Jump to content

Krishna Pushkaralu


Recommended Posts

  • Replies 2.2k
  • Created
  • Last Reply
హైటెక్‌ పుష్కరం
 
257251.jpg

sk3s0Zn.jpg

కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు అదరహో అనేలా రాష్ట్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. సర్కారు సిద్ధం చేయించిన పుష్కర ఘాట్ల డిజైన్లను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. అందులో ఒకటే ఇది.. 
  • కృష్ణా పుష్కరాలకే.. రివర్‌ ఫ్రంట్‌ ఘాట్లు! 
  •  రూ.152 కోట్లతో ఏర్పాటు.. ‘ఆంధ్రజ్యోతి’ చేతికి డిజైన్లు 
విజయవాడ, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): కృష్ణా పుష్కరాలకు.. తరలివచ్చే లక్షల మంది భక్తులకు సరికొత్త కృష్ణా తీరాన్ని ఆవిష్కరించేందుకు రూపొందనున్న రివర్‌ ఫ్రంట్‌ ఘాట్‌ డిజైన్లు ఇవే! చైనాకు చెందిన గిజ్‌హౌ ఇంటర్నేషనల్‌ సంస్థ(జీఐఐసీ) రూపొందించిన ఈ డిజైన్లు ‘ఆంధ్రజ్యోతి’ చేతికి చిక్కాయి. కృష్ణా పుష్కరాలకు ఏ-ప్లస్‌ కేటిగిరీ శ్రేణిలో ఉన్న పవిత్ర సంగమం, దుర్గాఘాట్‌లతో పాటు దిగువన ఉన్న అనేక ఘాట్లను శాశ్వత ప్రాతిపదికన సుందరీకరించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
కృష్ణా తీరపు ప్రస్తుత రూపాన్ని మార్చి వేసి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి రూ.152 కోట్ల వ్యయంతో ముఖ్య ఘాట్లను సుందరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాలను ఆధారంగా చేసుకుని అటు ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర పవిత్ర సంగమం, ఇటు కృష్ణవేణి, పద్మావతి ఘాట్ల వరకు రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చెయ్యాలన్న ఉద్దేశంతో ఉంది. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టులో అంతర్భాగంగా తొలుత ఘాట్లను అత్యద్భుతంగా ఆవిష్కరిస్తారు. పుష్కరాల తర్వాత మిగిలిన రివర్‌ ఫ్రంట్‌ పనులను పూర్తి చేస్తారు. దుర్గగుడి సమీపంలోని దుర్గాఘాట్‌ ప్రస్తుతం అనువైన ప్రాంతంగా ఉంది. ఇక్కడ 2.3 కిలోమీటర్ల పొడవున రూ.66 కోట్ల వ్యయంతో టూరిస్ట్‌ రివర్‌ ఫ్రంట్‌ ల్యాండ్‌ స్కేప్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కృష్ణానదికి హారతులు ఇవ్వటానికి ఒక భారీ వేదిక కూడా ఈ ప్రాజెక్టులోనే అంతర్భాగంగా ఉంటుంది. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లోర్‌ ఘాట్‌ పనులను మాత్రమే ప్రస్తుతం చేపడుతున్నారు. తర్వాత రివర్‌ ఫ్రంట్‌ స్క్వేర్‌, రివర్‌ ఫ్రంట్‌ వాక్‌ వే, రెండు పార్కులు, బెంచీలు, స్కై వీల్‌ (జెయింట్‌ వీల్‌), చెక్కతో తయారు చేసిన నడకదారులు, వంటి ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు చైనా నిపుణులు ఇచ్చిన డిజైన్లను సీఎం పరిశీలించిన తర్వాత.. బ్యారేజీ దిగువన పద్మావతి, కృష్ణవేణి ఘాట్‌ల మీదుగా విశ్వేశ్వరయ్య ఘాట్‌ వరకు అదనంగా 1.6 కిలోమీటర్ల మేర రూ. 44 కోట్లతో పొడిగింపు పనులు చేపట్టనున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీ ముఖ ద్వారం వద్ద రాజధానిలోకి ప్రవేశించటానికి సింగపూర్‌ ఇచ్చిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఐకానిక్‌ బ్రిడ్జిని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. సరిగ్గా ఈ ప్రాంతంలోనే పట్టిసీమ ప్రాజెక్టు పుణ్యమా అని గోదావరి జలాలు, కృష్ణానదిలో కలుస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని పవిత్రసంగమంగా ప్రభుత్వం ప్రకటించింది. పవిత్ర సంగమాన్ని భారీ రివర్‌ ఫ్రంట్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. పవిత్ర సంగమం ప్రాంతాన్ని 2.1 కిలోమీటర్ల మేర రూ.42 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. పుష్కరాల నేపథ్యంలో ప్రస్తుతం నాలుగు స్టెయిర్ల ఘాట్‌ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఒకేసారి లక్షమంది యాత్రికులు స్నానం చేసే విధంగా ఘాట్‌లను నిర్మిస్తున్నారు. 
Link to comment
Share on other sites

  • 2 weeks later...

పూర్వం బ్రహ్మాది దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి భూలోక వాసులను పాపవిముక్తులను జేయుటకు సులభోపాయమును తెలుపమని ప్రార్ధించారు. విష్ణువు బ్రహ్మర్ధులను తోడుకుని పరమేశ్వరుని వద్దకు వెళ్లి విషయము వివరించి సరైన తరుణోపాయమును సూచించమని కోరడం జరిగింది. అంత పరమేశ్వరుడు వారికి తరుణోపాయమును విశిద్ధ్హికపరచి పడమటి కనమలలో గల సహ్యాద్రి పర్వతమందు బ్రహ్మగిరి, వేదగిరి అను రెండు శిఖరములు గలవు. బ్రహ్మగిరి యందు నేవు శ్రీ మహా విష్ణువు ఆశ్వత (రావి) వృక్షము గాను, నేను వేదగిరి యందు పెద్ద ఉసిరిక వృక్షము గాను వెలయదుమని తెలిపారు. మా అంసలో కృష్ణ - వేణి నదులు ఆవిర్భవించి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతములో కలియగలవని ఆ నదీమ తల్లిలో స్నానము ఆచరించిన జనులు సర్వ పాపవిముక్తులు అవుతారని పేర్కున్నారు. అలా బ్రహ్మాది దేవతలకు, ఈశ్వరుడు చెప్పి పంపించెను.


కాలానుగతముగా సహ్య పర్వతమందలి బ్రహ్మగిరి యందు శ్రీ మహా విష్ణువు ఆశ్వత వృక్షముగా ఆవిర్భవించి తన అంశతో "కృష్ణా నది"ని ఆవిర్భింప చేసెను. తదుపరి ఈశ్వరుడు వేదగిరి యందు ఆమలక వృక్షంగా వెలసి తన అంశతో "వేణి నది" గా ఆవిర్భింప చేసెను.


మహారాష్ట్రలోని పూణే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో మహాబలేశ్వరం ప్రాంతంలో జార్ గ్రామంలో కృష్ణా నది పుట్టిన ప్రాంతం. అటు మహాబలేశ్వర ప్రాంతాన ఉద్భవించిన "కృష్ణ - వేణి " నదులతో "ఖిల్లవడి" అనే ప్రదేశానికి పై భాగాన కలిసి కృష్ణవేణి నదులు విడిపోయి పులిగడ్డ నుంచి తూర్పుగా కృష్ణానది ప్రవహించి కృష్ణాజిల్లాలో హంసల దీవి వద్ద బంగాళాఖాతములో కలిసినది. పులిగడ్డ నుండి వేణి నది దక్షిణంగా ప్రవహించి నాచుగుంట ప్రాంతాన మూడు పాయలై "త్రివేణి సాగర సంగమం" ను పేరు ప్రఖ్యాతలు గాంచి సముద్రంలో కలిసినది.


అందువల్ల ఈ రెండు నదుల మధ్య గల ప్రదేశమందు సంకల్పములో "కృష్ణవేణి యోర్యధ్యప్రదేశ్" అని చెప్పుకునే ఆచారము ననుడిలోనికి వచ్చినది.


కృష్ణ నది ఉప నదులు: కోయనా నది, పెన్నా నది, మాలప్రభ నది, భీమా నది, ఎర్ల నది, ఘాట్ ప్రభ నది, దిండి నది, వర్ణ నది, మూసి నది, పాలేరు నది, దూద్గంగ నది.


Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...