Jump to content

Krishna Pushkaralu


Recommended Posts

  • Replies 2.2k
  • Created
  • Last Reply
కృష్ణా పుష్కరాలకై ప్రత్యేక గీతాలు
 
636041830624783457.jpg
విజయవాడ : కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా ప్రణాళికలు చేస్తోంది. అంతేకాదు కృష్ణా పుష్కరాల కోసం ప్రత్యేక గీతాలను కూడా రూపొందిస్తోంది. పుష్కరాలపై ప్రచారం కోసం అన్ని జిల్లాల్లో ప్రచార రథాలు, కళా జాతాలు సిద్ధం చేస్తోంది.
 
ఆగష్టు 12 నుంచి ప్రారంభంకానున్న కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడానికి ఏపీ సర్కార్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌లో సమాచారశాఖా భవన్‌లో పుష్కరాలపై మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ , అనంతశ్రీరాంతో భేటీ అయిన ఆయన, గురువారం ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌తో సమావేశమయ్యారు. కృష్ణా పుష్కరాల ప్రత్యేక గీతాలపై చర్చలు జరిపారు. కృష్ణా పుష్కరాల విశిష్టతను తెలిపేందుకు, పుష్కర స్నానం ప్రాసస్థ్యాన్ని తెలిపే ప్రత్యేక గీతాలను రూపొందిస్తున్నట్లు మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి చెప్పారు.
 
జొన్నవిత్తుల రాసిన మూడు పాటలను మంత్రి విన్నారు. ఆ పాటలకు ట్యూన్లు కట్టే బాధ్యతను సంగీత దర్శకుడైన మాధవపెద్ది సురేష్‌కు అప్పగించారు. మంచి పేరున్న గాయకులతోనే పాడించి అద్భుతంగా పాటలు తయారు చేయాలని మంత్రి సూచించారు. ఈనెల 18న జరిగే కృష్ణా పుష్కరాల సమీక్షనాటికి పాటల ట్రాక్‌ను సిద్దం చేయాలని కోరారు. పుష్కరాల్లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా ప్రచారం నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్ని జిల్లాల్లో ప్రచార రథాలు, కళా జాతాలను తయారుచేస్తోంది. ప్రధానంగా ప.గో, కృష్ణా, గుంటూరు జిల్లాల సమాచార అధికారులు అప్రమత్తంగా ఉండి, వీఐపీల పర్యటనలు సక్సెస్ చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించేది లేదని, నేరుగా ఇంటికే పంపుతామని హెచ్చరించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...