Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

rajanani

Today RK Kothapaluku highlights

Recommended Posts

తెలుగుదేశం పార్టీని వదిలి పెట్టకపోతే మీ ప్రాణాలకు హామీ ఇవ్వలేమని ఒక ఎమ్మెల్యేను బెదిరించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యాపారాలు, గనులు ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపైకి విజిలెన్స్‌ అధికారులను ఉసిగొల్పుతున్నారు. కిందిస్థాయి నాయకులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని ప్రయోగిస్తున్నారు.

ఆర్థిక శాఖకు చెందిన ఒక అధికారి సెలవుపై వెళ్లిపోవడానికి సమాయత్తం అవుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సైతం జనవరి తర్వాత తాను ఎమ్మెల్యేగా మాత్రమే ఉండాలనుకుంటున్నానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరుగుతోంది. ‘‘ఉద్యోగులకు జీతాలు చెల్లించిన తర్వాత మా శాఖ వద్ద రెండు లక్షల రూపాయలు ఉన్నాయి. మీ శాఖ వద్ద లక్ష మాత్రమే ఉంది. అంటే నీ కంటే నేనే రిచ్‌’’ అని ఒక శాఖ అధికారి మరో శాఖ అధికారిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆర్థిక వ్యవహారాలలో ఇదే ధోరణి కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడినా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదని ఒక సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు.

చంద్రబాబును తిట్టిపోసిన ప్రస్తుత అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఇప్పుడు సమర్థించడాన్ని దిగజారుడుతనం అని అనకుండా ఎలా ఉండగలం 

తాను పంచె కట్టుకుని తిరిగినంత మాత్రాన తెలుగు భాష– సంస్కృతి బతికిపోయినట్టేనని ఆయన భావిస్తున్నారేమో తెలియదు.
 

ఢిల్లీలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని పట్టుకుని హిందీ అకాడమీ అధ్యక్ష పదవిని పొందిన వైఎల్‌పీ.. నిన్నటివరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును తిట్టిపోసి.. జగన్మోహన్‌రెడ్డి వద్ద మార్కులు సంపాదించడం ద్వారా అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి పొందారు. ప్రెస్‌ డే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటున్నారని తెలిసి, ఆ కార్యక్రమానికి హాజరవ్వడానికి జగన్మోహన్‌రెడ్డి నిరాకరించిన విషయం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు తెలుసో? లేదో? 

Share this post


Link to post
Share on other sites
1 hour ago, kurnool NTR said:

Time will answer all the questions. These guys were paid artists and I want see when they are the victims. 

 

Share this post


Link to post
Share on other sites

Honestly ABN valla TDP ki 0 labham ...

Loss is huge ....

EEnadu, TV5 are far better in injecting content in better way ....

ABN overacting vall leniponin differences ekkuva awtunnai

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×