Jump to content

Amaravati


Recommended Posts

రాజధాని రైతులకు శిక్షణ
26-02-2019 08:30:51
 
  • నిర్మాణ రంగంలో మెళకువలపై అవగాహన
  • నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ అకాడమీ, సీఆర్డీయేల ఆధ్వర్యంలో..
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధాని రైతులకు స్థిరాస్తి వ్యవహారాలతోపాటు నిర్మాణరంగంలోని మెళకువలపై అవగాహన కల్పించేందుకు నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ అకాడమీ, సీఆర్డీయేల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండో బ్యాచ్‌కు శిక్షణ సోమవారం ప్రారంభమైంది. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో దీనిని కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ప్రారంభించారు. ఈ దఫా 50 మంది రాజధాని రైతులు ప్రధానంగా నాలుగు అంశాలపై నెలరోజులపాటు శిక్షణ పొందనున్నారు. వారిని నిర్మాణదారులు, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్థిరాస్తి రంగ స్థితిగతులు, అనుమతులు పొందే ప్రక్రియ, లీగల్‌, ఫైనాన్స్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, లీడర్‌షిప్‌, మార్కెటింగ్‌, బ్రాండింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, టెక్నాలజీ, మెటీరియల్‌, ల్యాండ్‌స్కేపింగ్‌ తదితర అంశాలపై ఆయా రంగాల్లో నిపుణులు తెలియజేస్తారు.
 
 
శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన రైతులకు ధృవపత్రాలను అందజేస్తారు. శిక్షణ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా శ్రీధర్‌ ప్రసంగిస్తూ అమరావతిలో సుమారు 3 కోట్ల చదరపుటడుగుల నిర్మాణ ప్రణాళిక అమలవుతోందని, 2050 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల కల్పన జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజధానిలో సుమారు రూ.50,000 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని, ఇవి రూ.లక్ష కోట్ల విలువైన ఆర్ధిక వ్యవస్థను సృష్టించేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఏపీ రెరా సభ్యుడు చందు సాంబశివరావు తొలి రోజున ఏపీ రెరా చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు అనుమతులు పొందడమెలాగో తెలియజేశారు. సీబీఆర్‌ఈ టీం లీడర్‌ ప్రమోద్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో స్థిరాస్తిరంగ తీరుతెన్నులను వివరించారు. కార్యక్రమంలో సీఆర్డీయే గ్రూప్‌ డైరెక్టర్‌ ఎం.శ్రీనివాసబాబా, సీనియర్‌ అర్బన్‌ ప్లానర్‌ పి.వి.రమణరావు, రాజధానిలోని వివిధ గ్రామాలకు చెందిన తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Advertisement

Link to comment
Share on other sites

రకట్ట విస్తరణకు ప్రణాళిక
27-02-2019 08:23:36
 
636868526172040561.jpg
  • 23 నుంచి 82 అడుగులకు పెరగనున్న రహదారి వెడల్పు
  • రాజధానికి మెరుగైన అనుసంధానానికి ఏడీసీ చర్యలు
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధానికి అంతకంతకూ పెరుగుతున్న వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి ఉన్న కృష్ణానది కరకట్ట విస్తరణకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సంకల్పించింది. సుమారు రూ.537.35 కోట్ల అంచనా వ్యయంతో 17.28 కిలోమీటర్ల పొడవున దీనిని విస్తరించనున్నారు. ఈ పనులకు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా వీటిని చేపట్టి, పూర్తి చేయించేందుకు ఏడీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
 
 
ప్రస్తుతం సుమారు 23అడుగుల వెడల్పు మాత్రమే ఉన్న ఈ మార్గమే విజయవాడ వైపు నుంచి రాజధానికి వెళ్లే వారికి ప్రధాన మార్గంగా ఉపయోగపడుతోంది. ఈ మార్గంలోనే ముఖ్యమంత్రి నివాసగృహం, ప్రజావేదికలే కాకుండా పలు ఇతర భవనాలూ ఉన్నాయి. ఫలితంగా రోజురోజుకూ ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాల సంఖ్య అధికమవుతోంది. రాజధానిగా అమరావతిని ప్రకటించిన అనంతరం ఈ రహదారిని కొంతమేర విస్తరించడంతోపాటు పటిష్టపరచినప్పటికీ, సరిపోవడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఈ కరకట్ట మార్గాన్ని ఇప్పుడున్న 23 అడుగుల నుంచి 82 అడుగులకు విస్తరించడంతోపాటు వాహనాల భద్రత కోసం దానికి రెండువైపులా రక్షణ గోడను నిర్మించాలని ఏడీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారధి మంగళవారం ఈ పనులపై సమీక్ష నిర్వహించారు.
 
 
వెంకటపాలెంలోని ఏడీసీ నర్సరీలో అధికారులతో సమావేశమైన ఆమె కరకట్ట విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. ఈ పనులను ఆటంకపరిచేలా ఎక్కడైనా భూసేకరణపరమైన సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పరిష్కరించాలని భూవ్యవహారాల విభాగాధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదే సందర్భంగా ఆమె రాజధానిలో చేపట్టిన ప్యాకేజీ 1, 17, 18 రహదారుల నిర్మాణ పురోగతిని కూడా సమీక్షించారు. వేసవికాలం ప్రవేశించినందున నిర్మాణాలను మరింత వేగంగా చేపట్టి, గడువులోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఏడీసీ సీఈ టి.మోజె్‌సకుమార్‌, ఎస్‌.ఈ.లు ఎం.వి.సూర్యనారాయణ, పి.అంకమ్మచౌదరి, ఈఈలు బి.నరసింహమూర్తి, ఎం.బ్రహ్మాజీ, భూవ్యవహారాల విభాగం సంచాలకుడు బి.రామయ్య, అటవీ విభాగాధిపతి బి.శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...