Jump to content

Krishna Pushkaralu


Recommended Posts

  • Replies 2.2k
  • Created
  • Last Reply

Here is the video of krishna Pushkaram, Flyover and Durga temple road works which are in progress and captured by Drone Camera.


15 km water front development is planned by Chief Minister Chandrababu Naidu, starting from Prakasam Barrage to Pavithra Sangamam with a budget of rupees 850 crores, out of which Rupees 108 crores will be spent before pushkarams and rest after Pushkarams.


This 15 km water front will be developed as one of the world's best tourist destination.


Link to comment
Share on other sites

నభూతో నభవిష్యత్‌లా..కృష్ణా పుష్కరాలు
 
636045127066800236.jpg
అమరావతి : కృష్ణా పుష్కరాలను నభూతో నభవిష్యత్‌ లా ప్రభుత్వం నిర్వహిస్తుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ తెలిపారు. సోమవారం అమరావతిలో జరుగుతున్న పుష్కర అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ధ్యాన బుద్ధ ప్రాజెక్టు సమీపంలోని పుష్కరఘాట్‌ ను పరిశీలించి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ చౌదరిని పనులపై వివ రణ కోరారు. అనం తరం అమరేశ్వరాలయం సమీపంలోని పుష్కరఘాట్లను పరిశీలించారు. భక్తులకు సౌకర్యవంతం గా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో రూ.16 కోట్లతో 1.3 కి.మీ ఘాట్‌ పనులు ఈ నెల 31 నాటికి పూర్తి చేస్తారన్నారు. కృష్ణానదిలో గోదావరి జలాలు కలవడం చారిత్రక అంశమని, ఎగువ కూడా వరద నీరు వస్తుందన్నారు. 15 రోజుల్లో నదిలో నీటి ప్రవాహం ఆశాజనకంగా ఉంటుందన్నారు. పుష్కరాల రోజుల్లో నదిలో ము క్కోటి దేవతలు స్నాన ం చేస్తారని ఆదే సమయంలో మ నం కూ డా నదీ స్నానం చేయడం వల్ల దేవతల ఆశీస్సులు తప్పక లభిస్తాయన్నారు. రోజుకు 1.5 లక్షల మంది స్నానాలు చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సీఎం చం ద్రబాబు ఎప్పుడైనా పుష్కర పనులను సందర్శించే అవకాశం ఉందని తెలిపారు.
కోటప్పకొండకు దీటుగా...
కోటప్పకొండ ఆలయానికి దీటుగా అమరేశ్వరాలయం అభివృద్ధి జరగాలని స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ తెలిపారు. అమరేశ్వరాలయం సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. అమరేశ్వరాలయం సమీపంలో అక్వేరియంలు, బోటు షికారు వంటివి ఏర్పాటు చేయాలని ఈవో శ్రీనివాసరెడ్డికి స లహా ఇచ్చారు. కార్యక్రమాల్లో ఆర్డీ వో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
 
 
 
Link to comment
Share on other sites

పుష్కరనగర్ల నుంచి భక్తులకు ఉచితంగా రవాణా సౌకర్యం
 
636045128856472254.jpg
  • ఐదు వేల మంది అధికారులు, సిబ్బందితో ప్రభుత్వ సేవలు 
  • స్నానానికి రోజుకు 10 లక్షల మంది వస్తారని అంచనా 
  • ఆంధ్రజ్యోతితో గుంటూరు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే
ఆంధ్రజ్యోతి - గుంటూరు: ప్రభుత్వం ఆదేశించిన విధంగా జిల్లాలో పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ కాంతిలాల్‌దండే తెలిపారు. జిల్లాలో పుష్కరాలకు అధికార యం త్రాంగం పరంగా జరుగుతోన్న ఏర్పాట్ల గురించి ఆయన సోమవారం ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆంధ్రజ్యోతి: జిల్లాలో ఎన్ని పుష్కర ఘాట్లను నిర్మి స్తున్నారు? యాత్రికుల సేవలో ఎంతమంది సిబ్బం దిని వినియోగించబోతున్నారు?
కలెక్టర్‌: కృష్ణ పుష్కరాలకు ఈ సారి మొత్తం 79 ఘాట్లను నిర్మిస్తున్నాం. అమరావతి, సీతానగరం, తాళ్లాయపాలెం, పెనుమూడిలో పెద్ద ఘాట్ల నిర్మా ణం చేపట్టాం. అలానే విజయపురిసౌత, తంగెడ, సత్రశాల, దైదలో ఎక్కువమంది యాత్రికులు స్నానం చేసేందుకు ఘాట్ల నిర్మాణం జరుగుతున్నది. ఒక్క పారిశుధ్యానికే 3 వేల మంది కార్మికులు అవసరం అవుతారు. అధికారులు, మిగతా సిబ్బందిని పరిగణ నలోకి తీసుకుంటే కనీసం 5 వేల మంది సిబ్బందితో యాత్రికులకు సేవలందిస్తాం.
ఆంధ్రజ్యోతి:పుష్కరనగర్‌ల గురించి వివరించండి?
కలెక్టర్‌: జిల్లాలో మొత్తం 19 పుష్కరనగర్‌లు ఏర్పాటు చేయబోతున్నాం. మంగళవారం నుంచి వీటి పనులు ప్రారంభమౌతాయి. ప్రతి పుష్కరనగర్‌ లేఅవుట్‌ సిద్ధమైంది. వీటి వద్ద కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేస్తాం. డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి ఇనచార్జ్‌గా ఉండి 10 సర్వీసు డిపార్టుమెంట్ల సిబ్బంది ని సమన్వయం చేసుకుంటూ సేవలంది స్తారు. పుష్కరనగర్లలో కనీసం లక్ష మంది బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడే రవాణ, భోజన సౌకర్యాలు కల్పిస్తాం.
ఆంధ్రజ్యోతి: పుష్కర ఘాట్లను ఎన్ని కేటిగిరీలుగా విభజించారు? పిండప్రదాన షెడ్ల గురించి చెప్పండి?
కలెక్టర్‌: ఫుష్కర ఘాట్లను మొత్తం నాలుగు కేటిగి రీలుగా విభజించాం. ఏ+ కేటిగిరి కింద అమరావతి, తాళ్లాయపాలెం, పెనుమూడి, సీతానగరం ఘాట్‌లు చేర్చాం. అలానే ఏ కేటిగిరి కింద ఎనిమిది, బీ కేటిగిరి కింద 13, మిగతా ఘాట్లను సీ కేటిగిరిగా నిర్ణయిం చాం. మొత్తం 27 పిండ ప్రదాన షెడ్లను గృహనిర్మాణ శాఖ ద్వారా నిర్మిస్తాం. వీటి వద్ద 600 మంది పురోహితులు పిండ ప్రదానం, మూసివాయనం, పొత్తర్ల సేవలందిస్తారు.
ఆంధ్రజ్యోతి: యాత్రికుల రద్దీ నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు?
కలెక్టర్‌: ఇతర జిల్లాల నుంచి వచ్చే యాత్రికులు ఎక్కడా ఇబ్బంది పడకుండా సర్క్యూట్‌ రూట్‌ ప్లాన చేశాం. యాత్రికులు నేరుగా పుష్కరనగర్‌లకు చేరు కుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా ఘాట్ల వద్దకు తీసుకెళ్లి దింపుతాం. ప్రతీ పుష్కర ఘా ట్‌ వద్ద క్యూలైనలు ఏర్పాటు చేస్తాం. ఘాట్‌ విస్తీర్ణం, రద్దీని బట్టి ఒకేసారి స్నానం చేసేందుకు ఎంత మందిని అనుమతించాలనే దానిపై ఘాట్‌ ఇనచార్జ్‌ నిర్ణయం తీసుకుంటారు.
ఆంధ్రజ్యోతి: యాత్రికులకు వినోదాన్ని పంచేందుకు ఎలాంటి కార్యక్రమాలు ప్లాన చేశారు?
కలెక్టర్‌: తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ నిత్యం అమరావతిలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వ హించేందుకు ముందుకొచ్చింది. ఇదే విధంగా ప్రభు త్వ సాంస్కృతిక శాఖ కూడా కొన్ని కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాత్రి వేళల్లో లేజర్‌ లైటింగ్‌ షోల నిర్వహణకు కూడా ప్లాన చేస్తున్నాం.
ఆంధ్రజ్యోతి: స్వచ్ఛంద సేవా సంస్థల సేవలను ఎలా వినియోగించుకోనున్నారు?
కలెక్టర్‌: ఇప్పటికే రైస్‌మిల్లర్స్‌, దాల్‌మిల్లర్స్‌ తదితర అసోసియేషన్లు పుష్కరాల్లో సేవలందించేందుకు ముందుకొచ్చాయి. యాత్రికులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చాయి. ఇదే విధంగా కొన్ని సంస్థలు వలంటీర్లుగా సేవలందిం చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి: ప్రమాదాల నివారణకు ముందుస్తుగా తీసుకుంటున్న జాగ్రత్తలు గురించి వివరించండి?

కలెక్టర్‌: ప్రతీ పుష్కరఘాట్‌ వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతాం. అలానే మత్స్యకారుల సేవలు కూడా వినియోగిస్తాం. అగ్నిమాపక శాఖ, ఎనడీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘాట్ల వద్దనే మూడు షిఫ్టులు గా అందుబాటులో ఉంటూ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతారు. సిబ్బందికి అవసరమైన లైఫ్‌ జాకెట్లు వంటివి భారీగా సమకూర్చుకుంటున్నాం.
ఆంధ్రజ్యోతి: పుష్కరాల పనుల ఆశించినంత వేగంగా జరగడం లేదన్న వాదనలపై మీ స్పందన ఏమిటి?
కలెక్టర్‌: జిల్లాలోని పుష్కర ఘాట్లను సందర్శించాము. ఘాట్ల వరకు 80 శాతం కాంక్రీట్‌ పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయా ల్సిందిగా ఆదేశించాం. గుంటూరు నగరంలో రహదారుల విస్తరణ పనులు కొంత జాప్యం జరుగుతోన్న విషయం వాస్తవమే. ఒక్క ఏటు కూరు రోడ్డు, పొన్నూరు రోడ్డులో డ్రెయిన వద్ద మినహా మిగతా పనులన్నీ నెలాఖరు లోపే పూర్తి చేస్తాం. ప్రజల మనోభావాలతో ముడి పడి ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చీలను రోడ్ల విస్తరణ కోసం తొలగించాల్సి ఉండ టంతో కొంత జాప్యం జరుగుతుంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...