Jump to content

Krishna Pushkaralu


Recommended Posts

  • Replies 2.2k
  • Created
  • Last Reply
కృష్ణా పుష్కరాలకు హై‘టెక్‌’ హంగులు
 
విజయవాడ, జూలై 13(ఆంధ్రజ్యోతి): కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం హై‘టెక్‌’ హంగులు అద్దుతోంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలే కాక, ఇతర రాష్ట్రాల వారు కూడా కృష్ణా పుష్కరాల సమాచారాన్ని తెలుసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం కృష్ణా జిల్లా యంత్రాంగం ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందిస్తోంది. జిల్లా యంత్రాంగం, ఇతర శాఖలు అందించే సేవలు, జిల్లా చరిత్ర, విశేషాలు, ఘాట్ల వివరాలు, పూజలు, దర్శనీయ ప్రాంతాల సమస్త సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తున్నారు. అంతేగాక స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండేలా యాప్‌ను కూడా రూపొందిస్తున్నారు. ఒకవేళ మీరెక్కడున్నారో తెలియకపోతే.. యాప్‌ తెరిస్తే చాలు!! మీరున్న ప్రదేశం.. అక్కడి నుంచి ఘాట్ల రూట్‌మ్యా్‌పలు.. హోటల్‌, బస్టాండు, ఏటీఎంలు, ఆలయాలు ఇలా అన్నీ తెలుసుకోవచ్చు! వీటికి సంబంధించిన సమాచారమంతా యాప్‌లో పొందుపరుస్తున్నారు. వెబ్‌సైట్‌, యాప్‌ను సీఎం 18న ప్రారంభిస్తారు.
Link to comment
Share on other sites

పుష్కర జంక్షన్‌గా కృష్ణా కెనాల్‌
 
తాడేపల్లి టౌన్‌: తాడేపల్లి కృష్ణా కెనాల్‌ రైల్వేజంక్షన్‌ను రాబోయే కృష్ణా పుష్కరాలకు అనువుగా రైల్వేశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. స్టేషన్‌లో వివిధ అభివృద్ధి పనులు, పుష్కర యాత్రీకులకు సౌకర్యాలు కల్పించడానికి రూ.3 కోట్లను వెచ్చిస్తున్నారు. విజయవాడకు కూతవేటు దూరంలో వున్న స్టేషన్‌ కావడంతో పుష్కరాల సమయంలో చెన్నై వైపు నుంచి వచ్చే రైళ్లను ఇక్కడ నిలుపుదల చేసి అధికసంఖ్యలో వచ్చే యాత్రీకుల రద్దీని నియంత్రించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపే విధంగా అయిదవ నెంబరు ఫ్లాట్‌ఫారంను ఆధునికీకరిస్తున్నారు. అలాగే, స్టేషన్‌ ప్రధాన ద్వారం వద్ద రద్దీని నియంత్రించడానికి రెండవ నెంబరు ఫ్లాట్‌ఫారం నుంచి నేరుగా స్టేషన్‌ బయటికి వెళ్లే విధంగా నూతన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వున్న బ్రిడ్జికి పైకప్పును అమర్చడం, మెట్ల మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు.
టిక్కెట్‌ కౌంటర్‌ సమీపంలో మరో ఆరు నూతన కౌంటర్లను ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. స్టేషన్‌ ఎదురు ఖాళీ స్థలంలో యాత్రీకులు బస చేయడానికి పుష్కరనగర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
Link to comment
Share on other sites

కృష్ణా పుష్కరాలకు ట్రయల్‌ రన్
 
636040766728365050.jpg
(ఆంధ్రజ్యోతి,విజయవాడ)
కృష్ణా పుష్కరాలకు 70 రెండు గంటల ముందుగా.. వివిధ శాఖలకు సంబంధించిన 76 వేల మంది పుష్కర సిబ్బంది విధుల్లో పాలు పంచుకోనున్నారు. ముందుగా జరిగే ట్రయల్‌రనలో వారు పాల్గొంటారు. పుష్కరాల తొలి రోజు విధుల్లోకి వస్తే కొత్తగాను, గందరగోళం ఉండే అవకాశం ఉన్నందున మూడు రోజులు ముందుగానే అందరినీ విధుల్లోకి దించాలని నిర్ణయించారు.
నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌, పరిసరాల్లో ఉన్న ఐదు శాటిలైట్‌ రైల్వేస్టేషన్స్‌ నుంచి, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌, ఇతర బస్‌స్టేషన్ల నుంచి వచ్చే యాత్రికులను పుష్కర నగర్లకు, అక్కడి నుంచి ఘాట్లకు తరలించే ప్రక్రియ నిరంతరాయంగా జరగాల్సి ఉంది. ఈ బాధ్యతలను నిర్వహించాలంటే.. ముందుగా ట్రయల్‌ రన్‌ అవసరం ఉంటుంది. మూడు రోజులు ముందుగానే సిబ్బంది విధుల్లోకి చేరితే ఒక అవగాహన వస్తుంది. బ్యారేజీ దిగువన ఏకీకృతంగా విస్తరిస్తున్న అతిపెద్ద భారీ ఘాట్‌లో పీఎన్‌బీఎస్‌ ఎదురుగా ఉన్న పద్మావతి ఘాట్‌ ఒకటి. ఇందులో సెకనుకు లక్ష మంది మునక వేసేలా తీర్చిదిద్దారు. కృష్ణా బ్యారేజీ - రైల్‌ బ్రిడ్జి మధ్య ఒక సరస్సు వంటిదానిని ఏర్పాటు చేయనున్నారు. నగరంలో మొత్తం 12 శాటిలైట్‌ బస్‌స్టేషన్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. తాత్కాలిక బస్‌స్టేషన్లు. రైల్వేస్టేషన్‌, పీఎన్‌బీఎస్‌, శాటిలైట్‌ రైల్వేస్టేషన్స్‌, పుష్కర నగర్‌లకు ఒక సర్కిల్‌గా ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. ప్రతి మూడు నిమషాలకు ఒక బస్సు కదిలేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
 
 
పుష్కర నగర్‌లో ఏర్పాటు ఇవి..
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేయబోతున్న 36 పుష్కర నగర్లకుగానూ విజయవాడ నగరంలో 15, విజయవాడ చుట్టుపక్కల ఉన్న రూరల్‌ ప్రాంతాల్లో మరో 8 పుష్కర నగర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంది. ఈ పుష్కర నగర్ల ఏర్పాటుకు అలాగే పుష్కరాలు జరిగే 12 రోజులపాటు పుష్కర నగర్లలో కల్పించబోవు సౌకర్యాలను ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటుచేయబోతోంది. పుష్కర నగర్లలో ఏర్పాటుచేయబోతున్న ఫుడ్‌ స్టాళ్లలో ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం, రాత్రి సమయల్లో భోజనాల సౌకర్యాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. పుష్కరనగర్ల నుంచి యాత్రికులు నగరంలో వెళ్లాలనుకునే ప్రదేశాలకు అనగా దేవాలయాలు, ఘాట్లు, బస్టాండ్‌, రైల్వే స్టేషన తదితర ప్రదేశాలకు చేరుకోవడానికి వీలుగా ఉచితంగా బస్పు సౌకర్యాలను ఏర్పాటుచేస్తున్నారు. అన్ని రకాల వైద్య పరమైన సౌకర్యాలను ఏర్పాటుచేస్తున్నారు. వీటిలో భాగంగా ఫస్ట్‌ ఎయిడ్‌, వీల్‌ చైర్లు, వెంటిలేషన్లు, అంబులెన్సు మొదలగు సౌకర్యాలను ఏర్పాటుచేస్తున్నారు. సామాన్లను భద్రపరచుకొనుటకు వీలుగా పుష్కర నగర్లలోనే సామాన్లు భద్రపరచుకొను లాకర్ల(క్లోక్‌ రూములు)ను ఏర్పాటుచేస్తున్నారు. ఘాట్ల వద్ద, దేవాలయాల్లో జరగబోవు కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసేందుకు పుష్కర నగర్లలోని యాత్రికులు వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేస్తున్నారు.
 
 
 
   
Link to comment
Share on other sites

ఇంటి వద్దకే పుష్కర జలం
 
636040763999244144.jpg
ఆంధ్రజ్యోతి, విజయవాడ/ తెనాలి రూరల్‌ : ఆగస్టు 12న ప్రారంభం కానున్న పుష్కరాల సందర్భంగా తపాల శాఖాధికారులు పవిత్ర కృష్ణాజలాలను 500 మిల్లీ లీటర్ల బాటిల్‌ ద్వారా స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా డోర్‌డెలివరీ చేయనున్నారు. అరలీటర్‌ రూ.30గా ధర నిర్ణయించారు. బుధవారం (13వ తేదీ) నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు కస్టమర్లు అన్ని తపాల కార్యాలయాల్లో బుక్‌ చేసుకోవచ్చు. తపాల కార్యాలయాలకు వెళ్లలేని వారికోసం ఆనలైన బుకింగ్‌ సౌకర్యం కల్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పుష్కర జలం అరలీటర్‌ బాటిల్‌కు రూ.30లు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రాష్ట్రాల వారు, ఇతర దేశాల వారు బాటిల్‌ ధరతో పాటు అదనంగా స్పీడ్‌ పోస్ట్‌ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
 
పుష్కర జలం స్టాల్‌
అన్ని ముఖ్య ఘాట్లలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించిన తరువాత ఇంటికి పుష్కర జలాన్ని ఇంటికి నీరు తీసుకు వెళ్లాలని భావించే యాత్రికుల కోసం ప్రత్యేకంగా పోస్టల్‌ శాఖ పుష్కర్‌ జలం పేరుతో స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. పుష్కరాలు ప్రారంభమైన తరువాతనే గొల్లపూడి, సూరాయపాలెం, పెదపులిపాక ఘాట్లనుంచి పుష్కర జలాన్ని ట్యాంకుల ద్వారా సేకరించనున్నారు. గోదావరి పుష్కర జలం బాటిల్స్‌ అందించినప్పుడు కొన్ని విమర్శలు తలెత్తిన నేపథ్యంలో పోస్టల్‌ శాఖాధికారులు ఈసారి ప్రత్యేకంగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లో 13 సార్లు శుద్ధి చేయనున్నారు. ఈసారి ఈపనులను హైటెక్‌ మినరల్‌ ప్లాంట్‌కు అప్పగించారు.
 
ప్రత్యేక ఆకర్షణగా మై స్టాంప్‌ స్టాల్‌
సాధారణ వ్యక్తులకు కూడా వారి ఫొటోతో స్టాంపులను అందించేందుకు తపాలశాఖ మై స్టాంప్‌ అనే కాన్సెప్ట్‌ను తీసుకువచ్చింది. కృష్ణా పరివాహక ప్రాంతం గల జిల్లాలోని ముఖ్య ఘాట్లలలో తపాల శాఖాధికారులు మై స్టాంప్‌ పేరుతో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్టాల్‌ ఏర్పాటు చేసేందుకు తగిన జాగా ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని తపాలా శాఖాధికారులు సంప్రదించారు. తమ ఫొటో స్టాంప్‌లో కావాలనుకునే వారు స్టాల్‌లో పాస్‌పోర్టు సైజు ఫొటోతో పాటు, రూ.300 కట్టినట్లయితే, ఫొటోతో 12స్టాంప్‌లను అరగంటలో అందజేస్తారు.
 
12 రోజులూ 12 లోగోలు..
ఆగస్టు 12నుంచి ప్రారంభమయ్యే పవిత్ర కృష్ణా పుష్కరాలకు తపాల శాఖ తన ప్రత్యేకత చాటుకోనుంది. ఆ పన్నెండు రోజులూ రోజుకొక ప్రత్యేక లోగోలను విడుదల చేయనుంది. పుష్కర లోగోలలో గాంధీహిల్‌, ప్రకాశం బ్యారేజీ, బాపు మ్యూజియం, చిలకలపూడి పాండరంగ క్షేత్రం, కొండపల్లి ఖిల్లా, ఇంద్రకీలాద్రి, శ్రీకాకుళేశ్వర స్వామి దేవాలయం, పులిచింతల, తదితర చారిత్రక ప్రాశస్త్యం గల వాటిని లోగోలుగా ప్రతి రోజూ పుష్కర ఘాట్లలో ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించేందుకు పోస్టల్‌ శాఖాధికారులు సిద్ధమయ్యారు.
Link to comment
Share on other sites

Anni good kanipistunayi pushkaralaki AP meda wrong propogonda godavari water lo snanam cheyakudadu ani crying batch ki left right padali.

 

Almatti good flood valla last 3 days lo double storage vachindi even today 15-18tmc flow undi today already 70 tmc reached inka 60 tmc deficit undi. If same flow continues till 3 days chalu 35-40tmc add avochu Almatti dam lo appudu inko 25-30 tmc vasthe dam will get filled and water may come down. Appudu crying batch faces chudali 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...