Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

  • 3 weeks later...
  • Replies 518
  • Created
  • Last Reply
  • 4 weeks later...
కొలిక్కిరానున్న ఓడరేవు
నెరవేరని లక్ష్యాలకు భూసేకరణతో చెక్‌
తాజాగా కొనసాగుతున్న భూముల సర్వే
amr-sty4a.jpg

మచిలీపట్నం ఓడరేవు (పోర్టు) నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన భూములు సమకూర్చుకొనే విషయంలో తుది అంకం సిద్ధమైంది. ఇప్పటి వరకూ పోర్టుకు అవసరమైన భూముల విషయంలో నెలకొంటూ వచ్చిన ప్రతిష్టంభనకు భూసేకరణ ప్రక్రియ ద్వారా చెక్‌ పెట్టే దిశగా కార్యాచరణ మొదలయ్యింది. మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు ఈ పనులు ప్రారంభిస్తామంటూ అనేక గడువులు ప్రకటించినా అవి నీటిమూటలే అయ్యాయి. చివరికి మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి, స్థానిక రైతుల మనోగతాలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఆర్థిక భారాన్ని లెక్కచేయకుండా భూసేకరణ ద్వారా భూములు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ విషయంలో నెలకొన్న మితిమీరిన జాప్యం సమసిపోయేందుకు మార్గం సుగమం అయ్యింది.

న్యూస్‌టుడే- కృష్ణా కలెక్టరేట్‌

నిర్మాణ పనులను దక్కించుకున్న గుత్తేదారు సంస్థ పనులు ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఉన్నా, అవసరమైన భూములను సమకూర్చుకోవడంలో కొనసాగుతూ వస్తున్న ఆలస్యం పోర్టు పురోగతికి తీవ్ర అడ్డంకిగా మారింది. కేవలం ఇందువల్లే అభివృద్ధి సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అందుకు తగ్గ విధంగా భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాదాపు 15,000 ఎకరాలకు పైగా ప్రైవేటు భూములను ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో తీసుకోవాలని నిర్ణయించడం వివాదాస్పదం అయ్యింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.  పరిశ్రమల సంగతి తర్వాత ముందు ఓడరేవు పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేయడం వంటి అంశాలతో దాదాపు రెండు సంవత్సరాలకు పైగా కాలం గడిచిపోయింది.

ఎట్టకేలకు తొలుత కేవలం ఓడరేవు పనులనే ప్రారంభించాలన్న నిర్ణయంతో ప్రభుత్వం అందుకు అవసరమైన 5,300 ఎకరాలను సమకూర్చుకోవాల్సిందిగా సూచించింది. ఇందులో దాదాపు 3,014 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల లెక్క తేల్చి పోర్టు శాఖకు కూడా అప్పగించింది.  మిగిలిన దాదాపు 2,300 ఎకరాల ప్రైవేటు భూములను ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులతో, స్థానిక రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలుసార్లు స్పష్టం చేశారు.  ల్యాండ్‌ పూలింగ్‌ విషయంలో రైతులను చైతన్యపర్చడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వైఫల్యాన్ని మూటగట్టుకున్నారు.   కేవలం 700 ఎకరాల వరకూ పూలింగ్‌ ద్వారా సమకూరింది. మిగిలిన 1,600 ఎకరాల్లో ఎంతో కొంత పూలింగ్‌ ద్వారా తీసుకొని మిగిలినవి సేకరణ ద్వారా తీసుకొనేలా ముఖ్యమంత్రి, రైతుల మధ్య చర్చల సందర్భంగా ఒక అభిప్రాయానికి వచ్చారు. అందుకు తగ్గ స్పందన మాత్రం కరవయ్యింది. ఎప్పటికప్పుడు కప్పదాటు తరహా హామీలతో సంవత్సరాలు దొర్లిపోతున్న పరిస్థితులను బట్టి అసలు పోర్టు వాస్తవ రూపం దాల్చే అవకాశాలపై కూడా అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా భూములు సమకూర్చుకోలేరన్న విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి భూసేకరణ ద్వారా భూములు తీసుకోవాలని సూచించడంతో మళ్లీ  ఆశలు చిగురించాయి.

తాజాగా కొనసాగుతున్న భూముల సర్వే.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భూములను పూలింగ్‌ విధానంలో తీసుకోవాలని భావించినా తగు స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి భూసేకరణ పక్రియకు అంగీకారం తెలిపారు. ఓడరేవు నిర్మాణం కోసం భూ సేకరణకు కావాల్సిన రమారమి రూ.1,300 కోట్లను ప్రభుత్వ గ్యారంటీతో ఇచ్చేందుకు ఓ బ్యాంకు ముందుకు వచ్చింది. బ్యాంకు నుంచి రుణం పొందేందుకు ఆర్థిక శాఖ అంగీకారం దక్కగా ఇక కేబినెట్‌ ఆమోదమే మిగిలిఉంది. దీంతో ‘ముడ’ అధికారులు భూసేకరణ పక్రియకు అవసరమైన చర్యలను ముమ్మరం చేశారు. ఇందుకోసం కోసం తీసుకోవాల్సిన భూముల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం ప్రభుత్వ, అసైన్డ్‌, ప్రైవేటు భూముల వివరాలను నిశితంగా పరిశీలిస్తూ సర్వే చేపట్టారు. ఆరు బృందాల ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతోంది. ఆయా భూముల అనుభవదారుల వివరాలు దస్త్రాలతో సరిపోల్చి భూసేకరణ అనంతరం ఇవ్వాల్సిన పరిహారాన్ని వారి అందించేలా వివరాలు సేకరిస్తున్నారు. సర్వేను వేగవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. ఆయా భూముల వాస్తవ లబ్ధిదారులను గుర్తించడమే సర్వే ప్రధాన ఉద్దేశమని ముడ అధికారులు చెబుతున్నారు.

జులై నాటికి సమీకరణ ప్రక్రియ పూర్తి: విల్సన్‌బాబు, ముడ వీసీ
బందరు ఓడరేవుకు అవసరమైన పట్టా భూముల సమీకరణ పక్రియ నడుస్తోంది. సమీకరణ నిబంధనల ప్రకారం 6-ఏ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో పాటు 6-బి నోటీసులు అందజేశాం. భూముల ఎంజాయ్‌మెంట్‌ సర్వే కొనసాగుతోంది. మరోపక్క ముడ మాస్టర్‌ప్లాన్‌ ఒప్పందం ఖరారయ్యింది. ఆరు నెలల వ్యవధిలో డ్రాఫ్ట్‌ ప్రణాళిక అందనుంది. భూ సేకరణ నిబంధనలను అనుసరించి ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జులైలో భూములు తీసుకున్న రైతులకు అవార్డు పాస్‌ చేస్తాం. భూ సమీకరణ ప్రక్రియకు సమాంతరంగా ఇతర అవసరమైన కార్యాక్రమాలపైనా చర్యలు తీసకుంటున్నాం. భూములు ఇచ్చే ప్రతి ఒక్కరికి మేలు చేకూర్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పోర్టు కలను అతి త్వరలోనే సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నాం.

Link to comment
Share on other sites

60 రోజుల్లో బందరు పోర్టు పనులు
07-04-2018 07:49:22
 
636586841633790952.jpg
  • బందరు రోడ్డులో ఆక్రమణల తొలగింపునకు కలెక్టర్‌ ఆదేశం
విజయవాడ: ‘60 రోజుల్లో బందరు పోర్టు పనులను ప్రారంభించటానికి రంగం సిద్ధమవుతోంది. జూన్‌ మాసంలో శంకుస్థాపన చేస్తాం. వేగంగా జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తి కావాలి. ఆ క్రమణలు తొలగించాలి..’ అని కలెక్టర్‌ బాలయ్యనాయుడు లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు.
 
శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జేసీ విజయకృష్ణన్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోర్టు పనులకు శంకుస్థాపన చేసే నాటికి విజయవాడ - బందరు రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. బెంజ్‌సర్కిల్‌ నుంచి కానూరు వరకు నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఆక్రమణలను తొలగించి డ్రెయినేజీ పనులు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, కార్పొరేషన్‌ శాఖలు ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
 
ఆయా సందర్భాల్లో సమస్యలు ఉత్పన్నమైతే తక్షణం వాటిని పరిష్కరించే విధంగా తహశీల్దార్లు, ఆర్‌డీఓలు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్బంగా దిలీప్‌ బిల్డ్‌కాన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ విజయవాడ - బందరు రోడ్డు పనులను సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు.
 
ఈపీఆర్‌ సాధించాలి
ప్రతి ఉద్యోగి పెర్‌ఫార్మెన్స్‌ సాధించే విధంగా పనిచేయాలన్నారు. బయో మెట్రిక్‌ విధానంలో హాజరు వేయడం, పెండింగ్‌ ఫైళ్ళు పరిష్కరించడం, ఫిర్యాదుల సత్వర పరిష్కారం వంటి అంశాలపై గ్రేడింగ్‌లు ఇస్తామన్నారు.
 
3వ వారంలో కలెక్టర్ల సమావేశం
ఈనెల 3వ వారంలో కలెక్టర్ల సమావేశం ఉన్నందున ప్రతి శాఖ తమకు సంబంధించిన ప్రణాళికలను సంక్షిప్త రూపంలో తయారు చేయాలన్నారు. గత ఏడాది ప్రగతి, ఈ ఏడాది అమలు చేస్తున్న అంశాలను క్రోడీకరించి 2018 - 19 ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.
 
పంచాయతీలకు స్వీపింగ్‌ యంత్రాలు
గ్రామాలు, పట్టణాలలో మెరుగైన పారిశుధ్య సేవలను నిర్వహించటానికి స్వీపింగ్‌ యంత్రాలను వినియోగించాలని సూచించారు. మునిసిపాలిటీలు తప్పనిసరిగా వీటిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈనెల 10వ తేదీన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉపాధి హామీ నిధులపై సమావేశం ఉంటుందని రికార్డులు సిద్ధం చేసుకోమని చెప్పారు.
 
భూ సేకరణపై జేసీ సమీక్ష
అభివృద్ధి పనులకు భూ సేకరణ, వాటికి చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై జాయింట్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులతో సమీక్షించారు. వీఎంసీ, ఆర్‌అండ్‌బీ, ఈఈ డ్రెయినేజి, ఆర్‌డబ్ల్యూఎస్‌, బుడమేరు సంబంధిత భూ సమస్యలు, పరిష్కరించాల్సిన ఇతర సమస్యలపై పలు సూచనలు చేశారు.
Link to comment
Share on other sites

ముడా ప్లాన్‌ తయారీపై నేడు వర్క్‌షాపు
12-04-2018 07:59:51
 
636591167924556511.jpg
  • సేకరించాల్సిన భూములు 33178 ఎకరాలు
  • పోర్టు భూములు 5300 ఎకరాలు
  • మిగిలిన 27885 ఎకరాలు
  • ఇండస్ర్టియల్‌ కారిడార్‌, మెగా టౌన్‌షిప్‌ తదితర నిర్మాణాలకు అంచనా
 
మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఈ బాధ్యతను ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెంట్‌ కంపెనీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఇందుకు ఐదు కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సదరు కంపెనీ ఏడాదిలోగా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాల్సి ఉంది. ఆరు నెలల్లో ఇందుకు సంబంధించిన రూపురేఖలు ఏర్పడతాయి. ఆ ప్రక్రియ ఇప్పటికే కన్సల్టెంట్‌ కంపెనీ ప్రారంభించగా, దీనిపై గురువారం కలెక్టరేట్‌లో వర్క్‌షాపు నిర్వహించనున్నారు.
 
 
మచిలీపట్నం: పోర్టు, పరిశ్రమల ఏర్పాటుతో పాటు మచిలీపట్నం, పరిసర గ్రామాల అభివృద్ధికి తొలుత మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాజధాని అమరావతి తరహాలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంఏడీఏ స్థానంలో ఎంయూడీఏ ఏర్పాటు జరిగింది. దీని పరిధి 426.16 చదరపు కిలో మీటర్లు. మచిలీపట్నం మునిసిపాలిటీతో పాటు బందరు రూరల్‌లో 27 గ్రామా లున్నాయి. పెడన మండలం కాకర్లమూడి గ్రామాన్ని ఎంయూడీఏ పరిధిలో చేర్చారు.
 
   దీని పరిధిలో జరిగే అభివృద్ధికి సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. పోర్టు నిర్మాణం, దానికి అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటు మెగా టౌన్‌షిప్‌ మాస్టర్‌ ప్లాన్‌లో ప్రధాన అంశాలు. జోన్‌ల వారీ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌లో చోటు దక్కనుంది. వీటన్నింటిపై సమగ్రంగా చర్చించేందుకు గురువారం జరగనున్న వర్క్‌షాపు దోహదపడనుంది. ముడా అధికారులతో పాటు మునిసిపల్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులు మాస్టర్‌ప్లాన్‌తయారీ కంపెనీ ప్రతినిధులు
 
 
ఈ వర్క్‌షాపులో పాల్గొంటారు. పోర్టు నిర్మాణం తో పాటు పరిశ్రమలు, మెగా టౌన్‌షిప్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెపుతున్నారు. ఆయా నిర్మాణాలు ఒక ఆర్డర్‌లో ఏ రీతిలో నిర్మిత మవుతాయో మాస్టర్‌ ప్లాన్‌లో రూపొందిం చనున్నారు. వీటిపై ఏకాభిప్రాయానికి వర్క్‌షాపు నిర్వహణ అవసరమని భావించిన ముడా అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేపట్టారు.
 
ఉదయం నుంచి సాయంత్రం వరకు
వర్క్‌షాపు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుందని ముడా మాస్టర్‌ప్లాన్‌ ఆధారంగా అభివృద్ధి పనులు చేయనున్న దృష్ట్యా అందుకు అవసరమైన భూములపైనా అధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది. పోర్టు నిర్మాణానికి ప్రభు త్వం దాదాపు 5300 ఎకరాలు నిర్మాణ సంస్థ నవయుగ కంపెనీకి అప్పగించాల్సి ఉంది. వీటిలో 3014 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ భూములు ఇప్పటికే కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు జిల్లా అధికారులు అప్పగించారు. ప్రైవేటు భూములకు సంబంధించి 2286 ఎకరాలకుగాను ఇప్పటి వరకు భూ సమీకరణ ద్వారా సుమారు 752 ఎకరాలకు రైతుల నుంచి అంగీకారం లభించింది.
 
   ఇంకా మిగిలిన 1534 ఎకరాల పట్టా భూముల కోసం కసరత్తు జరుగుతోంది. ఈ భూము లను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వ హామీతో బ్యాంకు రుణం పొందే యోచనలో ఉన్నారు. ఈ ప్రక్రియ తుది దశలో ఉన్నట్టు మంత్రి రవీంద్ర ఇటీవల తెలిపారు. భూసేకరణతో పోర్టు భూముల ప్రక్రియ ఒక కొలిక్కి వస్తే ముడా పరిధిలో ఉన్న మిగిలిన భూము లపైనా అధికారులు కసరత్తు చేయాల్సి ఉంటుంది. ముడా మాస్టర్‌ ప్లాన్‌ పూర్తయ్యే లోపు ఆయా నిర్మాణాలకు అవసరమైన భూములు సిద్ధమైతే ఆశించిన అభివృద్ధికి అవకాశం ఉంటుంది.
 
  ఇందుకు రైతులు ఏవిధంగా సహకరిస్తారో వేచి చూడాలి. రెండేళ్ల పైబడి పోర్టు భూముల కోసమే కసరత్తు జరుగుతోంది. ఇండస్ర్టియల్‌ కారిడార్‌ భూముల ప్రసక్తి ప్రస్తుతానికి ప్రస్తావించడం లేదు. ముడా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందాక ఆ మేర జరిగే అభివృద్ధిపై రైతుల్లో నమ్మకం ఏర్పడితే భూముల సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నింటికి దోహద పడే ముడా మాస్టర్‌ ప్లాన్‌పై బందరు భవితవ్యం ఆధారపడి ఉంది
Link to comment
Share on other sites

  • 2 weeks later...
బందరు పోర్టు నిర్మాణానికి మోక్షం
02-05-2018 19:56:34
 
636608877982632236.jpg
అమరావతి: బందరు పోర్టు నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. వెంటనే పోర్టు పనులు ప్రారంభించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల ద్వారా రూ.11 వందల కోట్ల రుణం తీసుకునేందుకు.. పెట్టుబడులు, మౌలికవసతుల అభివృద్ధి సంస్థకు కేబినెట్‌ అనుమతిచ్చింది.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Link to comment
Share on other sites

బందరు పోర్టుకు మోక్షం
పనులు ప్రారంభ దిశగా చర్యలు
రాష్ట్ర మంత్రివర్గ  సమావేశం నిర్ణయం
kri-top1a.jpg

కలెక్టరేట్‌,న్యూస్‌టుడే: బందరు పోర్టును సాకారం చేసే విషయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టుకు అవసరమైన భూములు సమకూర్చుకొనే విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన ఈ నిర్ణయంతో సమసిపోనుంది. అవసరమైన భూములు సేకరించుకునేందుకు, అభివృద్ధికి రూ.1,092 కోట్లు రుణం పొందేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం నిమిత్తం 5200 ఎకరాలు అవసరం ఉండగా ఇప్పటికే దాదాపు 3000 ఎకరాలు ప్రైవేటు, అసైన్డ్‌ భూములను పోర్టు శాఖకు అప్పగించారు. మిగిలిన ప్రైవేటు భూములను తీసుకొనే నిమిత్తం ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేయగా స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ పరిస్థితుల్లో రాజధాని భూముల తరహాలో ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా  తీసుకోవాలని చూసినా తగు సానుకూలత లభించలేదు. గుత్తేదారు సంస్థకు భూములు అప్పగించిన మరుక్షణం పనులు ప్రారంభించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ వస్తోంది. గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంగా భూములు సమకూర్చుకోవడంలో స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా సఫలీకృతం కాలేకపోయారు. కేవలం 750 ఎకరాలకు మాత్రమే

బందరు పోర్టుకు మోక్షం
ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు. మిగిలిన 1500 ఎకరాల భూములను తీసుకొనే విషయంలో రైతుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు వారితో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులు ముఖ్యమంత్రితో ముఖాముఖి ఏర్పాటు చేశారు. కొంత భూసేకరణ ద్వారా మరికొంత ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో తీసుకోవాలని అన్నదాతలు కోరడంతో అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలత వ్యక్త పరిచారు. అనంతరం భూసేకరణ కోసం అయ్యే నిధులను ప్రభుత్వ గ్యారంటీ మేరకు నిధులను బ్యాంకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
పోర్టు నిర్మాణ విషయంలో ఏకైక అడ్డంకిగా ఉన్న నిధుల కొరతకు పరిష్కారం లభించింది.

ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు. మిగిలిన 1500 ఎకరాల భూములను తీసుకొనే విషయంలో రైతుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు వారితో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులు ముఖ్యమంత్రితో ముఖాముఖి ఏర్పాటు చేశారు. కొంత భూసేకరణ ద్వారా మరికొంత ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో తీసుకోవాలని అన్నదాతలు కోరడంతో అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలత వ్యక్త పరిచారు. అనంతరం భూసేకరణ కోసం అయ్యే నిధులను ప్రభుత్వ గ్యారంటీ మేరకు నిధులను బ్యాంకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోర్టు నిర్మాణ విషయంలో ఏకైక అడ్డంకిగా ఉన్న నిధుల కొరతకు పరిష్కారం లభించింది.

ఎవరూ అడ్డుకోలేరు: మంత్రి రవీంద్ర
పోర్టును అడ్డుకోవడం ఎవరితరం కాదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రతిపక్షం పోర్టు నిర్మాణంపై రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టించి అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆటలు సాగవన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే పోర్టు నిర్మించి ప్రజల చిరకాల కోరికను నెరవేరుస్తుందని ఇందులో ఎలాంటి అనుమానం లేదని ఆయన స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

మచిలీపట్నం పోర్టు అభివృద్ధి, అక్కడ డీప్‌ వాటర్‌ పోర్టు- ఇంటిగ్రేటేడ్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌ (ఐఎల్‌ఎంజెడ్‌) ఏర్పాటుకు రూ.1092 కోట్ల రుణం అవసరమవుతుంది. దీనిని వివిధ బ్యాంకుల నుంచి తీసుకునేందుకు ప్రభుత్వం హామీగా ఉండాలన్న ఇన్‌క్యాప్‌ ప్రతిపాదనకు ఆమోదం. పోర్టుకు సంబంధించి భూసేకరణ, రైలు అనుసంధానం వంటి ఇతర అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టేందుకు ఈ రుణం ఉపయోగపడుతుంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
పోర్టు నిర్మాణంలో ప్రభుత్వం మరో అడుగు
13-05-2018 08:13:18
 
636617959991047937.jpg
  • సమీకరణ, సేకరణతో పాటు మరో పథకం
  • కమిటీ ద్వారా భూ కొనుగోళ్లు
  • జీవో విడుదల
మచిలీపట్నం: బందరు పోర్టు నిర్మాణం పట్ల ప్రభుత్వం విస్తృతంగా పనిచేస్తుంది. రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ పోర్టు భూముల లక్ష్యాన్ని చేధించేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే భూ సమీకరణ, భూ సేకరణ పథకాలు అమలు చేస్తుండగా కొత్తగా మరో పథకాన్ని రంగంలోకి తెచ్చారు. ప్రత్యేక కమిటీ ద్వారా భూమి కొనుగోలు పథకాన్ని పోర్టు భూముల కోసం అమలు చేయనున్నారు. పోర్టు నిర్మాణం కోసం 5,300 ఎకరాలు సేకరించాల్సిన విషయం తెలిసిందే. వీటిలో 3014 ఎకరాలు ప్రభుత్వ అసైన్డ్‌ భూములు కాగా మిగిలిన 2286 ఎకరాలు పట్టా భూములుగా ఉన్నాయి. ప్రభుత్వ అసైన్డ్‌ భూముల ప్రక్రియ పూర్తి కాగా పట్టా భూముల విషయమే ఒక కొలిక్కి రావడం లేదు. ఈ భూముల కోసం భూసమీకరణతో పాటు భూసేకరణ అమలు చేయడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం తాజాగా మరో నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. కమిటీ ద్వారా నేరుగా రైతుల నుంచి భూములు కొనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కమిటీలో జాయింట్‌ కలెక్టర్‌తో పాటు ముడా వీసీ, బందరు ఆర్‌డీవో, కాకినాడ పోర్టు డైరెక్టర్‌, స్ధానిక పోర్టు కార్యాలయ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి రైతుల నుంచి నేరుగా భూములు కొనుగోలు చేసే అధికారాలు ఇచ్చారు.
 
భూముల మార్కెట్‌ విలువ, స్థానిక విలువలను పరిగణలోకి తీసుకుని రైతులతో సంప్రదింపులు జరిపి వారి సమ్మతి మేరకు భూ కొనుగోళ్లు చేపడతారు. పట్టా భూములకు సంబంధించి 2286 ఎకరాల్లో భూ సమీకరణ ద్వారా ఇప్పటి వరకు 750 ఎకరాలకు అంగీకారం లభించగా ఇంకా 1536 ఎకరాలు రైతుల నుంచి తీసుకోవాల్సి ఉంది. వీటితో పాటు పోర్టుకు అనుసంధానంగా నిర్మించ బోయే రైలు, రోడ్డు కనెక్టివిటీకి మరో 1500 ఎకరాలు అవసరం అవుతాయని గుర్తించారు. మొత్తంగా మూడు వేల ఎకరాలకు పైబడి ఇంకా పోర్టు కోసం భూములను తీసుకోవాల్సి ఉంది. ఈ భూములకు సంబంధించి మూడు పఽథకాలు అమల్లో పెట్టి రైతుల అభీష్టం మేరకు ఆయా పథకాలను వర్తింపచే యాలనే ఉద్దేశంతో అధికారులు ఉన్నారు.
 
సఫలీకృతం అయ్యేనా...
పోర్టు నిర్మాణం పట్ల కృత నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఆ దిశగా మూడేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు తుది దశకు చేరుతున్నాయి. పోర్టు భూములే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కొత్తగా కమిటీ ద్వారా భూమి కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో అయినా పోర్టు భూముల ప్రక్రియ సఫలీకృతం అవుతాయోమో చూడాల్సిఉంది. ఈ భూముల కోసం అమలు చేస్తున్న మూడు పథకాల్లో రైతులకు భూ సమీకరణ ద్వారా అధిక ప్రయోజనం చేకూరుతుందనే అభి ప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుందనే అభిప్రాయంతో ఉన్న రైతులు ఈ పథకం ద్వారా భూములు ఇవ్వడానికి పెద్దగా ముందుకు రాలేదు. దీంతో భూసేకరణ తిరిగి అమల్లోకి తెచ్చారు. దీనిద్వారా భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు ప్రయోజనం చేకూర్చను న్నారు.
 
   దీనిద్వారా రైతులకు తమ భూములకు సంబంధించి చట్ట నిబంధనల ప్రకారం నగదు చెల్లింపులు తదితర రాయితీలు లభిస్తాయి. ఈ రెండింటితో పని లేకుండా కేవలం తమ భూములకు అనుకూలమైన ధరలు చెల్లిస్తే భూమి కొనుగోలు పథకానికి రైతులు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కుటుంబ అవసరాలకు తమ భూములు ఎటూ ఉపయోగపడటం లేదనే ఒక అభిప్రాయం పోర్టు గ్రామాల్లో నెలకొని ఉంది. అలాంటి అవసరాలు గల రైతులకు ఈ పథకం అక్కరకొస్తుందేమో చూడాలి. ఆ విధంగా రైతులు భావిస్తే ఈ పథకం ద్వారా కొంత వరకు భూములు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా మూడు పథకాల ద్వారా పోర్టు భూములు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయడానికి కసరత్తువేగవంతం అవుతుంది.
 
 
రైతు నిర్ణయానికే ప్రాధాన్యం
ముడా వీసీపోర్టు భూముల విషయంలో రైతు నిర్ణయానికే అంతిమంగా ప్రాధాన్యత ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా దానిలో రైతు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. పోర్టు భూముల కోసం ఇప్పటికే భూసమీకరణ అమలు జరుగుతుంది. దీంతో పాటు భూ సేకరణకు సిద్దమయ్యాం. తాజాగా కమిటీ ద్వారా భూమి కొనుగోలుకు నూతన పథకం అమల్లోకి వచ్చింది. పోర్టు భూముల కోసం ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఆ ప్రకారం రైతులకు న్యాయం చేసే విధంగా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. కలెక్టర్‌ లక్ష్మీకాంతం అదేశాల మేరకు పనిచేస్తాం. జీవోలో ఉన్న నియమ నిబంధనలు అమలుకు కలెక్టర్‌ చర్యలు తీసుకుంటున్నారు.
 
Link to comment
Share on other sites

పోర్టు గ్రామాల కోసం స్థలాలు పరిశీలన
16-05-2018 07:29:26
 
636620525674602945.jpg
  • ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలుకు చర్యలు
  • మూడు గ్రామాలు ఖాళీ
మచిలీపట్నం: బందరు పోర్టు నిర్మాణంపై పాలక, ప్రతిపక్షాల మధ్య వాద, ప్రతివాదనలు ఉధృతమవుతుండడంతో నిర్మాణ దిశగా పనులు వేగవంతమవుతున్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. అందుకు ఆస్కారం లేకుండా నిర్మాణాన్ని చేపట్టాలనే తలంపుతో పాలకపక్షం వ్యవహరిస్తోంది. దానిలో భాగంగా భూసేకరణకు అవసరమైన నిధులు సమకూర్చడంతోపాటు పునరావాస గ్రామాలకు ఆర్‌ ఆర్‌ యాక్ట్‌ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది.
 
బందరు మండలంలోని మేకావానిపాలెం, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, పోతేపల్లి, తవిసిపూడి గ్రామాల్లో భూములు సేకరిస్తున్న విషయం తెలిసిందే. అక్కడి నుంచి భూములు సేకరించి, రైతుల అభీష్టం మేరకు భూ సమీకరణ లేదా సేకరణ ఈ రెండు కాకపోతే భూమి కొనుగోలు పథకాన్ని అధికారులు అమలు చేస్తారు. ఈ గ్రామాల్లోని భూములను మాత్రమే పోర్టు నిర్మాణానికి తీసుకోవడం జరుగుతుంది. కరగ్రహారం పంచాయతీ పరిధిలో ఉన్న పల్లెపాలెం, క్యాంప్‌బెల్‌ పేట, ఎస్టీ కాలనీలను పోర్టు నిర్మాణం కోసం ఖాళీ చేయాల్సి ఉంది. వారికి పునరావాసం కల్పించేందేకు అధికారులు దృష్టి సారించారు.
 
ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు...
పునరావాస గ్రామాలకు ఆర్‌ ఆర్‌ యాక్ట్‌ అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పల్లెపాలెం, క్యాంప్‌బెల్‌పేట, ఎస్టీ కాలనీ ఖాళీ చేయాల్సి ఉంది. అక్కడి ప్రజలతో సంప్రదింపులు జరిపినా అధికారులు, ప్రజాప్రతినిఽధులు పునరా వాసంపై దృష్టి సారించారు. భూసేకరణ తోపాటు పునరావాసం కోసం ఆర్‌ ఆర్‌ యాక్ట్‌ అమలు చేసేందుకు ప్రభుత్వ హామీతో 1092 కోట్ల రూపాయలు బ్యాంకు రుణం తీసుకోబోతున్న ముడా. ఈ మొత్తంలో కొంత భాగాన్ని పునరావాస గ్రామాలకు కేటాయించనున్నారు.
 
   సొంత ఊళ్లను ఒదులుకునేందుకు స్థానికులు తొలుత అయిష్టంగానే ఉన్నారు. మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఎంపీ కొనకళ్ల నారాయణరావు వారితో సంప్రదింపులు నిర్వహిం చారు. అన్ని వసతులతో కూడిన పునరావాసం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా స్థలాల కోసం పరిశీలిస్తున్నారు. పట్టణంలో హౌసింగ్‌బోర్డు, హుస్సేన్‌పాలెంతోపాటు మరో రెండు ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. వీటిలో హౌసింగ్‌బోర్డు ఏరియా పట్ల పునరావాస గ్రామాల ప్రజలు సుముఖతతో ఉన్నట్లు తెలుస్తోంది.
 
పూర్తి స్థాయిలో మౌలిక వసతులు....
పునరావాసంతోపాటు పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలుత ఒక ప్రాంతాన్ని ఎంపికచేసి దానిపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి అభివృద్ధి చేసే తలంపుతో ఉన్నారు. ఇళ్ల నిర్మాణాలతోపాటు రోడ్లు, పార్కులు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. క్యాంప్‌బెల్‌పేటలో దాదాపు 400 కుటుంబాలు, పల్లెపాలెంలో 180, ఎస్టీ కాలనీలో సుమారు వంద కుటుంబాలున్నాయి. వీరందరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌ ఆర్‌ యాక్ట్‌ అమలు చేయనున్నారు.
 
   వీరితోపాటు భూసమీకరణ ద్వారా పోర్టుకు భూములిచ్చిన రైతులకు ప్యాకేజీ కింద కమర్షియల్‌, రెసిడెన్షియల్‌గా కేటాయించాల్సి ఉంది. రెసిడెన్షియల్‌ భూములకు సంబంధించి మొత్తంగా మెగా టౌన్‌షిప్‌ ఏర్పాటులో అధికారులున్నారు. ముడా మాస్టర్‌ ప్లాన్‌ రూపుదిద్దుకుంటే టౌన్‌షిప్‌ అంశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టౌన్‌షిప్‌లో పల్లెపాలెం, క్యాంప్‌బెల్‌పేట, ఎస్టీ కాలనీ వాసులకు పునరావాసం కల్పించే ఆలోచన ఉన్నప్పటికీ వీరికోసం ప్రత్యేకంగా ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు చేయడమే సమంజసమనే అభిప్రాయంతో ఉన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...