Jump to content

Krishna Pushkaralu


Recommended Posts

  • Replies 2.2k
  • Created
  • Last Reply
పుష్కరాలకు 358 ప్రత్యేక రైళ్లు
 
636050277670167857.jpg
(విజయవాడ, ఆంధ్రజ్యోతి): పుష్కరాల సందర్భంగా పవిత్ర కృష్ణానదిలో స్నానాలు ఆచరించే వారికోసం దక్షిణ మధ్య రైల్వే 358 ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది. ప్రత్యేక రైళ్ళలో జనరల్‌ బోగీల సంఖ్యను పెంచారు. రాజమండ్రి , భద్రాచలం, నర్సాపూర్‌, ఒంగోలు, సికింద్రాబాద్‌, గుంతకల్‌ తదితర ప్రాంతాల నుంచి విజయవాడ రావడానికి ప్రత్యేక రైళ్ల రాకపోకలు ఇలా ఉంది.
సికింద్రాబాద్‌ నుంచి కృష్ణాకెనాల్‌
సికింద్రాబాద్‌లో ఆగస్టు 14, 21 తేదీల్లో ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. ఆగస్టు 15, 22 తేదీల్లో ఉదయం ఆరు గంటలకు కృష్ణాకెనాల్‌కు చేరుకుంటాయి. (కృష్ణాకెనాల్‌ గుంటూరు జిల్లాలో విజయవాడకు దగ్గరగా ఉన్న స్టేషన), ఆగస్టు 8, 22 తేదీల్లో ఉదయం ఎనిమిది గంటలకు రైళ్లు బయలుదేరి సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 2.10 గంటలకు చేరుకుంటాయి.
సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ
14, 21 తేదీల్లో ఉదయం 9.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ చేరుకుంటాయి. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు రాత్రి 11.30 గంటలకు చేరుకుంటాయి. చర్లపల్లి, జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌ జంక్షన, ఖమ్మం, రాయనపాడు, విజయవాడలో ఆగుతాయి.
గుంతకల్‌ నుంచి కృష్ణాకెనాల్‌
ఆగస్టు 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో రాత్రి 9.30 గంటలకు గుంతకల్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 9.40 గంటలకు కృష్ణాకెనాల్‌ చేరుకుంటాయి. తిరిగి 14, 16, 18, 20, 22, 24 తేదీల్లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి రాత్రి పది గంటలకు గుంతకల్‌ చేరుకుంటాయి. ద్రోణాచలం (డోన), బేతంచెర్ల, నంద్యాల, దిగువమెట్ల, గిద్దలూరు, సోమిదేవిపల్లె, కంభం, మార్కాపూర్‌రోడ్డు, దొనకొండ, కురిచేడు, వినుకొండ, సంతమాగులూరు, నరసరావుపేట, ఫిరంగిపురం, నల్లపాడు, గుంటూరు, మంగళగిరి స్టేషన్లలో రైళ్లు ఆగుతాయి.
నర్సాపూర్‌ నుంచి కృష్ణాకెనాల్‌
ఆగస్టు 12 నుంచి 23 తేదీల్లో నర్సాపూర్‌లో మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు కృష్ణాకెనాల్‌కు చేరుకుంటాయి. కృష్ణాకెనాల్‌లో సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి రాత్రి 9.30 గంటలకు తిరిగి నర్సాపూర్‌ చేరుకుంటాయి. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, భీమవరం టౌన, అకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ స్టేషన్లలో ఆగుతాయి.

  • 11వ తేదీ నుంచి 23 వతేదీ వరకు రోజూ విజయవాడలో ప్రత్యేక డెము రైళ్లు రాత్రి పది గంటలకు బయలుదేరుతాయి. నర్సాపూర్‌కు ఆర్ధరాత్రి రెండు గంటలకు చేరుకుంటాయి. 12 నుంచి 24 వతేదీ వరకు రోజూ డెము రైళ్లు నర్సాపూర్‌లో తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడకు ఉదయం 7.40 గంటలకు చేరుకుంటాయి. మధురానగర్‌, రాయనపాడు, తరిగొప్పుల, గుడివాడ, పాసర్లపూడి, మండవల్లి, ఆకివీడు, భీమవరం, భీమవరం జంక్షన, వీరవాసరం, పాలకొల్లుల్లో ఆగుతాయి.
  • 12 నుంచి 23వతేదీ వరకు డెము రైళ్లు రోజు మధ్యాహ్నం 1.45 గంటలకు విజయవాడలో బయలుదేరుతాయి. నర్సాపూర్‌కు సాయంత్రం 5.15కు చేరుకుంటాయి. తిరిగి నర్సాపూర్‌లో సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరి రాత్రి 9.35 గంటలకు విజయవాడ చేరుకుంటాయి.
  • మచిలీపట్నం నుంచి విజయవాడ 12 నుంచి 23 వ తేదీ వరకు డెము రైళ్లు విజయవాడలో ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి మచిలీపట్నానికి ఉదయం 10.10 గంటలకు చేరుకుంటాయి. ఉదయం 10.45 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి విజయవాడకు మధ్యాహ్నం 1.15కు చేరుకుంటాయి. మధురానగర్‌, రామవరప్పాడు, తరిగొప్పుల,గుడివాడ, గుడ్లవల్లేరు, పెడన, చిలకలపూడి స్టేషన్లలో ఆగుతాయి.
  • కృష్ణాకెనాల్‌ నుంచి ఒంగోలు 12 నుంచి 18 వతేదీ వరకు, 20 నుంచి 23 వతేదీ వరకు ప్రత్యేక రైళ్లు ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30 గంటలకు కృష్ణాకెనాల్‌లో బయలుదేరి ఒంగోలుకు సాయంత్రం 5.30 గంటలకు చేరుకుంటాయి. ఒంగోలులో సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరి రాత్రి తొమ్మిది గంటలకు కృష్ణాకెనాల్‌ చేరుకుంటాయి. పెదవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, చినగంజాం, అమ్మనబ్రోలు స్టేషన్లలో ఆగుతాయి.
  • విజయవాడ నుంచి భద్రాచలం రోడ్డు 11 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో రాత్రి 11.20 గంటలకు బయలుదేరి భద్రాచలం రోడ్డుకు తెల్లవారుజామున నాలుగు గంటలకు చేరుకుంటాయి. 12 నుంచి 24 వతేదీ వరకు భద్రాచలం రోడ్డులో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి ఉదయం 10 గంటలకు విజయవాడ చేరుకుంటాయి. రాయనపాడు, గంగినేని, ఎరుబాలెం, మధిర, బోనకల్లు,ఖమ్మం, దోర్నకల్‌ జంక్షన, కారేపల్లి స్టేషన్లలో ఆగుతాయి.
  • 12 నుంచి 23 వతేదీ వరకు ఇదే రూట్‌లో డెము రైళ్ళు రోజు విజయవాడలో ఉదయం 10.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు భధ్రాచలం రోడ్డుకు చేరుకుంటాయి. సాయంత్రం 4.30 గంటలకు భద్రాచలం రోడ్డులో బయలుదేరి రాత్రి తొమ్మిది గంటలకు విజయవాడకు చేరుకుంటాయి.
  • రాజమండ్రి- రాయనపాడు 12 నుంచి 17వ తేదీ వరకు, 19 నుంచి 23వ తేదీ వరకు మెము రైళ్ళు రాజమండ్రిలో ఉదయం 4.10 గంటలకు బయలుదేరి రాయనపాడుకు ఉదయం 8.50 గంటలకు చేరుకుంటాయి. రాయనపాడులో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి, రాజమండ్రికి మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటాయి. మరలరాజమండ్రిలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదే రి, రాయనపాడుకు సాయంత్రం 6.30గంటలకు చేరుకుంటాయి. తిరిగి రాయనపాడులో రాత్రి 7.30 గంటలకు బయలుదేరి రాజమండ్రికి రాత్రి 11.30 గంటలకు చేరుకుంటాయి. కోవూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, చేబ్రోలు, భీమడోలు, ఏలూరు, పవర్‌పేట, నూజివీడు, తేలప్రోలు, గన్నవరం, ముస్తాబాద, గుణదల, విజయవాడ స్టేషన్లలో ఆగుతాయి. ఇదే రూట్‌లో తిరిగే 07981 రైలు గోదావరి స్టేషన్లో కూడా ఆగుతుంది.
Link to comment
Share on other sites

పుష్కరాల్లో జన నియంత్రణతో జయం
 
636050276215522196.jpg
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఒక ప్రదేశం నుంచి నిర్ణీత వ్యవధిలో ఎంత సంఖ్యలో పుష్కర యాత్రికులను ఘాట్ల నుంచి బయటకు పంపగలమో, అంతే సంఖ్యలో యాత్రికులను ఘాట్లలలో స్నానానికి అనుమతించాలనే ప్రాథమిక సూత్రం ద్వారా మానవ సమూహ నిర్వహణ (క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌) చేయాల్సి ఉంటుందని వాతావరణ విపత్తు నివారణ కేంద్రం ప్రొఫెసర్‌ డాక్టరు డబ్ల్యు.జి ప్రసన్నకుమార్‌ తెలిపారు. నగరంలోని మాంటిస్సోరి మహిళా కళాశాలలో ఆదివారం కృష్ణాపుష్కరాల సందర్భంగా డాక్టరు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ ఆధ్వర్యంలో మానవ సమూహ నిర్వహణపై జిల్లా అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సమయంలో తొలి రోజు ఘటనకు కారణం క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ సరిగా చేయకపోవటమే కారణమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పుష్కర డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రౌడ్‌మేనేజ్‌మెంట్‌ సూత్రం తప్పక పాటించాలన్నారు. అధికారులకు రెండు సెషన్సగా అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు వివిధ శాఖలకు చెందిన 700 మంది ఉద్యోగులు హాజరయ్యారు.
విపత్తు నివారణకు కొన్ని సూచనలు
  • ఘాట్‌ సామర్థ్యం దృష్టిలో ఉంచుకుని పుష్కర యాత్రికులను స్నానాలకు అనుమతించాలి. ప్రవేశ, నిష్క్రమణ మా ర్గాలు వేర్వేరుగా ఉం డాలి.
  • దేవాలయాల వ ద్ద రోప్‌ల ద్వారా భక్తులను ని యంత్రించాలి.
  • ఘాట్ల నుంచి బయటకు నిష్క్రమించే యాత్రికుల సంఖ్య ఎంత ఉందో అంతే మందిని ఘాట్లలోకి అనుమతించాలి. ఘాట్లలో ఎక్కువ ఖాళీ ఉంది కదా అని ఎక్కువ మొత్తంలో యాత్రికులను అనుమతించరాదు.
  • విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం ప్రతి ఘాట్‌లోనూ నియమించిన ప్రత్యేక అధికారికి క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌పై విస్తృత అధికారాలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉంటుంది.
  • రూట్‌, ఏరియా, మూమెంట్‌, పీపుల్‌ (ర్యాంప్‌) విధానంలో యాత్రికులు వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు తగిన మార్గాలు తెలిపేలా మ్యాప్‌లను, ప్రణాళికలను రూపొందించాలి. వీటిపై పుష్కర డ్యూటీలో ఉన్న ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
  • పుష్కర స్నానానికి వచ్చిన కుటుంబం పూజలు, స్నానం, పిండప్రదానం వంటి కార్యక్రమాలకు కనీసం 55 నిమిషాల సమయం పడుతుంది. ఈ సమయాన్ని ఎంత తగ్గించగలిగితే పుష్కరాలు అంతగా విజయవంతం అవుతాయి.
  • ఫ ఘాట్లు, క్యూలైన్లు దగ్గర బిచ్చగాళ్లు, తోపుడు బండ్లు, గారడీ వాళ్లు లేకుండా చూడాలి. పుష్కరాల సమయంలో ఒక రోజుకు 20 నుంచి 30 లక్షల మంది యాత్రికులు వస్తారని అంచనా.
  • దుర్గమ్మను గంటకు 16 వేల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది. రోజుకు కనకదుర్గమ్మ దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య లక్షా 40 వేలు మాత్రమే. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
  • యాత్రికులందరికీ జిల్లా అధికారులు పబ్లిక్‌ లయబులిటీ ఇన్సూరెన్స తీసుకోవాల్సి ఉంటుంది.
  • ప్రతి ఘాట్‌ భద్రతపై అగ్నిమాపక శాఖాధికారులు అధ్యయనం చేసి నివేదికలను జిల్లా కలెక్టరుకు అందజేయాలి. అగ్నిమాపక, విద్యుత, ఇరిగేషన శాఖాధికారులు ప్రతిఘాట్‌లోని వివిధ ప్రాంతాల రిస్క్‌ ఎనాలసిస్‌ రిపోర్టును తప్పని సరిగా తయారుచేయాలి.
  • ప్రవేశ, నిష్క్రమణ బోర్డులతో పాటు మైకుల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ యాత్రికులు వాటిని పట్టించుకునే స్థితిలో ఉండరు. అధికారులే అప్రమత్తంగా ఉండాలి.
  • యాత్రికులకు భోజన ఏర్పాట్లు ఘాట్లు, ముఖ్య కూడళ్లు, దేవాలయాల సమీపంలో ఉండకుండా చర్యలు తీసుకోవాలి.
  • పుష్కరాల 15 రోజుల్లో మొదటి నాలుగు ప్రభుత్వ సెలవులు, 18వ తేదీ శ్రావణ పౌర్ణమి, 22న ఆదివారం, 23న ఆఖరిరోజు కావటంతో మొత్తం ఏడు రోజుల పాటు రద్దీ అత్యధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో అదనపు భద్రత, జనసమూహం నియంత్రణ ఏర్పాట్లు ఉండేలా చర్యలుండాలి. బస్టాండు, రైల్వే స్టేషనలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
  • తొక్కిసలాట నివారణకు..బస్సుల్లోనూ, రైళ్లలలోనూ సీట్లు దొరకవని, దేవాలయాల్లో తొలి దర్శనం కోసం, ఘాట్లలో స్నానంకోసం పోటీపడడం తదితర కారాణాల తో యాత్రికుల్లో ఆందోళనలు, ఒత్తిడి పెరిగి ముందుకు తోసుకు వచ్చేయడంతో తొక్కిసలాటలు ఎక్కువగా జరుగుతుంటాయి.
  • ఆరుగురు వ్యక్తులు ఒక వ్యక్తిపై 30 సెకన్లు పడితే ఆ వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకుంటాడు. ఈ స్థితి 3 నిమిషాలు కొనసాగితే మరణం సంభవిస్తుంది.
  • తొక్కిసలాట జరగకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తి చుట్టూ ఒక చదరపు మీటరు ఖాళీ స్థలం ఉండాలి. జనసమూహంలో సాంద్రత పెరిగే కొద్దీ ఈ ఖాళీ స్థలం తగ్గిపోతుంది. క్యూలో కూడా ప్రతి వ్యక్తి చుట్టూ ఒక చదరపు మీటరు ఖాళీ స్థలం ఉన్నప్పుడే తోపులాటలు, తొక్కిసలాటలకు అవకాశం ఉండదు.
  • అగ్ని ప్రమాదాలు, కరెంట్‌ షాకులు, లేదా స్పార్క్‌ల వంటి రూమర్ల వల్ల జన సమూహంలో భయాందోళనలు వ్యక్తం అవుతాయి. ఇవి తొక్కిసలాటకు దారి తీసిన ఘటనలు అనేకం.
  • నగరంలోని అన్ని ఘాట్లకు దుర్గా ఘాట్‌-1, దుర్గా ఘాట్‌-2, దుర్గా ఘాట్‌-3 అని వ్యవహరించడంతో యాత్రికులందరిలోనూ పవిత్ర దుర్గాఘాట్‌లోనే స్నానం ఆచరించాలని భావిస్తే తీవ్ర తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది.
Link to comment
Share on other sites

The Krishna and Guntur Districts administration are making elaborate arrangements for the smooth conduct of Krishna Pushkaralu to serve the devotees and to avoid untoward incidents.


The main maha ghats are getting ready, with a beautiful look. Here are some snaps of the arrangements being done. The remaining works, which are mostly laying of tiles is going to be completed by this month end.


Link to comment
Share on other sites

పుష్కరాల్లో బోట్‌ అంబులెన్స్‌ సేవలు

మంత్రి కామినేని వెల్లడి

25brk166a.jpg

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ దుర్గాఘాట్‌ వద్ద రెండు బోట్‌ అంబులెన్స్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. పుష్కరాల్లో వైద్య సదుపాయాలపై ఆయన అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పుష్కరాలకు అత్యవసర చికిత్స విధానంలో భాగంగా 12 ర్యాపిడ్‌ ఎమర్జెన్సీ మెడికల్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏ, ఏ ప్లస్‌ ఘాట్ల వద్ద ప్రత్యేక వైద్య బృందాలు పనిచేస్తాయన్నారు. పుష్కర్‌నగర్‌లో ఆహారం పంపిణీ సందర్భంగా నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...