Jump to content

Vykuntapuram Barrage


sonykongara

Recommended Posts

అమరావతి దాహార్తి తీర్చేందుకు మరో బ్యారేజి
వైకుంఠపురం పాలనామోదానికి ఏర్పాట్లు
10 టీఎంసీల నిల్వ, రూ.2420 కోట్ల అంచనా వ్యయం
ఆర్థికశాఖకు చేరిన ఫైలు
ఈనాడు - అమరావతి
10ap-main8a.jpg

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి తాగునీటి అవసరాలు తీర్చేలా...2050 వరకు ఈ నగరంలో నివసించే ప్రజల దాహార్తి తీర్చే ఉద్దేశంతో కృష్ణా నదిపై మరో బ్యారేజి నిర్మాణానికి రంగం సిద్ధమయింది. గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామాల మధ్య కృష్ణా నదిపై ఈ బ్యారేజి నిర్మించనున్నారు. కృష్ణా డెల్టా వ్యవస్థ చీఫ్‌ ఇంజినీర్‌ రూ.2420.68 కోట్ల అంచనా వ్యయంతో జలవనరులశాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ పరిశీలన, ఆమోదం అనంతరం ఈ ఫైలును ఆర్థికశాఖ ఆమోదానికి పంపారు. ఇప్పటికే ఈ బ్యారేజి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా ఆమోదం ఉంది. ఆర్థికశాఖ ఆమోదం అనంతరం ఈ వారంలో లేదా, వచ్చే వారంలో జలవనరులశాఖ పాలనామోదం ఇవ్వనుంది. ఆ వెంటనే టెండర్లు పిలిచి గుత్తేదారును ఖరారు చేసి పనులు ప్రారంభించే ఆలోచనతో జలవనరులశాఖ ఉంది. ఈ బ్యారేజి నిర్మాణానికి రెండేళ్ల సమయంపడుతుందని చెబుతున్నారు.

30 లక్షల జనభా అంచనాతో..
పులిచింతల ప్రాజెక్టుకు దిగువన, ప్రకాశం బ్యారేజికి ఎగువన ఈ కొత్త బ్యారేజి నిర్మాణం జరగనుంది. 2050 నాటికి రాజధాని అమరావతి ప్రాంత జనాభా 30 లక్షలకు చేరుతుందని, వారి తాగునీటి అవసరాలు తీర్చేందుకు 10 టీఎంసీల నీరు అవసరమవుతుందని లెక్కించి దీని నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. పులిచింతలకు దిగువన ప్రకాశం బ్యారేజికి ఎగువన కురిసే వర్షాలు, వాగులు వంకల నుంచి భారీ వర్షాల సమయంలో వృధాఅవుతున్న నీటిని ఈ బ్యారేజిలో ఒడిసిపట్టే అవకాశం ఉంది.
బ్యారేజి నిర్మాణ ప్రాంతంలో కృష్ణానది దాదాపు 3 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. ఇక్కడ స్పిల్‌ వే 1250 మీటర్లు మేర నిర్మిస్తారు. మిగిలిన 1809 మీటర్లకు మట్టితో టై బండ్‌ నిర్మిస్తారు. నేవిగేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.
స్పిల్‌ వే మార్గంలో 55 గేట్లు ఏర్పాటు చేస్తారు. అది కాక స్లూయిస్‌ మార్గంలో మరో 14 గేట్లు ఉంటాయి. ఇది ప్రకాశం బ్యారేజి కన్నా వెడల్పు ఎక్కువగా ఉంటుంది.
2009, అంతకుముందు 1903 సంవత్సరాల్లో కృష్ణానదికి గరిష్ఠ వరద వచ్చింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి తట్టుకునేలా ఈ బ్యారేజి నిర్మాణం చేపడుతున్నారు.
నది కట్టల ఎత్తును కూడా అటూ ఇటూ పెంచుతారు. భూసేకరణకే రూ.770.74 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
కృష్ణానది మధ్యలో 8 లంకలు ఈ బ్యారేజినిర్మాణంతోమునుగుతాయి.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • Replies 235
  • Created
  • Last Reply

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశలో మరో ప్యాకేజి, వెలిగొండ టన్నెళ్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ వేగవంతమయింది. మరో వైపు వైకుంఠపురం బ్యారేజికి కొద్ది రోజుల్లోనే పాలనామోదం రానుంది. గోదావరి పెన్నా తొలిదశ పట్టాలు ఎక్కబోతోంది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
జూన్‌లో వైకుంఠపురం బ్యారేజీ పనులు: మంత్రి దేవినేని
18-05-2018 12:39:39
 
విజయవాడ: ప్రకాశం బ్యారేజికి ఎగువన వైకుంఠపురం బ్యారేజీని నిర్మిస్తామని మంత్రిదేవినేని ఉమమహేశ్వరరావు తెలిపారు. బ్యారేజీ డీపీఆర్‌ సిద్ధంగా ఉందని, జూన్‌లో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. జూన్ నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. ఆగస్టులో లక్ష మంది రైతులతో గ్యాలరీ వాక్ చేపడతామని తెలిపారు. నవంబర్‌లో గేట్ల నిర్మాణం చేపట్టి మార్చి నాటికి పూర్తి చేస్తామని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
కృష్ణా నదిపై నూతన బ్యారేజీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
08-06-2018 15:18:45
 
636640679338393048.jpg
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణానదిపై నూతన బ్యారేజీ నిర్మాణానికి రూ.2,169 కోట్ల పాలనా పరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీకి పైన 23 కి.మీ దూరంలో వైకుంఠపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. నూతన రాజధానికి నీటి సరఫరా కోసం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Link to comment
Share on other sites

కృష్ణా నది పై మరో బ్యారేజీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఈ నెలలోనే టెండర్లు...

Super User
08 June 2018
Hits: 2
 
barrage-08062018.jpg
share.png

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి తాగునీటి అవసరాలు తీర్చేలా...2050 వరకు ఈ నగరంలో నివసించే ప్రజల దాహార్తి తీర్చే ఉద్దేశంతో కృష్ణా నదిపై మరో బ్యారేజి నిర్మాణానికి రంగం సిద్ధమయింది. గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామాల మధ్య కృష్ణా నదిపై ఈ బ్యారేజి నిర్మించనున్నారు. కృష్ణా డెల్టా వ్యవస్థ చీఫ్‌ ఇంజినీర్‌ రూ.2420.68 కోట్ల అంచనా వ్యయంతో జలవనరులశాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ పరిశీలన, ఆమోదం అనంతరం ఈ ఫైలును ఆర్థికశాఖ ఆమోదానికి పంపారు. దీనిని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.

 

barrage 08062018 2

కృష్ణానదిపై నూతన బ్యారేజీ నిర్మాణానికి రూ.2,169 కోట్ల పాలనా పరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీకి పైన 23 కి.మీ దూరంలో వైకుంఠపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. త్వరలోనే దీని కోసం టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించనున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు దిగువన, ప్రకాశం బ్యారేజికి ఎగువన ఈ కొత్త బ్యారేజి నిర్మాణం జరగనుంది. 2050 నాటికి రాజధాని అమరావతి ప్రాంత జనాభా 30 లక్షలకు చేరుతుందని, వారి తాగునీటి అవసరాలు తీర్చేందుకు 10 టీఎంసీల నీరు అవసరమవుతుందని లెక్కించి దీని నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. పులిచింతలకు దిగువన ప్రకాశం బ్యారేజికి ఎగువన కురిసే వర్షాలు, వాగులు వంకల నుంచి భారీ వర్షాల సమయంలో వృధాఅవుతున్న నీటిని ఈ బ్యారేజిలో ఒడిసిపట్టే అవకాశం ఉంది.

barrage 08062018 3

బ్యారేజి నిర్మాణ ప్రాంతంలో కృష్ణానది దాదాపు 3 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. ఇక్కడ స్పిల్‌ వే 1250 మీటర్లు మేర నిర్మిస్తారు. మిగిలిన 1809 మీటర్లకు మట్టితో టై బండ్‌ నిర్మిస్తారు. నేవిగేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. స్పిల్‌ వే మార్గంలో 55 గేట్లు ఏర్పాటు చేస్తారు. అది కాక స్లూయిస్‌ మార్గంలో మరో 14 గేట్లు ఉంటాయి. ఇది ప్రకాశం బ్యారేజి కన్నా వెడల్పు ఎక్కువగా ఉంటుంది. 2009, అంతకుముందు 1903 సంవత్సరాల్లో కృష్ణానదికి గరిష్ఠ వరద వచ్చింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి తట్టుకునేలా ఈ బ్యారేజి నిర్మాణం చేపడుతున్నారు. నది కట్టల ఎత్తును కూడా అటూ ఇటూ పెంచుతారు. భూసేకరణకే రూ.770.74 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

Link to comment
Share on other sites

బ్యారేజీల నిర్మాణానికి సన్నాహాలు 
వైకుంఠపురానికి రూ.2169 కోట్లతో   పాలనామోదం 
చోడవరానికి రూ.600 కోట్ల అంచనా

ఈనాడు-అమరావతి: కృష్ణా నదిపై మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి కసరత్తు వేగవంతమయింది. ప్రస్తుత ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వద్ద ఒక బ్యారేజీ, దిగువన చోడవరం సమీపంలో మరో బ్యారేజీ నిర్మించనున్నారు. వైకుంఠపురం బ్యారేజీ రాజధాని అమరావతి తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు పులిచింతల దిగువన ఉత్పత్తయ్యే కృష్ణా జలాలు సముద్రంలో వృథా కాకుండా నిల్వ చేస్తుంది. బ్యారేజీ నిర్మాణానికి రూ.2247.57 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. రూ.2169 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణానికి జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ శుక్రవారం పాలనామోదం ఇచ్చారు. టెండర్లు పిలిచి గుత్తేదారును ఖరారు చేసి పనులు అప్పగించడమే తరువాయి. 
* ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం బ్యారేజీ ఉంటుంది. దీనిలో పది టీఎంసీల నీరు నిల్వ చేస్తారు. 
* అంచనాల్లో పేర్కొన్న ధరలకు, నిబంధనలకు సాంకేతికంగా మంజూరు ఇచ్చే అధికారి బాధ్యుడిగా పేర్కొంటూ ఈ ఉత్తర్వులిచ్చారు. మెకానికల్‌ పనులకు సంబంధించి జలవనరుల శాఖలోని మెకానికల్‌ విభాగం పర్యవేక్షిస్తుందని ప్రస్తావించారు. 
* బడ్జెట్‌లో దీనికి కేటాయింపులు లేనందున తొలుత ఆర్థిక శాఖ అభ్యంతరాలు చెప్పినా.. ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా తక్షణమే చేపట్టాలని పేర్కొనడంతో ఆమోదం సాధ్యమయింది.

రూ600 కోట్లతో మరో బ్యారేజీ 
ఇదే సమయంలో ప్రకాశం బ్యారేజీకి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో చోడవరం గ్రామం వద్ద కృష్ణాపై బ్యారేజీని నిర్మించనున్నారు. దీనికోసం అధికారులు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపారు. 2.7 టీఎంసీల నీటి నిల్వతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఎనిమిది మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కారం, 17వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను ఉద్దేశించారు. సమీపంలో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. దీని నిర్మాణానికి 55 హెక్టార్ల భూసేకరణ కూడా అవసరం. ఈ ప్రతిపాదన జలవనరుల శాఖ నుంచి ఆర్థిక శాఖకు వెళ్లింది. అక్కడ అనుమతి లభించాక పాలనామోదం ఇవ్వనున్నారు.

Link to comment
Share on other sites

వైకుంఠవరమే...
కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణానికి¨ నిధులు
రూ.2169 కోట్ల పరిపాలన అనుమతులు
రాజధాని ప్రాంతానికి తాగునీటి సరఫరా
10 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా నిర్మాణం
ఈనాడు-అమరావతి
amr-top1a.jpg
కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద 10టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణంతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం తాగునీటి అవసరాలు తీర్చడంతోపాటు ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందనుంది. కృష్ణానది ఉత్తరవాహినిగా వైకుంఠపురం వద్ద ప్రవహిస్తోంది. తొలి ఏకాదశి వద్ద భక్తులు ఇక్కడ పవ్రిత పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కొండపై వెంకటేశ్వరుడు స్వయంభువుగా వెలవడం, కృష్ణానది  ఉత్తరవాహినిగా ప్రవహిస్తుండటంతో ఈప్రాంతం ఆధ్యాత్మికంగా ప్రత్యేకత కలిగింది. వైకుంఠపురం కొండ వరకు బ్యారేజీ నిర్మించడంతో కొండపై ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం అభివృద్ధి వేగవంతమవుతుంది. పర్యటకంగా, ఆధ్యాత్మికంగా, రవాణాపరంగా ఈప్రాంతం కీలకం కావడం, బ్యారేజీ నిర్మాణానికి సహజసిద్ధంగా అనుకూలంగా ఉండటంతో ఇక్కడ బ్యారేజీ నిర్మాణం చేపడుతున్నారు. గుంటూరు- కృష్ణా జిల్లాల నడుమ రాకపోకలతోపాటు హైదరాబాద్‌ నుంచి అమరావతి వచ్చేవారికి బ్యారేజీ మార్గం ఉపయుక్తంగా ఉంటుంది. బ్యారేజీకి ఆకృతులు రూపొందించి వారం రోజుల్లో పనులకు టెండర్లు పిలవడానికి జలవనరులశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

బ్యారేజీ నిర్మాణంతో ప్రగతి
గుంటూరు జిల్లా అమరావతి మండలంలో వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై బ్యారేజీని నిర్మిస్తున్నారు. బ్యారేజీ నిర్మాణంతో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం బ్యారేజీ నిర్మిస్తున్నారు. ప్రకాశంబ్యారేజీలో నీరు నిల్వచేసినప్పుడు వైకుంఠపురం వరకు నీరు నిలుస్తోంది. ఇక్కడ బ్యారేజీ నిర్మిస్తే ఎగువ ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల మేర నీరు నిలుస్తుంది. గుంటూరుజిల్లా వైపు భూభాగం మొత్తం పెదకూరపాడు నియోజకవర్గంలో ఉంటుంది. దీంతో ఈప్రాంతం మొత్తం భూగర్భజలాలు అభివృద్ధి  చెందడంతోపాటు నీటిలభ్యత పెరుగుతుంది. అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మండలాల్లో సాగర్‌ కాలువల నీరు చివరి ఆయకట్టుకు సక్రమంగా అందక సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ఇక్కడ బ్యారేజీ నిర్మిస్తే నీటిలభ్యత పెరగనుంది. ఇక్కడే కొన్ని ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో పెదకూరపాడు నియోజకవర్గానికి బ్యారేజీ నిర్మాణం వరంగా మారనుంది. నిర్మాణంలో భాగంగా కొంత భూభాగం కోల్పోయిన మిగిలిన ప్రాంతానికి లబ్ధి చేకూరుతుంది. కృష్ణా జిల్లా వైపు నుంచి నేరుగా వైకుంఠపురం చేరుకోవడానికి రవాణాసౌకర్యాలు మెరుగుపడతాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చేవారు విజయవాడ వెళ్లకుండానే బ్యారేజీ ద్వారా అమరావతి నగరానికి చేరుకోవచ్చు. 10 టీఎంసీలు నీరు నిల్వచేయడంతో చేపలు పెంపకం, బోటింగ్‌, నది ఒడ్డున రిసార్టులు, అతిథిగృహాల ద్వారా ప్రగతి సాధ్యమవుతుంది. దీనిద్వారా ఈప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

రూ.2169కోట్లతో బ్యారేజీ నిర్మాణం
వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి మొత్తం రూ.2169కోట్లు వెచ్చిస్తున్నారు. ఇందులో భూసేకరణకు రూ.771కోట్లు కేటాయించారు. బ్యారేజీ నిర్మాణ పనులకు రూ.1088కోట్లు, నావిగేషన్‌ పనులకు రూ.88కోట్లు, భవనాల నిర్మాణానికి రూ.11కోట్లు ఖర్చుచేస్తారు. ఇంకా రహదారుల నిర్మాణం, మట్టి పని, సిమెంట్‌ లైనింగ్‌, బ్యారేజీ నిర్మాణంలో కోల్పోయే అటవీప్రాంతానికి ప్రత్యామ్నాయంగా మొక్కలు పెంపకానికి, సమాచార వ్యవస్థ ఏర్పాటు, ఇతర పనులకు నిధులు కేటాయించారు. బ్యారేజీ నిర్మాణంతో 10టీఎంసీలు నిల్వచేయడం వల్ల ప్రకాశంబ్యారేజీలో నీటిలభ్యత లేనప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నీటిఅవసరాలకు వీటిని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ప్రకాశంబ్యారేజీకి గోదావరి జలాలు తీసుకువచ్చి డెల్టాకు వాడుకుంటున్నాం. ఈక్రమంలో పులిచింతల ప్రాజెక్టు-ప్రకాశంబ్యారేజీ మధ్య కృష్ణానది పరివాహక ప్రాంతంలో వచ్చే వరదనీటిని వైకుంఠపురం బ్యారేజీలో నిల్వచేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటివరకు పులిచింతల- ప్రకాశంబ్యారేజీ నడుమ వచ్చే వరదనీటిని 2.61 టీఎంసీలకు మించి నిల్వచేసే అవకాశం లేకపోవడంతో ప్రకాశంబ్యారేజీ నుంచి దిగువకు వదిలేస్తున్నాం. వైకుంఠపురం బ్యారేజీ అందుబాటులోకి వస్తే 10టీఎంసీల నీటిని నిల్వచేసుకుని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవచ్చు.

ఆధ్యాత్మికంగా కీలకం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి సమీపంలోనే వైకుంఠపురం బ్యారేజీ నిర్మిస్తున్నారు. వైకుంఠపురం కొండపై వెంకటేశ్వరస్వామి స్వయంభువుగా వెలిశారు. వెంకటేశ్వరుడి వైభవం వల్లే ఈప్రాంతానికి వైకుంఠపురం పేరు వచ్చింది. 1650 సంవత్సరంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఈప్రాంతానికి జమిందారుగా ఉంటూ పరిపాలనా చేసేవారు. ఈప్రాంతానికి బంధారావూరు అనే పేరు ఉండేది. ఈక్రమంలో కొండమీద వెంకటేశ్వరస్వామికి నిత్యం వేదపారాయణము, నిత్యసేవా కార్యక్రమాలు 650 మంది వైష్ణవస్వాములచే నిర్వహించడాన్ని జమిందారు చూసి కలియుగ వైకుంఠంలాగా వెలుగొందుతోందని గుర్తించి వైకుంఠపురం అని నామకరణం చేశారు. అప్పటినుంచి వైకుంఠంపురంగాఈప్రాంతం ప్రసిద్ధి చెందింది. కాశీ క్షేత్రంలో గంగానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. అలాగే కాశీక్షేత్రంలో ఒకే రాతిపై ఐదు శివలింగాలుంటాయి. ఇక్కడ కృష్ణానదిలో 5 శివలింగాలు ఉండటం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉండటంతోపాటు అమరావతి సమీపంలో ఉండటంతో రూ.100కోట్లతో అభివృద్ధి చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకువచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఇక్కడి ఆలయం అభివృద్ధి చేస్తామని గతంలోనే ప్రకటించారు. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణంతో పెదకూరపాడు నియోజకవర్గం ప్రజల కల నెరవేరుతుందని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ‘ఈనాడు’కు తెలిపారు. బ్యారేజీ నిర్మాణంతో సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు.

 
 
 

 

 
Link to comment
Share on other sites

రాజధానికి నిండు కుండ
09-06-2018 09:46:41
 
636641344099327055.jpg
  • వైకుంఠపురం బ్యారేజి నిర్మాణానికి అడుగులు
  • ప్రజా రాజధానిలో నీటి వనరులకు ఢోకా లేదు!
  • పశ్చిమ కృష్ణాకు జల ‘సిరి’
  • రాష్ట్రంలో నాలుగో ఆనకట్టగా...
  • రామలింగేశ్వరనగర్‌ వద్ద మరో రబ్బరుడ్యామ్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు
ప్రజా రాజధానిగా అమరావతిని నిలపాలన్న కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నివశించే ప్రజలు ఆనందంగా ఉండటానికి అవసరమైన పరిస్థితులు కల్పించాలని నిర్ణయించింది. కృష్ణానదిపై కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దున ఉన్న ప్రకాశం బ్యారేజీ నుంచి 23 కిలోమీటర్ల ఎగువన వైకుంఠపురం దగ్గర బ్యారేజీ నిర్మించటం ద్వారా రాజధాని నీటి అవసరాలను సమృద్ధిగా తీర్చవచ్చని జల వనరుల శాఖ సూచించింది. దీనికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
 
విజయవాడ(ఆంధ్రజ్యోతి): రాజధాని తాగునీటి అవసరాలు తీర్చటానికి దోహదపడే వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి తొలి అడుగుపడింది. భవిష్యత్తులో రాజధాని ప్రాంతవాసులకు ఇక తాగునీటికి ఢోకా లేదు. పశ్చిమ కృష్ణా జల‘సిరి’గా మారనుంది. జలవనరుల శాఖ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వటంతో బ్యారేజీ నిర్మాణానికి వేగంగా అడుగులు పడబోతున్నాయి. వారం రోజులలో డ్రాయింగ్స్‌, డిజైన్లు ఫైనల్‌ చేసి క్వాంటిటీ కూడా చూసుకుని టెండర్ల ప్రక్రియకు వెళ్ళటానికి జలవనరుల శాఖ కృష్ణాడెల్టా ఇంజనీరింగ్‌ అధికారులు రంగం సిద్ధం చేయబోతున్నారు. అన్నీ అనుకూలిస్తే మరో రెండు, మూడు నెలల్లో పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. నవ్యాంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధానికి మణిహారంగా ఈ బ్యారేజీ నిలవనుంది.
 
 
అమరావతి అంటే భయం ఉన్న పరిస్థితిని తప్పించటానికి, అమరావతిని జీవన నగరంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం రెండు అంశాలపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముందుగా వరదముంపు ప్రభావితంగా ఉన్న కొండవీడు వాగు ముంపు సమస్యను శాశ్వితంగా పరిష్కరించటానికి కోట్లాది రూపాయల వ్యయంతో పనులు చేపడుతోంది. చరిత్రలో కృష్ణాకు వచ్చిన వరదలు, సగటు వర్షపాతాన్ని లెక్కలోకి తీసుకుని రాజధానికి వరదముంపు లే కుండా పనులు చేపడుతోంది. ప్రజా రాజధానిలో ఉండేవారికి మంచినీటి వనరులు పుష్కలంగా ఉండాలన్న రెండవ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ముందు చూపు ఆలోచనల ఫలితంగా వైకుంఠపురం బ్యారేజీ ఆవిష్కృతం కాబోతోంది. కృష్ణానదిపై విజయవాడ, గుంటూరు జిల్లాల సరిహద్దున ఉన్న ప్రకాశం బ్యారేజీ నుంచి 23 కిలోమీటర్ల ఎగువున వైకుంఠపురం దగ్గర బ్యారేజీ నిర్మించటం ద్వారా రాజధాని నీటి అవసరాలను సమృద్ధిగా తీర్చవచ్చన్నది జలవనరుల శాఖ అధికారుల విశ్లేషణగా ఉంది. రాజధానికి నీటి వనరులను తీసుకువెళ్ళాలంటే ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా కెనాల్‌, గుంటూరు చానల్‌ మీదుగా నీటిని మళ్ళించాల్సి ఉంటుంది. దిగువ ప్రాంతం నుంచి ఎగువకు పారించటం కంటే, ఎగువప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి పారించటం చాలా సులభం. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు వైకుంఠపురం దగ్గర బ్యారేజీని ప్రతిపాదించారు. దీంతో పాటు ప్రకాశం బ్యారేజీ దిగువన నీటి వనరులను నిల్వ చేయటానికి రామలింగేశ్వరనగర్‌ దగ్గర మరో రబ్బరు డ్యామ్‌ నిర్మాణానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానికి అవసరమైన నీటి వనరుల కోసం వైకుంఠపురం బ్యారేజీ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
 
 
రాష్ట్రంలో నాలుగో ఆనకట్టగా...
వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం చేపట్టడం ద్వారా నవ్యాంధ్రప్రదేశ్‌లో కృష్ణానదిపై ఇది నాల్గవ ఆనకట్టగా అవుతుంది. విభ జన త ర్వాత మన రా ష్ట్రంలో శ్రీ శైలం ప్రాజెక్టు మొదటిది. రెండవది సాగర్‌ పులిచింతల ప్రాజెక్టు మూడవది ప్రకాశం బ్యారేజీ. నాల్గవదిగా వైకుంఠపురం బ్యారేజీ నిలుస్తుంది. కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైల ప్రాజెక్టు 178.74 టీఎంసీల సామర్ధ్యం కలిగి ఉంది. ఇక్కడి నుంచి 260 కిలోమీటర్ల దూరంలో కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల సరిహద్దున పులిచింతల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పారుతుంది. సాగర్‌ పులిచింతల ప్రాజెక్టును 45 టీఎంసీల నీటిని నిల్వ చేయగల సామర్ధ్యంతో నిర్మించటం జరిగింది. ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల మేర ప్రయాణించే కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజికి చేరుతుంది. ప్రస్తుత తెలంగాణా జిల్లాలో కృష్ణానదిపై సాగర్‌ డ్యామ్‌ (180 అడుగుల ఎత్తు) నుంచి నీటిని వదిలితే 12 టీఎంసీల సామర్ధ్యం కలిగిన జూరాల ప్రాజెక్టుకు చేరుతుంది. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తితే శ్రీశైలం రిజర్వాయర్‌కు కృష్ణాజలాలు వస్తాయి.
 
 
తక్కువ వ్యయప్రయాసలు
వైకుంఠపురం దగ్గర బ్యారేజీ ఏర్పాటు చేయటం తక్కువ ప్రయాసలతో కూడుకున్న విషయం. భూ సేకకరణ పెద్దగా జరపాల్సిన పనిలేదు. పునరావాసం కల్పించాల్సిన అంతగా అవసరం లేదు. సహజంగా విస్తరించిన కొండసాణువులు ఒకవైపు బలంగా కృష్ణమ్మ ఉప్పొంగకుండా అడ్డుకుంటుంది. ఈ కొండ సాణువులకు అనుసంధానంగా వైకుంఠపురం బ్యారేజీ ప్రతిపాదన ఉంది. కంచికచర్ల, ఇబ్రహీంపట్నం మధ్య ప్రాంతంలో వైకుంఠపురం బ్యారేజీ ఏర్పడనుంది. ఇక్కడ కృష్ణా ఉత్తర వాహినిగా ఉండటం వల్ల నీటి పారుదల ఎక్కువుగా ఉంటుంది. అంతకు మించి లోతట్టు ప్రాంతం కూడా. జీవనది కృష్ణా ఇక్కడ ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులలో అయినా, ప్రతికూల పరిస్థితులలో అయినా నీటి నిల్వలకు కొరత లేదు. పుష్కలంగా నీటివనరులు ఉండటం చేత రాజధానిలోని ప్రస్తుత 29 గ్రామాలతో పాటు, పరిపాలన భవనాల అవసరాలు, మాత్రమే కాకుండా 2050 నాటి అవసరాలు, ఆ తర్వాత భవిష్యత్తు నీటి అవసరాలను కూడా ఇది తీర్చగలదు. ప్రకాశం బ్యారే జీలో 5 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం మాత్రమే ఉండగా.. వైకుంఠపురం బ్యారేజీ 10 టీఎంసీల నీటి నిల్వతో ఉంటుంది.
 
 
జలసిరి..
చెంతనే కృష్ణానది ఉన్నా.. ‘పశ్చిమ కృష్ణా’కు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. తూర్పు కృష్ణా సాగునీటి అవసరాలను ప్రకాశం బ్యారేజీ తీరుస్తోంది. కృష్ణా జలాలతోపాటు ఇటీవల ప్రభుత్వం ముందు చూపు ఫలితంగా ప్రకాశం బ్యారేజీకి గోదావరి జలాల మళ్ళింపు కూడా జరుగుతోంది. పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాల్వ ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నారు. ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమ ప్రాంతంలో గోదారి కృష్ణమ్మలో కలుస్తుంది. కృష్ణా డెల్టాలో ప్రధానంగా తూర్పు కృష్ణా ప్రాంతం సస్యశ్యామలం అవుతోంది. పశ్చిమ కృష్ణాకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇటీవల వ్యవసాయం కోసం అనేక ఎత్తిపోతల పథకాలను ప్రారంభించటం జరిగింది. మేజర్‌గా చింతలపూడి రిజర్వాయర్‌ను తలపెట్టింది. చింతలపూడి పూర్తయితే సగం మేర ఈ ప్రాంతానికి నీటి కష్టాలు దూరమౌతాయి. వైకుంఠపురం బ్యారేజీకి తలెత్తుకోవటంతో నీటి కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయి.
 
 
వైకుంఠ ధామం
వైకుంఠపురం కొండనే క్రౌంచగిరి అంటారు. క్రౌంచగిరిపై వేంకటేశ్వరస్వామి, అలివేల మంగమ్మ దేవస్థానం ఉంది. దీంతో క్రౌంచగిరి వైకుంఠపురం క్షేత్రదర్శినిగా ఖ్యాతికెక్కింది. అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ కొండకు ఎనలేని శోభ వచ్చింది. వైకుంఠపురం కొండపై కలియుగ వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించాలని ఆలిండియా పంచాయతీ పరిషత్‌ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా స్పందించి టీటీడీకి దీనికి సంబంధించి లేఖ కూడా రాసింది. తిరుమల కొండపై ఏ విధంగా ఆలయాన్ని నిర్మించారో అదే విధంగా ఇక్కడ కూడా నిర్మించాలని ప్రభుత్వం నిశ్చయించింది. తిరుమల అంశగా వైకుంఠపురం ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇందులో భాగంగా రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించాలన్న భావనతో ఉంది. ప్రస్తుతం సీఆర్‌డీఏ ఈ అంశాన్ని చూస్తోంది.
 
కేటాయింపులు ఇలా
వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి రూ.2247.57 కోట్లతో అంచనాలు రూపొందించగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2169 కోట్ల వ్యయంతో చేపట్టడానికి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రాయింగ్స్‌, డిజైన్స్‌ , క్వాంటిటీ వంటి ప్రిలిమనరీ అంశాలకు రూ.6.50 కోట్లు, భూ సేకరణకు రూ.771.94 కోట్లు, పనులకు రూ.1089 కోట్లు , బ్రిడ్జిలకు రూ.69.70 లక్షలు, నేవిగేషన్‌ వర్క్స్‌కు రూ.88 కోట్లు, భవనాలకు రూ.119.52 కోట్లు, ఎర్త్‌వ ర్క్‌కు రూ.5.49 కోట్లు, రోడ్డుకు రూ.1.02 కోట్లు, ప్లాంటేషన్‌కు రూ.5 కోట్లు, తదితరాలకు తగిన కేటాయింపులను జరిపింది.
 
 
రెండో ఉత్తర వాహిని.. వైకుంఠపురం
కృష్ణమ్మ కృష్ణాజిల్లాలోకి జగ్గయ్యపేట దగ్గర ప్రవేశిస్తుంది. జగ్గయ్యపేట దగ్గర ముక్త్యాల ప్రాంతం దగ్గర కృష్ణమ్మ ఉత్తరం వైపు తిరిగి దిగువకు పారుతుంది. ఉత్తరవాహినిగా ఈ ప్రాంతానికి పేరు ఉంది. ముక్త్యాల ప్రాంతం ఆధ్యాత్మిక ధామంగా మారింది. ఇది మొదటి ఉత్తర వాహిని అయితే అమరావతి సమీపంలో వైకుంఠపురం దగ్గర మరోమారు కృష్ణమ్మ ఉత్తరవైపు తిరిగి ప్రవహిస్తుంది. వైకుంఠపురం కొండపై శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం కూడా ఉంది.
Link to comment
Share on other sites

అమరావతి తాగునీటి కోసం..
09-06-2018 02:08:00
 
  •  10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం
  • వైకుంఠపురం వద్ద బ్యారేజీ
అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన మరో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అమరావతి మండలంలోని వైకుంఠపురం గ్రామం వద్ద నిర్మించతలపెట్టిన ఈ బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన రూ.2169 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన, 10 టీఎంసీల సామర్థ్యంతో ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టనున్నారు. రాజధాని అమరావతి తాగునీటి అవసరాలను దీనిద్వారా తీర్చేలా నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం వ్యయంలో రూ.771 కోట్లు భూసేకరణకు కేటాయిస్తారు.
Link to comment
Share on other sites

idi mainly NSP right canal ki Godavari water lift purpose and not for for capital......Once polavaram is over capital gets drinking water direct even in summer from storage there.....

 

With this Vykuntapuram barrage Godavari water can be lifted easily out of 10 TMC bank......

 

Link to comment
Share on other sites

ఈ ఏడాది వైకుంఠపురం బ్యారేజీ ప్రారంభిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువకు, చింతలపూడికి ఈ నీరు వాడకుంటామని, పెన్నానదికి , సోమశిలకు కూడా నీరు తీసుకెళ్తామన్నారు. బొల్లాపల్లి వద్ద 200 టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్ చేపడతామని, దీని నుంచి సాగర్ కుడి కాలువకు నీరు అందిస్తామని చంద్రబాబు తెలిపారు.

Link to comment
Share on other sites

15 hours ago, AnnaGaru said:

idi mainly NSP right canal ki Godavari water lift purpose and not for for capital......Once polavaram is over capital gets drinking water direct even in summer from storage there.....

 

With this Vykuntapuram barrage Godavari water can be lifted easily out of 10 TMC bank......

 

Vykuntapuram barrage ki godavari water ela vasthundi konchem cheppadai map chusthunte naku ardham kavatala

Link to comment
Share on other sites

Vykuntapuram barrage gets administrative sanction in Andhra Pradesh

The proposed barrage would be built about 23 km upstream of Prakasam Barrage and nearly 60 km downstream Pulichintala project. 

 

By Express News Service

VIJAYAWADA:  A Proposal to build a dedicated water storage project to meet drinking needs of Amaravati has moved a step forward with the State government giving administrative sanction for construction of a barrage near Vykuntapuram. According to a government order (MS 48) issued by the Secretary of Water Resources Shashi Bhushan Kumar on Friday, `2,169 crore would be spent on the project, which envisages storage of 10 TMC of water to provide drinking water to the new capital. 

The proposed barrage would be built about 23 km upstream of Prakasam Barrage and nearly 60 km downstream Pulichintala project. Shashi Bhushan Kumar directed the officials of Krishna Delta System (KDS) to take necessary steps for the project execution at the earliest.With the State government issuing the administrative approval, the Water Resources Department would shortly float tenders. 

The officials plan to launch the barrage works in next three months. 
Out of the total Rs 2,169 crore, Rs 772 crore would be spent for procuring required land, while `1,088 crore would be spent on civic works of the barrage. The remaining amount would be spent towards admnistrative works, labour charges and construction of necessary structures – like navigation network, bridges and buildings.

Project cost
J2,169 crore will be spent on the project, which envisages storage of 10 TMC of water to provide drinking water to the new capital Amaravati Officials plan to launch the works in next three months

 
Stay up to date on all the latest Vijayawada news with The New Indian Express
Link to comment
Share on other sites

On 6/11/2018 at 10:48 PM, AnnaGaru said:

idi mainly NSP right canal ki Godavari water lift purpose and not for for capital......Once polavaram is over capital gets drinking water direct even in summer from storage there.....

 

With this Vykuntapuram barrage Godavari water can be lifted easily out of 10 TMC bank......

 

bro edi nijam kavacchu, kani cbn eroju matalu vintunte city vykunatapuram, oldAmaravati side penchutaru anipisthundi vykuntapuram kadithe aside 15 km river front  add avutudi anntunnadu,river kudda chala vedalupuga untundi kuda,Amaravati vertical ga (niluvuga) penchali ani chusthuaru, ade manchidi kadha,city horizontal ga perigithe addadittam tayaru avuthundi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...