Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply
గన్నవరం విమానాశ్రయానికి పర్యాటక శోభ

 

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఉన్న గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి నిత్యం వందలాది మంది ప్రయాణికులు, సందర్శకుల రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవలే రూ.కోట్లు ఖర్చుచేసి నూతన టెర్మినల్‌ భవనాన్ని అత్యాధునిక హంగులు, సరికొత్త శోభతో రూపొందించారు. విజయవాడ విమానాశ్రయం నామకరణ ప్రాంతాన్ని పచ్చని పచ్చికతో పెంచారు. రంగు రంగుల విద్యుత్తు దీపాలంకరణతో నీటి ఫౌంటేన్‌ ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 100 అడుగుల రేడియం జాతీయ జెండా కూడా ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఇది రాత్రి వేళల్లో వెలుగులు విరజిమ్ముతోంది. ఇటీవల ఆవిష్కరించిన 18 అడుగుల అంబారీ ఏనుగు బొమ్మ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రత్యేకతలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, యువతీ యువకులు విమానాశ్రయానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. సరదాగా గడుపుతూ సేదతీరుతున్నారు. అందాలను కళ్లతో చూడటమే కాకుండా.. ఆయా ప్రాంతాల వద్ద తమ ఫోన్లతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కృష్ణా, గుంటూరుతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి సందర్శకుల తాకిడి బాగా పెరుగుతూ వస్తోంది.

 

 
Link to comment
Share on other sites

సీఆర్డీయే తీరుతో రైతుల ఆందోళన
20-05-2018 07:47:57
 
636623992787567486.jpg
  • సమీకరణ రద్దుతో.. సందిగ్ధం
  • ఏలూరు డైవర్షన్‌ కెనాల్‌ భూ సమీకరణకు భూములిచ్చిన రైతుల ఆందోళన
  • రెండేళ్లుగా కౌలు ఆదాయం కూడా లేని దయనీయ పరిస్థితి
  • ఇన్నర్‌, అవుటర్‌కు కూడా ఇలాగే చేస్తారా ?
  • ప్రభుత్వం, సీఆర్డీయే తీరుపైనా రైతుల ఆగ్రహం
  • రైతులు నష్టపోకుండా తక్షణం చర్యలు చేపట్టాలి
విజయవాడ: ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టు ఉంది సీఆర్డీయే అధికారుల తీరు. రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వం తలపెట్టిన భూసమీకరణ ప్రపంచ ప్రశంసలు అందుకుంది. రైతులు ప్రభుత్వం మీద ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నమ్మకంతో ముందుగా రూపాయి ఇవ్వకపోయినా కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ భూములు ఇచ్చిన రైతులకు ప్రతిగా అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను ఇస్తామని ప్రభుత్వం రైతులకు వాగ్ధానం చేసింది. దీని ప్రకారం రాజధాని పరిధిలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలలోని 29 గ్రామాల నుంచి 33 వేల ఎకరాల భూమిని సమీకరించింది.
 
అక్కడ భూ సమీకరణ విజయవంతం అవడంతో అదే స్పూర్తితో గన్నవరం విమానాశ్రయ విస్తరణకు అడ్డంకిగా ఉన్న 11 గ్రామాల పరిధిలో 1,228 ఎకరాలను భూసమీకరణ పద్ధతిలో తీసుకోవటానికి రెండేళ్ల క్రితం సీఆర్డీయే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగానే రన్‌వే విస్తరణకు అడ్డుగా ఉన్న ఏలూరు కాల్వ ను కూడా మళ్లిం చాలని నిర్ణయించింది. జక్కుల నెక్కలం, కేసరపల్లి, పురుషోత్త పట్నం, వీఎన్‌పురం, గన్నవరం, పెద ఆవుటపల్లి, ఆత్కూరు గ్రామాల్లో ఈ భూములు ఉన్నాయి. విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు కూడా రాజధాని ప్రాంతంలో అక్కడ రైతులకు ఇచ్చిన విధంగానే మంచి గ్రామాలలో ప్లాట్లు ఇస్తామని ప్రకటించారు. వాస్తవానికి తుళ్లూరు మండల భూముల కంటే గన్నవరం పరిసర గ్రామాల భూములు అత్యంత ఖరీదైనవి.
 
అయినప్పటికీ చంద్రబాబుపై నమ్మకంతో విమానాశ్రయానికి పనుల కోసం రైతులు భూములు ఇచ్చారు. ఏలూరు కాల్వ కింద ఉన్న కొన్ని గ్రామాల రైతుల నుంచి ఇందుకు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ గ్రామాల్లోని కొంతమంది రైతులు భూసమీకరణ కింద భూములు ఇచ్చి సీఆర్డీయేకు ఫారం 3లు ఇచ్చారు. ఆ తరువాత ఫారం 6, 7, 14 ద్వారా తుది ఒప్పందాలు కూడా జరిగాయి. కాల్వ కింద ఉన్న భూములలో కొందరు రైతులు అయిష్టంగా ఉన్నారన్న మిషతో సీఆర్డీయే, రెవెన్యూ అధికారులు ఆ భూమి మొత్తాన్ని సమీకరించలేదు. దీంతో భూమి ఇచ్చిన వారిలో ఆందోళన పెరిగి సీఆర్డీయే చుట్టూ తిరిగారు. భూమి ఇవ్వడానికి రైతులను ప్రోత్సహించటం కోసం రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా మినహాయింపు నిచ్చింది.
 
కొంతమంది రైతులు తమ భూములను ఇవ్వగా, మరికొందరు నగదు కావలసిన వారు అమ్ముకున్నారు. రెండేళ్లుగా ఈ భూములపై కౌలు ఆదాయం కూడా లేకుండా ఉన్న రైతులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. కాల్వ కింద ఉన్న భూములను అన్నిటిని భూసమీకరణ నుంచి తొలగిస్తూ డీనోటిఫికేషన్‌ జారీ చేసింది. భూమి ఇవ్వని రైతులు ఈ నిర్ణయంతో ఆనందపడ్డారు. ఇచ్చిన రైతులు హతాసులయ్యారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం పనిష్మెంట్‌ ఇచ్చినట్టు ఉందని వారు ఆవేదనతో ఉన్నారు.
 
 
ఇన్నర్‌, అవుటర్‌కు ఇలాగే చేస్తారా..?
రాజధానిలో భూ సమీకరణలో ఇచ్చిన రైతులలో అపనమ్మకం కలగకుండా ఉండేందుకు రైతులు ఇవ్వని భూమిని భూసేకరణ చట్టం ద్వారా తీసుకునే ప్రయత్నంలో ఉంది. గన్నవరం భూముల విషయానికొచ్చేసరికి ప్రభుత్వం ఇందుకు విరుద్ధ నిర్ణయం తీసుకుంది. కాల్వకింద భూములను డినోటిఫై చేయడం వరకు బాగానే ఉన్న భూములను ఇచ్చిన వారిని అయోమయంలో పడేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ అధికారులను రైతులు ప్రశ్నిస్తుంటే తమ చేతులలో ఏమి లేదని జవాబు ఇస్తున్నారు. భవిష్యత్తులో రాజధాని చుట్టూ ఇన్నర్‌ రింగ్‌, అవుటర్‌ రింగ్‌ రోడ్ల కోసం భూసమీకరణ చేయడానికి సిఆర్‌డిఎ ప్రణాళికలు తయారు చేస్తోంది. గన్నవరం ఉదంతం ప్రభావం ఆ రోడ్ల భూసమీకరణపై పడుతుందని రైతులు అంటున్నారు. భూములు ఇచ్చి దెబ్బతినే కంటే ఇవ్వకుండా ఉండటమే మేలు అనే విధంగా సీఆర్డీయే వ్యవహరించిందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాశ్రయ విస్తరణ కోసం భూములు ఇచ్చి దెబ్బతిన్న రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Link to comment
Share on other sites

దుబాయ్ అంతర్జాతీయ సర్వీసుకు రాంరాం..!
21-05-2018 09:26:18
 
636624915795847101.jpg
  • ఎయిర్‌ ఇండియా తీరుపై విమర్శల వెల్లువ
  • దుబాయ్‌కి అంతర్జాతీయ సర్వీసుపై ముందు హడావిడి.. ఆనక ఒట్టి చెయ్యా!
  • ప్రభుత్వ లేఖలకూ స్పందించరా!
  • కదిలిన అధికారులు.. రేపు ఉపరాష్ట్రపతి దృష్టికి..
అంతర్జాతీయ సర్వీసు నడపటానికి హామీ ఇచ్చి.. అన్నీ రెడీ అయ్యాక ఇప్పుడు ఎయిర్‌ఇండియా విముఖత చూపటం ఎయిర్‌పోర్టు అధికారులతో పాటు, కృష్ణాజిల్లా యంత్రాంగాన్ని సైతం నివ్వెరపరుస్తోంది! ఆఖరి నిమిషంలో ఎయిర్‌ఇండియా హ్యాండ్‌ ఇవ్వటంతో తర్జన భర్జనలు పడుతున్నారు.
 
 
విజయవాడ: దుబాయ్‌కు అంతర్జాతీయ సర్వీసు నడిపే విషయంలో ఎయిర్‌ ఇండియా ముందు హడావిడి చేసి, ఇప్పుడు వెనకడుగు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్‌ ఇండియా తీరుపై ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ మధుసూదనరావు కృష్ణాజిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సర్వీసు విషయంలో తలెత్తిన సమస్యను ఆయన దృష్టికి తీసుకు వెళ్ళాలని ఉభయులు నిర్ణయించినట్టు తెలిసింది. విజయవాడ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారు.
 
 ఆయన ఉప రాష్ట్రపతి అయిన తర్వాత విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధి బాధ్యతలను కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు తీసుకున్నారు. రాష్ర్టానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చకపోవటాన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రుల ఇటీవల తమ పదవులకు రాజీనామా చేశారు. అశోక్‌ గజపతిరాజు రాజీనామాతో కేంద్రంలో మన తరఫున కృషిచేసే పెద్దదిక్కు లేకుండా పోయారు. ఇదే సందర్భంలో అంతర్జాతీయ సర్వీసులు నడవటానికి వేగంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల కేంద్ర పౌరవిమానయాన శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వం లేఖ రాసిన తర్వాత కూడా స్పందన లేకపోగా.. ఎయిర్‌ ఇండియా చావు కబురు చల్లగా చెప్పింది!
 
ఎయిర్‌ ఇండియా తీరుపై విమర్శలు
అంతర్జాతీయ సర్వీసు నడిపే విషయంలో ఎయిర్‌ ఇండియా అనుసరించిన తీరు తీవ్ర విమర్శల పాలౌతోంది. విజయవాడ నుంచి దుబాయికి సర్వీసును నడపలేమనడానికి చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. భద్రతాపరమైన కారణాల వల్ల హాపింగ్‌ ఫ్టైట్స్‌ విదేశాలు వెళ్లడానికి కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ అనుమతించటం లేదన్నది ఒక అంశంగా చెబుతోంది.
 
ముంబై రూట్‌లో నడిపే విమాన సర్వీసునే విజయవాడ నుంచి దుబాయికి అక్కడి నుంచి షార్జాకు తిరిగి విజయవాడ, ముంబైలకు నడుపు తుంది. ఇది కూడా హాపింగ్‌ ఫ్లెట్‌ కాబట్టి.. అనుమతి కష్టమన్న ఒక వాదన తీసుకువస్తోంది. మరోవైపు ఇండియా, అరబ్‌ ఎమిరేట్స్‌ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా సీట్ల సర్దుబాటు విదేశీ సంస్థలకు అనుకూలంగా ఉండటం వల్ల దుబాయికి సర్వీసును నడపలేమని ఎయిర్‌ ఇండియా చెప్పడం విమర్శలకు తావిస్తోంది.
 
 
ఇప్పటికే అనుమానాలు..
విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చి చాలా కాలమైనా ఇప్పటికీ అంతర్జాతీయ సర్వీసు నడవకపోవటంపై అనేక అనుమానాలు ఉన్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించటానికి వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ విమానాల రాకపోకలకు సంబంధించి అవసరమైన రన్‌వే పనులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ సర్వీసులుగా భారీ విమానాలే కాకుండా మధ్య శ్రేణి విమానాలను ప్రస్తుత రన్‌వే నుంచి నడవటానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇటీవల ఎయిర్‌ ఇండియా సంస్థ ఎయిర్‌బస్‌ను ఇదే రన్‌వేపై ల్యాండ్‌ చేసింది. అంతర్జాతీయ టెర్మినల్‌ రెడీ అయింది. ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ల కోసం విభాగాలు సిద్ధమయ్యాయి. ఇమిగ్రేషన్‌ సిబ్బంది శిక్షణ కూడా పూర్తయి విధులు నిర్వహించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో విదేశీ విమానాలు నడవటానికి ఎదురౌతున్న సమస్యలను తక్షణం పరిష్కరించాల్సి ఉంది.
Link to comment
Share on other sites

9 లక్షల మైలురాయి
నెలకు 75వేల మంది విమాన ప్రయాణికులు
గత ఏడాది కంటే 1.5లక్షల పైగా వృద్ధి
గత నాలుగేళ్లలోనే ఏడు లక్షల పెరుగుదల
ఈనాడు, అమరావతి
amr-top1a.jpg
గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ ఏటేటా అమాంతం పెరుగుతూ వెళ్తోంది. గత ఏడాది 7.5లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది 9లక్షల పైనే ఉండబోతోంది. అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమైతే మాత్రం ఈ సంఖ్య 10 లక్షలు దాటుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అత్యధిక ప్రయాణికుల వృద్ధితో గత ఐదేళ్లుగా దేశంలోనే మొదటి స్థానంలో గన్నవరం నిలుస్తోంది. ఈసారి కూడా గత ఏడాదితో పోలిస్తే.. 1.5లక్షల మంది పెరగనున్నారు. దేశంలోని మరే విమానాశ్రయంలోనూ ఈ స్థాయిలో ప్రయాణికుల వృద్ధి లేదు. అంతకుముందు ఏడాది సైతం ప్రయాణికుల సంఖ్య 1.5లక్షలు పెరిగింది. ఈ ఏడాది అదే కొనసాగుతోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం రోజుకు 2500 మంది రాకపోకలు సాగిస్తున్నారు. నెలకు 75 వేలకు పైగా ఉంటున్నారు. ఎనిమిది నగరాలకు 52 సర్వీసులు నిత్యం నడుస్తున్నాయి. విమానాశ్రయం నుంచి ప్రతి పావుగంటకో సర్వీసు రావడం, పోవడం జరుగుతున్నాయి. దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు, చెన్నై, విశాఖ, కడప, తిరుపతి నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రతి నగరానికి వెళ్లే సర్వీసుకూ భారీ డిమాండ్‌ ఉంటోంది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు  నడిచే సర్వీసులకు ఆక్యుపెన్సీ 80శాతం పైగా ఉంటోంది. దీంతో విమానయాన సంస్థలు సైతం కొత్తగా సర్వీసులను పెంచుకుంటూ వెళుతున్నాయి. 2016-17లో 7596 విమాన సర్వీసులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించగా.. ప్రస్తుత ఏడాదికి 18,720కు చేరాయి. ఏడాదిలోనే రెట్టింపవ్వడం గమనార్హం.

గత నాలుగేళ్లలోనే అనూహ్యంగా..
2010-11లో గన్నవరం విమానాశ్రయం నుంచి ఏడాదిలో 77,131 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అప్పట్లో రోజుకు కేవలం ఏడు సర్వీసులు నడుస్తుండేవి. అవికూడా హైదరాబాద్‌కే ఎక్కువ ఉండగా.. విశాఖకు ఒకటీ అరా నడిచేవి. రోజుకు 200 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించేవారు. కేవలం ఏడేళ్ల వ్యవధిలో ప్రయాణికుల సంఖ్య అమాతం ఆకాశంలోనికి పెరిగింది. అప్పట్లో ఏడాదిలో తిరిగిన ప్రయాణికులు ఇప్పుడు నెలలో ఉంటున్నారు. అదికూడా గత నాలుగేళ్లలోనే ఏడు లక్షల మంది వరకూ ప్రయాణికులు పెరిగారు. 2014 ఏప్రిల్‌ నుంచి 2015 మార్చి వరకూ 2.33లక్షల మంది ప్రయాణించారు. 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాలనను విజయవాడ నుంచి ఆరంభించడంతో అమాంతం ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. 2015-16లో 3.96లక్షల మందికి పెరిగారు. అంతకుముందు ఏడాది కంటే 1.63లక్షల మంది ఎక్కువయ్యారు. ఇంక అప్పటినుంచి ఏటేటా.. అదేస్థాయిలో పెరుగుతూ వస్తున్నారు. 2018-19లో ఈ సంఖ్య 9లక్షలు దాటుతుందని రద్దీని బట్టి అధికారులు పేర్కొంటున్నారు.

కాలం కలిసి రావడంతో..
ప్రస్తుతం సమయానికి విలువ పెరగడంతో బస్సు, రైలు కంటే తొలి ప్రాధాన్యం విమాన సర్వీసులకే ఇస్తున్నారు. సాధారణ మధ్యతరగతి వాళ్లు సైతం దిల్లీ, ముంబయి, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లాలంటే.. విమాన సర్వీసులకే మొగ్గు చూపుతున్నారు. ముంబయికి వెళ్లాలంటే రైలు, బస్సుల్లో 20గంటలకు పైగా సమయం పడుతుంది. అదే విమానంలో కేవలం 1.45గంటల్లో చేరుకోవచ్చు. దీనికితోడు రాష్ట్ర పరిపాలన అంతా ఇక్కడి నుంచే సాగుతుండడంతో.. వచ్చిపోయే వారి సంఖ్య పెరిగింది. గతంలో హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి విమాన సర్వీసులను అందుకునే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం గన్నవరం వైపు వీరంతా వస్తున్నారు. ఇక్కడి నుంచే నేరుగా.. ముంబయి, దిల్లీ, బెంగళూరు చేరుకుని.. అక్కడి నుంచి విదేశీ సర్వీసులను అందుకుంటున్నారు. అందుకే.. ఏ నగరానికి సర్వీసు ప్రారంభించినా కేవలం నెలల వ్యవధిలోనే విపరీతమైన రద్దీ ఉంటోంది. దేశీయ విమానాశ్రయాలన్నింటిలోనూ అత్యధిక వృద్ధి రేటు నమోదవ్వడంతో ఇక్కడి నుంచి సర్వీసులను నడిపేందుకు విమానయాన సంస్థలు మొగ్గుచూపుతున్నాయి.

ఆ నగరాలకూ సర్వీసులొస్తే..
దేశంలోని అనేక ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించేవారి సంఖ్య ఇక్కడి నుంచి నిత్యం వేల సంఖ్యలో ఉంటోంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి ఏటా లక్షల సంఖ్యలో దేశంలోని అన్ని ప్రముఖ ప్రాంతాలకూ వ్యాపార, వాణిజ్య పనులపైనా, చదువులు, విహార యాత్రలకు వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం ఎనిమిది నగరాలకే సర్వీసులు నడుస్తున్నాయి. అదికూడా.. తిరుపతి, కడప, విశాఖను వదిలేస్తే.. హైదరాబాద్‌తో సహా మరో ఐదు నగరాలకే సర్వీసులున్నాయి. కేరళ, అహ్మదాబాద్‌, జైపూర్‌, కోల్‌కతా, భువనేశ్వర్‌, గోవా, పూణె, ఔరంగాబాద్‌ లాంటి అనేక నగరాలకూ ఇక్కడి నుంచి విపరీతమైన రద్దీ ఉంటుంది. వాటికీ సర్వీసులను ఏర్పాటు చేస్తే.. ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం ఉన్న దాని కంటే రెట్టింపు అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

గత తొమ్మిదేళ్లలో ప్రయాణికుల రాకపోకలు
2010-11: 77వేలు
2011-12: 1.57లక్షలు
2012-13: 1.69లక్షలు
2013-14: 1.95లక్షలు
2014-15: 2.33లక్షలు
2015-16: 3.96లక్షలు
2016-17: 6లక్షలు
2017-18: 7.5లక్షలు
2018-19: 9లక్షలు

 
 

 

Link to comment
Share on other sites

వెంకయ్య’ కోర్టులో ఎయిర్‌ ఇండియా పంచాయితీ
23-05-2018 07:35:24
 
636626577264268669.jpg
  • అంతర్జాతీయ సర్వీసు విముఖతపై వెంకయ్య దృష్టికి..
  • సెక్రటరీని పిలిచి సివిల్‌ ఏవియేషన్‌కు లెటర్‌ రాయమని సూచన
  • వ్యక్తిగతంగా సంబంధిత శాఖలతో మాట్లాడేందుకు వెంకయ్య హామీ
  • బందరు పోర్టు, ఎకనమిక్‌ సిటీల వివరాలు అడిగి తెలుసుకున్న వెంకయ్య
 
విజయవాడ: బెజవాడ నుంచి దుబాయికి అంతర్జాతీయ సర్వీసు నడిపే విషయంలో ఎయిర్‌ ఇండియా సంస్థ విముఖత చూపిన వ్యవహారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోర్టుకు చేరింది. కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాలయ్యనాయుడు లక్ష్మీకాంతం, విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావులు ఈ విషయాన్ని వెంకయ్యనాయుడికి నివేదించారు. విజయవాడ ఎయిర్‌పోర్టుకు వెంకయ్య నాయుడు వచ్చిన సందర్భంలో ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో ఆయన దృష్టికి ఈ విషయాలను తీసుకు వచ్చారు. ముంబాయికి విమాన సర్వీసును నడుపుతున్న ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ అంతర్జాతీయ టెర్మినల్‌ ఏర్పాటు, ఇమిగ్రేషన్‌ ఏర్పాటు తర్వాత ముంబాయి నుంచి విజయవవాడ మీదుగా దుబాయ్‌, ఆ తర్వాత షార్జా తిరిగి విజయవాడ, ముంబాయి వెళ్ళేలా అంతర్జాతీయ సర్వీసును నడపటానికి హామీ ఇచ్చిందని తెలిపారు.
 
అంతర్జాతీయ టెర్మినల్‌ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయని, ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాల కార్యాలయాలను కూడా సిద్ధం చేయటం జరిగిందని చెప్పారు. ఇమిగ్రేషన్‌ విభాగంలో కంప్యూటర్ల బిగింపు కూడా జరుగుతోందని తెలిపారు. ఇమిగ్రేషన్‌కు సిబ్బందిని కేటాయించి వారికి శిక్షణ ఇవ్వటం కూడా పూర్తయిందని, ప్రస్తుతం వారు ఖాళీగా ఉండాల్సి వస్తోందని చెప్పారు. చివరి నిమషంలో అంతర్జాతీయ సర్వీసుకు ఎయిర్‌ ఇండియా విముఖత చూపటం నిరాశకు గురి చేస్తోందని చెప్పారు. ఇండియా , అరబ్‌ ఎమిరేట్స్‌ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఆయా దేశాల విమాన సంస్థలకు జరిపిన సీట్ల సర్దుబాటు వల్ల తమకు ప్రయోజనం లేదన్న భావనలో ఎయిర్‌ ఇండియా ఉందని, భద్రతా కారణాల రీత్యా హాపింగ్‌ ఫ్లైట్స్‌కు విదేశీ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇవ్వటం లేదన్న కారణాలను ఎయిర్‌ ఇండియా కమర్షియల్‌ ప్రతినిథులు చెబుతున్నారని వెంకయ్య దృష్టికి తీసుకు వచ్చారు.
 
విజయవాడ చుట్టుపక్కల నుంచి విదేశాలకు లక్షమంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్న విషయాన్ని వివరించారు. విజయవాడ ఎయిర్‌పోర్టులో 26 విమానాలు 52 షెడ్యూల్స్‌గా నడుస్తున్నాయని చెప్పారు. దీనిపై వెంకయ్యనాయుడు వెంటనే స్పందించారు తన సెక్రటరినీ పిలిచారు. తక్షణం సివిల్‌ ఏవియేషన్‌కు, సంబంధిత శాఖలకు ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి లెటర్‌ రూపొందించి పంపాలని ఆదేశించారు. తాను వ్యక్తిగతంగా కూడా ఈ విషయంపై సంబంధిత శాఖలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. జిల్లాలో, విజయవాడలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ప్రధానంగా మచిలీపట్నం పోర్టు గురించి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. మరో రెండు నెలల్లో పోర్టు పనులకు సంబంధించి ముందుకు వెళుతున్న విషయాన్ని వెంకయ్యనాయుడికి కలెక్టర్‌ వివరించారు. దీంతో పాటు జక్కంపూడిలో ఎకనమిక్‌ సిటీ ఏర్పాటుకు సంబంధించి కూడా వెంకయ్యనాయుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Link to comment
Share on other sites

ఎయిర్‌ ఇండియా షాక్‌.. శుభవార్త చెప్పిన దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌
02-06-2018 08:41:38
 
636635257060596529.jpg
ఎయిర్‌ ఇండియా ఇచ్చిన దిమ్మతిరిగే షాక్‌తో విజయవాడ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసుల ఆశలు అడియాశలు అయిన వేళ... ‘ఫ్లై దుబాయ్‌’ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఆశలు చిగురింప చేస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడపటానికి వీలుగా స్లాట్‌ కోరుతూ సివిల్‌ ఏవియేషన్‌ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. అరబ్‌ ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌కు అనుబంధంగా ఉన్న ఫ్లై దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ కోస్తా ప్రజలకు తీపి కబురు అందించింది. ఎయిర్‌ ఇండియా ఇచ్చిన షాక్‌తో స్తబ్దుగా ఉన్న పారిశ్రామికవేత్తలలో కూడా తాజా కబురుతో జోష్‌ వచ్చింది.
 
 
విజయవాడ: అంతర్జాతీయ హోదా వచ్చి అర్థ సంవత్సరం గడుస్తున్నా అంతర్జాతీయ విమానాలు నడవకపోవటంతో ప్రాభవం మసకబారుతున్న తరుణంలో ఫ్లై దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ ఆశలు చిగురింప చేస్తోంది. ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక్ష అంశాలకు సంబంధించి సమావేశం జరగనుంది. ఈ క్రమంలో విజయవాడ నుంచి దుబాయ్‌కు స్లాట్‌ కోరిన ఫ్లై దుబాయ్‌ సంస్థ దరఖాస్తును కూడా పరిశీలించటం జరుగుతుంది. దుబాయ్‌ ప్రభుత్వంతో జరిగే ద్వైపాక్షిక ఒప్పందాలు చాలా ఉన్నాయి. అక్కడి విమానయాన సంస్థలు సీట్ల సర్దుబాటు కోసం కేంద్రంతో ఇప్పటికే సంప్రదింపులు చేయటం జరుగుతోంది. వీటన్నింటినీ పరిశీలించిన మీదట విజయ వాడ నుంచి కనీసం 100 నుంచి 150 లోపు సీట్లకు కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేయగలిగితే ప్రత్యేక విమాన సర్వీసును నడపటానికి అవకాశం కలుగుతుంది. విజయవాడ నుంచి దుబాయ్‌కు నేరుగా ఫ్లై దుబాయ్‌ సంస్థ ప్రత్యేక విమానం నడపటానికి అవకాశం కలుగుతుంది. మరో రెండు వారాలలో జరిగే కేంద్ర సమావేశంపై ఎయిర్‌పోర్టు వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి.
 
 
            వాస్తవానికి ఈ నెలలో దుబాయ్‌, షార్జాలకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ తన తొలి అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించాల్సి ఉండగా.. విదేశీ సర్వీసును నడిపే విషయంలో ఆ సంస్థ తప్పుకుంది. హాపింగ్‌ ఫ్లైట్స్‌కు సెక్యూరిటీ పరంగా అనుమతులు ఇవ్వకపోవటం, ద్వైపాక్షిక్ష ఒప్పందాలలో భాగంగా దుబాయ్‌ కు సీట్ల సర్దుబాటుకు సంబంధించి కేంద్రస్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల వల్ల స్లాట్‌ దక్కదన్న ఉద్దేశ్యంతోనూ, ప్రైవేటీకరణ బాటలో ఉన్న ఎయిర్‌ ఇండియా సంస్థ నూతన ప్రయోగాల పట్ల ఆనాసక్తి చూపటం వంటి కారణాల రీత్యా బెజవాడ నుంచి అంతర్జాతీయ ఫ్లైట్‌ను నడిపే అవకాశం తప్పింది. ఈ క్రమంలో కిందటి నెల చివర్లో 24, 25 తేదీల్లో చెన్నైలో జరిగిన సదరన్‌ రీజియన్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ వల్ల అనుకోకుండా ఫ్లై దుబాయ్‌ నుంచి ఆసక్తి వ్యక్తమైంది. ఏపీ, తెలంగాణా, తమిళనాడు, పాండిచ్చేరి, లక్షద్వీప్‌ తదితర ఏడు రాష్ర్టాల నుంచి మొత్తం 22 విమానాశ్రయాల నుంచి అధికారులు, ఆయా విమానయాన సంస్థలు, రీజనల్‌ హెడ్‌ ఆఫ్‌ ఎయిర్‌పోర్టు తదితరులు పాల్గొన్నారు.
 
 
            ఈ సమావేశానికి విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మదుసూదనరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి ఉన్న అవకాశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చేశారు. దేశీయంగా ఇండిగో, ఎయిర్‌ ఆసియా, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఫ్లైదుబాయ్‌, ఎయిర్‌ ఇండియా వంటి అనేక ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రతినిథులు పాల్గొన్నారు. విదేశీ అవకాశాలకు సంబంధించి ఏపీడీ ప్రజంటేషన్‌ను అన్ని విమానయాన సంస్థలు ఆసక్తిగా విన్నప్పటికీ, ఫ్లై దుబాయ్‌ సంస్థ తక్షణం స్పందించింది.
 
            స్లాట్‌ కోరుతూ సివిల్‌ ఏవియేషన్‌కు దరఖాస్తు చేయటం కూడా వెంటనే జరిగిపోయింది. ఎయిర్‌పోర్టు అధికారులు ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసును నడపటానికి ఎయిర్‌ ఇండియా సారీ చెప్పిన విషయాన్ని గమనంలోకి తీసుకుని భారత ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. ఆయన తన సెక్రటరీ ద్వారా సెంట్రల్‌ క్యాబినెట్‌కు నోట్‌ పంపించారు. ఈ నోట్‌ ప్రకారం కేంద్ర మంత్రివర్గం చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎయిర్‌ ఇండియా సంస్థ సన్నద్ధతగా లేనపుడు కేంద్ర నిర్ణయం ఎంత వరకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో ఫ్లై దుబాయ్‌ సంస్థ ముందుకు రావటంతో ఆశలు చిగురిస్తున్నాయి.
Link to comment
Share on other sites

April AAI numbers at 97,578. Considering that its only 30 days in April, its a good increment over March.

VGA got additional 8k seats in April and pax numbers increased by 6k after discounting for the 1 extra day in March.

With the additional capacity introductions in May, VGA may see numbers around 105k-110k pax for May.

VGA crossed Vadodara, Bhopal, and Imphal in the last few months and is closing in on Dehradun and Udaipur.

Link to comment
Share on other sites

భారీ ప్రణాళిక.. వింటర్‌ షెడ్యూల్స్‌కు ఇండి‘గో’!
03-06-2018 08:22:45
 
636636109727323347.jpg
 
  • మలిదశ ఆపరేషన్స్‌కు ప్రణాళికలు పూర్తి
  • ఎయిర్‌బస్‌ నడిపేందుకు ఆసక్తి
  • సింగపూర్‌కు సర్వీస్‌పై ఏపీఏడీసీఎల్‌ సర్వే
 
విజయవాడ: వింటర్‌ షెడ్యూల్స్‌కు ‘ఇండిగో’ సన్నద్ధమౌతోంది. విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి దేశీయంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులకు సర్వీసులను నడుపుతున్న ఇండిగో మలిదశ ఆపరేషన్స్‌కు శ్రీకారం చుడుతోంది. దశలవారీగా దేశ వ్యాప్తంగా సర్వీసులను ప్రారంభిస్తామని విజయవాడలో ఇటీవల సంస్థ కమర్షియల్‌ విభాగ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోనే దిగ్గజ సంస్థగా భాసిల్లుతున్న ఇండిగో భారీ ప్రణాళికలతోనే ముందుకు వస్తుందనడంలో సందేహం లేదు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లో దేశీయంగా పదిలక్షల ప్రయాణీకుల సామర్ధ్యం కలిగిన విజయవాడ ఎయిర్‌పోర్టుపై ఇండిగో దృష్టి సారించింది. సుదీర్ఘకాలం అనేక అధ్యయనాల అనంతరం విజయవాడ నుంచి దేశంలోని పలు ప్రధాన నగరాలకు సర్వీసులు నడిపేందుకు నిర్ణయించింది.
 
 
ఆ దిశగా తొలి షెడ్యూల్‌లో మూడు రూట్లతో మొత్తం 10 ట్రిప్పులు వేస్తోంది. ఇందులో హైదరాబాద్‌కు ఆరుట్రిప్పులు, చెన్నై బెంగళూరులకు చెరోరెండు ట్రిప్పులు వేస్తోం ది. ఇదే క్రమంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ముంబయికి తనసర్వీసును ప్రారంభించింది. రెండోదశలో ముంబయి, గుజరాత్‌, ఢిల్లీ తదితర ప్రాంతాలకు సర్వీసులు నడపాలని ప్రాథమికంగా నిర్ణయించినా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ముంబయికి సర్వీసు ప్రారంభించి విజయవంతంగా నడపటంతో ఇండిగో ప్రతినిథులు కూడా కొంతకాలంగా అధ్యయనం చేసి ఏఏ రూట్లలో సర్వీసులు నడపాలన్న దానిపై ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. సెకండ్‌ ఫేజ్‌లో సర్వీసులన్నింటినీ వింటర్‌ షెడ్యూల్స్‌గా నడపాలని, ఒక సర్వీసు ఎయిర్‌బస్‌ నడపాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ రూట్లకు సర్వీసులు నడపాలన్నదానిపై సమాచారం రావాల్సి ఉంది.
 
 
సింగపూర్‌కు సర్వీసుపై అభిప్రాయ సేకరణ
విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు నడిపే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) ద్వారా అభిప్రాయ సేకరణకు సంబంధించి బహిరంగ ప్రకటన కూడా జారీ చేయటం జరిగింది. హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు ప్రస్తుతం ఉన్న ఛార్జీలను దృష్టిలో ఉంచుకుని అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరటం జరిగింది. పదిరోజుల్లోగా అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరింది. ప్రజలు 98681 75288 నెంబర్‌కు ఫోన్‌ చేసి తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. కార్పొరేషన్‌కు చెందిన www.apadcl.com వెబ్‌పోర్టల్‌ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...