Jump to content

Krishna Godavari Pavitra sangamam


Recommended Posts

పవిత్ర సంగమం వెలవెల
06-05-2018 08:14:17
 
636611912558731671.jpg
  • నీటిపై తేలియాడే రెస్టారెంట్లు, క్యాండిల్‌ డిన్నర్‌లు తొలగింపు
విజయవాడ: పవిత్ర సంగమంలో లగ్జరీ, స్పీడ్‌ బోటింగ్‌ వెలవెలబోతోంది. మేక్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎన్‌ఆర్‌ఐ గుమ్మడపు పాపారావు ఇక్కడ చేపట్టిన వినూత్న ప్రయోగానికి ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. వాటర్‌ స్పోర్ట్స్‌ సింపుల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలసి చేపట్టిన లగ్జరీ బోటింగ్‌ ప్రాజెక్టు గత ఏడాది ఆగస్టులో ప్రారంభించారు. దీనికోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా లగ్జరీ బోట్స్‌, కియాస్కి బోట్స్‌, బంపర్‌ బోట్స్‌ను దిగుమతి చేసుకుని పవిత్ర సంగమంలో పర్యాటకులకు అందుబాటులో ఉంచారు. తొలుత పర్యాటకుల నుంచి మంచి స్పందనే లభించింది. ఇంతలో పవిత్ర సంగమం సమీపంలో జరిగిన దుర్ఘటన బోటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. సంగమం సమీపంలో బోటు తిరగబడి 23 మంది పర్యాటకులు మృత్యువాత పడటంతో బోటింగ్‌ ఎక్కేందుకు పర్యాటకులు ఆసక్తి చూపటం మానేశారు.
 
   అన్ని అనుమతులు ఉండి, శిక్షకులు ఉన్నప్పటికీ పర్యాటకులకు కళ్ల ముందు జరిగిన దుర్ఘటనతో బోటింగ్‌కు దూరం అయ్యారు. దీంతో ఎన్నో ఆశలతో ప్రారంభించిన లగ్జరీ, స్పీడ్‌ బోటింగ్‌ పర్యాటకులు లేక వెలవెలబోతోంది. పర్యాటకులు హాయిగా నదిలో విహారించేందుకు సుమారు నాలుగు లగ్జరీ బోట్లు, ఒక్కో బోటులో సుమారు 8మంది విహరించేందుకు చేసిన ఏర్పాట్లు వృథా అయ్యాయి. యువతీ యువకులు స్పీడ్‌ బోటింగ్‌ చేసేందుకు అనువైన కియాస్కి బోట్స్‌, నీటిపై తేలియాడే రెస్టారెంట్లు, ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌, క్యాండిల్‌ డిన్నర్‌ వంటివి పత్తా లేకుండా పోయాయి. అన్నీ అనుకున్నట్లు జరిగినట్లయితే ఉదయం టికెట్‌ తీసుకుని నదిలోకి వెళ్లిన జంట రాత్రి కూడా అక్కడే బస చేసేందుకు ఏర్పాట్లకు ఉపక్రమించారు. అల్పాహారం, వివిధ రకాల చైనీస్‌ ఐటెమ్స్‌, స్నాక్స్‌ బార్‌, నూతన దంపతులు ఏకాంతంగా గడిపే విధంగా నీటిపైనే అన్ని వసతులతో కూడిన గదులు నిర్మాణాలు చేపట్టే క్రమంలో దుర్ఘటన జరగటంతో గడిచిన తొమ్మిది నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా పోయింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 4 weeks later...
ప్రమాదాల ‘ఘాటు’
పవిత్ర సంగమం నుంచి దుర్గా ఘాట్‌ వరకూ రక్షణ చర్యలు కరవు
కనీసం హెచ్చరికల బోర్డులూ లేవు
ఈనాడు, అమరావతి
29ap-main7a.jpg
అందంగా తీర్చిదిద్దిన ఘాట్‌లు ప్రమాద హేతువులవుతున్నాయి. జనం అధికంగా వస్తున్నా రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. విజయవాడ సమీపంలోని ఘాట్‌లలో వరుస ప్రమాదాలు భీతి గొలుపుతున్నాయి. ఏడెనిమిది నెలల కిందట పవిత్ర సంగమంవద్ద పడవ మునిగిన ప్రమాదాన్ని మరువకముందే నాలుగు రోజుల కిందట అక్కడే మరో నలుగురు విద్యార్థులు జల సమాధి కావడం భయపెడుతోంది.

విజయవాడ సమీపంలోని ఫెర్రీ, పవిత్ర సంగమం, పున్నమి, దుర్గాఘాట్‌లను గత పుష్కరాల సమయంలో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. దీంతో పర్యాటకులు, దుర్గగుడికి వచ్చే భక్తులు, స్థానికులు అధికంగా సందర్శిస్తున్నారు. వాటిని సుందరంగా తీర్చిదిద్దినా రక్షణ చర్యలు లేకపోవడం ఇబ్బందిగా మారింది.

ఫెర్రీ
29ap-main7b.jpg
ఇబ్రహీంపట్నం పరిధిలో ఫెర్రీ ఘాట్‌ ఉంది. 2004లో కృష్ణా పుష్కరాల సమయంలో ఈ ఘాట్‌ను నిర్మించారు. ఇటీవల కృష్ణా పుష్కరాల సమయంలో ఈ ఘాట్‌కు ఎగువన మరో చిన్న ఘాట్‌ను అభివృద్ధి చేశారు.
లోపాలు..
* ఈ ఘాట్‌ నుంచి నీళ్లలోకి దిగే చోట కనీసం బారికేడ్లు లేదు.
* ఘాట్‌ పక్కన గట్టు కూలిపోయి మనుషులు, పశువులు నీటిలో పడిపోయేలా ఉంది.
* నది మీదుగా ఆవలివైపు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తుండటంతో అక్కడ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
దుర్గాఘాట్‌..
29ap-main7c.jpg
ప్రకాశం బ్యారేజీకి అతి సమీపంలో... కనకదుర్గమ్మ దేవాలయం కింద ఉన్నదే దుర్గా ఘాట్‌. దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులంతా దాదాపు ఇదే ఘాట్‌లో స్నానమాచరిస్తారు. స్నానం చేయడంతోపాటు ఇక్కడే కృష్ణమ్మకు పూజలు చేస్తారు. భక్తులు, పర్యాటకులు, విజయవాడ స్థానికుల సందర్శనతో ఇక్కడ నిత్యం రద్దీగా ఉంటోంది.
లోపాలు..
* ఇక్కడ ఘాట్‌ మరీ చిన్నదైంది.
* పక్కనే పైవంతెన (ఫ్లైఓవర్‌) పనులు జరుగుతుండటం... ఇసుక, మట్టి, సిమెంట్‌ వంటివన్నీ ఆ ఘాట్‌లో పడుతుండటంతో ఘాట్‌ కుంచించుకుపోయింది.
* ఇక్కడ నీటిలో ఏర్పాటు చేసిన బారికేడ్లు తక్కువ ఎత్తులో ఉండటంతో నీటిలో దిగినవారు వీటిని దాటుకుని లోపలికి వెళుతున్నారు.
* ఘాట్‌ ప్రారంభంలో బారికేడ్లు దాటి నదిలోకి వెళ్లవద్దంటూ జల వనరులశాఖ ఏర్పాటు చేసిన సూచన బోర్డు మినహా ఇక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరికలూ లేవు.
పవిత్ర సంగమం
29ap-main7d.jpg
గోదావరి వచ్చి కృష్ణాలో కలిసే చోటు ఇది. పవిత్ర సంగమంగా ఈ ప్రాంతంలో 2016లో జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా విశాలమైన భారీ ఘాట్‌ను ప్రభుత్వం నిర్మించింది. ఇక్కడే కృష్ణా నదికి ప్రతి రోజూ హారతి ఇస్తున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగానే ఉంటోంది. ప్రస్తుతం విజయవాడలో ప్రకాశం బ్యారేజీ తర్వాత అంతటి ప్రాధాన్యమున్నది పవిత్ర సంగమానికే అని చెప్పొచ్చు. దీనికి తగ్గట్లే ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
లోపాలు..
* ఎలాంటి ప్రమాద హెచ్చరికలూ లేవు.
* కృష్ణా హారతి వేదిక నుంచి గోదావరి వచ్చే దారి వరకూ ఉన్న ఘాట్‌ మెట్లు, నీటిలోని బారికేడ్లకు మధ్యన మొక్కలు పెరిగిపోయాయి. దీంతో అక్కడ స్నానాలు చేయాలకునేవారు బారికేడ్లు దాటి నీటిలోకి వెళ్లాల్సిన పరిస్థితి.
* గోదావరి నీరు వస్తున్న మార్గాన్ని సూచిస్తూ ఎలాంటి సూచికలు లేవు. దీనివల్ల చాలామంది తెలియక ఆ మార్గంలోని ఘాట్‌లోకి స్నానానికి దిగుతున్నారు. రెండు నదులు కలుస్తున్న చోట నీరు సుడులు తిరుగుతుంటుంది.
* పహారా కాసేందుకు పోలీసులను నియమించినా వారికి కనీస సౌకర్యాలు లేవు.
* ఘాట్‌ విస్తీర్ణం ఎక్కువగా, ఎత్తుగా ఉండటంతో ఎవరు ఎటువైపు నుంచి దిగుతున్నారు ఎక్కడ ప్రమాదానికి గురవుతున్నారనేదీ గుర్తించే పరిస్థితి లేదు.
పున్నమి ఘాట్‌
29ap-main7e.jpg
అంతకుముందు కృష్ణా పుష్కరాల సమయంలో ఇక్కడ ఘాట్‌ నిర్మించారు. ఇటీవలి పుష్కరాల సమయంలో విస్తరించి ఆహ్లాదభరితంగా మార్చారు. భవానీ ద్వీపం (ఐలాండ్‌) వెళ్లే పడవలు/లాంచీలు ఇక్కడ నుంచే బయల్దేరుతుంటాయి. ఇక్కడే పున్నమి రిసార్టు ఉండటంతో బయట నుంచి వచ్చే పర్యాటకులు బస చేస్తుంటారు. ఇక్కడ వారాంతాల్లో, ఇతర ప్రత్యేక దినాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతోపాటు విజయవాడ నగరానికి దగ్గరగా ఉండటంతో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది.
లోపాలు..
* రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పరిధిలో ఉన్న కొద్దిపాటి ఘాట్‌ ప్రాంతంలో మాత్రమే ఆ సంస్థ ఏర్పాటు చేసుకున్న పొరుగు సేవల భద్రతా సిబ్బంది ఒకరిద్దరు కనిపిస్తున్నారు.
* ఏపీటీడీసీకి ఇరువైపులా ఉన్న ఘాట్‌లో ఎక్కడా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవు.
* బారికేడ్‌ నుంచి నేరుగా నీటిలోకి వెళ్లే పరిస్థితి. కనీస ప్రమాద హెచ్చరికలూ లేవు.
ఇలా చేయొచ్చు
*  నీటి ప్రవాహ వేగం, లోతు, ఎక్కడ స్నానాలు చేయాలి? ఎక్కడ నీటిలోకి దిగకూడదు వంటి హెచ్చరికలతో కూడిన బోర్డులను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలి.
*  ఈ ఘాట్‌లలో నియమించిన గజ ఈతగాళ్లకు ఘాట్‌ల వద్ద షెల్టర్‌ లాంటివి ఏర్పాటు చేస్తే వారు అక్కడే ఉండి పర్యవేక్షించే వీలుంటుంది.
*  పవిత్ర సంగమంవద్ద టవర్‌ ఏర్పాటు చేసి అక్కడ నుంచి అటు ఫెర్రీ, ఇటు పవిత్ర సంగమం ఘాట్‌లలో నీటిలోకి దిగేవారికి పరిశీలించేందుకు వీలుగా బైనాక్యులర్‌ అందుబాటులో ఉంచాలి. దీంతో 2 కి.మీ. పరిధిలో నిఘా పెట్టవచ్చు.
*  ఎస్డీఆర్‌ఎఫ్‌ ద్వారా ప్రత్యేకంగా శిక్షణనిచ్చిన వారిని ఫెర్రీ, పవిత్ర సంగమం, పున్నమి ఘాట్‌లలో నియమించినప్పటికీ వారికి అవసరమైన అత్యాధునిక ఎక్విప్‌మెంట్‌ ఇవ్వలేదు.

అవి ఇస్తే మేలు జరుగుతుంది.
*  రక్షకులకు సాధారణ రబ్బరు బోట్‌ను ఇచ్చారు. గాలి నింపి (చుట్టూ బెలూన్‌ తరహాలో ఉంటుంది) నడుపుతారు కాబట్టి ఇది నీటి ప్రవాహానికి ఎదురు వెళ్లలేదు. ఫైబర్‌తో నిర్మించే స్పీడ్‌ బోట్లను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.

ఫ్లోరిడా, ఆస్ట్రేలియాల్లో చర్యలు అనుసరణీయం
అమెరికాలోని ఫ్లోరిడా, ఆస్ట్రేలియాల్లోని బీచ్‌లలో తీసుకుంటున్న చర్యలు మనకూ అనుసరణీయం. అక్కడ తీర ప్రాంతంలో ఎక్కడ స్నానం చేయడం సురక్షితం, లోతు లేని, లోతున్న ప్రాంతాలు, ఆ రోజు ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నీటిలోకి వెళ్లవచ్చా లేదా?, రాకాసి అలలు ఎప్పుడొస్తాయి? వంటి సమాచారంతో అన్ని బీచ్‌లలో హెచ్చరిక/సూచిక బోర్డులుంటున్నాయి. ఎక్కడైనా గజ ఈతగాళ్లు, రక్షణ చర్యలు లేకపోతే ఇక్కడ రక్షణ చర్యలు తీసుకోలేదు. ఇక్కడ నీటిలోకి దిగవద్దన్న సూచనా ఉంటుంది.

గోవాలో...
గోవాలోనూ ప్రధాన, జనతాకిడి ఉండే బీచ్‌లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అర కిలోమీటరుకూ రబ్బరు ట్యూబ్‌లు, లైఫ్‌ జాకెట్లతో గజ ఈతగాడిని అందుబాటులో ఉంచుతున్నారు. ఆ పరిధిలో ఎవరైనా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగితే గజ ఈతగాడు వెంటనే వెళ్లి వారికి లైఫ్‌ జాకెట్‌/ ట్యూబ్‌ ఇవ్వడంతోపాటు వారిని బయటకు తీసుకొచ్చేలా ఏర్పాట్లున్నాయి.

 
 
 

ముఖ్యాంశాలు

 
Link to comment
Share on other sites

నిఘా నీడలో పవిత్ర సంగమం
01-07-2018 10:52:29
 
636660391483559523.jpg
  • మూడు షిప్టుల్లో 15 మంది పోలీసులు
  • ఘాట్‌ పొడవునా నిత్యం పహారా
  • ఘాట్‌లలో ఈత కొట్టేందుకు అనుమతులు నిల్‌
  • పిండ ప్రదానాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి
పవిత్ర సంగమం (ఇబ్రహీంపట్నం): పవిత్ర సంగమంలో పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. పర్యాటకులు కొందరు సరదా పేరుతో సంగమం ఘాట్‌లలోకి దిగి ఈత కొడుతున్నారు. ఇటీవల కంచికచర్ల మిక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు గోదావరి ఘాట్‌లోకి దిగి గల్లంతై మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో సంగమంలో భద్రత చర్యలు లోపభూయిష్టంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రమాద సంఘటన తెలుసుకుని 6 గంటలకు పైగా ఘాట్‌లలో ఉండి పరిశీలించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి స్థానికులు పలు సమస్యలు తీసుకువచ్చారు. పవిత్ర సంగమంలో ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడం వల్ల పర్యాటకులు, విద్యార్థులు ఘాట్‌లలోకి దిగి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల బాలుర దగ్గర నుంచి ఇంజనీరింగ్‌ విద్యార్థుల వరకూ ఘాట్‌లలోకి సరదా కోసం దిగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ కార్యాలయంలో జరిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారుల సమీక్షలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీస్‌ భద్రతపై ప్రధానంగా చర్చించారు.
 
24 గంటలు గస్తీ
పవిత్ర సంగమం ఘాట్‌ పొడవునా ఇకపై ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లతో నిఘా ఉంచనున్నారు. ఘాట్‌లలోకి వెళ్లకుండా వీరు అప్రమత్తంగా ఉంటారు. 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో 15 మంది కానిస్టేబుల్స్‌ విధులు నిర్వహిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఘాట్‌లలోకి దిగి ఈతకొట్టేందుకు అనుమతులు ఇచ్చే ప్రసక్తి లేకుండా ఆదేశాలు జారీ చేశారు. పిండ ప్రదానాలకు సైతం ముందస్తు అనుమతులు తీసుకోవాలనే నిబంధన పెట్టారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...