Jump to content

Bhavani Island - Tourism


Recommended Posts

  • Replies 112
  • Created
  • Last Reply
Bhavani Island gets a boost

With the objective of developing Bhavani Island and other islets on the Krishna into major tourist destinations and giving a much-needed push to water sports, river cruises and other water-based activities in the region, the Government has decided to form a Special Purpose Vehicle and gave orders to set up Bhavani Island Tourism Corporation.

The key objectives of BITC will be development and maintenance of tourism infrastructure and tourism services at the islands in Krishna river near Vijayawada and Amaravati, river front development on both sides of the Krishna i.e. alongside Vijayawada and Amaravati, water sports, river cruises and other water based activities/ attractions.

BITC shall be incorporated with Andhra Pradesh Tourism Development Corporation Limited (APTDC) as the sole promoter. Based on the need of the project, additional promoters like CRDA and Vijayawada Municipal Corporation (VMC) may be included as promoters after the infusion of appropriate capital. The equity share holding of APTDC shall be at least 50 per cent at any given point time in BITC.

Functions of the BITC will be to exercise development control and regulate development of the lands under relevant Acts, to raise required finances including from market if required by mortgaging the lands, promote and develop tourism infrastructure and tourism experiences, to maintain municipal services to coordinate the government departments in execution of common infrastructure.15202529_1438773039484891_55315758557818
Link to comment
Share on other sites

ఆటపాటలతో .. కళకళలాడిన భవానీ ద్వీపం
 
636159123163611349.jpg
  • భవానీ ద్వీపం కిటకిట 
  • ఆరు వేలకు పైగా సందర్శకుల రాక 
  • టార్గెట్‌ .. రూ. 30 లక్షలు. 
  • ఆదాయం రూ. 36 లక్షలు 
  • బోటింగ్‌ యూనిట్‌ ఆదాయం రూ. 16 లక్షలు 
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కార్తీక మాసం చివరి ఆదివారం భవానీద్వీపం ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేసింది. కిందటి ఏడాది 5 వేల యాత్రికుల రికార్డును ఈ ఆదివారం తిరగరాసింది. రికార్డు స్థాయిలో ఆరు వేలకు పైగా యాత్రికులు భవానీ ద్వీపానికి తరలి వచ్చారు. పిల్లా, పాపలతో సహా కుటుంబాలు భారీ సంఖ్యలో భవానీ ఐల్యాండ్‌కు తరలి వచ్చాయి. కేవలం రూ. 40 లకే బోటింగ్‌ టిక్కెట్‌, రూ. 190 లోపు భోజనం .. మొత్తంగా రూ. 250లకు మించని ఖర్చుతో ఏపీ టూరిజం అందించిన రాయితీలు పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఉన్నత వర్గాలనే కాకుండా.. మధ్య తరగతి, దిగువ తరగతుల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో భవానీ ఐల్యాండ్‌కు వచ్చి సంబరం చేసుకున్నాయి. గత కార్తీక మాసాలను పురస్కరించుకుని ఈ ఏడాది రూ. 30 లక్షల ఆదాయాన్ని టార్గెట్‌గా భవానీ ఐలాండ్‌ యూనిట్‌ అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే దీనికి భిన్నంగా ఆదివారం నాటికి రూ. 36 లక్షల మేర ఆదాయం వచ్చింది.
ఇంకా మూడు రోజుల సమయం ఉంది. చివరి కార్తీక సోమవారం రోజున కూడా భారీగా సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. కార్తీక మాసంలో ప్రతి రోజూ భవానీ ద్వీపం సందర్శకులతో కళకళ లాడింది. ఆదివారాలు మాత్రం రికార్డు స్థాయిలో సందర్శకులు వచ్చారు. అంతే స్థాయిలో పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆదాయాన్ని మూటకట్టుకుంది. భవానీ ద్వీపం సాధించిన మొత్తం రూ. 36 లక్షల ఆదాయంలో .. నాలుగు ఆదివారాలలో రూ. 20 లక్షలు సాధించటం గమనార్హం. ఇక బోటింగ్‌ యూనిట్‌కు వస్తే.. ఇప్పటి వరకు రూ.16 లక్షల ఆదాయం సమకూరింది. మధ్య తరగతి వర్గాలకు కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో రూ. 40 ను మాత్రమే ఛార్జీగా నిర్ణయించింది. దీంతో ఆదాయం తక్కువగా అనిపిస్తోంది. ఏపీటీడీసీ బోట్లు పర్యాటకులను ఒక సమూహంగా అటు, ఇటూ తీసుకు వెళ్ళేవి కాబట్టి ఈ మాత్రమే ఆదాయం వచ్చింది. అదే ఏపీటీడీసీ సొంతగా వాటర్‌స్పోర్ట్స్‌ను ఏర్పాటు చేస్తే.. అతి తక్కువ ధరలకు మధ్య తరగతి వర్గాలు కూడా ఎంజాయ్‌ చేసే అవకాశం ఉంటుంది. భవానీ ద్వీపంలో కాటేజీలు కూడా భారీగానే బుక్‌ అయ్యాయి.
చివరి ఆదివారం ... ఫండే : చివరి ఆదివారం భవానీ ద్వీపం యాత్రికుల సందోహంతో శోభిల్లింది. బోట్లలో ఎక్కటానికి పర్యాటకులు క్యూ కట్టారు. ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు ఏపీటీడీసీ అధికారులు అలుపెరుగుకుండా క్యూలను నిర్వహించటం వల్ల తొక్కిసలాటలు జరగలేదు. బోధిసిరి డబుల్‌ డెక్కర్‌ క్రూయిజర్‌తో పాటు మెకనైజ్డ్‌ క్రూయిజ్‌ బోట్లు రోజంతా నిర్విరామంగా యాత్రికులను భవానీ ద్వీపానికి తీసుకు రావటం, ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళటం చేశాయి. భవానీ ద్వీపంలో ఎక్కువుగా కుటుంబాలు తరలి వచ్చాయి. కుటుంబ సభ్యులంతా ఆత్మీయంగా మాట్లాడుకోవటం, వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అంత్యాక్షరి, రోప్‌ పుల్‌ వంటి ఆటలు ఆడారు. ఉయ్యాలలు, స్పైడర్‌ జెట్‌ ఆటల మజాను ఆస్వాదించారు. ఏపీటీడీసీ వేడివేడిగా సిద్ధం చేసిన కమ్మటి భోజనాలను తృప్తిగా ఆరగించారు. చివరి ఆదివారం భారీ సంఖ్యలో పిల్లలు రావటం విశేషం.
Link to comment
Share on other sites

అంతర్జాతీయ టూరిజం స్పాట్‌గా భవానీ ద్వీపం
 
636163441652849134.jpg
విజయవాడ, తెనాలి : రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన చైర్మన వి.జయరామిరెడ్డి తెలిపారు. వచ్చే నాలుగైదేళ్లలో ఈ రంగంలో రూ.పది వేల కోట్లు ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తెనాలి చినరావూరులో ఆధునికీకరించిన సత్యనారాయణ లేక్‌ పార్కును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చాపురం నుంచి తడ వరకు కోస్తా తీరం వెంబడి టూరిజం స్పాట్లు, బోటు పార్కులు, రిసార్ట్‌లు ఏర్పాటు చేసేందుకు అధ్యయనం జరుగుతున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని భవానీ ద్వీపాన్ని ఇంటర్నేషనల్‌ టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆరునెలల్లో ప్రాజెక్టు సిద్ధం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుపై రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌, రాష్ట్ర మహిళా కమిషన చైర్‌పర్సన నన్నపనేని రాజకుమారి, ఏపీఐఐసీ చైర్మన డాక్టర్‌ పి.కృష్ణయ్య పాల్గొన్నారు.
సూర్యలకం అభివృద్ధికి కృషి
బాపట్ల : సూర్యలంక సముద్రతీరాన్ని టూరిజం కార్పొరేషన్‌ ద్వారా అభివృద్ధి చేస్తానని చైౖర్మన్‌ వి.జయరామిరెడ్డి తెలిపారు. సూర్యలంక సముద్రతీరంలో పర్యాటకకేంద్రానికి కేటాయించిన 8ఎకరాల స్థలాన్ని శుక్రవారం ఎమ్మెల్సీ అన్నంసతీష్‌ప్రభాకర్‌, ఇండ స్ర్టియల్‌ ఇన్‌ప్రాస్టక్చర్స్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పి.కృ ష్ణయ్య, కల్లుగీత కార్పొరేషన్‌ చైౖర్మన్‌ జయప్రకాష్‌నారాయణలతో కలిసి ఆయన పరిశీలించారు. భూమి వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అన్నంసతీష్‌ప్రభాకర్‌ మాట్లాడుతూ రాజధాని సమీపంలో ఉన్న సూర్యలంక పర్యాటక కేంద్రానికి పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. నిధులు కేటాయిస్తే సూర్యలంకను అభివృద్ధి చేస్తానని తెలిపారు. దీనిపై స్పందించిన జయరామిరెడ్డి సూర్యలంక పర్యాటకకేంద్రం అభివృద్ధ్దితో పనిచేస్తానన్నారు. గతంలో రూ.5కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశారని.. అభివృద్ధి మాత్రం చేయలేదని ఎమ్మెల్సీ వివరించారు. ఎంపీపీ మానంవిజేత, మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ, పార్టీ మండల అధ్యక్షులు కావూరి శ్రీనివాసరెడ్డి, నక్కావీరారెడ్డి, పమిడి భాస్కరరావు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కృష్ణా నదిలో అడ్వంచర్ స్పోర్ట్స్ ప్రారంభం
 

water-sports-vijayawada-07122016.jpg

APTDC చైర్మెన్ జైరాం రెడ్డి, కృష్ణానదిలో అడ్వంచర్ వాటర్ స్పోర్ట్స్ బుధవారం ప్రారంభించారు. సింపుల్ ఇండియా పైవేట్ లిమిటెడ్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. పర్యాటక శాఖ చైర్మన్ జయరామరెడ్డి, ఎండీ గిరిజాశంకర్, సింపుల్ వాటర్ స్పోర్ట్స్ సంస్థ ఈడీ తరుణ్ కాకాని పరంభోత్సవలో పాల్గున్నారు. ఇప్పటికే సింపుల్ ఇండియా సంస్థ మచిలీపట్నం, రాజమండ్రిలో అడ్వంచర్ వాటర్ సోర్స్ నిర్వహిస్తోంది.

ఈ అడ్వంచర్ వాటర్ స్పోర్ట్స్, భవానీ ఐలాండ్, పన్నమి ఘాట్, సీతానగరం, కృష్ణవేణి మోటెల్ నుంచి నిర్వహిస్తారు. వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ లో భాగంగా ఉపయోగించే బోట్లను ఫ్లోరిడా, యూఎస్ఏల నుంచి దిగుమతి చేసుకుంది, సింపుల్ ఇండియా.

 

లివింగ్ స్టోన్ క్రూయిజ్ బోటు, పోర్జా బోటు, హోబీ కాయాకాస్ తో పాటు స్పీడ్ బోటు కూడా ఉన్నాయి. మొత్తంగా 25 వివిధ రకాల బొట్లు ఉన్నాయి. ఈ తరహా బొట్లు భద్రతా పరంగా కూడా అత్యున్నతమైనవిగా చెబుతున్నారు

Link to comment
Share on other sites

పర్యాటక ప్రాంతంగా కృష్ణానదీ తీరం
 
636167739491024197.jpg
విద్యాధరపురం(విజయవాడ) : విజయవాడ నగరంలోని కృష్ణానదీ తీరాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ జయరామిరెడ్డి అన్నారు. బుధవారం భవానీపురం పున్నమి ఘాట్‌ వద్ద ఏపీ టూరిజం, వాటర్‌ స్పోర్ట్స్‌ సింపుల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న వాటర్‌ స్పోర్ట్స్‌ బోట్లను జయరామిరెడ్డి, సంస్థ ఎండీ గిరిజాశంకర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా చైర్మన జయరామిరెడ్డి మాట్లాడుతూ నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భవానీ ఐలాండ్‌కు వచ్చే పర్యాటకులకు ఆనందం, ఆహ్లాదం, సంతోషం కలిగించేందుకు వాటర్‌ స్పోర్ట్స్‌ బోట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. దక్షిణ భారతదేశంలో అరుదుగా కనిపించే రకరకాల బోట్లను వాటర్‌ స్పోర్ట్స్‌ ఇండియా పున్నమి ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిందని, నవ్యాంధ్రప్రదేశలో ఈ వాటర్‌ స్పోర్ట్స్‌ ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి బోట్లను రానున్న రోజుల్లో మరికొన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గిరిజాశంకర్‌ మాట్లాడుతూ నవ్యాంధ్రలో యువతకు, పిల్లలకు కొత్తరకం ఆహ్లాదాన్ని అందించాని వినూత్నంగా వాటర్‌ స్పోర్ట్స్‌ని ప్రారంభించినట్టు తెలిపారు. వాటర్‌ స్పోర్ట్స్‌ సింపుల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తరుణ్‌కాకాని మాట్లాడుతూ వాటర్‌ స్పోర్ట్స్‌ బోటులు అత్యాధునిక టెక్నాలజీతో తయారైనవని, వీటితో ఆహ్లాదంతో పాటు భద్రతను దృష్టిలో పెట్టుకుని డిజైన చేసినట్టు చెప్పారు. సుశిక్షితులైనవారు ఈ వాటర్‌ స్పోర్ట్స్‌ బోట్లను నడుపుతారని, గజ ఈతగాళ్లు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటారని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఫౌండేషన సీఈఓ ఆర్‌.విజయ్‌కుమార్‌, సీఐఐ వైస్‌ చైర్మన జేఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, పర్యాటక వాటర్‌ స్పోర్ట్స్‌ జనరల్‌ మేనేజర్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...