Jump to content

ఓడిన మోడీ.. పాకిస్తాన్‌ని లాగడమా.! దిగజారుడుతనానికి పరాకాష్ట.!


Npower

Recommended Posts

ఓడిన మోడీ.! December 17 , 2017 | UPDATED 20:37 IST 

గుజరాత్‌ ఎన్నికల్లో గెలుపు కోసం 'పాకిస్తాన్‌' సాయం.! 

కాంగ్రెస్‌పై విమర్శలకు పాకిస్తాన్‌ తప్ప ఇంకేమీ దొరకలేదా.? 

ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ ఇంత 'చిన్నతనం' ప్రదర్శించడమేమిటో.! 

ఆయన దేశానికి ప్రధాన మంత్రి. తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నప్పుడు, దానిపై చర్యలకు ఉపక్రమించే హక్కు, అధికారం రెండూ ఆయనకి రాజ్యాంగం కల్పించింది. పైగా, పొరుగుదేశంతో దేశంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ కుట్ర పన్నితే, అది దేశద్రోహమే. అలాంటి దేశద్రోహాన్ని ఆయన ఉపేక్షించడమంటే, పరోక్షంగా ఆయనా ఆ 'ద్రోహం'లో భాగం పంచుకున్నట్లే భావించాల్సి వస్తుంది. 

దేశ ప్రయోజనాల్ని పక్కన పెట్టి, ఎన్నికల అవసరాల కోసం ఆ దేశద్రోహాన్ని పబ్లిసిటీ స్టంట్‌గా వాడటమంటే, అంతకన్నా దారుణమైన విషయం ఇంకేముంటుంది.? దేశాన్ని విస్మయపరిచిందీ ఘటన. గుజరాత్‌ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్‌ పార్టీపై చేసిన ఆరోపణల్ని ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. ఎన్నికల్లో ఏదేదో మాట్లాడతారు, అన్నిటినీ పట్టించుకోకూడదని సరిపెట్టుకునే పరిస్థితి కాదిది. ఇది, దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. 

పాకిస్తాన్‌ని లాగడమా.! దిగజారుడుతనానికి పరాకాష్ట.! 

పొరుగుదేశం పాకిస్తాన్‌, భారతదేశంలోకి తీవ్రవాదాన్ని ఎగదోస్తోందన్నది జగమెరిగిన సత్యం. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ని ఎండగట్టేస్తున్నాం. సరిహద్దుల్లోకి పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదం చొచ్చుబడకుండా నిలువరించడానికి సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. సరిహద్దులకి ఆవలే తీవ్రవాదుల్ని మట్టుబెట్టేందుకోసం 'సర్జికల్‌ స్ట్రైక్స్‌' కూడా నిర్వహించాం. 

ఆ ఘనతని ప్రధాని నరేంద్రమోడీ, తన ఖాతాలో వేసుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? తీవ్రవాదాన్నే అంత పకడ్బందీగా నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, దేశంలో రాజకీయ అస్థిరత కోసం విదేశాలు ప్రయత్నిస్తోంటే, ఇంకెంత కఠినంగా వ్యవహరించాలి.? ఏదో అలవోకగా నరేంద్రమోడీ, తనకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో కుట్ర జరిగిందని చెప్పారుగానీ.. దేశ భద్రతకు సంబంధించి అది అత్యంత ప్రమాదకరమైన విషయమని ఆయన విస్మరించడం శోచనీయం. 

పాకిస్తాన్‌, మన దేశంలో అస్థిరతకు ప్రయత్నిస్తోందన్న మాటకంటే, ఆ అవకాశాన్ని పాకిస్తాన్‌కి మనం ఇస్తున్నామా.? అన్న ఆలోచనే దేశ ప్రజానీకాన్ని షాక్‌కి గురిచేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నోట ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని దేశ ప్రజానీకం కలలో కూడా అనుకుని వుండరు. 

గెలుపుపై అంత అనుమానమెందుకు.? 

22ఏళ్ళపాటు గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీనే అధికారంలో వుంది. ఈ ఎన్నికల్లో కూడా పరిస్థితులు భారతీయ జనతా పార్టీకే అనుకూలంగా వున్నాయని ముందస్తు సర్వేలు తేల్చి చెప్పాయి. ఆ లెక్కన కమలనాథులు, జస్ట్‌ మెజార్టీ గురించి మాత్రమే ఆలోచించి వుండాలి. అలాగే ఆలోచించి వుంటారు కూడా.! ఓ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ప్రధానికి ఏమొచ్చిందట.? అన్న ప్రశ్నకే మోడీ ఆస్కా రం ఇచ్చి వుండకూడదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోడీ ఇలాగే చేశారు.. 'అంతా నేనే' అన్న భావన కల్గించేందుకు ప్రయత్నించారు. 

ఇంతకు ముందు ఏ ప్రధాన మంత్రీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతలా 'గెలుపు' కోసం ఆరాటపడిన సందర్భాల్లేవు. ఢిల్లీ, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకే అంత హడావిడి చేసిన మోడీ, సొంత రాష్ట్రంగుజరాత్‌లో ఇంకెంత హడావిడి చేయాలి.? సరిగ్గా ఈ కోణంలోనే బహు శా ఆయన ఆలోచనలు కూడా సాగి వుంటాయి. అందుకే, హద్దులు దాటేశారు.. స్థాయిని మర్చిపోయారు. మంచి చెడుల విచక్షణను పక్కన పెట్టేశారు.. దేశం తన గురించి ఏమనుకుంటుందోనన్న బెరుకూ లేకుండా వ్యవహరించారు. 

ఎవరెస్టు శిఖరం నుంచి పాతాళానికి.. 

నరేంద్రమోడీ అంటే ఎవరెస్ట్‌ శిఖరం. 2014ఎన్నికల్లో ఆ స్థాయిలో ఆయన ఇమేజ్‌ పెరిగిపోయింది. పార్లమెంటుకి వెళుతూనే ప్రధాని అయిన ఘనతను దక్కించుకున్నారాయన. భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే అతి గొప్ప విజయాన్ని అందించిన ఘనత మోడీకే దక్కుతుంది. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ అత్యంత పాపులారిటీ పొందిన అతి కొద్దిమంది ప్రముఖుల్లో ఒకరిగా నరేంద్రమోడీ అతి తక్కువ కాలంలోనే ఎదిగారు. పెద్ద నోట్ల రద్దు అనే సంచలన నిర్ణయాన్ని ఆయన తీసుకోగలిగారంటే, అంత 'శక్తి' ఆయనకు తప్ప ఇంకెవరికీ లేదని దేశం నమ్మింది. దేశమే కాదు, ప్రపంచం కూడా నమ్మింది. 

ప్రపంచ దేశాలూ మోడీ సామర్ధ్యాన్ని కొనియాడాయి. కానీ, ఏమయ్యింది.? సొంత రాష్ట్రం గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా తన గెలుపు కోసం కాంగ్రెస్‌ పార్టీ మీద విమర్శలు చేయడానికి, ఆయన పాకిస్తాన్‌ పేరుని వాడుకున్నారు. అంతే, మోడీ ఇమేజ్‌ ఎవరెస్ట్‌ శిఖరం స్థాయి నుంచి పాతాళానికి పడిపోయింది. సర్వేలు బీజేపీకి అనుకూలంగా వున్నా, కాంగ్రెస్‌ గెలిచేస్తుందేమోనన్న భయమే ఆయనతో ఇలా మాట్లాడించిందా.? అయినాసరే, ఇది క్షమించరాని విషయం. 

మోడీ మీద ఆశలు పెట్టుకున్నవారందరికీ ఆయన మర్చిపోలేని షాక్‌ ఇచ్చారు. ఇది ముమ్మాటికీ నిజం. గుజరాత్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలొచ్చాయి. అన్నిట్లోనూ బీజేపీ గెలుపుకి అనుకూలంగానే జనం తీర్పు వుండబోతోందని తేలింది. ఆ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలే వాస్తవ ఫలితాల్లోనూ ప్రతిబింబిస్తే, బీజేపీకీ, నరేంద్రమోడీకి ఇంకో గెలుపు దక్కినట్లే. కానీ, నైతిక విలువల పరంగా నరేంద్రమోడీ ఓడిపోయారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలుండవ్‌.

Link to comment
Share on other sites

Uncle... ee para ki aa title ki sambadham ento set kaledu anukunta

 

పాకిస్తాన్‌ని లాగడమా.! దిగజారుడుతనానికి పరాకాష్ట.! 

పొరుగుదేశం పాకిస్తాన్‌, భారతదేశంలోకి తీవ్రవాదాన్ని ఎగదోస్తోందన్నది జగమెరిగిన సత్యం. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ని ఎండగట్టేస్తున్నాం. సరిహద్దుల్లోకి పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదం చొచ్చుబడకుండా నిలువరించడానికి సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. సరిహద్దులకి ఆవలే తీవ్రవాదుల్ని మట్టుబెట్టేందుకోసం 'సర్జికల్‌ స్ట్రైక్స్‌' కూడా నిర్వహించాం. 

ఆ ఘనతని ప్రధాని నరేంద్రమోడీ, తన ఖాతాలో వేసుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? తీవ్రవాదాన్నే అంత పకడ్బందీగా నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, దేశంలో రాజకీయ అస్థిరత కోసం విదేశాలు ప్రయత్నిస్తోంటే, ఇంకెంత కఠినంగా వ్యవహరించాలి.? ఏదో అలవోకగా నరేంద్రమోడీ, తనకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో కుట్ర జరిగిందని చెప్పారుగానీ.. దేశ భద్రతకు సంబంధించి అది అత్యంత ప్రమాదకరమైన విషయమని ఆయన విస్మరించడం శోచనీయం. 

పాకిస్తాన్‌, మన దేశంలో అస్థిరతకు ప్రయత్నిస్తోందన్న మాటకంటే, ఆ అవకాశాన్ని పాకిస్తాన్‌కి మనం ఇస్తున్నామా.? అన్న ఆలోచనే దేశ ప్రజానీకాన్ని షాక్‌కి గురిచేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నోట ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని దేశ ప్రజానీకం కలలో కూడా అనుకుని వుండరు. 

 

పాకిస్తాన్‌ని లాగడమా.! ante pakistan innocent, anavasaram ga politics lo ki laguthunnaru ane meaning vastondi... who ever wrote the article!

Link to comment
Share on other sites

+1 for Modi

Union Cabinet clears triple talaq bill

 
TIMESOFINDIA.COM | Updated: Dec 15, 2017, 16:17 IST
crown.png
5
 
 
 
 
 
Union Cabinet clears triple talaq bill
NEW DELHI: Union Cabinettoday cleared the Muslim Women (Protection of Rights on Marriage) Bill, 2017, to make the practice of "instant" triple talaq an offence.

According to the draft bill sent out to states earlier this month, it was proposed that triple talaq be made a cognisable and non-bailable offence that would attract a jail term of three years.

The draft law was prepared in the backdrop of the August 22 verdict of the Supreme Court striking down the practice of "instant" triple talaq as illegal. The draft law was sent to states for their views on December 1and they were asked to reply by December 10. The government's justification for the law stems from the fact that there have been reports of several divorces by way of talaq-e-bidat despite the SC verdict.

Assam, Jharkhand, Madhya Pradesh, Maharashtra, Manipur, Uttar Pradesh and Uttarakhand have written back to say that they support the draft legislation.
 


The draft law was prepared by an inter-ministerial group headed by home minister Rajnath Singh. The other members include external affairs minister Sushma Swaraj, finance minister Arun Jaitley, law minister Ravi Shankar Prasad and his junior in the ministry P P Chaudhary.

According to the proposed law, a victim of instant divorce can seek the custody of her minor children as well as maintenance from her husband by approaching a magistrate after registering a complaint with police. Under the law, triple talaq in any form — spoken, in writing or by electronic means such as email, SMS or WhatsApp — would be banned.

 

source: TimesofIndia

https://timesofindia.indiatimes.com/india/union-cabinet-clears-triple-talaq-bill/articleshow/62082295.cms

Link to comment
Share on other sites

6 hours ago, chanti149 said:

Uncle...cabinet approved triple talaq bill...

 

Oka ted eyochu ga adi...congratulating central govt. muslim women...that they succeded in their fight against it...!!

E okka statement meeda rojuki oka ted veyatam kante adi better...!!

Modi..:youth:

 

Only instant triple talaq, Triple talaq will continue... Still small victory

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...