Jump to content

Amaravati


Recommended Posts

అమరావతికి 58 వేల కోట్లు ఖర్చు అంచనా
 
636155192968379335.jpg
విజయవాడ: అమరావతికి రూ.58 వేల కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. అమరావతి నిధుల సమీకరణకు 5 మార్గాలను సీఆర్డీఏ సూచించింది. ప్రతిపాదనలను సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ సీఎం ముందుంచారు. మౌలిక సదుపాయాల కోసం రూ.32 వేల కోట్లు, హడ్కో, ప్రపంచబ్యాంక్‌, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించాయి.
 
రాజధానికి సహకరించే సంస్థల ప్రతినిధులతో ఈనెల 25న అమరావతి ఫైనాన్సింగ్ రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. పీపీపీ పద్ధతిలో రూ. 5,500 కోట్లు సేకరించాలని ప్రతిపాదన చేశారు. సీడ్ కేపిటల్, ప్రభుత్వ భవనాలు, నివాసాలు నిర్మించి లీజ్-రెంటల్ విధానం ద్వారా రూ.2850 కోట్లు సమకూర్చుకోవచ్చని సీఆర్డీఏ ప్రతిపాదన చేసింది. వివిధ దేశాల భాగస్వామ్యంతో ప్రాయోజక అభివృద్ధి కింద రూ.1400 కోట్లు సమకూరగలవని అధికారులు అంచనా వేస్తున్నారు.
Link to comment
Share on other sites

అమరావతిలో 1620 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్‌లు
 
అమరావతిలో 1620 కి.మీ మేర సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఆలిండియా బైస్కిలింగ్ ఫెడరేషన్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వెలగపూడిలో సైకిల్ ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు. 43 కిలోమీటర్ల మేర ఉన్న వెలగపూడి సచివాలయంలో పబ్లిక్ బైక్ షేరింగ్ విధానంలో బైస్కిలింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయనున్నారు. వంద సైకిళ్లు, 6 బైక్ స్టేషన్లు మూడు నెలల్లో సిద్ధం కానున్నాయి.
Link to comment
Share on other sites

అమరావతి నిధుల సమీకరణకు 5 మార్గాలు

 

 
 

amaravati-funds-23112016.jpg

ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణానికి ప్రధానంగా 5 మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టనున్నారు. ప్రపంచస్థాయి నగరంగా రూపుదాల్చనున్న కొత్త రాజధానికి నిర్మాణదశలో ఎలాంటి నిధుల కొరత రానివ్వరాదన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనల మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ నిధుల సమీకరణకు గల అవకాశాలపై కసరత్తు చేసి కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదనలను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రి ముందుంచారు. దీనిపై సమావేశంలో సవివరంగా చర్చించారు.

రాజధాని నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం రూ.58 వేల కోట్లు ఖర్చు కాగలదని భావిస్తున్నారు. ఈ మొత్తంలో 70 శాతం అంటే రూ.32 వేల కోట్లు రానున్న 2017, 18, 19 సంవత్సరాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చవుతుందని అంచనావేశారు. ఈ నిధులను హడ్కో, వరల్డ్ బ్యాంక్, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించారు. రాజధానిలో ఆవాస సముదాయాల నిర్మాణాలకు హడ్కో ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులకు గృహ సముదాయ నిర్మాణాల నిమిత్తం రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ అమరావతిలో కొంత స్థలాన్ని కేటాయించనుంది. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించే సంస్థల ప్రతినిధులతో ఈనెల 25న ‘అమరావతి ఫైనాన్సింగ్ రౌండ్ టేబుల్’ పేరుతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు.

సీఆర్‌డీఏ 5 ప్రతిపాదనలలో మొదటిది పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానం. దీని ద్వారా రాజధానిలో రహదారులు (రోడ్ ప్యాకేజ్ 2, 3), నీరు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఈ పీపీపీ పద్ధతిలో చేపట్టే ప్రాజెక్టుల ఆమోదానికి, పర్యవేక్షణకు ఒక సాధికార కమిటీని ఏర్పాటుచేస్తారు. పీపీపీ పద్ధతిలో రూ. 5,500 కోట్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు సమకూరగలవని భావిస్తున్నారు.

రెండో ప్రతిపాదన ప్రకారం లీజు-రెంటల్ డిస్కౌంటింగ్ విధానంలో ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ నివాసాలు, సీడ్ కేపిటల్ ఏరియా అభివృద్ధి చేపడతారు. ఈ విధానంలో సీఆర్‌డీఏకు ప్రభుత్వ శాఖల నుంచి అద్దెలు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఇంటి అద్దె భృతి (హెచ్‌ఆర్ఏ) ద్వారా నిధులు సమకూరుతాయి. లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ విధానంలో మొత్తం రూ.2850 కోట్లు సీఆర్‌డీఏకు సమకూరగలవని అధికారులు అంచనావేశారు.

ఇక మూడో ప్రతిపాదన ప్రకారం జీ2జీ ఈక్విటీ ఫండ్ ఏర్పాటుచేస్తారు. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపుతున్న వివిధ దేశాలను భాగస్వాములను చేసి మిశ్రమ ప్రాయోజక అభివృద్ధి (మిక్స్‌డ్ యూజ్ డెవలప్‌మెంట్), సాంఘిక మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. రూ.1400 కోట్ల నిధులను జీ2జీ విధానం ద్వారా సమకూరగలవని అధికారులు అంచనాతో వున్నారు.

నాలుగవ ప్రతిపాదన సమష్టి పెట్టుబడుల పథకం (కలెక్టీవ్ ఇన్వెస్టుమెంట్ స్కీమ్). మూడేళ్ల నుంచి పదేళ్ల వ్యవధి గల ల్యాండ్ మానిటైజేషన్ పథకం ఇది. దీని ప్రకారం స్పెషల్ పర్సస్ వెహికిల్ కింద సీఆర్‌డీఏ రాజధానిలో కొంత మేర భూమిని రిజర్వ్ చేసి వుంచుతుంది. వీటిని యూనిట్లుగా విభజించి ఆసక్తిగల పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంది. దీనిపై పెట్టే పెట్టుబడులకు గ్యారంటీ రాబడిని చూపిస్తుంది. భూమి విలువ పెరిగిన సమయంలో ఆ యూనిట్లను విక్రయించడం ద్వారా ఆ లాభాలను పెట్టుబడిదారులకు అందిస్తుంది. రూ.2500 కోట్లు ఈ విధానం ద్వారా సమకూర్చవచ్చునని అధికారులు భావిస్తున్నారు.

 

ఇక, ఆఖరి ప్రతిపాదన ప్రకారం బాండ్స్ జారీ చేయడం ద్వారా నిధులను సమీకరిస్తారు. ఈ బాండ్లు తీసుకునే వారికి పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తారు. బాండ్ల జారీకి అవసరమైన సెబీ రెగ్యులేటరీ నిబంధనలకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేయాల్సివుంటుంది. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.2వేల కోట్లు నిధులు సమకూరగలవని అధికారులు అంచనావేశారు.

జీ2జీ ఈక్విటీ ఫండ్ ఏర్పాటుకు సంబంధించి ఇన్వెస్టుమెంట్ అడ్వయిజర్‌ను ఎంపిక చేయాల్సివుంటుంది. అలాగే, న్యాయ సంబంధిత ప్రక్రియను పూర్తిచేయాల్సివుంది. పన్ను విధానాన్ని రూపొందించాల్సివుంది. కలెక్టీవ్ ఇన్వెస్టుమెంట్ స్కీమ్‌ కోసం ఇన్వెస్టుమెంట్ బ్యాంకర్‌ను నియమించాల్సివుంటుంది. బాండ్స్ జీరీకి ఆర్థిక శాఖ అనుమతులు, మంత్రిమండలిలో చర్చ తదితర ప్రక్రియను పూర్తిచేయాల్సివుంది.

రాజధానిలో కట్టడాల నిర్మాణంలో ఉపయోగించే ఇసుక, సిమెంట్, మొరం, మెటల్ తదితర సామాగ్రిని ఎంత అవసరమో ముందుగానే గుర్తించి అందుకు తగినట్టుగా వ్యూహ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి సీఆర్‌డీఏ అధికారులకు సూచించారు. ముఖ్యంగా రాజధాని పరిధిలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని పదిరోజుల క్రితమే ఆదేశాలు ఇచ్చినా ఇంకా కొన్నిచోట్ల ఆ ప్రక్రియ కొనసాగుతుండటం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. రాజధాని ప్రాంత పరిధిలోని క్వారీ తవ్వకాలను తక్షణం నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనింగ్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని సీఆర్‌డీఏ యంత్రాంగానికి సహకరించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఈ తరహా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇప్పుడా నిర్మాణం ఇబ్బందులు లేకుండా సాగుతోందని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములుగా వున్న 8 సలహా సంప్రదింపుల సంస్థలను, ఇతర సంస్థల ప్రతినిధులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థదేనని అన్నారు.

నాణ్యత, ధరల నిర్ణయమే రాజధాని నిర్మాణ ప్రక్రియలో జరపవలసిన అతిపెద్ద కసరత్తు అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో నిధుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం వున్నదని అన్నారు. దీనికి అనుసరించాల్సిన వ్యూహ ప్రణాళికపై మెకన్జీ వంటి సంప్రదింపుల సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో బార్సిలోనా నగర వైస్ మేయర్ ఆంథోని పాల్గొని ఒలింపిక్ క్రీడా గ్రామం ఏర్పాటులో తమ అనుభవాలను వివరించారు. రానున్న కాలంలో అమరావతిని ఒలింపిక్స్ వేదికగా రూపొందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు తలపెట్టామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. విశ్వ క్రీడా వేదికగా నిలిచేలా అమరావతిలో క్రీడా సదుపాయాలు వుండాలని అన్నారు. కేవలం మౌలిక సౌకర్యాలు కల్పించడంతో సరిపెట్టకుండా నగరంలో వుండే బాలబాలికల్లో ఫిజికల్ ఫిట్‌నెస్, క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా మైండ్‌సెట్ మార్చాల్సివుందని చెప్పారు.

వెలగపూడిలోని తన కార్యాలయం ద్వారా వచ్చే సోమవారం నుంచి విధులను నిర్వర్తిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. వెలగపూడి సచివాలయం, శాసనసభ నిర్మాణాల పురోగతిపై సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తన ఛాంబర్‌లో జరుగుతున్న ఇంటీరియర్, ల్యాండ్ స్కేపింగ్ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేసి సోమవారం నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. వెలగపూడిలో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులపై సమావేశంలో చర్చించారు.

ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి పి. నారాయణ, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్ శ్రీధర్, అదనపు కమిషనర్ మల్లికార్జున్, రాజధాని నగర అభివృద్ధి-నిర్వహణ సంస్థ చైర్మన్ లక్ష్మీ పార్థసారధి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

అమరావతిలో 1,620 కి.మీ. సైక్లింగ్‌ ట్రాక్‌లు..
 
636155660195631947.jpg
  • విజయవాడ, గుంటూరులో ఎంపిక చేసిన ప్రాంతాల్లోనూ.. 
  • ఆలిండియా బైస్కిలింగ్‌ ఫెడరేషన్ తో ఎంవోయూ
అమరావతి : రాజధానిని కాలుష్యరహితంగా రూపొందనుంది. మొత్తం 1,620 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మాణం కానుంది. విజయవాడ, గుంటూరు నగరాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లోనూ సైకిల్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో సైక్లింగ్‌ ట్రాక్స్‌ ఏర్పాటుపై ఆలిండియా బైస్కిలింగ్‌ ఫెడరేషనతో బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. చైర్మన డీవీ మనోహర్‌, సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ ఈమేరకు సీఎం సమక్షంలో ఎంవోయూలు మార్చుకున్నారు. తొలిగా 43 ఎకరాలున్న వెలగపూడి సచివాలయంలో ప్రయోగాత్మకంగా పబ్లిక్‌ బైక్‌ షేరింగ్‌ విధానంలో సైకిల్‌ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో వంద అధునాతన సైకిళ్లు, ఆరు బైక్‌స్టేషన్లను మూడు నెలల్లోగా సిద్ధం చేయనున్నట్లు ఫెడరేషన ప్రతినిధులు తెలిపారు. సైక్లింగ్‌కు ప్రపంచంలోనే పేరొందిన డెన్మార్క్‌ రాజధాని కోపెనహాగనలో సైతం ఇంత పెద్ద నెట్‌వర్క్‌ లేదన్నారు. విజయవాడలోని కాలువల వెంబడి ఉన్న మార్గాలతోపాటు బెంజిసర్కిల్‌- రామవరప్పాడు రింగ్‌ మధ్య సర్వీస్‌ రోడ్డు పక్కన వీటిని అభివృద్ధి చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ మార్గాల్లో ఈ-బైక్‌లను కూడా ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. స్కాడా వెబ్‌సైట్‌ ప్రారంభంఆంధ్రజ్యోతి, విజయవాడ: నగర పాలక సంస్థ రక్షిత మంచినీటి సరఫరా విధానాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ప్రజలు వీక్షించేందుకు వీలుగా పొందుపరచిన స్కాడా(స్మార్ట్‌ వాటర్‌ డిస్ర్టిబ్యూషన్‌ మోనిటరింగ్‌) వెబ్‌సైట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం కార్పొరేషన్‌ ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న తాగునీటి సరఫరా విధానాన్ని స్కాడాకు అనుసంధానం చేయుట ద్వారా, సెన్సార్ల సాయంతో ఆటోమేటిక్‌గా నియంత్రించే సూపర్‌వైజరీ విధానాన్ని సీఎంకు మునిసిపల్‌ కమిషనర్‌ వివరించారు. కంట్రోల్‌ అండ్‌ డేటా ఆక్విజిషన్‌ (స్కాడా) ద్వారా రిజర్వాయర్లలో నీరు ఎంత నిల్వ ఉన్నదీ, ఎంత వినియోగ మవుతున్నదీ తదితర అంశాలను ఆయన వివరించారు. అలాగే నగరంలో ఉన్న 63 రిజర్వాయర్లకుగానూ ప్రస్తుతం ఈ విధానం ద్వారా 52 రిజర్వాయర్లను అనుసంధానం చేశామని ముఖ్యమంత్రికి తెలిపారు. మిగిలిన 11 రిజర్వాయర్లను కూడా సత్వరమే స్కాడాకు అనుసంధానం చేస్తామని ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్‌ వివరించారు. మునిసిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, గుంటూరు కమిషనర్‌ నాగలక్ష్మి, పబ్లిక్‌ హెల్త్‌ చీఫ్‌ ఇంజనీరు మోజెస్‌కుమార్‌ పాల్గొన్నారు
Link to comment
Share on other sites

అమరావతికి 5 మార్గాల్లో నిధులు!
 
636155537107783726.jpg
  • సమీకరణకు సీఆర్డీయే కసరత్తు
  • 2018కి రూ.14250 కోట్ల సమీకరణే లక్ష్యం
  • రాజధాని నిర్మాణంపై అధికారులతో సీఎం సమీక్ష
అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి ఐదు మార్గాల్లో నిధులను సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి నిర్మాణంపై వారం వారం నిర్వహిస్తున్న సమీక్షల్లో భాగంగా బుధవారం సీఎం చంద్రబాబు విజయవాడలో సీఆర్డీయే అధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో నిధుల సమీకరణపైనే ప్రధానంగా చర్చ జరిగింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణపై సమగ్ర బ్లూ ప్రింట్‌ను రూపొందించుకొని, దాన్ని కార్యరూపంలో పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రయత్నాలు జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిధుల సమీకరణకు సావరిన, మసాలా బాండ్లు, ఎన్‌ఆర్‌ఐ నిధులపైనా దృష్టి కేంద్రీకరించాలని కోరారు.
 
 
రాజధానికి రూ.58 వేల కోట్లు అవసరం
రాజధాని నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం రూ.58 వేల కోట్లు అవసరమని, అందులో 70 శాతం అంటే దాదాపు రూ.32 వేల కోట్లను మౌలిక సదుపాయాల కల్పన కోసం 2019కి ఖర్చు చేయాల్సి ఉంటుందని సీఆర్డీయే అధికారులు అంచనా వేశారు. వీటిని ప్రపంచ బ్యాంకు, హడ్కో, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించే సంస్థల ప్రతినిధులతో శుక్రవారం ‘అమరావతి ఫైనాన్సింగ్‌ రౌండ్‌టేబుల్‌’ పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. రాజధాని కోసం 2018 నాటికి మొత్తం రూ.14,250 కోట్లను సమీకరించాలని నిర్ణయించారు. ఈ నిధుల సమీకరణకు ఏపీసీఆర్డీయే ప్రతిపాదించిన 5 మార్గాలను సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ సీఎంకి వివరించారు. పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం) విధానం, లీజ్‌-రెంటల్‌ డిస్కౌంటింగ్‌ విధానం(సీడ్‌ క్యాపిటల్‌లో భవనాలు నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయార్జన), గవర్నమెంట్‌ టూ గవర్నమెంట్‌ (జీ2జీ )విధానం, సమష్టి పెట్టుబడుల పథకం (కలెక్టివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ స్కీం), బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించాలని సీఆర్డీయే భావిస్తోంది.
ఈ విధానాలపై అధికారులతో సీఎం కూలంకషంగా చర్చించారు. వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. వచ్చే సోమవారం నుంచి వెలగపూడిలోని తన కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తానని సీఎం వెల్లడించారు. అమరావతి పరిధిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాల్సిందిగా 2 వారాల క్రితమే ఆదేశాలిచ్చినా ఇంకా కొన్ని చోట్ల అవి కొనసాగుతుండడం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని తక్షణమే ఆపేందుకు గనుల శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్‌ను నిర్వహించే విధంగా అమరావతిలో క్రీడాస్టేడియంల ఏర్పాటు ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా సీఆర్డీయే అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన బార్సిలోనా నగర ఉపమేయర్‌ ఆంథోనీని బుధవారం నాటి సమావేశానికి ఆహ్వానించారు. ఆయన తమ అనుభవాలను వివరించారు. అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు.
అమరావతిలో ప్రత్యేక సైక్లింగ్‌ ట్రాక్‌లు
రాజధానిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు మొత్తం 1620 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక సైక్లింగ్‌ ట్రాక్‌లను నిర్మించనున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. సైక్లింగ్‌కు ప్రపంచంలోనే పేరొందిన డెన్మార్క్‌ రాజధాని కోపెనహాగ్‌లో సైతం ఈ స్థాయిలో సైక్లింగ్‌ ట్రాక్‌ లేదని చెప్పారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో సైక్లింగ్‌ ట్రాక్స్‌ ఏర్పాటుపై ఆలిండియా బైస్కిలింగ్‌ ఫెడరేషనతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని చైౖర్మన డీవీ మనోహర్‌, సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ సీఎం సమక్షంలో ఎంవోయూలు మార్చుకున్నారు. తొలిగా 43 ఎకరాలున్న వెలగపూడి సచివాలయంలో ప్రయోగాత్మకంగా సైకిల్‌ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందులో వంద అధునాతన సైకిళ్లు, 6 బైక్‌స్టేషన్లను 3 నెలల్లోగా సిద్ధం చేయనున్నామని మనోహర్‌ సీఎంకు తెలిపారు. ఒక్క వెలగపూడిలోనే కాకుండా విజయవాడ, గుంటూరు నగరాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లోనూ సైక్లింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ-బైక్‌లను కూడా ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   1 member

×
×
  • Create New...