Jump to content

Vijayawada railway station


sonykongara

Recommended Posts

Ignored station in united andhra pradesh.... eppudu chusina Secendrabad aneevallu

hmm.. South Central railway zone head quarter kada secunderabad so.. repu vizag ki zone istey vizag name inapadiddi..But train frequency lo vijayawada is top 6 in india and top1 in south india with 760 trains (Passenger n goods) daily...secunderabad daridaapullo kooda ledu..

Link to comment
Share on other sites

hmm.. South Central railway zone head quarter kada secunderabad so.. repu vizag ki zone istey vizag name inapadiddi..But train frequency lo vijayawada is top 6 in india and top1 in south india with 760 trains (Passenger n goods) daily...secunderabad daridaapullo kooda ledu..

True.....vizag cargo valla antha revenue vastadi....when it comes to passengers, VJA is way ahead than others....VJA zone aithene better for state ani naa yokka idi

Link to comment
Share on other sites

విజయవాడలో రైల్వే ప్లాట్‌ఫారాల విస్తరణ షురూ
 
636099494204505364.jpg
విజయవాడ (రైల్వేస్టేషన్‌), (ఆంధ్రజ్యోతి, విజయవాడ): రైల్వేస్టేషన్‌లో రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ (ఆర్‌ఆర్‌ఐ) పనులు ప్రారంభమయ్యాయి. మూడు దశల్లో పనులు చేపట్టనున్నారు. మొదటి దశ పనులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పాయింట్‌ క్రాస్‌ ఓవర్స్‌ను తొలగించే ప్రక్రియ చేపట్టారు. వీటి సిగ్నలింగ్‌ వ్యవస్థ అంతా పాత ఆర్‌ఆర్‌ఐ క్యాబిన్‌లో ఉంది. ఈ క్యాబిన్‌లో ఉన్న ప్యానెల్స్‌ అన్నింటినీ తొలగించి సరికొత్తగా నిర్మించిన ఆర్‌ఆర్‌ఐ క్యాబిన్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను దాదాపుగా ఐదు వందల మంది కార్మికులు చేపడుతున్నారు. రెండు, మూడు, నాలుగు, ఐదో నెంబర్‌ ప్లాట్‌ఫారాలలో కూడా 24 బోగీలతో కూడిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు రాకపోకలు సాగించే విధంగా విస్తరించే పనులు చేపట్టారు. దీంతో పాటు ఎనిమిది, తొమ్మిది, పది ప్లాట్‌ ఫారాలను కూడా పూర్తి స్థాయిలో ఆర్‌ఆర్‌ఐ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. పనులన్నీ పూర్తయిన తర్వాత మరో మూడు రోజుల పాటు సిగ్నలింగ్‌ వ్యవస్థను పరీక్షించాల్సి ఉంటుంది. దీంతో వారం రోజుల పాటు రైళ్ళ రాకపోకలను నిలిపివేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి దాదాపుగా రెండు వేల మంది ఉద్యోగులు ఇప్పటికే నగరానికి తరలి వచ్చారు. రెండో నాన్‌ రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ పనులు బుధవారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ పనులలో రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా ఉన్న యార్డులలో రైలు పట్టాలను తొలగించి కొత్త పాయింట్లను వేస్తారు. మూడో దశ పనులను కొత్తగా వేసిన రైలు పట్టాలు, వాటి పాయింట్లలో సిగ్నలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్‌ఆర్‌ఐ క్యాబిన్‌కు అనుసంధానిస్తారు. దీంతో రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ పనులు పూర్తవుతాయి. ఆ తర్వాత ట్రయల్‌ రన్‌ నిర్వహించి రైళ్ళ రాకపోకలను 29 వ తేదీ నుంచి పునరుద్ధరిస్తారు.
శాటిలైట్‌ స్టేషన్స్‌ పరిశీలన
శాటిలైట్‌ రైల్వే స్టేషన్ల నుంచి ఒక రోజు ముందుగానే సిటీ బస్సులను సిద్ధం చేయాలని ఆర్టీసీ, రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. సిటీ బస్సుల నైట్‌ హాల్ట్‌ కూడా శాటిలైట్‌ స్టేషన్ల దగ్గరే ఉంటుంది. ఎన్ని సిటీ బస్సులు సిద్ధం చేస్తారన్న విషయాన్ని మంగళవారం ఆర్టీసీ అధికారులు ప్రకటించనున్నారు. సోమవారం ఆర్టీసీ, రైల్వే ఉన్నతాధికారులు గన్నవరం, రామవరప్పాడు, గుణదల, రాయనపాడు శాటిలైట్‌ రైల్వేస్టేషన్స్‌ను పరిశీలించారు. ఆర్టీసీ విజయవాడ జోన్‌ ఈడీ ఎన్‌వీ రావు, విజయవాడ రైల్వే డివిజన్‌ అదనపు మేనేజర్‌ (ఏడీఆర్‌ఎం) వేణుగోపాల్‌తో పాటు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ (ఆర్‌ఎం) పీవీ రామారావు, సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (సీనియర్‌ డీసీఎం) షెఫాలీ, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ (డీసీటీఎం) నాగేంద్ర ప్రసాద్‌లు శాటిలైట్‌ స్టేషన్స్‌ను పరిశీలించారు. గన్నవరం రైల్వే స్టేషన్‌లో బస్సులు నిలుపుదల చేయటానికి సరైన ఏర్పాట్లు లేవని గుర్తించారు. ఇక్కడ బస్‌బే ఏర్పాటు చేస్తామని ఏడీఆర్‌ఎం వేణుగోపాల్‌ ఆర్టీసీ అధికారులకు హామీ ఇచ్చారు. రామవరప్పాడు రైల్వే స్టేషన్‌కు బస్సులు వెళ్ళలేవు కాబట్టి హైవే పక్కన కాలిబాట వంతెన సమీపంలో బస్‌బే ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు చెప్పారు. రాయనపాడు, గుణదల రైల్వే స్టేషన్లలో రోడ్డు సదుపాయాలతో పాటు, బస్సులు పార్కింగ్‌ చేయటానికి కూడా అనువుగా ఉందని గుర్తించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...