Jump to content

Supreme Court NO to Palamuru & Dindi - Go to Apex

3mar

Recommended Posts

పాలమూరు, డిండి ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్

Published Wednesday, 20 July 2016

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఉండకూడదని తేల్చింది. వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని పరిష్కరించాలని సూచించింది. తెలంగాణలో పాలమూరు, డిండి ప్రాజెక్టుల నిర్మాణంపై కృష్ణా జిల్లా రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి తెహర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించి పలు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులే ఇప్పుడు నిర్మిస్తున్నామన్న తెలంగాణ వాదనతో ఏపీ ప్రభుత్వం విభేదించింది. డిండి ప్రాజెక్టుల డీపీఆర్‌లను తెలంగాణ ప్రభుత్వం సమర్పించలేదని, ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని కేంద్రం కోర్టుకు తెలియజేసింది. ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే ఇక ముందు ప్రాజెక్టులన్నీ నిర్మించాల్సి ఉంటుంది.

Link to comment
Share on other sites

న్యూఢిల్లీ : రెండు రాష్ట్రాల మధ్య సెగ రాజేస్తున్న ప్రాజెక్టుల నిర్మాణంపై సుప్రీం కోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంపై కృష్ణా జిల్లా రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి తెహర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించి పలు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని పరిష్కరించాలని సూచించింది. కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఉండకూడదని తేల్చింది.

ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులే ఇప్పుడు నిర్మిస్తున్నామన్న తెలంగాణ వాదనతో ఏపీ పూర్తిగా విభేదించింది. అప్పట్లో కిరణ్‌కుమార్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం కోసం సర్వే చేయాలని మాత్రమే ఆదేశించిందని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా రంగంలోకి దిగి ప్రాజెక్టులు కడుతోందని వాదించింది. పాలమూరు, డిండి ప్రాజెక్టుల డీపీఆర్‌లను తెలంగాణ ప్రభుత్వం సమర్పించలేదని, ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని కేంద్రం కోర్టుకు తెలియజేసింది. ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇక ముందు కట్టబోయే ప్రాజెక్టులన్నీ అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే నిర్మించాల్సి ఉంటుంది. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా...ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు అనుమతి తప్పనిసరి అవుతుంది.

Link to comment
Share on other sites

Ban these Rogues of the Nation from Country as their Strategy was/is Built on Lies & Hate and it is very dangerous to society as quoted by Supreme Court Ruling on "Nativity based on 1956 Birth Year"

Link to comment
Share on other sites

హైదరాబాద్: పాలమూరు, డిండి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందన పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను సీఎం కేసీఆర్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు స్పందనతో పాలమూరు ప్రాజెక్టుకు పట్టిన శని విరగడవుతుందన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు శాశ్వతంగా అడ్డంకులు తొలిగినట్లేనని పేర్కొన్నారు.

సుప్రీం తీర్పు దరిమిలా పాలమూరు, డిండి ప్రాజెక్టులను రాకెట్ వేగంతో పూర్తి చేస్తమని ఉద్ఘాటించారు. ఆగమేఘాల మీద పనులు పూర్తి చేసి ప్రాజెక్టుల ఫలితాలను ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. ఏపీ అభ్యంతరాలకు ఎక్కడా విలువ లేనందున పాలమూరు, డిండి ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

mandulo unnadaa..

As usual we don't want permission to construct projects ani direct ga ne cheptunadu ga

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...