ కర్మాగారాల అభివృద్ధి కోసం భూములను తక్కువ ధరకే కేటాయిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే తెలంగాణాలోని బాలానగర్‌ తదితర ప్రాంతాల్లో వున్న ఇండస్ర్టిలిస్ట్‌లు ఈ ప్రాంతంలో కర్మాగార నిర్మాణానికి మక్కువచూపుతున్నారన్నారు. ఇప్పటికే అశోక్‌లైల్యాండ్‌, మోహన్‌ స్పిన్‌టెక్‌, మెజిస్టిక్‌ పార్ట్‌ తదితర పెద్ద సంస్థలు భూకేటాయింపుల కోసం కోరాయని, అలాగే మరో 30దాకా చిన్న తరహా పరిశ్రమలకు భూమిని కేటా యించాలని ప్రభుత్వానికి దరఖాస్తులు అందాయని వివరించారు. రోడ్లు నిర్మాణాలు పూర్తయి ప్లాట్లు విభజించి సిద్ధంగా ఉన్నాయని, సీఆర్‌డీఏ అనుమతులు తదితర అంశాలపై ఆయాశాఖల అధికారులతో చర్చించాల్సి ఉందన్నారు.
పనులను అడ్డుకుంటాం: రైతులు
‘అభివృద్ధికి అడ్డంకి కాదు, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాం, అయినా నష్టపరిహారం విషయంలో అధికారులు హైడ్రామా వేస్తున్నారు. నష్టపరిహారం అందించేవరకు పనులను అడ్డుకుంటామని’ మల్లవల్లి రైతులు మంత్రితో అన్నారు. స్థానిక అధికారులు బినామీపేర్లతో తమకు నచ్చినవారికి నష్టపరిహారం అందించారని, అందులో భూ అనుభవం లేనివారికి కూడా నష్టపరిహారం ఇచ్చారని, ఎన్నోఏళ్ళుగా సాగుచేస్తున్న అనుభవ దారులకు మాత్రం నష్టపరిహారం అందించలేదని రైతులు పంతం కామరాజు, వేముల రంగారావు, బాషా, సాంబశివరావు, హరినాధరావు, నాగరాజు తదితరులు వివరించారు. తమకు నష్టపరిహారం అందించేవరకు పనులను అడ్డుకుంటామని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి స్పందించి వద్దంటూ వారించారు. తహసీల్దార్‌ను పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 1,460 ఎకరాల్లో 490మంది రైతులను గుర్తించామని తహసీల్దార్‌ వివరించారు. అందులో 32మందికి 52 ఎకరాలకు బినామీలు ఉన్నారని తేలడంతో నష్ట పరిహారం అందించలేదని తహసీల్దార్‌ కలగర గోపాలకృష్ణ వివరించారు. దీనికి స్పందించిన మంత్రి 52 ఎకరాల్లోవున్న రైతులకు తక్షణమే నష్టపరిహారం అందిం చాలని సూచించారు. దీనిపై కలెక్టర్‌తో చర్చించి 32 మంది రైతులకు నష్టప రిహారం అందేలా చర్యలు తీసుకుంటానని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రేషన్‌కార్డు దారులకు ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున ప్రతి కుటుంబానికి అందించిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. అందులో 100 కుటుంబాలు పాతకార్డులు వారు ఉండగా, మరో 250 మంది కొత్తకార్డుల వారు ఉన్నారని, వారికికూడా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ ఈడీ బి.సుబ్బారావు, సీఈ సిహెచ్‌వి ప్రసాద్‌, డీఈ కె.ఎన్‌.ఆర్‌.వి ప్రసాద్‌ తదితరులతో పాటు ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

మల్లవల్లి వద్ద సరకు రవాణా పార్క్‌

5న కేంద్రంతో ఒప్పందం

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌కు సమీపంలోని మల్లవల్లి వద్ద ‘జాతీయ రహదారుల లాజిస్టిక్స్‌ పార్కు’ ఏర్పాటు కాబోతోంది. కేంద్రం నిర్ణయంలో భాగంగా ఈ పార్కు ఏర్పాటుపై భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఈ పార్కు కోసం మల్లవల్లి వద్ద 150 ఎకరాల భూమిని గుర్తించింది. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ స్థలానికి ఎన్‌హెచ్‌ఏఐ కూడా ఆమోదం తెలిపింది. మే 5వ తేదీన ఈ పార్కు ఏర్పాటుకు సంబంధించి ఏపీఐఐసీ, జాతీయ రహదారుల సంస్థలు దిల్లీలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతో పాటు దేశంలోని 15 ప్రాంతాల్లో జాతీయ రహదారుల లాజిస్టిక్స్‌ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం సంకల్పించింది. వీటి కోసం రూ.32,853 కోట్లు వెచ్చించనుంది. ఈ పార్కుల ద్వారా రాష్ట్రంలో సరకు రవాణా వ్యయం 10శాతం తగ్గించాలనేది లక్ష్యం.

Link to comment
Share on other sites

ప్రభుత్వ భూములు ఇక ఉచితంగా స్వాధీనం
 
636293911945151048.jpg
  •  భూ పరిహార రికవరీ కోసం ప్రతిపాదన!
  •  వీరపనేనిగూడెం, మల్లవల్లి కారిడార్లకు రూ.74 కోట్ల ఖర్చు
  •  మరో రూ.24 కోట్ల చెల్లింపులు..
ఇండస్ర్టియల్‌ కారిడార్ల భూముల కోసం తాము చెల్లించిన కోట్లాది రూపాయలను ప్రభుత్వం నుంచి తిరిగిరాబట్టుకునేందుకు, ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఏపీఐఐసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తాజాగా ప్రభుత్వ భూములను ఉచితంగా ఏపీఐసీసీకి అందించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ క్రమంలో తాము చెల్లించిన మొత్తం రూ.98 కోట్లను రీయింబర్స్‌ చేయాల్సిందిగా ఏపీఐసీసీ కోరనున్నట్టు తెలుస్తోంది.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
ఇండస్ర్టియల్‌ కారిడార్ల భూముల కోసం చెల్లించిన కోట్లాది రూపాయలను ప్రభుత్వం నుంచి తిరిగి రాబట్టుకునేందుకు ఏపీఐఐసీ సన్నాహాలు చేపట్టింది. కృష్ణాజిల్లాలో ఇండస్ర్టియల్‌ పార్కుల కోసం వీరపనేనిగూడెం, మల్లవల్లిలో భూముల కోసం ఏపీఐఐసీ రూ.74 కోట్ల మేర ఖర్చు పెట్టింది. వీరపనేనిగూడెంలో మరో రూ.24 కోట్లను చెల్లించాల్సిందిగా జిల్లా యంత్రాంగం ఏపీఐఐసీకి ఇటీవల నిర్దేశించింది. ఈ రెండు ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్ల కోసం అభివృద్ధి చేసిన భూములను పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకు అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏపీఐఐసీపై ఆర్థిక భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించుకోవటానికి ఏపీఐఐసీ ప్రభుత్వానికి ప్రతిపాదన చేయనున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని పారిశ్రామిక కారిడార్ల భూ సేకరణకు దాదాపుగా రూ.100 కోట్ల మేర ఏపీఐఐసీ సొంత నిధులు ఖర్చు పెడుతోంది. జిల్లాలోని పారిశ్రామిక కారిడార్ల విస్తరణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలను ఇటీవలకాలంలో తీసుకుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చవకగా భూములను అందించాలని నిర్ణయించింది.
 
               గన్నవరం నియోజకవర్గ పరిధిలో భూములకు రాజధానితో సంబంధం లేకుండా ఎప్పటి నుంచో బూమ్‌ ఉంది. ర్యాపిడ్‌ గ్రోత ఏరియాగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో భూముల ధరలు కోటిన్నర నుంచి నాలుగు కోట్ల మేర ధర పలుకుతున్నాయి. పరిశ్రమలను నెలకొల్పే ఔత్సాహికులకు తక్కువ ధరకు భూములు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరపనేనిగూడెంలో ఏర్పాటు చేస్తున్న మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ భూములకు ఏపీఐఐసీ రూ.4 కోట్లు చెల్లించింది. రూ.24 కోట్లు చెల్లించాల్సిందిగా ఇటీవల కృష్ణాజిల్లా యంత్రాంగం ఏపీఐఐసీ దృష్టికి తీసుకువచ్చింది. దీనికి సంబంధించి ఏపీఐఐసీ చెల్లింపులు జరపలేదు. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో మెగా ఇండస్ర్టియల్‌ కోసం ఏపీఐఐసీ రూ.70 కోట్లను రైతులకు పరిహారంగా చెల్లించింది. పారిశ్రామిక క్లస్టర్లు, ఇండస్ర్టియల్‌ కారిడార్లు, సెజ్‌ల కింద పరిశ్రమలను ఏర్పాటు చేయించటం తద్వారా ఆదాయం పొందటం అన్నది ఏపీఐఐసీ ప్రధాన విధి. జిల్లాలో వీరపనేనిగూడెం, మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్లకు సంబంధించి భూములకు కూడా ఏపీఐఐసీ చెల్లింపులు జరపటం ద్వారా ఆ శాఖ ఆదనంగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. మౌలిక సదుపాయాల పనుల కోసం దాదాపుగా 100 కోట్ల రూపాయల మేర ఏపీఐఐసీ ఖర్చు చేస్తోంది.
 
               మౌలిక సదుపాయాలను కల్పించటం ఏపీఐఐసీ ప్రధాన బాధ్యత. భూ సేకరణ కోసం ఏపీఐఐసీ చెల్లించాల్సి రావటంతోనే ఇబ్బందికరంగా మారుతోంది. వీరపనేనిగూడెం, మల్లవల్లి ప్రాంతాల్లో మార్కెట్‌ రేట్ల ప్రకారం రూ.కోటిన్నర నుంచి రూ.3 కోట్లమేర భూముల ధరలు ఉన్నాయి. అయితే భూ సేకరణలో భాగంగా ప్రభుత్వం రైతులకు నిర్దేశించిన రూ.7.50 లక్షల నష్టపరిహారాన్నే ఏపీఐఐసీ చెల్లించింది. ఈ లెక్కన వీరపనేనిగూడెంలో రమారమి రూ.30 కోట్లు, మల్లవల్లిలో రూ.70 కోట్ల మేర చెల్లించింది. పారిశ్రామికవేత్తలకు నిర్దేశించిన ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒక నిర్ణయం తీసుకుంది. భూములను లీజు ప్రాతిపదిక కానీ, ఔట్‌రేట్‌ సేల్‌ (ఓఆర్‌ఎస్‌) ప్రాతిపదికన కానీ తీసుకోవచ్చు. పారిశ్రామిక వేత్తలంతా ఔట్‌రేట్‌ సేల్‌ (ఓఆర్‌ఎస్‌) కింద కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపారు. ఈ ప్రకారం వీరపనేనిగూడెంలో ఎకరం రూ.8 లక్షలుగాను, మల్లవల్లిలో ఎకరం రూ. 16.5 లక్షలుగాను నిర్ణయించింది. అయితే ఏపీఐఐసీ మౌలిక సదుపాయాలతో కలిపి చేసిన ఖర్చు చూస్తే వీరపనేనిగూడెంనకు రూ.30లక్షలు, మల్లవల్లికి రూ.కోటి వరకు ఖర్చు అయింది. దీనిని దృష్టిలో ఉంచుకుంటే ఏపీఐఐసీపై అదనంగా ఆర్థికభారం పడుతోంది.
 
                 మల్లవల్లి భూములను ఎకరం రూ.16.5 లక్షలకే ఇవ్వాలన్న పారిశ్రామిక వేత్తల ప్రతిపాదనకు ఏపీఐఐసీ ముందు ఆసక్తి చూపలేదు. దీనికి సంబంధించి క్యాబినెట్‌లో చర్చ జరిగాక.. వారం రోజుల్లో ఏపీఐఐసీ ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించటం జరిగింది. ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో ఉండటం, ఏపీఐఐసీ కూడా సానుకూలంగా ఆలోచించాలని సీఎం క్యాబినెట్‌లో సూచించటంతో తర్వాత రూ.16.5 లక్షలకు అంగీకరించింది.
Link to comment
Share on other sites

279 ఎకరాలైనా కేటాయించండి

మల్లవల్లి పరిశ్రమల సంఘం విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి: మల్లవల్లిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కనీసం 279 ఎకరాలైనా కేటాయించాలని ‘మల్లవల్లి పరిశ్రమల సంఘం’ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కృష్ణా జిల్లాలోని మల్లవల్లి భూముల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 400 ఎకరాలు కేటాయిస్తామన్న ప్రభుత్వం తరువాత అంత కేటాయించలేమని చెబుతోంది. దీంతో తమకు కనీసం 279 ఎకరాలైన కేటాయించాలని ఈ సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌.అమరనాథ్‌రెడ్డిని బుధవారం సచివాలయంలో కలిసి విజ్ఞప్తి చేసింది. మల్లవల్లి పరిశ్రమల సంఘం అధ్యక్షులు కె.సాయి కిశోర్‌, ప్రధాన కార్యదర్శి జీఎన్‌బీ చౌదరిలు మంత్రికి విజ్ఞాపనపత్రం అందజేశారు. హైదరాబాద్‌ జీడిమెట్లలోని దాదాపు 433 పరిశ్రమలు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయని, ఈ పరిశ్రమల కోసం మొత్తం రూ.954 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. వారి సమస్యలను ఆలకించిన మంత్రి.. తప్పకుండా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
నెలాఖరుకు ఆన్‌లైన్‌లో ప్లాట్ల ప్లాన్‌!
 
 
636321646861967295.jpg
  • ఆన్‌లైన్‌లో ‘మల్లవల్లి’ ఇండస్ర్టియల్‌ కారిడార్ల ప్లాట్ల వివరాలు
  • 100 ఎకరాలలో ఫుడ్‌పార్క్‌ కమ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ పూర్తి
  • 1,260 ఎకరాలలో మెగా ఫుడ్‌పార్క్‌కు శ్రీకారం
  • లే అవుట్‌ వేసి ప్లాట్లను నిర్దేశించే పనిలో ఏపీఐఐసీ
విజయవాడ: అమరావతి రాజధాని ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మక మల్లవల్లి మల్టీ ప్రొడక్టు ఇండస్ర్టియల్‌ కారిడార్లలో ప్లాట్ల కోసం ఎదురు చూసేవారికి శుభవార్త! ఈ నెలాఖరులోపు ఏపీఐఐసీ మల్లవల్లికి సంబంధించిన ప్లాట్ల వివరాలను ఆనలైనలో పొందుపరుస్తోంది. మొత్తం ఎన్ని ప్లాట్లు? ఏ పరిమాణంలో ఉంటాయి? వాటి ధర ఎంత? అన్న వివరాలపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో రెవెన్యూ శాఖ సమకూర్చిన 1,460 ఎకరాల్లో ఇండస్ర్టియల్‌ కారిడార్‌కు ఏపీఐఐసీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో విడిగా 100 ఎకరాలలో ప్రత్యేకంగా ఫుడ్‌ పార్క్‌ కమ్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ కారిడార్‌ను అభివృద్ధి చేశారు. ఇది కాకుండా మరో 100 ఎకరాలను భూములు ఇచ్చిన వారికి ప్లాట్లుగా ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 1,260 ఎకరాల్లో మెగా ఇండస్ర్టియల్‌ కారిడార్‌కు శ్రీకారం చుట్టారు. ఫుడ్‌ పార్క్‌ కమ్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ విషయానికి వస్తే చుట్టూ ప్రహరీగోడ, లోపల లే అవుట్‌ వేశారు. రోడ్లు, డ్రెయిన్లు, వీధి దీపాల వంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి ప్లాట్లను నిర్దేశించారు. ఇక 1,260 ఎకరాలలోని మెగా ఇండస్ర్టియల్‌ పార్క్‌కు సంబంధించి సీఆర్‌డీఏ నుంచి మరికొద్దిరోజుల్లో లే అవుట్‌ రానుంది. ఇప్పటికే పలు భారీ పరిశ్రమలు ఈ కారిడార్‌లోకి రావటానికి ఆసక్తి చూపాయి. అశోక్‌ లేల్యాండ్‌ మోహన స్పినటెక్స్‌, గోల్డ్‌ రిఫైనరీ, ఫార్మా రంగానికి సంబంధించినటువంటి భారీ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చాయి. ఈ సంస్థలు కాకుండా మధ్య తరహా పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. మధ్యతరహా పరిశ్రమల అసోసియేషన కీలకపాత్ర పోషిస్తోంది. అసోసియేషన పరిధిలో ఇక్కడికి వచ్చే వారికి ప్లాట్ల ధరలను ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఎకరం ధర రూ.16.50 లక్షలకు ఔట్‌రేట్‌ సేల్‌ ప్రాతిపదికన విక్రయించాలని నిర్ణయించారు. మిగిలిన ప్లాట్లకు ఏపీఐఐసీ ధరను నిర్ణయిస్తుంది. లే అవుట్‌ రాగానే.. ప్లాట్లను విభజిస్తుంది. ప్రస్తుతం ప్లాట్లను ఏ ప్రాతిపదికన విభజించాలన్న దానిపై ఏపీఐఐసీ కసరత్తు చేస్తోంది. ప్లాట్లకు సంబంధించి ఐదు ఎకరాలు, రెండున్నర ఎకరాలు, ఎకరం 1000 - 2000 చదరపు మీటర్లు వంటి వాటిని పరిశీలిస్తుంది. మరో వారంలో ఏ పరిణామంలో ప్లాట్లను విభజించాలన్న దానిపై ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన కేటగిరీ కాకుండా మిగిలిన పరిశ్రమలకు సంబంధించి ధర ఎంత నిర్ణయించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ఫుడ్‌పార్క్‌ కమ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌కు సంబంధించి చూస్తే.. అన్ని పనులు పూర్తయ్యాయి. ప్లాట్ల వర్గీకరణ ఒక్కటే మిగిలి ఉంది. మెగా ఇండస్ర్టియల్‌ కారిడార్‌ విషయానికి వస్తే.. ఇంకా మౌలిక సదుపాయాల కల్పన చేపట్టలేదు. లే అవుట్‌ రాగానే ముందుగా ప్లాట్లను వర్గీకరించిన తర్వాత సమాంతరంగా అభివృద్ధి పనులు చేపట్టనుంది. అభివృద్ధి పనులతో సంబంధఽం లేకుండా వివరాలను ఆనలైనలో పొందుపరచనుంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

మల్లవల్లి పార్కు’లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం

ముందుకొచ్చిన 400 మంది

ఈనాడు, అమరావతి: మల్లవల్లిలో ఏర్పాటు చేయబోయే సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్న పారిశ్రామికవేత్తలు సోమవారం ప్రభుత్వానికి డీపీఆర్‌లు సమర్పించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రకు చెందిన సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు నిర్వహిస్తున్న 400 మంది ఈ పార్కులో పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకొచ్చారు. మల్లవల్లి పరిశ్రమల సంఘం నేతృత్వంలో వారంతా ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) అధికారులకు ఈ డీపీఆర్‌లను అందజేశారు. వీటిని పరిశీలించి తమకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి స్థలాలు కేటాయించాలని మల్లవల్లి పరిశ్రమల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సాయి కిశోర్‌, జీఎన్‌బీ చౌదరి విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. డీపీఆర్‌లను పరిశీలించిన తరువాత త్వరితగతిన ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి స్థలాలు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...