Jump to content

Amaravati

Recommended Posts

గవర్నర్‌తో చర్చ
ఈనాడు అమరావతి: అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించే రాజ్‌భవన్‌ ప్రణాళిక గురించి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు సీఆర్‌డీఏ అధికారులు శుక్రవారం వివరించారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, అదనపు కమిషనర్‌ షణ్మోహన్‌, నిర్మాణరంగ నిపుణులు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. అమరావతిలో 12 ఎకరాల విస్తీర్ణంలో రాజ్‌భవన్‌ నిర్మించనున్నారు. గవర్నర్‌ నివాసం, కార్యాలయ అవసరాలు, సందర్శకులు, అతిథుల అవసరాల కోసం ఏర్పాటు చేయాల్సిన వసతులు, సమావేశ మందిరాలు.. ఇలా రాజ్‌భవన్‌లో ఉండాల్సిన వసతులకు సంబంధించిన ప్రణాళికపై నరసింహన్‌తో వీరు చర్చించారు. ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నారు. గవర్నర్‌ సూచనల మేరకు నిర్మాణ ప్రణాళికను మూడు వారాల్లో కొలిక్కి తెస్తామని, ఆ తర్వాత బాహ్య ఆకృతులను రూపొందిస్తామని కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

యోగా పరిశోధన  కేంద్రానికి 25 ఎకరాలు
ఈనాడు అమరావతి: కృష్ణా జిల్లా కొండపావులూరులో కేంద్ర యోగ, ప్రకృతి చికిత్స పరిశోధన కేంద్రం ఏర్పాటుకానుంది. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆరు రాష్ట్రాలకే ఈ కేంద్రాలు మంజూరు చేసింది. కొండపావులూరులో ఏర్పాటు చేసే ఈ కేంద్రానికి 25 ఎకరాల భూమిని కేటాయించారు.

Link to comment
Share on other sites

హైకోర్టు ఏర్పాటుకు భవనాల పరిశీలన 
ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తుల బృందం రాక 
నేలపాడు వైపే మొగ్గు! 

ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించిన తాత్కాలిక భవనాలను పరిశీలించేందుకు నియమించిన హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ శనివారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. దూర విద్య కేంద్రం భవనాలను, వర్సిటీ పక్కనే ఓ గృహ నిర్మాణ సంస్థకు సంబంధించిన విల్లాలను, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలోని నిమ్రా ఇంజినీరింగు కళాశాల భవనాలను పరిశీలించింది. రాజధానిలో ఏపీ ప్రభుత్వం న్యాయ నగరం నిర్మాణం కోసం నేలపాడులో ప్రతిపాదించిన భూములను చూసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. వెంట సభ్యులు జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ టి.సునీల్‌చౌదరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఉన్నారు.
ఏఎన్‌యూపై విముఖత? 
దూరవిద్య భవనానికి అతి సమీపంలోనే బాలికల వసతిగృహాలు ఉన్నాయని తెలుసుకున్న న్యాయమూర్తులు ఇక్కడ తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేస్తే వారికి అసౌకర్యం కలుగుతుందని విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడినట్లు తెలిసింది. దూరవిద్య కేంద్రం భవనం 1.14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని వర్సిటీ అధికారులు తెలియజేశారు. కనీసం హైకోర్టును నడపటానికి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు,   25 హాళ్లు ఉండాలని, అన్ని వసతులు సమకూరవనే అంచనాకు వచ్చినట్లు సమాచారం. అనంతరం రెయిన్‌ ట్రీ పార్కు భవనాలను హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ పరిశీలించింది.
నేలపాడు ప్రతిపాదనలు ఇలా... 
నేలపాడులో తాత్కాలిక హైకోర్టు నిర్మాణాన్ని 4 ఎకరాల్లో కేవలం ఆర్నెల్లలో నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తామని సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పక్కా భవనాలు నిర్మించాక భవనాల్లో పరిపాలనా ట్రైబ్యునల్‌ వంటివి ఏర్పాటు చేసుకుని వినియోగించుకోవచ్చని చెప్పినట్లు సమాచారం. కమిటీ వెంట గుంటూరు కలెక్టర్‌ శశిధర్‌, అర్బన్‌ జిల్లా ఎస్పీ విజయారావు, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

Link to comment
Share on other sites

దేవాలయం నిర్మిస్తాం 
థాయ్‌లాండ్‌ కాన్సుల్‌ జనరల్‌   క్రాంగ్‌ నిట్‌ రాకరీన్‌ 

ఈనాడు, విశాఖపట్నం: అమరావతిలో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం ప్రపంచ ప్రసిద్ధ బుద్ధుడి దేవాలయాన్ని నిర్మించనున్నట్లు థాయ్‌లాండ్‌ కాన్సుల్‌ జనరల్‌ క్రాంగ్‌ నిట్‌ రాకరీన్‌ వెల్లడించారు. శనివారం విశాఖలోని గీతం విశ్వవిద్యాలయానికి వచ్చిన ఆమె ‘ఈనాడు’తో మాట్లాడారు. బుద్ధగయలో 1956లో ఒక బౌద్ధ ఆలయం నిర్మించామని అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందన్నారు. కొన్ని దశాబ్దాల విరామం అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో అదే స్థాయిలో బౌద్ధ ఆలయం నిర్మించనున్నామన్నారు. బుద్ధిజం భారత్‌ నుంచే వ్యాప్తి చెందినందున భారత్‌ అంటే మాదేశం వారికి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. మా ప్రతిపాదనకు ఏపీ ముఖ్యమంత్రి అంగీకరించారని, పది ఎకరాల స్థలాన్ని కూడా కేటాయిస్తున్నందున అందులో థాయ్‌లాండ్‌ నిర్మాణ శైలిలో ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. బౌద్ధ పర్యాటకాన్ని ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ఆలోచిస్తోందని, ఆయా ప్రణాళికలకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం అవసరమైన సహాయసహకారాలు అందిస్తుందన్నారు.

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

హైకోర్టు ఏర్పాటుకు భవనాల పరిశీలన 
ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తుల బృందం రాక 
నేలపాడు వైపే మొగ్గు! 

ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించిన తాత్కాలిక భవనాలను పరిశీలించేందుకు నియమించిన హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ శనివారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. దూర విద్య కేంద్రం భవనాలను, వర్సిటీ పక్కనే ఓ గృహ నిర్మాణ సంస్థకు సంబంధించిన విల్లాలను, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలోని నిమ్రా ఇంజినీరింగు కళాశాల భవనాలను పరిశీలించింది. రాజధానిలో ఏపీ ప్రభుత్వం న్యాయ నగరం నిర్మాణం కోసం నేలపాడులో ప్రతిపాదించిన భూములను చూసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. వెంట సభ్యులు జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ టి.సునీల్‌చౌదరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఉన్నారు.
ఏఎన్‌యూపై విముఖత? 
దూరవిద్య భవనానికి అతి సమీపంలోనే బాలికల వసతిగృహాలు ఉన్నాయని తెలుసుకున్న న్యాయమూర్తులు ఇక్కడ తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేస్తే వారికి అసౌకర్యం కలుగుతుందని విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడినట్లు తెలిసింది. దూరవిద్య కేంద్రం భవనం 1.14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని వర్సిటీ అధికారులు తెలియజేశారు. కనీసం హైకోర్టును నడపటానికి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు,   25 హాళ్లు ఉండాలని, అన్ని వసతులు సమకూరవనే అంచనాకు వచ్చినట్లు సమాచారం. అనంతరం రెయిన్‌ ట్రీ పార్కు భవనాలను హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ పరిశీలించింది.
నేలపాడు ప్రతిపాదనలు ఇలా... 
నేలపాడులో తాత్కాలిక హైకోర్టు నిర్మాణాన్ని 4 ఎకరాల్లో కేవలం ఆర్నెల్లలో నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తామని సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పక్కా భవనాలు నిర్మించాక భవనాల్లో పరిపాలనా ట్రైబ్యునల్‌ వంటివి ఏర్పాటు చేసుకుని వినియోగించుకోవచ్చని చెప్పినట్లు సమాచారం. కమిటీ వెంట గుంటూరు కలెక్టర్‌ శశిధర్‌, అర్బన్‌ జిల్లా ఎస్పీ విజయారావు, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

Ee Tatkalika HC gola endi :kick:

Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=535324

సిద్ధమవుతున్న రాజధాని రక్షణ కవచం
12-02-2018 08:08:36
 
636540197172824780.jpg
  •  పట్టిసీమ పనులను తలపిస్తూ శరవేగంగా...
కొండవీటివాగు ఎత్తిపోతల పథకం పనుల్లో పట్టిసీమ ‘జోరు’ కనిపిస్తోంది. గోదావరి వరద జలాలను కృష్ణమ్మ చెంతకు చేర్చేలా పట్టిసీమ ఎత్తిపోతలను రికార్డు సమయంలో పూర్తిచేసిన విధంగానే కొండవీటివాగు ఎత్తిపోతల పనులను కూడ శ్రీఘ్రంగా జరిపిస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసిన మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీయే కొండవీటివాగు ఎత్తిపోతలను కూడ చేపట్టింది. పట్టిసీమ అనుభవం ఇక్కడ ఆ సంస్థకు బాగా కలిసొచ్చింది.
 
మంగళగిరి: రాజధాని అమరావతికి వరదల నుంచి రక్షణ కల్పించేందుకు చేపట్టిన కొండవీటివాగు వరద నియంత్రణ పథకం తాలూకు పనులు చివరి దశకు చేరుకున్నాయి. వరద నియంత్రణ కోసం ఉండవల్లి కరకట్ట వద్ద వాగు కృష్ణానదిలో కలిసేచోట ఎత్తిపోతల పనులను చేపట్టిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించిన రూ.1500 కోట్ల నిధుల నుంచి రూ.237 కోట్లను వెచ్చించి దీనిని చేపట్టారు. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణ పనులను జరిపిస్తోంది. ప్రస్తుతానికి 75 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టు ఏజెన్సీ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ పట్టిసీమ ఎత్తిపోతలను ఎంతైతే వేగంగా పూర్తిచేసిందో అదే వేగాన్ని కొండవీటివాగు ఎత్తిపోతల నిర్మాణ పనుల్లోనూ చూపిస్తోంది.
 
కలెక్షన్‌ పాయింట్‌
కొండవీటివాగులో గరిష్ట నీటి ప్రవాహాన్ని 16వేల క్యూసెక్కులుగా అంచనా వేస్తూ ఎత్తిపోతలను డిజైన్‌ చేశారు. ఉండవల్లి కరకట్ట నుంచి 350 మీటర్ల దూరంలో వాగు వెంబడి వరదనీటి కలెక్షన్‌ పాయింట్‌ అంటే ఓ సంపు వంటి మినీ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. ఈ సంప్‌ నిర్మాణాన్ని చివర్లో అంటే వచ్చేనెలలో చేపట్టనున్నారు. దీనికోసం సుమారు ఆరేడు కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ఇంకో ఆరేడు కోట్లను బ్యూటిఫికేషన్‌ నిమిత్తం ఖర్చు చేయాలని ప్రతిపాదించారు.
 
ఎస్కేప్‌ రెగ్యులేటర్‌
సంపులోకి వచ్చిపడే వరదనీటిని కృష్ణానదితో పాటు కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి తరలించేవిధంగా ఈ పథ కాన్ని రూపొందించారు. సంపుకు తూర్పువైపున ఐదు లాకులతో కూడిన వంతెన వంటి నిర్మాణాన్ని ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ పేరుతో నిర్మించారు. వరదల సందర్భంలో రెగ్యులేటర్‌ లాకులను ఎత్తేస్తే ఐదువేల క్యూసెక్కుల వరదనీరు పశ్చిమ ప్రధానకాలువలోకి తరలిపోతుంది.ఈ ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ను రూ.9.5 కోట్లవ్యయంతో నిర్మించారు.
 
పైౖపులతో అనుసంధానమే కీలకం
డెలివరీ సిస్టమ్‌ను పంప్‌హౌస్‌తో అనుసంధానిస్తూ కరకట్టరోడ్డు దిగువ నుంచి రెండుమీటర్ల డయా వ్యాసం కల 16 పైపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం కరకట్ట రోడ్డును తవ్వేశారు. పైపుల అనుసంధానం పూర్తయ్యాక తిరిగి రోడ్డును పునర్నిర్మిస్తారు. ఈ పైపుల కోసం రూ.18 కోట్లను ఖర్చు చేశారు.
 
aegaerg.jpgడెలివరీ సిస్టమ్‌
ఉండవల్లి కరకట్టకు దిగువన కృష్ణాతీరం వైపు రూ.ఎనిమిది కోట్ల వ్యయంతో డెలివరీ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. ఇది చూసేందుకు ఓ మినీ శ్రీశైలం ప్రాజెక్టు మాదిరి వుంటుంది. ఈ డెలివరీ సిస్టమ్‌ నుంచే మరో ఐదువేల క్యూసెక్కుల వరదనీరు నదిలోకి వేగంగా దూసుకుపోతుంది.
 
argr.jpgసబ్‌స్టేషన్‌ పనులు షురూ
చివరిగా మొత్తం పథకాన్ని నడిపించేందుకు అవసరమైన విద్యుశ్చక్తి కోసం సంపునకు దక్షిణంగా 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడినుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నులకపేట వద్ద వున్న తాడేపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌తో దీనిని అనుసంధానించేలా 22 టవర ్లతో ట్రాన్స్‌మిషన్‌ లైనును ఏర్పాటుచేశారు. ఈ లైను, కంట్రోల్‌రూమ్‌, అంతర్గత రోడ్ల నిమిత్తం రూ.14 కోట్లను ఖర్చు చేస్తుండగా అచ్చంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం మరో రూ.13.6 కోట్లను వెచ్చిస్తున్నారు. అత్యవసర సందర్భాలను దృష్టిలో వుంచుకుని ముందుజాగ్రత్తగా నాలుగు డీసెల్‌ జనరేటర్లను రూ.4.25 కోట్ల వ్యయంతో అందుబాటులో ఉంచుతున్నారు. క్షేత్రస్థాయిలో కొంతమేర పంప్‌హౌస్‌, సంపు నిర్మాణ పనులు మాత్రమే మిగిలివున్నాయి. వీటిని మార్చి మాసాంతానికి పూర్తిచేసి ఏఫ్రిల్‌ నెలాఖరులోగా ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు.
 
afgawerg.jpgపంప్‌హౌస్‌
ఉండవల్లి కరకట్టకు ఎగువన డెలివరీ సిస్టమ్‌కు దక్షిణ అభిముఖంగా అత్యంత ప్రధానమైన పంప్‌హౌస్‌ను రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 16 పంపులను ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతానికి 12 పంపులను బిగించేందుకు అనువుగా పంప్‌హౌస్‌ నిర్మాణం పూర్తయింది. మరో నాలుగు పంపులను ఏర్పాటుచేసేందుకు వీలుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పంప్‌హౌస్‌పైన మోటార్లను ఏర్పాటుచేసేందుకు మోటారుహౌస్‌ను ఏర్పాటు చేయాల్సివుంది. పంప్‌హౌస్‌పైన నిర్మించిన కాంక్రీటు శ్లాబ్‌పై సంబంధిత మోటార్లను బిగించి వాటి రక్షణ కోసం ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పంప్‌ కమ్‌ మోటారు హౌస్‌లో ఏర్పాటు చేయబోయే అన్ని రకాల యంత్రసామాగ్రిని రూ.91 కోట్లతో కోనుగోలు చేసి క్షేత్రస్థాయిలో సిద్ధంగా వుంచారు.

Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=535320

బ్లూసిటీ.. అమరావతి!
12-02-2018 07:55:27
 
636540189279384069.jpg
  • రెండు దశల్లో వరద నియంత్రణ.. తొలి దశలో రాజధాని ప్రాంతంపై దృష్టి
  • మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.667 కోట్లు..237కోట్లతో ఉండవల్లి వద్ద ఎత్తిపోతల పథకం
  • బోర్డింగ్‌ పాయింట్‌గా నీరుకొండ రిజర్వాయరు..కాలువ కట్టలపై గ్రీనరీ అభివృద్ధికి బఫర్‌జోన్‌
మంగళగిరి (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పర్యావరణానికి నెలవైన నీలిహరితయుత నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాంతానికి అతిపెద్ద వరదముంపు శాపంగా ఉందని చరిత్ర చెబుతోంది. దీన్నే ఓ వరంగా మార్చుకునేలా ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వరద నియంత్రణ, పుష్కలమైన తాగునీటి వసతి, నావిగేషన్‌ ప్రధాన లక్ష్యాలతో కూడిన ఓ బృహత్తరమైన పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనుంది. రెండు దశలతో అమలుచేసే ఈ పథకం తొలిదశను ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడతారు. దీనికోసం ప్రభుత్వం గత వందేళ్ల నుంచి వర్షపాతం, వరదల పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసింది.
 
వాగుల విస్తరణ, బఫర్‌జోన్‌
వాగులను బాగా లోతుగాను పెద్దఎత్తున విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. వాగు/కాలువలకు ఇరువైపులా కట్టలమీద 30మీటర్ల వెడల్పున గ్రీనరీని అభివృద్ధి చేస్తూ బఫర్‌జోన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. నీరుకొండ నుంచి వయా కృష్ణాయపాలెం మీదుగా ఉండవల్లి వరకు 11కి.మీ. పొడవున కొండవీటివాగు విస్తరణకు రూ.193.47కోట్లు, దొండపాడు- కొండమరాజుపాలెం మధ్య 7.4 కి.మీ.పొడవున పాలవాగును అభివృద్ధికి 55.96 కోట్లు, కొండమరాజుపాలెం-కృష్ణాయపాలెం మధ్య 9.3 కి.మీ. పొడవున పాలవాగు అభివృద్ధికి రూ.87.27 కోట్లు, నెక్కల్లు-పిచ్చుకాలపాలెం మధ్య 7.84 కి.మీ. పొడవున సహజ ప్రవాహ కాలువ నిర్మాణానికి రూ.153.16కోట్లు కావాలని అంచనా వేశారు. ఉండవల్లి వద్ద చేపట్టిన ఎత్తిపోతల పనులను మరో రెండు నెలల్లో పూర్తి చేయనున్నారు.
 
వరద నియంత్రణ, రిజర్వాయర్ల నిర్మాణం
కొండవీటివాగు దిగువ పరీవాహక ప్రాంతంలో వరదనీటి మొత్తాన్ని సుమారు 16వేల క్యూసెక్కులుగా అంచనా వేశారు. ఇందుకోసం ప్రతిపాదించిన తొలిదశ ప్రణాళికను ఇప్పటికే ఆరంభించారు. ఈ వాగు ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలిసేచోట రూ.237కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. దీనిద్వారా 5వేల క్యూసెక్కులు నదిలోకి, మరో 5వేల క్యూసెక్కులు కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ ద్వారా తరలించే విధంగా పనులను చేపట్టారు. తొలిదశలో మూడు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు కొండవీటివాగు..దాని ఉపవాగులను లోతుచేసి విస్తరిస్తారు. నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరుల్లో వీటిని నిర్మిస్తారు. అత్యంత ప్రధానమైన నీరుకొండ రిజర్వాయరును 455ఎకరాల విస్తీర్ణంలో రూ.453.45కోట్ల వ్యయంతో 0.43టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేలా అభివృద్ధి చేస్తారు. కృష్ణాయపాలెం వద్ద 190ఎకరాల విస్తీర్ణంలో రూ.159.44కోట్లతో 0.1టీఎంసీల సామర్థ్యం గల చెరువును నిర్మిస్తారు. శాఖమూరు వద్ద ప్రస్తుతం ఉన్న చెరువును రూ.54కోట్లతో 50ఎకరాల విస్తీర్ణంలో 0.03టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కూడిన రిజర్వాయర్‌గా అభివృద్ధి చేస్తారు. నీరుకొండ రిజర్వాయరు నుంచి కొండవీటివాగులో పడవల్లో ప్రయాణం ఉంటుంది. ఈ కారణంగా ఈ రిజర్వాయర్‌ను బోర్డింగ్‌ పాయింట్‌గా నిర్ణయించారు. దక్షిణాభిముఖంగా షిప్‌లాక్‌ను ఏర్పాటు చేస్తారు. ఎక్కువ ప్రవాహగతి మార్గంలో ఓగి స్పిల్‌వేను, తక్కువ ప్రవాహగతి మార్గంలో స్టాప్‌లాగ్స్‌, గేట్లు ఏర్పాటు చేస్తారు.
 
ప్రతిపాదనలు ఇవీ...
  • కొండవీటివాగు క్యాచ్‌మెంట్‌ ఏరియా మొత్తం విస్తీర్ణాన్ని 421చదరపు కిలోమీటర్లుగా గుర్తించారు.
  • అమరావతి హద్దులకు లోపలివైపు ప్రాంతాన్ని దిగువ క్యాచ్‌మెంట్‌ ఏరియా(231చ.కి.మీ.), వెలుపలి ప్రాంతాన్ని ఎగువ క్యాచ్‌మెంట్‌ ఏరియా(190చ.కి.మీ.)గా వర్గీకరించారు.
  • వరదనీటిని నిల్వ చేసేందుకు ఎగువ క్యాచ్‌మెంట్‌ ఏరియాలో ఉన్న లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద మూడు రిజర్వాయర్లు నిర్మించి వాటిని సహజ ప్రవాహ కాలువతో అనుసంధానించాలి.
  • దీనివల్ల లాం, పెదపరిమిలో 0.3టీఎంసీలు చొప్పున, వైకుంఠపురంలో 0.2 టీఎంసీల వరదనీటిని తాగునీటి అవసరాలకు నిల్వ చేయవచ్చు.
  • ఇంకా మిగిలి ఉన్న వరదనీటిని సహజ ప్రవాహకాలువ ద్వారా వైకుంఠపురం వద్ద ఎత్తిపోతల పథకం సహాయంతో కృష్ణానదిలోకి తరలించవచ్చు.
  • వైకుంఠపురం-దాములూరు మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి కం ఆనకట్టను నిర్మిస్తే అక్కడినుంచి మరో కొత్త కాలువను నీరుకొండ వద్ద రిజర్వాయర్‌కు అనుసంధానించడం ద్వారా అదనపు నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
Link to comment
Share on other sites

http://www.eenadu.net/andhra-pradesh-news-inner.aspx?category=general&item=break8

రాజధానికి తరలివస్తోన్న పరిశ్రమలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతికి తరలివస్తున్న పరిశ్రమల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విభజన తర్వాత రాష్ట్రానికి తరలిరావాలన్న ఆకాంక్ష మేరకు హైదరాబాద్‌, జీడిమెట్ల, నాచారం ప్రాంతానికి చెందిన ఏపీ పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలోనూ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా బాపులపాడులోని మల్లవెల్లి పారిశ్రామిక క్లస్టర్‌లో 400కు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. తొలిదశలో 216 పరిశ్రమలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. రూ.800 కోట్ల‌తో రానున్న ఈ పరిశ్ర‌మ‌లు ప్రాథ‌మికంగా 7,250మందికి ప్ర‌త్య‌క్షంగా, ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించ‌నున్నాయ‌ని మ‌ల్ల‌వెల్లి ఇండ‌స్ట్రీస్ సహ‌య కార్య‌ద‌ర్శి జీఎన్‌బీ చౌద‌రి తెలిపారు..

Link to comment
Share on other sites

సిద్ధమవుతున్న రాజధాని రక్షణ కవచం
12-02-2018 08:08:36

 పట్టిసీమ పనులను తలపిస్తూ శరవేగంగా...
కొండవీటివాగు ఎత్తిపోతల పథకం పనుల్లో పట్టిసీమ ‘జోరు’ కనిపిస్తోంది. గోదావరి వరద జలాలను కృష్ణమ్మ చెంతకు చేర్చేలా పట్టిసీమ ఎత్తిపోతలను రికార్డు సమయంలో పూర్తిచేసిన విధంగానే కొండవీటివాగు ఎత్తిపోతల పనులను కూడ శ్రీఘ్రంగా జరిపిస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసిన మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీయే కొండవీటివాగు ఎత్తిపోతలను కూడ చేపట్టింది. పట్టిసీమ అనుభవం ఇక్కడ ఆ సంస్థకు బాగా కలిసొచ్చింది.
 
మంగళగిరి: రాజధాని అమరావతికి వరదల నుంచి రక్షణ కల్పించేందుకు చేపట్టిన కొండవీటివాగు వరద నియంత్రణ పథకం తాలూకు పనులు చివరి దశకు చేరుకున్నాయి. వరద నియంత్రణ కోసం ఉండవల్లి కరకట్ట వద్ద వాగు కృష్ణానదిలో కలిసేచోట ఎత్తిపోతల పనులను చేపట్టిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించిన రూ.1500 కోట్ల నిధుల నుంచి రూ.237 కోట్లను వెచ్చించి దీనిని చేపట్టారు. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణ పనులను జరిపిస్తోంది. ప్రస్తుతానికి 75 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టు ఏజెన్సీ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ పట్టిసీమ ఎత్తిపోతలను ఎంతైతే వేగంగా పూర్తిచేసిందో అదే వేగాన్ని కొండవీటివాగు ఎత్తిపోతల నిర్మాణ పనుల్లోనూ చూపిస్తోంది.
 
కలెక్షన్‌ పాయింట్‌
కొండవీటివాగులో గరిష్ట నీటి ప్రవాహాన్ని 16వేల క్యూసెక్కులుగా అంచనా వేస్తూ ఎత్తిపోతలను డిజైన్‌ చేశారు. ఉండవల్లి కరకట్ట నుంచి 350 మీటర్ల దూరంలో వాగు వెంబడి వరదనీటి కలెక్షన్‌ పాయింట్‌ అంటే ఓ సంపు వంటి మినీ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. ఈ సంప్‌ నిర్మాణాన్ని చివర్లో అంటే వచ్చేనెలలో చేపట్టనున్నారు. దీనికోసం సుమారు ఆరేడు కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ఇంకో ఆరేడు కోట్లను బ్యూటిఫికేషన్‌ నిమిత్తం ఖర్చు చేయాలని ప్రతిపాదించారు.
 
ఎస్కేప్‌ రెగ్యులేటర్‌
సంపులోకి వచ్చిపడే వరదనీటిని కృష్ణానదితో పాటు కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి తరలించేవిధంగా ఈ పథ కాన్ని రూపొందించారు. సంపుకు తూర్పువైపున ఐదు లాకులతో కూడిన వంతెన వంటి నిర్మాణాన్ని ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ పేరుతో నిర్మించారు. వరదల సందర్భంలో రెగ్యులేటర్‌ లాకులను ఎత్తేస్తే ఐదువేల క్యూసెక్కుల వరదనీరు పశ్చిమ ప్రధానకాలువలోకి తరలిపోతుంది.ఈ ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ను రూ.9.5 కోట్లవ్యయంతో నిర్మించారు.
 
పైౖపులతో అనుసంధానమే కీలకం
డెలివరీ సిస్టమ్‌ను పంప్‌హౌస్‌తో అనుసంధానిస్తూ కరకట్టరోడ్డు దిగువ నుంచి రెండుమీటర్ల డయా వ్యాసం కల 16 పైపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం కరకట్ట రోడ్డును తవ్వేశారు. పైపుల అనుసంధానం పూర్తయ్యాక తిరిగి రోడ్డును పునర్నిర్మిస్తారు. ఈ పైపుల కోసం రూ.18 కోట్లను ఖర్చు చేశారు.
 
డెలివరీ సిస్టమ్‌
ఉండవల్లి కరకట్టకు దిగువన కృష్ణాతీరం వైపు రూ.ఎనిమిది కోట్ల వ్యయంతో డెలివరీ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. ఇది చూసేందుకు ఓ మినీ శ్రీశైలం ప్రాజెక్టు మాదిరి వుంటుంది. ఈ డెలివరీ సిస్టమ్‌ నుంచే మరో ఐదువేల క్యూసెక్కుల వరదనీరు నదిలోకి వేగంగా దూసుకుపోతుంది.
 
 సబ్‌స్టేషన్‌ పనులు షురూ
చివరిగా మొత్తం పథకాన్ని నడిపించేందుకు అవసరమైన విద్యుశ్చక్తి కోసం సంపునకు దక్షిణంగా 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడినుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నులకపేట వద్ద వున్న తాడేపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌తో దీనిని అనుసంధానించేలా 22 టవర ్లతో ట్రాన్స్‌మిషన్‌ లైనును ఏర్పాటుచేశారు. ఈ లైను, కంట్రోల్‌రూమ్‌, అంతర్గత రోడ్ల నిమిత్తం రూ.14 కోట్లను ఖర్చు చేస్తుండగా అచ్చంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం మరో రూ.13.6 కోట్లను వెచ్చిస్తున్నారు. అత్యవసర సందర్భాలను దృష్టిలో వుంచుకుని ముందుజాగ్రత్తగా నాలుగు డీసెల్‌ జనరేటర్లను రూ.4.25 కోట్ల వ్యయంతో అందుబాటులో ఉంచుతున్నారు. క్షేత్రస్థాయిలో కొంతమేర పంప్‌హౌస్‌, సంపు నిర్మాణ పనులు మాత్రమే మిగిలివున్నాయి. వీటిని మార్చి మాసాంతానికి పూర్తిచేసి ఏఫ్రిల్‌ నెలాఖరులోగా ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు.
 
పంప్‌హౌస్‌
ఉండవల్లి కరకట్టకు ఎగువన డెలివరీ సిస్టమ్‌కు దక్షిణ అభిముఖంగా అత్యంత ప్రధానమైన పంప్‌హౌస్‌ను రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 16 పంపులను ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతానికి 12 పంపులను బిగించేందుకు అనువుగా పంప్‌హౌస్‌ నిర్మాణం పూర్తయింది. మరో నాలుగు పంపులను ఏర్పాటుచేసేందుకు వీలుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పంప్‌హౌస్‌పైన మోటార్లను ఏర్పాటుచేసేందుకు మోటారుహౌస్‌ను ఏర్పాటు చేయాల్సివుంది. పంప్‌హౌస్‌పైన నిర్మించిన కాంక్రీటు శ్లాబ్‌పై సంబంధిత మోటార్లను బిగించి వాటి రక్షణ కోసం ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పంప్‌ కమ్‌ మోటారు హౌస్‌లో ఏర్పాటు చేయబోయే అన్ని రకాల యంత్రసామాగ్రిని రూ.91 కోట్లతో కోనుగోలు చేసి క్షేత్రస్థాయిలో సిద్ధంగా వుంచారు.

Link to comment
Share on other sites

కోర్టు భవనాలకు.. 86.60 కోట్లు
12-02-2018 08:29:25

బెజవాడ కోర్టు నిర్మాణ వ్యయం పెంచిన ప్రభుత్వం
ఉత్తర్వులను హైకోర్టు న్యాయమూర్తికి అందజేసిన మంత్రి రవీంద్ర
అమరావతిలో జ్యుడీషియల్‌ మ్యూజియం, అకాడమీ నిర్మించాలి
బీబీఏ వార్షికోత్సవ సభలో సోము కృష్ణమూర్తి
కళా ప్రదర్శనలతో న్యాయమూర్తులకు స్వాగతం
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : మద్రాసు హైకోర్టుకు తెలుగువాడిని ప్రధాన న్యాయమూర్తిగా పంపింది.. ‘కృష్ణమ్మ’ చెంత పుట్టి పెరిగిన వాళ్లను హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరకు తీసుకెళ్లింది.. ఇదీ బెజవాడ బార్‌ అసోసియేషన్‌(బీబీఏ) ప్రస్థానం. విజయవాడ ఏ కన్వెన్షన్‌ హాలులో బీబీఏ 111వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రంజన్‌ గొగాయ్‌, ఎన్వీ రమణతోపాటు హైకోర్టు న్యాయమూర్తులు వి.రామసుబ్రహ్మణ్యం, సి.ప్రవీణ్‌కుమార్‌, ఆకుల వెంకటశేషసాయి, ఎం.సత్యనారాయణ, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. వివిధ జిల్లాలకు చెందిన న్యాయవాదులు వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలో నూతనంగా నిర్మిస్తున్న కోర్టుల సముదాయానికి వ్యయ కేటాయింపులను పెంచుతూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, హైకోర్టు న్యాయమూర్తి రామసుబ్రహ్మణ్యానికి అందజేశారు. లోగడ ఈ భవన నిర్మాణ వ్యయానికి రూ.60కోట్లను కేటాయించిన ప్రభుత్వం దాన్ని రూ.86.68కోట్లకు పెంచింది. దీనిపై బెజవాడబార్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది.
 
కళాప్రదర్శనలతో స్వాగతం
వేడుకల్లో హాజరైన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ‘ఏ’ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద ఘనస్వాగతం లభించింది. కేరళ డప్పు వాయిద్య కళాకారులతో స్వాగత ఏర్పాట్లు చేశారు. వేదికపై సాంస్కృతి కార్యక్రమాలు న్యాయమూర్తులను, న్యాయవాదులను ఆకట్టుకున్నాయి.
 
న్యాయవాదుల సంక్షేమానికి కృషి
- న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర
ప్రభుత్వం, న్యాయవాదుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. వారికోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. 111ఏళ్ల ప్రస్థానంలో బీబీఏ ఎన్నో మైలురాళ్లను దాటింది. దేశంలో బార్‌ అసోసియేషన్లలో మానవ హక్కుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి బీబీఏ ముందు వరుసలో నిలిచింది.
 
జ్యుడిషియల్‌ అకాడమి నిర్మించాలి
నవ్యాంధ్రలో న్యాయవాదులు తమ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి, కీలక కేసుల్లో తీర్పులను పరిశీలించుకునేందుకు వీలుగా అమరావతిలో జ్యుడీషియల్‌ అకాడమి, మ్యూజియంను నిర్మించాలి. జస్టిస్‌ సిటీలో దీన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. న్యాయవాదులకు హెల్త్‌కార్డులు జారీచేసే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిసారించాలి. మరణ బీమాకు సంబంధించిన వాటాను ప్రభుత్వం కేటాయించాలి.
- సోము కృష్ణమూర్తి,
బీబీఏ అధ్యక్షుడు

Link to comment
Share on other sites

116 రోజులపాటు నీరు-ప్రగతి: చంద్రబాబు
12-02-2018 13:52:31

విజయవాడ: 116 రోజులపాటు నీరు-ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం ప్రాధాన్యత ప్రాజెక్టుల పనులపై ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేస్తామన్నారు. రాయలసీమను రతనాల సీమగా చేసి చూపిస్తామని సీఎం స్పష్టం చేశారు. రెండేళ్లు వర్షాలు పడకపోయినా నీటికి కొదవ లేకుండా చేస్తామన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. కొండవీటివాగు, పాలవాగులను సమర్థవంతంగా పూర్తి చేస్తామని, పులిచింతల నుంచి సముద్రం వరకు జల రవాణాను అభివృద్ధి చేస్తామని, బ్లూ అండ్ గ్రీన్ నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్‌లో ఏపీ హైకోర్టు
12-02-2018 19:11:31
అమరావతి: సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్‌లో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు రోజులపాటు పలు భవనాలను హైకోర్టు జడ్జిలు పరిశీలించారు.
విజయవాడలోని సిటీ సివిల్‌ కోర్టు కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు.

Link to comment
Share on other sites

అందులోనే తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేస్తాం: నారాయణ
12-02-2018 20:15:58

అమరావతి: రాజధాని పరిధిలో సిటీ సివిల్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. లక్షా 96 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సిటీ సివిల్‌కోర్టు నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. తాత్కాలిక హైకోర్టు నిర్మించాలన్న ఆలోచనను విరమించుకున్నామని చెప్పారు. 8 నెలల్లో సిటీ సివిల్ కోర్టు భవనాలను నిర్మించి...అందులోనే తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని నేషనల్ హైవే అథారిటీకి అప్పగిస్తామని, ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. ఇన్నర్‌ రింగ్ రోడ్డు పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. క్యాపిటల్ సిటీ పరిధిలో గ్రిడ్ రోడ్ ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

good, finally come to senses. 

Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=535590

అమరావతిలో సమీకృత బిజినెస్‌ పార్క్‌!
13-02-2018 00:58:22

20 ఎకరాల్లో ఏర్పాటుకు సీఆర్డీయే ప్రతిపాదన
అమరావతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిలో ప్రపంచస్థాయి ఇంటిగ్రేటెడ్‌ బిజినెస్‌ పార్క్‌ ఏర్పాటుకు ఏపీసీఆర్డీయే ప్రతిపాదించింది. ఆర్థిక కార్యకలాపాలతో పాటు నివాసం, వినోదం, అద్భుత రుచులనందించే ప్రదేశంగా దీన్ని అభివృద్ధి చేయనుంది. 20 ఎకరాల్లో, రాజధానిలోని పలు కీలక ప్రాజెక్టులకు చేరువలో, విజయవాడ, మంగళగిరి, గుంటూరుకు అందుబాటులో ఈ బిజినెస్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. సువిశాలమైన ఖాళీ స్థలాలు, ఆహ్లాదం గొలిపే పచ్చదనం మధ్య ఎనిమిది అంతస్తుల భవనాలు, మొత్తం 50.80 లక్షల చదరపుటడుగుల నిర్మాణ స్థలంతో రూపుదిద్దుకునే దీని ఏర్పాటుకు మొత్తం రూ.1,872 కోట్లు వ్యయమవుతుందని అంచనా.
 
ఇది పూర్తయితే దీనిద్వారా 20వేల నుంచి 30వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, ఏడాదికి రూ.700కోట్ల నుంచి రూ.800కోట్ల వరకు ఆదాయం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ పార్కులో 4 ప్రాంతా(డిస్ట్రిక్ట్‌)లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అవి కార్పొరేట్‌ (10.10లక్షల చ.అ.), రెసిడెన్షియల్‌ (20.80లక్షల చ.అ.), మీడియా (10.10లక్షల చ.అ.) రెడ్‌ (ఆహారం- 8లక్షల చ.అ.). పేరుకు తగ్గట్టుగానే ఈ పార్క్‌లో ఐటీ, ఫైనాన్స్‌, టెలికం, మీడియా(కంటెంట్‌ ప్రొడక్షన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌, డిజిటల్‌ మీడియా తదితరాలు), మూవీ స్టూడియో, ట్రైనింగ్‌ అకాడమీ, దేశ, విదేశీ వంటకాలను అందించే ఆహారశాలలు, రిటైల్‌, వినోదం తదితరాలు సువిశాలమైన ప్రాంగణాల్లో కొలువుదీరనున్నాయి. కార్యాలయాలకు నడిచి చేరుకునేందుకు వీలుగా ఆఫీస్‌ స్పేసె్‌సను ఏర్పాటు చేస్తారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...