Jump to content

Amaravati

Recommended Posts

అమరావతిలో హైకోర్టు! 
ఏర్పాటుకు రంగం సిద్ధం 
నేడు పూర్తి కానున్న కీలక ప్రక్రియ 
తాత్కాలిక సీజేకు అందనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ 
ఈనాడు - హైదరాబాద్‌ 

అమరావతిలో ఏపీ హైకోర్టును తాత్కాలిక భవనంలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మే నాటికి అన్నీ సిద్ధంచేసి జూన్‌ కల్లా ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఇందుకు ప్రతిపాదించిన రెండు, మూడు భవనాల్ని పరిశీలించి అభిప్రాయం తెలియజేయాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ను కోరుతూ సిద్ధం చేసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేసినట్లు తెలిసింది. అంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఆ లేఖను గురువారం(నేడు) ఏసీజేకు అందజేయనున్నట్లు సమాచారం. శాశ్వత హైకోర్టుకు సంబంధించిన నమూనా ఖరారు తుది దశలో ఉంది. శాశ్వత భవన నిర్మాణం మొదలు పెట్టాక.. పూర్తి చేయడానికి పదహారు నెలలు పడుతుందనేది ఓ అంచనా. ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్‌లో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కక్షిదారులు అక్కడకి వెళ్లాల్సి  వస్తోంది. వారిని దృష్టిలో పెట్టుకొని ఏపీ హైకోర్టును అమరావతి పరిధిలోని తాత్కాలిక భవనంలో ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది.
ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులు ఇచ్చిన ఐచ్ఛికాల ఆధారంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇటీవల కేంద్రప్రభుత్వం న్యాయమూర్తులను విభజించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి హైకోర్టుకు మొత్తం 61 మంది న్యాయమూర్తులను నిర్ధారించారు. 60:40 నిష్పత్తిలో ఏపీకి 37 మంది, తెలంగాణకు 24 మంది న్యాయమూర్తులను ఖరారు చేశారు.
ఉమ్మడి హైకోర్టులో ప్రసుత్తం పనిచేస్తున్న 31 మంది న్యాయమూర్తుల్లో 17 మందిని ఏపీకి, 12 మందిని తెలంగాణకు కేటాయించారు. ఇద్దరు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ప్రస్తుతం కేరళ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ దామా శేషాద్రినాయుడును ఏపీకే కేటాయించారు. త్వరలో ఆయన బదిలీపై ఇక్కడికి రానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రాసిన లేఖను అందుకన్నాక ఏసీజే.. ఆ విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తులతో చర్చిస్తారు. హైకోర్టు బిల్డింగ్‌ కమిటీ.. ఏపీ సర్కారు ప్రతిపాదించిన భవనాల్ని చూసొచ్చి వాటిలో మార్పులుంటే సూచిస్తుంది. హైకోర్టు తరలింపునకు అంతా సిద్ధమైతే కేంద్ర మంత్రివర్గ అనుమతితో రాష్ట్రపతి ప్రకటన జారీచేస్తారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు 
జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఏ.రామలింగేశ్వరరావు, జస్టిస్‌ దామా శేషాద్రినాయుడు(ప్రస్తుతం కేరళలో పనిచేస్తున్నారు), జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ టి.సునీల్‌చౌదరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎ.శంకరనారాయణ, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌, జస్టిస్‌ జి.ఉమాదేవి, జస్టిస్‌ ఎన్‌.బాలయోగి, జస్టిస్‌ టి.రజనీ, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ ఎం.గంగారావు.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు 
జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌, జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ చల్లా కోదండరామ్‌, జస్టిస్‌ బి.శివశంకరరావు, జస్టిస్‌ ఎమ్మెస్కే జైశ్వాల్‌, జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌, జస్టిస్‌ పి.కేశవరావు, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌.

Link to comment
Share on other sites

జరగడానికి వీల్లేదు 
ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు భూమిపూజ చేసిన సీఎం 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో నేరాలు జరగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తుళ్లూరులో ఏపీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి ఆయన గురువారం భూమిపూజ చేశారు. దొంగతనం ఏ రూపంలో అయినా అది పోలీసు, ప్రభుత్వం ఉదాసీనత వల్లనే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేసినా న్యాయస్థానాల్లో ఏదో రకంగా తప్పించుకోవచ్చని చాలా మంది అనుకుంటున్నారన్నారు. నేరాల ఆధారాలకు సంబంధించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సమర్థంగా పనిచేసి తప్పు చేసిన వారు తప్పించుకోకుండా చేయాలని సూచించారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు ఈ ఫోరెన్సిక్‌ కలిగి ఉండాలన్నారు. అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే వూపందుకున్నాయని చంద్రబాబు తెలిపారు. రూ.400 కోట్ల వ్యయంతో ఈ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్మిస్తున్నట్లు డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

11 hours ago, sonykongara said:

అమరావతిలో హైకోర్టు! 
ఏర్పాటుకు రంగం సిద్ధం 
నేడు పూర్తి కానున్న కీలక ప్రక్రియ 
తాత్కాలిక సీజేకు అందనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ 
ఈనాడు - హైదరాబాద్‌ 

అమరావతిలో ఏపీ హైకోర్టును తాత్కాలిక భవనంలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మే నాటికి అన్నీ సిద్ధంచేసి జూన్‌ కల్లా ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఇందుకు ప్రతిపాదించిన రెండు, మూడు భవనాల్ని పరిశీలించి అభిప్రాయం తెలియజేయాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ను కోరుతూ సిద్ధం చేసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేసినట్లు తెలిసింది. అంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఆ లేఖను గురువారం(నేడు) ఏసీజేకు అందజేయనున్నట్లు సమాచారం. శాశ్వత హైకోర్టుకు సంబంధించిన నమూనా ఖరారు తుది దశలో ఉంది. శాశ్వత భవన నిర్మాణం మొదలు పెట్టాక.. పూర్తి చేయడానికి పదహారు నెలలు పడుతుందనేది ఓ అంచనా. ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్‌లో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కక్షిదారులు అక్కడకి వెళ్లాల్సి  వస్తోంది. వారిని దృష్టిలో పెట్టుకొని ఏపీ హైకోర్టును అమరావతి పరిధిలోని తాత్కాలిక భవనంలో ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది.
ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులు ఇచ్చిన ఐచ్ఛికాల ఆధారంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇటీవల కేంద్రప్రభుత్వం న్యాయమూర్తులను విభజించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి హైకోర్టుకు మొత్తం 61 మంది న్యాయమూర్తులను నిర్ధారించారు. 60:40 నిష్పత్తిలో ఏపీకి 37 మంది, తెలంగాణకు 24 మంది న్యాయమూర్తులను ఖరారు చేశారు.
ఉమ్మడి హైకోర్టులో ప్రసుత్తం పనిచేస్తున్న 31 మంది న్యాయమూర్తుల్లో 17 మందిని ఏపీకి, 12 మందిని తెలంగాణకు కేటాయించారు. ఇద్దరు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ప్రస్తుతం కేరళ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ దామా శేషాద్రినాయుడును ఏపీకే కేటాయించారు. త్వరలో ఆయన బదిలీపై ఇక్కడికి రానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రాసిన లేఖను అందుకన్నాక ఏసీజే.. ఆ విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తులతో చర్చిస్తారు. హైకోర్టు బిల్డింగ్‌ కమిటీ.. ఏపీ సర్కారు ప్రతిపాదించిన భవనాల్ని చూసొచ్చి వాటిలో మార్పులుంటే సూచిస్తుంది. హైకోర్టు తరలింపునకు అంతా సిద్ధమైతే కేంద్ర మంత్రివర్గ అనుమతితో రాష్ట్రపతి ప్రకటన జారీచేస్తారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు 
జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఏ.రామలింగేశ్వరరావు, జస్టిస్‌ దామా శేషాద్రినాయుడు(ప్రస్తుతం కేరళలో పనిచేస్తున్నారు), జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ టి.సునీల్‌చౌదరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎ.శంకరనారాయణ, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌, జస్టిస్‌ జి.ఉమాదేవి, జస్టిస్‌ ఎన్‌.బాలయోగి, జస్టిస్‌ టి.రజనీ, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ ఎం.గంగారావు.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు 
జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌, జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ చల్లా కోదండరామ్‌, జస్టిస్‌ బి.శివశంకరరావు, జస్టిస్‌ ఎమ్మెస్కే జైశ్వాల్‌, జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌, జస్టిస్‌ పి.కేశవరావు, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌.

Enduku antha tondara.. HC hyd lo untene AP ki melu.. TG tho migilina issues solve chesukovachu..Schedule 9 asthulu panchaka kani.. Seperate HC ki oppukokidadu AP..

Link to comment
Share on other sites

ప్రపంచ బ్యాంక్‌ ప్రాజెక్టులపై వర్క్‌షాపులు
29-12-2017 08:58:37
 
636501347191434306.jpg
అమరావతి: అమరావతిలో ప్రపంచ బ్యాంక్‌ ఆర్ధిక సహా యంతో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులు లోపరహితంగా, ప్రజలపైనా, పర్యావరణంపైనా ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపని విధంగా పూర్తవ్వా లంటే పాటించాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానాలపై వివిధ వర్గాల వారి అభిప్రా యాలను తెలుసు కునేందుకు ఏపీసీఆర్డీయే కన్సల్టేషన్‌ వర్క్‌షా పులను నిర్వహిం చనుం ది. రాజధాని లోని మందడం, నీరుకొం డల్లో వచ్చే నెల 6వ తేదీన వరుసగా ఉదయం 11, మధ్యాహ్నం 3 గంటలకు ఇవి జరగనున్నాయి. రాజధానిలో ప్రపంచ బ్యాంక్‌ తోడ్పాటుతో నిర్మితమవుతున్న రహదారులు, వరద నియంత్రణ ప్రాజెక్టు ల కారణంగా నిర్వాసితులు లేదా ప్రభావి తులయ్యే వారికి పకడ్బందీ పునరావాసం లభించేలా చూడడంతోపాటు ఆ ప్రాజెక్టులు పర్యావరణంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపడాన్ని నిరోధించేందుకు ఇప్ప టికే ముసాయిదా ప్రతిపా దనలు సిద్ధమయ్యాయి.
 
    వీటి పై విస్తృత చర్చ జరిగితే అవి మరింత పక్కాగా రూపు దిద్దుకునేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో సీఆర్డీయే పైన పేర్కొన్న కన్సల్టేషన్‌ వర్క్‌షాపులను తలపెట్టింది. వీటిల్లో సదరు రంగాల్లో నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రకృతి ప్రేమికులు, సామాజికవేత్తలు, ఇతర వర్గాల వారు పాల్గొని, ముసాయిదా ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలు తెలుపాలని సీఆర్డీయే కోరుతోంది. వీటిల్లో వ్యక్తమైన అభిప్రాయాలు, వచ్చిన సూచనలను క్రోడీకరించి, ప్రపంచ బ్యాంక్‌ ప్రాజెక్టులు ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపని విధంగా పూర్తయ్యేందుకు దోహదపడే మార్గనిర్దేశకాలను ఖరారు చేస్తామని పేర్కొంది.
Link to comment
Share on other sites

రాజధానిలో 320 కి.మీ.రోడ్లు
29-12-2017 04:39:56
 
636501191974850657.jpg
  •  ఏడాదిలోగా పూర్తిస్థాయిలో అభివృద్ధి: మంత్రి నారాయణ
అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాజధానిలో అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న 320 కిలోమీటర్ల పొడవైన ప్రాధాన్య రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే ఏడాది డిసెంబరు నాటికి వీటిని పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ చెప్పారు. ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారఽథి, ఏడీసీ, ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులతో కలసి గురువారం ఆయన రాజధానిలో జరుగుతున్న రహదారులు, పచ్చదనం ప్రాజెక్టుల పనులను పరిశీలించారు. గ్రీనరీ పనులు చురుగ్గా సాగుతున్నాయంటూ ఏడీసీని అభినందించారు. తొలుత నారాయణ బృందం రాజధాని గ్రామాల్లో ఒకటైన వెంకటపాలెం ఏడీసీ నర్సరీని సందర్శించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతికి అత్యుత్తమ రవాణా వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నిర్మిస్తున్న 320 కిలోమీటర్ల ప్రాధాన్య రహదారులను 2018, డిసెంబరుకల్లా పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. అనంతరం నారాయణ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఇతర ప్రధాన రహదారులైన ఎన్‌-16, ఈ-8ల పనులను అనంతవరం వద్ద పరిశీలించారు. వీటికి అనుసంధానంగా ఉన్న వంతెలన పనులను వేగవంతం చేయాల్సిందిగా కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధానిలో జరిగే అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు ఇకపై ప్రతి వారం వాటిని ప్రత్యక్షంగా పరిశీలిస్తానని చెప్పారు. రాజధానిలో పేదలకు ఆధునిక వసతులు కలిగిన ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు నావిగేషన్‌ బ్రిడ్జి పనుల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 కల్లా రాజధానిలో 85 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

పూర్తయితే అమరావతి మహాద్భుతం
29-12-2017 02:45:57
 
636501123586659044.jpg
  • ట్విట్టర్‌లో రాష్ట్రపతి ప్రశంస
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని ప్రభుత్వ సాంకేతిక కేంద్రం ఆసియాలోనే పెద్దదని విన్నానని, ఆన్‌లైన్‌లో సచివాలయం పాత్రను అది పోషిస్తోందని.. అనేక సర్వీసులను ఆన్‌లైన్‌లో దీని ద్వారా అందిస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. అమరావతి నిర్మాణ ప్రణాళికలను కూడా మెచ్చుకున్నారు. ‘మొత్తం నిర్మాణం పూర్తయితే అమరావతి మొత్తం దేశంలోనే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు కలిగిన నగరం అవుతుంది. దేశంలో అది టెక్నోపొలి్‌సగా నిలుస్తుంది. ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబులో అత్యుత్తమ అభివృద్ధి సాధించడానికి పడే తపననే చూస్తున్నారు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. .ప్రతి ఇంటికీ, ప్రతి కార్యాలయానికీ ఇంటర్‌నెట్‌తో అనుసంధానం తప్పనిసరి అవుతున్న నేటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భవిష్యత్‌ను అర్థం చేసుకుని వ్యవహరిస్తోందని ప్రశంసించారు. బుధవారం అమరావతికి వచ్చి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత తన భావాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ప్రస్తుత హైపర్‌ యుగంలో ప్రభుత్వాలు ప్రజల అవసరాలకు కేవలం ప్రతిస్పందిస్తే చాలదని.. నిత్యం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

అమరావతి దేశంలోనే దీటైన సాంకేతిక నగరమవుతుంది 
ట్విట్టర్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే సాంకేతికంగా దేశంలోనే అత్యంత దీటైన నగరంగా తయారుకానుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అత్యుత్తమ అంశాల సాధన కోసం పడే తపనను చంద్రబాబు నుంచి ప్రజలు ఆశిస్తున్నారన్నారు. ‘‘రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రం ఆసియాలోనే అతిపెద్దది. ఇక్కడ వర్చువల్‌ సచివాలయం నిర్వహిస్తున్నారు. సైబర్‌ స్పేస్‌లో వివిధ రకాల పౌరసేవలు అందిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచంలో ప్రభుత్వం, పరిపాలన.. ఆన్‌లైన్‌, ఆన్‌టైమ్‌లో సాగాలి. రియల్‌ టైమ్‌ ఇన్‌ఫర్మేషన్‌ గవర్నెన్స్‌ కోసం డ్రోన్ల వినియోగం.. భద్రత, పోలీసింగ్‌, మైనింగ్‌, పట్టణాభివృద్ధి, వ్యవసాయ దిగుబడుల పెంపు, ప్రకృతి విపత్తులను ముందే ఊహించడం వంటి వాటికి దీన్ని వినియోగించడం బాగుంది. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తును అర్థం చేసుకుంటుంది. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంది.’’ అని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

ఇకపై ప్రతి వారం రాజధాని పనుల పరిశీలన: నారాయణ 
28ap-state15a.jpg

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఇకపై వారం వారం స్వయంగా పరిశీలించి ప్రజలకు వివరిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి అభివృద్ధి ప్రాధికారసంస్థ (ఏడీసీ) అధికారులతో కలిసి మంత్రి నారాయణ గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే డిసెంబరుకు 320 కిలోమీటర్ల మేర రహదారుల పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. వేసవి ముగిసేనాటికి సగానికిపైగా నిర్మాణాలు ముగిసేలా అధికారులు గుత్తేదారులపై ఒత్తిడి తేవాలని సూచించారు. అనంతరం వెంకటపాలెంలో ఉద్యానవన నర్సరీని సందర్శించారు. ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి మాట్లాడుతూ.. 320 కిలోమీటర్ల పొడువునా మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నామని, జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతందని వివరించారు.

Link to comment
Share on other sites

అమరావతిలో ఉత్తమ విధానాలకు ఏపీడీఆర్‌ఐ

ఈనాడు అమరావతి: అమరావతి నిర్మాణానికి సంబంధించి వచ్చే 5 నుంచి 20 ఏళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా అంతర్గత సామర్థ్యాల పెంపు, ముఖ్య దార్శనిక సూత్రాల్ని తూచ తప్పక పాటించేలా చూడటం, వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి అవసరమైన నైపుణ్యాల్ని, ఉత్తమ విధానాల్ని అందిపుచ్చుకోవడం వంటి లక్ష్యాలతో... రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్లానింగ్‌ డిజైన్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను (ఏపీడీఆర్‌ఐ) ఏర్పాటు చేయనుంది. దీనికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనరు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఒక సాంకేతిక నిపుణుడిని ఈ సంస్థకు ముఖ్య కార్య నిర్వహణాధికారిగా (సీఈవో) నియమిస్తారు. అమరావతి ప్లానింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రణాళిక-మౌలిక వసతులు, ప్రజలు-ఆర్థిక, సమాచారం-పాలన అని మూడు ప్రధాన విభాగాలుంటాయి. పట్టణ ప్రణాళిక, డిజైన్‌, మౌలిక వసతులు, ఆర్థికాభివృద్ధి, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ తదితర రంగాలకు చెందిన 15 మంది సబ్జెక్ట్‌ నిపుణుల్ని నియమిస్తారు. సీఈవో కార్యాలయంలో పనిచేసేందుకు కొందరు సిబ్బంది ఉంటారు. ప్రస్తుతం సీఆర్‌డీఏ వివిధ సంస్థలతో కలసి చేపడుతున్న ప్రాజెక్టుల్ని ఏపీడీఆర్‌ఐ పరిధిలోకి తెస్తారు. పట్టణ ఆస్తులు, మౌలిక వసతుల నిర్వహణ వ్యవస్థ (యూఏఐఎంఎస్‌), ఐసీటీపై జపాన్‌కు చెందిన వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖతో (మేటి) కలసి అధ్యయనం, బ్రిటిష్‌ జియోలాజికల్‌ సర్వే ప్రాజెక్టు, పట్టణ రవాణా ప్రణాళిక, ఆనంద సూచి, ఎల్‌పీఎస్‌ డాక్యుమెంటేషన్‌, సింగపూర్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌ సంస్థతో కలసి చేపడుతున్న ప్రాజెక్టు వంటి వాటిని దీని పరిధిలోకి తీసుకురానున్నారు.

Link to comment
Share on other sites

మాల్దీవుల తరహాలో ఏపీలో పర్యాటకం 
జాతీయ మెరైన్‌ మ్యూజియంగా ఐఎన్‌ఎస్‌ విరాట్‌ 
పర్యాటక వారసత్వ బోర్డు ద్వితీయ సమావేశంలో సీఎం ఆమోదం 
28ap-state1a.jpg

ఈనాడు అమరావతి: మాల్దీవుల తరహాలో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆ దీవుల్లో కేవలం 4కోట్ల మంది జనాభా ఉంటే 30-40 సీప్లేన్‌లున్నాయని తెలిపారు. ప్రపంచస్థాయి ఉత్తమ పర్యాటక గమ్యస్థానంగా భవానీద్వీపాన్ని అభివృద్ధి చేయాలని.. ఇక్కడున్న ఏడు ద్వీపాలను ఒక్కోదాన్ని ఒక్కో దృక్పథంతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటక వారసత్వ బోర్డు నిర్ణయించింది. సీబీటీ స్టూడియోపాడ్‌ కన్సార్టియం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ గురించి ముఖ్యమంత్రికి పర్యాటక శాఖ ప్రత్యేక కమిషనర్‌ హిమాన్షుశుక్లా వివరించారు. మొత్తం 7 ద్వీపాల్లో మొదటివిడతలో 792 ఎకరాల్లోని ఒక ద్వీపాన్ని, 515 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మరో మూడు ద్వీపాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.300 కోట్లతో 15నెలల వ్యవధిలో రుషికొండలో ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌకను జాతీయ స్థాయి మెరైన్‌ మ్యూజియంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. బోర్డు ద్వితీయ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో జరిగింది. పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా, ఇతర అదికారులు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. 9పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది.

బోర్డు ఆమోదం తెలిపినవాటిలో... 
మధురవాడ కొండపైన 5నక్షత్రాల హోటల్‌ ఏర్పాటుకు పార్క్‌ గ్రూపు ప్రతిపాదనలు సమర్పించినట్లు అధికారులు తెలపగా.. ‘‘పోటీ పెట్టండి, అక్కడ కనీసం 3హోటళ్లు రావాలి. వచ్చే అయిదేళ్లలో విశాఖలో 25వేల అదనపు హోటల్‌గదులు రావాలి, ప్రస్తుతం 2500 గదులు కూడా లేవ’’ని సీఎం వ్యాఖ్యానించారు. బీ స్వదేశ్‌దర్శన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతో చేపట్టనున్న అరకు ట్రైబల్‌ సర్క్యూట్‌ అంచనా వ్యయం రూ.163.02కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ.127.41కోట్లు, రాష్ట్రం వాటా రూ.35.61కోట్లు. ఇందులో సాహస కార్యక్రమాల జోన్‌, బోటింగ్‌ ఎరీనా, కళా ప్రదర్శన కేంద్రం, గిరిజన ప్రదర్శనల కోసం ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, 150మీటర్ల సస్పెన్షన్‌ వంతెన, వజ్రాలకొండలో కృత్రిమ స్కైయింగ్‌ 
తదితరాలుంటాయి.

* అమరావతిలో... రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలో రూ.15.8కోట్ల అంచనా వ్యయంతో 2018 నవంబరులో స్పీడ్‌ బోట్‌ రైడ్‌ నిర్వహిస్తారు. ఇందులో ఏపీ నుంచి ఇద్దరు ప్రతినిధులు పోటీపడతారు. 33దేశాల నుంచి రైడర్లు ఈ పోటీలకు రానున్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

* అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో మెగా శిల్పారామం ఏర్పాటు.బీ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్‌లో 15 ఎకరాల్లో రూ.200 కోట్లతో లగ్జరీ బీచ్‌రిసార్ట్స్‌. బీ కడప జిల్లాలోని గండికోటలో రూ.7.5కోట్ల అంచనా వ్యయంతో రోప్‌వే ఏర్పాటు.

* ఇవేగాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టుల్లో రూ.16.7కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

* షెరటాన్‌ 5 నక్షత్రాల హోటల్‌కు మార్చి 1న శంకుస్థాపన: రూ.200 కోట్లతో విజయవాడలో ఎన్‌ఏసీ గ్రూపు ఏర్పాటు చేయదలచిన షెరటాన్‌ 5నక్షత్రాల హోటల్‌కు మార్చి 1న శంకుస్థాపన నిర్వహిస్తున్నామని దానికి రావాలంటూ ఆ గ్రూపు ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. 

Link to comment
Share on other sites

అమరావతిలో భూగర్భ విద్యుత్‌ లైన్లు
01-01-2018 01:54:19
తీగలు కనిపించొద్దు
విద్యుత్‌ ఆదా పరికరాలే వాడాలి!
ఇంధన పొదుపుపై చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయస్థాయిలో అమరావతిలో అంతరాయం లేని, నాణ్యమైన కరెంట్‌ సరఫరా చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రపంచశ్రేణి గ్రీన్‌ఫీల్డ్‌ రాజధానిగా నిర్మిస్తున్న అమరావతిలో ఎక్కడా ఓవర్‌హెడ్‌ విద్యుత్‌లైన్లు కనిపించడానికి వీల్లేదని, భూగర్భంలోనే వేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లలో విద్యుత్‌ను ఆదా చేసే ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల వాడకాన్ని మరింత పెంచేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. అప్పుడే రాష్ట్రం ఇంధన పొదుపులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని అన్నారు.
 
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు విద్యుత్‌ను ఆదా చేసే ఎల్‌ఈడీ బల్బులు, స్టార్‌ రేటెడ్‌ ఫ్యాన్లు వంటి గృహోపకరణాలను సరసమైన ధరలకు అందజేయాలన్నారు. ఈ ఉపకరణాలను నేరుగా లేదా సులభమైన వాయిదా పద్ధతిలో వ్యాపారులు విక్రయించాలన్నారు. ఇది తమ ప్రభుత్వం ప్రజలకు అందించే నూతన సంవత్సర కానుకగా చంద్రబాబు అభివర్ణించారు. ఆదివారం ఆయన ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర, సుస్థిర ఇంధన సామర్థ్య ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. స్టార్‌ రేటెడ్‌ ఉపకరణాలను వాడటం వల్ల 30-40 శాతం విద్యుత్‌ ఆదా అవుతుందని, ఫలితంగా కరెంటు బిల్లులు తగ్గడమే గాక, పర్యావరణానికి హాని చేసే వాయువులు విడుదల కూడా తగ్గుతుందని సీఎం వెల్లడించారు.
 
అవార్డులు ప్రజలకు అంకితం
విద్యుత్‌ రంగంలో ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలు, నెడ్‌క్యాప్‌, సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ గత మూడేళ్లలో దాదాపు 20 ప్రతిష్టాత్మక అవార్డులు సాధించడం మన పనితీరుకు నిదర్శనమన్నారు. ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్‌ వరుసగా మూడేళ్లు జాతీయ అవార్డులు అందుకుని హ్యాట్రిక్‌ సాధించడం మనందరికీ గర్వకారణమని సీఎం అన్నారు.
 
ఈ అవార్డులు ప్రభుత్వంపై మరింత బాధ్యతను పెంచాయన్నారు. జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులన్నింటినీ రాష్ట్ర ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. గ్రామ పంచాయతీలన్నింటిలో 30 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను అమర్చడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ఏటా 333 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుందని, ఫలితంగా రూ.200 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి వివరించారు.

Link to comment
Share on other sites

రాష్ట్రంలో... 
నిర్మాణాత్మక అడుగులు 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలకు 2018 ఎంతో కీలక సంవత్సరం. 2019లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2018లో ఆయా పథకాల మీద చేసే కసరత్తే ప్రాధాన్యాన్ని సంతరించుకోనుంది. ముఖ్యంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు తదితర నిర్మాణాలు నూతన సంవత్సరంలో ఎలా ముందుకు సాగనున్నాయంటే..
అమరావతి.. 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణపరంగా 2018 అత్యంత కీలకమైన సంవత్సరం. పరిపాలనా నగరం, న్యాయ నగరంలో కొంత భాగం కలిపి 1375 ఎకరాలకు ప్రణాళిక సిద్ధమైంది. శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతులు ఖరారయ్యాయి. త్వరలోనే వీటికి టెండర్లు పిలిచి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించనున్నారు. 2018 చివరి నాటికి వీటి నిర్మాణ కార్యక్రమాలు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 
* పరిపాలనా నగరంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల కోసం సీఆర్‌డీఏ పెద్ద ఎత్తున గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టింది. 60కి పైగా టవర్లలో, 3840 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. 2018లో వీటి నిర్మాణాలు పూర్తవుతాయి. 
* ఏడాదిలో ముఖ్య రహదారుల నిర్మాణాలు కొలిక్కి రానున్నాయి. 
* రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్‌లలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు 2018లో వేగంగా జరగనున్నాయి. 
* అమరావతిని కృష్ణా జిల్లాతో అనుసంధానిస్తూ... కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణం 2018లో మొదలయ్యే అవకాశం ఉంది.
పోలవరం.. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు 2018 సంవత్సరం ఎంతో ముఖ్యమైనది. ఎగువ కాఫర్‌ డ్యాంను 41.5 మీటర్ల ఎత్తుకు నిర్మించి, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌, అప్రోచ్‌ ఛానల్‌ నిర్మాణాలు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఈ లక్ష్యాన్ని అయిదు నెలల్లో పూర్తిచేయాల్సి ఉంది. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించే సమయానికి స్పిల్‌ వే, గేట్ల ఏర్పాటుతో సహా పూర్తి కావాల్సిందే. 2019లో మిగిలిన ప్రధాన డ్యాం పూర్తి స్థాయిలో నిర్మించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన.
* ఎగువ కాఫర్‌ డ్యాం ఆకృతులకు ఆమోదం రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కీలకాంశాలు ఇంకా కేంద్రం తేల్చాల్సి ఉంది. దిగువ కాఫర్‌ డ్యాంలో పునాది పనులు వేగంగా సాగుతున్నాయి. 
* స్పిల్‌ వే నిర్మాణం పూర్తి చేయాలి, గేట్లు ఏర్పాటు చేయాలి. గేట్ల తయారీ దాదాపు పూర్తి కావొచ్చింది. స్పిల్‌ వే కాంక్రీటు పనులు మందగమనంతో ఉన్నాయి. 
* స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ ఛానల్‌ నిర్మాణమూ పూర్తి చేయాలి. అప్రోచ్‌ ఛానల్‌ తవ్వకమూ పూర్తి కావాలి. 
* అయిదు నెలల్లో ఇవన్నీ పూర్తి చేయగలిగితేనే 2018లో గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వడం సాధ్యమవుతుంది.
అనుసంధానంపై అడుగులు.. 

* గోదావరి నుంచి పెన్నాకు అంతర్గత అనుసంధానం చేయాలని, దాదాపు 360 టీఎంసీల నీటిని పోలవరం జలాశయం నుంచి మళ్లించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
* అదే సమయంలో జాతీయ జల అభివృద్ధి సంస్థ తెలంగాణలోని ఖమ్మం జిల్లా అకినేపల్లి నుంచి 240 టీఎంసీల నీటిని పెన్నాకు అక్కడి నుంచి కావేరికి మళ్లించవచ్చని ఓ ప్రతిపాదన సిద్ధం చేసింది. 
* అయితే, అకినేపల్లి కన్నా పోలవరం నుంచి పెన్నా కావేరి అనుసంధానమే మేలు అని ఏపీ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో 2018వ సంవత్సరంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్లే అవకాశాలున్నాయి. అత్యధిక ప్రయోజనం గల ప్రతిపాదనకు కేంద్రం చేయూత అందే అవకాశం ఉంది. 
* రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 
* 2018లో ఆంధ్రప్రదేశ్‌కు ఈ రెండూ అత్యంత కీలకాంశాలు కానున్నాయి.
- ఈనాడు, అమరావతి

రాజధానికి రూ.వెయ్యి కోట్ల గ్రాంట్‌!
02-01-2018 02:42:05
ముందుకొచ్చిన జపాన్‌ సంస్థలు
విజయవాడలో 1, అమరావతిలో 4 ప్రాజెక్టులు
అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణంతోపాటు దానికి సమీపంలోనే ఉన్న విజయవాడను మరింతగా అభివృద్ధి పరిచేందుకు జపాన్‌కు చెందిన కొన్ని సుప్రసిద్ధ సంస్థలు సుమారు రూ.1,000 కోట్లను గ్రాంట్‌గా ఇవ్వనున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ఒప్పందం కుదురుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అమరావతిని అత్యాధునిక మౌలిక వసతుల కేంద్రంగా తీర్చిదిద్దాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... అందుకోసం అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిపుష్టమైన డేటా సెంటర్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, వాతావరణ అధ్యయన వ్యవస్థలు, నీటిశుద్ధి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన 4ప్రాజెక్టులతోపాటు విజయవాడలో ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టం నెలకొల్పేందు కు జపాన్‌కు చెందిన ఆయా రంగాల్లోని ప్రఖ్యాత కంపెనీలు ముందుకొచ్చాయి. వీటి పూర్తికి మొత్తం రూ.1242.50 కోట్ల వ్యయం అవసరమని అంచనా వేయగా, అందులో రూ.వెయ్యి కోట్లను జపాన్‌ సంస్థలు గ్రాంట్‌గా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. వీటివల్ల అమరావతి, విజయవాడకు భారీ లబ్ధి చేకూరుతుందని అధికారులు అంటున్నారు.
 
ఇవీ ప్రాజెక్టులు
అమరావతిలో ఈ సంస్థలు చేపట్టనున్న 4 ప్రాజెక్టుల్లో... రూ.277 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న డేటా సెంటర్‌ మరియు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రూ.268కోట్ల వ్యయమయ్యే రాడార్‌ ఆధారిత వాతావరణ వ్యవస్థలు, రూ.236.50 కోట్లు అవసరమైన తాగునీటి శుద్ధి వ్యవస్థలు, రూ.139కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మురుగునీటి శుద్ధి వ్యవస్థలు ఉన్నాయి. ఇవి కాకుండా.. రూ.322 కోట్ల అంచనా వ్యయంతో విజయవాడలో ట్రాఫిక్‌ వ్యవస్థను మెరుగు పరిచేందుకు సంకల్పించిన అత్యాధునిక ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టం కూడా ఈ జాబితాలో ఉంది.

నిధులకు నవ మార్గాలు
02-01-2018 02:43:30

రాజధాని నిర్మాణానికి చక్కటి ప్రణాళిక
సత్ఫలితాలిస్తున్న సీఆర్డీయే కార్యాచరణ
అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని నిర్మిస్తారంటున్నారుగానీ అందుకు కావాల్సిన వేలాది కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తెస్తారు, ఏ విధంగా సమకూర్చుకుంటారన్న అనుమానాలు ఎందరిలోనో ఉన్నాయి. అయితే.. చక్కటి ప్రణాళికా నైపుణ్యం, వ్యూహాత్మకంగా ముందుకు కదలగల నైజం, సంప్రదాయ రుణసేకరణ విధానాలతోపాటు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అద్దం పట్టే రుణ ప్రణాళికలను రూపొందించగల శక్తిసామర్థ్యాలు, సృజనాత్మకత ఉంటే అదంత కష్టమేమీ కాదని సీఆర్డీయే చాటుతోంది! రాజధానిని నిర్మించేందుకు తొలివిడతగా 3 ఏళ్లలో చేపట్టనున్న పనులకు రూ.29,676 కోట్ల వ్యయమవుతుందని (పూర్తిస్థాయిలో అమరావతి రూపొందేందుకు మొత్తం రూ.58,000 కోట్లు అవసరం) అంచనా వేసిన సీఆర్డీయే ఆ మొత్తాన్ని వివిధ మార్గాల్లో సమకూర్చుకునేందుకు పకడ్బందీ ప్రణాళికలను రూపొందించింది.
 
పనులు ప్రారంభించే వరకూ నిరీక్షించకుండా, మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమవుతుండగానే దేశ, విదేశాలకు చెందిన ఆ రంగ నిపుణులు, అనుభవజ్ఞులతో ముమ్మర చర్చలు జరిపి, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకుని, తదనుగుణంగా ముందుకు కదిలింది. తద్వారా తొలి మూడేళ్లలో చేపట్టే పనులకు కావలసిన నిధుల్లో సుమారు 45 శాతానికి ఇప్పటికే వివిధ ద్రవ్యసంస్థలు, రుణవితరణ సంస్థల నుంచి నిర్దిష్ట హామీలు పొందింది. తొలి మూడేళ్లలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంతోపాటు టైర్‌-1 ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధి తదితర పనులతో కూడిన ట్రంక్‌-2 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కల్పనకు మొత్తం రూ.29,676 కోట్లు కావాలని సీఆర్డీయే అంచనా వేసింది. ఇందులో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు రూ.6,705 కోట్లు, ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.7,218 కోట్లు, ట్రంక్‌-2 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.15,753 కోట్లు అవసరమని లెక్కించింది. అమరావతికి అవసరమైన నిధులను ప్రధానంగా 9 మార్గాల్లో సమీకరించేందుకు ప్రతిపాదించింది.
 
నిధుల సమీకరణకు ప్రతిపాదించిన 9 మార్గాలు ఇవీ..
రాజధానిలో అభివృద్ధి పరచిన భూమి విక్రయం
కేంద్ర ప్రభుత్వ పథకాలు
కన్వర్టబుల్‌ బాండ్ల జారీ
ఏడీబీ, ఏఐఐబీ తదితర అంతర్జాతీయ బ్యాంకుల నుంచి మల్టీలేటరల్‌, బైలేటరల్‌ రుణాలు
ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం
దేశీయంగా ఎల్‌ఐసీ వంటి రుణాలిచ్చే సంస్థల నుంచి స్వీకరణ
ఈక్విటీ విధానంలో పెన్షన్‌ ఫండ్స్‌, ఇన్‌ఫ్రా ఫండ్స్‌ ద్వారా సమీకరణ
అంతర్జాతీయంగా పేరొందిన ద్రవ్యసంస్థలు, పెట్టుబడి సంస్థల నుంచి రుణాలు
ఎన్‌ఆర్‌ఐ, మసాలా, గ్రీన్‌ బాండ్స్‌ జారీ

Link to comment
Share on other sites

లేకుండా..! 
అమరావతి రైలు మార్గంలో భద్రతకు ప్రాధాన్యం 
106 కి.మీ. 200 వంతెనలు 
రెండు మార్గాల్లో భవిష్యత్తులో రెండో లైను నిర్మాణానికి అవకాశం? 
ఆ మేరకు ఇప్పుడే భూసేకరణకు రైల్వేశాఖ నిర్ణయం 
ఈనాడు - హైదరాబాద్‌ 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని అనుసంధానించే రైలు మార్గాల నిర్మాణంలో భద్రతకు కీలక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు(56.8కి.మీ., రెండు లైన్లు), అమరావతి-పెదకూరపాడు(24.5కి.మీ., సింగిల్‌లైను), సత్తెనపల్లి-నరసరావుపేట(25కి.మీ., సింగిల్‌లైను)... మూడు నూతన మార్గాలు కలిపి 106 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. ఇందులో ఒక్కచోట కూడా లెవల్‌క్రాసింగ్‌ రాకుండా దక్షిణ మధ్య రైల్వే భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా ఆయా మార్గాల అలైన్‌మెంట్లను ఖరారు చేసింది. రైలు ప్రమాదాల్లో ఎక్కువ భాగం లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద జరుగుతుంటాయి. పట్టాలను దాటేక్రమంలో చాలా వాహనాలు రైలు ప్రమాదాలకు గురవుతుంటాయి. హైదరాబాద్‌ సమీపంలోని మాసాయిపేట లెవల్‌క్రాసింగ్‌ వద్ద మూడేళ్లక్రితం రైలు ఢీకొన్న ప్రమాదంలో 19 మంది పాఠశాల విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మూడోవంతు రైలు ప్రమాదాలు లెవల్‌క్రాసింగ్‌ల వద్దే జరుగుతున్నట్లు అంచనా. దేశంలో 28 వేల పైచిలుకు లెవల్‌ క్రాసింగ్‌లు ఉండగా 9వేలకుపైగా కాపలా లేని క్రాసింగ్‌లున్నాయి.
ఆర్వోబీలు, ఆర్‌యూబీలు 
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నుంచి.. ఉత్తర, దక్షిణ భారతం నుంచి రాకపోకలకు వీలుగా అమరావతికి మూడు కొత్త రైలు మార్గాలు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి తుది సర్వేని పూర్తిచేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను దక్షిణ మధ్య రైల్వే.. రైల్వే బోర్డుకు నవంబరులో పంపింది. పలు చోట్ల రోడ్డు మార్గాలు ఉన్న ప్రాంతాల నుంచి కొత్త రైలు మార్గాలు రానున్నాయి. లెవల్‌ క్రాసింగ్‌లు ఉంటే ప్రమాదాలకు ఆస్కారం ఉండటంతో.. ఆయా ప్రాంతాల్లో రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ), రోడ్‌ అండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ)లను నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. తద్వారా ఆయా మార్గాల్లో రైలు వచ్చేటప్పుడు గేటువేయడం, వాహనాల రాకపోకలకు ఆటంకం వంటి ఇబ్బందులు ఉండవు. వాహనాల రాకపోకలు ఆర్వోబీల మీదుగా, ఆర్‌యూబీల నుంచి సాఫీగా సాగిపోతాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
687 హెక్టార్ల భూసేకరణ 
మొత్తం మూడు లైన్లకు కలిపి 687 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని రైల్వేశాఖ తుది సర్వేలో గుర్తించింది. అమరావతి-పెద్దకూరపాడు, సత్తెనపల్లి-నరసరావుపేట లైన్లను ప్రస్తుతం సింగిల్‌లైన్‌గానే నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే భవిష్యత్తులో వివిధ ప్రాంతాల నుంచి రాజధాని అమరావతికి పెరిగే రాకపోకల్ని దృష్టిలో పెట్టుకుని భూసేకరణకు ఇబ్బంది రాకుండా.. రెండో లైనుకూ అవసరమైన భూమిని గుర్తించింది. రెండు లైన్లకు అవసరమైన భూసేకరణ లెక్కల్ని పరిగణనలోకి తీసుకుని డీపీఆర్‌లో పేర్కొంది.
కిలోమీటరుకు రెండు వంతెనలు
* మొత్తం వంతెనలు   200 
* భారీ వంతెన 1. కృష్ణా నదిపై 2.5 కిమీ 
* పెద్ద వంతెనలు       52 
* చిన్న వంతెనలు     147 
* ఆర్వోబీలు           23 
* ఆర్‌యూబీలు         3 
* మూడు రైలు మార్గాల దూరం 106 కిమీ 
* మొత్తం అంచనా   రూ.3,272.03 కోట్లు

Link to comment
Share on other sites

ప్రపంచబ్యాంకు మదింపు
ప్రాథమిక అధ్యయనం జరుగుతోంది 
కేంద్రం ఇప్పటివరకూ  రూ.1500 కోట్లు ఇచ్చింది 
ఏపీ ప్రభుత్వం రూ.1,583 కోట్లకు యూసీలు అందించింది 
రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి 
ఈనాడు - దిల్లీ 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం సీఆర్‌డీఏ 2016 మే నెలలో ప్రపంచ బ్యాంకును రూ.3,324 కోట్ల రుణం కోరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు వద్ద మదింపు దశలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాథమిక అంచనాలు, అధ్యయనాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రపంచ బ్యాంకు రుణం ఏ స్థాయిలో ఉంది? ఆ రుణం పొందాలంటే తొలుత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 30% మొత్తాన్ని ఖర్చు చేయాలని షరతు విధించడం నిజమా? కాదా? ఒకవేళ నిజమైతే అందుకు కారణలేంటి? కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇంతవరకూ ఎంత నిధులు విడుదల చేసింది? ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంత ఖర్చుచేసింది? వినియోగ ధ్రువీకరణ పత్రాల పరిస్థితి ఏంటి? అని మంగళవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జైట్లీ సమాధానమిచ్చారు. ఒకసారి ప్రాజెక్టు మదింపు పూర్తయితే రుణంపై సంప్రదింపులు జరుగుతాయని చెప్పారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు రుణానికి ఆమోద ముద్ర వేస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, సాధారణ కేటగిరీ రాష్ట్రాలు ప్రపంచ బ్యాంకు లాంటి బహుముఖ అభివృద్ధి బ్యాంకుల నుంచి విదేశీ రుణాలు తీసుకున్నప్పుడు ప్రాజెక్టు మొత్తం వ్యయంలో గరిష్ఠంగా 70% లభ్యమవుతుందని చెప్పారు. మిగిలిన 30% మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సొంత వనరుల నుంచి సమకూర్చుకుంటుందని స్పష్టం చేశారు. ఒకసారి ప్రాజెక్టు ప్రారంభమైతే రాష్ట్ర ప్రభుత్వం తాను పెట్టిన ఖర్చును ప్రపంచ బ్యాంకు నుంచి దశలవారీగా తీసుకుంటుందని తెలిపారు. అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు రుణానికి ఇప్పటివరకూ ఆమోదం లభించలేదని, అందువల్ల ఈ ప్రాజెక్టు కింద వినియోగం, విడుదల అన్న ప్రశ్న ఉత్పన్నం కాదని అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం... నూతన రాజధానిలో కొన్ని సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తున్నట్లు మరో లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆర్థికశాఖ సహాయమంత్రి పి.రాధాకృష్ణన్‌ తెలిపారు. రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఉభయసభలతోపాటు ఇతర అత్యవసరమైన మౌలిక వసతుల కల్పనకోసం ఆర్థికశాఖ ప్రత్యేక సాయం కింద ఇప్పటివరకూ రూ.1,500 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. రాజ్‌భవన్‌, అసెంబ్లీ నిర్మాణం కోసం 2014-15లో రూ.500 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం 2015-16లో రూ.350 కోట్లు, రాజ్‌భవన్‌, హైకోర్టు, సెక్రటేరియట్‌, అసెంబ్లీ ఉభయసభలుసహా, ఇతర అత్యవసర పట్టణ మౌలిక వసతుల కల్పనకోసం 2015-16లో రూ.200 కోట్లు, 2016-17లో రూ.450 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.1,583 కోట్లకు నీతి ఆయోగ్‌కు వినియోగ ధ్రువీకరణ పత్రాలు అందించినట్లు వివరించారు.

$

Link to comment
Share on other sites

ఏసీజేకు సీఎం లేఖ 
అందజేసిన ఏపీ ఏజీ 
భవనాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని కోరిన ముఖ్యమంత్రి 
నేడు న్యాయమూర్తుల సమావేశం
ఈనాడు, హైదరాబాద్‌: అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖను గత శనివారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌కు ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ అందజేశారు. అమరావతి పరిధిలో ఏపీ శాశ్వత హైకోర్టును ఈ ఏడాది జూన్‌ నుంచి తాత్కాలిక భవనంలో ప్రారంభించేందుకు రెండు, మూడు భవనాలను ప్రభుత్వం గుర్తించిందని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపాదిత భవనాల పరిశీలనకు న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటుచేయాలని కోరారు.  కమిటీ జనవరి రెండో వారంలోపు పరిశీలించి నెలాఖరుకల్లా సూచనలు చేస్తే ఎంపిక చేసిన భవనానికి తగిన మార్పుచేర్పులు చేయనున్నామని పేర్కొన్నారు. ఆ భవనాన్ని అన్ని సౌకర్యాలతో ఏప్రిల్‌ చివరినాటికి అందిస్తామని, మే నెలలో తరలింపు ప్రక్రియ చేపట్టి జూన్‌ రెండో తేదీ నుంచి న్యాయస్థానం పనిచేయడానికి సిద్ధం చేస్తామని వివరించారు. అమరావతిలో జస్టిస్‌ సిటీ నిర్మాణానికి అప్పటి ఏసీజే ఏకగ్రీవ ఆమోదం తెలిపిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. శాశ్వత భవన నిర్మాణానికి సమయం పడుతున్నందున తాత్కాలిక భవనాల్ని గుర్తించామని పేర్కొన్నారు. ఏపీ హైకోర్టును అమరావతి ప్రాంతంలో ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకతను లేఖలో తెలిపారు. వేసవి సెలవుల్లో తరలింపు ప్రక్రియ చేపడితే ఇబ్బందులు తలెత్తవని ప్రస్తావించారు.  లేఖ అందిన నేపథ్యంలో బుధవారం ఏసీజేతో సహా హైకోర్టు న్యాయమూర్తులందరితో (ఫుల్‌ కోర్టు) సమావేశం  జరగనుంది. ఉమ్మడి హైకోర్టు విభజనపై తమ అభిప్రాయాల్ని తీసుకోవాలని ఏపీ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, న్యాయవాదులు ఏసీజేను కోరగా వినతి సమర్పించాలని వారికి ఆయన సూచించారు. ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులు ఇచ్చిన ఐచ్ఛికాల ఆధారంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇటీవల కేంద్రం న్యాయమూర్తులను విభజించిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

Idi kanukuna jarigithe.. TG nunchi AP ki ravalsindi edi raadu.. :blink:

Link to comment
Share on other sites

పారిశ్రామిక వాడలు
04-01-2018 03:32:27
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
 సీఆర్డీయే సమావేశంలో సీఎం ఆదేశం
 అంతర్జాతీయ విమానాశ్రయానికి ల్యాండ్‌ పూలింగ్‌
 ఐఆర్‌ఆర్‌లోనూ భూ సమీకరణ
 ముందుకొచ్చిన 5 గ్రామాల రైతులు
 కనకదుర్గ ఫ్లై ఓవర్‌ పనులపైనా సమీక్ష
అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): రాజధాని ఔటర్‌ రింగ్‌రోడ్డు, అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే మార్గంలోని వివిధ జిల్లాల పరిధిలో పారిశ్రామికవాడ (ఇండస్ట్రియల్‌ టౌన్‌షి్‌ప)లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు, ప్రణాళికలను 30 రోజుల్లోగా అందజేయాలని సీఎం చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుఽధవారం రాత్రి నిర్వహించిన ఏపీసీఆర్డీయే సమీక్షా సమావేశంలో...అమరావతిలో చేపట్టిన వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. 3, 4 ఏళ్లలో నిర్మించబోయే నూతన అంతర్జాతీయ విమానాశ్రయం కోసం అవసరమైన భూమిని పూలింగ్‌ విధానంలో సమీకరించేందుకు తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మొత్తం 30 గ్రామాల మీదుగా సాగే అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు(ఐఆర్‌ఆర్‌)ను మొదటి విడతలో 97.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నట్లు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అవసరమైన భూమిని సమీకరణ ప్రాతిపదికన ఇచ్చేందుకు తాడికొండ, రావెల తదితర 5 గ్రామాల రైతులు ముందుకు వచ్చారని సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ చెప్పారు. దాంతో ఓఆర్‌ఆర్‌, ఐఆర్‌ఆర్‌ల పరిఽధిలోని ఇతర గ్రామాల్లోనూ అవసరమైన భూమిని పూలింగ్‌ ద్వారా సమీకరించేందుకు ప్రతిపాదనలు రూపొందించాల్సిందిగా సీఎం ఆదేశించారు. హైబ్రిడ్‌ నమూనాలో ఈ ప్రాజెక్టును చేపట్టాలన్నారు.
 
6 లేన్లుగా ఓఆర్‌ఆర్‌..!
అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డును 189 కిలోమీటర్ల పొడవున, 150 మీటర్ల వెడల్పుతో మొత్తం రూ.17,761 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు అధికారులు చంద్రబాబుకు తెలిపారు. 6 వరుసలతో నిర్మితమయ్యే ఈ భారీ రహదారి కోసం 3,404 హెక్టార్ల భూమి అవసరమవుతుందని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపి మొత్తం 87 గ్రామాల మీదుగా వెళ్తుందని అన్నారు. అలాగే, 200 మీటర్ల వెడల్పుతో అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా సాగే 393.6 కిలోమీటర్ల పొడవైన అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే పూర్తయితే రాయలసీమ రాజధానికి బాగా దగ్గరవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ రోడ్డుకు సమాంతరంగా రానున్న రైల్వేలైన్‌తో వీటి పొడవునా ఉన్న అన్ని జిల్లాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన భూసేకరణ పనులను చురుకుగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణ నిమిత్తం బడ్జెట్‌ తొలి త్రైమాసికంలోనే రూ.2,500 కోట్లు కేటాయించాలని అధికారులు ఈ సందర్భంగా సీఎంను కోరారు.
 
వంతెనలు అమరావతికే అలంకారం
అమరావతిని ఐకానిక్‌ వారధులు కలిగిన నగరంగా పిలిచేందుకు కృష్ణానదిపై నిర్మించే వంతెనల విషయంలో ప్రపంచంలోని పేరెన్నికగన్న అత్యుత్తమ నిర్మాణాలను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ ఏడాది మార్చి 31నాటికి పూర్తి కావాల్సి ఉన్న విజయవాడలోని కనకదుర్గమ్మ ఫ్లైవోవర్‌ నిర్మాణ పురోగతిని కూడా ఆయన సమీక్షించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...