Jump to content

Amaravati


Recommended Posts

Guest Urban Legend
3 minutes ago, Bezawadabullo said:

idhi ekkada?

 

toomuch undhi

vaaradhi to guntur highway near mangalagiri 

 

Link to comment
Share on other sites

11 minutes ago, Bezawadabullo said:

idhi ekkada?

 

toomuch undhi

Back side of Nagarjuna university...krishna family varasatwa polam lo(Mahesh babu e.t.c parters)....

when Nuzveedu was thought capital they put it for sale...brokers used to market saying "buy krishna mahesh babu land". .....No one came to buy as it was single large BIT(almost 30 crores) and later it became gold and now this project...

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

Couple of convention centers needed ASAP. 

Pellillaku vadukovatchu season lo 

UN season lo summits workshops lantivi pettukovatchu

Ippativaraku aa hotels Kalyana mandapale dikku - inka entha kalam tents lo lagistharu

-vizag lo ee year kuda tents ye 

Link to comment
Share on other sites

1 hour ago, AnnaGaru said:

Back side of Nagarjuna university...krishna family varasatwa polam lo(Mahesh babu e.t.c parters)....

when Nuzveedu was thought capital they put it for sale...brokers used to market saying "buy krishna mahesh babu land". .....No one came to buy as it was single large BIT(almost 30 crores) and later it became gold and now this project...

@Annagaru, question was about DGP office. meeru Venuzia gurinchi cheptunnatlunnaru.

Link to comment
Share on other sites

టెండర్లు రద్దు.. ఐకానిక్‌ బ్రిడ్జ్ ఆలస్యం..!
02-03-2018 07:29:34
 
636555725736717283.jpg
  • మొదటి టెండర్లు రద్దు
  • పోటీ లేకపోవడంతో నిర్ణయం
  • మళ్లీ టెండర్లకు ఆహ్వానం
  • అంచనా వ్యయం రూ.14 కోట్లు పెంపు
 
కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణ పనులు ఆలస్యమయ్యేట్టు కనిపిస్తోంది. అన్నీ కుదిరితే మార్చి నాటికే నిర్మాణ పనులను చేపట్టి ఏడాదిలోగా పూర్తి చేయాలని భావించింది. కానీ, టెండర్ల ప్రక్రియ ఇంకా ఆలస్యం కావడంతో పనులు వాయిదాపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 
 
మంగళగిరి: రాజధాని ప్రాంతం అభివృద్ధి కృష్ణానదిపై ఏర్పాటయ్యే వంతెనల మీద ఆధారపడివుంది. కృష్ణానదిపై ఒకటి, రెండు వంతెనలు నిర్మిస్తే...రాజధాని ప్రాంతానికి హైదరాబాద్‌, రాయపూర్‌ నుంచి నేరుగా అత్యుత్తమ రవాణా మార్గాలు అభివృద్ధి చెందినట్టువుతుంది. అలాగే విజయవాడ త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు వీలు కలుగుతుంది. రాజధాని అమరావతితోపాటు, కంచికచర్ల మొదలు గొల్లపూడి వరకూ భూములకు మంచి గిరాకీ వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం కృష్ణానదిపై మొత్తం 4 వంతెనలు నిర్మించాలని ప్రతిపాదించింది. వీటిలో తొలుత రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ నగరం నుంచి అటు కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం సెంటరును అనుసంధానించేలా కృష్ణానదిపై 3.2కి.మీ. పొడవునా బ్రహ్మాండమైన ఐకానిక్‌ బ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదించింది. అమరావతికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వుండేలా దీనిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు పదేపదే స్పష్టం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.
 
మూడే సంస్థలు పోటీ!
రాజధాని అమరావతిలో ప్రభుత్వ నగరానికి అభిముఖంగా ఎన్‌-10 రహదారి ముగిసే ప్రాంతం నుంచి ఈ ఐకానిక్‌ బ్రిడ్జి మొదలవుతుంది. ఇది కృష్ణానదిపై 3.2 కి.మీ. పొడవున అటు ఫెర్రీ వద్ద పవిత్రసంగమ ప్రాంతాన్ని చేరుతుంది. 6 వరుసలుగా దీనిని నిర్మిస్తారు. ఇందుకోసం గతేడాది జూన్‌లో ఎల్‌అండ్‌టీ సంస్థ రూపొందించిన 6 డిజైన్లను సీఎం పరిశీలించారు. నమస్కారం, కూచిపూడి నాట్యభంగిమ, ఆరల ముద్ర, డబుల్‌డెక్కర్‌ బ్రిడ్జి, బుద్ధ స్థూపతోరణం, కొండపల్లి పడవ బొమ్మ డిజైన్లలలో వీటిని చూపించారు. అప్పట్లో కూచిపూడి నాట్య భంగిమవైపు అందరూ మొగ్గుచూపారు. దీని ఆధారంగా వంతెన డిజైన్‌ను మరింత సరికొత్తగా మలిచి ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) పద్ధతిలో నిర్మించేందుకుగాను అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ గతేడాది టెండర్లను ఆహ్వానించింది.
 
   రూ.1,334 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కోసం ఎల్‌అండ్‌టీ, గామన్‌, ఎస్పీసీ సంస్థలు మూడే పోటీపడ్డాయి. ఒక్క ఎల్‌అండ్‌టీ సంస్థ మాత్రమే టెక్నికల్‌ బిడ్‌లో అర్హత సాధించింది. దీంతో ఫైనాన్సియల్‌ బిడ్‌లో పోటీలేకపోయింది. దరిమిలా ప్రభుత్వం సదరు టెండర్లను రద్దుచేసి సోమవారం కొత్తగా టెండర్లను ఆహ్వానించింది. ఈసారి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కొద్దిగా పెంచి రూ.1,348.09 కోట్లగా టెండర్లను పిలిచారు. ఇదంతా కొలిక్కి వచ్చి..పనులు మొదలయ్యే సరికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

ప్రజా రవాణా వ్యవస్థపై ప్రముఖ సంస్థల ఆసక్తి
02-03-2018 07:39:18

అమరావతి: రాజధాని ప్రాంతంలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న సమీకృత ప్రజా రవాణా వ్యవస్థ (ఇంటెగ్రేటెడ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం)లో కీలకమైనదైన బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం (బీఆర్టీఎస్‌)పై ఈ రంగంలో పేరొందిన పలు ప్రముఖ సంస్థలు ఆసక్తిని కనబరిచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజధానిలోని సుమారు 1671 కిలోమీటర్ల మేర నిర్మితమవనున్న నగర రోడ్లు, ఎల్పీ ఎస్‌ లేఅవుట్లలోని రహదారులను సమర్ధంగా అను సంధానిస్తూ బీఆర్టీఎస్‌ను ఏర్పాటు చేయాలన్నది సీఆర్డీయే ఉద్దేశ్యం. అమరావతిలో అంతర్గత అను సంధానం అనంతరం ఈ వ్యవస్థను దానికి చుట్టుపక్కల ఉన్న విజయవాడ, గుంటూరు నగ రాలకు కలపాలన్నది లక్ష్యం. తద్వారా రాజధానిలోని అన్ని ప్రాంతాల మధ్యనే కాకుండా వాటి నుంచి విజయవాడ, గుంటూరులకు కూడా అద్భుత ప్రజా రవాణా వ్యవస్థను నెలకొల్పాలని భావిస్తున్నారు.
 
  ఈ పథకాన్ని చేపట్టాలంటే సంబంధిత రంగంలో అను భవం, నైపుణ్యమున్న సంస్థను ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌గా నియమించుకోవాలని సీఆర్డీయే నిర్ణయించింది. దాని ద్వారా అమరావతి బీఆర్టీఎస్‌పై సమగ్ర అధ్యయనం చే యించి, సవివర పథక నివేదిక (డి.పి.ఆర్‌.)ను రూపొం దింపజేయనుంది. వీటితోపాటు సదరు డీపీఆర్‌ ప్రకారం టెండర్లు పిలిచి, అర్హమైన సంస్థను ఎంపిక చేయడంలో సీఆర్డీయేకు సహకరించడంతోపాటు ఈ ప్రాజెక్టు సజావుగా పట్టాలెక్కేలా చూడాల్సిన ఈ ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌ సంస్థను ఎంపిక చేసేందుకు కొంత కాలం క్రితం సీఆర్డీయే ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌.ఎఫ్‌.పి.)ను ఆహ్వానించింది. వీటిని సమ ర్పించేందుకు ఈ నెల 12వ తేదీవరకూ గడు వునిచ్చింది. ఈలోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ రింత సమాచారం కావాలనుకునే కంపెనీల సౌక ర్యార్ధం బుధవారం విజయవాడలోని తన ప్రధాన కార్యాలయంలో సీఆర్డీయే ప్రీబిడ్‌ సమావేశం నిర్వహిం చగా 5 సుప్రసిద్ధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కంపెనీలతోపాటు గడువు ముగిసేలోగా మరికొన్ని సంస్థలు కూడా ఆర్‌.ఎఫ్‌.పి.లను దాఖలు చేస్తాయని సీఆర్డీయే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గడు వుకల్లా అందిన ఆర్‌.ఎఫ్‌.పి.లను పరిశీలించి, ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌ను ఎంపిక చేసి, దానికి అమరావతి బీఆర్టీఎస్‌ డీపీఆర్‌ను రూపొందించే బాధ్యతను అప్పగించనున్నారు.

Link to comment
Share on other sites

కేంద్రం 
రూ.219 కోట్లతో ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ ఆమోదం 
  ఇప్పటికే అమరావతిలో   250 ఎకరాల కేటాయింపు
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 9(3) కింద చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ ఆమోదముద్ర వేసింది. గురువారం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. రాష్ట్ర విభజన కారణంగా అది తెలంగాణకు వెళ్లిపోవడంతో  దానికి సమానమైనస్థాయిలో అత్యాధునిక శిక్షణ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీనిపై 2016 డిసెంబర్‌ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరుగుతూ వచ్చాయి. ఎట్టకేలకు గురువారం దానికి ఆమోదముద్ర వేశారు. అమరావతి సమీపంలో 250 ఎకరాల్లో రెండు యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గుంటూరు జిల్లాలో మొత్తం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌, ప్రత్యేక విభాగాల ఏర్పాటుకు 2014లో రాష్ట్ర ప్రభుత్వం 2,700 ఎకరాల పలుచబడ్డ అటవీప్రాంతాన్ని గుర్తించింది. దీని మళ్లింపునకు కేంద్ర అటవీశాఖ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఇందులో 250 ఎకరాలను గ్రేహౌండ్స్‌ కేంద్రానికి కేటాయించింది.  హైదరాబాద్‌ తరహాలో పూర్తిస్థాయి మౌలిక వసతులతోకూడిన గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుచేయాలంటే రూ.853.37 కోట్లు ఖర్చవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంచనావేసింది. కేంద్రం మాత్రం ప్రస్తుతం రూ.219 కోట్ల ప్రాజెక్టుకే ఆమోదముద్ర వేసింది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...