Jump to content

Canal beautification in Vijayawada


Recommended Posts

పట్టిసీమ నీరు ముందుగా కాలువలకు.. తర్వాతే నదిలోకి

636436544703389034.jpg


  • ఇరిగేషన్‌ అధికారులకు సీఎం ఆదేశం

ఆంధ్రజ్యోతి, విజయవాడ: ఏలూరు కాలువ.. బందరు కాలువ.. బుడమేరు కాలువ.... రైవస్‌ కా లువ.. ఈ నాలుగూ వేర్వేరు చోట్ల కలుస్తాయి. వీటిని విజయవాడలోనే ఏకం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. నగర మధ్యలో చెరోవైపు నుంచి ప్రవహించే ఈ కాలువలను అనుసంధానం చేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కాలువలను పరిశీలించారు. ఏలూరు, బందరు కాలువల ప్రవాహం ప్రాజెక్టు గేట్ల నుంచి మొదలవుతుంది. బుడమేరు కాలువ వెలగలేరు నుంచి వస్తోంది. రైవస్‌ కాలవ ఆర్టీసీ బస్‌స్టాండ్‌ నుంచి మొదలవుతుంది. విజయవాడలో కొంతదూరం ప్రవహించాక, ఆ గ్రామాల మధ్య నుంచి దిగువకు వెళ్తాయి. వీటన్నింటినీ అనుసంధానం చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.

 

పట్టిసీమ నుంచి గోదావరి నీరు నేరుగా కృష్ణానదిలోకి వస్తోంది. ఇకనుంచి ఆ నీటిని ముందుగా ఈ కాలువల్లోకి తీసుకొచ్చి, ఆ తర్వాత నదిలోకి మళ్లించాలని సూచించారు. తద్వారా కాలువలన్నీ నీటితో నిండుకుండలా కళకళలాడ తాయని చెప్పారు. వీటిలో బోట్లు ఏర్పాటుచేసి కూలీలు, ఉద్యోగులు రాకపోకలు సాగించే లా చేయాలని ఓ ప్రణాళికను ఆవిష్కరించారు. అవసరమైన ప్రైవేటు బోట్లను రంగంలోకి దింపాలన్నారు. బోటింగ్‌తో పాటు కాలువ గట్లను పచ్చని ఆహ్లాదకర వాతావరణం ఉట్టి పడేలా సుందరంగా తయారు చేయాలని ఆదేశించారు.

Link to comment
Share on other sites

  • 2 months later...

 

 

జనవరిలోగా రామవరప్పాడు డబుల్‌ లైన్‌బ్రిడ్జి పనులు
24-12-2017 11:12:09
 
  • రూ 6 కోట్లు అంచనాలతో రెండు రోజుల్లో ఈ- టెండర్లు
  • ఇరిగేషన్‌ ఎస్‌ఈ రమేష్‌బాబు
విజయవాడ: గత 75 సంవత్సరాల క్రితం రామవరప్పాడు రైవస్‌ కాలువపై నిర్మించిన కాలిబాట వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో డబుల్‌ లైను బ్రిడ్జి నిర్మాణానికి జనవరిలోగా పనులు ప్రారంభించనున్నట్లు ఇరిగేషన్‌ ఎస్‌ఈ రమేష్‌బాబు చెప్పారు విజయవాడలోని ఇరిగేషన్‌ ఎస్‌ఈ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ ఎస్‌ఈ తిరుమలరావు, ఈఈ మోహనరావులతో కలసి మాట్లాడారు. ఇటీవల వాహనాల రాకపోకలు పెరిగిపోవడం, ప్రజలు విజయవాడకు వివిధ రకాల వాహనాల్లో వచ్చి వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో రామవరప్పాడు బ్రిడ్జిని ధ్వంసం చేసి దాదాపు రూ. 6 కోట్లు అంచనాలతో ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేశామని చెప్పారు. గతంలో ఇదే వంతెన నిర్మాణానికి రూ.1.32 కోట్లు అంచనాలతో రిపోర్టు సిద్ధం చేసినా కొన్ని అనివార్య కారణాల వల్ల పనులు జరగలేదన్నారు. ప్రస్తుతం రెండు వరుసల బ్రిడ్జిని నిర్మించేందుకు జనవరిలోగా పనులు ప్రారంభించడానికి రెండు రోజుల్లో ఆన్‌లైన్‌ టెండర్లు పిలుస్తామన్నారు.
 
40 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. సాధారణంగా అయితే ఏడాది కాలం పడుతుందని ఇప్పుడు ఈ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేస్తామని తెలిపా
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
  • 4 weeks later...
  • 3 weeks later...
  • 3 weeks later...
రూ.20.77 కోట్లతో పార్కుల అభివృద్ధి
24-05-2018 07:10:49
 
636627426515363272.jpg
  • విజయవాడ రైవస్‌ కెనాల్‌, రాజధాని అనంతవరం వద్ద...
  • టెండర్లు పిలిచిన ఏడీసీ ఫ వచ్చే నెల 5 వరకు గడువు
అమరావతి: సీఎం చంద్రబాబు ఆదేశానుసారం నగరంలోని గులాబీతోటలో రైవస్‌ కెనాల్‌ ఒడ్డును అభివృద్ధి పరచేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లు పిలిచింది. దీంతోపాటు రాజధాని గ్రామాల్లో ఒకటైన అనంతవరంలో ఏర్పాటు చేయదలచిన ఉద్యానవనం పనుల కోసం కూడా బిడ్లను ఆహ్వానించింది. ఈ రెండు పనులకు రూ.20.77కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసిన ఏడీసీ ఆసక్తి ఉన్న సంస్థలు టెండర్లను సమర్పించేందుకు వచ్చే నెల5వ తేదీ వరకు గడువునిచ్చింది.
 
రైవస్‌ కాల్వ గట్టున...
బెజవాడలోని వివిధ కాల్వగట్ల సుందరీకరణ పనుల్లో ముందుగా గులాబీతోటలో రైవస్‌ కాల్వను పలు పర్యాటక ఆకర్షణలతో తీర్చిదిద్దాలని ఏడీసీ నిర్ణయించింది. వాకింగ్‌ ట్రాక్‌లు, ఫుడ్‌ కోర్టులు, పచ్చదనం, ఆటస్థలాలు, పార్కింగ్‌ ఇత్యాది వాటితో ఇందుకోసం ప్రణాళిక రూపొందించింది. సుమారు 0.9 కిలోమీటర్ల పొడవున ఇవన్నీ రానున్నాయి. త్వరలోనే వీటికి సంబంధించిన పనులను చేపట్టబోతున్న ఏడీసీ ముందుగా కంచెను ఏర్పాటు చేయనుంది. దీని ఏర్పాటు జరుగుతుండగానే ఇతర పనులను కూడా చేపడుతుంది.
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...