Jump to content

APIIC industrial park in Mallavalli,Verpanenigudam


sonykongara

Recommended Posts

  • 2 weeks later...
  • Replies 240
  • Created
  • Last Reply
హైదరాబాద్‌ నుంచి తరలి వచ్చే పరిశ్రమలకు 200 ఎకరాలు
 
636164430631748511.jpg
హైదరాబాద్‌ నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి తరలివచ్చే పరిశ్రమల కోసం రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం వీరపనేనిగూడెం ఇండస్ర్టియల్‌ కారిడార్‌ లే అవుట్‌లో అభివృద్ధి పనులు ముమ్మరమయ్యాయి. కృష్ణాజిల్లా రెవెన్యూ యంత్రాంగం అప్పగించిన 86 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్న ఏపీఐఐసీ .. ఈ భూముల్లో అభివృద్ధి పనులు చేపడుతోంది.
 
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):వీరపనేనిగూడెం ఇండస్ర్టియల్‌ కారిడార్‌ లే అవుట్‌లో అభివృద్ధి పనులు ముమ్మరమయ్యాయి. కృష్ణాజిల్లా రెవెన్యూ యంత్రాంగం అప్పగించిన 86 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్న ఏపీఐఐసీ .. ఈ భూముల్లో అభివృద్ధి పనులు చేపడుతోంది. ముందుగా రూ. 6.8 కోట్ల వ్యయంతో రోడ్ల పనులు చేపట్టింది. ఏపీఐఐసీకి అప్పగించిన భూములలో ఎక్కువ భాగం కొండప్రాంతం కావటంతో భారీ సంఖ్యలో యంత్రాలను ఉపయోగిస్తూ చదను చేసే పనులు ప్రారంభించింది. మరోవైపు సమాంతరంగా రోడ్ల పనులు కూడా ఏకకాలంలో చేపట్టింది. ప్రస్తుతం రోడ్లకు సంబంధించి ఎర్త్‌ వ ర్క్‌ జరుగుతోంది. హైదరాబాద్‌ నుంచి మొదటి దశలో తరలివస్తున్న పరిశ్రమలన్నీ అమరావతి అసోసియేషనగా ఏర్పడ్డాయి.
 
రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్‌ నుంచి తరలి వచ్చే పరిశ్రలకు వీరపనేనిగూడెంలో 200 ఎకరాలకు పైగా ఇవ్వటానికి అంగీకరించింది. కృష్ణాజిల్లా యంత్రాంగం ముందుగా 86 ఎకరాలను కేటాయించింది. ఇంకా 120 ఎకరాల వరకు భూములను అప్పగించాల్సి ఉంది. ఈ క్రమంలో ఏపీఐఐసీ స్వాధీనం చేసుకున్న భూములను పరిశీలించేందుకు అమరావ తి ఇండస్ర్టీస్‌ అసోసియేషన కొద్దికాలం కిందట వీరపనేనిగూడెం వచ్చింది. తమకు తక్షణం రోడ్లు, విద్యుత సదుపాయాన్ని ఏర్పాటు చేస్తే వెంటనే వచ్చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఏపీఐఐసీ అధికారుల దృష్టికి పారిశ్రామి కవేత్తలు సూచించారు. ఈ క్రమంలో ఏపీఐఐసీ తాను స్వాధీనం చేసుకున్న 86 ఎకరాల లే అవుట్‌ కోసం సీఆర్‌డీఏకు దరఖాస్తు చే సింది. సీఆర్‌డీఏ నుంచి అనుమతులు వచ్చాక .. రోడ్లకు టెండర్లు పిలిచింది. రోడ్ల పనులు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో, శనివారం ఆంధ్రప్రదేశ ఇండస్ర్టియల్‌ ఇనఫ్రాస్ట్రక్చరల్‌ కార్పొరేషన(ఏపీఐఐసీ) ఎండీ నివాస్‌ మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్‌ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండటంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. రోడ్ల పనులు పూర్తికాగానే వెంటనే విద్యుత సదుపాయలం కల్పించే పనులు కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇదే సందర్భంలో అమరావతి ఇండస్ర్టీస్‌ అసోసియేషనతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఇక్కడి అధికారులకు సూచించారు. పనులు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో, సరైన సమయంలో పరిశ్రమలను స్థాపించటానికి వీలుగా చర్యలు తీసుకోవాలని అమరావతి ఇండస్ర్టీస్‌ అసోసియేషనకు కూడా సమాచారం అందించాలని ఎండీ నివాస్‌ ఇక్కడి అధికారులకు సూచించారు.
 
మేథా ఐటీ పార్క్‌ డీ నోటిఫై లేనట్టే
కేసరపల్లిలో ఏర్పాటు చేసిన ఐటీ పార్కును డీ నోటిఫై చేయటానికి గతంలో ప్రయత్నాలు చేసినా.. ప్రస్తుతం ఆదిశగా ఆలోచన చేయటం లేదని తెలుస్తోంది. ఐటీ పార్క్‌ మొత్తం ఐదు టవర్లతో ఉండాలి. ఒక్క టవర్‌ మాత్రమే ప్రస్తుతం పూర్తయింది. ఐదేళ్ళ నుంచి పూర్తయిన ఈ ఒక్క టవర్‌లోకి అరడజనుకు మించి ఐటీ సంస్థలు రావటం లేదు. దీంతో మిగిలిన టవర్ల నిర్మాణం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇదే సమయంలో తాత్కాలిక రాజధానిగా విజయవాడ వ్యవహరించిన సందర్భంలో మేథా టవర్స్‌ను డీ నోటిఫై చేసి ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వెలగపూడిలో సచివాలయం కడుతుండటంతో ప్రతిపాదనను విరమించుకున్నారు. ఏపీఐఐసీ ఎండీ నివాస్‌ కూడా దీని జోలికి ఇప్పట్లో వెళ్ళే ఉద్దేశం లేదని చెబుతున్నారు. మేథా టవర్‌ చుట్టూ ఖాళీగా ఉన్న భూముల విషయంలో ఆలోచన ఉందని చెప్పారు.
 
 
 
  •  
Link to comment
Share on other sites

పారిశ్రామిక ప్రగతిపై ‘భారీ’ ఆశలు
 
636166128941313392.jpg
రాజధాని ప్రాంత పరిధిలోకి భారీ పరిశ్రమలు వస్తున్నాయి. రాజధాని ప్రాంతం లో పరిశ్రమల ఏర్పాటుకు బాపులపాడు మండలం మల్లవల్లి ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాయి. బంగారు శుధ్ధి ప్లాంట్‌ (గోల్డ్‌ రిఫైనరీ), మోటార్‌ వెహికల్‌ బాడీ బిల్డంగ్‌ యూనిట్‌, ప్లాస్టిక్‌ ఇం డస్ర్టీస్‌ ఏర్పాటుకు మార్గం సుగమ మైంది. దేశంలోనే అత్యున్నత సంస్థలు వీటి ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ ఇండస్ర్టియల్‌ ఇన్‌ఫ్రాస్టక ్చరల్‌ కార్పొరేషన (ఏపీఐఐసీ)కు ప్రతిపాదనలు చేశాయి. (ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఖనిజాలను శుద్ధి చేయటంలో దేశంలోనే పేరుగాంచిన ’ ఇందాని ’ గ్రూప్‌ సంస్థ మల్లవల్లిలో గోల్డ్‌ రిఫైనరీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 30 ఎకరాల కోసం ప్రతిపాదించింది. అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ దక్షిణ భారత స్థాయిలో వెహికల్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటుకు 100 ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. కుమార్‌ - సింటెక్స్‌ సంస్థ కూడా భారీ యూనిట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సింటెక్స్‌ పేరుతో ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడే తయారు చేయటానికి రంగం సిద్ధం చేస్తోంది. దీని కోసం 100 ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. ఇంకా అనేక సంస్థలు ఇటు వైపు చూస్తున్నాయి. త్వరలోనే వాటి నుంచి కన్ఫర్మేషన వచ్చే అవకాశం ఉంది.
భూ బ్యాంక్‌ను మరింత పెంచాలి
మల్లవల్లిలో ఫుడ్‌ పార్క్‌కు కేటాయించిన భూములు మినహాయిస్తే ప్రస్తుతం 1250 ఎకరాల ల్యాండ్‌బ్యాంక్‌ ఉంది. భారీ పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకుంటే ఈ భూములు పది సంస్థలకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. పరిశ్రమలను ఏర్పాటు చేయటానికి ఒక్కో సంస్థ సగటున 100 ఎకరాలకు తక్కువ కాకుండా ప్రతిపాదిస్తోంది. ఈ లెక్కన చూస్తే.. మరో 7 సంస్థలకు మించి అవకాశం ఉండదు. కృష్ణాజిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి అన్ని అవకాశాలు ఉన్నా భారీ పరిశ్రమలు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సిమెంట్‌ ఫ్యాక్టరీలు, చక్కెర కర్మాగారాలు తప్పితే పెద్దగా చెప్పుకోవటానికి కూడా లేవు. మల్లవల్లిలో భూములు ఉండటం, మౌలిక సదుపాయాల కోసం ఏపీఐఐసీ చర్యలు చేపడుతుండటంతో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లవల్లి సమీప ప్రాంతాలలో ఏపీఐఐసీ భారీ స్తాయిలో భూ బ్యాంక్‌ను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మెగా ఫుడ్‌పార్క్‌కు 110 ఎకరాలు..
మల్లవల్లిలోనే మెగా ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి , కృష్ణాజిల్లా యంత్రాంగం 110 ఎకరాలను కేటాయించింది. మొత్తం భూములలో 58 ఎకరాలను ఫుడ్‌పార్క్‌కు కేటాయించారు. మిగిలిన 42 ఎకరాలను ఫుడ్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌కు కేటాయించాలని నిర్ణయించారు. ఫుడ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌కు సంబంధించి ఇప్పటికే మూడు ప్రధాన సంస్థలు ముందుకు వచ్చినట్టు సమాచారం.
Link to comment
Share on other sites

ఏపీఐఐసీకు భూ బదలాయింపు

పారిశ్రామిక అవసరాలకు 1,360 ఎకరాలు

మల్లవల్లి(హనుమాన్‌జంక్షన్‌ గ్రామీణం), న్యూస్‌టుడే : బాపులపాడు మండలం మల్లవల్లిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల్ని పారిశ్రామికాభివృద్ధికి వినియోగించేందుకు వీలుగా ఏపీఐఐసీకు భూ బదలాయింపు ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. రేషన్‌కార్డుదార్లకు రోజుల వ్యవధిలోనే పరిహారం చెల్లించే దిశగా దస్త్రం సిద్ధం చేస్తున్నారు. ఆక్రమణదారుల నుంచి ఎలాంటి అభ్యంతరాల్లేకపోవడంతో ఈ భూముల్లో మౌలిక వసతుల కల్పనకు వీలుగా ఏపీఐఐసీ కార్యాచరణ చేపట్టింది.

1,360 ఎకరాలు : మల్లవల్లి సర్వే సంఖ్య 11లో మొత్తం 1,460 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ఈ మొత్తాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రభుత్వం ఇందులో 1,360 ఎకరాలను ఏపీఐఐసీకు కేటాయించింది. మిగతా వంద ఎకరాలను భవిష్యత్తులో గ్రామంలోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఉంచింది. దీన్లో ఎలాంటి ఆక్రమణలు చోటుచేసుకోకుండా నివారించేందుకు ఏపీఐఐసీ ద్వారానే చుట్టూ కంచె వేయిస్తున్నారు.

పనులు మొదలు : కేంద్రం మంజూరు చేసిన మెగాఫుడ్‌ పార్కుకు ఇప్పటికే ఇందులో వందెకరాలు కేటాయించారు. దీని నిర్మాణానికి అనుగుణంగా పనులు ప్రారంభించారు. మరోవైపు మిగతా 1,260 ఎకరాల్లో పారిశ్రామికవాడను నెలకొల్పేందుకు వీలుగా ముందుగా రహదారులు సిద్ధం చేస్తున్నారు. అటు మల్లవల్లితోనూ, ఇటు మీర్జాపురం వద్ద పెడన-విస్సన్నపేట రాష్ట్ర రహదారిని అనుసంధానించేలా కొత్త రహదారుల నిర్మాణం, పాత రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవలే ఏపీఐఐసీ ఎండీ నివాస్‌ వీటిని స్వయంగా పరిశీలించారు.

గ్రామంలో మొత్తం 1,612 తెల్లరేషన్‌కార్డులు ఉండగా, ఇప్పటికే భూమికి సంబంధించిన పరిహారం పొందిన వారిని మినహాయించగా 1,256 మంది అర్హులుగా తేలారు. కార్డులో ఒకే సభ్యుడు ఉండి, అతడు మరణించిన నేపథ్యంలో ఇందులో కూడా కొంతమందిని తొలగించాల్సి ఉంది. డిసెంబర్‌ 15 లోగా వీరందరికీ రూ.50 వేలు చొప్పున పరిహారం వారి బ్యాంకు ఖాతాల్లోకి జమచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 4 weeks later...
Guest Urban Legend

super going at great pace

 

గన్నవరంలోని, బాపులపాడు మండలం మల్లవల్లి, అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది... రాష్ట్రం ఇండస్ట్రియల్ హబ్ గా పరిగణించి, పరిశ్రమలు నెలకొల్పటం, మరో పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన మెగా ఫుడ్‌పార్కు నెలకొల్పటంతో లేఔట్ కు, సీఆర్డీఏ అనుమతులు ఇచ్చింది. దీంతో, మెగా ఫుడ్ పార్కు ప్రాంతాన్ని, ఏపీఐఐసీ శరవేగంగా మౌలకి వసతులు కలిపిస్తుంది. ఇప్పటికే రోడ్ల నిర్మాణం ఒక కొలిక్కివచ్చింది. ఫుడ్‌పార్కు అవసరాలకోసం మొత్తం అయిదు రహదారుల్ని నిర్మిస్తున్నారు. ఉద్యానశాఖ మామిడి నర్సరీ కోసం ఉపయోగిస్తున్న వందెకరాలను కేటాయించారు. ఈ మెగా ఫుడ్‌పార్కు ప్రాజెక్ట్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.100 కోట్లను వెచ్చించనున్నాయి. ఇప్పటికే, రోడ్లు డ్రెయిన్ల నిర్మాణం దాదాపు పుర్తియ్యింది. ఈ 100 ఎకరాల్లో, ఆహార పరిశ్రమలకు ఫ్లాట్ల్ కేటాయింపుపై కసరత్తు పూర్తి చేశారు. ఆహార పరిశ్రమల పెట్టుబడి, వాటి సాయిని దృష్టిలో ఉంచుకుని ఫ్లాట్ల్ కేటాయిస్తారు.

అలాగే వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపేందుకు సిద్ధంగా ఉంది. ఇందు కోసం, ఇండస్ట్రియల్ హబ్ కోసం, మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసే పనిలో ఉంది, ఏపీఐఐసీ. మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను ఎల్ అం డ్ టీ సంస్థకు అప్పగించింది.

 

మల్లవల్లిలో ఫుడ్‌ పార్క్‌కు కేటాయించిన భూములు మినహాయిస్తే ప్రస్తుతం 1250 ఎకరాల ల్యాండ్‌బ్యాంక్‌ ఉంది. ఖనిజాలను శుద్ధి చేయటంలో దేశంలోనే పేరుగాంచిన ’ ఇందాని ’ గ్రూప్‌ సంస్థ మల్లవల్లిలో గోల్డ్‌ రిఫైనరీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 30 ఎకరాల కోసం ప్రతిపాదించింది. అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ దక్షిణ భారత స్థాయిలో వెహికల్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటుకు 100 ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. కుమార్‌ - సింటెక్స్‌ సంస్థ కూడా భారీ యూనిట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సింటెక్స్‌ పేరుతో ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడే తయారు చేయటానికి రంగం సిద్ధం చేస్తోంది. దీని కోసం 100 ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. ఇంకా అనేక సంస్థలు ఇటు వైపు చూస్తున్నాయి. త్వరలోనే వాటి నుంచి కన్ఫర్మేషన వచ్చే అవకాశం ఉంది.

మల్లవల్లిలో భూములు ఉండటం, మౌలిక సదుపాయాల కోసం ఏపీఐఐసీ చర్యలు చేపడుతుండటంతో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లవల్లి సమీప ప్రాంతాలలో ఏపీఐఐసీ భారీ స్తాయిలో భూ బ్యాంక్‌ను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Link to comment
Share on other sites

  • 4 weeks later...

super going at great pace

 

గన్నవరంలోని, బాపులపాడు మండలం మల్లవల్లి, అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది... రాష్ట్రం ఇండస్ట్రియల్ హబ్ గా పరిగణించి, పరిశ్రమలు నెలకొల్పటం, మరో పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన మెగా ఫుడ్‌పార్కు నెలకొల్పటంతో లేఔట్ కు, సీఆర్డీఏ అనుమతులు ఇచ్చింది. దీంతో, మెగా ఫుడ్ పార్కు ప్రాంతాన్ని, ఏపీఐఐసీ శరవేగంగా మౌలకి వసతులు కలిపిస్తుంది. ఇప్పటికే రోడ్ల నిర్మాణం ఒక కొలిక్కివచ్చింది. ఫుడ్‌పార్కు అవసరాలకోసం మొత్తం అయిదు రహదారుల్ని నిర్మిస్తున్నారు. ఉద్యానశాఖ మామిడి నర్సరీ కోసం ఉపయోగిస్తున్న వందెకరాలను కేటాయించారు. ఈ మెగా ఫుడ్‌పార్కు ప్రాజెక్ట్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.100 కోట్లను వెచ్చించనున్నాయి. ఇప్పటికే, రోడ్లు డ్రెయిన్ల నిర్మాణం దాదాపు పుర్తియ్యింది. ఈ 100 ఎకరాల్లో, ఆహార పరిశ్రమలకు ఫ్లాట్ల్ కేటాయింపుపై కసరత్తు పూర్తి చేశారు. ఆహార పరిశ్రమల పెట్టుబడి, వాటి సాయిని దృష్టిలో ఉంచుకుని ఫ్లాట్ల్ కేటాయిస్తారు.

అలాగే వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపేందుకు సిద్ధంగా ఉంది. ఇందు కోసం, ఇండస్ట్రియల్ హబ్ కోసం, మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసే పనిలో ఉంది, ఏపీఐఐసీ. మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను ఎల్ అం డ్ టీ సంస్థకు అప్పగించింది.

 

మల్లవల్లిలో ఫుడ్‌ పార్క్‌కు కేటాయించిన భూములు మినహాయిస్తే ప్రస్తుతం 1250 ఎకరాల ల్యాండ్‌బ్యాంక్‌ ఉంది. ఖనిజాలను శుద్ధి చేయటంలో దేశంలోనే పేరుగాంచిన ’ ఇందాని ’ గ్రూప్‌ సంస్థ మల్లవల్లిలో గోల్డ్‌ రిఫైనరీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 30 ఎకరాల కోసం ప్రతిపాదించింది. అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ దక్షిణ భారత స్థాయిలో వెహికల్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటుకు 100 ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. కుమార్‌ - సింటెక్స్‌ సంస్థ కూడా భారీ యూనిట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సింటెక్స్‌ పేరుతో ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడే తయారు చేయటానికి రంగం సిద్ధం చేస్తోంది. దీని కోసం 100 ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. ఇంకా అనేక సంస్థలు ఇటు వైపు చూస్తున్నాయి. త్వరలోనే వాటి నుంచి కన్ఫర్మేషన వచ్చే అవకాశం ఉంది.

మల్లవల్లిలో భూములు ఉండటం, మౌలిక సదుపాయాల కోసం ఏపీఐఐసీ చర్యలు చేపడుతుండటంతో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లవల్లి సమీప ప్రాంతాలలో ఏపీఐఐసీ భారీ స్తాయిలో భూ బ్యాంక్‌ను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

super going at great pace

Link to comment
Share on other sites

 

గన్నవరం సమీపంలోని వీరపనేనిగూడెంలో 75 కంపెనీలు....

veerapanenigudem-27022017.jpg

share.png

నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు భారీ ఎత్తున రానున్నాయి. హైదరాబాద్‌ నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి తరలివచ్చే పరిశ్రమల కోసం రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం వీరపనేనిగూడెం ఇండస్ర్టియల్‌ కారిడార్‌ లే అవుట్‌లో అభివృద్ధి పనులు ముమ్మరమయ్యాయి.

డీఆర్డీవో, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాల తయారీ... హెలికాప్టర్ తయారీలో ఉపయోగ పడే విడిభాగాలు తయారీ... ఎల్ఈడీ టీవీల్లో ఉపయోగించే పరికరాలు మొదలు ఎలక్రానిక్ వస్తువులకు అవసరమయ్యే విడిభాగాలను తయారుచేసే కంపెనీలూ రాబోతున్నాయి

ముందుగా 75 కంపెనీలు ప్రారంభమవుతాయి. వీటి ద్వారా మూడు వేల మందికి ప్రత్యక్షంగా, మరో రెండు వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకు తుందన్నారు. పూర్తిస్థాయిలో వచ్చాక మరో 400 చిన్న మధ్యతరహా కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. భారీ పరిశ్రమలతో పాటు చిన్న మధ్యతరహా పరిశ్రమలతోనూ అటు అభివృద్ది, ఇటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

 

Advertisements

ఇందులో భాగంగానే చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఆకర్షించేందుకు గన్నవరం సమీపంలోని వీరపనేనిగూడెంలో ఒక పారిశ్రామిక లే-అవుట్ ను ఏపీఐఐసీ సిద్ధం చేసింది. ఇందులో 75 సంస్థలకు కలిపి 81 ఎకరాలు కేటాయించింది. దీన్నీ ఒక మోడల్ పారిశ్రామిక ఎస్టేట్గా అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు, మౌలిక సదుపా యాలను కల్పిస్తున్నారు. దీన్నిచూసి ఇతర కంపెనీలు కూడా వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ఎస్టేట్లో భూములు పొందిన చిన్న మధ్యతరహా కంపెనీల యజమానులంతా సోమవారం అక్కడకు రానున్నారు. మౌలిక సదుపాయాలు, తమ ప్లాట్ల అభివృద్ధిని పరిశీలిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం వీరు తమ కంపెనీల నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ లే అవుట్ కు శంకుస్థాపన చేస్తారు.

 

Link to comment
Share on other sites

వీరపనేనిగూడెం మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌
 
636238633819125968.jpg
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వేదికగా నిలవనున్న వీరపనేనిగూడెం మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో డిసెంబర్‌ కల్లా పూర్తి స్థాయిలో అన్ని పరిశ్రమలు రూపుదిద్దుకోనున్నాయి. హైదరాబాద్‌ నుంచి తరలి వస్తున్న పరిశ్రమల మండలికి నేతృత్వం వహిస్తున్న అమరావతి ఇండస్ర్టీస్‌ అసోసియేషన డెడ్‌లైన్ ను అధికారికంగా ప్రకటించింది. ఐటీ పార్క్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించటానికి హైదరాబాద్‌ నుంచి అసోసియేషన ప్రతినిధులు సోమవారం వీరపనేనిగూడెం వచ్చారు. అభివృద్ధి పనులపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
 
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఏపీఐఐసీ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో ప్లాట్ల అభివృద్ధి పనులను రెండు, మూడు నెలల్లో పూర్తి చేస్తామని, డిసెంబర్‌, మార్చి నాటికల్లా పరిశ్రమలు నెలకొల్పుతామని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఐటీ పార్క్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించటానికి హైదరాబాద్‌ నుంచి అమరావతి ఇండ స్ర్టియల్‌ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం వీరపనేనిగూడెం వచ్చారు. ఇక్కడ పరిశ్రమలు పెట్టే 75 మందిలో దాదాపుగా 50 మంది వరకు పారిశ్రామికవేత్తలు వచ్చారు. లాటరీ విధానంలో తమకు కేటాయించిన ప్లాట్లను చూసుకున్నారు. పారిశ్రామికవేత్తలంతా కలసి రావటం ఇది రెండోసారి. రెండు నెలల కిందట మొదటిసారి వచ్చారు. అప్పట్లో ఐటీ పార్క్‌లో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిందిగా ఏపీఐఐసీ అధికారులను కోరారు. దీంతో ఏపీఐఐసీ అధికారులు మొదటి ఫేజ్‌లో రూ.20 కోట్ల వ్యయంతో లే అవుట్‌, రోడ్లు, స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయినేజీ, వాటర్‌ సప్లై తదితర సదుపాయాల కోసం టెండర్లును పిలిచింది. ముందుగా కొండను తొలిచి ప్లాట్లకు మార్గాన్ని కల్పించే పనులు చేపట్టింది. బ్లాకుల వారీగా ప్లాట్లకు చేరుకునేలా రహదారుల పనులు చేపట్టింది.
 
 
వీరపనేనిగూడేనికి ఏఐఏ బృందం
అమరావతి ఇండస్ర్టియల్‌ అసోసియేషన బృందం సోమవారం వీరపనేనిగూడెం ఐండస్ర్టియల్‌ పార్క్‌ను సందర్శించి అభివృద్ధి పనులపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. రెండు నెలల కిందట వచ్చినప్పటికీ, ఇప్పటికీ ఎంతో పురోగతి ఉందని చెప్పారు. పారిశ్రామికవేత్తలంతా తమకు కేటాయించిన ప్లాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం లే అవుట్‌ పక్కనే ఉన్న జిల్లా పరిషత హైస్కూల్‌లో స్థానిక ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రజా ప్రతినిధులు, ఏపీఐఐసీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
 
రూ.20 కోట్ల వ్యయంతో పనులు
ఏపీఐఐసీ చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) ప్రసాద్‌ కారిడార్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. మొదటి ఫేజ్‌లో భాగంగా 86 ఎకరాలలో 75 ప్లాట్లతో లే అవుట్‌ను రూపొందించినట్లు తెలిపారు. రోడ్లను మూడు కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ప్లాట్ల అభివృద్ధితో సమాంతరంగా బీటీ తదితర పనులు జరుగుతాయని తెలిపారు. స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయినేజీ, వాటర్‌ సప్లై పనులకు కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. మంచినీటి బోర్‌వెల్స్‌కు పరీక్షించామని, గంటకు 1500 గ్యాలన్ల నీటి లభ్యత ఉంటుందని తెలిపారు. విద్యుతపోల్స్‌ , విద్యుత వ్యవస్థ ఏర్పాటు కోసం ఏపీఎస్పీడీసీఎల్‌కు రూ. 80 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. మొత్తంగా రూ.20 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్లాట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడితే తదుపరి కార్యాచరణకు వెళతామని తెలిపారు.
 
నీరు .. విద్యుత్ ముఖ్యం
అమరావతి ఇండస్ర్టీస్‌ అసోయేషన్ ప్రతినిధులు ఏవీ రావు, రవి , మురళిలు మాట్లాడుతూ వెంటనే ప్లాట్ల అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుగా నీటి లభ్యత ఉండాలని చెప్పారు. విద్యుత్ సదుపాయం కూడా ఉండాలని తెలిపారు. దీనికి ఏపీఐఐసీ స్పందిస్తూ 5వేలకిలోవాట్‌ కెపాసిటీతో విద్యుత్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు. 10 వేల కిలోవాట్‌ నాణ్యమైన విద్యుత్ కావాలని డీపీఆర్‌లో పొందుపరచటం జరిగిందని తెలిపారు. విద్యుత్ హెచ్చు, తగ్గులు వచ్చినా నాణ్యత లేకపోయినా కోట్లాది రూపాయల యంత్రాలు కాలిపోతుందని చెప్పారు. డెడికేటెడ్‌ ఫీడర్‌ వేయాలని, ప్రత్యేకంగా సబ్‌స్టేషనను నిర్మించాలని తెలిపారు. దీనిపై ఏపీఐఐసీ సీఈ మాట్లాడుతూ తాము పరిశ్రమలు నెలకొల్పటానికి అవసరమైన మేరకు సబ్‌స్టేషన నుంచి డైవర్షన్ ద్వారా 5 వేల కిలోవాట్ల విద్యుత్ ను అందిస్తున్నామని, రెండో ఫేజ్‌లో సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. అండర్‌గ్రౌండ్‌ విద్యుత్ కేబులింగ్‌ పనులను పరిశీలించాల్సిందిగా సూచించారు. దీనిపై విద్యుతశాఖ అధికారి మాట్లాడుతూ కోస్టల్‌ తీరం వెంట లేము కాబట్టి సమస్య ఉండదని, అది మరింత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని చెప్పారు. అయినప్పటికీ దానిని కూడా పరిశీలిస్తామని చెప్పారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...