Jump to content

AP ports


Recommended Posts

వార్తలు
కృష్ణపట్నం పోర్టులో ఇమిగ్రేషన్‌ చెక్‌పోస్టు
24-02-2018 03:40:43

 నోటిఫై చేసిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: కృష్ణపట్నం పోర్టుకు అరుదైన గుర్తింపు లభించింది. ఇక్కడ నుంచి విదేశాలకు రాకపోకలు సాగించే వారికి కృష్ణపట్నం పోర్టును అధికారిక ఇమిగ్రేషన్‌ చెక్‌ పాయింట్‌గా గుర్తిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది. 1950 పాస్‌పోర్టు ఎంట్రీ రూల్స్‌ ప్రకారం నిబంధనలు వర్తిస్తాయని నోటిఫికేషన్‌లో వివరించారు. ఈ ఏర్పాటువల్ల కృష్ణపట్నం నుంచి నౌకా ప్రయాణం పెరిగి ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశిస్తున్నారు. సరుకుల ఎగుమతి, దిగుమతుల విషయంలోనూ దక్షిణ ఆసియాలో కీలక పోర్టుగా నిలుస్తుందని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • Replies 153
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 2 weeks later...
విశాఖ పోర్టు లాభం రూ.250 కోట్లు
06-04-2018 23:49:44
 
636586553848946594.jpg
కార్గో రవాణాలో దేశంలోనే నాలుగో స్థానం.. రూ.700 కోట్లతో నైపుణ్య శిక్షణా కేంద్రం: చైర్మన్‌ కృష్ణ బాబు
 
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోర్టు ట్రస్టు (విపిటి) 2017-18 ఆర్థిక సంవత్సరంలో 250 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించిందని చైర్మన్‌ కృష్ణబాబు వెల్లడించారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.917 కోట్ల రాబడిపై రూ.45 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1,078 కోట్ల రూపాయల రాబడిపై రూ.250 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించినట్లు చెప్పారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో కార్గో రవాణా 4 శాతం వృద్ధి చెంది 6.354 కోట్ల టన్నులుగా నమోదైందని తెలిపారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 6.101 కోట్ల టన్నులుగా ఉంది. కార్గో రవాణాలో విశాఖ పోర్టు దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. అలాగే నీతి ఆయోగ్‌ దేశంలో పనితీరు ఆధారంగా పోర్టులకు ర్యాంకింగ్‌ ఇవ్వగా మొదటి మూడింటిలో ఒకటిగా విశాఖ పోర్టు నిలిచిందన్నారు. కాగా కాలుష్య నివారణకు దేశంలోనే తొలిసారిగా కవర్డ్‌ స్టాక్‌యార్డు నిర్మాణానికి విశాఖ పోర్టు చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. అన్ని పోర్టుల్లోను ఓపెన్‌ స్టాక్‌యార్డులే వున్నాయని, విశాఖలో తొలిసారిగా 2.5 లక్షల టన్నుల బొగ్గు నిల్వకు అవసరమైన స్టాక్‌ యార్డుకు 20 ఎకరాలను కేటాయించి, దానిని రూ.125 కోట్లతో చుట్టూ కవర్‌ చేయనున్నామని వివరించారు. ఈ కవర్డ్‌ స్టాక్‌ యార్డు ఈ ఏడాదే ప్రారంభిస్తామని చెప్పారు. కాగా సాగరమాల ప్రాజెక్టు కింద రూ.2,200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
 
 
మారిటైమ్‌ వర్సిటీలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌
పోర్టు సంబంధిత వ్యవహారాల్లో నైపుణ్యం గల సిబ్బంది తక్కువగా ఉండటంతో విశాఖపట్నంలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీలో రూ.700 కోట్ల తో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు పోర్టు చైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు. కోస్తా తీర ప్రాంతంలో యువతకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీనికి అవసరమైన నిధులను సీమెన్స్‌ సంస్థ 90 శాతం భరిస్తుందని, మిగిలిన 10 శాతం కేంద్ర షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ అందించనుందన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Krishnapatnam Port’s cargo handling up by 25 percent

Krishnapatnam Port Company Ltd (KPCL), which runs India’s largest all-weather and deep water port on the east coast, handled 45 million metric tonne (MMT) of cargo in 2017-18, achieving a 25 per cent growth over the previous fiscal’s 36.10 MMT, an official said.

KPCL Director and CEO Anil Yenduluri told reporters here on Friday that the growth in cargo handling was impressive considering the fact that average growth rate of cargo clocked by major Indian ports was 4.79 per cent.

There was a record 88 per cent rise in the number of containers Krishnapatnam port handled at 4,81,408 TEUs during last fiscal as against 2,55,439 TEUs in the previous fiscal. Coal, iron ore and granite dominated the cargo portfolio handled.

The number of vessels visiting the port rose by 22 per cent to 1,290 in 2017-18 as against 1,061 vessels registered during 2016-17.

The port, located in Nellore district of Andhra Pradesh, is now aspiring to achieve an impressive 52 MMT in bulk and 2 Lakh TEU in containers this fiscal.

According to Yenduluri, favorable government policies and handling of new cargo such as sand, steel products and agri-commodities added to the growth of shipments.

“We are entering the 10th year of operations and KPCL is now the second largest port in India and is poised to become eastern gate way of India,” he said.

The company is on the verge of completing its second phase of expansion which takes it capacity from current 80 million tonnes to over 100 million tonnes. The company had invested Rs 8,000 crore in the first and second phases so far.

“After the completion of the second phase, we will finalise plans for the third phase including fund raising needs,” Yenduluri said.

The port has planned a total investment of $3 billion of which $1.23 billion has already been invested for development till date with second phase of expansion underway.

KPCT recently set up a dedicated coastal cargo berth to handle the growing coastal cargo traffic and reducing the time loss.

Link to comment
Share on other sites

  • 1 month later...
సెంట్రల్‌ ఇండియాకు గేట్‌వేగా కృష్ణపట్నం పోర్టు
30-05-2018 00:07:46
 
636632373037006099.jpg
  • కృష్ణపట్నం పోర్టు-నాగ్‌పూర్‌ కంటైనర్‌ రైల్‌ సర్వీస్‌ ప్రారంభం
 
ముత్తుకూరు: సెంట్రల్‌ ఇండియా రాష్ట్రాల వ్యాపారాభివృద్ధి గేట్‌వేగా కృష్ణపట్నం పోర్టు రూపుదిద్దుకోనున్నదని పోర్టు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అనిల్‌ కుమార్‌ యెండ్లూరి పేర్కొన్నారు. మంగళవారం నాడిక్కడ కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ (కెపిసిటి)లో కృష్ణపట్నం పోర్టు నుంచి నాగపూర్‌ ఐసిడి (ఇన్‌లాండ్‌ కంటైనర్‌ డిపో)కి ప్రత్యేక కంటైనర్‌ రైలును ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ కార్గో హబ్‌గా పేరుగాంచిన నాగపూర్‌కు రైల్వే ద్వారా మధ్య భారత రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, చత్తీ్‌సగఢ్‌లతో పాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి వ్యాపార విస్తృతికి మార్గం సుగమం అవుతుందన్నారు. ఎగుమతి, దిగుమతిదారులకు సమయంతో పాటు ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌) ఆధ్వర్యంలో ప్రతివారం నాగపూర్‌ ఐసిడికి కంటైనర్‌ రైలు రాకపోకలు సాగిస్తుందని అనిల్‌ చెప్పారు. సెంట్రల్‌ ఇండియాతో కృష్ణపట్నం పోర్టును అనుసంధానించే ఈ కీలక సర్వీసు నిర్వహణకు అవసరమైన కంటైనర్లను అంతర్జాతీయ సంస్థ మాస్క్‌లైన్‌ అందించనుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చైనా నుంచి నాగపూర్‌కు సరుకుల రవాణాకు 22 నుంచి 25 రోజులు పడుతుండగా, కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ ద్వారా 15 నుంచి 18 రోజుల్లో చేరుకుంటుందన్నారు. అలాగే యాంగాన్‌ నుంచి నాగపూర్‌కు 12 నుంచి 15 రోజులకు పడుతుండగా కెపిసిటి ద్వారా కేవలం 7-10 రోజుల్లో సరుకు చేరుతుందన్నారు. నాగ్‌పూర్‌ నుంచి కృష్ణపట్నం పోర్టు టెర్మినల్‌కు 55 గంటల్లో కంటైనర్‌ రైలు చేరుతుందని తెలిపారు.
 
కార్గో హ్యాండ్లింగ్‌లో 88 శాతం వృద్ధి..
2017-18లో కృష్ణపట్నం పోర్టు.. కంటైనర్‌ హ్యాండ్లింగ్‌లో 88 శాతం, మొత్తం కార్గో హ్యాండ్లింగ్‌లో 25 శాతం వృద్ధిని సాధించి రికార్డు సృష్టించిందని అనిల్‌ వెల్లడించారు. కొరియా, జపాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, తూర్పు,పశ్చిమ ఆఫ్రికా దేశాలకు ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు కృష్ణపట్నం పోర్టు హబ్‌గా మారనుందని కెపిసిటి డైరెక్టర్‌ వినీత వెంకటేశ్‌ అన్నారు. నాగపూర్‌ కేంద్రంగా కంటైనర్‌ రైల్‌ ద్వారా పత్తి, ఫెర్రో అల్లాయ్‌, బియ్యం, స్టీల్‌, ట్రాన్స్‌మిషన్‌ టవర్ల ఎగుమతులు, ఫర్నీచర్‌, కాల్షియం కార్బొనేట్‌, న్యూస్‌ ప్రింట్‌, టింబర్‌, స్ర్కాప్‌, వేస్ట్‌ పేపర్‌ ఉత్పత్తులు ఎగుమతి చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కెపిసిటి సిఒఒ జితేంద్ర, వేణుగోపాల్‌, కాంకర్‌, మాస్క్‌లైన్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కృష్ణపట్నం పోర్టులో కంటైనర్‌ స్కానర్‌
10-06-2018 00:17:15
 
636641866446829601.jpg
ముత్తుకూరు : కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌లో స్కానర్‌, రేడియేషన్‌ పోర్టల్‌ మానిటర్లను కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (సిబిఐసి) సభ్యుడు జాన్‌ జోసఫ్‌ శనివారం ప్రారంభించారు. పోర్టు అభివృద్ధిలో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని జోసఫ్‌ అన్నారు. అత్యాధునిక యంత్ర పరిజ్ఞాన వినియోగంతో ఎగుమతి, దిగుమతిదారులకు పోర్టు యాజమాన్యం సమయాన్ని, ఖర్చును ఆదా చేస్తోందన్నారు. ఆధునిక కంటైనర్‌ స్కానర్‌ ఏర్పాటు వల్ల కస్టమ్స్‌ శాఖ నిబంధనల మేరకు కంటైనర్ల డైరెక్ట్‌ పోర్టు డెలివరీకి అవకాశం కలుగుతుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వంతం చేసుకోవడంలో కృష్ణపట్నం పోర్టు ముందుంటుందని పోర్టు సిఇఒ అనిల్‌ ఎండ్లూరి పేర్కొన్నారు. ఈ స్కానర్‌, రేడియేషన్‌ పోర్టల్‌ ఏర్పాటుతో గంటకు వంద కంటైనర్లను తనిఖీ చేయవచ్చన్నారు
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 3 weeks later...
  • 2 months later...
  • 4 weeks later...
  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...