Jump to content

Recommended Posts

Posted
మే 10కి 900 ఎకరాల రాజధాని మాస్టర్ ప్లాన్: నారాయణ
 
636282226638815624.jpg
అమరావతి: మే నెల 10వతేదీకల్లా 900 ఎకరాల రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. బుధవారం అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మున్సిపల్ శాఖకు మొదటి ఈఏపీ ప్రాజెక్ట్ లభించిందని, ఏషియన్‌ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ నుంచి రూ.3700 కోట్ల రుణం అందుతుందన్నారు. మొత్తం 43 మున్సిపాలిటీల్లో మౌలిక వసతులకు ఈ రుణం తీసుకోవడం జరుగుతుందని, అయితే... ఈ రుణంలో 90 శాతం కేంద్రం చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచామని, వచ్చే మార్చికి 10 పట్టణాల్లో ప్రాజెక్టులు ఏర్పాటవుతాయని, రెండు బ్రిడ్జిలు తప్ప మిగతా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఆగస్టుకు పూర్తవుతుందని మంత్రి తెలిపారు.
  • 2 weeks later...
  • 2 weeks later...
Posted
విదేశీ సాయమే చాలదు!
 
  • ప్రత్యామ్నాయ గ్రాంట్లూ కావాలి
  • కేంద్రం వద్ద రాష్ట్రం పట్టు
  • నేడు కేంద్ర ప్రభుత్వ అధికారులతో సీఎస్‌ చర్చలు
  • ‘ప్యాకేజీ’లో వీలైనంత లబ్ధికి కసరత్తు
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టు(ఈఏపీ)ల ద్వారా కేంద్రం చేస్తానన్న సాయం ఒక్కటే చాలదని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. ఐదేళ్లపాటు సగటున ఏటా రూ.3 వేల కోట్లకు మించని ఈఏపీ సాయంతో అనుకున్న ప్రయోజనం నెరవేరదని భావించిన ప్రభుత్వం, దానికి అదనంగా కొన్ని గ్రాంట్లను కోరాలని నిర్ణయించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించడానికి ఒక ఉన్నతాధికార బృందం మంగళవారం ఢిల్లీ వెళ్తోంది.
 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక ఽశాఖ మరో కార్యదర్శి సునీత ఈ బృందంలో ఉన్నారు. ఆశించిన మేరకు ఈఏపీల ద్వారా నిధులు అందే అవకాశం లేదని గుర్తించిన ఉన్నతాధికారులు.. ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేశారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత కేంద్రాన్ని కోరవలసిన అంశాలపై స్పష్టత వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మూడు ప్రత్యామ్నాయ మార్గాల్లో అదనపు నిధులను కోరనున్నారు.
 
ఈఏపీలో బాగా వస్తే రూ.15 వేల కోట్లు!
2015-16 నుంచి చేపట్టిన ఈఏపీ ప్రాజెక్టులకు ఐదేళ్ల కాలపరిమితితో సాయం చేస్తామని కేంద్రం ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదాకు ప్రతిగా కేంద్రం చేసిన ప్రతిపాదన సారం ‘రాష్ట్రాల ప్రణాళికలకు కేంద్ర సాయం(సీఏఎస్‌పీ)లో ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు, సాధారణ తరగతి రాష్ట్రాలకు మధ్య ఉన్న వ్యత్యాసం 30ు. కేంద్ర వాటాలోని ఈ తేడా మేరకు ఈఏపీ ప్రాజెక్టులను తెచ్చుకుంటే రుణ దాతలకు కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది. ఏటా ఈమేరకు ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల మేరకు పూర్తిస్థాయిలో రాష్ట్రానికి నిధులు వస్తాయా? లేదా? అన్న సందేహాన్ని పక్కన పెడితే.. ఆ మొత్తం వచ్చినా రాష్ట్రం ఆశించిన ప్రయోజనం నెరవేరినట్టే! దీంతో ఇప్పుడు రాష్ట్రం.. ప్రత్యేక కేటగిరి రాష్ట్రాలకు సీఏఎస్‌పీతోపాటు ఈఏపీ రూపంలో వచ్చే ప్రయోజనాలపైనా దృష్టి సారించింది.
 
అందులో ఒకటి... ప్రత్యేక కేటగిరి రాష్ట్రాలకు ఈఏపీలలోనూ కేంద్రం వాటా 30ు అదనంగా ఉంటుంది కాబట్టి, ఏపీకి ప్యాకేజీలో ఆమేరకు అదనపు నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రెండో అంశం.. 2015-16కు ముందు చేపట్టిన ఈఏపీ ప్రాజెక్టులకు కూడా ఈ 30ు ఇవ్వాలని కోరనున్నారు. అయితే, దీంతో ప్రయోజనం చాలా పరిమితం. మూడో అంశం అత్యంత కీలకమైంది. చిన్న మొత్తాల పొదుపు రుణాలు, నాబార్డు రుణాలు, ఈఏపీ రుణాలు.. వాటిపై వడ్డీ మొత్తాలను తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా గ్రాంట్లుగా మార్చాలన్నదే ఈ విన్నపం. దీనికి కేంద్రం ఒప్పుకుంటుందా? అన్నది సందేహమే. అయితే, అందులో పెద్ద మొత్తాలను సాధించుకోవాలన్న పట్టుదలతో రాష్ట్రం ఉంది.
 
ఈ క్రమంలో చిన్న మొత్తాల పొదుపు రుణాలపై వడ్డీ రూపంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.1,464 కోట్లు చెల్లించాల్సి ఉంది. తిరిగి చెల్లించవలసిన అసలు రూ.881 కోట్లుగా ఉంది. పాత ఈఏపీ ప్రాజెక్టులపై అసలు రూ.592 కోట్లు, వడ్డీ రూ.201 కోట్లు చెల్లించాల్సి ఉంది. నాబార్డు రుణాల్లో తిరిగి చెల్లించవలసిన అసలు రూ.618 కోట్లు, వడ్డీ రూ.201 కోట్లుగా ఉంది. ఈ మొత్తాన్ని గ్రాంట్లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. ఇదే జరిగితే వచ్చే ఏడాది ఈఏపీ ప్రాజెక్టులకు అదనంగా రూ. 5 వేల కోట్ల మేరకు ప్రయోజనం కలుగుతుంది.
 
Posted
ఈఏపీపై ఆర్థికశాఖ అధికారులతో సీఎస్‌ చర్చ

ఈనాడు, దిల్లీ: కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ ఆర్థికసంస్థల నుంచి రుణసాయం అందించడంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో చర్చించారు. 2015-20 మధ్యకాలానికి అయిదేళ్లపాటు ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలతో సమానంగా ఈఏపీ ద్వారా ఆర్థికసాయం అందిస్తామన్న ప్రకటన మేరకు చేయూతనందించాలని కోరారు. 2015-16 ఆర్థికసంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ పద్దులపై ఆడిట్‌ నివేదిక పూర్తయినట్లు దినేష్‌కుమార్‌ కేంద్ర ఆర్థికశాఖ వ్యయ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. దాని ప్రకారం ఆ ఏడాది ఏపీకి రూ.2,900 కోట్ల సాయంరావాల్సి ఉన్నట్లు తెలిపారు. అయితే కేంద్ర అధికారులు మాత్రం అది రూ.2,500గానే చెప్పినట్లు సమాచారం. ఈ అంశంపై ఇరువర్గాలు మరికొంత స్పష్టతకు రావాల్సి ఉన్నట్లు తెలిసింది. 2016-17 లెక్కలపైనా ఇరువర్గాలు చర్చించినట్లు సమాచారం. ఏటా రూ.3వేల కోట్ల చొప్పున అయిదేళ్లకాలానికి రూ.15వేల కోట్ల సాయం చేయాలన్న ఏపీ ప్రభుత్వ వాదనను దినేష్‌కుమార్‌ ఆర్థికశాఖ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. బుధవారం ఆయన కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శి బీపీశర్మను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ అధికారుల కేడర్‌ రివ్యూపై చర్చించారు. ఇప్పటివరకు ఇచ్చిన 115 కేడర్‌ పోస్టులను 130కి పెంచాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఉన్న లోపాల సవరణపై ఇప్పటికే తాము కేంద్రహోంశాఖకు లేఖరాసినట్లు దినేష్‌కుమార్‌ చెప్పారు. ఉన్నత విద్యామండలి విభజనపై హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టును ఆశ్రయించడంపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Posted
ఏపీకి హోదా ఆదా 2500కోట్లు
18-05-2017 04:10:36
  •  లెక్క తేల్చిన కేంద్రం.. విభేదించిన రాష్ట్రం
న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వల్ల అదనంగా వచ్చే లాభాన్ని ప్యాకేజీ రూపంలో చెల్లిస్తాం!’... ఇదీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ! ఆ లాభం ఎంతో తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని గట్టిగా కోరారు. ఈ నేపథ్యంలో దీనిపై కొంత కదలిక వచ్చింది. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి ఏటా కలిగే లబ్ధిని కేంద్రం రూ.2500 కోట్లుగా తేల్చింది. ఈ లెక్కతో రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవించడం లేదు. హోదా వల్ల రూ.3 వేల కోట్లు అదనంగా వస్తాయని... ప్యాకేజీలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలో రూ.15వేల కోట్లు లబ్ధి కలిగేలా విదేశీ రుణ సహాయంతో చేపట్టే ప్రాజెక్టులను (ఈఏపీ) అనుమతించాల్సిందేనని డిమాండ్‌ చేస్తోంది. ‘హోదా - ఆదా’ లెక్కలపై బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శి లావాసాతో భేటీ అయ్యారు. ఏపీకి హోదా వల్ల కలిగే లబ్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుదీర్ఘ కసరత్తు చేశాయి. 2015-16 ఆడిట్‌ లెక్కల ప్రకారం ఏిపీకి వచ్చిన కేంద్రం సాయానికి అదనంగా మరో 30శాతం నిధులు కలిపితే ఏడాదికి రూ.2500కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.12,500కోట్లు వస్తాయని కేంద్ర ఆర్ధికశాఖ లెక్క తేల్చింది. అయితే, ఏపీ మాత్రం ఏడాదికి 2900-3000కోట్ల వరకూ కేంద్రం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది.
  • 1 month later...
Posted
ఈఏపీ కింద సాధిస్తే రూ.13 వేల కోట్లు లాభం

విదేశీ రుణ ప్రాజెక్టుల (ఈఏపీ) కింద ఎక్కువ సాయం కేంద్రం నుంచి సాధించగలిగితే ఐదేళ్లలో రూ. 13 వేల కోట్ల మేర లాభం కలుగుతుందని ఆర్థిక శాఖ అధికారులు ఈ సందర్భంగా ఎంపీలకు చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర ఈ సమావేశంలో కేంద్రం నుంచి సాధించాల్సిన నిధులపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘కేంద్ర ప్రాయోజిత పఽథకాలను మనం తీసుకొంటే నలభై శాతం రాష్ట్రం భరించాలి. విదేశీ ప్రాజెక్టుల కింద అయితే కేవలం పది శాతం భరిస్తే సరిపోతుంది. మొత్తం అవే తెచ్చుకోగలిగితే ఏడాదికి రూ.2600 కోట్ల భారం తగ్గుతుంది. ఐదేళ్లలో ఈ తేడా రూ.13 వేల కోట్లు ఉంటుంది’ అని తెలిపారు. ప్రతి శాఖకు ఎంపీలు వ్యక్తిగతంగా వెళ్లి విదేశీ ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆమోదింపచేయాలని, వాటంతటవే అవుతాయని ఊరుకోవద్దని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరంలో భూ సేకరణ, పునరావాస కల్పనకు రూ.32 వేల కోట్లు అవసరమని, ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 16 వేల కోట్లు కావాలని జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చేసిన ఖర్చులో కేంద్రం ఇంకా రూ.3 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. రాజధాని పేరిట విజయవాడ, గుంటూరు నగరాల్లో భూగర్భ డ్రైనేజీ ఇతరాలకు ఈ మూడేళ్లలో ఇప్పటికి రూ.1500 కోట్లు ఇచ్చారని, ఇంకా రూ. వెయ్యి కోట్లు రావలసి ఉందని సంబంధిత అధికారి ఒకరు వివరించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద కూడా ఇంకా రూ. వెయ్యి కోట్లు రావాలని చెప్పారు. కేంద్రం నుంచి రావల్సినంతగా సాయం రావడం లేదని, ఈ దిశగా ఎంపీలు ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. విశాఖ రైల్వే జోన్‌ ప్రజల్లో భావోద్వేగ అంశంగా ఉందని, దాని సాధనకు గట్టి ప్రయత్నం చేయాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు కోరారు. తమ ప్రాంతానికి సాగునీటి వసతికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు. 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా బీరు పోకుండా జాగ్రత్తగా పోలింగ్‌ చేయించాలని, ఎంపీలందరూ ఒక రోజు ముందే ఢిల్లీ చేరాలని చంద్రబాబు ఆదేశించారు

Posted
నవ్యాంధ్రకు విదేశీ ఇం‘ధనం’!
 
 
636355939652143584.jpg
  • 13 ప్రాజెక్టులు..5 ఏళ్లు.. రూ.41వేల కోట్లు
  • సాకారమవుతున్న విదేశీ రుణ సాయం ప్రాజెక్టులు
  • తుది దశలో 6 ఈఏపీలు.. వాటి విలువ 15879 కోట్లు
  • అమరావతి నగరాభివృద్ధి, నిరంతర విద్యుత్తు..
  • పారిశ్రామిక కారిడార్‌ ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌
  • రుణదాతల వద్ద ప్రతిపాదనల దశలో మరో మూడు
 
 
అమరావతి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన సమయలో రూ.16 వేల కోట్లు ఉన్న బడ్జెట్‌ లోటు.. ప్రస్తుతం రూ.20వేల కోట్లపైచిలుకుకు చేరింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిబాట పట్టించాలంటే కేంద్రం సాయంతోపాటు పెద్ద ఎత్తున విదేశీ రుణసాయాన్ని పొందక తప్పని పరిస్థితి. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర చేయూతతో విదేశీ ఆర్థికసాయం పొందే దిశగా కసరత్తును వేగవంతం చేసింది. ఐదేళ్ల కాల వ్యవధిలో విదేశీ రుణ సాయం(ఈఏపీ)తో చేపట్టే 13 ప్రాజెక్టులను కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.41,437 కోట్లు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఈ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రాజధాని అమరావతి అభివృద్ధి మొదలు.. రాయలసీమ కరవు నివారణ, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగమయ్యే ప్రాంతాల్లో అభివృద్ధి పనుల వరకు అన్నింటినీ ఈఏపీల్లో ప్రతిపాదించారు. కీలకమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదం పొందేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. విదేశీ రుణసాయంతో చేపట్టనున్న ప్రాజెక్టుల్లో రూ.15879 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులు కేంద్రం ఆమోదాన్ని పొంది రుణదాతల తుది ఆమోదం పొందే దశలో ఉన్నాయి. వీటిలో అమరావతి నగరాభివృద్ధి, నిరంతర విద్యుత్తు, వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ప్రాజెక్టులకు రుణదాతల ఆమోదం దాదాపు లభించగా మిగిలిన 3 ప్రాజెక్టులకు నేడో రేపో రుణదాతల నుంచి అనుమతి లభించే అవకాశం ఉంది.
ఆయా ప్రాజెక్టుల వివరాలు ఇవీ..
 
total-praject.jpg 
  
amaravathi.jpg అమరావతి నగరాభివృద్ధి
అమరావతి నగరాభివృద్ధి ప్రాజెక్టు.. ఈఏపీ ప్రాజెక్టుల్లో అతి పెద్దది. ఈ ప్రాజెక్టు ద్వారా రాజధాని ప్రాంతంలో రహదారులు తదితర మౌలికవసతులను అభివృద్ధి చేయనున్నారు. కేంద్రం, రుణదాతల ఆమోదం పొంది పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. రూ.4,749 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టులో ప్రపంచబ్యాంకు, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) భాగస్వాములు. ఆ రెండు కలిపి రూ.3,324 కోట్ల మేర రుణం ఇవ్వాల్సిఉంది.
 
 
irrigation_projects.jpg నీటివనరుల సమర్థ వినియోగం
రాష్ట్రంలోని 35 వేల చెరువుల పరిధిలో 3.2 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోంది. చెరువుల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు వాటి పరిధిలో సాగువిస్తీర్ణాన్ని పెంచాలన్న లక్ష్యంతో ‘ఏపీ ఇంటిగ్రేటెడ్‌ ఇరిగేషన్‌- అగ్రికల్చర్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టు’కు రూపకల్పన చేశారు. వాతావరణ పరిరక్షణకు అనుగుణంగా వ్యవసాయ దిగుబడులు పెంచడడం.. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పాదక రాబట్టడం.. సాగునీటి సంఘాల సామర్థ్యాన్ని పెంచడం కూడా ఈ ప్రాజెక్టులు లక్ష్యాలే. ఇది కూడా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.
 
 
projects.jpg తీరానికి పారిశ్రామిక కళ
రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికంగా కాస్త వెనుకంజలో ఉన్న రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో ‘వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ప్రాజెక్టు’కు రూపు ఇచ్చారు. రూ.2689 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రమే పూర్తిగా మారిపోనుంది. విశాఖ నుంచి చెన్నై వరకు తీరం వెంబడి రహదారుల నిర్మాణం, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వేగం పుంజుకోనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రుణ చర్చల ప్రక్రియ, ఒప్పందాలు ముగిసి పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది.
 
power-stations1.jpg నిరంతర విద్యుత్తు వెలుగులు
రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్తుపరంగా తీవ్రమైన ఒడిదుడుకులు ఉండేవి. విద్యుత్తు కోతలు తీవ్రంగా ఉండేవి. ప్రస్తుతం పరిస్థితి గాడినపడింది. మిగులు విద్యుత్తు దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్తు వెలుగులు ఉండేలా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకొనేందుకు ‘24/7 పవర్‌ ఫర్‌ ఆల్‌’ ప్రాజెక్టు ఎంతో కీలకమైనది. రూ 3,584 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుకు ఇటీవలే ప్రపంచబ్యాంకు ఆమోదం తెలిపింది. రుణ ఒప్పంద పత్రంపై సంతకాలు చేయడమే మిగిలి ఉంది.
 
kalavyavadi.jpg 
 
new-rs-500-note-bundle-new.jpg కాల వ్యవధి కీలకం
ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా.. 30 శాతం గ్రాంటు కింద ఏటా సగటున రూ.3 వేల కోట్ల చొప్పున లబ్ధి చేకూరుస్తామని, ఆమేరకు విదేశీ రుణాలు తెచ్చుకుంటే వడ్డీతోసహా తిరిగి చెల్లిస్తామని కేంద్రం తెలిపింది. పోలవరం నిధుల మొత్తాన్ని భరిస్తామనడంతోపాటు ఈఏపీల రూపంలో సాయాన్ని ప్రకటించడంతో రాష్ట్ట్ర ప్రభుత్వం పలు విడతలుగా రూ.41,437 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రతిపాదించింది. ఆ ప్రాజెక్టుల అమలుకు 2016-17 నుంచి 2020-21 వరకు కాలవ్యవధిని నిర్దేశించుకుంది. 2019 ఎన్నికల దృష్ట్యా ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
 
agriculture.jpg వ్యవసాయ ఉత్పత్తుల పెంపే లక్ష్యం
వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యాలను అభివృద్ధి చేయడం.. ప్రస్తుతమున్న నీటిపారుదల వ్యవస్థలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ‘ఏపీ ఇంటిగ్రేటెడ్‌ లైవ్‌లీహుడ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు’కు రూపకల్పన చేశారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టుకు రుణదాతల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించనుంది.
 
karuv-rahitham.jpg కరువురహిత రాష్ట్రం
రాష్ట్రాన్ని కరువురహితంగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. అందులో భాగంగా రూ.1257 కోట్లతో రూపొందించినదే ’కరువు నివారణ పర్యావరణసహిత వ్యవసాయ ప్రాజెక్టు’. ఈ ప్రాజెక్టు కూడా నేడో రేపో పట్టాలెక్కనుంది.
 
 
 
ప్రతిపాదనల దశలో 3.. ఆమోదం పొందాల్సినవి 4
కేంద్ర ప్రభుత్వ సూత్రప్రాయ ఆమోదంతో విదేశీ రుణ దాతలకు ప్రతిపాదనలు వెళ్లినవి మూడు ప్రాజెక్టులు. వాటిలో రూ.3,723 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పట్టణ నీటి సరఫరా, మురుగునీటి యాజమాన్య మెరుగుదల ప్రాజెక్టు అతి పెద్దది. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి కీలకమైన రూ.4.324 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు, రూ.4500 కోట్ల గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టుకూ ఆమోదం రావాల్సి ఉంది. వీటికి వీలైనంత త్వరగా ఆమోదం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
  • 2 months later...
Posted
ఇచ్చింది గోరంతే!
27-09-2017 02:27:58
 
636420761020940214.jpg
  • సత్వరమే ప్యాకేజీ నిధులివ్వండి
  • పథకాలు, విదేశీ రుణాల కింద 20 వేల కోట్లు రావాలి
  • ఈఏపీలకు 90:10 నిష్పత్తి
  • వాటికి ఎఫ్‌ఆర్‌బీఎం వద్దు
  • ఫైబర్‌నెట్‌పై జీఎస్టీ తగ్గించండి
  • జైట్లీకి సీఎం చంద్రబాబు వినతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు గతేడాది ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ మేరకు ఎన్నో నిధులు రావలసి ఉన్నా.. చాలా తక్కువ నిధులు విడుదలవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. నిధుల విడుదలలో కేంద్రం తాత్సారం చేస్తోందని అన్నారు. ఆయన మంగళవారమిక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో సమావేశమయ్యారు. ప్యాకేజీ నిధులను త్వరగా విడుదల చేయాలని, ప్యాకేజీని సంపూర్ణంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీలు, తదనంతర పరిణామాలు, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనను గుర్తుచేశారు.
 
కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్‌ఎస్)కు 2015-16 నుంచి 2019-20 వరకు కేంద్రం 90 శాతం నిధులు ఇవ్వడానికి బదులు.. ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ రుణాలతో చేపట్టే ప్రాజెక్టుల (ఈఏపీ) రూపంలో ప్రయోజనాలను అందిస్తామని 2016లో ప్రకటించారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రానికి ఈఏపీల రూపంలో ఆర్థిక సహకారం అందించేందుకు 2017 మార్చి 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వడం కంటే ఈఏపీల ద్వారానే రాష్ట్రానికి అదనపు లబ్ధి చేకూరుతుందని కేంద్రం చెప్పిందని తెలిపారు.
 
ఈఏపీల ద్వారా 2015-16 నుంచి 2019-20 వరకు తీసుకున్న రుణాలను ప్రత్యేక సహకారం రూపంలో కేంద్రం వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 90:10 నిష్పత్తి ప్రకారం కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వానికి 2015-16లో రూ.2951 కోట్లు, 2016-17లో రూ.2992 కోట్లు వచ్చి ఉండేవని.. ఈ లెక్కన ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి రూ.15 వేల కోట్లు రావాలని పేర్కొన్నారు. కానీ రాష్ట్రానికి ఈఏపీ సాయం కింద 2017-18 కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ.3500 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాలకు 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వడమే కాకుండా ఈఏపీ రుణాల విషయంలో కూడా 90: 10 నిష్పత్తి వర్తిస్తోందని చంద్రబాబు తెలిపారు.
 
అదే తరహాలో ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఈఏపీలకు 90:10 నిష్పత్తిని వర్తింపజేయాలని కోరారు. ‘గత రెండేళ్లలో ఈఏపీ రుణాల కింద 2016-17లో రూ.685 కోట్లు, 2016-17లో రూ.874 కోట్లు వచ్చాయి. ఇది కేవలం 70 శాతమే. ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఉండి ఉంటే 90 శాతం నిధులు పొందే అర్హత ఉండేది. హోదా ఉంటే... 2015-16లో రూ.881 కోట్లు, 2016-17లో 1124 కోట్లు పొందే అవకాశం ఉండేది. అంటే... సగటున ఏడాదికి రూ.1002 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5010 కోట్లు వచ్చేవి. కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఈఏపీల ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.20,010 కోట్లు రావలసి ఉంది’ అని వెల్లడించారు. ఈ లెక్కలను కేంద్రం పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక సహకార చర్యల కింద నిధులివ్వాలని అభ్యర్థించారు. నాబార్డు, హడ్కో, ఇతర వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలను పొందడానికి అనుమతివ్వాలని కోరారు.
 
ఈ భారాన్ని మోయలేం..
రాష్ట్రానికి అందించే ఈఏపీ రుణాలను ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్ట పరిధిలో పరిగణించవద్దని జైట్లీకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జూలై 10న కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి నుంచి వచ్చిన లేఖ తమను అసంతృప్తికి గురిచేసిందన్నారు. ఈ ఐదేళ్లలో తీసుకున్న ఈఏపీల రుణ మొత్తాన్ని, వాటి వడ్డీని కేంద్రం తిరిగి చెల్లిస్తుందని.. కానీ అంతకుముందున్న రుణ బకాయిల చెల్లింపునకు సహకరించబోమని అందులో పేర్కొన్నారని జైట్లీ దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా వాటికి ఎఫ్‌ఆర్‌బీఎంను వర్తింపజేస్తామని స్పష్టం చేశారని తెలిపారు. ఇప్పటికే ఆర్థికంగా సతమతమవుతున్న రాష్ట్రం వీటిని భరించే పరిస్థితి లేదని, కాబట్టి ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయించాలని కోరారు.
 
ఫైబర్‌నెట్‌పై జీఎస్‌టీ భారం తగ్గించండి
ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌)పై జీఎ్‌సటీ భారం తగ్గించాలని జైట్లీకి సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మెమోరాండం సమర్పించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్‌నెట్‌, కేబుల్‌ టీవీ అందించే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టు ప్రారంభించామని, 14వేల ఎంఎ్‌సవోలను కలుపుతూ 13 జిల్లాల గుండా 23.8 వేల కి.మీ. మేర ఇది విస్తరించిందని వివరించారు. వీటిపై 18 శాతం జీఎ్‌సటీ విధించడంతో అదనంగా భారం పడుతుందని.. 5శాతం శ్లాబుకు తగ్గించాలని కోరారు. కాగా.. తిరుమలలో దర్శన టికెట్లపై జీఎస్‌టీని మినహాయించాలని కోరగా.. జైట్లీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వచ్చే జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని సమాచారం. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సదరు సమావేశంలో మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు చర్చించే అవకాశం ఉంది
  • 4 weeks later...
Posted
నిధులు ఫుల్‌.. ఖర్చు నిల్‌!
19-10-2017 03:10:30
 
636439794313398535.jpg
  • మౌలికసదుపాయాల ఈఏపీలపై నిర్లక్ష్యం
  • నిధులున్నా సకాలంలో ఖర్చుపెట్టని వైనం
అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): గ్రామీణ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఈఏపీలను రాష్ట్రం నిర్లక్ష్యం చేస్తోంది. వందల కోట్ల నిధులు సమకూర్చేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయా శాఖలు సకాలంలో వాటిని ఖర్చు చేయడం లేదు. ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు ఖర్చుచేసి వాటి యూసీలను పంపితే కేంద్రం పరిశీలన తర్వాత ఆయా సంస్థలు నిధులు విడుదల చేస్తాయి. కానీ, రాష్ట్రంలో కొన్ని కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు.
 
దీంతో ఈ ఏడాది, వచ్చే ఏడాదికి పూర్తి కావాల్సిన కొన్ని ప్రాజెక్టులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. మూడేళ్ల క్రితం ప్రారంభమై ఈ డిసెంబర్‌ నాటికి పూర్తవ్వాల్సిన అనేక ప్రాజెక్టులు సగంలోనే ఆగిపోయి ఉన్నాయి.
 
  • వరల్డ్‌ బ్యాంకు నిధులు అందిస్తున్న ఏపీ గ్రామీణ నీటి సరఫరా, శానిటేషన్‌ ప్రాజెక్టు ఈ నవంబరు నాటికి పూర్తవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.405.72కోట్లు. ఇప్పటివరకు రూ.361కోట్లు మాత్రం ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన 42.88కోట్లు ఇప్పటి వరకూ ఖర్చు చేయలేదు.
  • ఏపీ మున్సిపల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టుకు కూడా ప్రపంచబ్యాంకు నిధులు అందిస్తోంది. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.1218.24 కోట్లు. ఇప్పటివరకు రూ.780కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో దీనికి రూ.145 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి అనుకున్న లక్ష్యం ప్రకారం రూ.124కోట్ల విలువైన పనులు పూర్తిచేయాలి. కానీ, ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.
  •  ఏపీ గ్రామీణ సమ్మిళిత వృద్ధి ప్రాజెక్టుకు కూడా ప్రపంచ బ్యాంకు నిధులు అందిస్తోంది. 2020 జూన్‌ నాటికి దీన్ని పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.642కోట్లు. ఇప్పటి వరకు రూ.227.13 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది కేటాయించిన నిధులను ఇంతవరకూ ఖర్చు చేయలేదు.
  • రూ.1831కోట్లతో ఏపీ కరువు నివారణ ప్రాజెక్టు ప్రారంభించారు. ఇందులో రాష్ట్ర గ్రాంట్‌ రూ.574 కోట్లు. దీనికోసం బడ్జెట్‌లో 22కోట్లు కేటాయించారు. కానీ వాటిని ఖర్చుపెట్టే ప్రయత్నం చేయలేదు.
  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను విద్యుదీకరించే ఉద్దేశంతో ప్రారంభించిన 24/7 పవర్‌ ఫర్‌ ఆల్‌ ప్రాజెక్టు పని కూడా నత్తనడకనే సాగుతోంది. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3584 కోట్లు. బడ్జెట్‌లో రూ.100కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు.
Posted

విదేశీ రుణం వూసే లేదు

ఇప్పటికీ పట్టాలెక్కని ఏపీ ప్రత్యేక ప్యాకేజీ

రాష్ట్ర ప్రతిపాదనలపై చర్చలతోనే కాలహరణం

ఈనాడు - దిల్లీ

20ap-main2a.jpg

కేంద్ర ప్రభుత్వం ఏడాది కిందట ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. గత ఏడాది సెప్టెంబర్‌ 7వ తేదీ రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విభజన చట్టంలో ప్రకటించిన హామీల అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల మాదిరే విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తీసుకొనే రుణంలో 90% కేంద్రమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. 2015-20 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తీసుకొనే రుణాలకు ఈ వెసులుబాటు వర్తింపజేస్తామని ప్రకటించారు. ఏడాది గడిచినా ఈ విషయంలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం, దానిపై కేంద్రం వివరణలు కోరడంతోనే పుణ్యకాలం గడిచిపోతోంది. విభజన కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం విదేశీ రుణం అందితే అభివృద్ధి పనులు చేపట్టవచ్చని ఆశిస్తోంది. కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తొలుత తన వాటా కింద 30% నిధులు ఖర్చు చేస్తేనే మిగతా రుణం గురించి ఆలోచిస్తామని చెబుతోంది. ఇలాంటి షరతుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.19,161 కోట్ల విలువైన ప్రతిపాదనలు కేంద్రం వద్ద అలానే ఉన్నాయి. ఆ ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు చెబుతూనే కేంద్రం కొన్ని రకాల షరతులు విధించించడం వల్ల రుణ వ్యవహారం ముందుకుసాగడం లేదు.

ఆరు ముఖ్యమైన ప్రతిపాదనలు, వాటి తాజా పరిస్థితి ఇలా...

1. ఏపీ కమ్యూనిటీ బేస్డ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు-2 అంచనా వ్యయం రూ.1,600 కోట్లు. ప్రపంచబ్యాంకు ద్వారా ఇచ్చే రుణం రూ.1,120 కోట్లు.

*రుణదాత, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరగాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 30% వాటాను పెట్టుబడిగా పెట్టాలి.

2. వైజాగ్‌ చెన్నై పారిశ్రామిక కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం అంచనా వ్యయం రూ.2,689 కోట్లు. ఏడీబీ ద్వారా రూ.2006 కోట్లు.

*ఏడీబీ డైరెక్టర్‌ 28.8.2017న భారత్‌ను సందర్శించినప్పుడు రూ.800 కోట్ల మొత్తాన్ని రెండు వాయిదాల్లో విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బలమైన ప్రాజెక్టు పర్యవేక్షణ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనికి తోడు మరో కమిటీని నియమించాలని సూచించారు.

3. అమరావతి రాజధాని అభివృద్ధికి మొత్తం వ్యయం రూ.4,749 కోట్లు. ప్రపంచబ్యాంకు ద్వారా రూ.3,324 కోట్లు.

*సంప్రదింపులు పురోగతిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 30% మొత్తాన్ని తొలుత ఖర్చుచేయాలి.

4. ఏపీ అర్బన్‌ వాటర్‌సప్లై, సెప్టేజ్‌మేనేజ్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు వ్యయం రూ.3,723 కోట్లు. ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) ద్వారా రూ.2,606.31 కోట్ల రుణం.

*కేంద్ర ఆర్థిక వ్యయ విభాగంలోని వడపోత సమితి (స్క్రీనింగ్‌కమిటీ) 24.1.2017న ఆమోద ముద్ర వేసి ఏఐఐబీకి పంపింది.

5. ఏపీ రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.3,200 కోట్లు. ఏఐఐబి ద్వారా రూ.2,240 కోట్లు.

*30% వాటాను తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాలని షరతు విధించింది.

6. పీ మండల, గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు వ్యయం రూ.3,200 కోట్లు. ఏఐఐబీ ద్వారా రుణం ఇవ్వాల్సి ఉంది.

*రుణదాత, రుణ గ్రహీత మధ్య సంప్రదింపులు జరగాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొంది. 30% వాటాను ఖర్చు చేయాలి.

  • 2 weeks later...
Posted
1 hour ago, Jaitra said:

Atleast RK has the balls to talk about this this....Dramoji is busy licking Kcr here and Modi there.

 
జైత్ర బ్రదర్ .... చెప్పాలా నిష్ఠురంగా ఉన్నా నిజమొకటి  ! ....తిలా పాపం తలా పిడికెడు ....బీజేపీ మాట మారుస్తుంది కథలు చెప్తుంది, యుద్ధ భేరి మోగించాలి, తెలుగు ప్రజను సిద్ధం చెయ్యాలి అనే సమయం చాలా సార్లు వచ్చింది గత మూడేళ్ళలో , నీళ్లు చల్లి చల్లార్చారు పదేపదే ...  రాధాకృష్ణ  లేడా ఈ ఆట లో, వెంకయ్య నాయుడుతో అప్పటికప్పుడు స్మూతింగ్స్,ఇంటర్వ్యూలు జనాల్లో ఉద్రేకం రాకుండా...ప్రత్యేక హోదా అవసరం లేదు ఇంకోటి వేరేది దానికంటే మంచిది ఇస్తున్నారు  ..ఇంకా భూస్థాపితం చేస్తది బీజేపీ కి ఎదురు తిరిగి పోరుకి సిద్ధం అయితే ...శల్య సారధ్యం, పిరికిమందు  అడుగడుగునా .....
 
అస్సలు వాళ్ళనీ వీళ్ళనీ అనాల్సిన పని లేదు జాతి లో సత్తువ, తెగింపు లేదు...ఆత్మ విశ్వాసం లేకపోతే ఎవరూ లెఖ్ఖ పెట్టరు, అది లోకరీతి, మాట మరచేవాళ్ళు ఎక్కువుంటారు, మర్యాద రామన్నలు అరుదు లోకంలో ... అన్నాయ్ చెప్పిన నీతి మర్చిపోయింది తెలుగుజాతి, దబాయించి తీసుకోకపోతే ఇవ్వరు.. ..ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ తో పాసివ్ యాంగర్ వచ్చింది వేసిన తప్పటడుగులతో ... పుంజుకోవాలంటే చెయ్యాల్సింది - అంతర్మథనం, ఆత్మవిమర్శ  ....
 
Posted

AJ publishing every day one artical about pushpams backstabbing to Ap.it shows CBN stand towards pushpams.If pushpams continues same strategy towards AP we may hear ram ram news in near future 

Posted
1 hour ago, krish2015 said:

AJ publishing every day one artical about pushpams backstabbing to Ap.it shows CBN stand towards pushpams.If pushpams continues same strategy towards AP we may hear ram ram news in near future 

Ya, without CBN nod,I don't think RK would independently publish these articles.

1 hour ago, Sr Fan said:
 
జైత్ర బ్రదర్ .... చెప్పాలా నిష్ఠురంగా ఉన్నా నిజమొకటి  ! ....తిలా పాపం తలా పిడికెడు ....బీజేపీ మాట మారుస్తుంది కథలు చెప్తుంది, యుద్ధ భేరి మోగించాలి, తెలుగు ప్రజను సిద్ధం చెయ్యాలి అనే సమయం చాలా సార్లు వచ్చింది గత మూడేళ్ళలో , నీళ్లు చల్లి చల్లార్చారు పదేపదే ...  రాధాకృష్ణ  లేడా ఈ ఆట లో, వెంకయ్య నాయుడుతో అప్పటికప్పుడు స్మూతింగ్స్,ఇంటర్వ్యూలు జనాల్లో ఉద్రేకం రాకుండా...ప్రత్యేక హోదా అవసరం లేదు ఇంకోటి వేరేది దానికంటే మంచిది ఇస్తున్నారు  ..ఇంకా భూస్థాపితం చేస్తది బీజేపీ కి ఎదురు తిరిగి పోరుకి సిద్ధం అయితే ...శల్య సారధ్యం, పిరికిమందు  అడుగడుగునా .....
 
అస్సలు వాళ్ళనీ వీళ్ళనీ అనాల్సిన పని లేదు జాతి లో సత్తువ, తెగింపు లేదు...ఆత్మ విశ్వాసం లేకపోతే ఎవరూ లెఖ్ఖ పెట్టరు, అది లోకరీతి, మాట మరచేవాళ్ళు ఎక్కువుంటారు, మర్యాద రామన్నలు అరుదు లోకంలో ... అన్నాయ్ చెప్పిన నీతి మర్చిపోయింది తెలుగుజాతి, దబాయించి తీసుకోకపోతే ఇవ్వరు.. ..ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ తో పాసివ్ యాంగర్ వచ్చింది వేసిన తప్పటడుగులతో ... పుంజుకోవాలంటే చెయ్యాల్సింది - అంతర్మథనం, ఆత్మవిమర్శ  ....
 

Hmm

  • 2 months later...
Posted

రుణ ప్రతిపాదనలివే.. 
రూ.27వేల కోట్లకు ఆంధ్రప్రదేశ్‌ 
రూ.14 వేల కోట్లకు తెలంగాణ 
ఈనాడు - దిల్లీ
వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి విదేశీ రుణ ప్రతిపాదనలు వచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పి.రాధాకృష్ణన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రూ.27,113 కోట్లకు, తెలంగాణ రూ.14,616 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చాయని, ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ సాగు నీరు, జీవనోపాధి మెరుగుదల రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన రుణ ఒప్పందంపై జైకాతో డిసెంబరు 13న సంతకాలు జరిగినట్లు తెలిపారు. అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంకులు (ఏఐఐబీ) సంయుక్తంగా రుణ సౌకర్యం అందించనున్నాయని చెప్పారు. ప్రపంచ బ్యాంకుకు చెందిన తనిఖీ బృందం సెప్టెంబరు 12-15 తేదీల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి తనముందుకొచ్చిన ఫిర్యాదులపై పరిశీలన జరిపి తదుపరి విచారణ కోసం విజ్ఞప్తి చేస్తూ నివేదిక సమర్పించినట్లు తెలిపారు. అందుకు భారత్‌ అభ్యంతరం తెలిపినట్లు వెల్లడించారు. గురుకుల విద్య, వైద్య వ్యవస్థ ఆధునీకరణ, అమరావతి హరిత అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన రుణ ప్రతిపాదనలను ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని వ్యవహారాల విభాగం ప్రపంచ బ్యాంకుకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ కోసం రూ.2,226 కోట్ల ప్రతిపాదనలు పంపి తర్వాత ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

Posted

 దశలో ప్రపంచ బ్యాంకు రుణం
03-01-2018 02:34:00
తర్వాత మంజూరుపై చర్చలు
అనంతరం నిధుల విడుదల
రాజధానికి కేంద్రం నుంచి 1500 కోట్లు
రాజ్యసభలో కేంద్ర మంత్రుల వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణం కోసం రుణం రూపంలో రూ.3,324 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్రప్రభుత్వం ప్రపంచబ్యాంకును అభ్యర్థించింది. 2016 మే నెలలో ఈ మేరకు విజ్ఞప్తి చేసిందని, ప్రస్తుతం ఈ వినతి మదింపు దశలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు.
 
మంగళవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కాంగ్రెస్‌ సభ్యుడు ఎంఏ ఖాన్‌ అడిగిన ప్రశ్నలకు జైట్లీ, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ సమాధానాలిచ్చారు. మదింపు జరిగాక రుణం మంజూరుపై చర్చలు ప్రారంభమవుతాయని, అనంతరం ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేస్తుందని జైట్లీ వివరించారు.
 
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ప్రపంచ బ్యాంకు వంటి బహుముఖ ఆర్థిక సంస్థల నుంచి పొందే ఆర్థిక సహాయం.. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 70 శాతం మించకూడదని, మిగిలిన 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరుల ద్వారా సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. రుణం ఇంకా మంజూరు చేయలేదు కాబట్టి నిధుల విడుదల, వినియోగ పత్రాల సమర్పణ వంటి అంశాలు ఉత్పన్నం కాబోవని స్పష్టం చేశారు. కాగా.. అమరావతి నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1500 కోట్లు ఇచ్చినట్లు పొన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు.
 
2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2016-17 వరకు మూడు దశల్లో నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం.. నూతన రాజధానిలో సౌకర్యాల కల్పన కోసం ఆర్థిక సహకారం చేస్తున్నామని విజయసాయిరెడ్డికి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. రాజ్‌భవన్‌, అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం 2014-15లో రూ. 500 కోట్లు; 2015-16లో రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు, పట్టణ మౌలిక సదుపాయాల కోసం మరో రూ.200 కోట్లు.. మొత్తం రూ.550 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
 
ఈఏపీ ప్రతిపాదనలివీ..
ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ రుణ సాయంతో నడిచే ప్రాజెక్టులు (ఈఏపీ) చేపట్టడానికి వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఉన్నాయని పొన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. ఆ ప్రాజెక్టుల వివరాలు ఇవీ..
సుమారు రూ.4535 కోట్లతో చేపడుతున్న రాజధాని ప్రాజెక్టుకు సాయం చేయడానికి ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ సంయుక్తంగా ముందుకొచ్చాయి. కొన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రపంచబ్యాంకు విజయవాడలో పర్యటించి నివేదికను అందించింది.
ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌, జీవనోపాధి మెరుగుపరిచే ప్రాజెక్టు రెండో దశ చేపట్టడానికి రూ.1700 కోట్ల రుణం కోసం జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా)తో 2017 డిసెంబరు 13న ఒప్పందం.
రూ.3200 కోట్లతో చేపడుతున్న ఆంధ్రప్రదేశ్‌ రోడ్స్‌ అండ్‌ బ్రిడ్జెస్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టు కోసం రూ.2240 కోట్ల ఆర్థిక సహకారం కోసం గతేడాది మే నెలలో ఏఐఐబీతో ఒప్పందం.
692.3 మిలియన్‌ డాలర్ల (రూ.4392 కోట్లు)తో చేపడుతున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టు కోసం 484.61 మిలియన్‌ డాలర్ల (రూ.3074 కోట్లు) ఆర్థిక సహకారం కోసం గతేడాది అక్టోబరులో ఏఐఐబీతో మరో ఒప్పందం.
651.38 మిలియన్‌ డాలర్ల (రూ.4131 కోట్లు)తో చేపడుతున్న రూరల్‌ రోడ్‌ కనెక్టివిటీ ప్రాజెక్టు కోసం నిరుడు అక్టోబరులో ఏఐఐబీతో ఒప్పందం.
రూ. 1290 కోట్లతో చేపడుతున్న గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ ఇంట్రా స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ ప్రాజెక్టు కోసం రూ.516 కోట్ల ఆర్థిక సహకారానికి 2015 అక్టోబరులో జర్మన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంకుతో రుణ ఒప్పందం.
360 మిలియన్‌ డాలర్ల (రూ.2283 కోట్లు)తో చేపడుతున్న ఏపీ ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్టుకు సాయం చేయాలని ప్రపంచ బ్యాంకుకు 2017 డిసెంబరులో కేంద్ర ఆర్థిక శాఖ సిఫారసు.
328 మిలియన్‌ డాలర్ల (రూ.2080 కోట్లు)తో చేపడుతున్న ఏపీ ఆరోగ్య వ్యవస్థల ప్రాజెక్టుకు సాయం చేయాలని ప్రపంచ బ్యాంకుకు 2017 డిసెంబరులో కేంద్ర ఆర్థిక శాఖ సిఫారసు.
156 మిలియన్‌ డాలర్ల (రూ.989 కోట్లు)తో చేపడుతున్న అమరావతి గ్రీనింగ్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని ప్రపంచ బ్యాంకుకు 2017 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వ సిఫారసు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...