Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

న్‌వే మధ్యలో టవర్‌!
26-07-2018 02:53:20
 
636681704002842252.jpg
  • ఇస్తాంబుల్‌ తరహాలో ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థ
  • నవ్యాంధ్ర రాజధాని ఎయిర్‌పోర్టు ప్రత్యేకత!
  • 25 కోట్లతో ప్రతిపాదనలు
విజయవాడ, జూలై 25(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ఎంతో ప్రతిష్ఠాత్మకం. తాజాగా ఆ స్థాయికి తగ్గట్టు ప్రత్యేక ఆకర్షణగా ఇస్తాంబుల్‌ తరహాలో ఆధునిక టవర్‌ బిల్డింగ్‌ నిర్మించనున్నారు. విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న రన్‌వేకు తోడు నూతనంగా నిర్మిస్తున్న రన్‌వేకు మధ్య భాగంలో.. వీకేఆర్‌ కాలేజీ వైపుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇస్తాంబుల్‌ విమానాశ్రయంలో రన్‌వే మధ్యభాగంలో ఏర్పాటు చేసిన టవర్‌ బిల్డింగ్‌లో ఆర్కిటెక్చర్‌ నైపుణ్యం అణువణువూ కనిపిస్తుంది. ఆ స్థాయిలో కాకపోయినా... అలాంటి టవర్‌ ఏర్పాటుకు రూ.25 కోట్ల అంచనాతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టవర్‌ బిల్డింగ్‌కు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) అధికారులు తాత్కాలిక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆరు అంతస్థులుండే ఈ టవర్‌ బిల్డింగ్‌ పొడవు 30 మీటర్లు.. అంటే 100 అడుగుల పొడవుంటుంది. బిల్డింగ్‌ పై భాగంలో టవర్‌ ఏర్పాటు చేస్తారు.
 
 
ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో పాత టెర్మినల్‌ దగ్గర ఏటీసీ టవర్‌ బిల్డింగ్‌ ఉంది. ఈ ఏటీసీ టవర్‌ బిల్డింగ్‌ పశ్చిమ దిశన రన్‌వే మొదట్లో ఉం టుంది. ఎయిర్‌ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుంటే.. రన్‌వే మధ్య భాగంలో ఏటీసీ టవర్‌ బిల్డింగ్‌ ఏర్పాటు శ్రేయస్కరం. రన్‌వే రెండు వైపులా కనిపించటానికి వీలుగా ఒక పక్కన దీన్ని నిర్మించాలి. దీనిపై నుంచి చేస్తూ విమా నం ల్యాండింగ్‌, టేకాఫ్‌ వంటివి కూడా స్పష్టం గా కనిపిస్తాయి. కొత్త టవర్‌ బిల్డింగ్‌ డిజైన్లకు అప్పుడే శ్రీకారం చుట్టారు. వీటిలో ఒక దానిని కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. కాగా, ఎయిర్‌పోర్టుకు ఇటీవలే ఆస్ర్టియా దేశం నుంచి అత్యంత శక్తివంతమైన రెండు ఫైర్‌ ఫైటర్లను ఒక్కొక్కటీ రూ.5 కోట్లకు కొనుగోలు చేశారు. టేకాఫ్‌, ల్యాండింగ్‌లో రన్‌వేపై ప్రమాదం జరిగితే రెండు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి ఫైర్‌ఫైటర్లు చేరుకుంటాయి.
Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply
అక్టోబర్‌ 27 నుంచి ప్రత్యేక విమానాలు
26-07-2018 10:35:50
 
636681981495239370.jpg
విజయవాడ: వింటర్‌ షెడ్యూల్స్‌గా ప్రత్యేక విమానాలు నడపటానికి ఎయిర్‌ పోర్టు అథారిటీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అక్టోబర్‌ 27 నుంచి వింటర్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. వింటర్‌లో విమాన ప్రయాణాలు ఎక్కువుగా ఉంటాయి. ఈ క్రమంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని విమానయాన సంస్థలు మరిన్ని సర్వీసులను నడపటానికి ప్రయత్నిస్తుంటాయి. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి వింటర్‌లో ప్రత్యేక సర్వీసులు నడపటానికి స్పైస్‌ జెట్‌ సంస్థ ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల స్పైస్‌జెట్‌ సంస్థ ఎయిర్‌బస్‌లను కొనుగోలు చేసింది.
 
ఇప్పటి వరకు స్పైస్‌ జెట్‌ విజయవాడ నుంచి బంబార్డ్‌ ఎయిర్‌ క్రా్‌ఫ్ట్‌లను మాత్రమే నడుపుతోంది. వింటర్‌లో ఎయిర్‌బస్‌లను నడపాలని భావిస్తోంది. దీని కోసం డీజీసీఏకు అనుమతులు కోరినట్టు తెలుస్తోంది. ఏ రూట్‌కు నడుపుతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ట్రూజెట్‌ సంస్థ కూడా ఒక విమానాన్ని అదనంగా నడపటానికి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఇండిగో విమానయాన సంస్థ కూడా ప్రధాన నగరాలకు ప్రత్యేక విమానాలు నడపటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
Link to comment
Share on other sites

గన్నవరానికి అనుమతిచ్చినా.. ఆచరణేదీ...?

01511326BRK-GANNAVARAM.JPG

అమరావతి: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది గన్నవరం విమానాశ్రయం పరిస్థితి. అంతర్జాతీయ హోదా వచ్చి ఏడాది కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి కారణంగా ఒక్క విమానం కూడా విదేశాలకు వెళ్లలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో విదేశీ విమానాలకు అనుమతి ఇచ్చే విషయంలో సందిగ్ధత వీడటం లేదు. ఎటూ తేల్చుకోలేక పౌరవిమానయాన శాఖ మల్లగుల్లాలు పడుతోంది. సింగపూర్‌, దుబాయ్‌ దేశాలకు సర్వీసులు నడపాలని ప్రణాళిక రచించిన విమాన సంస్థలు వెనకడుగేశాయి. ఫలితంగా రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం పడింది. వ్యాపారానికి అనువైన రాష్ట్రంగా మారాల్సిన ఆంధ్రప్రదేశ్ సమస్యలతో సతమతమవుతోంది.

గన్నవరం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రాజధానికి అతి సమీపంలో ఉన్నా ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. గతంలో రోజుకు రెండు విమానాలు మాత్రమే నడిచేవి. రాష్ట్ర విభజన తరవాత విజయవాడ విమానాశ్రయం అవసరం పెరిగింది. పరిపాలన ఇక్కడినుంచే ప్రారంభం కావడం వల్ల ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. 2015లో 50 వేలుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం 12 లక్షలకు చేరుకుంది. ఈ స్థాయిలో పెరుగుదలకు కారణం అమరావతి సహా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధే. దేశ విదేశీ ప్రము‌ఖులు, వ్యాపారవేత్తలు నిత్యం పర్యటిస్తున్నారు. ప్రస్తుతమున్న అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయ అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి.

పాత టెర్మినల్‌ ఉన్నా అది సరిపోదన్న ఉద్దేశంతో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తది నిర్మించారు. కన్వేయర్‌ బెల్టులు, బ్యాగేజీ కరౌజల్స్, అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 300 కార్లు నిలిపే సామర్ధ్యం ఉన్న పార్కింగ్‌ స్థలం అందుబాటులోకి తీసుకొచ్చారు. రన్‌వే పొడవు 3,366 మీటర్లకు పెంచుతున్నారు. ఇందుకోసం అవసరమైన 740 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. విమానాశ్రయ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గతేడాది ఆగస్టులో గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా లభించింది. ఫలితంగా ఇక్కడి నుంచి విదేశాలకు విమానాలు నడిపేందుకు మార్గం సుగుమం అయింది. అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించింది. నిర్మాణపనులు వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంది. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా అత్యంత అధునాతన హంగులతో విమానాశ్రయాన్ని నవీకరించారు.

విదేశాలకు విమానాలు నడిపేందుకు అప్పటి కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు విమానయాన సంస్థలతోనూ చర్చించి సూత్రప్రాయంగా అంగీకారం తీసుకున్నారు. మే తొలి వారంలో దుబాయ్‌కి తొలి విమానం నడపాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నిధులు కేటాయించి కేంద్రం అనుమతులిచ్చింది. రెండు నెలల్లోనే అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దారు. అంతర్జాతీయ సేవలు మొదలవుతాయన్న దశలో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఆ క్రమంలోనే అశోక్‌ గజపతి రాజు రాజీనామా చేశారు. ఫలితంగా విదేశీ సర్వీసులకు అంతరాయం కలిగింది.

Link to comment
Share on other sites

నమ్మి భూములిచ్చాం.. న్యాయం చేయండి
27-07-2018 07:20:25
 
636682728250920974.jpg
  • డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన గన్నవరం ప్రాంత రైతులు
  • న్యాయం చేస్తామన్న సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌
అమరావతి: ప్రభుత్వం కోరిన వెంటనే ఎయిర్‌పోర్ట్‌ విస్తరణకు భూ ములిచ్చిన తమకు అమరావతిలో సరైన ప్లాట్లను కేటాయించాలని గన్నవరం ప్రాంత రైతులు సీఆర్డీయేను డిమాండ్‌ చేశారు. వారికి ఇవ్వాల్సిన రిటర్నబుల్‌ ప్లాట్లకు సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటి ఫికేషన్‌ ఇటీవల విడుదలైన నేపథ్యంలో దానిపై తమకున్న పలు అభ్యంతరాలను వివిధ గ్రామాలకు చెందిన అన్న దాతలు సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితర ఉన్నతాధికారుల దృష్టికి తె చ్చారు. విజ యవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో గురువారం సాయంత్రం వారితో సమావేశమయ్యారు. రైతులకు గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీ మోహన్‌ నేతృత్వం వహించగా ఈ భేటీలో కృష్ణా జిల్లా పరిషత్తు మాజీ అధ్యక్షుడు కడియాల రాఘ వరావు, విజయవాడ కార్పొరేటర్‌ దేవినేని అపర్ణ, అల్లాపురం సర్పంచ్‌ అనగాని రవి, సీఆర్డీయే ఉన్నతా ధికారులు బి.ఎల్‌.చెన్నకేశవరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
ఎవ్వరూ పట్టించుకోవడం లేదు..
రాజధాని భూసమీకరణ ప్రారంభమైన సమయంలో అమరావతిలోని గ్రామాల భూములతో పోల్చితే గన్నవరం ప్రాంత భూముల ధరలు బాగా ఎక్కువగా ఉండేవని, అయినప్పటికీ విమానాశ్రయ విస్తరణకు తామందరం వందలాది ఎకరాలను ఇచ్చామని రైతులు గుర్తు చేశారు. ఆ సమయంలో తమకు ఏమాత్రం అన్యాయం జరగనివ్వబోమని హామీలిచ్చారని, కానీ తర్వాత మాత్రం తమనెవ్వరూ పట్టించుకోవడం లేదని పలువురు వాపోయారు. నిబంధనల ప్రకారం తమకు సకాలంలో కౌలు చెక్కులను ఇవలేదన్నారు. రిటర్నబుల్‌ ప్లాట్ల పంపిణీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు.
 
సీఆర్డీయే ఇటీవల విడుదల చేసిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ మరింత అన్యాయం చేసేలా ఉందని ఆరోపించారు. తమకు ఇచ్చేందుకు ప్రతిపాదించిన లొకేషన్లలో చాలావాటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని మార్చాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ప్రధా నంగా రెండు లొకేషన్లపై అసంతృప్తి ప్రకటిస్తూ, వా టికి బదులు వేరే చోట్ల తమకు ప్లాట్లు ఇవ్వాలన్నారు. ఇటీవల ఎమ్మెల్యే వంశీమోహన్‌ నాయకత్వంలో తాము సీఎంని కలుసుకున్నప్పుడు తమ అభ్యర్థ నలను ఆలకించిన ఆయన విజయవాడకు సమీపంలోని రాజధాని గ్రామాల వద్ద ప్లాట్లను ఇస్తా మని హామీ ఇచ్చారని, కానీ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో ఆ ఊసే లేదని వాపోయారు.
 
వీధి పోటు ఉన్న స్థలాలను ఇవ్వబోమని చెబుతూనే సీఆర్డీయే తమకు అలాంటి కొన్ని ప్లాట్లను ‘డ్రాఫ్ట్‌’లో చూపిందని విమర్శించారు. వంశీమోహన్‌ మాట్లాడుతూ రైతుల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని, వారు కోరిన విధంగా ప్లాట్లను కేటాయిస్తూ ఫైనల్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరారు. తమ ప్రాంత రైతులు అడుగుతున్న ప్రదేశాల్లో ఖాళీలు ఉన్న చోట్ల వారికి ప్లాట్లు ఇవ్వాలని రాఘవరావు, తమకు న్యాయం చేయాలని అపర్ణ విజ్ఞప్తి చేశారు. తమను గన్నవరం తహసీల్దార్‌ కార్యాలయం ఇబ్బందులకు గురి చేస్తోందని ఈ సందర్భంగా పలువురు రైతులు ఆరోపించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
 
 
సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం: శ్రీధర్‌
డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై గన్నవరం ప్రాంత రైతులు వెలిబుచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీ లిస్తామని, ఆ తర్వాతనే ఫైనల్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసి, ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయిస్తామని శ్రీధర్‌ ప్రకటించారు. రాజధానిలో కొన్ని గ్రామాలు బాగా, మిగిలినవి తక్కువగా అభివృద్ధి చెందు తాయ నుకోవడం కేవలం అపోహేనని, జేబులు నింపు కొనేం దుకు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు ఇలాంటివి వ్యాపిం పజేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతిలోని 217 చదరపు కిలోమీటర్లలో ప్రతి ఒక్క అంగుళాన్నీ సరిస మానంగా అభివృద్ధి పరుస్తామని, అందువల్ల రాజ ధానిలోని అన్ని గ్రామాల వద్ద ఉండే ప్లాట్లకు భవి ష్యత్తులో ఒకే విధమైన విలువ వస్తుందని చెప్పారు.
Link to comment
Share on other sites

మణికొండ, పుట్టగుంట నుంచి గన్నవరానికి లింక్‌రోడ్డు
28-07-2018 08:07:31
 
అమరావతి: గన్నవరం విమానాశ్రయం విస్తరణ, అభివృద్ధి పనుల కారణంగా రహదారుల రీరూటింగ్‌తో గ్రామాల మధ్య పెరిగిన రహదారి దూరాన్ని తగ్గించేందుకు రోడ్లు భవనాల శాఖ చర్యలు చేపట్టింది. ఆర్‌అండ్‌బీ మంత్రి అయ్యన్నపాత్రుడి సూచనల మేరకు గన్నవరం-మణికొండ, గన్నవరం -పుట్టగుంట రహదారులను కలుపుతూ లింక్‌రోడ్డు నిర్మించాలని ఆర్‌అండ్‌బీ ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 5.50 కోట్ల వ్యయంతో 1.95 కిమీ మేర ఈ లింక్‌రోడ్డును నిర్మిస్తారు. పైన పేర్కొన్న రెండు రోడ్లపై అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీని కారణంగా ట్రాఫిక్‌ డైవర్షన్‌ పెట్టడంతో రెండు గ్రామాల ప్రజలు, విద్యార్ధులు పాఠశాలలు, ఇతర అవసరాలకోసం గన్నవరం రావాలంటే సుమారు 12 కిమీపైనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. దూరాన్ని తగ్గించేందుకు లింకురోడ్డు నిర్మించాలని ప్రజలు మంత్రి అయనను కోరగా తాత్కాలిక లింకురోడ్డును మంజూరు చేశారు.
Link to comment
Share on other sites

లోహవిహంగాలకు పక్షులతో హడల్‌
28ap-state4a.jpg

విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో పక్షుల సంచారం తీవ్ర సమస్యగా మారింది. నిత్యం ఇక్కడి నుంచి 52 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటాయి.వాటిద్వారా ఏటా 9లక్షల మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. విమానాశ్రయాల పరిసరాల్లో పక్షుల సంచారం నిషేధం. కానీ, ఈ విమానాశ్రయం జాతీయ రహదారి చెంతనే ఉండటంతో.. చుట్టుపక్కల రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు సహా స్థానికులు వ్యర్థాలు, చెత్తను ప్రతిరోజు ఇక్కడే పారబోస్తున్నారు. వాటిని తినేందుకు వస్తున్న పక్షులు విమానాశ్రయం ప్రాంగణంలోకి ప్రవేశించి లోహవిహంగాల ప్రయాణానికి ఆటంకంగా పరిణమిస్తున్నాయి.పక్షులవల్ల పెనుముప్పు ఎదురుకావడంతోపాటు విమానాలూ కూలిపోయే పరిస్థితి తలెత్తవచ్చని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

28ap-state4b.jpg
Link to comment
Share on other sites

కేంద్రాన్ని ప్రశ్నించిన గల్లా జయదేవ్
30-07-2018 17:46:02
 
636685695629072912.jpg
ఢిల్లీ: విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టుల నుంచి విదేశీ విమానాల రాకపోకలకు అవకాశం కల్పించాలని ఎంపీ జయదేవ్‌ డిమాండ్ చేశారు. ఏపీ విభజన తర్వాత అంతర్జాతీయ విమానాల రాకపోకలకు చొరవ తీసుకుంటామని కేంద్రం ప్రకటించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టుల్లో సౌకర్యాలు కల్పించబడినా ఇప్పటివరకు విదేశీ విమానాల రాకపోకలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని మండిపడ్డారు.
 
‘‘విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 2, 3 సర్వీసులను నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖలో నేవీ అధికారుల కొత్త ఆంక్షలతో స్పైస్‌జెట్‌, శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ తమ సర్వీసులు నిలిపివేసే ఆలోచనలో ఉన్నారు. నేవీ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు గగనతలాన్ని అధికారులు వాడుకుంటున్నారు. విదేశీ విమాన సర్వీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడమేంటి’’ అని జయదేవ్‌ ప్రశ్నించారు.
 
 
విజయవాడ కేంద్రంగా కార్గో సర్వీసులను అందుబాటులోకి తెస్తామన్న హామీ కూడా ఇప్పటివరకు అమలుకాలేదని గల్లా మండిపడ్డారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో కార్గో కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ కార్గో సేవలు అందుబాటులోకి రాలేదని, కార్గో సేవలు అందుబాటులోకి వస్తే రైతులకు ఉపయోగాలు ఉంటాయన్నారు. ఈ అంశాలను కేంద్ర విమానయానశాఖ వెంటనే పరిశీలించాలని జయదేవ్ డిమాండ్ చేశారు.
Link to comment
Share on other sites

విస్తరణ పనులను అడ్డుకున్న రైతులు
02-08-2018 06:49:31
 
636687893719936363.jpg
  • ఎయిర్‌పోర్టుకు భూములిస్తే... ఇప్పుడు విస్మరిస్తారా?
  • ఆందోళనకారులతో తహసీల్దార్‌, ఏపీడీ చర్చలు
గన్నవరం: ఎయిర్‌పోర్టు అభివృద్ధికి భూమిలిస్తే... ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమను విస్మరించిందని, మూడున్నరేళ్లుగా అధికారులు తిప్పించుకుంటున్నారని పలువురు రైతులు బుధవారం ఎయిర్‌పోర్టు విస్తరణ పనులను అడ్డు కున్నారు. మట్టి లోడుతో వచ్చిన లారీలను అడ్డుకుని పనులు జరగడానికి వీల్లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్‌ ఎం.మాధురి, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు అక్కడకు చేరుకుని రైతులతో చర్చించారు. సీఎం హామీ ఇచ్చేంతవరకూ పనులు జరగనివ్వబోమని, టెంట్‌ వేసి అక్కడే కూర్చున్నారు. స్పందన రాకుంటే కుటుంబ సభ్యులతో కలసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతులు నాయిని ప్రభాకరరావు, ఎంవీఎల్‌ ప్రసాద్‌, కంభంపాటి సూర్యచంద్రరావు, కోడె వెంకటేశ్వరరావు, గూడవల్లి నాగేశ్వరరావు, పసుపులేటి రామారావు, తమ్మారెడ్డి ప్రతాప్‌, జమ్ముల కృష్ణారావు, మల్లిబాబు, కోనేరు రామారావు, గొంది రంజిత్‌, సీపీఎం నాయకులు కళ్ళం వెంకటేశ్వరావు, మరియదాసు పాల్గొన్నారు.
 
ఆ నాలుగు గ్రామాల్లోనే ప్లాట్లు కావాలి...
ఆందోళనకు ముందు రైతులు మండలంలోని బుద్ధవరం రామాలయంలో సమావేశం నిర్వహిం చారు. ఎయిర్‌పోర్టు విస్తరణకు 850 ఎకరాలు భూములిచ్చిన రైతులకు రాజధాని పరిధిలోని పది గ్రామాల్లో ప్లాట్లు ఇస్తామని సీఆర్‌డీఏ అధికారులు తెలపడంతో వెలగపూడి, మందడం, మాల్కాపురం, తుళ్ళూరు గ్రామాల్లో ప్లాట్లు ఇవ్వాలని కోరామన్నారు. ఎక్కడ ఖాళీగా ఉన్నాయో చూసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఆదేశాలమేరకు సర్వేయర్‌తో కలసి ఆ నాలుగు గ్రామాలను సందర్శిం చామన్నారు. మందడంలో 175 ఎకరాలు ఉందని గుర్తించి కమిషనర్‌కు తెలపగా, పరిశీలిస్తానని చెప్పిన ఆయన కొద్ది రోజుల తరువాత అక్కడ 12 ఎకరాలు మాత్రమే ఇవ్వగలమని చెప్పారన్నారు.
 
ఈ నాలుగు గ్రామాల్లో గజం భూమి రూ.28 వేలు ఉండగా, మిగిలిన 6 గ్రామాలైన పిచుకులపాలెం, శాఖమూరు, ఐనవోలు, నవులూరు, కురగల్లు, నిడమర్రులో గజం రూ.10వేలు మాత్రమే ఉందని రైతులు తెలిపారు. వీటిల్లో ప్లాట్లు ఇస్తే ఎకరాకు రూ.కోటి నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. మిగిలిపోయిన, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికలు, వాగులు ఉన్న చోట ప్లాట్లు ఎయిర్‌ పోర్టు రైతులకు ఇచ్చేందుకు చూస్తున్నారన్నారు.
 
ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలసి ఇటీవల సీఆర్‌డీఏ కమిషనర్‌ను కలసి నాలుగు గ్రామాల తోపాటు మరో రెండు గ్రామాలు కలపాలని విన్నవించగా, అందరూ ఏకాభిప్రాయానికి వస్తే పరిశీలిస్తామన్నారని రైతులు తెలిపారు. ఆ తరవాత కుదరదని చెప్పారు... ఎయిర్‌పోర్టుకు అడిగిన వెంటనే భూములు ఇస్తే అన్యాయం చేస్తారా అంటూ వారు ప్రశ్నించారు. సీఎం మీద నమ్మకం, ఎమ్మెల్యే చొరవ మేరకు భూములిస్తే మూడున్నరేళ్ళ నుంచి తిప్పుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

సరకు.. బయలుదేరింది
గన్నవరం నుంచి మొదలైన కార్గో సేవలు
మొదటి రోజే 12టన్నుల ఎగుమతి, దిగుమతి
పోస్టల్‌ విభాగం పార్శిల్‌తో శుభారంభం
amr-top2a.jpg
దశాబ్దాల కల సాకారమైంది. ఆకాశ మార్గంలో సరకు రవాణా మొదలైంది. గన్నవరం విమానాశ్రయం నుంచి బుధవారం ఉదయం మొదటి పార్శిల్‌ విమానంలో దిల్లీకి బయలుదేరి వెళ్లింది. డొమెస్టిక్‌ కార్గో సేవలు ఆరంభమయ్యాయి. మొదటి రోజే ఉదయం నుంచి రాత్రి వరకూ మొత్తం 12 టన్నుల సరకు దిల్లీ, ముంబయి, చెన్నై మూడు నగరాలకు ఎయిర్‌ కార్గోలో వెళ్లడం, రావడం జరిగింది. పోస్టల్‌శాఖకు చెందిన తొలి పార్శిల్‌ గన్నవరం విమానాశ్రయానికి ఉదయాన్నే చేరుకుంది. దిల్లీకి కార్గోలో బుక్‌ చేసి పంపించారు.
ఈనాడు, అమరావతి
గన్నవరం విమానాశ్రయం నుంచి సరకు రవాణా బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు ఊహించిన దాని కంటే అనూహ్యంగా స్పందన వచ్చింది. ఇటునుంచి వెళ్లింది, అటునుంచి వచ్చింది కలిపి సరకు 12 టన్నుల వరకూ ఉంది.  విజయవాడ నుంచి హైదరాబాద్‌, ముంబయి, చెన్నై, దిల్లీ, బెంగళూరు, విశాఖ, తిరుపతి, కడప నగరాలకు ప్రస్తుతం కార్గో సేవలు అందిస్తున్నారు. ఉదయం 6.30గంటల నుంచి రాత్రి 9.30 వరకూ కార్గో సేవలు అందుబాటులో ఉంటాయి. విమానాశ్రయం నుంచి నిత్యం 52 సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో సరకు రవాణాకు అవకాశం ఉన్న వాటన్నింటిలోనూ ప్రస్తుతం పంపిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోజుకు పది టన్నుల సరకును పంపించే సామర్థ్యం ఈ విమాన సర్వీసుల్లో ఉంది. ఇటునుంచి పంపించేందుకు, అటునుంచి తెప్పించేందుకు 20 టన్నుల సామర్థ్యం ఉంది.

ఇలా బుక్‌ చేసుకోవాలి
గన్నవరం విమానాశ్రయంలోని కార్గో కార్యాలయం వద్దకు సరకును తీసుకెళ్లిన తర్వాత.. ఏ నగరానికి పంపించాలనేది చెబితే.. విమాన సర్వీసుల వేళలు చెబుతారు. కార్గో సేవలు అందిస్తున్న శ్రీపా లాజిస్టిక్స్‌ కార్యాలయంలో తొలుత సరకును బుక్‌ చేసుకోవాలి. దానికి సంబంధించిన సర్వీసు రుసుం చెల్లించాలి. అనంతరం అక్కడే ఉన్న ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన కార్యాలయంలో వారు నిర్దేశించిన ధర చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం కార్గో సేవలు అందించే సంస్థ నిర్ధిష్ఠమైన ఒకేరకమైన ధరలు ఉన్నాయి. ఎయిర్‌లైన్స్‌ మాత్రం ఎయిరిండియా, స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌ ధరలు కొద్ది తేడాతో ఉన్నాయి. అదికూడా ఇక్కడి నుంచి సరకును పంపించే నగరాన్ని బట్టి రుసుం నిర్ణయించారు.

కిలోలను బట్టి ధరలు..
మూడు రకాల కార్గో సేవలను అందిస్తున్నారు. సాధారణ, ప్రత్యేక, పెరిషబుల్‌ కార్గోకు ప్రత్యేకంగా ధరలు వసూలు చేస్తారు. సాధారణ కార్గోలో ఏవైనా పంపించేయొచ్చు. దీని ధర కూడా తక్కువే. ప్రత్యేక, పెరిషబుల్‌కు ధర ఎక్కువ ఉంటుంది. ఆహారం పాడైపోకుండా త్వరగా చేర్చేందుకు, విలువైన సరకు వంటివి దీనికిందకు వస్తాయి. పాడైపోయే అవకాశం ఉన్న కూరగాయలు, పండ్లు లాంటి వన్నీ వీటి పరిధిలోనికి వస్తాయి. 10 నుంచి 144 కిలోలకు లోపు ఎంత సరకు ఉన్నా.. ఒకే ధరను కార్గో సంస్థ వసూలు చేస్తోంది. సాధారణ కార్గోకు కనీస ధర రూ.122 చెల్లించాల్సిందే. అంతకు మించితే కిలోకు 83పైసలు వసూలు చేస్తారు. అదే ప్రత్యేక, పెరిషబుల్‌ కార్గోకు 144 కిలోల వరకూ కనీస ధర రూ.243. దాటితే కిలోకు రూ.1.66పైసలు చెల్లించాలి. ఇదికాకుండా.. ఎక్స్‌రే తదితర అదనపు ఛార్జీలు తీసుకుంటారు. కార్గో సంస్థకు కాకుండా.. ఎయిర్‌లైన్స్‌లో తరలించేందుకు వాటికి అదనంగా ధర చెల్లించాలి. ఎయిరిండియాలో దిల్లీకి సరకును పంపించాలంటే.. కిలోకు రూ.15.25 వరకూ వసూలు చేస్తుంటారు. అదే స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌, ఇండిగో.. ఇలా వేటికవే కొద్దిగా తేడాతో రుసుం వసూలు చేస్తాయి. అందుబాటులో ఉన్న విమాన సర్వీసును బట్టి బుక్‌ చేసుకోవచ్చు.

తొలి రోజే అనూహ్య స్పందన..
కార్గో సేవలను బుధవారం నుంచి ప్రారంభించాం. మొదటి రోజూ అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 12 టన్నుల వరకూ సరకు పంపించడం, తీసుకురావడం జరిగింది. అతికొద్ది రోజుల్లోనే కార్గో సేవలు అనూహ్యంగా పుంజుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సరకును అత్యంత వేగంగా.. దేశంలోని ప్రధాన నగరాలకు తరలించేందుకు ఎయిర్‌కార్గో ఉపకరించనుంది. మిగతా నగరాలతో పోలిస్తే.. తక్కువ ధరకే ఇక్కడ కార్గో సేవలను అందించడం జరుగుతోంది. ఆలస్యం లేకుండా, పాడవ్వకుండా అత్యంత వేగంగా సరకును చేరవేసే అవకాశం ఉండడంతో ఎయిర్‌కార్గో సేవలు మరింత విస్తరించనున్నాయి.

- వెంకట రామారావు కోకలి, శ్రీపా లాజిస్టిక్స్‌ సీఎండీ
ప్రస్తుతం పరిస్థితి ఇదీ..
నిత్యం నడుస్తున్న సర్వీసులు: 52
మొదటి రోజు సరకు: 12 టన్నులు
రోజుకు ఎగుమతి, దిగుమతి సామర్థ్యం: 20టన్నులు
సరకు తరలించే అవకాశం ఉన్న నగరాలు: 8
సమయాలు: ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30గంటలు
 
 

 

Link to comment
Share on other sites

Vijayawada airport clocks 92.4% growth in passenger traffic

https://www.thehindu.com/news/cities/Vijayawada/8r1s4z/article24569562.ece/alternates/FREE_615/01VJAIRPORT%202

Tirupati among the top 20 on this count

When it comes to growth in the passenger traffic at airports, Vijayawada and Tirupati are among the top 20, competing with the bigger facilities in the country.

29th position for Vizag

As per the statistics released by the Airports Authority of India (AAI), which was uploaded onto the Twitter handle of the Visakhapatnam airport, while the Vijayawada airport stood at the 19th position, the Tirupati airport was ranked 20. Visakhapatnam stood at the 29 position.

In June this year, the total passenger traffic at the Vijayawada airport was 1,01,821 against the previous year’s 52,926, which showed a growth of 92.4%.

The Tirupati airport recorded a traffic of 69,165 compared to 42,242 the previous year, registering a growth of 63.7%.

The authorities said the Visakhapatnam airport also registered a growth of 10.2%.

The passenger footfalls at the Visakhapatnam airport had risen from 2,08,976 in June 2017 to 2,30,265 this year.

Link to comment
Share on other sites

ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు అడ్డుకుంటాం
03-08-2018 07:17:54
 
636688774752867106.jpg
  • స్పష్టమైన హామీ ఇవ్వాలి
  • మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నాం
  • ఎవ రూ పట్టించుకోవడం లేదు
  • ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చిన రైతులు
  • రెండో రోజు కొనసాగిన ఆందోళన
గన్నవరం: ‘సీఎం చంద్రబాబును నమ్మి భూములు ఇచ్చాం. ఎన్నిసార్లు తిరిగినా అదిగో ఇదిగో అంటూ కాలక్షేపం మాటలు చెబుతున్నారు. ఎంతో నీరసించిపోయాం. సీఎం ఆదేశాలను కూడా అధికారులు బేఖాతరు చేస్తున్నారు.. హామీ ఇచ్చే వరకు పనులు జరగనివ్వబోమని’ ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చిన రైతుల అంటున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు 830 ఎకరాలను రైతులు ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చారు. భూములిచ్చిన రైతులు గురువారం కూడా ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ధర్నా చేశారు. వీరికి రాజధానిలో జరీబ్‌ భూములు కింద ప్లాట్లు ఇస్తామని చెప్పారు. ఏడాదికి ఎకరానికి రూ.50వేలు చొప్పున పదేళ్లు కౌలు ఇవ్వడంతో పాటు ఏడాదికి రూ.5వేల చొప్పున పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. మొదటి ఏడాది కొందరికీ మాత్రమే కౌలు పడింది. రెండు, మూడో సంవత్సరం ఎవరికీ కౌలు పడలేదు. దీనిపై అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఉపయోగం లేదని వాపోతున్నారు. ప్లాట్లు కేటాయించడంలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
 
ఎయిర్‌పోర్టు విస్తరణకు కోట్లు విలువ చేసే భూములు ఇస్తే ఎందుకు పనికిరాని ప్లాట్లు ఇచ్చేందుకు సీఆర్‌డీఏ అధికారులు చూస్తున్నారని అంటున్నారు. పది గ్రామాల్లో ఇస్తామని చెబుతున్న అధికారులు నాలుగు గ్రామాల్లోని భూమికి విలువ ఉందని చెబుతున్నారు. అవసరమైతే ఎన్ని రోజులైనా ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. అడిగిన వెంటనే భూములిచ్చిన తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. రైతులు కోరిన గ్రామాల్లో ప్లాట్లు ఇవ్వాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కౌలు, లాంగ్‌ క్రాప్‌ పరిహారం, 44 బోర్లకు రూ.70లక్షలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రైతులకు అనుకూలమైన ప్రకటన వచ్చే వరకూ పనులు అడ్డుకుంటామని తెలిపారు. మాగంటి వెంకటరామారావు, గూడవల్లి నాగేశ్వరరావు, అచ్యుతరామారావు, గొంది రంజిత్‌, కారంపూడి సాండశివరావు, నూతక్కి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
 
హీనంగా చూస్తున్నారు
స్పష్టమైన హామీ వ చ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తాం. విస్తరణ పనులను జరగనివ్వం. అధికారులు రైతులను పశువుల కంటే హీనంగా చూస్తున్నారు. భూములిచ్చి వారి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగారం లాంటి భూములిచ్చాం. సరైన ప్లాట్లు కేటాయిం చడం లేదు. భూములిచ్చిన కుటుం బాల్లో గొడవలు జరుగుతున్నాయి. సమాధానం చెప్పలేకపోతున్నాం.
-నాయని ప్రభాకరరావు
 
 
రైతులకు న్యాయం చేయాలి
భూములిచ్చిన రైతు లకు అన్యాయం చేస్తున్నారు. పది గ్రామాల్లో ప్లాట్లు కేటాయిస్తామని చెబుతున్నారు. నాలుగు గ్రామాల్లో భూములకు ఎక్కువ విలువ ఉంది. మిగిలిన గ్రామాల్లో చాలా తక్కువ ఉంది. వీటి కారణంగా ఒక్కో రైతు రూ.కోటి నష్టపోవాల్సి వస్తుంది. సీఎం చంద్రబాబు మీద నమ్మకంతో భూములిచ్చాం. అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రైతులకు న్యాయం చేయాలి.
-ఎంవీఎల్‌ ప్రసాద్‌
 
 
సీఎం మీద నమ్మకంతో..
సీఎం చంద్రబాబు మీద నమ్మకంతో భూములు ఇచ్చాం. అధికారులు మాత్రం రైతులకు చుక్కలు చూపుతున్నారు. కౌలు, ప్లాట్లపై ఎప్పుడు అడిగినా వారంలో ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మూడున్నరేళ్ల నుంచి తిరుగుతున్నాం. ప్లాట్లు చూపింది లేదు, కౌలు ఇచ్చింది లేదు. మొదటి ఏడాది మాత్రమే కొందరికీ ఇచ్చారు. అధికారుల తీరు ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
-గూడవల్లి మల్లికార్జున ప్రసాద్‌
 
 
ఇష్టారాజ్యంగా అధికారులు
అధికారులు ఇష్టా రాజ్యంగా వ్యవహ రిస్తున్నారు. కౌలు ఇవ్వకపోగా రైతులను సంప్రదించకుండానే డిప్రిషియేషన్‌ కట్టారు. దీంతో కోళ్ల ఫారాలకు రావాల్సిన పరిహారం సగానికి పైగా తగ్గిపోయింది. భూములిచ్చి మూడేళ్లవుతోంది. ప్లాట్లు కేటాయించలేదు. కౌలు ఇవ్వడం లేదు. రైతులు ఎలా బతకాలి. అధికారులు తీరు చూస్తుంటే భయమేస్తోంది. పరిహారం చెల్లించడంతో పాటు ప్లాట్లు కేటాయించాలి.
- కె.వెంకటేశ్వరరావు
Link to comment
Share on other sites

భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వంశీ
05-08-2018 08:03:49
 
636690530281645842.jpg
గన్నవరం: ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చిన రైతుల పక్షాన ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఎయిర్‌పోర్టు విస్తరణ పనులను అడ్డుకుని ఆందోళన చేస్తున్న రైతులను శనివారం ఎమ్మెల్యే కలిసారు. ఈ సంద ర్భంగా వంశీ మాట్లాడుతూ అడిగిన వెంటనే భూములిచ్చిన రైతులకు 1450గజాలు జరీబు భూములను ఇస్తామని చెప్నామని, కమ్యూనికేషన్‌ గ్యాప్‌ రావటం వల్ల ప్లాట్ల కేటాయింపులో నిర్లక్ష్యం జరుగుతుందన్నారు. మూడేళ్ల కాలంలో కౌలు, ఇతర పరిహారం అందకపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చేయలేదన్నారు. ప్లాట్లు ఇచ్చే విషయంలో గందరగోళం ఏర్పడిందన్నారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళతానని సాధ్యమైనంత త్వరలో పరిష్కార మార్గం చూపిస్తానని తెలిపారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని చెప్పారు. మాజీ జడ్పీ చైర్మన్‌ కడియాల రాఘవరావు, ఎంపీపీ పట్రా కవిత, జడ్పీటీసీ మరీదు లక్ష్మీదుర్గ, వైస్‌ ఎంపీపీ గొంది పరంధామయ్య, టీడీపీ నాయకులు సురేష్‌, శివకోటేశ్వరరావు, సీపీఐ కార్యదర్శి కొండా వీరాస్వామి, రైతులు నాగేశ్వరరావు, ఎంవిఎల్‌ ప్రసా ద్‌, నాయిని ప్రభాకరరావు, దేవినేని అపర్ణ, రామారావు, రెడ్డియ్య చౌదరి, అచ్యుతరామారావు పాల్గొన్నారు. స్పష్టమైన హామీ వచ్చేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...