Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో చిప్‌ డిజైన్‌ వర్సిటీ
27-02-2018 04:42:30

విశాఖపట్నం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను ఓ స్టార్టప్‌ కంపెనీలా భావించి అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అమరావతిలో త్వరలో చిప్‌ డిజైన్‌ తయారీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఏపీలో నూతన పోర్టులు, ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. సదస్సు మూడో రోజు ‘ద యూనివర్స్‌ ఆఫ్‌ స్టార్టప్స్‌’ అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో మూడున్నర ఏళ్లలోనే 12% వృద్ధి సాధించామన్నారు. కాగా, విశాఖలోని మధురవాడలో 19.6 ఎకరాల్లో ఐటీ ట్విన్‌ టవర్లను నిర్మించేందుకు ఏపీ ఐటీశాఖతో వుడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Link to comment
Share on other sites

స్టార్టప్‌ ఏరియాలో సింగపూర్‌ విజిటర్‌ సెంటర్‌, గ్యాలరీ
27-02-2018 08:17:17

అమరావతి: రాజధాని ప్రగతికి పునాదిగా నిలవనున్న స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిని చేపట్టనున్న సింగపూర్‌ కన్సార్షియం ఆ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఒక విజిటర్‌ సెంటర్‌, ఎగ్జిబిషన్‌ గ్యాలరీలను నిర్మించనుంది. ‘ఫేజ్‌ జీరో’ అని సదరు ప్రాంతాన్ని వ్యవహరిస్తున్న ఈ కన్సార్షియం 684 హెక్టార్లలో విస్తరించిన స్టార్టప్‌ ఏరియాను అమరావతి అభివృద్ధి సంస్థతో కలసి సంయుక్తంగా అభివృద్ధి పరచనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా అమరావతిని సందర్శించేందుకు వచ్చే వారు ఈ ప్రాంతం గురించి తెలుసుకునేందుకు వీలుగా 4,000 చదరపు మీటర్ల విస్తీర్ణంతో అక్కడ విజిటర్‌ సెంటర్‌, ఎగ్జిబిషన్‌ గ్యాలరీలను ఏర్పాటు చేయనుంది. అమరావతి రాజధాని నగరం అభివృద్ధి చెందే క్రమాన్ని ఎప్పటికప్పుడు సందర్శకుల కళ్ల ముందు ఇవి నిలపనున్నాయి. అంతే కాకుండా వాణిజ్యాభివృద్ధికి తద్వారా అమరావతి ఆర్ధికాభ్యున్నతికి తోడ్పడనుంది. అత్యంత అధునాతనమైన, నాణ్యమైన నగరీకరణకు ఉపకరించే విధానాలతో రాజధాని రూపొందే వైనాన్నీ కళ్లకు కట్టనుంది. రెండు హెక్టార్లకు పైగా సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ నిర్మాణాలు కమ్యూనిటీ హబ్‌గానూ రూపుదిద్దుకుని, స్థానికులు ఆహ్లాదంతోపాటు సామూహిక కార్యక్రమాలను నిర్వహించుకునే వీలు కల్పించనుంది.

Link to comment
Share on other sites

అమరావతి అభివృద్ధిలో మేము సైతం 
27-02-2018 02:56:54
సీఎం చంద్రబాబుతో సింగపూర్‌ బిజినెస్‌ సమాఖ్య
(విశాఖ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నామని సింగపూర్‌ బిజినెస్‌ సమాఖ్య వెల్లడించింది. విశాఖ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు సింగపూర్‌ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌ సోమవారం వచ్చారు. ఆయన వెంట సింగపూర్‌ బిజినెస్‌ సమాఖ్య ప్రతినిధులూ వచ్చారు. అమరావతి అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అసెండాస్‌ వంటి సంస్థల ప్రతినిధులూ ఈ బృందంలో ఉన్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరావతి నగర నమూనాను ఆసక్తిగా పరిశీలించారు. రాజధాని నిర్మాణం, అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో ఈ బృందం చర్చించింది. అమరావతిలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నామని వివరించింది. సీడ్‌ క్యాపిటల్‌లో ఎగ్జిబిషన్‌, సెరిమోనియల్‌, గ్యాలరీ, కమ్యూనిటీ జోన్‌లుగా విడదీసి ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మిస్తామని తెలిపింది. ఈ సెంటర్‌ ఐదెకరాల్లో విస్తరించి ఉంటుంద ని, ఇందులో భవిష్యత్తు సాంకేతికతను ఉపయోగిస్తామని వివరించింది. రూ.5000 కోట్ల విద్యుత్‌ ప్రాజెక్టును విశాఖలో ఏర్పాటు చేస్తామని స్టెరిలైట్‌ పవర్‌ బృందం వెల్లడించింది. ఈ ప్రాజెక్టులను కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానం ద్వారా ఏర్పాటు చేస్తామని, వోల్టేజీ సమస్యలు ఎదురుకాబోవని వివరించింది. బిడ్స్‌, డిజైన్‌, కన్‌స్ట్రక్షన్‌, ఓన్స్‌, ఆపరేట్‌ విధానంలో పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ అసెట్స్‌ను ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో అమలు చేస్తున్న ఫైబర్‌ గ్రిడ్‌కు అవసరమైన ఆప్టికల్‌ ఫైబర్‌ టెక్నాలజీకి సహకరిస్తామని తెలిపింది. ప్రాజెక్టు నివేదికను అందజేస్తామని వివరించింది. ప్రఖ్యాత ఆధునిక ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీని ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా అందిస్తామని తెలిపింది.

Link to comment
Share on other sites

అంకుర ప్రాంతంలో ‘ఫేజ్‌ జీరో’ 
ఐదు ఎకరాల్లో ప్రదర్శన కేంద్రం, సందర్శకుల గ్యాలరీ 
ముఖ్యమంత్రితో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ భేటీ 
డిజైన్లు ప్రదర్శించిన సింగపూర్‌ కన్సార్టియం ప్రతినిధులు 
విశాఖ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి 
26ap-main9a.jpg

సింగపూర్‌ వాణిజ్య పరిశ్రమల మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ సారథ్యంలో ఆ దేశ ప్రతినిధుల బృందం విశాఖ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమైంది. సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థలతో కూడిన కన్సార్టియం, అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ)తో కలసి రాజధానిలోని 1691 ఎకరాల్లో అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పురోగతి గురించి చర్చింది. అంకుర ప్రాంతంలో ఉత్ప్రేరకాభివృద్ధిలో భాగంగా తొలుత ఐదెకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించనున్నట్టు సింగపూర్‌ బృందం తెలిపింది. దీనిలో ప్రదర్శన కేంద్రం, వివిధ వేడుకల నిర్వహణకు అవసరమైన విభాగం, సందర్శకుల గ్యాలరీ, కమ్యూనిటీ జోన్‌ ఉంటాయంది. దీనికి ‘ఫేజ్‌ జీరో’గా నామకరణం చేసింది. సంబంధిత నమూనా ఆకృతుల్ని ముఖ్యమంత్రి ముందుంచింది. అంకుర ప్రాంతాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని మొదట నిర్ణయించారు. మొదట్లో ఈ ‘ఫేజ్‌ జీరో’ ప్రతిపాదన లేదు. ఫేజ్‌ జీరో ప్రాజెక్టులో 4వేల చ.మీటర్ల నిర్మితప్రాంతం ఉంటుంది. రాజధాని అమరావతికి సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని కళ్లకు కట్టేలా ఇందులో ప్రదర్శన కేంద్రం ఏర్పాటుచేస్తారు. వినోద, సామాజిక అవసరాల కోసం స్థానిక ప్రజలు దీన్ని వినియోగించుకోవచ్చని కన్సార్టియం ప్రతినిధులు తెలిపారు. అంతకు ముందు భాగస్వామ్య సదస్సులోని ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌లో సీఆర్‌డీఏ ప్రదర్శనకు ఉంచిన రాజధాని, పరిపాలన నగరం, శాసనసభ, హైకోర్టు భవనాల నమూనాలను ఈశ్వరన్‌ తిలకించారు.

26ap-main9b.jpg
Link to comment
Share on other sites

రాజధాని అమరావతిలో 78,700 ఉద్యోగాలు
28-02-2018 09:26:32

49,800 కోట్లు
అమరావతి కోసం 37 సంస్థలతో సీఆర్డీయే ఎంవోయూలు
వాటి మొత్తం విలువ రూ.49,800 కోట్లు
అవి సృష్టించే ఉద్యోగాలు 78,700
రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోనున్న సుప్రసిద్ధ కంపెనీలు
అమరావతి(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ముగిసిన భాగస్వామ్య సదస్సు నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చింది. ఈ ప్రపంచస్థాయి రాజధాని నగర నిర్మాణంలో పాలుపంచుకునేందుకు దేశ, విదేశాలకు చెందిన ఎన్నెన్నో సుప్రసిద్ధ సంస్థలు ముందుకు వచ్చాయి. అలాంటి 37 కంపెనీలతో సీఆర్డీయే అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. వీటన్నింటి మొత్తం విలువ రూ.49,800 కోట్లు కాగా వీటి వల్ల రాజధానిలో 78,700 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి!
 
ఈ సంస్థల్లో విద్య, మౌలిక వసతులు, పర్యాటక, నిర్మాణ, క్రీడలు, సాంకేతిక, పారిశ్రామిక, రవాణా, మేనేజ్‌మెంట్‌, ఆతిథ్యం, మీడియా- ఫిల్మ్‌ స్టూడియో, యానిమేషన్‌, సాంస్కృతిక ఇత్యాది పలు రంగాలకు చెందినవి ఉన్నాయి. ఆయా కంపెనీల పేర్లు, అమరావతిలో అవి స్థాపించబోయే సంస్థలు, పెట్టబోయే పెట్టుబడుల వివరాలు సంక్షిప్తంగా..
 
ఎ.ఎన్‌.ఎ.ఎస్‌. ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)- రూ.5,000 కోట్లు, షాపూర్జీ పల్లోంజీ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)- రూ.2,400 కోట్లు, ఎల్‌.ఇ.పి.ఎల్‌. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అండ్‌ ఎస్సెల్‌ వరల్డ్‌ (ఫన్‌ప్లెక్స్‌)- రూ.500 కోట్లు, ఎల్‌.ఇ.పి.ఎల్‌. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (మిడ్‌వ్యాలీ సిటీ)- రూ.2500 కోట్లు, ఎల్‌.ఇ.పి.ఎల్‌. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎల్‌.ఇ.పి.ఎల్‌. హైటెక్‌ సిటీ)- రూ.1500 కోట్లు, వింధ్యా టెలిలింక్స్‌ (ఎం.పి. బిర్లా కంపెనీ)- టర్న్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్‌- రూ.750 కోట్లు, ఉండవల్లి కన్‌స్ట్రక్షన్స్‌ (హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌)- రూ.350 కోట్లు, శ్రీ రామచంద్ర ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, చెన్నై (మెడికల్‌ యూనివర్సిటీ మరియు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌)- రూ.1500 కోట్లు, ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎల్పీఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌)- రూ.2400 కోట్లు, ఎ.ఎన్‌.ఎ.ఎస్‌. ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఎల్పీఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌)- రూ.2,000 కోట్లు, ఎల్‌.ఇ.హెచ్‌. కన్‌ఫ్లూయెన్షియల్‌ కార్పొరేషన్‌ (అఫర్డబుల్‌ హౌసింగ్‌ టౌన్‌షిప్‌)- రూ.2,500 కోట్లు, ఎ.డి.ఎఫ్‌.ఎ.సి.- ఐ.ఎం.ఎ.సి. (ఔషధ పరిశోధన, తయారీ)- రూ.750 కోట్లు, హైదరాబాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ (హెల్త్‌ కేర్‌)- రూ.250 కోట్లు, ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్థోపెడిక్స్‌ రీజనరేటివ్‌ మెడిసిన్‌ (హెల్త్‌ కేర్‌)- రూ.200 కోట్లు, విజ్లింగ్‌ ఉడ్స్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (మీడియా- ఫిల్మ్‌ స్టూడియో)- రూ.100 కోట్లు, సవీతా యూనివర్సిటీ (ఉన్నత విద్య)- రూ.2,100 కోట్లు, ఇండియా ఇస్లామిక్‌ కల్చరల్‌ సెంటర్‌ (సాంస్కృతిక కేంద్రం)- రూ.120 కోట్లు, గోల్డ్‌ ఫిష్‌ ఎబోడ్‌ (గోల్ఫ్‌ కోర్స్‌)- రూ.2,000 కోట్లు, కుని ఉమి అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ- టోక్యో, జపాన్‌ (అఫర్డబుల్‌ హౌసింగ్‌ టౌన్‌షిప్‌)- రూ.1300 కోట్లు, కె.వి.ఎం.
 
స్పేసెస్‌ ఎల్‌.ఎల్‌.పి. (లగ్జరీ విల్లాలు, హౌసింగ్‌)- రూ.800 కోట్లు, టూన్జ్‌ యానిమేషన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (యానిమేషన్‌ స్టూడియో)- రూ.100 కోట్లు, ఎమ్మెస్కే ప్రసాద్‌ అమరావతి ఇంటర్నేషనల్‌ అకాడమీ (ప్రపంచస్థాయి క్రికెట్‌ అకాడమీ)- రూ.40 కోట్లు, ఆస్ట్రాజెన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎడ్యుటైన్‌మెంట్‌ పార్క్‌)- రూ.100 కోట్లు, పోదార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (ఇంటర్నేషనల్‌ స్కూల్‌)- రూ.7.50 కోట్లు, కోస్టా మెరీనా (రిఫర్‌ ఫ్రంట్‌ - బెర్తింగ్‌- టెర్మినల్‌)- రూ.60 కోట్లు, గ్రూమ్‌ ఇండియా సెలూన్‌ అండ్‌ స్పా (నేచురల్స్‌) స్పాలు మరియు ట్రైనింగ్‌ సెంటర్‌- రూ.51 కోట్లు, ర్యాన్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ (ఇంటర్నేషనల్‌ స్కూల్‌)- రూ.20 కోట్లు, స్మార్ట్‌ బైక్‌ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (స్మార్ట్‌ బైక్‌ల అసెంబ్లింగ్‌ యూనిట్‌)- రూ.100 కోట్లు, సమృద్ధి నెక్సా (హౌసింగ్‌)- రూ.100 కోట్లు, రూరల్‌ ఎంపవర్‌మెంట్‌ బై విమెన్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ ఆఫ్‌ అమరావతి (ఎం.ఎస్‌.ఎం.ఇ. పార్క్‌)- రూ.70 కోట్లు, వెంకటసాయి ఎస్టేట్స్‌ లిమిటెడ్‌ (ఇంటెగ్రేటెడ్‌ మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ హబ్‌)- రూ.60 కోట్లు, బీటెల్‌ స్మార్టోటెల్స్‌ (కంటైనర్‌ హోటళ్లు)- రూ.35 కోట్లు, కాంథారి హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ప్రి ఫ్యాబ్‌ హోటల్స్‌)- రూ.20 కోట్లు, క్యూబ్‌ డిజైన్‌ కన్సార్షియం (మాడ్యులార్‌ అఫర్డబుల్‌ హౌసింగ్‌)- రూ.15 కోట్లు, హెల్త్‌ స్టార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (స్టార్టప్‌ యాక్సిలేటర్‌)- రూ.10 కోట్లు, మహేష్‌ భూపతి టెన్నిస్‌ అకాడెమీ (స్పోర్ట్స్‌ అండ్‌ ట్రైనింగ్‌)- రూ.5 కోట్లు, బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (భవన నిర్మాణాలకు అవసరమైన సాంకేతిక సహకారం)- రూ.5 కోట్లు.
 
గత 2 సదస్సుల్లో 57 ఒప్పందాలు..
కాగా.. 2016, 2017లలో విశాఖపట్నంలోనే నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో కూడా ఏపీసీఆర్డీయే అమరావతి అభివృద్ధి కోసం మొత్తం 57 ఎంఓయూలు కుదుర్చుకుంది. వాటిల్లో 5 ఇప్పటికే కార్యరూపం దాల్చగా, మరో 21 ప్రాజెక్టులు త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించే దశలో ఉన్నాయి. ఈ 26 ప్రాజెక్టుల మొత్తం విలువ అవి పూర్తయ్యేసరికి రూ.66,200 కోట్లు. ఇది ఆ రెండేళ్లల్లో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల మొత్తంలో సుమారు 69 శాతానికి సమానం.

Link to comment
Share on other sites

రాజధాని చెరువులకు మహర్దశ..!
28-02-2018 07:49:58
 
636554009970630718.jpg
  • సుందరీకరణకు సీఆర్డీయే ప్రణాళిక
  • ఇప్పటికే తుళ్లూరు చెరువు అభివృద్ధి
  • దశలవారీగా మరిన్ని..
  • కోరిన గ్రామాలకు తొలి ప్రాధాన్యం
  • భూవ్యవహారాల శాఖ డైరెక్టర్‌ చెన్నకేశవులు
 
 
నవ్యాంధ్ర రాజధానిని బ్లూగ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను అమల్లో చూపించేందుకు కొంత సమయం పడుతుంది. ఈలోగా వున్న వనరులను వినియోగించుకుని రాజధాని ప్రాంతాన్ని అందంగా, ఆహ్లాదంగా మలిచేందుకు సీఆర్డీయే కృషి చేస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో చెరువులను తీర్చిదిద్దేందుక ప్రణాళికలు రూపొందిస్తోంది.
 
 
మంగళగిరి: రాజధాని ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఒకటికన్నా ఎక్కువ చెరువులే ఉన్నాయి. ఈ చెరువులను అందంగా తీర్చిదిద్ది స్థానికులకు మంచి ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు చెరువుల చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటుచేస్తే ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని కూడా అందించినట్టవుతుంది. ఈ ఆలోచనలకు అనుగుణంగా తుళ్లూరులోని ప్రధాన చెరువును సీఆర్డీయే తీర్చిదిద్దింది. రూ.45 లక్షల వ్యయంతో చక్కని గ్రీనరీ, వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటు చేసింంది. తుళ్లూరు చెరువును ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాల్లో వున్న చెరువులను కూడ అదేస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఆర్డీయే అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వెంకటపాలెంలోని చెరువును రూ.17 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు అంచనాలను రూపొందించారు. దీంతోపాటు దొండపాడు, తుళ్లూరు పరిధిలోనే వున్న మరో చెరువును కూడ అభివృద్ధి చేసేందుకు సీఆర్డీయే అంచనాలను రూపొందిస్తుంది. తొలుత ఇంజనీరింగ్‌ అధికారులు చెరువును పరిశీలించి కట్టలను బలోపేతం చేయడంతో పాటు దానికి మెట్లు, వాకింగ్‌ ట్రాక్‌ వంటి నిర్మాణాలను చేపడతారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సీఆర్డీయే అటవీశాఖ విభాగం తరపున చెరువు కట్టలపై గ్రీనరీని ఆహ్లాదంగా వుండేలా ఏర్పాటు చేస్తారు.
 
మల్కాపురం చెరువు
తాత్కాలిక సచివాలయం ప్రాంతానికి అతి సమీపంలో మల్కాపురం కాకతీయుల కాలంలో ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో ఇదో గోళకీమఠం. ఇక్కడో చారిత్రక శివాలయం...దానికెదురుగా ఓ తటాకం వున్నాయి. ప్రస్తుతం ఇది మందడం-తుళ్లూరు ఆర్‌అండ్‌బీ రహదారి మార్గం పక్కనేవుంది. రాణీ రుద్రమదేవి తరచుగా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ వుండేది. తొలుతగా ఆమె ఈ తటాకంలో పాదాలు కడుగుకుని ఒడ్డున కొద్ది నిమిషాల పాటు కూర్చొన్న తరువాత ఆలయంలోకి వెళ్లేదట! కాలగతిలో ఈ ప్రాంగణమంతా ఆక్రమణలకు లోనైంది. ఆనాటి చెరువు నేడో మినీ తటాకంగా దయనీయంగా దర్శనమిస్తోంది. దీనిని చారిత్రక కోణంలో బాగా అభివృద్ధి చేసి సంరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.
 
కొన్నిచోట్ల ఆక్రమణలు
మంగళగిరి మండలంలో బేతపూడి, నిడమర్రు, నవులూరు గ్రామాలలో చెరువులు బాగా ఆక్రమణలకు లోనయ్యాయి. ఈ చెరువులన్నీ కూడ హెచ్చు విస్తీర్ణంలో వున్నవే! దీంతో సీఆర్డీయే అధికారులు ముందస్తుగా తుళ్లూరు మండలం గ్రామాల చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. మలిదశలో మంగళగిరి ప్రాంత చెరువుల అభివృద్ధిని చేపడతారు.
 
ప్రజలు కోరితే వెనువెంటనే..
రాజధాని గ్రామాల్లోని అన్నీ చెరువులను సుందరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. ఇప్పటికే ఆ కార్యక్రమాలను చేపట్టాం. ఎక్కడైతే ప్రజలు ముందుగా కోరతారో... ఆ ప్రాంత చెరువులను వెంటనే సుందరీకరిస్తున్నాం. దొండపాడు, వెంకటపాలెం, తుళ్లూరు గ్రామాల ప్రజల నుంచి ఆ డిమాండ్లు వచ్చాయి. శాఖమూరు, ఐనవోలులలో పంచాయతీ ఆధ్వర్యంలో చెరువులను అభివృద్ధి చేసుకుంటామన్నారు. అందుకు సమ్మతించాం. మిగతా రాజధాని గ్రామాల ప్రజలు కూడ కోరితే తక్షణమే ఆయా గ్రామాల్లో చెరువులను అభివృద్ధి చేస్తాం.
- చెన్నకేశవులు, సీఆర్డీయే భూవ్యవహారాల శాఖ డైరెక్టర్‌
Link to comment
Share on other sites

eevi evadu kontadu le anukunna first lo...cut cheste maxim sell chesesadu...Villas mottam ammesadu vadu pettina price ke...Apt kooda sales baga unnai...

TOP INTERNATIONAL school(seriously they needIGCSE/IB syllabus school in this area)  kooda(Mahesh babu partner antunaru dantlo kooda) plan chestunaru valla land lone....school ki India top vallani avutunanru

TWO 40 floor each commercial TOWERS they are starting next month part of next phase

 

2.jpg

 

 

 

 

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

52 minutes ago, AnnaGaru said:

eevi evadu kontadu le anukunna first lo...cut cheste maxim sell chesesadu...Villas mottam ammesadu vadu pettina price ke...Apt kooda sales baga unnai...

TOP INTERNATIONAL school(seriously they needIGCSE/IB syllabus school in this area)  kooda(Mahesh babu partner antunaru dantlo kooda) plan chestunaru valla land lone....school ki India top vallani avutunanru

TWO 40 floor each commercial TOWERS they are starting next month part of next phase

 

2.jpg

 

 

 

 

MB ki renumeration 5C icharanta ADVT ki

Link to comment
Share on other sites

అమరావతిలో భారీ సైనిక విగ్రహం
01-03-2018 01:20:48
 
636554640475833756.jpg
అమరావతిలో మరో అపురూప కట్టడం కొలువుతీరనుంది. ఈ మేరకు స్మార్ట్‌ పార్క్స్‌ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికుల కష్టానికి, త్యాగాలకు గుర్తుగా అమరావతిలో బుద్ధ విగ్రహం సమీపంలో భారీ సైనిక విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు స్మార్ట్‌ పార్క్స్‌ ఎండీ తవ్వా శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. ఆ విగ్రహాలను కలుపుతూ 2 కిలోమీటర్ల మేర బండ్‌ స్ర్టీట్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
Link to comment
Share on other sites

అసెంబ్లీ ఆకృతి వివరంగా... 
నమూనాలను ప్రదర్శించిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు
పలు సూచనలు చేసిన సభాపతి కోడెల 
28ap-main6a.jpg

ఈనాడు అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ శాశ్వత భవన ఆకృతి రూపురేఖలను నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ సిద్ధం చేసింది. బుధవారం శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌లకు సంస్థ ప్రతినిధులు చూపించారు. అసెంబ్లీ కమిటీహాలులో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. అసెంబ్లీ భవనం ఎలా ఉండబోతోంది? లోపలి భాగంలో ఏయే అంతస్తులో ఏయే కార్యాలయాలుంటాయి? ముఖ్యమంత్రి, సభాపతి, ఛైర్మన్‌, సభ్యులు లోపలికి ఎటువైపు నుంచి వస్తారు? ప్రతిపక్ష నేత కార్యాలయం ఎక్కడుంటుంది వంటి అంశాలను లోతుగా వివరించారు.

* అసెంబ్లీ భవనంలోకి ముఖ్యమంత్రి తూర్పువైపు నుంచి మంత్రులు, సభ్యులు పశ్చిమవైపు నుంచి, సిబ్బంది, సందర్శకులు దక్షిణం దిశగా ప్రవేశించేలా ప్రతిపాదించారు. అసెంబ్లీ భవనం, బేస్‌, గ్రౌండ్‌, మొదటి, రెండో అంతస్తుగా ఉంటుంది. 3.50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం రాజసం ఉట్టిపడేలా నమూనాను సిద్ధం చేశారు.

బేస్‌ లెవెల్‌: ఇది భవనంలోకి ప్రవేశించేందుకు వినియోగిస్తారు. ఇక్కడ నుంచి పక్కనే ఏర్పాటు చేసే సెల్లార్‌ పార్కింగ్‌కు దారి ఉంటుంది.

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో: అసెంబ్లీ సచివాలయం, మంత్రుల కార్యాలయాలు, 500 సీట్ల సామర్థ్యంతో సెంట్రల్‌ హాలు, గ్రంథాలయం, రీడింగ్‌ గది వంటివుంటాయి.

మొదటి అంతస్తులో: శాసనసభ, శాసనమండలి హాళ్లు, ముఖ్యమంత్రి, సభాపతి, మండలి ఛైర్మన్‌, ప్రధాన ప్రతిపక్ష నేత, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కార్యాలయాలుంటాయి.

రెండో అంతస్తులో: ప్రభుత్వ విప్‌ల కార్యాలయాలు, సాంకేతిక అధికారుల గదులు, సాంకేతిక గది, కమిటీ హాళ్లు, సభ్యుల లాంజ్‌, రిక్రియేషన్‌ గది, జిమ్‌, మెడిటేషన్‌ గది వంటివుంటాయి.

28ap-main6b.jpg

* నమూనాలను చూసి సభాపతి కోడెల ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. 
* అసెంబ్లీ భవనంలో ప్రతి అంగుళమూ సద్వినియోగమయ్యేలా ఉండాలి. దానికనుగుణంగా నిర్మాణ ప్రణాళిక ఉండాలి. 
* అసెంబ్లీ సచివాలయాన్ని రెండు బ్లాక్‌ల్లో కాకుండా ఒకేచోట ఉండేలా చూడాలి. 
* ప్రధాన ప్రతిపక్ష నేతతోపాటు ఇతర పక్షాల నేతలకు, ప్రధాన పక్షాల శాసనసభాపక్ష కార్యాలయాలూ ఏర్పాటు చేయాలి. 
* ప్రస్తుత అవసరాలకు సరిపడా నిర్మాణంతోపాటు, భవిష్యత్‌ అవసరాల కోసం 20శాతం మేర అదనపు స్థలం ఉంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ స్థలాన్నిస్తే నిర్మాణ వ్యయం పెరగడంతోపాటు, తర్వాత వాటి నిర్వహణ ఖర్చులు కూడా భారమయ్యే అవకాశం ఉంది.

* అసెంబ్లీ అవసరాలకు సరిపోగా మిగిలిన స్థలాన్ని గేమింగ్‌, ఫుడ్‌కోర్ట్స్‌ వంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

Link to comment
Share on other sites

First international school in Amaravati with 50 crore investment

 

The Indian-curriculum-based Global Indian International School (GIIS), which expanded its operation from Singapore through Asia over the past 16 years, will make an investment of Rs 50 crore investment in a new campus in Amaravati of Andhra Pradesh.

 

https://www.indiatoday.in/pti-feed/story/singapore-giis-to-set-up-5-smart-campuses-in-india-1180114-2018-03-01

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...