Jump to content

Bapu - Ramana


raaz

Recommended Posts

నేడు ముళ్లపూడి వెంకటరమణ జయంతి..
 

తన రాతతో బాపు గీతకు బాష్యం చెప్పిన ఘనుడు ముళ్లపూడి వెంకటరమణ. ఈ మాటల ఊట జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, దర్శకుడు ముళ్లపూడి వర, తండ్రితో తనకున్న జ్ఞాపకాలను, అనుభవాలను నవ్యతో పంచుకున్నారు.
 
మా నాన్నతో యాభై ఏళ్ల గాఢానుబంధం నాది. చిన్నప్పటి నుంచి ఎన్నో అనుభవాలున్నాయి. ఆ సంఘటనలు జరిగినప్పటి కన్నా, ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటే కలిగే అనుభవం, అనుభూతి వెయ్యి రెట్లు ఎక్కువ. రచయితగా ఎంత ఒత్తిడిలో ఉన్నా, తన చుట్టూ జరిగే ప్రతి విషయం మీద ఆయన స్పందించేవారు. 
 
నాన్న హృదయం తెలిసింది...

1986లో మద్రాసులో భారీ వర్షాలతో మేమున్న వీధంతా జలమయమైంది. మా ఇల్లు ఎత్తులో ఉండటం వల్ల లోనికి నీళ్లు రాలేదు. వీధిలో సగానికిపైగా గుడిసెలు నీటమునిగాయి. నాన్న వాళ్లందరినీ మా ఇంట్లోకి వచ్చేయమన్నారు. సుమారు 40 మంది మూడు రోజుల పాటు మా ఇంట్లోనే ఆశ్రయం పొందారు. వారికి టీలు, కాఫీలు నాన్నే స్వయంగా అందించారు. వరదలు తగ్గాక వాళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మా ఇంటి వరండా అంతా బురదతో నిండిపోయింది. నాన్నే స్వయంగా అదంతా శుభ్రం చేయడానికి పూనుకున్నారు. ఆయన ముఖంలో కోపం కానీ, చికాకు కానీ కనిపించలేదు. ఎలా తెలిసిందో కానీ, ఆ గుడిసెల వాళ్లు బిలబిలమంటూ మళ్లీ మా ఇంటికి వచ్చేశారు. మన్నించమంటూ.. వరండా అంతా శుభ్రం చేసి వెళ్లిపోయారు. నాన్నగారి హృదయం ఏమిటో ఆ రోజు నాకు తెలిసింది.

 
ఆ నాలుగో ప్లేట్‌ ఎవరికి?

నాన్నకు గోదారంటే ప్రాణం. సినిమా కథల చర్చల కోసం తరుచూ రైళ్లో అటు వెళ్లేవారు. ఆ రోజుల్లో ఏసీ లయితే లేవు కాబట్టి, నలుగురు ఉండే వీలున్న ఫస్ట్‌క్లాస్‌ కోచ్‌ని బుక్‌ చేసుకునే వారు. బాపుగారు ఎప్పుడో అరుదుగా తప్ప వీరితో వెళ్లేవారు కాదు. నాన్న, శ్రీరమణ గారు, బాపుగారి కో డైరెక్టర్‌ కె.వి.రావు గారు ఈ ముగ్గురే ఎక్కువగా ప్రయాణం చేసేవారు. ముగ్గురే వెళ్లినా నాలుగు టికెట్లు తీసుకునేవారు. మందు తీసుకునే అలవాటు ఉండటం వల్ల ఆ నాలుగో వ్యక్తి ఎవరైనా తాగని వాళ్లయితే ఇబ్బందని నాలుగో టికెట్‌ తీసుకునేవారు. అంతేకాదు నాలుగు ప్లేట్‌లు, నాలుగు గ్లాసులు, నలుగురికి సరిపడా భోజనం ఓ బాక్స్‌లో పెట్టించేవారు. ఈ నాలుగో ఏర్పాటు ఎందుకంటే, ‘అనుకోకుండా ఎవరైనా టికెట్‌ లేకుండా తమ డబ్బాలోకి ఎక్కేస్తే, అతడు భోజనం తెచ్చుకోకపోతే..!’ అన్నది ఆయన సమాధానం. మొదట్లో వింతగా అనిపించినా, ఆ తర్వాత కాలంలో అది సరైనదేనని ఓ సందర్భంలో నాకు అర్థమైంది. ఓ సారి నేను రైలులో వెళ్తుంటే.. నేను రమణగారబ్బాయ్‌ అని తెలుసుకుని ఒకాయన నా డబ్బాలోకి వచ్చాడు. మూడేళ్ల క్రితం నాకు నాన్నగారితో కలిసి ప్రయాణం చేసే అవకాశం వచ్చిందని చెబుతూ, ఆ రోజు నిజంగానే నాకు భోజనం లేదు. ఆ మహానుభావుడే నాకు భోజనం పెట్టాడంటూ చేతులు పైకెత్తి నమస్కరించాడు. నాన్నగారు ఫుల్‌షర్ట్‌ వేసుకుని చేతులు కొంత వరకు మడిచేవారు. ఆ మడతలో డబ్బులుండేవి. ఎవరైనా వచ్చి ఇబ్బందుల్లో ఉన్నానని చెబితే ఆ మడతలో ఎంత ఉంటే అంత పదులు, వందలు, వేలు ఏమున్నా సరే లెక్కబెట్టకుండా మొత్తంగా ఇచ్చేవారు.


 
జీవితానికి దూరమై...
సాహిత్య రచన విషయంలోకి వస్తే నాన్నగారు ‘బుడుగు’ కానీ, ఇంకొకటి గానీ, 1964- 67 మధ్య కాలంలో రాసినవే. ఆ తర్వాత ఆయన రాయనే లేదు. నేను, చెల్లాయి మళ్లీ కథ లు రాయొచ్చు కదా అనేవాళ్లం. చాలా సార్లు సమాధానం ఇవ్వకుండా చిరునవ్వుతో దాటేసేవారు. ఒకసారి ‘ఒరే.. నేను నిజజీవితాన్ని చూడటం ఎప్పడో మానేశాను. ఇప్పుడు నేనున్నది మరో లోకం. అప్పుడు రాసినవన్నీ జీవితానుభవాల్లోంచి పుట్టుకొచ్చినవి. .ఇప్పుడు రాయాలంటే, నేను మళ్లీ ఆ జీవితంలోకి వెళ్లాలి. అది అయ్యే పని కాదు’ అన్నారు. ఊహించిన జీవితానికి, నిజ జీవితానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఒక్క మాటలో చెప్పేశారు.
 

ఇక్కడ ఉండలేదో...
నాన్న గారు సినిమాల్లోకి రావడం రావడమే విజయ దుందుభి మోగిస్తూ వచ్చారు. రచయితగా ఆయనకు బాగా పేరొచ్చింది. అయితే, బాపు- రమణలు స్వయంగా సినిమాలు తీయాలనుకున్నారు. చిత్రకల్పన బ్యానర్‌ కింద 1970 కాలంలో ‘సాక్షి’ తో మొదలెట్టి ఆ తర్వాత మరికొన్ని సినిమాలు తీశారు. మొత్తంగా 75 సినిమాల దాకా రచన చేస్తే అందులో 15 దాకా సొంత బ్యానర్‌లో చేసినవే. అయితే బయటి వాళ్లకోసం చేసిన సినిమాలు హిట్టయినంతగా సొంత సినిమాలు ఆడలేదు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పులు బాగా పెరిగిపోవడంతో ఇల్లు అమ్మేయాలనుకున్నారు. కాకపోతే, నాకు, చెల్లెలికి ఏమీ మిగిల్చలేకపోతున్నానే అంటూ చాలా బాధపడేవారు. ఇల్లు అమ్మే విషయం బాపు గారికి చెప్పలేదు. ఇల్లు అమ్మేశాక హైదరాబాద్‌లో ఉన్న నా దగ్గరకి వచ్చేయాలనుకున్నారు. విషయం తెలిసిన బాపు గారు తీవ్రమైన ఉద్విగ్నతకు లోనయ్యారు. ‘నువ్వు ఎక్కడికీ వెళ్లడానికి వీళ్లేదు. ఒకవేళ వెళ్లిపోతే ఇక్కడ నా శవమే మిగులుతుంది’ అంటూ వెంటనే తన ఇంట్లో మూడో వంతు భాగాన్ని నాన్న పేరిట రాసి ఇచ్చారు. అమ్మానాన్నలు అక్కడే ఉండిపోయారు. అమ్మ ఇప్పటికీ అక్కడే ఉంటోంది.


 
రమణ చెప్పేశాడ్రా...

బాపుగారి కుటుంబం పై పోర్షన్‌లో.. మేము కింది పోర్షన్‌లో ఉండేవాళ్లం. వారింట్లో ముగ్గురు పిల్లలు, మేమిద్దరం, మా బాబాయ్‌ కొడుకు. ఆరుగురం ఒకే చోట పెరిగాం. బాపు గారి పిల్లలకు మా నాన్నగారి వద్ద ఎక్కువ చనువుండేది. బాపు గారి దగ్గర మాకు చనువు ఎక్కువగా ఉండేది. ఏవైనా సమస్యలొచ్చినప్పుడు మేము బాపు గారికి చెప్పుకుంటే, వాళ్లేమో మా నాన్నకు చెప్పుకునే వారు. విభేదాలన్న మాటే లేదు. బాపుగారి అబ్బాయి ఓ తమిళ అమ్మాయిని ప్రేమించారు. కానీ తండ్రితో చెప్పాలంటే భయం. నాన్నతో చెప్పాడు. ‘నేను చెప్తాలే.. మీరు ఓసారి చెబితే మేలు’ అన్నారు. షూటింగ్‌ కోసం బాపుగారు రాజమండ్రిలో ఉన్నారు. నేను, అతను ఇద్దరం రాజమండ్రి వెళ్లాం. నాలుగురోజులైనా నోట మాట పెగలలేదు, చివరికి ధైర్యం చేసి విషయం చెప్పేశాడు. ఆ వెంటనే బాపు గారు ‘ఆ విషయం రమణ చెప్పేశాడ్రా .. చేసేసుకో’ అనేశారు. బాపు గారు ఆ పెళ్లికి ఒప్పుకోవడానికి ఆ అమ్మాయి పుట్టిన రోజు, నాన్న పుట్టిన రోజు ఒకటే కావడం బలమైన కారణం. నేను బాపుగారి తమ్ముడి కూతురుని పెళ్లి చేసుకున్నాను.


 
హడలిపోయాం...
ప్రాణస్నేహితులైనా.. వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగేవి. ’మిస్టర్‌ పెళ్లాం’ షూటింగ్‌ జరుగుతున్న రోజుల్లో జూబ్లీ హిల్స్‌‌లోని ఒక గెస్ట్‌ హౌజ్‌లో ఇద్దరూ ఉన్నారు. నేను కోడైరెక్టర్‌గా ఉన్న నా మిత్రుడు గాంధీ ఏదో పనిమీద బయటికి వెళ్లాం. తిరిగి వచ్చేసరికి ఇద్దరూ ఒకరి మీద ఒకరు బీభత్సంగా అరుచుకుంటున్నారు. లోపలికి వెళ్లాలంటేనే భయమేసింది. ఈ రోజుతో వీళ్ల ఫ్రెండ్‌షిప్‌ ముగిసింది అనుకున్నాం. ఏం చేయాలో తోచక అలా వెళ్లి రోడ్డు చివరన చాలాసేపు కూర్చుని వచ్చేసరికి ఇద్దరూ పడుకున్నారు. ఉదయాన్నే చూస్తే ఎదురెదురుగా కూర్చుని హాయిగా టిఫిన్‌ చేస్తున్నారు. ఈ చట్నీ వేసుకోవయ్యా బావుంది.. అని ఒకరంటే, ఇంకాసింత నెయ్యి వేసుకో సుబ్బరంగా ఉంటుంది. అని కొసిరి కొసిరి వడ్డించుకుంటున్నారు. అదీ వాళ్ల స్నేహం. అయితే మూడేళ్ల వ్యవధిలో ఇద్దరూ వెళ్లిపోయారు. వాళ్లిద్దరూ మళ్లీ ఈ లోకంలోకి వచ్చి మా కళ్లముందు కదలాడితే ఎంత బావుండునో అనిపిస్తుంది.
 
ఆ ఆశ తీరలేదు..
నేను దర్శకత్వం వహించే ఏ ఒక్క సినిమాకైనా నాన్నగారితో మాటలు రాయించుకో లేకపోయానన్న బాధొకటి నన్ను వేధిస్తూ ఉండిపోయింది. 2011లో ఒక సినిమాకి ఆ అవకాశం వచ్చింది. రవితేజ హీరోగా ఒక కథ అనుకుని ఈ సినిమాకు డైలాగులు నాన్నగారితో రాయించాలనుకున్నాను. అదే అడిగితే ‘నేనెక్కడ రాస్తానురా..’ అన్నారు. ‘మీరు రాయాల్సిందే’ అన్నాను. చివరకు ఒప్పుకున్నారు. నాన్నతో కలిసి పనిచేసే అవకాశం రావడంతో నేనంత థ్రిల్లింగ్‌గా ఫీలయ్యానో.. నాన్న కూడా నాతో చేయడాన్ని అంత థ్రిల్లింగ్‌గానూ ఫీలయ్యారు. హైదరాబాద్‌లో ఉంటున్న నేను ఫోన్లో రోజూ ఆ సినిమా గురించి ఏదో మాట్లాడుతూనే ఉన్నాను. ఆ రోజు కూడా రాత్రి చాలాసేపు మాట్లాడుకున్నాం. రాత్రి 2 గంటలకు నాన్నగారు పోయారని నాకు కాల్‌ వచ్చింది. నా కల తీరని వ్యథగా మారింది.

 

Link to comment
Share on other sites

Ashrutharpanam-Bapu Nivali Programme

 

https://youtu.be/4fxYrKizDIk

 

This video is in loving memory of Renowned Telugu filmmaker BAPU, an acclaimed artist, painter, cartoonist and illustrator. The programme was conducted on 11th September (Thursday)at 6.43 pm at Kalamandiram, Potti Sri Ramulu Telugu University, Nampally, Hyderabad, by Dr K I Varaprasad Reddy, Hyderabad

Link to comment
Share on other sites

eppudanna life llo bore kottinappudu Ramana gaaru raasina Kothi Kommachchi book series chaduvuthu unta.....repeated ga chadivina ekkada bore kottadhu......vaalla kastaalu, vaalla kanneellu, vaalla vijayaalu...vaalla apajayaalu.....vaatilni vaallu sportive ga theesukunna theeru adbutham....Ramana gari rachana saili adbutham....aayana extreme sense of humour ki navvukokunda undalem....jeevitham patla manam kaligi undaalsina drukpadhanni maarusthaadu aayana......Bapu - Ramana la sneham thara tharalaki oka adharsam....

Link to comment
Share on other sites

ASALA ALA UNDACHA ANI ANUKUNELA UNDI VALLA SNEHAM....PRATHI SARI CHADUVHTUNAPPUDU ALLA ANTHA SWACHAMAINA SNEHAM POSSIBLE AA AIPISTHUNDI....MANA THARAM UNANATHA KALA SNEHANIKI VALLE NIRVACHANAM.....

 

YSR - KVP ani gatham llo chepparu ga chandas sir...KEQkqP.gif

Link to comment
Share on other sites

ఇక్కడ ఉండలేదో...

నాన్న గారు సినిమాల్లోకి రావడం రావడమే విజయ దుందుభి మోగిస్తూ వచ్చారు. రచయితగా ఆయనకు బాగా పేరొచ్చింది. అయితే, బాపు- రమణలు స్వయంగా సినిమాలు తీయాలనుకున్నారు. చిత్రకల్పన బ్యానర్‌ కింద 1970 కాలంలో ‘సాక్షి’ తో మొదలెట్టి ఆ తర్వాత మరికొన్ని సినిమాలు తీశారు. మొత్తంగా 75 సినిమాల దాకా రచన చేస్తే అందులో 15 దాకా సొంత బ్యానర్‌లో చేసినవే. అయితే బయటి వాళ్లకోసం చేసిన సినిమాలు హిట్టయినంతగా సొంత సినిమాలు ఆడలేదు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పులు బాగా పెరిగిపోవడంతో ఇల్లు అమ్మేయాలనుకున్నారు. కాకపోతే, నాకు, చెల్లెలికి ఏమీ మిగిల్చలేకపోతున్నానే అంటూ చాలా బాధపడేవారు. ఇల్లు అమ్మే విషయం బాపు గారికి చెప్పలేదు. ఇల్లు అమ్మేశాక హైదరాబాద్‌లో ఉన్న నా దగ్గరకి వచ్చేయాలనుకున్నారు. విషయం తెలిసిన బాపు గారు తీవ్రమైన ఉద్విగ్నతకు లోనయ్యారు. ‘నువ్వు ఎక్కడికీ వెళ్లడానికి వీళ్లేదు. ఒకవేళ వెళ్లిపోతే ఇక్కడ నా శవమే మిగులుతుంది’ అంటూ వెంటనే తన ఇంట్లో మూడో వంతు భాగాన్ని నాన్న పేరిట రాసి ఇచ్చారు. అమ్మానాన్నలు అక్కడే ఉండిపోయారు. అమ్మ ఇప్పటికీ అక్కడే ఉంటోంది.

idi chaduvutunte kallallo neellu tirigaayi  :bawling:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...