Jump to content

Amaravati


Recommended Posts

రాజధాని భవంతుల డిజైన్లపై చర్చ
07-08-2018 08:31:45
 
636692275044071349.jpg
  • విండ్‌ ఇంజనీరింగ్‌ గురించి వివరించిన నిపుణులు
అమరావతి: రాజధానిలో నిర్మించబోతున్న బహుళ అంతస్థుల భవనాల డిజైన్లు ఏ విధంగా ఉండాలనే అంశంపై నిపుణులు సీఆర్డీయే అధికారులకు వివరించారు. ‘విండ్‌ ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చరల్‌ ఏరోడైనమిక్స్‌’పై విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన వర్క్‌షాపులో తిరువనంతపురా నికి చెందిన ఆర్‌.డబ్ల్యు.డి.ఐ.కన్సల్టింగ్‌ ఇంజినీరింగ్‌ నిపుణులు ప్రసంగించారు. ఆర్‌.డబ్ల్యు.డి.ఐ. ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సురేష్‌కుమార్‌, కన్సల్టింగ్‌ ఇంజినీర్‌ పి.ఎస్‌. రాహుల్‌లు మాట్లాడుతూ ఆకాశహార్మ్యాలను నిర్మించే ముందు అవి భారీ గాలులను ఎంతవరకు తట్టుకోగలవో తెలుసుకునేందుకు దోహదపడే భారీ భవన నమూనా డిజైన్లను విండ్‌ టన్నెల్‌లో ఉంచి, ఫోర్స్‌ టెస్టింగ్‌ను చేసే విధానాన్ని వివరించారు. ఈ వర్క్‌షాపులో సీఆర్డీయే ఇన్‌ఫ్రా అడిషనల్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి.ఆర్‌.కె.ప్రసాద్‌, సీనియర్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌ వి.ఎస్‌.ఎం.విష్ణు, డిజైన్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌ లింగస్వామి, జాయింట్‌ డైరెక్టర్‌ (హెచ్‌.ఆర్‌.) ఎస్‌.శర్మదలతో పాటు సీఆర్డీయే, ఏడీసీల అధికారులు, ఎల్‌అండ్‌టీ, ఎన్‌.సి.సి., ఏజీఐఎస్‌, సీహెచ్‌2ఎం, వి.ఆర్‌.సిద్దార్థ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అమరావతికి హైవేలతో అనుసంధానం ఎలా.?
07-08-2018 08:27:23
 
636692272424175341.jpg
  • అనుసంధానం.. ఎంతెంత దూరం!
  • ప్రతిపాదనల అమలులో జాప్యంతో అవస్థలు
  • వేగం పెంచడంపై సీఆర్డీయే అధికారుల కసరత్తు
 
అంతర్గతంగా నిర్మిస్తున్న రహదారుల నిర్మాణం చురుగ్గానే జరుగుతున్నప్పటికీ అమరావతిని దాని చుట్టుపక్కల వెళ్తున్న వివిధ జాతీయ రహ దారులతో అనుసంధానించడమెలాగన్న అంశంపై సీఆర్డీయే మల్లగుల్లాలు పడుతోంది. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడంలో చోటు చేసుకుంటున్న జాప్యంతో ప్రత్యామ్నాయాలను కనుగొనాల్సిన ఆవశ్యకత తలెత్తింది. దీంతో ఓ పక్క తన పరిఽధిలోని సమస్యలను తొలగిం చేందుకు ప్రయత్నిస్తూనే మరొకపక్క తన పరిధిలో లేని వాటిని సైతం తగు ప్రయత్నాలు చేయడం ద్వారా అధిగమించేందుకు సీఆర్డీయే కృషి చేస్తోంది.
 
 
అమరావతి: చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిని రాజధానితో అనుసంధానించేందుకు ఉద్దేశించిన ఈ 21.20 కిలోమీటర్ల పొడవైన భారీ రహదారి లో సుమారు 18 కి.మీ. భాగం (వెంకటపాలెం నుంచి దొండపాడు వరకు) దాదాపుగా చివరి అంకంలో ఉండగా, మిగిలిన 3.20 కి.మీ. భాగం (కనకదుర్గమ్మ వారధి నుంచి వెంకటపాలెం వరకు) మాత్రం ఇంకా నిర్మాణమే ప్రారంభం కాలేదు. భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలు దీనికి కారణం. వీటిని పరిష్కరించేందుకు సీఆర్డీయే అధికారులు రెవెన్యూ తదితర శాఖలతో కలసి ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. దీనికితోడు పలువురు రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించ గా, సదరు ప్రక్రియపై స్టే ఇవ్వడం మరింత జాప్యానికి కారణమవుతోంది. ఎలాగైనా ఈ అవరోధాలను తొలగించి, ఎక్కువగా ఎలివేటెడ్‌ కారిడార్‌ అయిన 2వ ప్యాకేజీని వెంకటపాలెం- వారధిల మధ్య పూర్తి చేస్తేనే రాజధాని చెన్నై- కోల్‌కతా హైవేకు అనుసంధానమవుతుంది.
 
విజయవాడ బైపాస్‌ దూరం...!
అమరావతిని దాని ఉత్తర దిక్కున ఉన్న మచిలీపట్నం- హైదరాబాద్‌ జాతీయ రహదారితోపాటు చెన్నై- కోల్‌కతా హైవేకు కలపడంలో అత్యంత కీలక పాత్ర పోషించనున్న ఈ విజయవాడ బైపాస్‌ రహదారి నిర్మాణ ప్రాజెక్ట్‌ ఎప్పటికి పూర్తవుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లాలోని చిన్నావుటపల్లి నుంచి గుంటూరు జిల్లాలోని కాజ వరకు కలిపేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ఎన్‌.హెచ్‌.ఎ.ఐ. పరిధిలో ఉంది. రాజధానిలోని వెంకటపాలెం, కృష్ణాయపా లెం, నిడమర్రు తదితర గ్రామాలకు చేరువగా, సీడ్‌ యాక్సెస్‌తోపాటు పలు ప్రాధాన్య రహదారులకు సమీపంగా సాగే ఈ రహదారి నిర్మితమైతే అమరావతికి మూడింతల ప్రయో జనం వాటిల్లుతుంది. ఒకపక్క మచిలీపట్నం- హైదరాబా ద్‌ జాతీయ రహదారిని జయవాడకు శివార్లలోని గొల్లపూడి- సూరాయపాలెంల వద్ద తాకే ఈ రోడ్డుతో అమరావతి నుంచి వచ్చే వాహనాలు విజయవాడను తాకకుండానే నేరుగా హైదరాబాద్‌, కొత్తగూడెం, నూజివీడు తదితర ప్రదేశాలకు వెళ్లిపోయే వీలు కలుగుతుంది, ఇబ్రహీంపట్నం నుంచి ప్రారంభమయ్యే జగదల్‌పూర్‌ హైవేకూ రాజధాని అనుసంధానమైనట్లవుతుంది.
 
మరొకపక్క.. ఈ విజయవాడ బైపాస్‌ రహదారి 2 సార్లు చెన్నై- కోల్‌కతా హైవేను (ఉత్తరాన చిన్నావుటపల్లి వద్ద, దక్షిణాన కాజ వద్ద) కలుస్తుంది కాబట్టి అమరావతి నుంచి అటు ఏలూరు, విశాఖపట్నం, కోల్‌కతాల వైపు వెళ్లాలన్నా, ఇటు గుంటూరు, చిలకలూరిపేట, నెల్లూరు, చెన్నై తదితర ప్రాంతాలకు సులభంగా, శీఘ్రంగా చేరే వీలు కలుగుతుంది. అంతే కాకుండా ప్రస్తుతం మాదిరిగా గన్నవరం విమానాశ్ర యానికి అమరావతి నుంచి వెళ్లాలంటే తప్పనిసరిగా విజయవాడ నుంచి వెళ్లాల్సిన అగత్యమూ తప్పుతుంది. అమరావతి నుంచి చిన్నావుటపల్లికి ఈ బైపాస్‌పై వచ్చి, అక్కడి నుంచి 3, 4 కిలోమీటర్ల దూంలోనే ఉన్న ఎయిర్‌పోర్ట్‌కు ప్రస్తుత హైవే మీదుగా చేరుకునే వీలు కలుగుతుంది.
 
అయితే.. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ విజయవాడ బైపాస్‌ నిర్మాణం అంతకంతకూ వెనక్కి పోతోంది. అవసర మైన భూమి దాదాపుగా అందుబాటులో ఉన్నప్పటికీ టెండర్లు దక్కించుకున్న గామన్‌ ఇండియా సంస్థ పనులు చేపట్టకపోవడం ఇందుకు కారణం. పలుమార్లు గడువును పొడిగించినా ప్రయోజనం లేనందున కొన్ని నెలల క్రితమే దానిని తొలగించి, ఎన్‌.హెచ్‌.ఎ.ఐ. మరోసారి టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ ముగిసి, మరొక సంస్థ ఎంపికై, అది విజయవాడ బైపాస్‌ మొత్తాన్ని పూర్తి చేసేందుకు ఎంత లేదన్నా కనీసం 3, 4 సంవత్సరాలు పడుతుందని భావిస్తున్నారు. ఈ లోగా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన కృష్ణానదిపై వంతెననైనా నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు సూచిస్తున్నా, అందుకు గల అవకాశాలేమిటో అస్పష్టం.
 
ఐకానిక్‌ బ్రిడ్జి
రాజధానిలో పడమర దిక్కున ఉన్న రాయపూడి- లింగాయపాలెంల మధ్య నుంచి కృష్ణానదికి అటువైపున ఉన్న ఇబ్రహీంపట్నం వరకు నిర్మించదలచిన ఐకానిక్‌ బ్రిడ్జి పూర్తయితే మచిలీపట్నం- హైదరాబాద్‌ హైవేతోపాటు ఇబ్రహీంపట్నం- జగదల్‌పూర్‌ జాతీయ రహదారికి అమరావతి నేరుగా అనుసంధానమ వుతుంది. అంతే కాకుం డా అనంత పురం- అమరావతి మధ్య ప్రతిపాదించిన ఎక్స్‌ప్రెస్‌ హైవేను పైన పేర్కొన్న 2 హైవేలతో ఇది కలుపు తుంది. తద్వారా అటు రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం, గుంటూరు తదితర జిల్లాలకు హైదరాబాద్‌, ఖమ్మం, ఛత్తీస్‌గఢ్‌లకు చక్కటి ప్రయాణసౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.
 
కానీ.. దీనిని ప్రతిపాదించి దాదాపుగా 3 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ డిజైనింగ్‌ అత్యద్భుతంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో పక్కాగా, పలువురు నిపుణులతో డిజైన్‌పై చర్చ లు జరుపుతుండడంతో జాప్యం అనివార్యమైంది. ఈమధ్యనే దీని డిజైన్‌ ఒక కొలిక్కి వచ్చి, మరి కొద్ది నెలల్లోనే నిర్మాణ పనులు ప్రారంభమవబోతున్నాయి. అయి తే ఈ ఐకానిక్‌ బ్రిడ్జ్‌ సిద్ధమయ్యేందుకు కనీసం 3 సంవత్సరాలైనా పడుతుం దని భావిస్తున్నారు. అంటే అప్పటి వరకూ దీని ద్వారా ఆశించిన ప్రయోజనాలేవీ నెరవేరబోవన్న మాట.
 
వేగం పెంచేందుకు చర్యలు..
పైన పేర్కొన్న విధంగా ప్రతిపాదిత 3 మార్గాలూ పూర్తయ్యేందుకు మరింత కాలం పట్టే అవకాశాలున్నందున ఏం చేయాలన్న దానిపై సీఆర్డీయే తర్జనభర్జనలు పడుతోంది. హైవేలతో అనుసంధానమైతే ప్రజల రాకపోకలు సులభతర మవడమే కాకుండా, రాజధాని నిర్మాణానికి అవసరమైన భారీ యంత్రపరిక రాలు, నిర్మాణసామగ్రిని అమరావతికి తరలించడం తేలికవుతుంది కాబట్టి ఎలాగైనా సరే పైన ప్రస్తావించిన 3 మార్గాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించడమెలాగన్న అంశంపై విస్తృత కసరత్తు చేస్తోంది.
 
అందులో భాగంగానే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు అవసరమైన భూములను సేకరించే ప్రక్రియను గత కొంతకాలంగా వేగవంతం చేసింది. రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖల సహాయంతో ఇందుకోసం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. విజయవాడ బైపాస్‌ రహదారి నిర్మాణాన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించేందుకుగాను ఎన్‌.హెచ్‌.ఎ.ఐ.తో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది, రాష్ట్ర ప్రభుత్వం ద్వారానూ ప్రయత్నాలు సాగిస్తోంది. ఇబ్రహీంపట్నం వద్ద నిర్మించదలచిన ఐకానిక్‌ బ్రిడ్జ్‌ పనులను కూడా సాధ్యమై నంత త్వరగా ప్రారంభింపజేసి, పూర్తి చేయించేందుకు ఏడీసీతో కలసి కసరత్తు చేస్తోంది.
Link to comment
Share on other sites

రాజధానిలో నిర్మాణాలు ప్రారంభించండి
08-08-2018 07:29:17
 
636693101561725926.jpg
  • కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో సీఎస్‌ దినేష్‌కుమార్‌
అమరావతి: రాజధానిలో కార్యాలయాల స్థాపనకు స్థలాలు పొందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు నిర్దేశిత గడువులోగా వాటిల్లో నిర్మాణపనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) దినేష్‌కుమార్‌ కోరారు. వెలగపూడి సచివాలయంలోని తమ సమావేశమందిరంలో మంగళవారం ఆయా సంస్థలు, బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల కేటాయింపు జరిగి, డబ్బు చెల్లించని వారు రెండు నెలల్లోగా జమ చేయాలని, ఈ ఏడాది డిసెంబర్‌లోగా నిర్మాణాలు మొదలుపెట్టి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. స్పందించిన కొన్ని సంస్థల ప్రతినిధులు 15 రోజుల నుంచి నెలలోగా డబ్బు చెల్లిస్తామన్నారు. వారిలో కొందరు నిర్మాణ పనులను నెలలోపే ప్రారంభిస్తామనగా, మరి కొందరు డిసెంబర్లోగా చేపడతామని చెప్పారు. కొందరు ప్రతినిధులు అదనపు భూమి కావాలని కోరగా, అది సాధ్యం కాదని సీఎస్‌ స్పష్టం చేశారు. భూముల కేటాయింపు, నగదు చెల్లింపులకు సంబంధించి సమస్యలేమైనా ఉంటే ఏపీసీఆర్డీయే అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించారు.
 
ఏపీసీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ నిర్మాణాలకు అనుమతులు పొందడంలో ఏమైనా సమస్యలున్నాయా అని ప్రతినిధులను ప్రశ్నించగా లేదన్నారు. సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ రాజధానిలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని ఛాయాచిత్రసహితంగా తెలియజెప్పారు. అమరావతిలో భూములను కేటాయించిన 57 సంస్థలకు నిర్మాణాలను శీఘ్రంగా ప్రారంభించా ల్సిందిగా కోరుతూ లేఖలను రాయగా, కొందరు స్పందించారన్నారు. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌, తపాలా, నిఫ్ట్‌, బీఐఎస్‌, కేంద్రీయ విద్యాలయం, సీపీడబ్ల్యూ, సీబీఐ, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం, విదేశీ వ్యవహారాల శాఖ, సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ, ఎల్‌.ఐ.సి., ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, రైట్స్‌, భారత వాతావరణ పరిశోధక శాఖ, ఎఫ్‌.సి.ఐ. తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Link to comment
Share on other sites

రాజధానిలో అభివృద్ధికి డోకా ఉండదు
08-08-2018 07:31:42
 
636693103010903756.jpg
  • గన్నవరం రైతులతో సీఆర్డీయే కమిషనర్‌
అమరావతి: రాజధాని ప్రాంతమంతా సమానంగా అభివృద్ధి చెందేలా ప్రణాళిక రూపొందించడం జరిగిందని, మీకు మంచి ప్లాట్లు కేటాయిస్తామని గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూములు ఇచ్చిన రైతులకు సీఆర్‌డీఏ కమిషనర్‌ సీహెచ్‌.శ్రీధర్‌ హామీ ఇచ్చారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధానిలో వారికి కేటాయించే ప్లాట్ల కేటాయింపుపై అవగాహన కల్పించారు. రాజధాని ప్రాంతమంతా సమానంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు.
 
రైతుల కోరిక మేరకు ఖాళీగా ఉన్న చోట్ల వారికి ప్లాట్లు కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. నిడమర్రు, కురగల్లు ప్రాంతాల్లో ప్లాట్లు వద్దని రైతులు కోరుకున్నందున వారికి అక్కడ కేటాయించబోమని హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిపై గన్నవరం రైతులకు అవగాహన కల్పించేందుకు బుధవారం వారిని అక్కడకు తీసుకువెళ్లేందుకు కమిషనర్‌ అంగీకరించారు. సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్‌, జడ్పీ మాజీ చైర్మన్‌ కడియాల రాఘవరావు, సీఆర్‌డీయే ప్లానింగ్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

రాజధానిలో నిర్మాణాలు ప్రారంభించండి
08-08-2018 07:29:17
 
636693101561725926.jpg
  • కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో సీఎస్‌ దినేష్‌కుమార్‌
అమరావతి: రాజధానిలో కార్యాలయాల స్థాపనకు స్థలాలు పొందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు నిర్దేశిత గడువులోగా వాటిల్లో నిర్మాణపనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) దినేష్‌కుమార్‌ కోరారు. వెలగపూడి సచివాలయంలోని తమ సమావేశమందిరంలో మంగళవారం ఆయా సంస్థలు, బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల కేటాయింపు జరిగి, డబ్బు చెల్లించని వారు రెండు నెలల్లోగా జమ చేయాలని, ఈ ఏడాది డిసెంబర్‌లోగా నిర్మాణాలు మొదలుపెట్టి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. స్పందించిన కొన్ని సంస్థల ప్రతినిధులు 15 రోజుల నుంచి నెలలోగా డబ్బు చెల్లిస్తామన్నారు. వారిలో కొందరు నిర్మాణ పనులను నెలలోపే ప్రారంభిస్తామనగా, మరి కొందరు డిసెంబర్లోగా చేపడతామని చెప్పారు. కొందరు ప్రతినిధులు అదనపు భూమి కావాలని కోరగా, అది సాధ్యం కాదని సీఎస్‌ స్పష్టం చేశారు. భూముల కేటాయింపు, నగదు చెల్లింపులకు సంబంధించి సమస్యలేమైనా ఉంటే ఏపీసీఆర్డీయే అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించారు.
 
ఏపీసీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ నిర్మాణాలకు అనుమతులు పొందడంలో ఏమైనా సమస్యలున్నాయా అని ప్రతినిధులను ప్రశ్నించగా లేదన్నారు. సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ రాజధానిలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని ఛాయాచిత్రసహితంగా తెలియజెప్పారు. అమరావతిలో భూములను కేటాయించిన 57 సంస్థలకు నిర్మాణాలను శీఘ్రంగా ప్రారంభించా ల్సిందిగా కోరుతూ లేఖలను రాయగా, కొందరు స్పందించారన్నారు. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌, తపాలా, నిఫ్ట్‌, బీఐఎస్‌, కేంద్రీయ విద్యాలయం, సీపీడబ్ల్యూ, సీబీఐ, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం, విదేశీ వ్యవహారాల శాఖ, సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ, ఎల్‌.ఐ.సి., ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, రైట్స్‌, భారత వాతావరణ పరిశోధక శాఖ, ఎఫ్‌.సి.ఐ. తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Link to comment
Share on other sites

రాజధానిలో అభివృద్ధికి డోకా ఉండదు
08-08-2018 07:31:42
 
636693103010903756.jpg
  • గన్నవరం రైతులతో సీఆర్డీయే కమిషనర్‌
అమరావతి: రాజధాని ప్రాంతమంతా సమానంగా అభివృద్ధి చెందేలా ప్రణాళిక రూపొందించడం జరిగిందని, మీకు మంచి ప్లాట్లు కేటాయిస్తామని గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూములు ఇచ్చిన రైతులకు సీఆర్‌డీఏ కమిషనర్‌ సీహెచ్‌.శ్రీధర్‌ హామీ ఇచ్చారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధానిలో వారికి కేటాయించే ప్లాట్ల కేటాయింపుపై అవగాహన కల్పించారు. రాజధాని ప్రాంతమంతా సమానంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు.
 
రైతుల కోరిక మేరకు ఖాళీగా ఉన్న చోట్ల వారికి ప్లాట్లు కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. నిడమర్రు, కురగల్లు ప్రాంతాల్లో ప్లాట్లు వద్దని రైతులు కోరుకున్నందున వారికి అక్కడ కేటాయించబోమని హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిపై గన్నవరం రైతులకు అవగాహన కల్పించేందుకు బుధవారం వారిని అక్కడకు తీసుకువెళ్లేందుకు కమిషనర్‌ అంగీకరించారు. సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్‌, జడ్పీ మాజీ చైర్మన్‌ కడియాల రాఘవరావు, సీఆర్‌డీయే ప్లానింగ్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

రాజధాని అభివృద్ధిలో జపాన్‌ భాగస్వామ్యం 
7ap-main18a.jpg
ఈనాడు డిజిటల్‌, అమరావతి: అమరావతిలో వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో సీఆర్‌డీఏ సహకారంతో ‘హైమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌’ను అభివృద్ధి చేసేందుకు జపాన్‌కు చెందిన కుని ఉమి అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ముందుకొచ్చింది. రాజధానిలో గృహ నిర్మాణం, ఆహార శుద్ధి యూనిట్లలో పరస్పర సాంకేతిక సహకారానికి జపాన్‌ ఆసక్తి వ్యక్తం చేసింది. భారత్‌లో జపాన్‌ రాయబారి కెంజి హిరమత్సు సారథ్యంలోని బృందం బుధవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాజధానిలో అవకాశాల గురించి సీఎం వివరించారు. అమరావతిని రెండో టోక్యోగా భావించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో జపాన్‌ భాషను ప్రవేశపెడతామని తెలిపారు. రాజధాని అమరావతిలో డేటా కేంద్రం, విపత్తుల నిరోధక వ్యవస్థ, విజయవాడలో ట్రాఫిక్‌ నియంత్రణ, తాగునీటి సరఫరా, మురుగు నీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను జపాన్‌ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.
 
 
 

ముఖ్యాంశాలు

Link to comment
Share on other sites

అమరావతిలో హైకోర్టు భవనం టెండర్లు ఖరారు 
షాపూర్జీ పల్లోంజీ సంస్థకు పనులు
ఈనాడు, అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. హైకోర్టు నిర్మాణ పనులు దక్కించుకునేందుకు షాపూర్జీ-పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ సంస్థలు పోటీ పడ్డాయి. మిగతా రెండు సంస్థలకంటే తక్కువ మొత్తానికి బిడ్‌ దాఖలు చేసిన షాపూర్జీ సంస్థ పనులు దక్కించుకుంది. హైకోర్టు నిర్మాణానికి రూ.996 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్‌డీఏ టెండర్లు పిలవగా.. షాపూర్జీ సంస్థ 4.3 శాతం ఎక్కువ మొత్తానికి బిడ్‌ దాఖలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా.. హైకోర్టు భవనం స్ట్రక్చర్‌ను మాత్రం షాపూర్జీ సంస్థ నిర్మిస్తుంది. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ వంటి పనులకు విడిగా టెండర్లు పిలుస్తారు. భవనాన్ని బౌద్ధ స్థూపాన్ని పోలిన ఆకృతిలో నిర్మిస్తున్నారు. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఆకృతిని రూపొందించింది. జీ+7 విధానంలో నిర్మిస్తారు. మొత్తం 12 లక్షల చ.అ. నిర్మితప్రాంతం ఉంటుంది. సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లను వాహనాలు నిలిపేందుకు కేటాయిస్తారు.
Link to comment
Share on other sites

250 మీటర్ల ఎత్తు నుంచి రాజధాని వీక్షణం 
సిద్ధమవుతున్న శాసనసభ భవనం 
  వివరణాత్మక ఆకృతులు

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాసనసభ భవనం ఆకృతిని లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ పలు విలక్షణాంశాల సమాహారంగా తీర్చిదిద్దుతోంది. శాసనసభ భవనానికి ఎత్తైన టవర్‌తో ఉన్న ఆకృతిని ఇప్పటికే ఖరారు చేశారు. దాని వివరణాత్మక ఆకృతుల్ని సంస్థ సిద్ధం చేస్తోంది. శాసనసభ భవనం ఎత్తు.. దానిపై నిర్మించే టవర్‌తో కలిపి 250 మీటర్లు ఉంటుంది. 210 మీటర్ల ఎత్తున టవర్‌లో వీక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తారు. దానిని వ్యూయింగ్‌ డెక్‌గా పిలుస్తారు. ఒకేసారి 150 మంది ఆ డెక్‌పై నిలబడి రాజధానిని వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి 250 మీటర్ల ఎత్తు వరకు వెళ్లేందుకు పారదర్శకంగా అద్దాలతో రూపొందించిన లిఫ్ట్‌ ఉంటుంది. అందులో టవర్‌ చిట్ట చివరికి వెళ్లి అక్కడి నుంచి రాజధాని మొత్తాన్ని చూడవచ్చు. టవర్‌ చివరికి వెళ్లాక లిఫ్ట్‌ ఐదు నిమిషాలు ఆగుతుంది. దీనిలో ఒకేసారి 30 మంది వెళ్లేందుకు వీలుంటుంది. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌లో 276 మీటర్ల ఎత్తు నుంచి నగరం మొత్తాన్ని వీక్షించే వీలుంది. ‘‘అమరావతిలో నిర్మించే శాసనసభ భవనం టవర్‌ ఎత్తుని కూడా ఆస్థాయికి పెంచేలా ఆకృతిలో మార్పులు చేస్తామని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఏ మార్పులు చేసినా... జాప్యం మాత్రం జరగరాదని వారికి స్పష్టంచేశాం’’ అని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ‘ఈనాడు’కి తెలిపారు. వచ్చే నెల 15 నాటికి డ్రాయింగ్స్‌ అందజేస్తారని, అప్పటి నుంచి అంచనాల రూపకల్పనకు వారం పది రోజులు పడుతుందని, వచ్చే నెలాఖరుకి టెండర్లు పిలుస్తామని ఆయన వెల్లడించారు. శాసనసభ భవనంలో 9 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం ఉంటుంది.

హడ్కో నుంచి మరో రూ.12 వేల కోట్లు..! 
రాజధానిలో తొలి దశలో మౌలిక వసతుల అభివృద్ధికి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం వంటి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సుమారు రూ.38 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు. వీటిలో సుమారు రూ.28 వేల కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. మరో రూ.10 వేల కోట్ల పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ నిధుల్ని వివిధ మార్గాల్లో సమీకరించేందుకు సీఆర్‌డీఏ ప్రణాళికలు రూపొందించింది. హడ్కో నుంచి రూ.7,200 కోట్లు రుణం తీసుకునేందుకు ఇప్పటికే సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. హడ్కో నుంచే మరో రూ.12 వేల రుణం తీసుకునేందుకు సీఆర్‌డీఏకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్ల రుణాలు తీసుకోనున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్‌ తెలిపారు. వీటిపై వడ్డీ రేటు 8.68 నుంచి 8.7 శాతం వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇలా వివిధ రూపాల్లో నిధులు సమీకరిస్తున్నట్టు తెలిపారు. డిసెంబరు నాటికి రహదారుల పనులన్నీ కొలిక్కి వస్తాయన్నారు

Link to comment
Share on other sites

అమరావతిపై ప్రపంచ బ్యాంక్‌ డాక్యుమెంటరీ
09-08-2018 08:35:21
 
636694005212550495.jpg
  • ప్రాజెక్టు వివిధ దశల వివరాల సేకరణ
  • రాజధాని రైతుల అభిప్రాయాలూ నమోదు
అమరావతి: రాజధానిలోని వివిధ ప్రాధాన్య రహదారులతోపాటు వరద నియంత్రణ ప్రాజె క్టులకు రుణం కోసం సీఆర్డీయే చేసుకున్న దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే ముందు ప్రపంచబ్యాంక్‌ తీయిస్తున్న వీడియో చిత్రీ కరణ బుధవారంతో పూర్తయినట్లు తెలిసింది. వచ్చే నెల ప్రథమార్ధంలో జరగనున్న ఉన్న తస్థాయి సమావేశంలో ఈ రుణమివ్వాలో, వద్దోననే విషయంపై ప్రపంచబ్యాంక్‌ నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యంలో ఈ వీడి యోకు ప్రాధాన్యత సమకూరింది.
 
రాజధాని నిర్మాణంలో భాగంగా సీఆర్డీయే దిగ్విజయంగా నిర్వహించిన భూసమీకరణ ప్రక్రియతో మొదలుకుని వివిధ ప్రాజెక్టుల నిర్మాణం సాగుతున్న క్రమం వరకు ఉన్న వివిధ దశలకు సంబంధించిన వివరాలను రెండు రోజులపాటు చిత్రీకరించిన వీడియోలో ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు రికార్డ్‌ చేశారు. మంగళవారంనాడు రాజధానిలో పర్యటించిన చిత్రీకరణ బృంద సభ్యులు ఈ వీడియో కోసం ఎల్పీఎస్‌ కింద అమరావతికి భూములిచ్చిన రైతుల అభిప్రాయాలను తీసుకోవడంతోపాటు రాజధాని యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన నిమిత్తం సీఆర్డీయే నిర్వ హిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు, వివిధ వర్గాలకు రాజధానిలో లభిస్తున్న ఉపాది పథకాలు అమలవుతున్న తీరుతెన్నులపై వాకబు చేసింది. వివిధ ప్రాజెక్టుల వల్ల ప్రభావితులవుతున్న వారికి కల్పిస్తున్న పున రావాస, సహాయక కార్యక్రమాల అమలు గురించి కూడా తెలుసుకుంది. బుధ వారంనాడు ప్రపంచ బ్యాంక్‌ బృందం విజ యవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యా లయానికి వచ్చి, ఉన్నతాధికారులను కలు సుకుంది. అమరావతికి సంబంధించిన వివిధ అంశాలపై కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఇంటర్వ్యూను రికార్డ్‌ చేసింది.
Link to comment
Share on other sites

రాజధాని ప్రగతిని పరిశీలించిన రైతులు
09-08-2018 08:37:03
 
636694006224974820.jpg
అమరావతి: రాజధాని నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను గన్నవరం ప్రాంత రైతులు బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూము లనిచ్చిన గన్నవరం, బుద్ధవరం, అజ్జంపూడి, చిన్నావుటపల్లి తదితర గ్రామాలకు చెందిన సుమారు 40 మందిని సీఆర్డీయే 2 ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తీసుకుని వెళ్లింది. గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్‌, కృష్ణా జిల్లా పరిషత్తు మాజీ అధ్యక్షుడు కడియాల రాఘవరావు, విజయ వాడ కార్పొరేటర్‌ దేవినేని అపర్ణ తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. వీరందరికీ రాజధానిలో జరుగుతున్న పనుల గురించి, వారికి ఇవ్వదలచిన రిటర్నబుల్‌ ప్లాట్ల గురించి సీఆర్డీయే ప్లానింగ్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు, ఎస్‌.ఇ. ధనుంజయ తదితర అధికారులు వివరించారు.
 
విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయం నుంచి ఉదయం బయల్దేరిన రైతులు తొలుత అమరావతికి ముంపు బెడదను తప్పించేం దుకు ఉండవల్లి అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ వద్ద భారీఎత్తున నిర్మిస్తున్న కొండవీటి వాగు మళ్లింపు పథకాన్ని పరిశీలించారు. అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రహదారి మీదుగా ప్రయాణించి, కొండమరాజుపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న సీఆర్డీయే ప్రాజెక్టు కార్యాలయాన్ని, రాయపూడి, నేలపాడుల్లో శాసనసభ్యులు, ఏఐఎస్‌ అధికారులు, గెజిటెడ్‌ ఆఫీసర్లు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న ప్రభుత్వ హౌసింగ్‌ సముదాయా న్ని చూశారు. ఈ సందర్భంగా అధికారులు వారికి ఆయా నిర్మాణాలు వేగంగా, పకడ్బందీగా జరిగేందుకుగాను అనుసరిస్తున్న షియర్‌ వాల్‌ సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు.
 
పనులు జరుగుతున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ ప్రదేశంతో పాటు ప్రతిపాదిత ఐకానిక్‌ కట్టడాలైన అసెంబ్లీ, హైకోర్టు కోసం కేటాయించిన స్థలాలను పరిశీలించారు. 5 ఆకాశహర్మ్యాల తో రూపుదాల్చబోతున్న శాశ్వత సచివాలయ సముదాయపు ప్రదేశాన్ని కూడా చూశారు. రాజధానిలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాధా న్య రహదారులను కూడా చూసిన గన్నవరం ప్రాంత రైతులు తుళ్లూరులో తమకు ఇచ్చేందుకు సీఆర్డీయే ప్రతిపాదించిన రిటర్నబుల్‌ ప్లాట్లను సైతం పరిశీలించారు.
 
ఎస్‌.ఆర్‌.ఎం. విశ్వవిద్యాలయ సందర్శన..
పర్యటనలో చివరి అంకంగా రైతులను సీఆర్డీయే అధికారులు నీరుకొండ వద్ద ఏర్పాటైన ఎస్‌.ఆర్‌.ఎం. యూనివర్సిటీకి తీసుకుని వెళ్లారు. కొద్ది నెలల వ్యవధిలోనే చూడచక్కగా తయారవుతున్న ఈ విశ్వవిద్యాలయంలోని వివిధ భవంతులు, ఇతర మౌలిక వసతులను చూసిన రైతులు అనంతరం దాని రిజిస్ట్రార్‌ సత్యనారాయణరావు తదితర ఉన్నతాధికారు లతో సమావేశమయ్యారు.
 
ఆ గ్రామాల్లో ప్లాట్లకు ప్రత్యామ్నాయాలపై చర్చ..
ఈ సందర్భంగా గన్నవరం రైతులు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లోని 9, 10లొకేషన్ల (కురగల్లు, నిడమర్రు)లో తమకు ప్లాట్లను కేటాయించ రాదనడంపై సంక్షిప్త చర్చ జరిగినట్లు తెలి సింది. అయితే వీటిల్లోని ప్లాట్లకు కూడా మంచి విలువ వస్తుందన్న సీఆర్డీయే అధికా రులు శాసనసభ్యుడు వంశీమోహన్‌ సమక్షం లో మరొకసారి ఈ అంశంపై చర్చించుకుని, తమ నిర్ణయాన్ని తెలియజేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఒకవేళ అక్కడి ప్లాట్ల కు ప్రత్యామ్నాయాలు కావాలని భావిస్తే ఆ విషయాన్ని కూడా ఒకట్రెండు రోజుల్లో చెప్పాలని సూచించినట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...