Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

ఆకర్షణీయ అడుగు

ప్రారంభోత్సవానికి సిద్ధమైన ‘గోల్డెన్‌మైల్‌’

ఎంజీ రోడ్డులో ఉచిత వైఫై

సెన్సార్లతో పనిచేసే వీధిదీపాలు

ఈనాడు, అమరావతి

kri-top2a.jpg

అర్ధరాత్రి.. సమయం రెండు గంటలు.. దారంతా నిర్మానుష్యం..ఒక్కసారిగా వీధి దీపాలు ఆరిపోయాయి. కొంతసేపు తర్వాత ఎవరో వ్యక్తి వస్తున్నట్లు అనిపించింది. అంతే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వీధి దీపాలు వెలుగులు చిమ్మాయి. ఆ రోడ్డులో ట్రాఫిక్‌ విపరీతంగా ఉంది. వెంటనే పోలీసు కేంద్రానికి సమాచారం అందింది. ట్రాఫిక్‌ ఎలా మళ్లించాలో కూడా సూచనలు వచ్చాయి. రాత్రి పూట వెళ్లే వాహనాల వేగం పసిగట్టి నియంత్రణ కేంద్రానికి సమాచారం చేరిపోయింది.

రానున్న రోజుల్లో విజయవాడలో ఇలాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఆకర్షణీయ నగరాల పోటీలో ఉన్న విజయవాడలో ఆదర్శమైన సౌకర్యాలతో ఆకర్షణీయంగా రూపొందించే ‘గోల్డెన్‌మైల్‌ ప్రాజెక్టు’ పూర్తయ్యింది. ఇది లాంఛనంగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరు బాబు ఏ, నగరపాలక సంస్థ కమిషనర్‌ వీరపాండ్యన్‌ బదిలీ కావడంతో కొత్తగా వచ్చిన అధికారులకు ప్రాజెక్టును వివరించి ముఖ్యమంత్రి సమయం తీసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆకర్షణీయంగా రూపొందించాలని నిర్ణయించారు. బెంగళూరుకు చెందిన సిస్కో సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు ప్రారంభించారు.

ఇదీ పరిస్థితి..!

విజయవాడ ఎంజీ రోడ్డులో కంట్రోల్‌ రూం నుంచి బెంజి సర్కిల్‌ వరకు దీన్ని ఏర్పాటు చేశారు. గతంలో పీవీపీ మాల్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంను ప్రస్తుతం వీఎంసీ కార్యాలయంలోకి మార్చారు. మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.7.91కోట్లుగా నిర్ధరించారు. దీనిలో సిస్కో రూ.3.81 కోట్లు భరిస్తోంది. దీనికి సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. మిగిలిన రూ.4.10 కోట్లు విజయవాడ నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. వీఎంసీ ఇప్పటికే రూ.62 లక్షలు ఇచ్చింది. దీనిలో రూ.20 లక్షలు సిటీపోర్టల్‌ ఏర్పాటుకు ఖర్చు చేయనుంది. రూ.42 లక్షలను ఎల్‌ఈడీ వీధి ధీపాలకు వెచ్చించింది. మొత్తం 200 ఎల్‌ఈడీ దీపాలు సెన్సార్‌లతో పనిచేసే విధంగా ఏర్పాటు చేశారు. మరో రూ. 48 లక్షలు మూడో పార్టీకి పొరుగుసేవల ద్వారా మానవవనరుల వినియోగానికి ఖర్చు చేయనుంది. రాష్ట్ర పట్టణాభివృద్ధి సంస్థ రూ. 3 కోట్లు అందజేయనుంది.

గోల్డెన్‌మైల్‌ ప్రాజెక్టులో భాగంగా బందరు రోడ్డులో పూర్తిస్థాయిలో స్మార్టు వైఫై అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఐజీఎం క్రీడా మైదానం, పీవీపీ మాల్‌ తదితర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా స్మార్టుఫోన్ల వినియోగం ఎక్కువ కానుంది. అంతర్జాలం ద్వారా వివిధ లావాదేవీలు నిర్వహించనున్నారు. ఎంజీ రోడ్డులోని దుకాణాల వారికి ఇది అందుబాటులో ఉంటుంది.

గోల్డెన్‌ మైల్‌ ప్రాజెక్టులో స్మార్టు లైటింగ్‌ కీలకం. ఎంజీ రోడ్డులో బెంజి సర్కిల్‌ వరకు ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. వీటికి సెన్సార్లు అమర్చారు. అవసరం లేని సమయంలో దీపాలు ఆరిపోతాయి. వాహనాలు వెలుతురు ఎక్కువగా ఉన్నప్పడు దీపాలు ఆరిపోతాయి. సెన్సార్లతో పనిచేయడం వీటి ప్రత్యేకత. మొత్తం 200 దీపాలు ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీసెంట్‌ రోడ్డు ఎక్కడపడితే అక్కడ పార్కింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అడ్డదిడ్డంగా పార్కు చేస్తున్నారు. ఇక ముందు బందరు రోడ్డులో స్మార్టు పార్కింగ్‌ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు నిలపాల్సి ఉంది. దీనికి పది ప్రాంతాలను ఎంపిక చేశారు. దీనికి రుసుం వసూలు చేస్తారు.

స్మార్టు ట్రాఫిక్‌ నియంత్రణ, రోడ్డు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎక్కడ ట్రాఫిక్‌ జాం అయినా వెంటనే కంట్రోల్‌ రూంకు సమాచారం అందుతుంది. ట్రాఫిక్‌ మళ్లింపు చేపడతారు. ఇది ఇంకా పూర్తి స్థాయిలో అమలులోకి రాలేదు. ప్రస్తుతం యూటర్న్‌ల తీరు మార్చారు.

ఎంజీ రోడ్డులో కియోస్క్‌లు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా బస్సు, రైల్వే, సినిమా టిక్కెట్లు నమోదు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇవి కార్యరూపం దాల్చలేదు.

నగరంలో డిజిటల్‌ తరగతుల నిర్వహణకు పది నగరపాలక సంస్థ పాఠశాలలను ఎంపిక చేశారు.

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరానికి సంబంధించిన వివరాలతో సిటీ పోర్టల్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఒక ఏజెన్సీకి అప్పగించారు.

ప్రత్యేకంగా డాటా కేంద్రాన్ని నిర్వహించాల్సి ఉంది. దీన్ని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. పూర్తిగా నియంత్రణ వ్యవస్థ అక్కడే ఉంటుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...