Jump to content

Vykuntapuram Barrage


sonykongara

Recommended Posts

  • Replies 235
  • Created
  • Last Reply
  • 2 weeks later...
కోట్లు ధారబోసినా అంతే!
వైకుంఠపురం బ్యారేజీకి సమగ్ర ఆకృతులు ఇవ్వని వ్యాప్కోస్‌
భూముల వివరాలూ తప్పులతడక
టెండర్ల ప్రక్రియ మరింత ఆలస్యం
ఈనాడు - అమరావతి
26ap-main12a.jpg

కొత్త ప్రాజెక్టుల నివేదికలకు జల వనరులశాఖ రూ.కోట్లు వెచ్చిస్తున్నా ఫలితం కనిపించడంలేదు. పెద్ద మొత్తంలో నిధులు పొందుతున్న ఏజెన్సీలు ఆ తర్వాత పూర్తి స్థాయి జవాబుదారీతనంగా ఉండటం లేదు. జల వనరులశాఖ ఇంజినీర్లు, అధికారులు మళ్లీ ఆ పని చేసుకోవాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాజెక్టులకు నివేదికలను రూపొందించే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వ్యాప్కోస్‌ తీసుకుంది. గోదావరి పెన్నా అనుసంధానంతోపాటు వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించిన డీపీఆర్‌ బాధ్యతలను ఆ సంస్థకే అప్పగించారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన వైకుంఠపురం నివేదిక బాధ్యతను టెండర్లు పిలవకుండానే ఇచ్చారు. పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికను రూపొందించిన తర్వాత తాజాగా ప్రభుత్వం దీని నిర్మాణానికి పాలనామోదం ఇచ్చింది. రూ.2169 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే టెండర్లు ఆహ్వానించాల్సి ఉంది. కానీ జులై నెలాఖరు వరకూ కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కారణం ఏమిటా అని ఆరా తీస్తే బ్యారేజీ నిర్మాణానికి ఆకృతులు సిద్ధం కాలేదని తెలిసింది. దీనికి ఈపీసీ విధానంలో కాకుండా ఎల్‌ఎస్‌ విధానంలో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. దీనివల్ల ఆకృతుల బాధ్యత గుత్తేదారుకు ఉండదు. జల వనరులశాఖే ఆకృతులు సిద్ధం చేసి అంచనాలు ఖరారు చేయాలి. సాధారణంగా డీపీఆర్‌ సిద్ధం చేసిన సంస్థే పూర్తి స్థాయి ఆకృతులు సమర్పించాల్సి ఉంటుంది. వైకుంఠపురం బ్యారేజీ ప్రాజెక్టు నివేదిక రూపొందించిన వ్యాప్కోస్‌ పూర్తి స్థాయి ఆకృతులు సమర్పించకపోవడం గమనార్హం. దీనిపై జల వనరులశాఖలో ఉన్నతస్థాయిలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పైగా వైకుంఠపురం బ్యారేజీ పాలనామోద ఉత్తర్వుల్లోనే కేంద్ర ఆకృతుల విభాగం చీఫ్‌ ఇంజినీరు నుంచి ఆమోదం పొందిన ఆకృతులు తీసుకోవాలని నిబంధన విధించారు. అసలు డీపీఆర్‌ను వ్యాప్కోస్‌ రూపొందిస్తే ఆకృతులు ఎందుకు ఇవ్వలేదని ఆ సంస్థను ప్రశ్నించకపోగా సాక్షాత్తూ ఆకృతుల సంస్థ చీఫ్‌ ఇంజినీరును బాధ్యుడిని చేస్తూ ఉత్తర్వులు రావడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంలో కృష్ణా డెల్టా అధికారులకు, కేంద్ర ఆకృతుల సంస్థ అధికారులకు మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇప్పుడు జల వనరులశాఖ పరిధిలోని ఆకృతుల సంస్థ బ్యారేజీకి ఆకృతులు సిద్ధం చేయాల్సి వస్తోంది. ఇక బ్యారేజి విషయంలో అటవీ, ప్రభుత్వ, ప్రైవేటు భూములకు సంబంధించి వ్యాప్కోస్‌ సమర్పించిన గణాంకాలు చూసి జల వనరులశాఖ అధికారులు విస్తుపోయారు. లేని భూములను అక్కడ చూపించి, భూసేకరణ ఖర్చు పెంచేసి ప్రాజెక్టు అంచనాలు మించిపోయేలా చేశారు. బ్యారేజీ నిర్మించాలంటే ఒక్క భూసేకరణకే రూ.1510 కోట్లు ఖర్చవుతుందని లెక్కించారు. పట్టాభూములు, అసైన్డ్‌ భూములు కలిపి కేవలం 2951 ఎకరాలు వాస్తవంగా ఉంటే వ్యాప్కోస్‌ అది తన ప్రాథమిక నివేదికలో 11,600 ఎకరాలు ఉన్నట్లు చూపడం విశేషం. బ్యారేజీ ప్రతిపాదిత స్థలంలో 2901 ఎకరాల అటవీభూమి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. నిజానికి అక్కడ అసలు అటవీ భూమే లేదు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

నీటి బొట్టు.. నిలిచేట్టు 
కృష్ణా నదిపై రెండు ఆనకట్టలు 
చోడవరం బ్యారేజీకి త్వరలో ప్రభుత్వ ఆమోదం 
దిగువన మరొకటి నిర్మాణానికి యత్నాలు 
 రాజధాని ప్రాంత భవిష్యత్తు అవసరాలే లక్ష్యం 
ఈనాడు, అమరావతి 
T38MPUX.jpg

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి నీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో విస్తరించిన రాజధాని ప్రాంతంలో తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు నీటిని అందించేందుకు బృహత్‌ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నదీ ముఖ ప్రాంతంగా అభివృద్ధి చేసే తలంపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. దీంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం కృష్ణా నది వెంబడి మూడు బ్యారేజీలను నిర్మించబోతోంది. కృష్ణా నది నుంచి సముద్రంలోకి వదిలే నీటిని సద్వినియోగం చేసుకునే ఆలోచనలో ఉంది.

ఇందులో భాగంగా ఇప్పటికే గుంటూరు జిల్లా వైకుంఠపురం వద్ద రూ.2వేల కోట్లు పైగా వెచ్చించి ప్రకాశం బ్యారేజికి 23 కి.మీ ఎగువున నిర్మించనుంది. దీనికి పరిపాలనపరమైన ఆమోదం తెలిపింది. బ్యారేజికి దిగువున చోడవరం వద్ద ఆనకట్టను కూడా నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో దీనికి పచ్చజెండా ఊపనుంది. దీనికి దిగువున మరో బ్యారేజిని నిర్మించడం ద్వారా మరింత అధిక పరిమాణంలో నీటిని నిల్వ చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ రెండు ఆనకట్టలు నిర్మితమైతే 7.2 టీఎంసీల మేర నీటిని నిలిపే అవకాశాలు ఉన్నాయి. నీరు లేక ఒట్టిపోతున్న నదిలోకి సముద్ర నీరు బాగా చొచ్చుకొస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

ప్రత్యేకతలు ఇవీ.. 
* ప్రకాశం బ్యారేజికి దిగువున 12 కి.మీ వద్ద కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం సమీపంలో ఆనకట్టను నిర్మించనున్నారు. దీని నిల్వ సామర్థ్యం 2.7 టీఎంసీలు. దీని నిర్మాణ వ్యయం రూ.907 కోట్లు. తొమ్మిది గేట్లు బిగించనున్నారు.

* ఆనకట్ట గేట్లు ఎయిర్‌ బ్యాగ్స్‌తో ఆపరేట్‌ అవుతాయి. అందులోని నీటి పరిమాణాన్ని బట్టి వాటంతట అవే పనిచేస్తాయి. పూర్తిగా సెన్సర్ల ఆధారంగా తెరుచుకుంటాయి. సిబ్బంది అవసరం లేకుండానే పనిచేస్తాయి. 
* 11.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా తట్టుకునేలా దీనిని నిర్మించనున్నారు. 
* ఏడాది పొడవునా నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. దీని వల్ల సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. పర్యటకానికి కూడా ఇది ఉపయోగపడనుంది. తాగునీటి అవసరాలకు కూడా అక్కరకొస్తుంది. 
* ఈ ఆనకట్టు కోసం పట్టాభూమి, ప్రభుత్వ భూమిని సేకరించాల్సి ఉంది. పట్టాభూమి.. 50 హెక్టార్లు, ప్రభుత్వ భూమి.. 2,878 హెక్టార్లు అవసరమని గుర్తించారు. భూసేకరణ కోసం రూ.87.55 కోట్లు అవసరం.

కడలిపాలయ్యే నీటికి అడ్డుకట్ట 
రాజధాని ప్రాంతంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్యను అధిగమించి, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు విజయవాడ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని వైపులా శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా కంకిపాడు మార్గంలో ఎక్కువ మంది వస్తున్నారు.

* ప్రకాశం బ్యారేజిలో 3.02 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంది. భారీ వర్షాల సమయంలో అయితే నీటిని సముద్రంలోకి వదిలిపెట్టాల్సిందే. ఈ నేపథ్యంలో అధిక నీటిని వదలకుండా దిగువ ప్రాంతాలకు ప్రయోజనం కలిగేలా చోడవరంలో బ్యారేజికి రూపకల్పన చేస్తున్నారు.

* దీని వల్ల కృష్ణా జిల్లా యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, గుంటూరు జిల్లాలోని ప్రాతూరు, చిర్రావురు, గుండిమేడ, రామచంద్రాపురం గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రాంతాల్లోని రైతులు ఏడాది పొడవునా బోరు నీటితో పంటలు వేస్తున్నారు. దీని వల్ల భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వర్షాల రాక ఆలస్యం అయిన సందర్భాలలో నీటికి కొరత తలెత్తుతోంది. ఈ ప్రభావం కారణంగా తాగునీటి పథకాలు కూడా ఒట్టిపోతున్నాయి. దశాబ్దాల తరబడి ఇలా సాగడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

* ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెక్‌డ్యామ్‌లు, బ్యారేజి నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఫలితంగా చోడవరం బ్యారేజి నిర్మితమైతే సమస్యలు పరిష్కారమవుతాయి. వరద నీటిని ఒడిసిపట్టడం వల్ల తాగునీటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. సరకు రవాణా, పర్యటకం, నదీముఖ అభివృద్ధికి ఇది తోడ్పతుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు పరిశ్రమలు వస్తున్నాయి. వీటికి నీటిని అందించేందుకు వీలు కలుగుతుంది.

* ఆనకట్ట నిర్మాణం వల్ల వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరనుంది. ఏటా రూ.166 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. చేపల పెంపకం ద్వారా ఏడాదికి రూ.15.91 కోట్లు, పర్యటకం ద్వారా రూ.56కోట్లు, భూగర్భ జలం పెరిగితే రూ.17.64 కోట్ల మేర విద్యుత్తు బిల్లులు ఆదా అవుతుంది. ఈ ప్రాంతాల్లోని రైతులు పంటలను సాగుకు నీరు అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల రూ.76.50 కోట్ల వరకు కర్షకులకు ఆదాయం లభిస్తుంది.

ప్రతిపాదనల్లో మరొకటి 
బ్యారేజీ నిర్మించనున్న చోడవరం ప్రాంతానికి దిగువన కూడా మరొకటి నిర్మించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీని నిర్మాణం ద్వారా చుక్క నీరు కూడా వృథాగా పోకూడదన్న తలంపుతో ఉంది. ఈ మేరకు ప్రాథమికంగా జలవనరుల శాఖ అధికారులు.. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. నదిపై కృష్ణా జిల్లా శ్రీకాకుళం, గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని గాజుల్లంక మధ్య నిర్మించాలని అంచనాకు వచ్చారు. ప్రకాశం బ్యారేజీకి 46 కి.మీ దూరంలో ఇది రానుంది. దీని నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు. ఈ బ్యారేజి నిర్మాణానికి రూ.1,200 కోట్లు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి సవివర నివేదిక తయారీలో ఉంది. ఇది నిర్మితమైతే చుట్టుపక్కల లంక గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పటికే కొల్లూరు మండలం లంక గ్రామాల్లో ఉద్యాన పంటలు వేస్తుండటంతో బోర్ల ద్వారా నీటిని అందించాల్సి వస్తోంది. దీని వల్ల 70 అడుగుల లోతుకు వెళ్లినా నీరు పడని పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లాలో ఘంటసాల మండలం వరకు సముద్రం నీరు చొచ్చుకొచ్చింది. ఫలితంగా భూగర్భ జలాలు ఉప్పునీటి మయంగా మరాయి. శ్రీకాకుళం వద్ద బ్యారేజి నిర్మిస్తే ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య తీరుతుంది. దీంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయి.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...

Vijayawada: No bidders for Vykuntapuram Barrage

High cost estimate, `1,088 crore for civil works, `772 crore for land procurement reason behind no response.

Published: 12th August 2018 05:32 AM  |   Last Updated: 12th August 2018 05:32 AM   |  A+A-

Express News Service

VIJAYAWADA: Even as the State government is planning to launch, at the earliest, the works related to Vykuntapuram Barrage project, proposed to be built upstream of Prakasam Barrage to serve the needs of the capital region, there seem to be no takers for its execution. Not a single bid was filed after the Water Resources department invited tenders for the `2169-crore-project. Since there was no response from the bidders, the officials have once again begun the process of tendering.

Keeping in mind the future drinking water requirement, which is set to go up with Amaravati coming up, and with an objective to tap into excess flood waters for irrigation purposes, the State government has mooted the proposal of a 10 tmc reservoir at Vykuntapuram. After giving an administrative approval for the proposal in June, the Water Resources department invited tenders last month. Most of the designs related to the project have been approved by the Central Design Organisation (CDO). However, when the officials opened the tenders last week, they found that not a single bid was filed.

The reason behind this is said to be the high cost of tenders. While `1,088 crore is estimated to be spent on civil works, `772 crore is for land procurement. “When we opened the tenders on August 2, there were no bids. It may be because of the cost. So, we are inviting tenders again after revising the prices,” the Chief Engineer (CE) of Krishna Delta System (KDS), R Satish Kumar, told TNIE.

According to the CE, the tenders with revised rates would be floated in the next week. “The new Standard Schedule of Rates (SSR) have been set, and we will know them by Monday. We will take two days to revise the cost of the civil works of the project. After that, we will immediately invite the tenders,” Satish Kumar explained.

It may be noted that the reservoir will be built near the Vykuntapuram village of Guntur district, which is 23 km upstream the barrage, and nearly 60 km downstream Pulichintala project. Once built, the barrage will store 10 tmc of water in addition to the three tmc at Prakasam Barrage.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

40 tmc this year to sea.....on top of this 20 days pattiseema motors stopped.....on top of it chintalapudi lift adds more water taking ..also eluru canal early diversion gives more capacity

vykuntapuram ki 50+ TMC varaku problem ledu......a 50 tmc use cheyyagaligina sankrati vachinatte guntur&prakasam lo nsp canals kinda....

 

20180827b_001139003.jpg

 

Link to comment
Share on other sites

అక్టోబరులో వైకుంఠపురం
03-09-2018 02:19:03
 
636715379419333151.jpg
  • బ్యారేజీకి శంకుస్థాపన చేస్తాం
  • చోడవరం టెండరు పనులూ వచ్చే నెలలో
  • లక్షా 2 వేల మంది పోలవరం సందర్శన
  • జగన్‌కు మాత్రం తీరిక లేదు: దేవినేని
విజయవాడ (విద్యాధరపురం), సెప్టెంబరు 2: గోదావరి-పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా వైకుంఠపురం బ్యారేజీ పనులకు అక్టోబరు మొదటి వారంలో శంకుస్థాపన చేస్తామని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన తలపెట్టిన చోడవరం బ్యారేజీ టెండరు పనులు వచ్చేనెలలో పూర్తి చేస్తామన్నారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. పురుషోత్తపట్నం రెండోదశను అక్టోబరు రెండోవారంలో ముఖ్యమంత్రి జాతికి అంకితం చేస్తారని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీవర్షాలతో దిగువకు వరద వస్తోందని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో నీటినిల్వలు పెరిగాయన్నారు.
 
పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ జిల్లాలకు నీరు అందిస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లా అవుకు టన్నెల్‌ ద్వారా వారంరోజుల్లో నీరు విడుదల చేస్తామని చెప్పారు. సాగర్‌ నుంచి 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. పులిచింతలలో 45 టీఎంసీల నిల్వకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పటివరకు లక్షా 2వేలమంది సందర్శించారని.. కానీ ప్రతిపక్ష నేత జగన్‌కు మాత్రం పోలవరం చూసే తీరిక మాత్రం లేదని ఆక్షేపించారు. రాజన్న రాజ్యంలో ఐఏఎ్‌సలు, మంత్రులు జైలుకు వెళ్లారని, మళ్లీ అలాంటి పరిపాలన తెస్తానని ఆయన చెబుతున్నారని ఎద్దేవాచేశారు. గుంటూరులో ముస్లింల సభను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించిందని విమర్శించారు.
Link to comment
Share on other sites

వైకుంఠపురం రిజర్వాయర్‌.. దసరాకు ముహూర్తం?
04-09-2018 10:10:45
 
636716526442319894.jpg
గుంటూరు: అమరావతి రాజధాని నగరానికి భవిష్యత్తులో నీటి ప్రదాయిని కానున్న వైకుంఠపురం రిజర్వాయర్‌కు దసరా రోజున శంకుస్థాపన నిర్వహించేందుకు జలవనరుల శాఖ సన్నాహాలు చేస్తోంది. విజయదశమి పర్వదినాన ఏ కార్యక్రమం చేపట్టినా అది దిగ్విజయంగా కొనసాగుతుందన్న సెంటిమెంట్‌ ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. అమరావతి రాజధాని శంకుస్థాపన కూడా ఇదే పర్వదినాన జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్టోబర్‌ నెలలో ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియని గుంటూరు అధికారులు వేగవంతం చేశారు. వచ్చేవారంలోనే టెండర్లు ఆహ్వానించనున్నట్లు ఆ శాఖ ఎస్‌ఈ ఎం బాబూరావు తెలిపారు.
 
పులిచింతల ప్రాజెక్టు దిగువున కృష్ణానదికి వచ్చే వరదనీరు ప్రకాశం బ్యారేజ్‌ వద్ద నుంచి వృథాగా దిగువకు విడుదల చేయాల్సి వస్తోన్నది. ఈ సంవత్సరం కూడా సుమారు 30 టీఎంసీల పైగా నీటిని సముద్రంలోకి వదిలిపెట్టారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిగా నిండి ఉన్నది. ఇక ఏమాత్రం వరద నీరు వచ్చినా దిగువకు విడుదల చేయక తప్పదు. ఆ నీరంతా వృధాగా దిగువకు వెళ్లిపోవాల్సిందే. ఈ నేపథ్యంలో అమరావతి పుణ్యక్షేత్రానికి సమీపంలోని వైకుంఠపురం వద్ద ఒక రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టాలని ఈ ఏడాది జూన్‌ మొదటి వారంలో ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
 
ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువున 23వ కిలోమీటర్‌ వద్ద దీని నిర్మాణం చేపడతారు. సుమారుగా 10 టీఎంసీల నీటిని ఇక్కడ నిల్వ చేసే విధంగా బ్యారేజ్‌ డిజైన్‌ చేస్తోన్నారు. ఇందుకోసం రూ.2,247.57 కోట్ల నిధులు అవసరమౌతాయని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొన్న ప్రభుత్వం రూ.2,169 కోట్లకు పరిపాలన అనుమతిని మంజూరు చేసింది. ఏ-ప్రాథమిక అంశాలకు రూ.6.50 కోట్లు, బీ-ల్యాండ్‌కు రూ.77,194.11 టక్షలు, సీ-వర్కులకు రూ.1,08,859.12 లక్షలు, జీ-బ్రిడ్జీలకు రూ.69.70 లక్షలు, ఐ-నేవిగేషన్‌ వర్కులకు రూ.8,800.00 లక్షలు, కే-బిల్డింగ్‌లకు రూ.1,119.52 లక్షలు, ఎల్‌1-మట్టిపనికి రూ.549.50 లక్షలు, ఎల్‌3-సర్వీసు రోడ్లకు రూ.102.44 లక్షలు, ఎం-ప్లాంటేషన్‌కి రూ.500 లక్షలు, ఇతరత్రా ఖర్చులకు రూ.942.50 లక్షలు, ఆర్‌-కమ్యూనికేషన్‌కి రూ.415 లక్షలు, ఎక్స్‌-ఎన్విరాన్‌మెంట్‌, ఎకాలజీకి రూ.100 లక్షలు, ఒక శాతం చొప్పున లేబర్‌ సెస్సు రూ.1,214.58 లక్షలు, జీఎస్‌టీ రూ.14,572.93 లక్షలు, సీనరేజ్‌ ఛార్జీలు రూ.1,677.512 లక్షలు, ఎన్‌ఏసీ 0.1 శాతం చొప్పున రూ.121.43 లోలు, టెండర్‌ పబ్లికేషన్‌కి రూ. 10 లక్షలు కలిపి మొత్తం రూ.2,169 కోట్లుగా ప్రభుత్వం అంచనాలు వేసింది.
 
గత కొద్ది రోజులుగా జిల్లా అధికారులు టెండర్‌ డాక్యుమెంట్లని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోన్నారు. ఈ వారంలోనే టెండర్లు పిలవాలని భావించిననప్పటికీ అనివార్య కారణాల వలన వచ్చే వారానికి వాయిదా వేసినట్లు ఎస్‌ఈ వెల్లడించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఏడాదిలో 4 అద్భుతాలు
16-09-2018 03:04:10
 
636726638516453767.jpg
  •  నేడు కొండవీటివాగు ఎత్తిపోతల ప్రారంభం
  •  చోడవరం బ్యారేజీకి త్వరలో టెండర్లు
  •  దసరాకల్లా పోలవరం గేట్ల బిగింపు
  •  ఇంజనీర్స్‌ డే వేడుకల్లో మంత్రి దేవినేని
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది కాలంలో నాలుగు అద్భుతాలు సృష్టించబోతున్నామని జల వనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా శనివారం విజయవాడలో నిర్వహించిన ఇంజనీర్స్‌ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఈ అద్భుతాల్లో మొదటిది.. కొండవీటివాగు ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రెండో అద్భుతం.. ప్రకాశం బ్యారేజీకి దిగువన చోడవరం బ్యారేజీ నిర్మాణానికి త్వరలోనే పాలనామోదం ఇచ్చి.. టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తాం. మూడో అద్భుతంగా వైకుంఠపురం బ్యారేజీని నిర్మిస్తున్నాం. నాలుగో అద్భుతంగా హరిశ్చంద్రపురం నుంచి నాగార్జున కుడికాలువ ద్వారా సత్తెనపల్లి వరకూ గోదావరి జలాలను తీసుకెళ్లి బొల్లాపల్లి వద్ద రిజర్వాయరును నిర్మిస్తాం. అక్కడి నుంచి సోమశిల ద్వారా పెన్నా నదిలోకి.. ఆ తర్వాత రాయలసీమ జిల్లాలకూ గోదావరి జలాలను తీసుకెళ్తాం. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌ వాల్‌, స్పిల్‌వే గ్యాలరీ వాక్‌ను పూర్తి చేశాం. దసరాకు గేట్లు బిగిస్తాం. సంక్రాంతిని కూడా పోలవరం ప్రాజెక్టులోనే చేసుకుంటాం’ అని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

వరద నుంచి రాజధాని క్షేమం..
‘‘రాజధాని మునగకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నాం. 5 వేల క్యూసెక్కుల వరద నీరు పొలాలోక్లి వెళ్లకుండా, నేరుగా కృష్ణానదిలోకి చేరేలా... కొండవీటి వాగు వరద నివారణ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాం. రూ.237 కోట్లు వెచ్చించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్‌లో ఎన్ని వరదలు వచ్చినా రాజధాని ప్రాంతానికి, రైతాంగానికి ఎలాంటి ముప్పు ఉండదు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తం 22వేల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే చేరేలా రూ.400 కోట్లతో రెండో దశలో పనులు త్వరలోనే చేపడతామని ఈ సందర్భంగా రైతులకు హామీనిచ్చారు. గతంలో అనేకసార్లు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు రైతాంగం నష్టపోయిందని, ఇకమీదట ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. పనుల్లో కొంత జాప్యం చోటుచేసుకున్నా పనులు బాగా చేశారని జలవనరుల యంత్రాంగాన్ని, ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావును ఈ సందర్బంగా అభినందించారు.

16ap-main1b.jpg

కరవు రహిత రాష్ట్రమే ధ్యేయం
తన జీవితంలో ఎప్పుడూ ఇంతగా జలవనరుల రంగంపై శ్రద్ధ పెట్టలేదని, జలదీక్షతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని సంకల్పం పెట్టుకుని ముందుకెళుతున్నానని చంద్రబాబు చెప్పారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా విస్తరించిన మొత్తం ఐదు నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రాన్ని కరవు రహితంగా చేస్తామని వివరించారు. అందులో భాగంగా ప్రస్తుతం కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం పూర్తయిందని, పెన్నానదిని అనుసంధానం చేసే పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నీటికి భద్రత ఉండాలనే రూ.58 వేల కోట్లతో 57 ప్రాజెక్టుల పనులు చేపట్టామని,  వీటిలో ఇప్పటికే 12 ప్రారంభించామని చెప్పారు. మిగిలిన 45 ప్రాజెక్టులను వచ్చే మే నెలలోపు పూర్తి చేస్తామన్నారు.  గుంటూరు ఛానల్‌ పొడిగించటం ద్వారా 50 వేల ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పారు. దీనికి రూ.459 కోట్లు మంజూరు చేస్తునట్లు సభాముఖంగా హామీనిచ్చారు.

వచ్చే నెలలో ‘వైకుంఠపురం’ శంకుస్థాపన: మంత్రి ఉమా
కొండవీటివాగు ఎత్తిపోతల పథకం ద్వారా తుళ్లూరు, మంగళగిరి వాసుల దశాబ్దాల కల నెరవేరిందని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వచ్చే నెలలో కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్ధాపన చేస్తారని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ దిగువన చౌడవరం వద్ద మరో బ్యారేజీ నిర్మిస్తామన్నారు.  రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టులకు మీ ఎంపీలతో కేసులు వేయించటమే కాకుండా... పొరుగు రాష్ట్రాల వారిని రెచ్చగొడుతున్నారని విపక్షనేత జగన్‌పై ధ్వజమెత్తారు. అసెంబ్లీకి రాకుండా లక్షలు జీతాలు తీసుకుంటూ సీఎంను ఆడిపోసుకోవాలని చూస్తున్నారని మీ ఆటలు సాగవని హెచ్చరించారు. వెలిగొండ వంటి ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని వైకాపా, భాజపాలు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నాయన్నారు. మరో మంత్రి నారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని, వరదనీటి వల్ల అమరావతికి ఇబ్బంది లేకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంత్రులు పుల్లారావు, నక్కా ఆనందబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం జాతికి అంకితం
17-09-2018 09:57:17
 
636727750338368123.jpg
  • ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • రాజధానికి ముంపు ముప్పు లేదని ప్రకటన
  • అనుసంధానం జరిగిన చోట జల హారతి
  • రూ.400 కోట్లతో రెండో దశ పనులు చేపడతామని ప్రకటన
  • గుంటూరు చానల్‌ పొడిగింపు పైనా హామీ
 
రాజధానికి ముంపు సమస్య తీరిపోయింది. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని వరదనీటితో ముంచేస్తున్న కొండవీటి వాగు సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. నీరు నదిలో కలిసే డిశ్చార్జ్‌ పాయింట్‌ వద్ద జలసిరికి హారతినిచ్చారు. రాజధానికి ఇక ముంపు ఉండబోదని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వైకుంఠపురం బ్యారేజీకి వచ్చే నెలలో శంకుస్థాపన చేసి, ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.
 
 
గుంటూరు: అమరావతి రాజధానిలోని ఉండవల్లిలో నూతనంగా నిర్మించిన కొండవీటివాగు వరదనీటి ఎత్తిపోతల పథకం మోటార్లకు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్విచ్‌ఆన్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించి కృష్ణానదికి హారతి పట్టారు. ఈ సందర్భంగా వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ జిల్లాకు పలు వరాలను ప్రకటించారు. వైకుంఠపురం బ్యారేజ్‌కు వచ్చే నెలలో శంకుస్థాపన చేసి ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. అక్కడ 10 టీఎంసీల నీటిని నిల్వబెడతామని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్‌ దిగువున చౌడవరం వద్ద మరో బ్యారేజ్‌ నిర్మించి నీటిని నిల్వ చేసి పంటలకు, తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టు దిగువ నుంచి కృష్ణానది అంతర్ధానం వరకు రెండు వైపులా నీరు ఉండేలా చూస్తామన్నారు. కొండవీటి వాగు వరదనీటి ఎత్తిపోతల పథకం తొలిదశ నిర్మాణానికి రూ.222 కోట్లు ఖర్చు చేశామని, దీనివలన వాగు నుంచి ప్రస్తుతానికి ఐదు వేల క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోయవచ్చన్నారు.
 
మరో నాలుగు వేల క్యూసెక్కుల నీటిని ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ ద్వారా పశ్చిమ ప్రధాన కాలువలోకి మళ్లించ వచ్చన్నారు. రోజుకు ఒక టీఎంసీ నీటిని ఈ స్కీం ద్వారా ఎత్తిపోయవచ్చని తెలిపారు. రెండో దశలో లాం వద్ద నుంచే మరో 5,250 క్యూసెక్కుల నీటిని వైకుంఠపురం బ్యారేజ్‌కు మళ్లిస్తామన్నారు. మరో ఎత్తిపోతల పథకం నిర్మించి రాజధాని అవసరాలకు నీటిని వినియోగిస్తామన్నారు. వీటన్నింటి కోసం రూ.400 కోట్ల నిధులు ఖర్చు పెడతామన్నారు. అమరావతి రాజధానికి ఇక ముంపు ఉండబోదని ధైర్యంగా ప్రకటిస్తున్నానన్నారు. త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసిన జలవనరుల శాఖ ఇంజనీర్లు, మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ సిబ్బందిని సీఎం అభినందించారు. గుంటూరు చానల్‌ పొడిగింపు ప్రాజెక్టు పూర్తి చేస్తే కొత్తగా 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. అంచనాల తయారీకి అయ్యే రూ.87 లక్షలకు సభా వేదిక మీద నుంచే శాంక్షన్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.489 కోట్ల నిధులు అవసరమౌతాయన్నారు. అలానే హెడ్‌ పంపింగ్‌ స్లూయిజ్‌కు రూ.13 కోట్లు మంజూరు చేశారు. ఆధునికీకరణకు రూ.350 కోట్ల నిధులను విడుదల చేశామన్నారు. వరికపూడిశెల లిఫ్టు ఇరిగేష్‌ ప్రాజెక్టుని త్వరలోనే చేపడతామన్నారు.
 
ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, రావెల కిషోర్‌బాబు, నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఫిలిప్‌ సీ థోచర్‌, ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, కలెక్టర్‌ కోన శశిధర్‌, సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, అర్బన్‌ ఎస్పీ విజయారావు, ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ జేఆర్‌ పుష్పరాజ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ షేక్‌ జానిమూన్‌, దివ్యాంగుల సంస్థ చైర్మన్‌ కోటేశ్వరరావు, మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ జియావుద్దీన్‌, మిర్చియార్డు చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, కృష్ణా పశ్చిమ డెల్టా పీసీ చైర్మన్‌ మైనేని మురళీ, ఎపెక్స్‌ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ అడ్మిన్‌ కె.శ్రీనివాస్‌, సీఈ ఆర్‌.సతీష్‌కుమార్‌, ఎస్‌ఈ ఎం.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
 
 
త్వరలో హరిశ్చంద్రాపురం ఎత్తిపోతల
సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. హరిశ్చంద్రాపురం వద్ద గోదావరి నీటిని నాగార్జునసాగర్‌ కాలువలకు మళ్లించే ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నాం. బ్యారేజ్‌ దిగువన చౌడవరం వద్ద మరో ఆనకట్ట నిర్మించబోతున్నాం. పట్టిసీమ ప్రాజెక్టు దండగని జగన్‌ మాట్లాడాడు. నేడు డెల్టాని సస్యశ్యామలం చేస్తున్న పట్టిసీమ నీటిని చూసి ఆయన ముఖం ఎక్కడ పెట్టుకొంటారరు. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కేసులు వేయిస్తూ రాజధానికి అడ్డుపడుతున్నారు. అలానే వెలిగొండ ప్రాజెక్టు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
- మంత్రి దేవినేని ఉమా
 
 
వేగంగా రాజధాని నిర్మాణం
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. పరిపాలన, న్యాయ నగరాల్లో నాలుగు వేల అపార్టుమెంట్ల నివాసాలు వేగవంతంగా జరుగుతున్నాయి. కొండవీటి వాగు, పాలవాగుల డిజైన్లను నెదర్లాండ్స్‌ నిపుణులతో చేయించాం. వాళ్లు రాబోయే 100 ఏళ్లలో గరిష్టంగా 16 వేల క్యూసెక్కుల వరద వస్తుందని చెబితే తాము 22 వేల క్యూసెక్కులకు డిజైన్‌ చేశాం.
- మంత్రి పి.నారాయణ
 
 
అమరావతికి వరప్రదాయిని
అమరావతి ఒక ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకొంటోంది. కొండవీటి వాగుకు హఠాత్తుగా వచ్చే వరదతో ముంపు ఉంది. ఇది గమనించిన సీఎం తమకు ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని చెప్పినా అనివార్య కారణాలతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఏడాదిన్నరలో పూర్తి చేశాం. ఇది అమరావతికి వరప్రదాయినిగా మారుతుంది.
- శశిభూషణ్‌కుమార్‌, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ
 
 
అపర భగీరథుడు చంద్రబాబు
తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ కొండవీటి వాగు ఈ ప్రాంత వాసులకు భవిష్యత్తులో వరప్రదాయినిగా నిలుస్తుందని అపర భగీరదుడు చంద్రబాబు రాజదాని అభివృద్దికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.
- ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌
Link to comment
Share on other sites

బ్యారేజీలు.. జలసిరి నిలయాలు
కృష్ణానదిపై రెండు నూతన ప్రాజెక్టుల నిర్మాణం
సిద్ధమైన సవివర ప్రాజెక్టు నివేదికలు
రాజధాని ప్రాంతానికి తాగునీటి భరోసా
ఈనాడు, గుంటూరు
gnt-top1a.jpg
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి తాగునీటి అవసరాలు తీర్చడానికి వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై బ్యారేజీని నిర్మిస్తున్నారు. 2050 నాటికి అమరావతి నగరంలో 35 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తారన్న అంచనా.  బ్యారేజీ నిర్మాణం ద్వారా 10టీఎంసీల నీటిని నిల్వచేసి తాగునీటి అవసరాలు తీరుస్తారు. దీంతో జాతీయ జలమార్గంలో భాగంగా బ్యారేజీ జలరవాణాకు కూడా ఉపయోగిస్తారు.  రాజధాని ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి సామగ్రి, వస్తువుల తరలింపునకు, రవాణా సౌకర్యాల్లో జలమార్గం కీలకం కానుంది. రాజధాని ప్రాంతానికి సిమెంట్‌, ఇనుము, ఇతర సామగ్రి రవాణాకు జలమార్గం ఉపయోగపడనుంది. కృష్ణానది ఒడ్డున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సిమెంట్‌ పరిశ్రమల నుంచి ప్రస్తుతం రోడ్డుమార్గం ద్వారా విజయవాడ, రాజధాని ప్రాంతానికి సిమెంట్‌ తరలిస్తున్నారు. జలమార్గం అందుబాటులోకి వస్తే  దూరం తగ్గడంతోపాటు రవాణాఛార్జీల భారం తగ్గనుంది. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం వల్ల పులిచింతల ప్రాజెక్టు వరకు 60కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉంటుంది. దీనివల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రెండువైపులా ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించవచ్చు. కృష్ణానది ఒడ్డునే ఉన్నా అటు సాగర్‌ నుంచి కాని, ఇటు కృష్ణానది నుంచి సాగునీరు అందడం లేదు. ఈక్రమంలో ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించడానికి వెసులుబాటు కలుగుతుంది. అదేసమయంలో నదికి రెండువైపుల ప్రాంతాల్లో భూగర్భజలాలు వృద్ధిచెందుతాయని జలవనరులశాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. రాజధాని నగరం సమీపంలో బ్యారేజీ ఉండటంతో పర్యటకంగా ఎంతో కీలకం కానుంది. నదీముఖద్వారం కొన్ని కిలోమీటర్ల మేర ఉండటంతో జలక్రీడలు, స్పీడ్‌బోట్లు, బోటింగ్‌ తదితర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. వైకుంఠపురంలో వెంకటేశ్వరస్వామి ఆలయం ఉండటంతో ఆధ్యాత్మికంగా అభివృద్ధికి అడుగులు పడతాయి.
చోడవరం... నీటికి నిలయం
ప్రకాశం బ్యారేజీలో 3.02 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంది. భారీ వర్షాల సమయంలో వరదనీటిని ప్రకాశంబ్యారేజీ నుంచి విడుదల చేస్తే సముద్రం పాలవుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసి నీటిని నిల్వ చేసి అవసరాలకు ఉపయోగించుకునేలా చోడవరం బ్యారేజీకి రూపకల్పన చేశారు. నదీ వెంబడి ఈప్రాంతాల్లో రైతులు ఏడాది పొడవునా బోరుబావుల ద్వారా ఏడాది పొడవునా పంటలు సాగు చేస్తున్నారు. దీంతో నదీతీరంలో ఉన్నప్పటికీ భూగర్భజలాల మట్టం పడిపోతోంది. కృష్ణానదిపై ఎగువప్రాంతంలో నూతన ప్రాజెక్టులు రావడం, అక్కడ నీటి వినియోగం పెరగడంతో నదిలో నీటిలభ్యత తగ్గిపోయింది. ఈ ప్రభావం కారణంగా బోరుబావులతోపాటు తాగునీటి పథకాలు సైతం వట్టిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెక్‌డ్యామ్‌లు, బ్యారేజీ నిర్మించాలని కొన్నాళ్లుగా ప్రతిపాదనలు చేస్తున్నారు. నీటివనరులకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో చోడవరం బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడంతో సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. వరద నీటిని ఒడిసిపట్టడం వల్ల తాగునీటి సమస్యలు పరిష్కారం కావడంతోపాటు సరకు రవాణా, పర్యటకం, నదీముఖ అభివృద్ధికి ఇది తోడ్పతుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు నీటిఅవసరాలు తీరనున్నాయి. ఆనకట్ట నిర్మాణంతో వివిధ మార్గాల ద్వారా ఏటా రూ.166 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.  చేపల పెంపకం ద్వారా ఏడాదికి రూ. 15.91 కోట్లు, పర్యటకం ద్వారా రూ.56 కోట్లు, భూగర్భ జలం పెరిగితే రూ. 17.64 కోట్ల మేర విద్యుత్తు బిల్లులు ఆదా అవుతుందని అంచనా. ఈ ప్రాంతాల్లోని రైతులకు సాగునీటి లభ్యత పెరగడంతో పంటల ద్వారా రూ.76.50 కోట్ల వరకు కర్షకులకు లబ్ధి చేకూరనుంది.

వైకుంఠపురం
నిర్మాణ ప్రాంతం: ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన, పులిచింతలకు 60కిలోమీటర్ల దిగువన
‌* ఎక్కడ నిర్మిస్తున్నారు :  వైకుంఠపురం (గుంటూరు జిల్లా), దాములూరు (కృష్ణా జిల్లా)
‌* నీటినిల్వ సామర్థ్యం: 10టీఎంసీలు
‌* బ్యారేజీకి చేరే వర్షపునీటి అంచనా :    35.44టీఎంసీలు
‌* దీనిద్వారా ఉపయోగించుకునే నీరు: 10టీఎంసీలు
‌* వరదనీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం : 1165383 క్యూసెక్కులు
‌* ఒకరోజులో నీటిని విడుదల చేసే సామర్థ్యం : 100.68 క్యూసెక్కులు
‌* నిర్మాణంతో ముంపునకు గురయ్యే భూమి: 9744 హెక్టార్లు
‌* ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయం: 2420.68 కోట్లు
‌* నిర్మాణం పొడవు : 3.068 కిలోమీటర్లు
‌* ప్రయోజనాలు: నూతన రాజధాని అమరావతి నగరానికి తాగునీరు సరఫరా బ్యారేజీకి ఇరువైపులా మండలాల్లో భూగర్భజలాల వృద్ధి, మత్స్యసంపదకు నిలయం, పర్యటక ప్రగతి
‌* ప్రస్తుత స్థితి: టెండర్లు పిలిచారు

చోడవరం
‌* నిర్మాణ ప్రాంతం : ప్రకాశం బ్యారేజీ దిగువన 12 కిలోమీటర్ల దూరంలో
‌* ఎక్కడ: పెనుమలూరు మండలంలోని చోడవరం
‌* ఏర్పాటుచేసే గేట్ల సంఖ్య: 9
‌* నీటి నిల్వ సామర్థ్యం: 2.70 టీఎంసీలు
‌* దీని నుంచి నీటివిడుదల సామర్థ్యం: 11.50 లక్షల క్యూసెక్కులు
‌* నిర్మాణానికి భూసేకరణ : 75 హెక్టార్లు
‌* పట్టా భూమి సేకరణకు వెచ్చించే వ్యయం: ఎకరానికి సుమారు రూ.30.36లక్షలు
‌* నిర్మాణ వ్యయం అంచనా:  రూ.899.09కోట్లు
‌* లబ్ధిపొందే గ్రామాలు: యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం (కృష్ణా జిల్లా), పాతూరు, చిర్రావూరు, గుండిమెడ, రామచంద్రాపురం (గుంటూరు జిల్లా)
‌*  ప్రయోజనాలు: భూగర్భజలాలు వృద్ధి,  తాగునీటి అవసరాలు తీర్చడం,  జల  రవాణా, పర్యటకం అభివృద్ధి
‌* ప్రస్తుత పరిస్థితి: పరిపాలనా అనుమతుల కోసం ప్రతిపాదనలు

 
 
 

 

 

 
Link to comment
Share on other sites

వరదనీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం : 1165383 క్యూసెక్కులు
‌* ఒకరోజులో నీటిని విడుదల చేసే సామర్థ్యం : 100.68 క్యూసెక్కులు

enti edi

Link to comment
Share on other sites

  • 3 weeks later...

వైకుంఠపురానికి మళ్లీ స్పందన కరవు
కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజి ఎగువన వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మాణానికి జలవనరుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు వెయ్యి కోట్లకుపైగా అంచనా విలువతో ఈ పనికి టెండర్లు ఆహ్వానించారు. శనివారం సాంకేతిక బిడ్‌ తెరిచారు. ఏ ఒక్క గుత్తేదారు నుంచి స్పందన రాలేదు. గతంలో ఒక్కసారి టెండర్లు పిలవగా అప్పట్లోనూ ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు. అప్పట్లో తాజా ఎస్‌ఎస్‌ఆర్‌ ఖరారు కాక పాత ధరలతోనే చేయాల్సి రావడంతో ఎవరూ టెండర్లు వేయలేదు. ఇప్పుడు కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రకారం అంచనాలు రూపొందించి రెండోసారి టెండర్లు పిలిచారు. అయితే ఐబీఎం అంచనా విలువలు మరీ తక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతోనే గుత్తేదారులు ముందుకు రాలేదని సమాచారం. నిజానికి ఈ పనులు ఎవరికి దక్కుతాయనే అంశంపై గుత్తేదారు సంస్థల్లో ఒక ప్రధాన గుత్తేదారు పేరు ప్రచారంలో ఉంది. ఆ గుత్తేదారు అసంతృప్తి వల్ల టెండర్లు దాఖలు చేయలేదని చెబుతున్నారు. ముందస్తు అవగాహనలు, అధికారుల స్థాయిలో మద్దతు వల్ల ఏ ఏజెన్సీకి ఏ పని దక్కుతుందనేది ముందే ప్రచారమైపోతోంది.

Link to comment
Share on other sites

On 9/20/2018 at 2:55 PM, sonykongara said:

వరదనీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం : 1165383 క్యూసెక్కులు
‌* ఒకరోజులో నీటిని విడుదల చేసే సామర్థ్యం : 100.68 క్యూసెక్కులు

enti edi

100.68 tmc

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...