Jump to content

Amaravati


Recommended Posts

ఎన్టీఆర్‌ స్మారక చిహ్నానికి ఆరు ఆకృతులు
సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో ప్రజాభిప్రాయ సేకరణ
30ap-main2a.jpg

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని నీరుకొండ గ్రామంలో కొండపై ఏర్పాటుచేసే ఎన్టీఆర్‌ భారీ విగ్రహం, స్మారక చిహ్నం, మ్యూజియంకి సంబంధించి అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఆరు ఆకృతుల్ని సిద్ధం చేసింది. ఎన్‌సీసీ, జెనెసిస్‌, ఎల్‌ అండ్‌ టీ సంస్థలు వీటిని రూపొందించాయి.  సంబంధిత వీడియో చిత్రాలను ప్రజాభిప్రాయ సేకరణ కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) వెబ్‌సైట్‌లో ఉంచారు. నౌక(క్రూయిజ్‌), ఆల్చిప్ప(ఆయిస్టర్‌), ఆలయం, ఇహంపరం, వెండితెర, ఎన్టీఆర్‌ స్మారక సంబంధిత అంశాలతో ఈ ఆరు ఆకృతుల్ని రూపొందించారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది ఏ ఆకృతి వైపు మొగ్గు చూపితే దాన్ని ఎంపిక చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

పర్యాటక ప్రచారంపై 10 ప్రతిపాదనలకు ఆమోదం.. రాష్ట్రంలో పర్యాటకంపై ప్రచారానికి పలు సంస్థలు సమర్పించిన ప్రతిపాదనల్లో పదింటికి రాష్ట్ర స్థాయి పర్యాటక మార్కెటింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రచారానికి వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మంత్రి భూమా అఖిలప్రియ కార్యాలయంలో బుధవారం కమిటీ పరిశీలించింది. ప్రతిపాదిత సంస్థలతో ఈ కమిటీ సమావేశమై.. ఒక్కో దానిపై ప్రత్యేకంగా చర్చించింది. అనంతరం పది ప్రతిపాదనలకు ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. ఇందులో ఒకటి విమానాల్లో సీటు వెనకవైపు చిరు పుస్తకాలు(బుక్‌లెట్స్‌), ప్రచార చిత్రాలను ప్రదర్శించే ప్రతిపాదన ఉంది. ఈ కమిటీలో పర్యటక శాఖ కమిషనర్‌ హిమాన్షు శుక్లా, ఆర్థిక శాఖ ఉపకార్యదర్శి మల్లేశ్వరరావు, సాంస్కృతిక, సమాచార, పౌరసంబంధాల అధికారులు ఉన్నారు.

Link to comment
Share on other sites

నేడు, రేపు అమరావతిలో ప్రపంచ బ్యాంక్‌ బృందం పర్యటన
31-05-2018 08:59:54
 
636633540010604032.jpg
అమరావతి(ఆంధ్రజ్యోతి): ప్రపంచ బ్యాంక్‌ బృందం మరొకసారి రాజధానిలో విస్తృతంగా పర్యటించనున్నది. ఈ బ్యాంక్‌కు చెందిన 11 మంది ప్రతినిధులు గురు, శుక్రవారాల్లో అమరావతి నగరంలోని వివిధ ప్రదేశాల్లో పర్యటించి, అక్కడ జరుగుతున్న పనులతోపాటు ఇతర అంశాలు కొన్నింటిని కూడా పరిశీలించనున్నారు. ఆయా అంశాలపై ఏపీసీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులతో చర్చలు కూడా జరపనున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న ప్రాధాన్య రహదారుల్లో కొన్నింటితోపాటు రాజధానికి వరద ముప్పును తప్పించేందుకు చేపడుతున్న పథకం కోసం రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్‌ సూత్రప్రాయంగా అంగీకరించిన సంగతి విదితమే. అయితే ఈ రుణాన్ని విడుదల చేయాలంటే తాము నిర్దేశించిన నిబంధనలను పాటించాలన్న షరతును విధించింది. ఈ క్రమంలో ఆయా పనులు పరిసర ప్రాంతాల ప్రజలపై చూపే ప్రభావం, వాటి వల్ల నిర్వాసితులయ్యే వారికి కల్పించే పునరావాసం, నిర్మాణ ప్రదేశాల్లో తీసుకుంటున్న భద్రతా చర్యలు, వాటిలో పాల్గొనే కార్మికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పరిశీలించనున్నది.
Link to comment
Share on other sites

జూన్‌ రెండో వారంలో అమరావతి బాండ్లు విడుదల
31-05-2018 19:42:39
 
636633925666690386.jpg
 
అమరావతి: రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్న ‘అమరావతి బాండ్లు’ జూన్‌ రెండో వారంలో ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సమాచారం. రూ. 2వేల కోట్లు విలువైన బాండ్లను విడుదల చేయనున్నట్లు తెలియవచ్చింది. అమరావతి బాండ్ల విడుదలపై కసరత్తు పూర్తి అయిందని, ఆర్బీఐ పాలసీ ప్రకటన తరువాత బాండ్లను జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమరావతికి కావాల్సిన నిధుల్లో ప్రాథమికంగా రూ.2వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చే బాండ్ల ద్వారా సేకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

రాజధాని అభివృద్ధి పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష
31-05-2018 19:55:18
 
636633933257166672.jpg
విజయవాడ: రాజధాని అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం పనుల గురించి గొప్పగా చెప్పుకుంటున్నామని, రాజధాని పనులు కూడా ఆస్థాయిలో జరగాలని ఆదేశించారు. పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం సూచించారు. డస్సాల్‌ సిస్టమ్స్‌ అందజేసిన కొత్త టెక్నాలజీ ఎంతో ఉపయోగకరమని, అండర్‌గ్రౌండ్‌ పైప్‌లైన్‌ పనులను త్రీడీ టెక్నాలజీతో అంచనా వేయవచ్చని సీఎం వివరించారు. రాజధానిలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన ప్రెజెంటేషన్‌ను చంద్రబాబు పరిశీలించారు.
 
అమరావతిలో సింగపూర్‌ సంస్థ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్‌ను చేపడుతోందని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ చెప్పారు. ప్రతి 440 మీటర్లకు కూల్ స్పాట్స్ ఏర్పాటు చేయడం ద్వారా.. 10 డిగ్రీల మేర వ్యత్యాసం తీసుకురావచ్చని సీఆర్‌డీఏ కమిషనర్ వివరించారు. హైకోర్టు భవనాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నామని, రూ.1685 కోట్లతో హైకోర్టును ఐకానిక్‌గా నిర్మిస్తున్నామని, ప్రి ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్‌తో రాజధానిలో.. ఫార్య్చూన్ మురళీ త్రీస్టార్‌ హోటల్ నిర్మిస్తోందని శ్రీధర్ చెప్పారు.
Link to comment
Share on other sites

మంగళగిరి మండలంలోని కురగల్లు, యెర్రబాలెం గ్రామాల మధ్య అమృత విద్యాపీఠ్‌ మాతా అమృతానందమయి ఆర్గనైజేషన్‌ తరఫున 150 ఎకరాల్లో ఏర్పాటుకానున్న విశ్వవిద్యాలయ ప్రాంగణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం శంఖుస్థాపన చేయనున్నారు.

https://pbs.twimg.com/media/Dehubq9VQAEMbmN.jpg

Link to comment
Share on other sites

అమరావతి పనుల్లో వేగమేదీ?
ఐదు నిమిషాల వీడియో కూడా తయారు చేయలేకపోతే ఎలా?
సీఆర్‌డీఏ అధికారులపై చంద్రబాబు అసంతృప్తి
ఈనాడు - అమరావతి
31ap-main4a.jpg

ఈనాడు, అమరావతి: ఎంతో గర్వపడేలా పోలవరం ప్రాజెక్టు పనులను 55 శాతం పూర్తి చేయగలిగామని, అదే అమరావతి విషయంలో ఆ స్థాయిలో పనులు వేగంగా జరగడం లేదని సీఆర్‌డీఏ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధానిలో జరుగుతున్న పనులను మహానాడు వేదికగా.. చూపించేందుకు ఐదు నిమిషాల వీడియోను తయారు చేయాలని సూచిస్తే దానినీ జనాలకు అర్థమయ్యేలా రూపొందించలేకపోవడమేంటని ప్రశ్నించారు. అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ రూపొందించిన ప్రతిపాదనలను ముందే పరిశీలించి, వాటిలో మార్పులు, చేర్పులను సూచించేలా తన దగ్గరకు రాకుండా నేరుగా తనతోపాటే దానిని చూస్తే ఎలా అని నిలదీశారు. వెలగపూడి సచివాలయంలో గురువారం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. పేరుకు పదుల సంఖ్యలో సలహాదారులను పెట్టుకుని కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా పనులను ఎందుకు పరుగెత్తించలేకపోతున్నారని ఈ సందర్భంగా అధికారులను ప్రశ్నించారు. సీడ్‌ యాక్సెస్‌ రహదారి ప్రాంతంలో ఒక చోట దుమ్ము లేచి ఆ దారిన వెళ్లే వారికి ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. వర్షాకాలం రానున్నందున నిర్మాణ పనులు అనుకున్నట్లుగా సాగవని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

6అమరావతి బాండ్లు
రాజధాని నిర్మాణానికి నిధుల సేకరణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్న రూ.2వేల కోట్ల విలువైన అమరావతి బాండ్లను జూన్‌ 6న విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినందున ఆర్‌బీఐ విధాన ప్రకటన తర్వాత వీటిని జారీ చేయాలని తీర్మానించారు.

6 నెలల్లో త్రీడీ డిజైన్లు
అమరావతి త్రీడీ సిటీ డిజైన్లను 6 నెలల్లో పూర్తి చేయాలని చంద్రబాబు డస్సాల్ట్‌ సిస్టమ్‌ సంస్థ ప్రతినిధులను కోరారు. తొలుత వారు ఈ డిజైన్లపై సీఎంకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నగర ప్రణాళికలు, ప్రకృతి వైపరీత్యాలు, భూ ప్రకంపనలకు సంబంధించి సూచనలు అందజేయడంలో ఈ త్రీడీ డిజైన్లు కీలకమవుతాయని, నిర్మాణాలను ఎప్పటికప్పుడు వాస్తవ సమయంలో ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి ఉపకరిస్తాయని వారు చెప్పారు. భూగర్భ పైపు లైన్లు మొదలు భవంతుల మధ్య గాలి, వెలుతురు వరకూ త్రీడీ సాంకేతిక సాయంతో అంచనా వేయొచ్చని వివరించారు.

10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించేందుకు..
రాజధాని ప్రాంతంలో ఎండలు, ఉష్ణోగ్రతల తీవ్రతపై అధ్యయనం చేసిన నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ ప్రతినిధులు... ఆ అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సమావేశంలో వివరించారు. గత మూడు రోజుల్లో విజయవాడలో నమోదైన వాస్తవ ఉష్ణోగ్రత కంటే ప్రజలకు అనిపించే (ఫీలయ్యే) ఉష్ణోగ్రత అధికంగా ఉందని, దాదాపు 60 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉన్నట్లు అనిపించిందని తెలిపారు. రాజధానిలో పది డిగ్రీల సెంటిగ్రేడ్‌ మేర ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు.
*అన్న క్యాంటీన్ల నిర్మాణ ఆకృతులను పరిశీలించిన ముఖ్యమంత్రి అవసరమైన నిధుల కోసం ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద అన్న క్యాంటీన్లకు నిధులు సమకూర్చుకోవచ్చని చెప్పారు.
* ప్రీ ఫ్యాబ్రికేటేడ్‌ సామగ్రితో రాజధానిలో మూడు నక్షత్రాల హోటల్‌ నిర్మాణం చేపట్టేందుకు ఫార్చ్యూన్‌ మురళీ యాజమాన్యం ముందుకొచ్చిందని సీఆర్‌డీఏ అధికారులు వివరించారు.

Link to comment
Share on other sites

అమరావతీ పరుగులు తీయాలి
01-06-2018 02:04:14
 
636634154610600847.jpg
  • ఈ నెల తొలిపక్షంలో రూ.2వేల కోట్ల బాండ్లు.. ఆరు నెలల్లో 3డీ సిటీ డిజైన్లు
  • సీఆర్డీయే అధికారులతో సమీక్షలో సీఎం
  • అన్న క్యాంటీన్ల డిజైన్లు పరిశీలన
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలంతా గర్వంగా చెప్పుకునేలా పోలవరం ప్రాజెక్టును 55శాతం పూర్తి చేయగలిగామని, కానీ ఆ వేగం అమరావతి నిర్మాణంలో కానరావడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం మాదిరిగానే రాజధానిని కూడా పరుగులు పెట్టించాలని, ఇందుకోసం అమరావతిలో చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. సచివాలయంలో గురువారం జరిగిన సీఆర్డీయే 17వ అథారిటీ సమావేశంలో... రాజధాని పనులను సీఎం సమీక్షించారు. వర్షాలు వచ్చినా రాజధాని పనులు నిరంతరాయంగా జరిగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులకు సూచించారు. కాగా, రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణ కోసం అమరావతి బాండ్లను జూన్‌ 6వ తేదీ తర్వాత సీఆర్డీయే ప్రత్యేకంగా జారీ చేయనున్నది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొత్తం దాదాపుగా పూర్తి చేశామని, ఆర్‌బీఐ విధాన ప్రకటన అనంతరం జారీ చేస్తామని సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి చెప్పారు.
 
 
ఇదిలావుండగా, నగర ప్రణాళికల రూపకల్పనతోపాటు ప్రకృతి వైపరీత్యాలు, భూప్రకంపనలకు సంబంధించిన ముందస్తు సూచనలు చేయడంలో ఎంతగానో తోడ్పడే 3డీ సిటీ డిజైన్లపై అంతర్జాతీయ సంస్థ ‘డస్సాల్ట్‌ సిస్టమ్స్‌’ ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ డిజైన్లను 6 నెలల్లోగా సిద్ధం చేయాలని, ఇందులో స్థానిక విద్యార్థులనూ భాగస్వాములను చేయాలని, శిక్షణ ఇవ్వడం ద్వారా వారి నైపుణ్యాన్ని అభివృద్ధి పరచాలని డస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ప్రతినిధులకు సూచించారు. హైకోర్టు నిర్మాణ టెండర్ల ప్రక్రియ పూర్తి కావొచ్చిందని సీఎంకి సీఆర్డీయే కమిషనర్‌ వివరించారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ విధానంలో రాజధానిలో 3 నక్షత్రాల హోటల్‌ను నిర్మించేందుకు విజయవాడకు చెందిన ‘ఫార్చ్యూన్‌ మురళీ’ యాజమాన్యం ముందుకొచ్చిందని తెలిపారు. కాగా, అన్న క్యాంటీన్ల డిజైన్లను సీఎం పరిశీలించారు. వీటి నిర్వహణకు అవసరమైన నిధుల కోసం ప్రత్యేకంగా ఒక ఖాతాను ఏర్పాటు చేసుకోవాలని, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద కూడా వీటికి నిధులు సమకూర్చుకోవచ్చునని సూచించారు.
 
 
రాజధానిలో వేడిని తగ్గించాలి
అమరావతిలో వేడిని తగ్గించి, దాన్ని అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మార్చేలా తీసుకోవాల్సిన చర్యలపై నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ప్రజెంటేషన్‌ను సీఎం పరిశీలించారు. ప్రభుత్వం అనుసరించబోయే విధానాలపై దృష్టి సారించి రాజధానిలో ఉష్ణోగ్రతలను కనీసం 5 నుంచి 6 డిగ్రీల వరకూ తగ్గించవచ్చన్నారు. ‘సింగపూర్‌ పవర్‌’ అనే సంస్థ అమరావతిలో డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టంను ఏర్పాటు చేస్తోందని, ప్రతి 440 మీటర్లకు ఒక కూల్‌ స్పాట్‌ చొప్పున ఏర్పాటు చేసి 10 డిగ్రీల వరకూ వేడిని తగ్గించొచ్చని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

modi akkadiki vellinappudu 

 

Andhra Pradesh Amaravati city project is progressing well with Singapore Consortium. We also recently launched Maharashtra-Singapore joint committee, to explore economic cooperation including planning & development of airport in Pune: PM of Singapore Lee Hsien Loong

Link to comment
Share on other sites

Guest Urban Legend
2 hours ago, AnnaGaru said:

eedu matram dusuku potunadu....

 

govt rent pay chestundhi bro 3 years ki so he picked up the pace 

Link to comment
Share on other sites

రాజధానిపై ఆసక్తి చూపుతున్న నిపుణులు
02-06-2018 22:10:09
 
636635742164667426.jpg
అమరావతి: గ్రీవెన్స్‌హాల్‌లో సీఎం చంద్రబాబును ప్రఖ్యాత అవయవ మార్పిడి నిపుణులు మహ్మద్‌ రేలా  కలిశారు. రాజధానిలో అవయవ మార్పిడి ఆస్పత్రి నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నట్లు చంద్రబాబుకు  తెలిపారు. ఆస్పత్రి నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించాలని రేలా కోరారు. దీనికి సీఎం చంద్రబాబు..  ఆస్పత్రి నిర్మాణంపై పూర్తి వివరాలతో వస్తే అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...