Jump to content

Arunachalam


raaz

Recommended Posts

రంగంలోకి అరుణాచలం

తమిళనాడు జేడికి అదనపు బాధ్యతలు
లక్ష్మీనారాయణకన్నా మహామొండి!

చెన్నై, జూన్ 7: సీబీఐ ఆంధ్రప్రదేశ్ శాఖ జాయింట్ డైరెక్టర్‌గా తమిళనాడు ఐపీఎస్ అధికారి ఎస్.అరుణాచలం నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం తమిళనాడు సీబీఐ విభాగం జేడీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ప్రస్తుత జేడీ లక్ష్మీనారాయణ డిప్యుటేషన్ కాలం ముగుస్తుండటంతో ఆయన స్థానంలో అరుణాచలానికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 1993 ఐపీఎస్ కేడర్‌కు చెందిన అరుణాచలం అవినీతిపరులకు సింహస్వప్నంగా పేరుగాంచారు.

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆయన మొదట బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు. ఉపాధ్యాయుడైన తండ్రి ప్రభావంతో సివిల్స్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. భక్తిప్రపత్తులు అధికంగా ఉన్న అరుణాచలం.. ఎన్‌కౌంటర్లకు దూరంగా ఉంటారని పోలీసువర్గాలు చెబుతుంటాయి. ఆయనకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు చెన్నై, తంజావూరులలో ఎంబీబీఎస్ చేస్తుండగా, అమ్మాయి చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతోంది.
అవినీతికి ఆమడదూరం
అరుణాచలం అవినీతికి ఆమడదూరంలో ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఏ పనైనా సక్రమంగా జరగాల్సిందేనన్నది ఆయన అభిప్రాయం. అందుకే అత్యంత సన్నిహితులు సైతం ఆయన్ని సాయం కోరేందుకు జంకుతుంటారు. ఎవ్వరినీ లెక్క చేయరు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోపణలు ఎదుర్కొన్న ఓ కుంభకోణంలో ఆమెకు వ్యతిరేకంగా ఫైళ్లు కదిల్చేలా ఆయన్ని ప్రభావితం చేసేందుకు కొన్ని పెద్ద తలకాయలు ప్రయత్నించి మొట్టికాయలు తిన్నాయని రాజకీయవర్గాలు బహిరంగంగానే చెబుతుంటాయి.

ప్రస్తుతం 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా కూడా ఆయన చేతిలో ఎదురుదెబ్బలు తిన్నవారేనని సమాచారం.


నిరాడంబర జీవితం ఇరవయ్యేళ్లుగా ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నా ఆయన నిరాడంబరంగా ఉంటారు. ఇటీవలే ఆయన ఓ కారును కొనుగోలు చేశారు. పోలీసు జాగీరుతనానికి ఆయన వ్యతిరేకం. కార్యాలయ సిబ్బందిని ఇంటి పనికి ఉపయోగించుకోరని పోలీసువర్గాలు గర్వంగా చెబుతుంటాయి. తిరుమల ఆలయానికి వెళ్లిన ఆయన.. తన అధికారాన్ని ఉపయోగించకుండా, రూ.300 టిక్కెట్టుతో క్యూలో నిలబడి మరీ స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

జగన్ అక్రమాస్తులు, సత్యం స్కాం, ఓబుళాపురం గనులు, ఎమ్మార్ విల్లాల కుంభకోణాలను వెలికితీయడంలో తనదైన ముద్రవేసిన జేడీ లక్ష్మీనారాయణకన్నా అరుణాచలం మహామొండి అని, ఆయన అక్రమార్కులకు కొరకరానికొయ్యలాంటి వారని ఆయన గురించి తెలిసిన సన్నిహితులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఓ కేసు దర్యాప్తు కోసం విదేశాలకు వెళ్తున్న అరుణాచలం వారం తరువాత కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశముందని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.

 

Link to comment
Share on other sites

నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అందలేదు..... నేను కూడా మీడియా లోనే చూసా...

- జె డి లక్ష్మీ నారాయణ

Link to comment
Share on other sites

నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అందలేదు..... నేను కూడా మీడియా లోనే చూసా...

 

- జె డి లక్ష్మీ నారాయణ

haa.. ippude chusa..malli idemi twist oo..?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...