sonykongara Posted July 19, 2016 Author Posted July 19, 2016 A Rotana group chana pedda di ga ippude chustunna. Dubai shake di. Good that Shetty introduced Amaravati to Emirates shakes. BR Shetty chala serious ga vunnattu vunnadu Amaravati meda.Infact all he picked are good options 1st golf course in island 1st international convetion on river front TOp prive hospital with less than 30 minutes lab test results(this is missing in India) yes bro. narens 1
sonykongara Posted July 20, 2016 Author Posted July 20, 2016 అమరావతికి మార్కెటింగ్ చేస్తా : బీఆర్ షెట్టి కళ్లు తిరిగేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో మూడు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు ‘ఆంధ్రజ్యోతి’తో అబుదాబి సంపన్నుడు బీఆర్ షెట్టి అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం తాను మార్కెటింగ్ పర్సన్ అవుతానని ప్రవాస భారతీయ సంపన్నుడు బీఆర్ షెట్టి చెప్పారు. అమరావతి నగరంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వివిధ ప్రాజెక్టుల్లో రూ.12,600 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన.. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై తన ప్రణాళికలపై చర్చించారు. మంగళవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యే సమయంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. కర్ణాటకకు చెందిన షెట్టి.. చేతిలో ఎనిమిది డాలర్లతో నాలుగు దశాబ్దాల క్రితం అబుదాబి వెళ్ళి తొలుత మార్కెటింగ్ పర్సన్‌గానే కెరీర్ ప్రారంభించారు. బీఆర్‌ఎస్ వెంచర్స్, ఎన్‌ఎంసీ హెల్త్‌కేర్‌లతో వ్యాపారం ప్రారంభించి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు అమరావతి కోసం మార్కెటింగ్ చేస్తానని చెప్పారు. అబుదాబి నగరాభివృద్ధికి సమాంతరంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన షెట్టి.. అమరావతి భవిష్యతలో బాగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘నేను అమరావతిలో పెట్టుబడిదారును మాత్రమే కాదు. ఆ నగరాభివృద్ధికి మార్కెటింగ్ పర్సన్‌ని’ అని ఉద్ఘాటించారు. అబుదాబిలోనే కాకుండా తాను ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా అమరావతి గురించి అందరికీ చెబుతానని, పెట్టుబడులకు ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు. అబుదాబి ఇన్వె్‌స్టమెంట్ అథారిటీ కోసం పనిచేస్తున్న తాను.. ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులను తేవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అమరావతిలో తాను చేపట్టబోయే ప్రాజెక్టులపై ఆంధ్రజ్యోతితో షెట్టి పంచుకున్న అనుభవాలు, అంతకుముందు ముఖ్యమంత్రితో సమావేశంలో చోటు చేసుకున్న చర్చల సమాహారమిదీ... సీఎం ఆకాంక్షకు అనుగుణంగా కన్వెన్షన్ సెంటర్ అమరావతిలో చేపట్టనున్న అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కళ్లు చెదిరేలా ఉంటుందని బీఆర్ షెట్టి చెప్పారు. ప్రపంచ శ్రేణి నగరంగా అమరావతిని నిర్మించతలపెట్టిన నేపథ్యంలో దానికి మరింత వన్నెతెచ్చే విధంగా కన్వెన్షన్ సెంటర్ ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షకు అనుగుణంగా నూతన నిర్మాణం ఉంటుందని హామీ ఇచ్చారు. 10 వేలసీట్లతో ఇండియాలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్‌గా దాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలోనే తలపెట్టిన ఎగ్జిబిషన్ సెంటర్‌ను జర్మనీలోని హానోవర్ సెంటర్‌కు దీటుగా నిర్మిస్తామని చెప్పారు. అక్కడే ఏర్పాటు చేసే అమ్యూజ్‌మెంట్ పార్కు కోసం అత్యుత్తమ ఆకృతులను అందించేందుకు ఈ రంగంలో పేరు గాంచిన ప్రపంచ స్థాయి డిజైనర్లను తీసుకొస్తామని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మిస్తామన్న షెట్టి.. ఆయా నిర్మాణాలన్నీ ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్లు అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. 3,500 పడకలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో మూడు ఆసుపత్రులను తమ గ్రూపు సంస్థ ఎన్‌ఎంసి నిర్మిస్తుందని షెట్టి చెప్పారు. హృద్రోగ, మధుమేహ, కేన్సర్ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా ఇవి ఉంటాయని, వాటిలో 3,500 పడకలు ఉంటాయని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో 1,500 పడకలతో ఓ ఆసుపత్రిని, రాయలసీమలోని కర్నూలులో 300 పడకలతో మరో ఆసుపత్రిని తొలి దశలో నెలకొల్పుతామని, ఆ తర్వాత మరో 1,700 పడకలతో వివిధ ప్రాంతాల్లో ఆసుపత్రులను ప్రారంభిస్తామని చెప్పారు. ఆసియాలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ వైద్య రంగంలో పరిశోధనలకు ఊతమిచ్చేలా ప్రపంచ స్థాయి మెడికల్ అనలిటిక్స్ సెంటర్‌ను, ఆసియాలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తామని షెట్టి తెలిపారు. వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి గ్లోబల్ ఐవీ లీగ్‌ను నాలెడ్జ్ పార్టనర్‌గా చేసుకుంటామన్నారు. ఫిజర్, మెర్క్, అబ్బాట్స్ వంటి ఫార్మా కంపెనీల సహకారంతో రాష్ట్రంలో ఫార్మాసూటికల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని షెట్టి చెప్పారు. కేన్సర్ చికిత్సలో నూతన సాంకేతికత, ఆవిష్కరణలకు దోహదపడే పరిశోధనా కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్నారు. వైద్యరంగంలో ఇంకా మిత్సుబిషి, ఫార్మాస్యూటిక్, కాస్మో ఆయిల్ తదితర సంస్థల సహకారం తీసుకుంటామని చెప్పారు. ప్రపంచంలోని అనేక వైద్య సంస్థలకు వైజ్ఞానిక సంబంధిత అంశాలను సమకూర్చేందుకు వీలయ్యే నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ సెంటర్‌ను ఏపీ కేంద్రంగా నెలకొల్పుతామన్నారు. పర్యావరణ హిత గృహ సముదాయం అమరావతి సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పచ్చదనం పరిఢవిల్లేలా పర్యావరణహితమైన గృహ సముదాయాల నిర్మాణానికి తాము సిద్ధంగా ఉన్నామని షెట్టి చెప్పారు. 2018నాటికి తమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. బీఆర్‌ఎస్ వెంచర్స్ ఇప్పటికే ఈ రంగంలో ముందుందున్నారు. అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు లభించేలా ప్రపంచ శ్రేణి గోల్ఫ్‌కోర్సును కూడా చేపడుతున్నట్లు షెట్టి చెప్పారు. సీఎం అభినందన ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన షెట్టిని ముఖ్యమంత్రి అభినందించారు. షెట్టి గ్రూపు నిర్మించే ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా 30 ఆసుపత్రులను ఎన్‌ఎంసి గ్రూపు నిర్వహిస్తోందని, హోటళ్లు, విద్యాసంస్థలను నడుపుతోందని, తమ విద్యా సంస్థల్లో 25 వేలమంది విద్యార్థులు న్నారని షెట్టి ఆయనకు చెప్పారు. ట్రావెలెక్స్, యుఎఇ ఎక్సేంజ్, నియో ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్ తదితర సంస్థలను తాను ఎలా ఏర్పాటు చేసిందీ వివరించారు. ఆసియాన్-ఇండియా బిజినెస్ కానక్లేవ్‌కు అచ్చెన్న అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఆసియాన్-ఇండియా బిజినెస్ లీడర్‌షిప్ కానక్లేవ్‌లో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలోని ఓ బృందం మలేసియా వెళ్లింది. కౌలాలంపూర్‌లో జరిగే ఈ సదస్సుకు మంత్రితోపాటు రాష్ట్ర ఎకనమిక్ డెవల్‌పమెంట్ బోర్డు సీఈవో కృష్ణకిషోర్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన హాజరవుతున్నారు.
abhitdp Posted July 20, 2016 Posted July 20, 2016 pakka desham vaddke una intrest ee Modilingam gadke ledu jaffa gadu
MVS Posted July 20, 2016 Posted July 20, 2016 Edo okati Cheyyi Shetty garu Amravati front lo nee Peru rasukuntamu
sonykongara Posted December 1, 2016 Author Posted December 1, 2016 ఏపీ కేబినెట్ నిర్ణయాలు అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తొలి సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ కేబినెట్ నిర్ణయాలు - - అమరావతిలో బీఆర్ శెట్టి గ్రూప్‌కు 100 ఎకరాలు కేటాయింపు -
nivas_hyd Posted December 1, 2016 Posted December 1, 2016 B.R Shetty. Heard a lot after coming to Abu Dhabi.. Many Indians are proud of him here.. He is very powerful and very influential.. That's not an easy thing for any one to reach that position in Middle East..
AnnaGaru Posted December 1, 2016 Posted December 1, 2016 Shetty's is not just any other hospital but " treatment&recuperation". CRDA was surprised at the depth of research his family has done when he asked for Krishna island&airport near by part of Medical Hub plans he has. He given reverse promotional details to CRDA on why Amaravati will be best as Medical Hub
sonykongara Posted December 2, 2016 Author Posted December 2, 2016 అమరావతి హెల్త్ కేపిటల్ కూడా కాబోతోంది. కింగ్ జార్జ్, ఎయిమ్స్ లాంటి పేర్లే కాదు ఇపుడు ఏకంగా హెల్త్ సిటీనే అమరావతిలో కొలువుదీరబోతోంది. ఇక నిర్మాణం మరో మూడు నెలల్లో మొదలుకాబోతోంది. అవును. బిఆర్ శెట్టి గ్రూప్ అమరావతిలో మెగా హెల్త్ సిటీ కడుతోంది. 150 ఎకరాల స్థలం కోరింది. ప్రాజెక్టు రిపోర్ట్ పరిశీలించాక 100 ఎకరాలు కేటాయింపును సీఆర్ డీఏ కన్ఫామ్ చేసింది. 4 వేల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి, మెడికల్ డివైజెస్ యూనిట్, త్రీస్టార్ హోటల్ రెడీ అవుతాయ్. బహుశా అమరావతిలో నిర్మాణాలకి లైన్ క్లియర్ అయిన తర్వాత పట్టాలెక్కబోతున్న తొలి మెగా ప్రాజెక్ట్ ఇదే కాబోతోందేమో అంటున్నారు ! ఎందుకంటే, టెంటర్ల గడుపు పూర్తయ్యి అమరావతిలో మరో దశ మొదలుకోబోతున్న సమయంలో సీఆర్ డీఎ క్లియరెన్స్ వచ్చేసరికి, కేపిటల్ సిటీలో హెల్త్ సిటీకి
KaNTRhi Posted December 2, 2016 Posted December 2, 2016 Shetty's is not just any other hospital but " treatment&recuperation". CRDA was surprised at the depth of research his family has done when he asked for Krishna island&airport near by part of Medical Hub plans he has. He given reverse promotional details to CRDA on why Amaravati will be best as Medical Hub Any article on this bro
sonykongara Posted December 2, 2016 Author Posted December 2, 2016 Amaravati: 100 Acres Allotted for Prestigious Group Amaravati the current fastest developing city invited one more prestigious engagement of 12000 cores investment. Andhra Pradesh signed a Memorandum of Understanding with BRS Ventures of Abu Dhabi who committed on investing 12000 crores in the healthcare sector. The state cabinet has allotted 100 acres to BRS Group to set up the health care unit with a medical university, naturopathy center, a hospital with 1000 bed capacity and a medical equipment manufacturing unit. The memorandum was signed by Dr. BR Shetty, the Chairman and representative of BR ventures and by J. Krishna Kishore, CEO of Economic Development Board, the representative of Andhra Pradesh Government. Naidu suggested BRS group complete the projects at the earliest assuring the clearances for all the requirements. A hospital is anticipated to be established in Amaravati By December 2018 and the state cabinet discussed strategies to make the health care coverage available to everyone in the region.
KaNTRhi Posted December 2, 2016 Posted December 2, 2016 Amaravati: 100 Acres Allotted for Prestigious Group Amaravati the current fastest developing city invited one more prestigious engagement of 12000 cores investment. Andhra Pradesh signed a Memorandum of Understanding with BRS Ventures of Abu Dhabi who committed on investing 12000 crores in the healthcare sector. The state cabinet has allotted 100 acres to BRS Group to set up the health care unit with a medical university, naturopathy center, a hospital with 1000 bed capacity and a medical equipment manufacturing unit. The memorandum was signed by Dr. BR Shetty, the Chairman and representative of BR ventures and by J. Krishna Kishore, CEO of Economic Development Board, the representative of Andhra Pradesh Government. Naidu suggested BRS group complete the projects at the earliest assuring the clearances for all the requirements. A hospital is anticipated to be established in Amaravati By December 2018 and the state cabinet discussed strategies to make the health care coverage available to everyone in the region.
sonykongara Posted December 2, 2016 Author Posted December 2, 2016 అమరావతిలో అబుదాబీకి చెందిన బీఆర్ శెట్టి గ్రూపు రూ.10000 వేల కోట్లతో నిర్మించే వైద్య కళాశాల, బిజినెస్ స్కూలు, వైద్య పరికరాల తయారీ యూనిట్‌కు కలిపి 100 ఎకరాలను కేటాయించింది.
sonykongara Posted December 2, 2016 Author Posted December 2, 2016 అమరావతిలో అబుదాబీకి చెందిన బీఆర్ శెట్టి గ్రూపు రూ.10000 వేల కోట్లతో నిర్మించే వైద్య కళాశాల, బిజినెస్ స్కూలు, వైద్య పరికరాల తయారీ యూనిట్‌కు కలిపి 100 ఎకరాలను కేటాయించింది. anna garu bro, business school news nijame na.
Raaz@NBK Posted December 2, 2016 Posted December 2, 2016 pakka desham vaddke una intrest ee Modilingam gadke ledu jaffa gadu
Suresh_Ongole Posted December 3, 2016 Posted December 3, 2016 pakka desham vaddke una intrest ee Modilingam gadke ledu jaffa gadu
phani2 Posted December 3, 2016 Posted December 3, 2016 Hope Amaravathi become medical facility destination for the country and for medical tourism too. When top class infra and medical facilities become available, obviously everyone would flock to amaravathi!
sonykongara Posted December 13, 2016 Author Posted December 13, 2016 బీఆర్‌శెట్టి మెడిసిటీ-హెల్త్‌కేర్‌కు వంద ఎకరాలు అమరావతిలో బీఆర్‌శెట్టి మెడిసిటీ-హెల్త్‌కేర్‌కు వంద ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎకరం రూ.50 లక్షల చొప్పున భూమి కేటాయించారు. బీఆర్‌శెట్టి గ్రూప్ 11 ప్రాజెక్టులను ప్రారంభించనుంది. మెడికల్ వర్సిటీ, ఆస్పత్రి, బిజినెస్ స్కూల్, త్రీస్టార్ హోటల్, వంద సర్వీస్ అపార్ట్‌మెంట్లు వైద్యపరికరాల తయారీ యూనిట్, యోగా సెంటర్, క్వాంటం ఎనలటిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now