Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
Guest Urban Legend

Konchem aa Alankar center dhaggara kuda chesthe bagundu. Maree ghoram ga vundhi Rivas canal

 

adhi yeppudu anthey..summer lo inka daarunam water vundavu kabbati every monsoon water release chesinappudu koncham flush avuthayi tarvatha back to normal

people lo kuda awareness raavali anni canals loki visurutharu ...too much plastic waste thrown into canals

hyd lo canals ki chuttu fencing vestunnaru ala

canal banks anntiki fencing vesesi oka entry point akkadaka isthey better

 

may be underground drainage and sewer water treatment plants plans vunnayi ga avvani aithey kaani permant solution raadhu

Link to comment
Share on other sites

మెట్రో’ ఏర్పాటుపై పరిశీలన
 

 
636315647925061233.jpg
పోరంకి ( కంకిపాడు/పెనమలూరు) : మెట్రో రైలు ఏర్పాటు పనులు వేగవంతం చేయనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్‌ అధికారులు జి.పి.రంగారావు చెప్పారు. స్థానిక పోరంకి సెంటర్‌లో శనివారం ఆయన బీఎస్‌ఎన్‌ఎల్‌, విద్యుత్‌ శాఖ, ఓఎఫ్‌సీ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ మెట్రో లైన్‌ అలైన్‌మెంట్‌లో భాగంగా బందరు రోడ్డుపై ఉన్న విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ ఫార్మర్లు, ఓఎఫ్‌సీ కేబుల్స్‌ మార్చేందుకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలిస్తున్నామన్నారు. బందరు రోడ్డుపై రోడ్డోకు ఇరువైపులా 7.5 మీటర్ల మేరకు నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆ సమయంలో మచిలీపట్నం నుంచి వచ్చే మూడు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలను కానూరు, వెంకటాపురం సీ్ట్రట్‌, పంటకాలువ రోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ మీదు గా ఎన్‌హెచ్‌ - 16కు మళ్లించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ మెట్రో రైల్‌ ప్రాజెక్టు అధికారులు సుధాకర్‌, వసంతకుమార్‌, సాయిరామ్‌, అధికారులు చిట్టిబాబు, ఎక్సేంజ్‌ శాఖ ఎస్‌డీఈ పవన్‌కుమార్‌, ఓఎఫ్‌సీ కృష్ణా ఎస్‌ఎస్‌సీ అల్తాఫ్‌ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

krishna_lanka.jpglanaka2.jpg

 

 

 

great news for yanamalakuduru peope

ah areas lo okka vote verey party vadiki vesina adhi mosamey ..floods vachina prathi sari munugudhi ah area

Link to comment
Share on other sites

  • 3 weeks later...
విజయవాడలో డిసెంబర్ నాటికి నోవాటెల్ రెడీ
 
 
636340622500734076.jpg
  • ‘నక్షత్రాల’ తళతళ
  • డిసెంబర్‌ నాటికి తొలి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నోవాటెల్‌ రెడీ
  • విజయవాడలో మరో రెండు ఐదు ఫైవ్ స్టార్ హోటల్స్‌కు ప్రతిపాదనలు
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి, తాత్కాలిక రాజధాని విజయవాడకు వచ్చే సందర్శకుల్లో అధునాతన సౌకర్యాలతో ఉన్న హోటళ్ళలో బసచేయడానికి ఇప్పుడున్న స్టార్‌ హోటళ్ళు కాకుండా అదనంగా మరికొన్ని స్టార్‌ హోటల్స్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే బెంజిసెంటర్‌ నుంచి రామవరప్పాడుకు వెళ్ళే ప్రధాన రహదారికి అనుబంధంగా నోవాటెల్‌ ఐదు నక్షత్రాల స్టార్‌ హోటల్‌ నిర్మాణంలో ఉంది. ఈహోటల్‌లో సకల సౌకర్యాలు గల 110 గదులుంటాయి. వరుణ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఈ హోటల్‌ త్వరితగతిన నిర్మాణమవుతున్నది. డిసెంబర్‌ నాటికి సిద్ధమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో అధికారులు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు. నోవాటెల్‌ ఐదునక్షత్రాల హోటల్‌ విజయవాడకు ప్రథమ ఆకర్షణగా ఉండనుంది.
 
మరోవైపు ఎన్‌ఏసీ హాస్పటాలటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 160 గదులతో ఐదు నక్షత్రాల హోటల్‌ను నిర్మించడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ నివేదిక ప్రభుత్వం వద్ద ఉంది. సొంత భూమిలో సంస్థ ఈ హోటల్‌ను నిర్మించనున్నది. అనుమతులు అన్నీ సిద్ధమైతే త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. రహేజా డెవలపర్స్‌ 150 గదులతో మరో ఐదు నక్షత్రాల హోటల్‌ను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి అన్ని అనుమతులు వస్తే అక్టోబర్‌ నుంచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఎన్‌ఏసీ హాస్పటాలటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఐదునక్షత్రాల హోటల్‌ షెరటాన్‌ బ్రాండ్‌ పేరుతో వినియోగదారులకు సేవలను అందించనుండగా రహేజా సంస్థ జేడబ్ల్యు మారియట్‌ బ్రాండ్‌ పేరుతో సేవలు అందించనున్నది. దీంతో విజయవాడ అంతర్జాతీయ స్థాయి ఐదునక్షత్రాల హోటళ్ళతో కళకళ లాడనుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో పలు పరిశ్రమలు రానున్నాయి, రాజధానికి పలు పనులపై ఇతర ప్రాంతాలనుంచి కూడా వ్యాపారావసరాలపై వచ్చే వారిసంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే నగరంలోని ఆధునిక సౌకర్యాలున్న హోటళ్ళ ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. మరోవైపు గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా రావడంతో ఆ స్థాయిలో విమానాల రాకపోకలు సాగించే అవకాశం ఉంది.
 
అంతర్జాతీయ విమానాల నడిస్తే ఇక్కడకు వచ్చే విదేశీయులు ఐదు నక్షత్రాల హోటళ్ళలోనే బసచేస్తారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అమరావతి, విజయవాడల చుట్టూ పర్యాటక ఆకర్షణ కోసం పలు ప్రాజెక్టులను తలపెట్టింది. రాష్ట్ర ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. భవానీఐలాండ్‌లో అంతర్జాతీయ స్థాయిలో లేజర్‌షో, మ్యూజికల్‌ ఫౌంటెన్‌లను నిర్మాణం చేయడానికి ఇటీవలే అనుమతులు వచ్చాయి. సుమారు రూ.16 కోట్లు దీని కోసం మంజూరయ్యాయి. మొత్తం మీద విజయవాడకు అటు పర్యాటకులు, ఇటు రాజధానికి పనులపై వచ్చేవారితో, సందర్శకులతో కళ కళ లాడనుంది. వారి అవసరాల కోసం మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా మరింత శ్రద్ధ పెట్టారు.
Link to comment
Share on other sites

స్లూయిజ్‌ చెంత ఆహ్లాదం.. ఆతిథ్యం
 
 
ఆంధ్రజ్యోతి, విజయవాడ: ఇటు తూర్పు డెల్టా హెడ్‌ స్లూయిజ్‌... అటు పశ్చిమ డెల్టా హెడ్‌ స్లూయిజ్‌... మధ్యలో కృష్ణా బ్యారేజి. తూర్పు డెల్టా హెడ్‌ స్లూయిజ్‌ కాలువ రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత రైవస్‌, ఏలూరు, బందరు కాలువలుగా విడిపోతుంది. స్లూయిజ్‌ నుంచి పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ వరకు ఉన్న దూరం కిలోమీటరున్నర. ఈ ప్రధాన కాలువకు అటూఇటూ త్వరలో ఆహ్లాదకర వాతావరణం రాబోతున్నది. ఆతిథ్యం, అమ్మకం, ఆనందం, ఆహ్లాదం ఈ నాలుగింటి కలయితో కాలువకు రెండు వైపులా అభివృద్ధి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ కాలువ వైపులా కొంత మేర ల్యాన్‌తో పచ్చదనాన్ని తీసుకొచ్చారు. కొంతభాగాన్ని ఖాళీగా వదిలేశారు. ఇక్కడ హోటళ్ల, షాపింగ్‌ కాంప్లెక్స్‌, రిక్రియేషన్‌ కాంప్లెక్స్‌లను నిర్మించి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజి ఈస్ట్రన్‌ కాలువ నుంచి నీరు విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...