Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం
31-01-2019 10:11:47
 
636845263077755444.jpg
అమరావతి: కృష్ణా తీరంలో కలియుగ వైకుంఠనాథుడు కొలువుదీరనున్నాడు. రాజధాని గ్రామం వెంకటపాలెం దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గురువారం ఉదయం సీఎం చంద్రబాబు భూకర్షణం, బీజవాపనం కార్యక్రమాలు నిర్వహించి ఆగమయోక్తంగా ప్రారంభించారు. తిరుమల తరహాలో భారతీయ కళ ఉట్టిపడేలా నిర్మాణం జరుగనుంది. రెండేళ్ల పాటు 25 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం, ఉపాలయాలు, కళ్యాణమండపాల నిర్మాణాలు, ద్రవిడ శిల్ప రీతులతో జరుగనున్నాయి. భూకర్షణంలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం, వసంతోత్సవం నిర్వహించనున్నారు.
 
భూకర్షణం తర్వాత పదిరోజుల పాటు అర్చకులు ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు జరుగనున్నాయి. అనంతరం ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. భూకర్షణం కార్యక్రమం సందర్భంగా హోంగుండాలు, వేదిక, సీఆర్డేయే స్టాళ్లు, ఆలయ నమూనా ఎగ్జిబిషన్, ప్రత్యక్ష ప్రసారాల డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దాదాపు రూ.140కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఇప్పటికే టెండర్లను ఖరారు చేసింది. ఆలయ నిర్మణం కూడా అత్యంత వేగంగా జరుగనుంది.
 
గత ఏడాది జులైలో కురక్షేత్రలో ఆలయ నిర్మాణం చేపట్టిన టీటీడీ జనవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహం ప్రతిష్ట, మహాకుంభాభిషేకం నిర్వహించింది. మార్చి 13న హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయాన్ని ప్రారంభించడంతో పాటు ఇటు అమరావతిలో శ్రీనివాసుని ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. అటు ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురంలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ పూనుకుంది. విశాఖపట్నం, భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాలతో పాటు చెన్నైలో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణాలు చేపట్టనున్న టీటీడీ ఇటు అమరావతిలో ఆలయ నిర్మాణాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు ధర్మప్రచారంలో భాగంగా వీలైనన్ని ఎక్కువ ప్రాంతల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించి తిరుమల తరహాలో సంప్రదాయబద్ధంగా కైంకర్యాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
Link to comment
Share on other sites

ముహూర్తం ఖరార్‌..!
 

తాత్కాలిక హైకోర్టు భవనానికి తుది మెరుగులు
అత్యాధునిక వసతులతో రూపకల్పన
ఫిబ్రవరి 3న ప్రారంభోత్సవం
ఈనాడు డిజిటల్‌, విజయవాడ

a1FSJ9Y.jpg

నవ్యాంధ్ర రాజధానిలో నిర్మిస్తున్న తాత్కాల్కిక హైకోర్టు భవన నిర్మాణం ప్రారంభానికి సిద్ధమైంది. అమరావతిలోని పరిపాలన నగరంలో జ్యూడిషియల్‌ కాంప్లెక్స్‌లో శాశ్వత హైకోర్టు నిర్మించే ప్రదేశానికి సమీపంలో చేపడుతున్న ఈ నిర్మాణం పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. రాష్ట్ర హైకోర్టుని హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడే భవనం నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికి కొంత సమయం పట్టే అవకాశముండటం, రాజధానిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాలేవీ హైకోర్టు ఏర్పాటుకు తగినట్లుగా లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత అక్టోబర్‌ 2 నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి, హైకోర్టుని రాజధానికి తరలించాలిన్నది ఆలోచన. కానీ ఆకృతు(డిజైన్లు)ల ఎంపికలు, వాటి అనుమతుల విషయంలో ఆలస్యం కావడంతో డిసెంబర్‌ 15, తర్వాత సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జనవరి 3వ తేదీ హైకోర్టు రాష్ట్రానికి వచ్చేయడంతో త్వరితగతిన పూర్తి చేయాలని సీఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పనులు తుదిదశకు రావడంతో.. ఫిబ్రవరి 3న ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రారంభోత్సవానికి రావాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ని ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.

* మహిళా న్యాయవాదులు: మహిళా న్యాయవాదుల సంఘం కోసం కోర్టు భవనంలోనే సుమారు 2,500 చ.అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక మందిరం ఉంటుంది.
* ప్రభుత్వ న్యాయవాదుల కోసం: 21 ప్రత్యేక క్యాబిన్ల నిర్మాణం
* సీనియర్‌ న్యాయవాదుల కోసం: 55వేల చదరపు అడుగులతో ప్రత్యేక భవనం నిర్మాణం.
* సిబ్బంది కోసం: ఆధునిక క్యూబికల్‌ ఫర్నిచర్‌ను తీసుకొచ్చారు.
* క్యాంటీన్‌: ఒకేసారి 500 మంది భోజనం చేసేలా గార్డెన్‌లో 4000 చ.అడుగుల్లో క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
* అలాగే కోర్టు ప్రాంగణంలోనే బ్యాంకు, తపాలా కేంద్రం, న్యాయపుస్తకాల విక్రయకేంద్రం వంటివిఉన్నాయి.

అత్యాధునిక వసతులు
జీ+2 విధానంలో నిర్మించే ఈ భవనం నిర్మిత ప్రాంతం దాదాపు 2,50,000 చదరపు అడుగులు ఉంటుంది. దీన్ని భవిష్యత్తులో జీ+5కి పెంచుకునే విధంగా ప్రీకాస్ట్‌ కాలమ్‌ ఆకృతుల్లో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ పనులన్నీ గోడలోపలే అంతర్గతంగా ఏర్పాటు చేస్తున్నారు. పేరుకి తాత్కాలిక హైకోర్టు భవనమే అయినప్పటికీ.. హైకోర్టు నిర్వహణకు కావాల్సిన అన్ని సౌకర్యాలు దీనిలో సమకూర్చారు. భవనానికి రెండు పక్కల ఉద్యానవనాలు, విశాలమైన పార్కింగ్‌ ప్రాంతం ఏర్పాటు చేస్తున్నారు. భవనానికి రాజస్థాన్‌ శాండ్‌ స్టోన్‌తో తాపడం చేసి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. హైకోర్టు బిల్డింగ్‌ పక్కనే జీ+5 విధానంలో న్యాయవాదుల భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 150 మంది న్యాయవాదులకు సరిపడేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. భవన కారిడార్లలో మినహా మిగతా ప్రాంతమంతా ఎయిర్‌ కండిషన్డ్‌ సదుపాయం ఉంది. 2.5 లక్షల దస్త్రాలను భద్రపరిచేలా ఆధునిక స్టోరేజీ సదుపాయాన్ని కోర్టు భవనంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణంలో కల్పించే మౌలిక సదుపాయాలన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటాయి. న్యాయవాదులు, వివాదులు, ప్రజలు, సాక్షులు, పోలీసు అధికారులు, వయోవృద్ధులు ఇలా అందరికీ సౌకర్యవంతమైన ఆకృతులతో నిర్మించారు.

పార్కింగ్‌
* నాలుగు ఎకరాల స్థలం
* రెండు సెక్యూరిటీ చెక్‌ పాయింట్స్‌
* ఒకేసారి 300 కార్లు నిలిపే సదుపాయం
ప్రతి రెండు పార్కింగ్‌ లైన్ల మధ్యలో 5 నుంచి 6.5 స్థలాన్ని వాహనాలు వెళ్లేందుకు వదిలారు.
* ప్రతి ఐదు కార్ల తర్వాత పచ్చదనం పెంచేందుకు ఖాళీ స్థలాన్ని ఉంచారు.

ప్రత్యేకతలు..
నాలుగు మార్గాలు: న్యాయమూర్తులు, ప్రజలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కోసం వేర్వేరు ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశారు.

కోర్టు హాళ్లు
* గ్రౌండ్‌ ఫ్లోర్‌- 0
* మొదటి అంతస్తు- 12
* రెండో అంతస్తు- 11
* ప్రధాన న్యాయమూర్తి కోర్టు- 1 (ఛాంబర్‌తో కలిపి 2480 చ.అడుగులు)
* ఇతర కోర్టులు-22 (జడ్జి ఛాంబర్‌తో కలిపి సుమారు 2480 చ.అడుగులు)
* లిఫ్టులు: 12

Link to comment
Share on other sites

మరావతికి భారీ ప్రణాళిక
01-02-2019 03:32:28
 
636845887493544209.jpg
  • రూ.55,343 కోట్ల పనులకు ఆమోదం
  • పలు సంస్థలకు భూకేటాయింపులు
  • భూధార్‌కు చట్టబద్ధత
  • మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
అమరావతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.55,343 కోట్లతో అమలు చేసే సమగ్ర ఆర్థిక ప్రణాళికకు రాష్ట్ర మంత్రిమండలి గురువారం ఆమోదముద్ర వేసింది. ఇందులో రూ.51,687 కోట్లను ప్రాజెక్టు పెట్టుబడి వ్యయంగా, రూ.3,656 కోట్లను నిర్మాణ సమయంలో వడ్డీగా అంచనా వేసింది. ఈ వ్యయంలో రూ.37,112 కోట్లను ఆర్థిక సంస్థలు, వాణిజ్య బ్యాంకుల ద్వారా సేకరించేందుకు సీఆర్డీఏకు అధికారమిచ్చింది. కొన్ని ప్రాజెక్టుల ఆస్తులు తనఖాపెట్టి రుణాలు తీసుకోవాలన్న సీఆర్డీఏ ప్రతిపాదనను ఆమోదించింది.
 
పబ్లిక్‌ బాండ్ల ద్వారా రూ.500 కోట్ల సేకరిస్తారు. అలాగే రాజధాని అమరావతి సుస్థిర మౌలిక సదుపాయాలు, సంస్థాగత అభివృద్ధి పథకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పథకానికి ఈఏపీ రుణ మొత్తం రూ.5,076 కోట్లు. ఇందులో రూ.3,550 కోట్లను ప్రపం చబ్యాంకు, ఏఐఐబీ ఇస్తాయి.ప్రభుత్వం తన వాటాగా రూ.1526 కోట్లు చెల్లించనుంది. అలాగే సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల నిర్మాణానికి రూ.4,900 కోట్ల సమీకరణకు కేబినెట్‌ అనుమతిచ్చింది.
 
రాజధానిలో భూ కేటాయింపులు
  • ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయానికి రాజధానిలో 25 ఎకరాల కేటాయింపు. ఎకరా ధర రూ.50 లక్షలు.
  • సెయింట్‌ మాథ్యూస్‌ పాఠశాలకు ఎకరా రూ.50 లక్షల చొప్పున 3 ఎకరాలు.
  • సతికాంతగుహ ఫౌండేషన్‌కు అంతే ధరతో 3 ఎకరాలు.
  • ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి 12 ఎకరాల కేటాయింపు. ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 33 ఏళ్లపాటు లీజు.
  • జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు 60 ఏళ్లపాటు 2 ఎకరాలు లీజుకు.
  • క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు చదరపు మీటరుకు రూపాయి చొప్పున ఎకరం కేటాయింపు.
  • యంగ్‌మెన్‌ ఆఫ్‌ క్రిస్టియన్స్‌ అసోసియేషన్‌కు ఎకరా రూ. 50 లక్షల ధరకు 2.65 ఎకరాలు.
  • రామకృష్ణ మిషన్‌, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలకు 25 ఎకరాల భూమి.
Link to comment
Share on other sites

అమరావతికి.. ఆధ్యాత్మిక శోభ
01-02-2019 09:47:51
 
636846112725532114.jpg
  • గోవిందనామ స్మరణతో మార్మోగిన రాజధాని
  • భక్తిప్రపత్తులతో శ్రీవారి ఆలయ భూకర్షణ
  • వేలాదిగా తరలి వచ్చిన భక్తులు, సేవకులు
  • హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు
తుళ్లూరు: రాజధాని అమరావతిలో ఆధ్యాత్మాక శోభ వెల్లివిరిసింది. వెంకటపాలెం వద్ద శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణ అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగలి పట్టి భూమిని దున్నారు. నవధాన్యాలు చల్లి బీజావాహం చేశారు. మంత్రులతో కలిసి నేలపై ఆశీనులై రుత్వికులు చేస్తున్న హోమాన్ని తిలకించారు. ఉదయం 9.30 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు భూకర్షణ జరిగే కార్యక్రమానికి రోడ్డుమార్గంలో వచ్చారు. ఆలయ నమూనాను సీఎం పరిశీలించారు. ఉత్సవమూర్తుల వద్ద పవిత్ర నాగలిని అర్చకులు సీఎంకు అందజేయగా, వేద మంత్రోచ్ఛరణలు మంగళ వాద్యాలతో వేదిక పక్కనే ఉన్న భూకర్షణ జరిగే ప్రదేశానికి సీఎం చేరుకున్నారు.తదననంతరం ఉత్సవమూర్తుల వద్ద పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. స్వామి వారికిచ్చిన నక్షత్ర హారతి, ఏక హారతి కళ్లకు అద్దుకొని స్వామి వారికి సీఎం నమస్కరించారు. ప్రాంగణమంతా గోవింద నామ స్మరణతో మార్మోగింది. సీఎం ప్రసంగం అయిపోయిన తరువాత భక్తులతో గోవిందా.. గోవిందా అనిపిస్తూ, సీఏం కూడా గోవింద నామస్మరణం చేశారు.
 
కార్యక్రమాన్ని వీక్షించటానికి టీటీడీ పెద్ద స్ర్కీన్‌లను ఏర్పాటు చేసింది. వేదిక బయట శ్రీవారి భక్తులు కోలాటం ఆకట్టుకుంది. కార్యక్రమానికి వచ్చిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నప్రసాదాలను అందజేశారు. సభా ప్రాంగణం వద్ద స్టాల్స్‌ను ఏర్పాటు చేసారు. తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్యసేవలను అందించారు. ఈ సందర్భంగా భక్తులను, సేవకులనుద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, నారాయణ, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు బొండా ఉమా, తెనాలి శ్రావణ్‌ కుమార్‌, టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో భాస్కరావు, ఎంపీపీ పద్మలత, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, టీటీడీ అర్చకులు, సిబ్బంది, రాజధాని గ్రామాల రైతులు పాల్గొన్నారు.
అమరావతికి.. ఆధ్యాత్మిక శోభ
01-02-2019 09:47:51
 
636846112725532114.jpg
  • గోవిందనామ స్మరణతో మార్మోగిన రాజధాని
  • భక్తిప్రపత్తులతో శ్రీవారి ఆలయ భూకర్షణ
  • వేలాదిగా తరలి వచ్చిన భక్తులు, సేవకులు
  • హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు
తుళ్లూరు: రాజధాని అమరావతిలో ఆధ్యాత్మాక శోభ వెల్లివిరిసింది. వెంకటపాలెం వద్ద శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణ అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగలి పట్టి భూమిని దున్నారు. నవధాన్యాలు చల్లి బీజావాహం చేశారు. మంత్రులతో కలిసి నేలపై ఆశీనులై రుత్వికులు చేస్తున్న హోమాన్ని తిలకించారు. ఉదయం 9.30 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు భూకర్షణ జరిగే కార్యక్రమానికి రోడ్డుమార్గంలో వచ్చారు. ఆలయ నమూనాను సీఎం పరిశీలించారు. ఉత్సవమూర్తుల వద్ద పవిత్ర నాగలిని అర్చకులు సీఎంకు అందజేయగా, వేద మంత్రోచ్ఛరణలు మంగళ వాద్యాలతో వేదిక పక్కనే ఉన్న భూకర్షణ జరిగే ప్రదేశానికి సీఎం చేరుకున్నారు.తదననంతరం ఉత్సవమూర్తుల వద్ద పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. స్వామి వారికిచ్చిన నక్షత్ర హారతి, ఏక హారతి కళ్లకు అద్దుకొని స్వామి వారికి సీఎం నమస్కరించారు. ప్రాంగణమంతా గోవింద నామ స్మరణతో మార్మోగింది. సీఎం ప్రసంగం అయిపోయిన తరువాత భక్తులతో గోవిందా.. గోవిందా అనిపిస్తూ, సీఏం కూడా గోవింద నామస్మరణం చేశారు.
 
కార్యక్రమాన్ని వీక్షించటానికి టీటీడీ పెద్ద స్ర్కీన్‌లను ఏర్పాటు చేసింది. వేదిక బయట శ్రీవారి భక్తులు కోలాటం ఆకట్టుకుంది. కార్యక్రమానికి వచ్చిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నప్రసాదాలను అందజేశారు. సభా ప్రాంగణం వద్ద స్టాల్స్‌ను ఏర్పాటు చేసారు. తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్యసేవలను అందించారు. ఈ సందర్భంగా భక్తులను, సేవకులనుద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, నారాయణ, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు బొండా ఉమా, తెనాలి శ్రావణ్‌ కుమార్‌, టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో భాస్కరావు, ఎంపీపీ పద్మలత, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, టీటీడీ అర్చకులు, సిబ్బంది, రాజధాని గ్రామాల రైతులు పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

వైకుంఠవాసుడే రాజధానికి రక్ష
 

వైభవంగా శ్రీవారి ఆలయ భూకర్షణం
గోవింద నామస్మరణతో పులకించిన వెంకటపాలెం

వెంకటపాలెం(తుళ్ళూరు), న్యూస్‌టుడే: రెండుగా విడిపోయిన తెలుగురాష్ట్రంలో కట్టుబట్టలతో బయటకు వచ్చాం...అన్నీపోయినా మనకు శ్రీనివాసుని తోడు ఉన్నందునే కష్టాలను అధిగమిస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాజధాని అమరావతిలో వెంకటపాలెం సమీపంలో నిర్మించబోయే శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించి గురువారం ఉదయం 9.30 నిమిషాలకు ఎద్దులతో అరకకట్టి స్వామిని ప్రతిష్ఠిపజేసే గర్భాలయం చుట్టూ మట్టిని ముఖ్యమంత్రి దున్నారు. తితిదే వేదపండితుల ఆశీర్వచనాలతో అష్టదిక్పాలకులను ఆవాహనం చేస్తూ భూకర్షణ కార్యక్రమం ముగించారు.తర్వాత సభాస్థలిలో ఏర్పాటు చేసిన మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు. నక్షత్రహోమం, బీజావాపనంలో పాల్గొన్నారు. సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన నమూనా ఆలయం ఆకృతులను పరిశీలించారు. తితిదే బహూకరించిన నాగలిని భుజాన పెట్టుకొని భూకర్షణ కార్యక్రమాన్ని ముగించారు. అసంఖ్యాకంగా వచ్చిన శ్రీవారి సేవకులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. శ్రీవారి సేవకుల సంఖ్య రెట్టింపు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి ఆద్యంతం ఆనందంగా కనిపించారు. శ్రీవారి ఆలయానికి కేటాయించిన 25 ఎకరాల భూమిని పూర్తిగా ఇస్తున్నామని భక్తుల కరతళాల మధ్య ప్రకటించారు. తితిదే వేదపండితులు సీఎం చంద్రబాబుకు ప్రసాదాన్ని అందించారు.

కట్టిపడేసిన కళాజాత ప్రదర్శనలు
శ్రీవారి సేవకులు గురువారం తెల్లవారుజామునుంచే భూకర్షణ నిర్వహించే ప్రదేశానికి చేరుకొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సేవకులు తరలివచ్చారు. అడుగడుగునా స్వామి ఘనతను కీర్తిస్తూ చేసిన కోలాట ప్రదర్శనలు భక్తులను కట్టిపడేశాయి. ఒకవైపు శ్రీనివాసుడి దేవస్థానం నిర్మాణానికి సంబంధించిన భూకర్షణ కార్యక్రమం, మరోవైపు పూర్ణాహుతి, ఇంకోవైపు నక్షత్రహోమాలతో ప్రాంగణం కళకళలాడింది. గోవింద నామస్మరణతో రాజధాని అమరావతి మార్మోగింది. కనుల పండువగా సాగిన వేడుకల్లో మంత్రులు, తితిదే అధికారులు, ఆలయాల ట్రస్టుబోర్డు ఛైర్మన్లు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

నా భూమిలో ఆలయ నిర్మాణం ఎంతో ఆనందం
రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నాభూమిలో ఆలయం నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నా పూర్వజన్మసుకృతం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపుతో ప్రాణ సమానమైన భూములు ఇచ్చాం. ఆ భూముల విలువైతే పెరిగింది. మనస్సులో ఏదో తెలియని వెలితి ఉండేది. ఈ సమయంలో శ్రీవారి ఆలయం ఇక్కడ నిర్మిస్తున్నారని తెలిసి నా మనస్సు ఉప్పొంగిపోయింది. ఇది నాజన్మకు చాలు.

- లంక సుధాకరరావు
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...