Jump to content

Amaravati

Recommended Posts

అమరావతిలో ‘సోని’ సినిమాలు!
26-05-2018 02:36:27
 
636628989899422172.jpg
  • మీడియా సిటీపై సోని కార్పొరేషన్‌ ఆసక్తి.. సీఎంతో భేటీ
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): వినోద రంగంలోని దిగ్గజ సంస్థ.. సోని కార్పొరేషన్‌ అమరావతిపై ఆసక్తి చూపిస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే మీడియా సిటీలో తనదైన పాత్ర పోషించేందుకు ముందుకొచ్చింది. ఎలకా్ట్రనిక్స్‌లో పేరొందిన సోని కార్పొరేషన్‌.. సోని పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో సినిమాల నిర్మాణం, పంపిణీ చేస్తోంది. సోని మ్యూజిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో మ్యూజిక్‌, అదేవిధంగా ఆడియో మ్యూజిక్‌ రంగంలోనూ ఉంది. ఈ నేపథ్యంలో సంస్థ ప్రతినిఽధులు.. ఏపీఎన్‌ఆర్‌టీ ఛైర్మన్‌ రవికుమార్‌ వేమూరితో కలిసి శుక్రవారమిక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇక్కడ నిర్మించే స్టూడియోల్లో తమ సంస్థ నిర్మించే సినిమాలు తీసేందుకు, స్థానిక నిర్మాతల భాగస్వామ్యంతో సినిమాలు తీసేందుకు సోని ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

రాజధానిలో జపాన్‌ సాంస్కృతిక కేంద్రం
ప్రత్యేక కాగితంతో భవనాల నిర్మాణం
ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో ఒక పర్యాటక ఆకర్షక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జపాన్‌కు చెందిన కునియుమి అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ముందుకు వచ్చింది. ‘హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌’ పేరుతో జపాన్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఇది ఉంటుంది. ప్రఖ్యాత భవన నిర్మాణశిల్పి, ఫ్రిట్జ్‌కర్‌ బహుమతి గ్రహీత షిగెరు బాన్‌ దీనికి రూపకల్పన చేయనున్నారు. పెవిలియన్‌ను పూర్తిగా కాగితంతో, కేంద్రాన్ని ప్రత్యేక కార్డ్‌బోర్డు ‘బాన్స్‌ సిగ్నేచర్‌ పేపర్‌’తో నిర్మిస్తారు. 10 వేల చ.అడుగుల వైశాల్యం కలిగిన కార్డ్‌బోర్డు నిర్మాణాల్ని చేపడతారు. అవసరమైతే ఏ భాగానికి ఆ భాగం విడదీసి వేరే చోటుకి తరలించే వీలుంటుంది. ఏడు నెలల వ్యవధిలో పనులు పూర్తి చేస్తారు. దీనికయ్యే ఖర్చును కునియుమి సంస్థ, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) చెరి సగం సమకూర్చనున్నాయి. ప్రధాన అనుసంధాన రహదారికి పక్కనే 8 వేల చ.మీటర్ల స్థలం సీఆర్‌డీఏ కేటాయించనుంది. జపాన్‌ సంస్థ కేవలం పెవిలియన్‌ను మాత్రమే ఏర్పాటు చేస్తుంది. దీనికి సుమారు రూ.5.8 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 700 మంది కూర్చునేందుకు వీలుగా ఒక సమావేశమందిరం ఉంటుంది. మరో 3 వేల చ.అడుగుల వైశాల్యంలో జపాన్‌ సంస్కృతిని చాటిచెప్పే నమూనాలను ఏర్పాటు చేస్తారు. సావనీర్‌ దుకాణం, ఫుడ్‌ కోర్టు, సందర్శకులకు సమాచారాన్ని అందించి, తగిన మార్గదర్శనం చేసేందుకు అవసరమైన కియోస్క్‌లు ఉంటాయి. 500 కార్లు నిలిపేలా పార్కింగ్‌ వసతి ఉంటుంది. దీని నిర్వహణకు కునియుమి సంస్థ, సీఆర్‌డీఏ కలిసి ఇండో-జపాన్‌ అమరావతి కొలాబరేషన్‌ ట్రస్ట్‌/ సొసైటీని ఏర్పాటు చేయనున్నాయి. భూ కేటాయింపు, నిధులు సమకూర్చడంపై ఇప్పటికే వాటి మధ్య అంగీకారం కుదిరింది.  షియర్‌ వాల్‌ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి కూడా కునియుమి సంస్థ ముందుకు వచ్చింది. 550 చ.అడుగుల విస్తీర్ణంలో జీ+1 విధానంలో నాలుగు మోడల్‌ యూనిట్లు నిర్మించేందుకు  సీఆర్‌డీఏ అనుమతిచ్చింది. ఒక్కో భవనం నిర్మిత ప్రాంతం 216 చ.మీటర్లు ఉంటుంది.
 
Link to comment
Share on other sites

ప్రధాన అనుసంధాన రహదారి సర్వేకు ఆటంకం
అడ్డుకున్న రైతులను అరెస్టు చేసిన పోలీసులు
ఎట్టకేలకు పూర్తి చేసిన రెవెన్యూ సిబ్బంది
25ap-state2a.jpg

తాడేపల్లి,న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) సర్వేను రైతులు అడ్డుకోవడంతో తాడేపల్లిలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల రంగంప్రవేశం, రైతుల అరెస్టు అనంతరం రెవెన్యూ సిబ్బంది ఎట్టకేలకు సర్వేను పూర్తి చేశారు. మణిపాల్‌ అస్పత్రి వెనుకభాగంలో ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని సర్వే చేయాల్సి ఉంది. గతంలో రెండు, మూడుసార్లు ప్రయత్నించినా రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో నిలిచిపోయింది. మళ్లీ శుక్రవారం ఉదయం తహసీల్దార్‌ పద్మనాభుడు పోలీసుల భద్రత మధ్య సిబ్బందితో వెళ్లారు. తమ అనుమతి లేకుండా, ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా తమ పొలాల్లోకి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తూ బయటకు వెళ్లిపోవాలని రైతులు పట్టుపట్టారు. పాతిన కర్రలను తొలగించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంతలో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌తో పాటు తాడేపల్లి, మంగళగిరి, మంగళగిరి గ్రామీణ, పెదకాకాని పోలీసులు తరలివచ్చారు. అడ్డు తగలవద్దని గుంటూరు ఉత్తర మండల డీఎస్పీ రామాంజనేయులు సూచించగా నోటీసు ఇచ్చి చేయాలని రైతులు స్పష్టం చేశారు. దీనికి తహసీల్దార్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 20నోటీసు ఇచ్చామని ఇంతకు మించి మరొకటి ఏమీ లేదని తెలిపారు. రైతులు మాత్రం 191నోటీసు ఇచ్చాకే చేయాలన్నారు. దీనికి నిరాకరించిన రెవెన్యూ అధికారులు సర్వే చేయాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ రామాంజనేయులు కల్పించుకుని ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించగా... చేయండని రైతులు ముందుకు వచ్చారు.  వైకాపా పట్టణ అధ్యక్షులు బుర్రముక్క వేణుగోపాలసోమిరెడ్డితో పాటు మండల సీపీఎం కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డిని పోలీసు వాహనం ఎక్కిస్తున్న సమయంలో అక్కడే ఉన్న మరికొందరు రైతులు, మహిళలు వారిని అనుసరించారు. మొత్తం 23 మందిని మంగళగిరిలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎన్టీఆర్‌ కట్ట నుంచి మణిపాల్‌ వెనుకభాగం వరకు ఉన్న ప్రైవేటు భూముల్లో సర్వే పూర్తి చేశారు. భూమి కొలతలు తీయడం పూర్తికావడంతో తదుపలి చేపట్టే పనులకు ప్రణాళిక రూపొందించారు.

Link to comment
Share on other sites

ఏపీలో చిత్ర పరిశ్రమకు అనువైన వనరులు
సోనీ పిక్చర్స్‌ వెల్లడి
ముఖ్యమంత్రితో భేటీ
25ap-state1a.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అనువైన సహజ వనరులు అపారంగా ఉన్నాయని సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎండీ వివేక్‌ కృష్ణాని తెలిపారు. సోనీ పిక్చర్స్‌ సంస్థ ప్రతినిధులు శుక్రవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కృష్ణాని మాట్లాడుతూ.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టీ) అధ్యక్షులు వేమూరి రవి, ఏపీఎన్‌ఆర్‌టీ ఆపరేషన్స్‌ సంచాలకులు మురళీధర్‌, సోనీ పిక్చర్స్‌ సంస్థ భారత విభాగం సంచాలకులు శ్రీరాం మీర్‌ చందాని, సీఎం అదనపు కార్యదర్శి రాజమౌళి ఉన్నారు.

Link to comment
Share on other sites

‘కొండపల్లి’ ఇవ్వలేం!
26-05-2018 03:37:29
 
636629026513481378.jpg
  • అటవీ భూముల మళ్లింపునకు కేంద్రం ‘నో’?
  • 2260 ఎకరాలు కోరిన సీఆర్డీయే
  • రాజధాని అభివృద్ధికి కావాలని ప్రతిపాదన
  • రెండోసారి పంపిన వినతులూ తిరస్కరణ
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకుగాను కృష్ణా జిల్లాలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో సుమారు 2,260 ఎకరాలను మళ్లించి (డైవర్షన్‌) తమకు అప్పగించాలని కోరుతూ ఏపీసీఆర్డీయే పంపిన ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తిరస్కరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి ఈ ప్రతిపాదనలకు కేంద్రం ‘నో’ చెప్పడం ఇది రెండోసారి. పలు రంగాలకు నెలవుగా అమరావతిని అభివృద్ధి పరచాలన్న సంకల్పంతో రాజధాని ప్రాంతం, దాని చుట్టుపక్కల ఉన్న 25 అటవీ బ్లాక్‌లలోని సుమారు 33,750 ఎకరాలను మళ్లించి, తమకు అప్పగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సీఆర్‌డీయే కొన్ని నెలల క్రితం ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రక్రియ క్లిష్టతరమైనప్పటికీ సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ నేతృత్వంలో సీఆర్డీయే ఉన్నతాధికారులు జరిపిన కృషి కొంతమేర ఫలించింది. గుంటూరు జిల్లాలోని వెంకటాయపాలెం, తాడేపల్లి బ్లాక్‌లలోని దాదాపు 2600 ఎకరాల అటవీ భూమి మళ్లింపునకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సుమారు 7నెలల క్రితం అంగీకరించింది. మిగిలిన అటవీ బ్లాక్‌లలోని భూముల మళ్లింపు అంశాన్ని చురుగ్గానే పరిశీలిస్తున్న కేంద్రం కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌ విషయంలో మాత్రం ససేమిరా అంటోంది.
 
అదే కారణమా?
కొండపల్లి అడవిలోని 2,260 ఎకరాలను అప్పగిస్తే వాటిల్లో క్రీడా ప్రాంగణం, వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పుతామని సీఆర్డీయే చేసిన ప్రతిపాదనలు కేంద్రానికి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని తెలిసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న అటవీ బ్లాక్‌లలో అత్యధిక భాగం అడవులను తలపించవు. కొద్దో గొప్పో నిజమైన అటవీ ప్రాంతంగా, పలు వృక్ష, జంతుజాతులకు ఆలవాలంగా ఉన్న కొండపల్లి బ్లాక్‌ను పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే అభిప్రాయమే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే అటవీ మంత్రిత్వ శాఖ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ, సవరించిన ప్రతిపాదనలను కొన్ని నెలల క్రితం మళ్లీ పంపించారు. వాటినీ తిరస్కరిస్తూ కేంద్రం నుంచి ఇటీవల వర్తమానం అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే ‘కొండపల్లి’ కోసం తమ ప్రయత్నాలను కొనసాగిస్తాయా లేక దానిని మినహాయించి, మిగిలిన అటవీ బ్లాక్‌లలో తాము కోరిన డైవర్షన్‌ను సాధించేందుకే పరిమితమవుతాయా అనేది చూడాల్సి ఉంది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...